
ఇన్ఫీ నారాయణ మూర్తి కానుక
న్యూఢిల్లీ: ఐటీ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్‌ఆర్ నారాయణ మూర్తి తన నాలుగు నెలల మనవడు ఏకగ్రాహ్ రోహన్ మూర్తికి ఖరీదైన బహుమతిని ప్రదానం చేశారు. ఇన్ఫోసిస్‌కు చెందిన 15 లక్షల షేర్లను ఇచ్చారు. ప్రస్తుత మార్కెట్ ధర (రూ. 1,602) ప్రకారం వీటి విలువ రూ. 240 కోట్లుగా ఇన్ఫోసిస్ ఒక ప్రకటనలో వెల్లడించింది.
కంపెనీలో తనకుగల ఈక్విటీలో 0.04 శాతం వాటాను కుమారుడు రోహన్ పుత్రుడు ఏకగ్రాహ్‌కు నారాయణ మూర్తి రిజిస్టర్ చేశారు. దీంతో ఏకగ్రాహ్ రోహన్ ఇన్ఫోసిస్‌లో బుల్లి బిలియనీర్ వాటాదారుడయ్యారు. నారాయణ మూర్తి కుమార్తె అక్షత, అల్లుడు రిషీ (బ్రిటన్ ప్రధాని)కి ఇద్దరు కుమార్తెలుకాగా.. ఏకగ్రాహ్ మనవడు.