BG Srinivas
-
ఇన్ఫోసిస్‌లో 12వ వికెట్
కంపెనీ గ్లోబల్ హెడ్ ప్రసాద్ నిష్ర్కమణ బెంగళూరు: భారత ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌లో సీనియర్ అధికారుల నిష్ర్కమణ కొనసాగుతోంది. తాజాగా కంపెనీ గ్లోబల్ హెడ్(సేల్స్ అండ్ మార్కెటింగ్) ప్రసాద్ త్రికూటం గురువారం ఇన్ఫోసిస్ నుంచి వైదొలిగారు. కొత్తగా సీఈవో ఎంపిక కొనసాగుతున్న నేపథ్యంలో అమెరికా ఇన్ఫోసిస్ కార్యకలాపాలను కూడా చూసే ప్రసాద్ రాజీనామా చేయడం గమనార్హం. ఈయన బాధ్యతలను కంపెనీ ప్రస్తుత అధ్యక్షుడు, బోర్డ్ సభ్యుడు కూడా అయిన యు.బి. ప్రవీణ్‌రావు చూస్తారని ఇన్ఫోసిస్ ప్రతినిధి పేర్కొన్నారు. గతంలో ప్రసాద్ ఎనర్జీ, యుటిలిటీస్, కమ్యూనికేషన్స్ విభాగానికి అధినేతగా పనిచేశారు. ఇన్ఫోసిస్‌కు సీఈవో కానున్నారని ఊహాగానాలున్న బి.జి. శ్రీనివాస్ రాజీనామా చేసిన వారం రోజుల్లోనే ప్రసాద్ వైదొలగుతున్నారు. ఇలా అయితే కష్టమే.. కాగా నారాయణ మూర్తి మళ్లీ ఇన్ఫోసిస్‌లో చేరిన ఏడాది కాలంలో కంపెనీ నుంచి ఇప్పటిదాకా 12 మంది సీనియర్ అధికారులు రాజీనామా చేశారు. అశోక్ వేమూరి, వి. బాలకృష్ణన్, బసాబ్ ప్రధాన్, చంద్రశేఖర్ కకాల్, స్టీఫెన్ ప్రట్ వంటి ఉద్దండులు కంపెనీని వీడిపోయారు. సీనియర్ ఆధికారులే కాకుండా, సీనియర్ ఉద్యోగులు కూడా కంపెనీ నుంచి వైదొలుగుతున్నారని, ఇలా అయితే కంపెనీ లక్ష్యంగా పెట్టుకున్న ఆదాయాన్ని ఆర్జించలేకపోవచ్చని పలు బ్రోకరేజ్ సంస్థలు పెదవి విరుస్తున్నాయి. ఆవేక్ష టెక్నాలజీస్‌లో ఇన్ఫీ ‘బాల’ న్యూఢిల్లీ: ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్ఓ వి.బాల కృష్ణన్ అవేక్ష టెక్నాలజీలో చేరారు. తమ కంపెనీ సలహా మండలి సభ్యుడిగా బాలకృష్ణన్‌ను నియమించుకున్నామని అవేక్ష టెక్నాలజీస్ పేర్కొంది. బెంగళూరు కేంద్రంగా పనిచేసే ఈ సంస్థను కొందరు ఇన్ఫోసిస్ మాజీ ఉద్యోగులే స్థాపిం చారు. ఈ కంపెనీ ఐటీ కన్సల్టింగ్, సొల్యూషన్స్ సర్వీసులను అందిస్తోంది. బాలకృష్ణన్ గత ఏడాది డిసెంబర్లో ఇన్ఫోసిస్ నుంచి వైదొలిగారు. ఇటీవల ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ తరపున ఎంపీగా పోటీచేసి ఓడిపోయారు. -
ఇన్పోసిస్ కు మరో సీనియర్ గుడ్ బై!
బెంగళూరు: భారత్ లో ఐటీ దిగ్గజం ఇన్పోసిస్ లిమిటెడ్ కు మరో సీనియర్ ఎగ్జిక్యూటివ్ గుడ్ బై చెప్పారు. సేల్స్, మార్కెటింగ్ హెడ్, వైస్ ప్రెసిడెంట్ ప్రసాద్ త్రికూటం తన పదవికి రాజీనామా చేశారని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ఇన్పోసిస్ కంపెనీలో పలు హోదాల్లో 19 ఏళ్లపాటు ఇన్పోసిస్ కు సేవలందించిన ప్రసాద్ రాజీనామా చేశారు అని కంపెనీ అధికార ప్రతినిధి వెల్లడించారు. ఇన్పోసిస్ అధ్యక్షుడు, బోర్డు మెంబర్ బీజీ శ్రీనివాస్ రాజీనామా చేసిన వారంలోపే మరో సీనియర్ ఉద్యోగి కంపెనీ నుంచి వైదొలగడం చర్చనీయాంశమైంది. బీజీ శ్రీనివాస్ మే 28 తేదిన రాజీనామా చేశారు. రిటైర్ మెంట్ తర్వాత నారాయణమూర్తి మళ్లీ ఇన్పోసిస్ కంపెనీలో చేరిన గత 12 నెలల్లో 12 మంది రాజీనామా సమర్పించారు. -
ఇన్ఫీలో మరో వికెట్ డౌన్...
బెంగళూరు: భారత ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌లో మరో వికెట్ పడింది. కంపెనీని ఒక స్థాయికి తీసుకొచ్చిన సీనియర్లు వరుసగా సంస్థను వీడుతున్నారు. తాజాగా కంపెనీ ప్రెసిడెంట్, బోర్డ్ సభ్యుడు కూడా అయిన బి.జి.శ్రీనివాస్ బుధవారం రాజీనామా చేశారు. ఆయన రాజీనామా వచ్చే నెల 10 నుంచి అమల్లోకి వస్తుందని ఇన్ఫోసిస్ పేర్కొంది. ప్రస్తుత సీఈఓ ఎస్.డి. శిబులాల్ తర్వాత కంపెనీ సీఈవో రేసులో ఉన్న శ్రీనివాస్ రాజీనామా చేయడం పరిశ్రమ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ ఏడాది జనవరిలో కొత్తగా ప్రెసిడెంట్ పదవిని సృష్టించి, దానిని శ్రీనివాస్‌కు కట్టబెట్టారు. సీఈవో ఎంపిక కొనసాగుతున్న నేపథ్యంలో శ్రీనివాస్ రాజీనామా చేశారు. ఆయన రాజీనామాకు కారణాలను కంపెనీ కానీ శ్రీనివాస్ కానీ వెల్లడించలేదు. మరో వైపు ఇన్ఫోసిస్ తనకు అద్భుతమైన అవకాశాన్నిచ్చిందని శ్రీనివాస్ కృత జ్ఞతలు వ్యక్తం చేశారు. కాగా గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీలోనే అత్యధిక వేతనం (రూ.7.52 కోట్లు) పొందిన శ్రీనివాస్ త్వరలో మరో ఐటీ సేవల కంపెనీకి సీఈవో, ఎండీ కానున్నట్లు సమాచారం. 10 మంది ఔట్... శ్రీనివాస్ రాజీనామా పట్ల ఇన్ఫోసిస్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఎన్.ఆర్.నారాయణ మూర్తి స్పందించారు. కంపెనీ వృద్ధిలో శ్రీనివాస్ పాత్ర ఎంతో ముఖ్యమైనది, కీలకమైనదని వ్యాఖ్యానించారు. భవిష్యత్‌లో శ్రీనివాస్ చేపట్టే అన్ని ప్రయత్నాల్లో ఆయనను విజయం వరించాలని మూర్తి ఆకాంక్షించారు. 2013, జూన్ 1న మూర్తి ఇన్ఫోసిస్‌లో మళ్లీ ప్రవేశించారు. తన తనయుడు, రోహన్ మూర్తిని ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్‌గా నియమించుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇన్ఫోసిస్ నుంచి 10 మంది సీనియర్లు వైదొలిగారు. కాగా శ్రీనివాస్ రాజీనామా ఇన్ఫోసిస్ షేర్‌పై స్వల్పకాలంలో ప్రతికూల ప్రభా వం చూపించగలదని పలు బ్రోకరేజ్ సంస్థలు అంచనా వేస్తున్నాయి. బుధవారం రాత్రి నాస్డాక్లో ఇన్ఫోసిస్ ఏడీఆర్ 4% పైగా క్షీణించింది.