ఇన్ఫోసిస్‌లో నారాయణమూర్తి కుటుంబానికి ఉన్న సమష్టి హోల్డింగ్స్ వారి శాశ్వత వారసత్వాన్ని, కంపెనీ పథంలో గణనీయమైన ప్రభావాన్ని కొనసాగిస్తున్నాయి. అయితే ఆ కుటుంబానికి మొత్తంగా కంపెనీలో ఉన్న వాటా దాదాపు 4-5 శాతం మాత్రమే. ప్రపంచ ఐటీ రంగం భవిష్యత్తులో భారీగా దూసుకుపోతుందని చాలామంది నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో ఆ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నారు. కేవలం రిటైలర్లే కాకుండా ఇన్వెసింగ్ సంస్థలు చాలాకాలం నుంచే ఈ రంగంలో వాటా కొనుగోలు చేస్తున్నాయి. ఇన్ఫోసిస్‌లో మూర్తి కుటుంబానికి ఉన్న వాటా కంటే కూడా రెట్టింపు వాటాను హోల్డ్ చేస్తున్న సంస్థలున్నాయి. ఆ వివరాల గురించి తెలుసుకుందాం.
మూర్తి కుటుంబం వాటా
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి కుటుంబానికి కంపెనీలో గణనీయమైన వాటా ఉంది. తాజా నివేదికల ప్రకారం తన కుటుంబం మొత్తం హోల్డింగ్స్ సుమారు 4.02% ఉన్నాయి. నారాయణమూర్తికి 0.36%, ఆయన భార్య సుధామూర్తికి 0.93%, వారి పిల్లలు అక్షత మూర్తికి 1.05%, రోహన్ మూర్తికి 1.465% వాటా ఉంది. నారాయణమూర్తి మనవడు నాలుగేళ్ల ఏకగ్రహ్ మూర్తికి కూడా తన తాత ఇటీవల షేర్లను బహుమతిగా ఇవ్వడంతో 0.04% వాటా ఉంది.
ఎల్‌ఐసీ వ్యూహాత్మక పెట్టుబడులు
వ్యూహాత్మక పెట్టుబడుల్లో భాగంగా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్‌ఐసీ) ఇన్ఫోసిస్‌లో భారీగా పెట్టుబడి పెట్టింది. ఇన్ఫోసిస్‌లో ఏకంగా 9.531 శాతం వాటాను ఎల్‌ఐసీ హోల్డ్ చేస్తోంది. దీని విలువ సుమారు రూ.8,694 కోట్లు. ఈ పెట్టుబడి ద్వారా ఎల్‌ఐసీ భవిష్యత్తులో ఇన్ఫోసిస్ సామర్థ్యం పట్ల నమ్మకంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఎల్‌ఐసీ ఇన్వెస్ట్‌మెంట్ వల్ల ప్రపంచ ఐటీ రంగంలో కంపెనీ పాత్ర ఎలా ఉండబోతుందో తెలుస్తుంది.
ఇదీ చదవండి: ఈపీఎఫ్ సభ్యులకు ఉచిత జీవితబీమా
ఇన్ఫోసిస్‌తో సహకారం..
ఇన్ఫోసిస్‌తో ఎల్‌ఐసీ భాగస్వామ్యం కేవలం ఆర్థిక పెట్టుబడులకు పరిమితం కాలేదు. సంస్థ అందించే సేవల్లోనూ ఇరు కంపెనీల సహకారం ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ సర్వీసుల్లో ఇన్ఫోసిస్ నైపుణ్యం ద్వారా ఎల్ఐసీ నిర్వహణ సామర్థ్యాలను పెంపొందించే లక్ష్యంతో డైవ్ (డిజిటల్ ఇన్నోవేషన్ అండ్ వాల్యూ ఎన్‌హాన్స్‌మెంట్) అనే డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఇనిషియేటివ్‌పై ఈ రెండు కంపెనీలు కలిసి పనిచేశాయి. ఈ సహకారం ఎల్ఐసీ కస్టమర్లు, ఏజెంట్లు, ఉద్యోగులకు అంతరాయంలేని సర్వీసులు అందిస్తుందని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment