ఫినియోటెక్స్ కెమికల్స్‌లో వాటాలు పెంచుకున్న అమితాబ్ | Big B raises stake in Fineotex Chem to 5.58 pc | Sakshi
Sakshi News home page

ఫినియోటెక్స్ కెమికల్స్‌లో వాటాలు పెంచుకున్న అమితాబ్

Published Sat, Feb 28 2015 2:59 AM | Last Updated on Sat, Sep 2 2017 10:01 PM

ఫినియోటెక్స్ కెమికల్స్‌లో వాటాలు పెంచుకున్న అమితాబ్

ఫినియోటెక్స్ కెమికల్స్‌లో వాటాలు పెంచుకున్న అమితాబ్

న్యూఢిల్లీ: రసాయనాల సంస్థ ఫినియోటెక్స్ కెమికల్స్‌లో బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ వాటాలను 5.58 శాతానికి పెంచుకున్నారు. తాజాగా ఆయన మరో 1.5 లక్షల షేర్లను కొనుగోలు చేశారు. ఇది మొత్తం షేర్ క్యాపిటల్‌లో 0.67 శాతమని కంపెనీ తెలిపింది. తద్వారా ప్రమోటర్లను మినహాయిస్తే అమితాబ్ బచ్చన్ మూడో అతి పెద్ద వాటాదారుగా ఉంటారని వివరించింది. టెక్స్‌టైల్ పరిశ్రమతో పాటు నిర్మాణ రంగం, పేపర్ తయారీ సంస్థలు మొదలైన వాటికి అవసరమైన రసాయనాలను ఫినియోటెక్స్ తయారు చేస్తుంది. శుక్రవారం బీఎస్‌ఈలో ఫినియోటెక్స్ షేరు 4.58 శాతం క్షీణించి రూ. 125.10 వద్ద ముగిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement