ఇన్పోసిస్ కు మరో సీనియర్ గుడ్ బై! | Another senior Infosys executive Prasad Thrikutam exits | Sakshi
Sakshi News home page

ఇన్పోసిస్ కు మరో సీనియర్ గుడ్ బై!

Published Thu, Jun 5 2014 11:19 PM | Last Updated on Sat, Sep 2 2017 8:21 AM

ఇన్పోసిస్ కు మరో సీనియర్ గుడ్ బై!

ఇన్పోసిస్ కు మరో సీనియర్ గుడ్ బై!

బెంగళూరు: భారత్ లో ఐటీ దిగ్గజం ఇన్పోసిస్ లిమిటెడ్ కు మరో సీనియర్ ఎగ్జిక్యూటివ్ గుడ్ బై చెప్పారు. సేల్స్, మార్కెటింగ్ హెడ్, వైస్ ప్రెసిడెంట్ ప్రసాద్ త్రికూటం తన పదవికి రాజీనామా చేశారని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. 
 
ఇన్పోసిస్ కంపెనీలో పలు హోదాల్లో 19 ఏళ్లపాటు ఇన్పోసిస్ కు సేవలందించిన ప్రసాద్ రాజీనామా చేశారు అని కంపెనీ అధికార ప్రతినిధి వెల్లడించారు. ఇన్పోసిస్ అధ్యక్షుడు, బోర్డు మెంబర్ బీజీ శ్రీనివాస్ రాజీనామా చేసిన వారంలోపే మరో సీనియర్ ఉద్యోగి కంపెనీ నుంచి వైదొలగడం చర్చనీయాంశమైంది. 
 
బీజీ శ్రీనివాస్ మే 28 తేదిన రాజీనామా చేశారు. రిటైర్ మెంట్ తర్వాత నారాయణమూర్తి మళ్లీ ఇన్పోసిస్ కంపెనీలో చేరిన గత 12 నెలల్లో 12 మంది రాజీనామా సమర్పించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement