NR Narayana Murthy
-
ఇన్ఫీలో మూర్తి కుటుంబం కంటే రెట్టింపు వాటా
ఇన్ఫోసిస్‌లో నారాయణమూర్తి కుటుంబానికి ఉన్న సమష్టి హోల్డింగ్స్ వారి శాశ్వత వారసత్వాన్ని, కంపెనీ పథంలో గణనీయమైన ప్రభావాన్ని కొనసాగిస్తున్నాయి. అయితే ఆ కుటుంబానికి మొత్తంగా కంపెనీలో ఉన్న వాటా దాదాపు 4-5 శాతం మాత్రమే. ప్రపంచ ఐటీ రంగం భవిష్యత్తులో భారీగా దూసుకుపోతుందని చాలామంది నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో ఆ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నారు. కేవలం రిటైలర్లే కాకుండా ఇన్వెసింగ్ సంస్థలు చాలాకాలం నుంచే ఈ రంగంలో వాటా కొనుగోలు చేస్తున్నాయి. ఇన్ఫోసిస్‌లో మూర్తి కుటుంబానికి ఉన్న వాటా కంటే కూడా రెట్టింపు వాటాను హోల్డ్ చేస్తున్న సంస్థలున్నాయి. ఆ వివరాల గురించి తెలుసుకుందాం.మూర్తి కుటుంబం వాటాఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి కుటుంబానికి కంపెనీలో గణనీయమైన వాటా ఉంది. తాజా నివేదికల ప్రకారం తన కుటుంబం మొత్తం హోల్డింగ్స్ సుమారు 4.02% ఉన్నాయి. నారాయణమూర్తికి 0.36%, ఆయన భార్య సుధామూర్తికి 0.93%, వారి పిల్లలు అక్షత మూర్తికి 1.05%, రోహన్ మూర్తికి 1.465% వాటా ఉంది. నారాయణమూర్తి మనవడు నాలుగేళ్ల ఏకగ్రహ్ మూర్తికి కూడా తన తాత ఇటీవల షేర్లను బహుమతిగా ఇవ్వడంతో 0.04% వాటా ఉంది.ఎల్ఐసీ వ్యూహాత్మక పెట్టుబడులువ్యూహాత్మక పెట్టుబడుల్లో భాగంగా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ) ఇన్ఫోసిస్‌లో భారీగా పెట్టుబడి పెట్టింది. ఇన్ఫోసిస్‌లో ఏకంగా 9.531 శాతం వాటాను ఎల్ఐసీ హోల్డ్ చేస్తోంది. దీని విలువ సుమారు రూ.8,694 కోట్లు. ఈ పెట్టుబడి ద్వారా ఎల్ఐసీ భవిష్యత్తులో ఇన్ఫోసిస్ సామర్థ్యం పట్ల నమ్మకంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఎల్ఐసీ ఇన్వెస్ట్మెంట్ వల్ల ప్రపంచ ఐటీ రంగంలో కంపెనీ పాత్ర ఎలా ఉండబోతుందో తెలుస్తుంది.ఇదీ చదవండి: ఈపీఎఫ్ సభ్యులకు ఉచిత జీవితబీమాఇన్ఫోసిస్తో సహకారం..ఇన్ఫోసిస్‌తో ఎల్ఐసీ భాగస్వామ్యం కేవలం ఆర్థిక పెట్టుబడులకు పరిమితం కాలేదు. సంస్థ అందించే సేవల్లోనూ ఇరు కంపెనీల సహకారం ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ సర్వీసుల్లో ఇన్ఫోసిస్ నైపుణ్యం ద్వారా ఎల్ఐసీ నిర్వహణ సామర్థ్యాలను పెంపొందించే లక్ష్యంతో డైవ్ (డిజిటల్ ఇన్నోవేషన్ అండ్ వాల్యూ ఎన్హాన్స్మెంట్) అనే డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇనిషియేటివ్పై ఈ రెండు కంపెనీలు కలిసి పనిచేశాయి. ఈ సహకారం ఎల్ఐసీ కస్టమర్లు, ఏజెంట్లు, ఉద్యోగులకు అంతరాయంలేని సర్వీసులు అందిస్తుందని భావిస్తున్నారు. -
4 నెలల మనవడికి రూ.240 కోట్ల బహుమతి
న్యూఢిల్లీ: ఐటీ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి తన నాలుగు నెలల మనవడు ఏకగ్రాహ్ రోహన్ మూర్తికి ఖరీదైన బహుమతిని ప్రదానం చేశారు. ఇన్ఫోసిస్‌కు చెందిన 15 లక్షల షేర్లను ఇచ్చారు. ప్రస్తుత మార్కెట్ ధర (రూ. 1,602) ప్రకారం వీటి విలువ రూ. 240 కోట్లుగా ఇన్ఫోసిస్ ఒక ప్రకటనలో వెల్లడించింది. కంపెనీలో తనకుగల ఈక్విటీలో 0.04 శాతం వాటాను కుమారుడు రోహన్ పుత్రుడు ఏకగ్రాహ్కు నారాయణ మూర్తి రిజిస్టర్ చేశారు. దీంతో ఏకగ్రాహ్ రోహన్ ఇన్ఫోసిస్‌లో బుల్లి బిలియనీర్ వాటాదారుడయ్యారు. నారాయణ మూర్తి కుమార్తె అక్షత, అల్లుడు రిషీ (బ్రిటన్ ప్రధాని)కి ఇద్దరు కుమార్తెలుకాగా.. ఏకగ్రాహ్ మనవడు. -
బ్రిటన్ ప్రధాని రేసులో రిషి సునాక్.. ఆయన భార్యపై ఇలా విమర్శలు
బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కాగా, బ్రిటన్‌కు తదుపరి ప్రధాని రేసులో ప్రముఖంగా మాజీ ఆర్ధిక మంత్రి రిషి సునాక్ పేరు వినిపిస్తోంది. రిషి సునాక్ కూడా రంగంలోకి దిగుతున్నట్లు శుక్రవారం అధికారికంగా వెల్లడించారు. దీంతో, ఆయనకు పలువురు ఎంపీలు కూడా మద్దతు ప్రకటించారు. ఇదిలా ఉండగా.. తాజాగా రిషి సునాక్ భార్య, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి కుమార్తె అక్షతా మూర్తి వార్తల్లో నిలిచారు. కాగా, రిషి సునాక్ ప్రధాని రేసులో ఉన్నట్టు ప్రకటించిన తర్వాత ఆయన మీడియాకు కనిపించలేదు. దీంతో జర్నలిస్టులు ఆయన కోసం ఇంటి వద్ద వేచి ఉన్నారు. ఈ క్రమంలో సునాక్ భార్య.. అక్షతా మూర్తి స్వయంగా తానే వచ్చి టీ, స్నాక్ అందించారు. దీంతో, ఆమె సోషల్ మీడియాలో వార్తలో నిలిచారు. ఈ ఘటనపై కొందరు ప్రశంసించగా.. మరికొందరు విమర్శలు చేశారు. ఎన్నో కోట్లకు అధిపతికి అయిన అక్షతా మూర్తి ఎంతో సంప్లిసిటీతో జర్నలిస్టులకు టీ అందించారని.. ఆమె నిరాడంబరతను ఇది నిదర్శనమంటూ మెచ్చుకుంటున్నారు. ఇక, ఆమె టీ ఇచ్చిన ఒకో టీ కప్పు ధర దాదాపు రూ.3,600(38 పౌండ్లు) ఉంటుందని తెలుస్తోంది. దీనిపై ప్రతిపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఆమె తమ గొప్పతనాన్ని చూపించడం కోసమే ఇలా చేశారని ఆరోపిస్తున్నారు. దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. ఆ టీ కప్పు ఖరీదుతో ఓ కుటుంబం రెండు రోజుల పాటు జీవించవచ్చు అంటూ కామెంట్స్ చేశారు. మరోవైపు.. అక్షతా మూర్తి చేసిన పని సునాక్‌ను విమర్శలకు గురిచేసింది. ఇక, అక్షత మూర్తికి ఇప్పటికీ భారత పౌరసత్వమే ఉంది. కాగా, వేరే దేశంలో స్థిర నివాసం ఉన్న వారికి బ్రిటన్‌లో నాన్-డొమిసైల్ పన్ను హోదా కల్పిస్తారు. ఇది పొందిన వారు విదేశాల్లో తాము ఆర్జించే ఆదాయానికి బ్రిటన్‌లో పన్ను కట్టాల్సిన అవసరం లేదు. దీన్ని అడ్డుపెట్టుకుని అక్షతా మూర్తి పన్నులు కట్టకుండా ఎగవేస్తున్నారని ప్రతిపక్ష నేతలు ఆరోపించారు. దీనిపై.. కొద్ది రోజుల క్రితం అక్షతా మూర్తి ప్రతినిధి స్పందిసూ.. తాము చట్టప్రకారం బ్రిటన్‌లో చేస్తున్న వ్యాపారాలకు పన్ను చెల్లిస్తున్నానని క్లారిటీ ఇచ్చారు. ☕️ After his shock resignation last night, Rishi Sunak's wife Akshata Murthy brings out a round of tea for journalists waiting for him to show his face. pic.twitter.com/Yt8ldN2aX9 — ITV News Calendar (@itvcalendar) July 6, 2022 ఇది కూడా చదవండి: రోడ్డుపైకొచ్చిన బోరిస్ మైనపు విగ్రహం.. ఫోటోలు వైరల్ -
వర్క్ ఫ్రమ్ హోంపై ఇన్ఫోసిస్ నారాయణమూర్తి కీలక వ్యాఖ్యలు..!
గత రెండేళ్ల నుంచి వర్క్ ఫ్రమ్ హోంకే పరిమితమైన ఐటీ ఉద్యోగుల విషయంలో ఇన్ఫోసిస్ వ్యవస్థాసకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు.తమ ఉద్యోగులను కార్యాలయానికి వచ్చేలా ప్రోత్సహించాలని ఐటీ కంపెనీలకు హితవు పలికారు. కోవిడ్-19 తీవ్రత తగ్గిపోయిందని ఇకపై ఇంటి నుంచి పనిచేసే విధానాలకు స్వస్తి పలకాలన్నారు. పెద్ద అభిమానిని కాదు..! బెంగుళూరులో ప్రముఖ మీడియా సంస్థ నిర్వహించిన ఐటీ సమ్మిట్‌లో వర్క్ ఫ్రం హోంపై ఎన్ఆర్ నారాయణమూర్తి తన అభిప్రాయాలను పంచుకున్నారు. వర్క్ ఫ్రం హోంకు అంత పెద్ద అభిమానిని కాదని అన్నారు. ఇంటి నుంచి పనిచేయడం తనకు అసలు ఇష్టం లేదని తేల్చి చెప్పారు. ఇంటి నుంచి పనిచేస్తే సృజన శీలత సాధ్యం కాదన్నారు. పనిలోనూ నాణ్యత ఉండదన్నారు. ఐటీ ఉద్యోగులు ఇంటికే పరిమితమవ్వడంతో కంపెనీల సంస్థాగత వ్యవహరాలు నెమ్మదించిందని తెలిపారు. అంతేకాకుండా కంపెనీల ఉత్పాదకత కూడా తగ్గిపోయిందని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా ఇప్పటికే పలు కంపెనీలు తమ ఉద్యోగులను ఆఫీసులకు పిలిచేందుకు సిద్దమయ్యాయి. బంగ్లాదేశ్ కంటే తక్కువ..! వర్క్ ఫ్రం హోంతో పాటుగా భారత తలసరి ఆదాయంపై కూడా నారాయణమూర్తి హైలైట్ చేశారు. 2020-21 గాను నాలుగు దశాబ్దాల క్రితం ఏర్పడిన బంగ్లాదేశ్ కంటే భారత తలసరి ఆదాయం తక్కువగా నమోదైందని గుర్తు చేశారు. ఇక రెండవ ప్రపంచ యుద్దం తరువాత ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు జర్మనీ తీసుకున్న చర్యలను మూర్తి వివరించారు. చదవండి: ఫ్లీజ్ మోదీజీ!! మమ్మల్ని ఆదుకోండి..భారత్‌కు రష్యా బంపరాఫర్! -
కృత్రిమ మేధతో ఉద్యోగాలు పోవు
బెంగళూరు: కృత్రిమ మేధ (ఏఐ) వంటి సాంకేతికతల వల్ల మనుషులకు ఉద్యోగాలు ఉండవన్నది నిజం కాదని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి అన్నారు. వాస్తవానికి ఏఐ, మెషీన్ లెర్నింగ్, బిగ్ డేటా అనలిటిక్స్ వంటి వాటి వల్ల మరిన్ని ఎక్కువ ఉద్యోగాలు వస్తాయన్నారు. వెట్టి చాకిరీని వదిలిపెట్టి సౌకర్యవంతంగా జీవించేందుకు, పనులను మరింత సులువుగా చేసుకునేందుకు సాంకేతికత అవకాశాన్ని కల్పిస్తుందని తెలిపారు. బెంగళూరులో జరిగిన ‘ఇన్ఫోసిస్ ప్రైజ్’ అనే వార్షిక బహుమతుల ప్రదాన వేడుకలో ఆయన పాల్గొన్నారు. ‘కంప్యూటర్ సైన్స్‌లో కృత్రిమ మేధ కచ్చితంగా ముఖ్యమైన అంశం. ఏఐ, ఐంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ) వంటి వాటి వల్ల మనుషులు జీవితాలు మరింత సౌకర్యవంతంగా మారుతాయి. ఉద్యోగాలు కూడా మరిన్ని పెరుగుతాయి. అలాగే ప్రపంచ ఆర్థిక సంస్థ (డబ్ల్యూఈఎఫ్) నివేదిక ప్రకారం పని ప్రదేశాల్లోని యంత్రాల్లో జరుగుతున్న మార్పులు 13.3 కోట్ల కొత్త ఉద్యోగాలను సృష్టించగలవు’ అని వివరించారు. -
బైబ్యాక్‌లో ఇన్ఫీ ప్రమోటర్లు రూ.2 వేల కోట్ల షేర్ల విక్రయం!
న్యూఢిల్లీ: దేశంలో రెండో అతిపెద్ద సాఫ్ట్వేర్ సంస్థ ఇన్ఫోసిస్ షేర్ల బైబ్యాక్‌లో ప్రమోటర్లు జోరుగానే పాల్గొంటున్నారు. ఎన్ఆర్ నారాయణమూర్తి, నందన్ నీలేకనితో పాటు ఇతర సహ–వ్యవస్థాపకులు తమవద్దనున్న వాటాల్లో 1.77 కోట్ల షేర్లను బైబ్యాక్‌లో విక్రయించేందుకు ముందుకొచ్చారు. వీటి విలువ దాదాపు రూ.2,038 కోట్లుగా అంచనా. ఒక్కో షేరుకి రూ.1,150 చొప్పున మొత్తం రూ.13,000 కోట్ల విలువైన బైబ్యాక్ ఆఫర్‌ను(దాదాపు 11.3 కోట్ల షేర్లు) ఇన్ఫోసిస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కంపెనీ చరిత్రలో ఇది తొలి బైబ్యాక్ కావడం గమనార్హం. ప్రమోటర్లతో ముఖ్యంగా నారాయణమూర్తితో విభేదాల కారణంగా కంపెనీ సీఈఓ పదవికి విశాల్ సిక్కా అర్ధంతరంగా రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆతర్వాత జరిగిన పరిణామాల్లో చైర్మన్ ఆర్.శేషసాయి మరికొందరు బోర్డు సభ్యులు కూడా వైదొలిగారు. సంస్థాగత ఇన్వెస్టర్ల ఒత్తిడితో ఇన్ఫీ సహ–వ్యవస్థాపకుడు నందన్ నీలేకని చైర్మన్ పగ్గాలను అందుకున్నారు. ఇక ఇప్పుడు కొత్త సీఈఓ–ఎండీ నియామకంపై కంపెనీ బోర్డు తీవ్రంగా దృష్టిసారిస్తోంది. సిక్కా రాజీనామా ఉదంతంతో ఇన్ఫీ షేరు ధర దాదాపు 15 శాతం మేర కుప్పకూలిన విషయం విదితమే. నీలేకని రీఎంట్రీతో కొద్దిగా కోలుకొని ప్రస్తుతం రూ.920 వద్ద కదలాడుతోంది. నీలేకని, మూర్తివే ఎక్కువ... ఇన్ఫీ సహ–వ్యవస్థాపకులు వారి కుటుంబ సభ్యులకు కలిపి మొత్తం ప్రమోటర్ల గ్రూప్‌నకు ఈ ఏడాది జూన్ చివరినాటికి కంపెనీలో 12.75 శాతం(29.28 కోట్ల షేర్లు) వాటాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రమోటర్లు ఆఫర్‌చేస్తున్న మొత్తం షేర్లను(1.77 కోట్ల షేర్లు) బైబ్యాక్‌లో కంపెనీ ఆమోదిస్తే... వారికి లాభాల పంటపండినట్లే. బైబ్యాక్‌లో విక్రయం కోసం ప్రమోటర్లకు సంబంధించి నీలేకని, మూర్తి ఆఫర్ చేసిన షేర్లే ఎక్కువగా ఉన్నాయి. నీలేకని(కుటుంబం) 58 లక్షల షేర్లను, మూర్తి(భార్య సుధ, ఇద్దరు పిల్లలతో కలిపి) 54 లక్షల షేర్లను విక్రయానికి ఉంచుతున్నారు. ఇక ఎస్.గోపాలకృష్ణన్ కుటుంబం 22 లక్షల షేర్లను, కె.దినేష్ 29 లక్షల షేర్లను విక్రయిస్తున్నారు. ప్రస్తుతం ఇన్ఫీ ప్రమోటర్లలో వ్యక్తితంగా అత్యధిక వాటా(2.14 శాతం) గోపాలకృష్ణన్ భార్య సుధా గోపాలకృష్ణన్కే ఉండటం విశేషం. కాగా, మరో ప్రమోటర్ ఎస్డీ శిబులాల్ బైబ్యాక్‌లో పాల్గొనడం లేదు. ఆయన భార్య, కుమారుడు మాత్రం 14 లక్షల షేర్లను విక్రయానికి పెడుతున్నారు. -
ఇన్వెస్టర్ల భేటీలో మూర్తి తీవ్ర ఆందోళన
సాక్షి, న్యూఢిల్లీ : ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి తనపై వచ్చిన ఆరోపణలపై తీవ్ర ఆందోళనను వ్యక్తంచేశారు. లోపాలను గుర్తించకుండా ఇన్ఫోసిస్ మాజీ బోర్డు సభ్యులు తనపై వ్యక్తిగత దాడికి దిగారన్నారు. అవి చాలా బాధ కలిగించినట్టు మూర్తి చెప్పారు. విశాల్ సిక్కా రాజీనామా అనంతరం తలెత్తిన పరిస్థితులపై తొలిసారి పెట్టుబడిదారులతో మూర్తి భేటీ అయ్యారు. తను ఎక్కువగా పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసమే పోరాడినట్టు మూర్తి చెప్పారు. గ్లోబల్ కంపెనీ స్థాయిగా ఇన్ఫీ తిరిగి పొందడానికే తాను కోరుకున్నట్టు తెలిపారు. త్రైమాసిక ఫలితాలను, గైడెన్స్‌ను రిపోర్టు చేసిన తొలి కంపెనీ ఇన్ఫోసిస్నేని, గట్టి కార్పొరేట్ పాలనతో తాము ఇలాంటి ప్రమాణాలను ఆర్జించామని మూర్తి చెప్పారు. మాజీ బోర్డు సభ్యులు కంపెనీలో లోపాలు గుర్తించకుండా.. తనపై వ్యక్తిగత దాడికి పాల్పడ్డారన్నారు. ఇటీవల విశాల్ సిక్కా రాజీనామా అనంతరం బోర్డు సభ్యులు మూకుమ్మడిగా మూర్తిపై విరుచుకుపడ్డారు. ఆయనపై పలు ఆరోపణలు గుప్పించారు. ఈ ఆరోపణలపై సరియైన వేదికపై సరియైన సమయంలో స్పందిస్తానని మూర్తి గట్టి జవాబిచ్చిన సంగతి తెలిసిందే. కంపెనీ మాజీ చైర్మన్ ఆర్ శేషసాయి, మాజీ సీఎఫ్ఓ రాజీవ్ బన్సాల్‌కు అధిక మొత్తంలో సెవరెన్స్ ప్యాకేజీ ఇచ్చారని మూర్తి ఆరోపించారు. రాజీవ్ బన్సాల్‌కు ఎక్కువ సెవరెన్స్ ప్యాకేజీ చెల్లించడాన్ని బోర్డు అంగీకరించిందని శేషసాయి తనకు చెప్పారని, కానీ వార్షిక సాధారణ సమావేశంలో శేషసాయి అబద్ధం ఆడినట్టు మూర్తి చెప్పారు. రాజీవ్ బన్సాల్‌పై మరింత విచారణ చేపట్టినప్పుడు శేషసాయి ఏం మాట్లాడలేకపోయారని తెలిపారు. సెవరెన్స్ పే విషయంపై జరిగిన సమావేశ మినిట్స్‌ను కూడా బోర్డు రికార్డు చేయలేదన్నారు. పైగా బన్సాల్ ఒప్పందాన్ని బహిర్గతం చేయలేమని జేఫ్ లేమన్ చెప్పినట్టు మూర్తి పేర్కొన్నారు. అంతకముందు వెళ్లిన ఏ సీఎఫ్ఓకి కూడా కంపెనీ సెవరెన్స్ ప్యాకేజీ ఇవ్వలేదన్నారు. బోర్డు పారదర్శకంగా లేదని, తప్పుదోవ పట్టించే విధంగా ఉందన్నారు. బలహీనమైన పాలన పద్ధతులు కంపెనీలో ఉండటమే తన ముఖ్యమైన ఆందోళన అని చెప్పారు. నిలేకని నేతృత్వంలో మేనేజ్మెంట్ టీమ్ ర్యాలీ జరుపుతుందని తనకు విశ్వాసం ఉందని, ఇన్ఫోసిస్‌కు మళ్లీ ఆ కీర్తిని తీసుకొస్తుందని మూర్తి ధీమా వ్యక్తంచేశారు. నందన్ ఎంతో విలువలతో కూడిన వ్యక్తి అని, 15 ఏళ్లుగా తనకు నిలేకని తెలుసని మూర్తి చెప్పారు. ఇన్ఫోసిస్‌కు మంచి రోజులు తీసుకురావడానికి నందన్ తన శతవిధాలా ప్రయత్నించాలని కోరుకుంటున్నట్టు మూర్తి తెలిపారు. -
విశాల్ సిక్కాపై మూర్తి కౌంటర్ ఎటాక్
సాక్షి, న్యూఢిల్లీ : విశాల్ సిక్కా రాజీనామాతో, ఇన్ఫోసిస్ మేనేజ్మెంట్కు, వ్యవస్థాపకులకు మధ్య వివాదం మరింత ముదిరింది. రాజీనామా చేస్తూ విశాల్ సిక్కా చేసిన ఆరోపణలపై కంపెనీ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి ఘాటుగా స్పందించారు. విశాల్ సిక్కా చేసిన నిరాధారణమైన ఆరోపణలపై స్పందిస్తే తన గౌరవానికే భంగకరమంటూ తీవ్రంగా మండిపడ్డారు. ఇన్ఫోసిస్ బోర్డు రాసిన ప్రకటనంతటిన్నీ చదివినట్టు తెలిపిన మూర్తి, ఆ ఆరోపణలు చాలా బాధాకరమని కూడా ఆవేదన వ్యక్తంచేశారు. అంతేకాక సరియైన సమయంలో తగిన సమాధానమిస్తానంటూ మూర్తి చెప్పారు. 2014లో తానే స్వయంగా బోర్డు నుంచి తప్పుకున్నానని, కనీసం నగదు కూడా కోరలేదని తెలిపారు. తన పిల్లల కోసం ఇన్ఫీలో కనీసం ఎలాంటి అధికారాలను, స్థానాలను అడుగలేదని కూడా మూర్తి చెప్పారు. కాగ, కంపెనీ సీఈవో విధుల్లో తాను కొనసాగలేనని, నిరాధారమైన విషపూరిత వ్యక్తిగత దాడులను నిలువరిస్తూ తాను పనిచేయలేనని సిక్కా తన బ్లాగ్‌లో పేర్కొన్నారు. ఈ బ్లాగ్‌లో ఎవరి పేరును ఆయన పేర్కొనలేదు. కానీ నారాయణమూర్తి లాంటి హై ప్రొఫైల్ వ్యవస్థాపకులకు మధ్య తాను నలిగిన తీరును వివరించారు. గత కొంతకాలంగా కంపెనీ మేనేజ్మెంట్పై, సీఈవోగా ఉన్న విశాల్ సిక్కాపై వ్యవస్థాపకులు అసంతృప్తి వ్యక్తంచేస్తూనే ఉన్నారు. అంతేకాక కంపెనీలో కార్పొరేట్ ప్రమాణాలు దెబ్బతింటున్నాయంటూ పలుమార్లు కంపెనీ వ్యవస్థాపకులు, బోర్డుకి చురకలు పెట్టారు. చాలా విషయాల్లో వ్యవస్థాపకులకు, బోర్డుకు పొంతన కుదరడం లేదని పలుమార్లు బహిర్గతం కూడా అయింది. విశాల్ సిక్కాకు ఎక్కువగా పరిహారాలు చెల్లించడం, కంపెనీ నుంచి వైదొలిగిన కొందరు మాజీ ఎగ్జిక్యూటివ్‌లకు అందించిన సెవరెన్స్ ప్యాకేజీ విషయంలోనూ వ్యవస్థాపకులు, బోర్డును ప్రశ్నించారు. -
మూర్తి లేఖ: ఇన్ఫీలో మళ్లీ చెలరేగిన వివాదం
బెంగళూరు : మరోసారి సాఫ్ట్వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్ బోర్డు సభ్యులకు, దాని వ్యవస్థాపకులకు లుకలుకలు ప్రారంభమయ్యాయి. పనాయా కొనుగోలుకు సంబంధించిన విచారణ రిపోర్టును బహిర్గతం చేయాలంటూ ఎన్ఆర్ నారాయణమూర్తి ఇటీవల బోర్డు సభ్యులకు రాసిన లేఖతో మళ్లీ వివాదాలు చెలరేగాయని సంబంధిత వర్గాలు చెప్పాయి. 200 మిలియన్ డాలర్లతో కొనుగోలు చేసిన పనాయా విషయంలో అక్రమాలు చోటుచేసుకున్నాయని మార్కెట్ రెగ్యులేటరీ సెబీ ఆరోపించింది. సెబీ ఆరోపణలపైనా, మాజీ సీఎఫ్ఓ రాజీవ్ బన్సాల్ సెవరెన్స్ ప్యాకేజీలో తలెత్తిన వివాదం విషయంలోనూ, ప్రస్తుత సీఈవో అత్యధికమైన ఖర్చుల ఆరోపణల విషయంలోనూ కంపెనీ అంతర్గతంగా విచారణ చేపట్టింది. జూన్‌లోనే వీటిపై కంక్లూజిన్ అండ్ సమ్మరీ ఫైండింగ్ స్టేట్మెంట్ను ప్రచురించింది. పనాయా కేసు, సీఈఓ వ్యయాలు వంటి విషయంలో వచ్చిన ఆరోపణల్లో ఎలాంటి నిర్థారణ లేదని గిబ్సన్ డన్ అండ్ క్రుచర్ అనే న్యాయ సంస్థ కూడా పేర్కొంది. కానీ మొత్తం రిపోర్టులను బహిర్గతం చేయాలని నారాయణమూర్తి డిమాండ్ చేస్తున్నారు. కంపెనీ పారదర్శకత, జవాబుదారీతనం కోసం ఈ రిపోర్టును అందించాలని ఆయన కోరుతున్నారని సంబంధిత వర్గాలు చెప్పాయి. అయితే ఈ రిపోర్టును ప్రజల ముందుకు తీసుకొచ్చేందుకు కంపెనీ ఏ మాత్రం అంగీకరించడం లేదు. ఈ రిపోర్టును బహిర్గతం చేస్తే, పనాయా ఇన్వెస్టర్లకు, దాని లిమిటెడ్ పార్టనర్లకు మధ్యనున్న క్లయింట్ రహస్య ఒప్పందాలను ఉల్లంఘించినట్టు అవుతుందని కంపెనీ పేర్కొంటోంది. ఇప్పటివరకు ఇన్ఫోసిస్ కొనుగోలుచేసిన వాటిలో పనాయా రెండో అతిపెద్ద డీల్. దీంతో మరోసారి కార్పొరేట్ గవర్నెన్స్ విషయంలో ఇన్ఫోసిస్ బోర్డు సభ్యులకు, వ్యవస్థాపకులకు వివాదం తలెత్తినట్టు తెలిసింది. -
అప్పుడు మావాళ్ల మాట వినాల్సింది
ఇన్ఫీ సహవ్యవస్థాపకుడు నారాయణమూర్తి న్యూఢిల్లీ: దేశీ రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ ‘ఇన్ఫోసిస్’ చైర్మన్ పదవి నుంచి వైదొలగడంపై ఆ కంపెనీ సహవ్యవస్థాపకుల్లో ఒకరైన ఎన్.ఆర్.నారాయణ మూర్తి ఇప్పుడు విచారం వ్యక్తంచేశారు. అప్పుడు కంపెనీ ఇతర సహవ్యవస్థాపకులు తనను పదవిలో కొనసాగాల్సిందిగా కోరారని, వారి మాట విని ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. కాగా ఇన్ఫోసిస్ చైర్మన్ పదవి నుంచి మూర్తి 2014లో తప్పుకున్నారు. ‘నా రాజీనామా నిర్ణయాన్ని కంపెనీ ఇతర సహ వ్యవస్థాపకులు వ్యతిరేకించారు. కంపెనీ నుంచి వెళ్లిపోవద్దని, మరికొన్నేళ్లు కంపెనీకి సేవలు అందించాలని కోరారు. కానీ నేను వారి మాట వినలేదు’ అని వ్యాఖ్యానించారు. ‘నాకు సాధారణంగా భావోద్వేగాలు ఎక్కువ. నా నిర్ణయాలు ఎక్కువగా ఐడియలిజంపై ఆధారపడి ఉంటాయి. అయినప్పటికీ బహుశా నేను వారి మాట వినాల్సింది’ అని సీఎన్‌బీసీ టీవీ 18కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. కాగా కార్పొరేట్ గవర్నెన్స్, సిక్కా వేతన ప్యాకేజ్, మాజీ ఉద్యోగులకు చెల్లింపులు వంటి అంశాలకు సంబంధించి ఇన్ఫోసిస్ మేనేజ్మెంట్ నిర్ణయాలపై మూర్తి విమర్శలు చేసిన విషయం తెలిసిందే. -
ఐటీలో సీనియర్లు జీతాలు కొంత తగ్గించుకోవాలి
♦ అప్పుడే యువ ఉద్యోగుల కొలువులు కాపాడొచ్చు ♦ ఉద్యోగాల కోతపై ఇన్ఫీ మూర్తి బెంగళూరు: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో సీనియర్ ఉద్యోగులు తమ జీతంలో కొంత త్యాగం చేయగలిగితే యువ ఉద్యోగుల కొలువులను కాపాడినట్లవుతుందని ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి వ్యాఖ్యానించారు. పరిశ్రమ గతంలో కూడా ఇలాంటి పరిస్థితులు అనేక సార్లు ఎదుర్కొందని ఒక టీవీ చానల్‌కి ఇచ్చిన ఇంటర్వూ్యలో పేర్కొన్నారు. పరిశ్రమ దిగ్గజాలందరూ ఉద్యోగాల కోత సమస్యను పరిష్కరించాలనే సదుద్దేశంతోనే ఉన్నారని ఆయన చెప్పారు. ‘2008లో.. అంతకన్నా ముందు 2001లోనూ ఇలాంటిదే ఎదురైంది. ఇది కొత్తేమీ కాదు. ఆందోళన అక్కర్లేదు. ఇలాంటి సమస్యలకు గతంలోనూ పరిష్కారాలు కనుగొన్నాం‘ అని పేర్కొన్నారు. 2001లో మార్కెట్ కష్టపరిస్థితుల్లో ఉన్నప్పుడు యువత ఉద్యోగాలు కోల్పోకుండా కాపాడేందుకు ఇన్ఫోసిస్‌లో సీనియర్ ఉద్యోగులు తమ వేతనాలను కొంత తగ్గించుకోవాలని నిర్ణయం తీసుకోవడాన్ని ఈ సందర్భంగా మూర్తి ఉదహరించారు. అప్పట్లో చాలా కంపెనీలు నియామకాలను డేట్‌ను వాయిదా వేస్తుంటే తాము మాత్రం 1,500 మంది ఇంజినీర్లకు ఉద్యోగాలు ఆఫర్ చేసినట్లు ఆయన తెలిపారు. మరోవైపు, పరిశ్రమ దిగ్గజాలు కొంగొత్త అవకాశాలను గుర్తించాలని, కొత్త టెక్నాలజీలను ఆకళింపు చేసుకునేందుకు యువతకు శిక్షణనివ్వడంపై దృష్టి పెట్టాలని మూర్తి సూచించారు. -
మూర్తి కామెంట్స్ :పతనమైన ఇన్ఫీ షేర్లు
న్యూఢిల్లీ : టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ లో బోర్డు సభ్యులకు, వ్యవస్థాపకులకు మరోసారి వివాదం రాజుకోవడంతో షేర్లు అతలాకుతలమవుతున్నాయి. చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ యూబీ ప్రవీణ్ రావు వేతనాన్ని భారీగా పెంచుతూ బోర్డు నిర్ణయించడంపై కంపెనీ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి మండిపడుతూ ఓ లేఖ రాశారు. నారాయణమూర్తి మరోసారి కంపెనీ బోర్డు సభ్యులపై విరుచుకుపడటంతో ఇన్వెస్టర్లలో ఆందోళన ప్రారంభమైంది. దీంతో మార్నింగ్ ట్రేడింగ్ లో 1శాతం పడిపోయిన ఈ టెక్ దిగ్గజం షేర్లు మరింత నష్టాల్లోకి పయనిస్తున్నాయి. ఫిబ్రవరిలో బోర్డు సభ్యులు యూబీ ప్రవీణ్ రావుకు భారీగా పెంచిన వేతనం కంపెనీ ఉద్యోగుల్లో నమ్మకాన్ని, విశ్వాసాన్ని హరిస్తుందని నారాయణమూర్తి ఆందోళన వ్యక్తంచేశారు. కంపెనీలో టాప్ -లెవల్ వ్యక్తులకు 60 శాతం నుంచి 70 శాతం పరిహారాలు పెంచుతున్న సమయంలో, ఇతర ఉద్యోగులకు కేవలం 6 శాతం నుంచి 8 శాతం మాత్రమే పరిహారాలు పెరుగుతున్నాయని, ఇది అనైతికమని నారాయణమూర్తి అన్నారు. ప్రవీణ్ రావు వేతనం పెంపుకు కేవలం 24 శాతం మంది ప్రమోటర్లే ఆమోదం తెలపుతూ ఓట్ వేశారు. మిగతావారందరూ ఓటింగ్ లో పాల్గొనలేదు. ఇది ఇన్ఫోసిస్ లోపాలన ప్రమాణాలు లోపించడాన్ని ఎత్తి చూపుతున్నాయని నారాయణమూర్తి ఆందోళన వ్యక్తంచేశారు. -
టెక్ దిగ్గజం ఇన్ఫీలో మళ్లీ 'ప్యాకేజీ' రగడ
బెంగళూరు : టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ రాజుకున్న ప్యాకేజీ రగడ ఇంకా సద్దుమణగలేదు. మరోసారి ఎగ్జిక్యూటివ్ లకు చెల్లించే వేతనాలపై కంపెనీ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి అసంతృప్తి వ్యక్తంచేశారు. అయితే ఈ సారి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ యూబీ ప్రవీణ్ రావుకు పెంచిన పరిహారాలపై ఆయన మండిపడ్డారు. టాప్-లెవల్ వ్యక్తులకు పెంచే పరిహారాలు, ఇతర ఉద్యోగులకు పెంచే వేతనాలు సరిగ్గా లేవని ఉద్దేశిస్తూ నారాయణమూర్తి ఆదివారం ఓ లేఖ రాశారు. చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ యూబీ ప్రవీణ్ రావుకు వేతన పెంపు విషయంలో జరిగిన ప్రమోటర్ల ఓటింగ్ ఫలితాల అనంతరం నారాయణమూర్తి తన అభిప్రాయాన్ని బహిర్గతం చేశారు. అయితే యూబీ ప్రవీణ్ రావుకు వేతనం పెంచడానికి కేవలం 24 శాతం ప్రమోటర్లు మాత్రమే అంగీకారం తెలిపారు. మిగతావారు ఓటింగ్ కు దూరంగా ఉన్నారని బొంబై స్టాక్ ఎక్స్చేంజ్ కు ఆదివారం సమర్పించిన పోస్టల్ బ్యాలెట్లో ఫలితాల్లో వెల్లడైంది. రావుకు వార్షికంగా స్థిర పరిహారాల కింద రూ.4.62 కోట్లు, వేరియబుల్ పరిహారాల కింద రూ.3.88 కోట్లు చెల్లించాలని కంపెనీ నిర్ణయించినట్టు ఇన్ఫోసిస్ గత అక్టోబర్ లో ప్రకటించింది. ఫిబ్రవరి 23న దీనిపై ఓటింగ్ వచ్చింది. శుక్రవారంతో ఈ ఓటింగ్ ప్రక్రియ ముగిసింది. ఈ ఓటింగ్ ప్రక్రియపైన మూర్తి ఆదివారం స్పందిస్తూ...'' కంపెనీలో చాలామంది వ్యక్తులకు పరిహారాలు కేవలం 6 శాతం నుంచి 8 శాతం పెంచుతున్నప్పుడు టాప్ -లెవల్ వ్యక్తులకు 60 శాతం నుంచి 70 శాతం పరిహారాలు పెంచుతున్నారు. నా అభిప్రాయం ప్రకారం ఇది అనైతికం'' అని బోర్డుకు చురకలంటించారు. ఇది కంపెనీ మేనేజ్మెంట్, బోర్డులపై ఉద్యోగులకున్న నమ్మకాన్ని, విశ్వాసాన్ని హరిస్తుందని ఆందోళన వ్యక్తంచేశారు. ఈ పోస్టల్ బ్యాలెట్ విషయంలో డీఎన్ ప్రహ్లాద్ ను స్వతంత్ర డైరెక్టర్ గా నియమించేందుకు ఓటింగ్ వేయాలని కోరింది. కంపెనీ సీఈవో విశాల్ సిక్కా ప్యాకేజీ పెంపు విషయంలో కూడా వ్యవస్థాపకులు బోర్డు సభ్యుల నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తంచేశారు. -
స్మార్ట్ సిటీలకు ఎంతో దూరంలో ఉన్నాం
♦ ఇంజనీర్లు పెద్ద పట్టణాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు ♦ ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి ముంబై: స్మార్ట్‌సిటీల రూపకల్పనకు కేంద్ర ప్రభుత్వం ఓ పక్క ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో... ప్రతిష్టాత్మక స్మార్ట్ సిటీలను కలిగి ఉండే స్థితికి మనం (దేశం) చాలా, చాలా దూరంలో ఉన్నామని ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి అన్నారు. ఐటీ ఇంజనీర్లు టైర్ 1 పట్టణాలకే ప్రాధాన్యమిస్తున్నారని పట్టణీకరణపై ఇక్కడ జరిగిన ఓ కార్యక్రమం సందర్భంగా మూర్తి వెల్లడించారు. స్మార్ట్‌సిటీలకు ఆమడ దూరంలో ఉన్నందున దీనిపై తాను మాట్లాడబోనన్నారు. ‘ఇంజనీర్లు పెద్ద పట్టణాల్లోనే పనిచేసేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇన్ఫోసిస్ మైసూరు, భువనేశ్వర్, తిరువనంతపురంలో అభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసింది. కానీ, 50 శాతం సీట్లు కూడా నిండలేదు. అక్కడికి వెళ్లాలని ఎవరూ అనుకోవడం లేదు. ప్రతి ఒక్కరూ ముంబై, పుణె, బెంగళూరు హైదరాబాద్, నోయిడాల్లోనే ఉండాలనుకుంటున్నారు’ అని మూర్తి వివరించారు. జీవిత భాగస్వామికి ఉద్యోగం, పిల్లల విద్య, నాణ్యమైన వైద్య సౌకర్యాలు ఈ పరిస్థితికి కారణాలుగా పేర్కొన్నారు. ఐటీ, ఐటీ ఆధారిత కంపెనీలు దేశంలోని మారుమూల పట్టణాలకు విస్తరించడం ద్వారా ఉద్యోగావకాశాలను విస్తృతం చేయాలని కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేస్తుండగా... ఇన్ఫోసిస్ మాజీ చైర్మన్ అయిన నారాయణమూర్తి ఇలా వ్యాఖ్యానించడం ప్రాధాన్యం సంతరించుకుంది. సామూహిక వలసలు ఇకముందూ కొనసాగుతాయనే విషయాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం స్మార్ట్‌సిటీలపై పనిచేయాలని మూర్తి సూచించారు. అధిక ఆదాయం గల దేశాల్లో ఏదీ కూడా పట్టణీకరణ లేకుండా ప్రగతి సాధించలేదన్న విషయాన్ని గుర్తు చేశారు. ప్రభుత్వం వీటిపై దృష్టి సారిస్తే సేవలు, తయారీ రంగాల్లో ఉద్యోగాలను సృష్టించాల్సి ఉంటుందన్నారు. స్మార్ట్‌సిటీ ఎలా ఉంటుందో చూడాలనుకుంటే మైసూరులోని ఇన్ఫోసిస్ క్యాంపస్‌ను ఒకసారి సందర్శించాలని సభికులకు నారాయణమూర్తి సూచించారు. -
ఈసారైనా వింటారా?!
మంచి మనిషికొక మాట చాలని నానుడి. దేశంలో పెరిగిపోతున్న అసహనంపై, మైనారిటీలపై జరుగుతున్న దాడులపై సంఘ్ పరివారానికీ... బీజేపీ పెద్దలకూ ఒకటికి పదిసార్లు చెప్పినా సరిపోలేదు. అనేకులు అనేకసార్లు చెప్పినా తలకెక్కలేదు. దేశంలో ప్రథమ పౌరుడు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇప్పటికి మూడోసారి కూడా చెప్పడం అయిపోయింది. రచయితలు, కళాకారులు నిరసన తెలిపితే అధికారంలో ఉన్నవారికి అస్సలు నచ్చలేదు. చెప్పినవారికల్లా పేర్లు పెట్టారు. ముద్రలేశారు. ‘మీరు రాయకపోతే ఏమవుతుంద’ని ఒకరు... మీరంతా ఫలానా సమయంలో ఏమైనారని ఒకరు... కుట్రపూరితమని ఒకరు మాట్లాడి గేలిచేశారు. సినీ రంగ దిగ్గజాలు, చరిత్రకారులు, శాస్త్రవేత్తలు సైతం అలా నిరసన చెబుతున్నవారితో గళం కలిపినా ఏం జరుగుతున్నదో తెలివి తెచ్చుకోలేదు. వారి విషయంలోనూ వ్యక్తిగత విమర్శలకు దిగారు. ఇప్పుడిక ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి, ఫార్మా దిగ్గజం బయోకాన్ చీఫ్ కిరణ్ మజుందార్ షా వంతు వచ్చింది. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురాం రాజన్ సైతం ఈ పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేశారు. వీరికన్నా ముందు అంతర్జాతీయ రేటింగ్ సంస్థ మూడీస్ కూడా మతతత్వ శక్తులు చెలరేగటంపై హెచ్చరిక జారీ చేసింది. ఇదే వరస కొనసాగితే దేశీయంగా, అంతర్జాతీయంగా విశ్వసనీయత కోల్పోవడం ఖాయమని చెప్పింది. ఏ మాటకామాటే చెప్పుకోవాలి... ఎన్నిసార్లు చెప్పినా రాష్ట్రపతిని మాత్రం బీజేపీ నేతలు ఏమీ అనలేదు. ఆయనకివ్వాల్సిన గౌరవం ఇచ్చారు. మళ్లీ ఆ స్థాయిలో బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులు గౌరవించింది నారాయణమూర్తి ఇత్యాదులనే! వారి విషయంలో ఎవరూ మాట తూలలేదు. లేనిపోని ఆరోపణలు గుప్పించలేదు. బహుశా వ్యాపార భాష అర్ధమైనట్టుంది. ఏదో విధంగా అర్ధం కావాలనే దేశ ప్రజలు కూడా కోరుకున్నారు. కవులు, రచయితల విషయంలో...శాస్త్రవేత్తల విషయంలో చేసిన తర్కం అందరినీ నివ్వెరపరిచింది. గతంలో తస్లీమా నస్రీన్‌పై దాడి చేసినప్పుడు మీరంతా ఏం చేశారని ఒకరంటే, ఎమర్జెన్సీ విధించినప్పుడు ఈ వివేచన ఎటు పోయిందని మరొకరు ప్రశ్నించారు. నిజమే...రచయితలు, కవులు స్పందించాల్సిన సందర్భాలు గతంలో చాలా వచ్చాయి. సిక్కుల ఊచకోత, బాబ్రీ మసీదు విధ్వంసం, ఎంఎఫ్ హుస్సేన్‌పై దాడి జరిగినప్పుడు, ఆయన దేశం వదలి వెళ్లిపోయే పరిస్థితులు ఏర్పడినప్పుడూ...శ్రీరాంసేన పేరిట పబ్‌లలో, పార్క్‌ల్లో యువజంటలపై దాడులు చేసినప్పుడూ వారు అవార్డులను వెనక్కి ఇవ్వలేదు. అంతమాత్రాన ఇప్పుడు కూడా మాట్లాడవద్దనడం ఏం తర్కమో అర్ధంకాదు. అమెరికాలో బస్సులో ప్రయాణిస్తున్న నల్లజాతి వనిత రోసా పార్క్స్‌ను వెనక సీటుకెళ్లి కూర్చోమని డ్రైవర్ హుకుం జారీ చేసినప్పుడు 1955లో అక్కడ పౌరహక్కుల ఉద్యమం రగిలింది. ఒక తెల్లవాడి కోసమని నల్ల జాతి మహిళను అవమానిస్తారా అంటూ దేశమంతా ఉవ్వెత్తున ఉద్యమం ఎగసింది. మొన్నటికి మొన్న అయలాన్ కుర్దీ అనే మూడేళ్ల బాలుడు విగతజీవుడై మధ్యధరా సముద్ర తీరానికి కొట్టుకొచ్చినప్పుడు యూరప్ దేశాల తీరుపై ఆగ్రహం వెల్లువెత్తింది. ఆ దేశాలు శరణార్థులపై తమ వైఖరిని మార్చుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. అమెరికాలో 1955 కన్నా ముందు ఎన్నో దశాబ్దాలనుంచి నల్ల జాతి పౌరులపై వివక్ష ఉంది. అలాగే గత కొన్నేళ్లుగా సిరియా, లిబియా తదితర దేశాలనుంచి వలసలు సాగుతున్నాయి. ప్రమాదాల్లో ఎందరో మరణిస్తున్నారు. అయినా అయలాన్ కుర్దీ ఉదంతమే అందరినీ కదిలించింది. శరణార్ధుల సమస్యకు తాత్కాలికంగానైనా ఒక పరిష్కారాన్ని చూపింది. నిరసన తెలిపిన రచయితలు, కళాకారులు, చరిత్రకారులు, శాస్త్రవేత్తలు వగైరాలు వ్యక్తంచేసిన ఆందోళనకూ...మూడీస్, నారాయణమూర్తి, కిరణ్ మజుందార్ షా, రఘురాంరాజన్ తదితరులు ప్రస్తావించిన అంశాలకూ చాలా తేడా ఉంది. ఈ రెండు వర్గాలూ దేశంలో పెరిగిపోతున్న అసహనం గురించే మాట్లాడినా ఆ సమస్యను చూసిన తీరు వేరుగా ఉంది. శతాబ్దాలుగా ఈ దేశంలో ఉన్న నాగరికత, అది అందజేసిన విలువలు ఛిద్రమవుతున్నాయన్న ఆందోళన రచయితలు, కళాకారులు తదితరుల్లో వ్యక్తమైంది. ఉన్మాద మూకల దాడులు ఇలాగే కొనసాగితే అంతిమంగా ప్రజాస్వామ్యం పతనం కావడానికి దారితీస్తుందని వారు హెచ్చరించారు. నారాయణమూర్తి, కిరణ్ మజుందార్ షా, రఘురాం రాజన్లది వేరే తరహా ఆందోళన. ఘర్షణ వాతావరణం, కొందరు భయాందోళనలతో కాలం వెళ్లబుచ్చే పరిస్థితులు ఆర్ధికాభివృద్ధికి ఆటంకాల వుతాయన్నది వారి భావన. రఘురాం రాజన్ చెప్పిన మాటలు గమనించదగ్గవి. భిన్నాభిప్రాయాలను గౌరవించడం, సహనంతో మెలగడం ఆర్థిక పురోగతికి దోహదపడతాయనడమే కాదు...వీటిని కాపాడుకోవడానికి పోరాడవలసిన అవసరం ఉన్నదని కూడా ఆయన నొక్కిచెప్పారు. దేశ ఆర్థిక పరిస్థితి గురించి, రెపో, రివర్స్ రెపో రేట్ల గురించీ...వడ్డీ రేట్ల హెచ్చుతగ్గుల గురించి మాత్రమే ప్రస్తావించే అలవాటున్న రాజన్ చేత విలువల గురించి కూడా మాట్లాడించిన ఘనత బీజేపీ నేతలదే. దాద్రిలో గొడ్డు మాంసం తింటున్నారని అనుమానం వచ్చి ఒక ముస్లింను దుండగులు పొట్టనబెట్టుకున్నాక అదే తరహాలో రెండు ఘటనలు జరిగాయి. అంతక్రితం తమిళనాడులో రచయిత పెరుమాళ్ మురుగన్‌ను వేధించడం, క ర్ణాటకలో సాహితీవేత్త కల్బుర్గిని కాల్చిచంపడం వంటి ఉదంతాలు చోటు చేసుకున్నాయి. వీటన్నిటినీ విడివిడిగా చూడగలగటం గొప్ప స్థిత ప్రజ్ఞతే కావొచ్చు...దాన్ని బీజేపీ నేతలు, సంఘ్ పరివార్ నేతలు సాధించి ఉండొచ్చు. కానీ మిగిలినవారెవరూ అలా చూడటం లేదు. వీటన్నిటి వెనకా ఒక రకమైన ధోరణి ఉన్నదని భావిస్తున్నారు. వ్యాపార ప్రపంచం హెచ్చరించాకైనా ఆ నేతలు వాస్తవాలను గ్రహించాలి. పరిస్థితిని చక్కదిద్దాలి. -
ప్చ్... అలా జరిగింది!
గొప్ప ఆవిష్కరణ ఒక్కటీ లేదు 60 ఏళ్లుగా భారత్‌లో పరిస్థితులపై ఇన్ఫీ మూర్తి వ్యాఖ్యలు బెంగళూరు: గడిచిన అరవై ఏళ్లలో ప్రపంచం నలుమూలలా ఇంటింటికి చేరగలిగే ఆవిష్కరణ కనీసం ఒక్కటి కూడా భారత్ చేయలేకపోయిందని ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. దేశీయంగా ప్రభావవంతమైన పరిశోధనలు జరిగేలా చూడటంపై దివంగత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తర్వాత ఇతర నేతలెవరూ కూడా పెద్దగా దృష్టి పెట్టలేదని ఆయన వ్యాఖ్యానించారు. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ స్నాతకోత్సవంలో పాల్గొన్న సందర్భంగా నారాయణ మూర్తి ఈ విషయాలు చెప్పారు. ‘రేడియో, బల్బు, టీవీలు, కంప్యూటర్లు ఇవన్నీ కూడా విదేశీ యూనివర్సిటీల నుంచి వచ్చినవే. మరోవైపు మన భారతీయ కళాశాలలు.. ముఖ్యంగా ఐఐఎస్సీ, ఐఐటీలు.. గడచిన అరవై ఏళ్లలో మన సమాజాన్ని, ప్రపంచాన్ని మెరుగ్గా తీర్చిదిద్దగలిగేందుకు ఏం ఆవిష్కరణలు చేయగలిగాయని ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఇంటింటా మార్మోగేలా కనీసం ఒక్క ఆవిష్కరణైనా భారత్ నుంచి వచ్చిందా? ప్రపంచాన్ని కుదిపేసేటువంటి ఒక్క ఐడియా అయినా ఇవ్వగలిగామా? నిజంగా చెప్పాలంటే గత 60 ఏళ్ల నుంచి అలాంటివేమీ చేయలేకపోయాం’ అని మూర్తి వ్యాఖ్యానించారు. మేధస్సులోనూ, ఉత్తేజంలోనూ పాశ్చాత్య విద్యార్థులకేమాత్రం తీసిపోకపోయినప్పటికీ.. మన యువత ప్రభావవంతమైన పరిశోధనలు పెద్దగా చేయలేదని ఆయన పేర్కొన్నారు. 1962లో అమెరికా సందర్శించినప్పుడు అక్కడ పీహెచ్‌డీలు పూర్తి చేసుకోబోతున్న భారతీయ విద్యార్థులు స్వదేశం తిరిగొచ్చి.. విద్యా, వైద్యం మొదలైనవి మారుమూల ప్రాంతాల్లో పేదవారికి కూడా అందుబాటులోకి వచ్చేలా చూడాలని పిలుపునిచ్చారని మూర్తి చెప్పారు. దాని ఫలితంగానే ఆటమిక్ ఎనర్జీ మొదలైన రంగాల్లో భారత్ పురోగతి సాధించగలిగిందని, ప్రస్తుతం కూడా 60 దశాబ్దం నాటి మ్యాజిక్‌ను మళ్లీ సృష్టించాల్సిన అవసరం ఉందని తెలిపారు. మేధావులకు, అధ్యాపకులకు సమాజంలో సముచిత గౌరవం లభించే పరిస్థితులు కల్పించాల్సి ఉందని పేర్కొన్నారు. చౌక కారు ముద్రతోనే నానోకు దెబ్బ టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా చెన్నై: నానో కారు భారీ అంచనాలతో వచ్చినా మార్కెట్లో నిలబడలేకపోవడానికి కారణం.. దాని బ్రాండింగ్ విషయంలో జరిగిన తప్పులేనని టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా వ్యాఖ్యానించారు. నానోకు అందుబాటు ధరలోని కారుగా కాకుండా చౌక కారుగా ముద్రపడటం అత్యంత పెద్ద తప్పిదమని, ఇదే వాహన అమ్మకాలపై ప్రతికూల ప్రభావం చూపిందని చెప్పారు. సాధారణంగా కారును హోదాకు చిహ్నంగా పరిగణిస్తారని, ఎవరూ కూడా అత్యంత చౌక కారుగా ముద్రపడిన దాన్ని కొనుక్కునేందుకు ఇష్టపడరని ఆయన విశ్లేషించారు. గ్రేట్ లేక్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ 11వ స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు చెప్పారు. నానో కారును డిజైన్ చేసిన వారి సగటు వయస్సు 25-26 సంవత్సరాలేనని, రూ.లక్షకు దీన్ని తయారుచేయడమనేది మహాయజ్ఞంలాంటిదేనని టాటా పేర్కొన్నారు. రాజకీయ కారణాల వల్ల కారు మార్కెట్లోకి రావడం ఆలస్యం కావడంతో దానిపై ఉత్కం ఠ తగ్గిపోయిందన్నారు. ఈలోగా తమకు వ్యతిరేకంగా కథనాలు అల్లడానికి పోటీ కంపెనీలకు అవకాశం చిక్కిందని చెప్పారు. వ్యాపార ముఖచిత్రాన్ని మార్చేసే ఈ-కామర్స్ భారీ స్థాయిలో వస్తున్న ఈ-కామర్స్ స్టార్టప్ సంస్థలు.. దేశీ వ్యాపార రంగం ముఖచిత్రాన్ని మార్చివేయగలవని టాటా అభిప్రాయపడ్డారు. అమెరికాలో 70, 80వ దశకాల్లో కనిపించినట్లుగా.. ఉజ్వల భవిష్యత్తు ఉన్న అనేక మంది యువ వ్యాపారవేత్తలు ప్రస్తుతం దేశీయంగా కనిపిస్తున్నారని ఆయన చెప్పారు. దేశీ వ్యాపార రంగ ముఖచిత్రాన్ని మార్చివేయగలిగే సత్తా ఉన్న ఈ-కామర్స్, ఈ-రిటైల్ విభాగ స్టార్టప్‌లను ప్రోత్సహించే ఉద్దేశంతోనే తాను కొన్నింటిలో ఇన్వెస్ట్ చేసినట్లు టాటా చెప్పారు. పీసీలపైనే దృష్టి.. పెద్ద తప్పిదం మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ఆర్లాండో: ఎప్పటికీ పర్సనల్ కంప్యూటర్ల (పీసీ) హవానే నడుస్తుందని భావించి గతంలో పెద్ద తప్పిదం చేశామని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల వ్యాఖ్యానించారు. ఈ ఆలోచనా ధోరణి వల్లే మొబైల్ ఫోన్ల విప్లవాన్ని ఊహించలేకపోయామని, అవకాశాలు అందుకోలేకపోయామని ఆయన పేర్కొన్నారు. అయితే అలాగని భవిష్యత్తంతా మొబైల్ ఫోన్లదే అనుకుంటే గతంలో చేసిన తప్పే పునరావృతం అయినట్లవుతుందని ఒక టెక్నాలజీ వెబ్‌సైట్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నాదెళ్ల పేర్కొన్నారు. భవిష్యత్‌లో పెను మార్పులు తే బోయే వాటిని ముందస్తుగా పట్టుకోవడంపైనే కంపెనీ దృష్టి పెట్టాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. అందులో భాగంగానే విండోస్ కొత్త వెర్షన్ అని, ఫోన్ల విషయంలోనూ కాపీలు కొట్టడం కాకుండా వినూత్నంగా అందించాలన్నదే తమ లక్ష్యమని నాదెళ్ల తెలిపారు. 1992లో తాను మైక్రోసాఫ్ట్‌లో చేరినప్పుడు ప్రతి ఇంట్లోనూ పర్సనల్ కంప్యూటర్ ఉండాలన్నది కంపెనీ లక్ష్యమని, తాము దాన్ని సాధించగలిగామని ఆయన చెప్పారు. పర్సనల్ కంప్యూటింగ్, ఉత్పాదకతను పెంచుకోవడం, మరింత మెరుగైన క్లౌడ్ ప్లాట్‌ఫామ్‌ను రూపొందించడమనే మూడు అంశాలపై మైక్రోసాఫ్ట్ ప్రస్తుతం ప్రధానంగా దృష్టి సారిస్తోందని నాదెళ్ల తెలిపారు. నోకియా ఫోన్ల వ్యాపార విభాగంలో మార్పులు, చేర్పులను ప్రస్తావిస్తూ.. తాము రోజుకో ఫోన్‌ను ఆవిష్కరించడం కన్నా గణనీయమైన మార్కెట్ వాటాను దక్కించుకునే సత్తా ఉన్న కొన్ని ఫోన్లపైనే దృష్టి పెట్టదల్చుకున్నట్లు ఆయన వివరించారు. -
ఇన్ఫీ ప్రమోటర్లకు జాక్‌పాట్!
వాటాల అమ్మకంతో రూ.6,500 కోట్లు... ⇒3.26 కోట్ల షేర్లను విక్రయించిన నలుగురు సహ వ్యవస్థాపకులు... ⇒జాబితాలో నారాయణ మూర్తి, శిబులాల్, నీలేకని, దినేశ్ ⇒ఇంకా కంపెనీలో 5.2% మేర వాటా.. ⇒దీని విలువ దాదాపు 18,000 కోట్లు.. ⇒5% పైగా పడిపోయిన షేరు విలువ.. ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు అదిరిపోయే లాభాలను సొంతం చేసుకున్నారు. కంపెనీని స్థాపించిన దాదాపు 35 ఏళ్ల తర్వాత భారీస్థాయిలో వాటాలను విక్రయించడం ద్వారా నలుగురు ప్రమోటర్లు, వాళ్ల కుటుంబ సభ్యులు ఏకంగా రూ.6,500 కోట్ల మొత్తాన్ని తమ ఖాతాలో వేసుకున్నారు. సహ వ్యవస్థాపకులైన ఎన్ఆర్ నారాయణ మూర్తి, ఎస్డీ శిబులాల్, నందన్ నీలేకని, కె.దినేశ్‌లు సోమవారం ఈ భారీ డీల్‌తో స్టాక్ మార్కెట్ వర్గాలను ఆశ్చర్యపరిచారు. కంపెనీ సీఈఓగా తొలిసారి బయటివ్యక్తి విశాల్ సిక్కా పగ్గాలు చేపట్టడం.. బోనస్ షేర్ల జారీ నేపథ్యంలో వాటాలను విక్రయించడం గమనార్హం. ఇంత భారీ అమ్మకం కారణంగా ఇన్ఫీ షేరు ధర 5% పైగా పతనమైంది. బెంగళూరు: ఇన్ఫోసిస్... దేశీ స్టాక్ మార్కెట్లో సోమవారం ఒక కుదుపు కుదిపింది. కంపెనీ సహ వ్యవస్థాపకులైన ఎన్ఆర్ నారాయణ మూర్తి, ఎస్డీ శిబులాల్, నందన్ నీలేకని, కె. దినేశ్.. వాళ్ల కుటుంబ సభ్యులు తమ వాటాల్లో కొంత భాగాన్ని బల్క్ డీల్ ద్వారా విక్రయించారు. 3.26 కోట్ల షేర్లను అమ్మడం ద్వారా దాదాపు రూ.6,500 కోట్ల మొత్తం లభించింది. ఒక్కో షేరును రూ.1,988 చొప్పున విక్రయించినట్లు సమాచారం. బీఎస్ఈలో శుక్రవారం నాటి ముగింపు ధర రూ.2,069తో పోలిస్తే ఇది 4 శాతం మేర తక్కువ కావడం గమనార్హం. ఈ భారీ డీల్‌ను విదేశీ బ్రోకరేజి దిగ్గజం డాయిష్ బ్యాంక్ పూర్తి చేసింది. ఇంత భారీ స్థాయిలో షేర్లు చేతులుమారడంతో కంపెనీ షేరు ధర భారీగా పడింది. ఒకానొకదశలో 5 శాతం పైగా పడిపోయి రూ.1,958 స్థాయికి దిగజారింది. చివరకు 4.88 శాతం నష్టపోయి... రూ.1,968 వద్ద స్థిరపడింది. కాగా, కంపెనీ మార్కెట్ విలువ సోమవారం ఒక్కరోజే సుమారు రూ.12,000 కోట్లు ఆవిరైంది. ఇంకా 5.2 శాతం వాటా.... ఈ నలుగురు ప్రమోటర్లు, వాళ్ల కుటుంబీకులకు ఇప్పటిదాకా కంపెనీ మొత్తం ఈక్విటీలో 12.4 కోట్ల షేర్లు(సుమారు 8 శాతం వాటా) ఉన్నాయి. తాజాగా విక్రయించిన 3.26 కోట్ల షేర్లు.. మొత్తం కంపెనీ ఈక్విటీలో సుమారు 2.8 శాతం వాటాకు సమానం. అంటే ఇంకా 5.2 శాతం వాటా ఈ నలుగురు సహ వ్యవస్థాపకులు(ప్రమోటర్లు), వాళ్ల కుటుంబీకులకు ఉన్నట్లు లెక్క. దీని విలువ సోమవారం షేరు ముగింపు ధరతో చూస్తే... సుమారు రూ.18,000 కోట్ల పైమాటే కావడం గమనార్హం. కాగా, 1981లో కంపెనీని స్థాపించిన ఏడుగురు సహ వ్యవస్థాపకుల(అశోక్ అరోరా, క్రిష్ గోపాలకృష్ణన్, ఎన్ఎస్ రాఘవన్‌లతో కలిపి) మొత్తం వాటా ఈ ఏడాది సెప్టెంబర్ చివరినాటికి దాదాపు 15.9%. దీనిలో ఇప్పుడు నలుగురు ప్రమోటర్ల వాటా అమ్మకాన్ని(2.8 శాతం) తీసేస్తే.. 13.1 శాతంగా లెక్కతేలుతోంది. ఇక ఈ సెప్టెంబర్ చివరికి విదేశీ ఇన్వెస్టర్లకు 42.67% వాటా, దేశీ సంస్థల(డీఐఐ)కు 14.68%, కార్పొరేట్లు.. రిటైల్ ఇన్వెస్టర్లు, ఇతరులకు 26.93% వాటాలు ఉన్నాయి. కొత్త సీఈఓ రాకతో... గడిచిన రెండేళ్లుగా ఐటీ రంగంలోని ఇతర పోటీ కంపెనీలతో పోలిస్తే ఇన్ఫోసిస్ అటు వ్యాపారపరంగా.. ఇటు స్టాక్ మార్కెట్లో షేరు విలువ పరంగా కూడా వెనుకబడిన సంగతి తెలిసిందే. దీంతో మాజీ చైర్మన్ ఎన్ఆర్ నారాయణ మూర్తి మళ్లీ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించడం.. ఆయన కుమారుడు రోహన్ మూర్తిని తనకు సహాయకుడిగా నియమించుకోవడం జరిగాయి. అయితే, ఈ చర్యలపై ఇన్వెస్టర్లతో పాటు అటు కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లలో కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో సుమారు 14 మంది టాప్ ఎగ్జిక్యూటివ్‌లు ఇన్ఫోసిస్‌ను వదిలిపెట్టారు కూడా. ఈ నేపథ్యంలో సీఈఓ వేట ప్రారంభించిన కంపెనీ.. జర్మనీ ఐటీ దిగ్గజం శాప్(ఎస్ఏపీ)కి చెందిన మాజీ ఎగ్జిక్యూటివ్.. విశాల్ సిక్కాను సారథిగా నియమించింది. నారాయణమూర్తితో పాటు అప్పటి సీఈఓ శిబులాల్, క్రిస్ గోపాల కృష్ణన్ కూడా కంపెనీ పదవుల నుంచి వైదొలిగారు. కాగా, ఆగస్టులో సిక్కా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇన్ఫీ షేరు ఇప్పటిదాకా 20 శాతం పైగానే దూసుకెళ్లింది. షేరు ధర ఆల్‌టైమ్ గరిష్టమైన రూ.4,400 స్థాయిని కూడా అందుకుంది. రెండో త్రైమాసిక ఫలితాల సందర్భంగా అనూహ్యంగా ఒక్కో షేరుకి మరో షేరును బోనస్‌గా కంపెనీ ప్రకటించడం తెలిసిందే. ఇటీవలే ఈ బోనస్ ఇష్యూ అమల్లోకి రావడంతో షేరు విలువ సగమైంది. విశ్లేషకులు ఏమంటున్నారు... సహ వ్యవస్థాపకుల వాటా విక్రయం వల్ల కంపెనీపై ప్రతికూల ప్రభావమేమీ ఉండబోదని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ‘కార్పొరేట్ నైతిక నియమావళి(గవర్నెన్స్) విషయంలో అత్యున్నత ప్రమాణాలను ఇన్ఫీ నెలకొల్పింది. ఇది ఇకపైనా కొనసాగనుంది. కంపెనీ రోజువారీ కార్యకలాపాల్లో ఈ ప్రమోటర్లు, వాళ్ల కుటుంబీకులెవరూ పాలుపంచుకోవడం లేదు. అందువల్ల భారీగా షేర్ల విక్రయం వల్ల స్టాక్ ధరపై తక్షణం కొంత ప్రభావం ఉన్నప్పటికీ.. కంపెనీ మూలాలు పటిష్టంగానే ఉన్నందున భవిష్యత్తుకు ఢోకా లేదు’ అని బ్రోకరేజి సంస్థ ప్రభుదాస్ లీలాధర్ అభిప్రాయపడింది. టీసీఎస్‌తో పోలిస్తే ఇన్ఫోసిస్ కాస్త వెనుకబడినప్పటికీ.. సిక్కా ఆగమనంతో మళ్లీ పునర్వైభవం దిశగా అడుగులేస్తోందని ఏంజెల్ బ్రోకింగ్ వైస్ ప్రెసిడెంట్ మాయురేష్ జోషీ అన్నారు. వ్యవస్థాపకుల వాటా విక్రయంవల్ల కంపెనీ ఫండమెంటల్స్‌పై ప్రభావమేమీ ఉండబోదని చెప్పారు. -
విద్యా సంస్థలకు మరింత స్వయం ప్రతిపత్తినివ్వాలి: ఇన్ఫీ మూర్తి
బెంగళూరు: విద్యా సంస్థల విషయంలో ప్రభుత్వ జోక్యం తగ్గాలని, వాటికి మరింత స్వయం ప్రతిపత్తినివ్వాలని ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ మాజీ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి వ్యాఖ్యానించారు. ఏది మంచి కళాశాల, ఏది కాదు అన్నది మార్కెట్, సమాజమే నిర్ణయించుకుంటాయని అంతే తప్ప ప్రభుత్వం వీటి ఏర్పాటులో జోక్యం చేసుకోకూడదని ఆయన పేర్కొన్నారు. ఇన్ఫోసిస్ ప్రైజ్ 2014 విజేతలను ప్రకటించేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మూర్తి ఈ విషయాలు తెలిపారు. ప్రొఫెసర్లు, పరిశోధకులు, యూనివర్సిటీల నిర్వాహకులకు పూర్తి స్థాయి స్వయం ప్రతిపత్తి అవసరమని.. ఏఐసీటీ, యూజీసీ వంటి సంస్థల పాత్రను తగ్గించాలని ఆయన పేర్కొన్నారు. కుప్పతెప్పలుగా పుట్టుకొస్తున్న స్కూళ్లు, కాలేజీల వల్ల విద్యాప్రమాణాలపై నియంత్రణ లేకుండా పోవచ్చన్న అంశంపై స్పందిస్తూ.. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయన్నారు. కానీ ప్రభుత్వ నియంత్రణ వల్ల పరిస్థితి మెరుగుపడకపోవచ్చని, ఏది మంచి..ఏది చెడు అన్న విషయంలో అంతిమ నిర్ణయం మార్కెట్దేనని మూర్తి పేర్కొన్నారు. పూర్తి స్థాయి స్వయం ప్రతిపత్తినిస్తే ప్రారంభంలో కొంత దుర్వినియోగం కావొచ్చని, కొంత మంది ఇబ్బంది పడవచ్చని కానీ అంతిమంగా మెరుగైన విద్యా వ్యవస్థ ఏర్పడగలదని ఆయన చెప్పారు. -
ఇన్ఫోసిస్ సీఈవోగా విశాల్ సిక్కా
బెంగళూరు : దేశంలోని అతి పెద్ద ఐటీ కంపెనీల్లో ఒకటిగా ఉన్న ఇన్ఫోసిస్ కొత్త సిఈఓగా విశాల్ సిక్కా పేరు ఖరారు అయ్యింది. మేనేజింగ్ డైరెక్టర్ బాధ్యతలు కూడా ఆయనే చేపట్టనున్నారు. ఆగస్ట్ 1వ తేదీ నుంచి విశాల్ సిక్కా ఇన్ఫీ పగ్గాలు చేపడతారు. ఆయన శిబూలాల్ నుంచి పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు. స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో పిహెచ్డీ చేసిన సిక్కా.. ఎస్ఏపీ కంపెనీలో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా పని చేస్తున్నారు. ఎస్ఏపీలో క్లౌడ్ టెక్నాలజీ, మొబైల్ అప్లికేషన్ల ఎనాలసిస్ల విభాగాలను నిర్వహిస్తున్నారు. మరోవైపు నారాయణ మూర్తి ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ బాధ్యతల నుంచి వైదొలుగుతారు. గౌరవ అధ్యక్షుడిగా మాత్రం కొనసాగతారు. కొత్త సీఈఓ వార్త నేపథ్యంలో ఇన్ఫోసిస్ షేరు ధర లాభపడింది. ఈరోజు మళ్లీ ఒక శాతానికి పైగా నష్టపోతోంది. ప్రస్తుతం 3,150కి సమీపంలో ట్రేడవుతోంది. దాదాపు ఏడాది కాలంగా ఇన్ఫోసిస్ నుంచి టాప్ ఎగ్జిక్యూటివ్‌లు అందరూ వెళ్లిపోతున్న నేపథ్యంలో కొత్త సీఈఓ రావడం కంపెనీకి కాసింత పాజిటివ్ న్యూసేనని అనలిస్టులు విశ్లేషిస్తున్నారు. అయితే కంపెనీ గత వైభవాన్ని తీసుకురావడం మాత్రం చాలా పెద్ద సవాల్ అని వారు అభిప్రాయపడుతున్నారు. కాగా రిటైర్ మెంట్ తర్వాత నారాయణమూర్తి మళ్లీ ఇన్పోసిస్ కంపెనీలో చేరిన గత 12 నెలల్లో 12 మంది రాజీనామా సమర్పించారు. -
ఇన్ఫోసిస్ లో ఏం జరుగుతోంది!
దేశ టెక్నాలజీ రంగంలో ఐటీ దిగ్గజం ఇన్పోసిస్ లిమిటెడ్ అగ్రస్థానమేనని చెప్పడానికి ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఎన్నో ఐటీ కంపెనీలకు మార్గదర్శకంగా నిలిచిన ఇన్పోసిస్ కంపెనీ ఇటీవల కాలంలో కొన్ని ఒడిదుడుకులకు లోనవుతున్నట్టు కనిపిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇన్ఫోసిస్ ను కొన్ని సమస్యలు చుట్టుముడుతున్నాయి. గతంలో ఎంతో ఘనకీర్తిని సంపాదించుకున్న ఇన్పోసిస్ సహవ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి చైర్మన్ స్థానం నుంచి తప్పుకున్న తర్వాత పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ఇటీవల కాలంలో సీనియర్లే కాక యువ సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు కూడా ఇన్పోసిస్ ను భారీ సంఖ్యలో వదిలి వెళ్లినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గత 12 నెలల కాలంలో 12 మంది సీనియర్లు తమ పదవుల నుంచి తప్పుకోవడం చర్చనీయాంశమవుతోంది. జనవరి-మార్చి మధ్యకాలంలోనే 8996 మంది ఉద్యోగులు ఇన్పోసిస్ ను వదిలి వెళ్లినట్టు తెలుస్తోంది. వివిధ కారణాలతో గత 12 నెలల్లో దాదాపు 36 వేలకు పైగానే ఐటీ దిగ్గజానికి టాటా చెప్పనట్టు తెలుస్తోంది. మార్చి 2015 సంవత్సరంలో ఇన్పోసిస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎస్.డీ శిబులాల్ కూడా రిటైరయ్యేందుకు సిద్దమవుతున్నారు. ఇన్పోసిస్ కంపెనీ వదిలేసి వెళ్తున్న ఉద్యోగులను ఆపేందుకు ఏడు శాతం మేరకు జీతాలను పెంపు చేశారు. ఐనా కంపెనీ నుంచి ఉద్యోగుల వెళ్లడం మాత్రం తగ్గుముఖం పట్టలేదనే వార్తలు వినిపిస్తున్నాయి. 1981లో నారాయణ మూర్తితో పాటు ఇన్పోసిస్ ను స్థాపించిన ఎన్ఎస్ రాఘవన్, ఎస్ గోపాలకృష్ణన్, నందన్ నీలెకని, శిబులాల్, కే.దినేష్ రాజీనామాలు సమర్పించిన వారిలో ఉన్నారు. వారేకాకుండా సినియర్ ఎగ్జిక్యూటివ్స్ అశోక్ వేమూరి, బాసబ్ ప్రధాన్ లు కూడా ఇన్పోసిస్ కు గుడ్ బై చెప్పారు. లోకసభ ఎన్నికల్లో పోటి చేసేందుకుగాను బాలకృష్ణన్ తప్పుకున్నారు. ఇన్పోసిస్ ను వదిలి వెళ్లే జాబితాలో తాజాగా 19 ఏళ్లపాటు సేవలందించిన సేల్స్, మార్కెటింగ్ హెడ్, వైస్ ప్రెసిడెంట్ ప్రసాద్ త్రికూటం తన పదవికి రాజీనామా చేయడం ఉద్యోగుల్లో మరింత అభద్రతభావాన్ని పెంచే దిశగా దారి తీసినట్టు తెలుస్తోంది. ఐతే యువ ఉద్యోగులు కంపెనీని విడిచి వెళ్లడానికి వారానికోసారి కొత్త విధానాల్ని ఉద్యోగులపై రుద్దడం ప్రధాన కారణమని వినిపిస్తోంది. ఉద్యోగులను సంప్రదించకుండానే 8.8 పనిగంటల నుంచి 9.25 గంటలకు పెంచడం ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తికి కారణమైనట్టు సమాచారం. పనిగంటల పెంపు కూడా ఉద్యోగుల్లో అభద్రతాభావాన్ని పెంచడమే కాకుండా కంటి తుడుపు చర్యగా జీతాలను పెంపు చేయడం కూడా ఉద్యోగులను సంతృప్తి పరచలేకపోయింది. ముఖ్యంగా ప్రశ్నించిన ఉద్యోగులను ఎలాంటి సమాచారం లేకుండా తొలగించినట్టు తెలుస్తోంది. ఇన్పోసిస్ లో కొనసాగుతున్న అప్రజాస్వామిక విధానాలను బహిరంగంగా మాజీ ఉద్యోగులు, ప్రస్తుత ఉద్యోగులు ఇంటర్నెట్ వెబ్ సైట్లు, బ్లాగ్ ల్లో స్పందిస్తున్నారు. ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఉన్న సీనియర్ ఉద్యోగులు ఎలాంటి ప్రోడక్టవిటీ లేకుండా సేవలందించడం కూడా దిగువ తరగతి ఉద్యోగుల్లో నిరాసక్తత పెంచినట్టు తెలుస్తోంది. 13 ఏళ్లకు పైబడి అనుభవం ఉన్న ఉద్యోగులందరిని తొలగించినా.. కంపెనీపై ఎలాంటి ప్రభావం చూపబోదని యువ ఉద్యోగులు వివిధ బ్లాగుల్లో తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇన్పోసిస్ లో చోటు చేసుకుంటున్న పలు పరిస్థితులపై వీడియోల రూపంలో, ఇంటర్నెట్ బ్లాగుల్లో కథనాలు భారీగానే పబ్లిష్ అవుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో తీవ్ర ఒడిదుడుకులెదుర్కొంటున్న ఇన్పోసిస్ లో పరిస్థితులు సానుకూలంగా మారుతాయనే అభిప్రాయాన్ని పలువురు ఆశిస్తున్నారు. -
ఇన్పోసిస్ కు మరో సీనియర్ గుడ్ బై!
బెంగళూరు: భారత్ లో ఐటీ దిగ్గజం ఇన్పోసిస్ లిమిటెడ్ కు మరో సీనియర్ ఎగ్జిక్యూటివ్ గుడ్ బై చెప్పారు. సేల్స్, మార్కెటింగ్ హెడ్, వైస్ ప్రెసిడెంట్ ప్రసాద్ త్రికూటం తన పదవికి రాజీనామా చేశారని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ఇన్పోసిస్ కంపెనీలో పలు హోదాల్లో 19 ఏళ్లపాటు ఇన్పోసిస్ కు సేవలందించిన ప్రసాద్ రాజీనామా చేశారు అని కంపెనీ అధికార ప్రతినిధి వెల్లడించారు. ఇన్పోసిస్ అధ్యక్షుడు, బోర్డు మెంబర్ బీజీ శ్రీనివాస్ రాజీనామా చేసిన వారంలోపే మరో సీనియర్ ఉద్యోగి కంపెనీ నుంచి వైదొలగడం చర్చనీయాంశమైంది. బీజీ శ్రీనివాస్ మే 28 తేదిన రాజీనామా చేశారు. రిటైర్ మెంట్ తర్వాత నారాయణమూర్తి మళ్లీ ఇన్పోసిస్ కంపెనీలో చేరిన గత 12 నెలల్లో 12 మంది రాజీనామా సమర్పించారు. -
ప్రపంచం చూపు మనవైపే: ‘ఇన్ఫోసిస్’ మూర్తి
‘ఐఐటీ-హైదరాబాద్’ స్నాతకోత్సవంలో ‘ఇన్ఫోసిస్’ మూర్తి సాక్షి, సంగారెడ్డి: ‘గ్రాడ్యుయేషన్ తర్వాత నేను 1970లో పారిస్ వెళ్లాను. అప్పట్లో భారత్ అంటే విదేశీయుల దృష్టిలో పనికిరాని దేశం. గ్రాడ్యుయేట్లుగా మీరు బయటకు వస్తున్న ఈ తరుణంలో మాత్రం మన దేశం ప్రపంచం దృష్టిలో ఎంతో నిరూపించుకుంది’ అని ఇన్ఫోసిస్ కార్యనిర్వాహక చైర్మన్ ఎన్ఆర్ నారాయణమూర్తి అన్నారు. మెదక్ జిల్లా సంగారెడ్డి మండలం ఎద్దుమైలారంలోని ఓఎఫ్‌డీ కర్మాగారంలో తాత్కాలికంగా నిర్వహిస్తున్న ‘ఐఐటీ-హైదరాబాద్’ కళాశాల ద్వితీయ స్నాతకోత్సవం బుధవారం జరిగింది. బీటెక్, ఎంఎస్సీ కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్థులకు పట్టాలు, బంగారు, వెండి పతకాలు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎన్ఆర్ నారాయణ మూర్తి విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. ‘ప్రపంచ ఆర్థిక, రాజకీయ సమస్యల పరిష్కారంలో నాయకత్వం వహించే దేశాల్లో ఒకటిగా ప్రపంచం భారతదేశం వైపు చూస్తోంది. ఈ గొప్ప అవకాశం, బాధ్యత మీపైనే ఉంది. మీ ప్రతి చర్య భవిష్యత్తు తరాలకు అద్భుత దేశాన్ని అందించేలా ఉండాలి. అవినీతి, అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడండి. ఇది మీ పవిత్ర బాధ్యత’ అని ఆయన సూచించారు. క్రియాశీలం, వేగం, నిజాయతీ, సార్థకత, ఉత్సాహం, క్రమశిక్షణతో పనిచేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో దేశ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలన్నారు.