Infosys Ltd
-
ఇన్ఫోసిస్ ఓకే
న్యూఢిల్లీ: సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్ లిమిటెడ్ గత ఆర్థిక సంవత్సరం(2023–24) చివరి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో కన్సాలిడేటెడ్ నికర లాభం వార్షికంగా 30 శాతం జంప్ చేసింది. రూ. 7,969 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది(2022–23) ఇదే కాలంలో రూ. 6,128 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం నామమాత్ర(1 శాతం) వృద్ధితో రూ. 37,923 కోట్లకు చేరింది. అంతక్రితం క్యూ4లో రూ. 37,441 కోట్ల టర్నోవర్ నమోదైంది. తయారీ రంగ సేవలు నెమ్మదించగా.. 20.1 శాతం నిర్వహణ మార్జిన్లను అందుకుంది. క్యూ4లో 84.8 కోట్ల డాలర్ల ఫ్రీక్యాష్ ఫ్లో సాధించింది. గత 11 త్రైమాసికాలలోనే ఇది అత్యధికం. 1–3 శాతం వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25)లో ఇన్ఫోసిస్ ఆదాయంలో 1–3 శాతం వృద్ధిని అంచనా(గైడెన్స్) వేసింది. 20–22 శాతం నిర్వహణ లాభ మార్జిన్లను ఆశిస్తోంది. అయితే గతేడాది ప్రకటించిన 4–7 శాతం వృద్ధితో పోలిస్తే తాజాగా బలహీన గైడెన్స్‌ను వెలువరించింది. గతేడాది సాధించిన ఫలితాలతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో ఆదాయ వృద్ధి అంచనాలు(గైడెన్స్) అధికమేనని సీఈవో పరేఖ్ పేర్కొన్నారు. విభాగాలవారీగా చూస్తే గతేడాదికంటే రానున్న 12 నెలల్లో ఫైనాన్షియల్ సరీ్వసుల్లో ఉత్తమ పనితీరు చూపేందుకు అవకాశమున్నట్లు తెలియజేశారు. విచక్షణా వ్యయాల తీరు, కన్సాలిడేషన్, వ్యయ నియంత్రణపై దృష్టి ద్వారా గైడెన్స్‌ను ప్రకటించినట్లు వెల్లడించారు. కాగా.. మార్చితో ముగిసిన గతేడాదికి 20.7 శాతం నిర్వహణ మార్జిన్లు సాధించింది. ఈ కాలంలో నికర లాభం 9% ఎగసి రూ. 26,233 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం 4.7% బలపడి రూ. 1,53,670 కోట్లయ్యింది. 2022–23లో రూ. 24,095 కోట్ల నికర లాభం, రూ. 1,46,767 కోట్ల టర్నోవర్ నమోదైంది. వ్యూహాత్మక, నిర్వహణ సంబంధ నగదు అవసరాలను పరిగణించాక రానున్న ఐదేళ్ల కాలానికి పెట్టుబడుల కేటాయింపుల విధానాన్ని బోర్డు సమీక్షించడంతోపాటు, అనుమతించినట్లు సీఎఫ్‌వో జయే‹Ù.ఎస్ పేర్కొన్నారు. ఈ కాలంలో వాటాదారులకు వార్షికంగా డివిడెండ్‌ను పెంచడం ద్వారా 85 శాతం కేటాయింపుల(రిటర్నులు)కు వీలున్నట్లు అంచనా వేశారు. ఇతర విశేషాలు.. ► పూర్తి ఏడాది(2023–24)కి కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా 17.7 బిలియన్ డాలర్ల విలువైన భారీ కాంట్రాక్టులు(టీసీవీ) కుదుర్చుకుంది. వీటిలో 52 శాతం కొత్త ఆర్డర్లు. ► షేరుకి రూ. 28 తుది డివిడెండ్ ప్రకటించింది. దీనిలో రూ. 8 ప్రత్యేక డివిడెండ్ కలసి ఉంది. ► పూర్తి ఏడాదిలో 25,994 మంది ఉద్యోగులు తగ్గారు. దీంతో 2001 తదుపరి మొత్తం ఉద్యోగుల సంఖ్య(7.5%) క్షీణించింది. 3,17,240కు పరిమితమైంది. 2022–23లో సిబ్బంది సంఖ్య 3,43,234గా నమోదైంది. ► ఉద్యోగ వలసల (అట్రిషన్) రేటు 12.6% గా నమోదైంది. రూ. 4,000 కోట్లతో.. జర్మనీ సంస్థ ఇన్‌టెక్‌లో 100 శాతం వాటాను పూర్తి నగదు చెల్లింపు ద్వారా కొనుగోలు చేయనున్నట్లు ఇన్ఫోసిస్ వెల్లడించింది. ఇందుకు 45 కోట్ల యూరోలు(రూ. 4,000 కోట్లు) వెచి్చంచనుంది. ఈమొబిలిటీ, కనెక్టెడ్, అటానమస్ డ్రైవింగ్, ఈవీలు, ఆఫ్‌రోడ్ వాహనాల విభాగంలో కంపెనీ సొల్యూషన్లను అభివృద్ధి చేస్తున్నట్లు ఇన్ఫోసిస్ పేర్కొంది. ఈ కొనుగోలుతో జర్మన్ ఓఈఎం క్లయింట్లను పొందడంతోపాటు 2,200 మంది సుశిక్షిత సిబ్బందిని సొంతం చేసుకోనున్నట్లు తెలియజేసింది. ఈ ఏడాది తొలి అర్ధభాగానికల్లా డీల్ పూర్తికాగలదని అంచనా వేస్తోంది. డీల్స్‌లో రికార్డ్ గతేడాది భారీ డీల్స్‌లో కొత్త రికార్డు సాధించాం. ఇది కంపెనీపట్ల క్లయింట్లకున్న విశ్వాసాన్ని ప్రతిబింబిస్తోంది. జనరేటివ్ ఏఐలో సిబ్బంది సామర్థ్యాల విస్తరణ కొనసాగుతుంది. క్లయింట్ల ప్రోగ్రామ్‌లు, విభిన్న లాంగ్వేజీలపై పనిచేయడం, కస్టమర్ సపోర్ట్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ప్రాసెస్ వినిమయం తదితరాలకు ప్రాధాన్యత ఇస్తున్నాం. – సలీల్ పరేఖ్, ఎండీ, సీఈవో, ఇన్ఫోసిస్ లిమిటెడ్ -
ఇన్ఫోసిస్.. ఓకే
న్యూఢిల్లీ: సాఫ్ట్వేర్ సేవల దేశీ దిగ్గజం ఇన్ఫోసిస్ లిమిటెడ్ గత ఆర్థిక సంవత్సరం(2022–23) చివరి త్రైమాసికంలో అంచనాలకంటే దిగువన ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జనవరి–మార్చి(క్యూ4)లో నికర లాభం వార్షికంగా 8 శాతం ఎగసింది. రూ. 6,128 కోట్లను తాకింది. త్రైమాసికవారీ(క్యూ3)గా చూస్తే ఇది 7 శాతం తక్కువకాగా.. అంతక్రితం ఏడాది(2021–22) ఇదే కాలంలో రూ. 5,686 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం 16 శాతం వృద్ధితో రూ. 37,441 కోట్లకు చేరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24)లో ఆదాయం 4–7 శాతం స్థాయిలో పుంజుకోగలదని తాజా అంచనాలు(గైడెన్స్) ప్రకటించింది. వెరసి ఐటీ సేవలకు నంబర్ టూ ర్యాంకులో ఉన్న కంపెనీ 2019 తదుపరి మళ్లీ నెమ్మదించిన గైడెన్స్‌ను వెలువరించింది. ఈ ఏడాది 20–22 శాతం స్థాయిలో నిర్వహణ లాభ మార్జిన్లు సాధించే వీలున్నట్లు పేర్కొంది. పూర్తి ఏడాదికి మార్చితో ముగిసిన గతేడాదికి ఇన్ఫోసిస్ నికర లాభం 9 శాతం బలపడి రూ. 24,095 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం 21 శాతం జంప్‌చేసి రూ. 1,46,767 కోట్లకు చేరింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3) ఫలితాల విడుదల సందర్భంగా కంపెనీ గతేడాది ఆదాయంలో 16–16.5 శాతం వృద్ధిని అంచనా వేసింది. వెరసి అంతక్రితం ప్రకటించిన 15–16 శాతం గైడెన్స్‌ను మెరుగుపరచింది. క్యూ4లో ఉత్తర అమెరికా నుంచి 61 శాతం ఆదాయం లభించగా.. యూరోపియన్ ప్రాంతం నుంచి 27 శాతం సమకూరింది. కాగా.. క్యూ4లో ఆర్జించిన పటిష్ట ఫ్రీక్యాష్ ఫ్లో నేపథ్యంలో తుది డివిడెండును ప్రకటించినట్లు సీఎఫ్‌వో నీలాంజన్ రాయ్ వెల్లడించారు. పూర్తి ఏడాదికి అంతక్రితం డివిడెండుతో పోలిస్తే 10 శాతం అధికంగా చెల్లించినట్లు పేర్కొన్నారు. మూలధన కేటాయింపుల పాలసీకి అనుగుణంగా మరోసారి షేర్ల బైబ్యాక్‌ను విజయవంతంగా పూర్తిచేసినట్లు తెలియజేశారు. ఫలితాల్లో హైలైట్స్... ► వాటాదారులకు షేరుకి రూ. 17.50 చొప్పున తుది డివిడెండ్ ప్రకటించింది. దీంతో గతేడాదికి మొత్తం రూ. 34 డివిడెండ్ చెల్లించినట్లయ్యింది. ► క్యూ4లో 2.1 బిలియన్ డాలర్ల విలువైన డీల్స్ కుదుర్చుకుంది. క్యూ3లో 3.3 బిలియన్ డాలర్లు, క్యూ2లో 2.7 బిలియన్ డాలర్ల చొప్పున పొందింది. ► గతేడాది మొత్తం 9.8 బిలియన్ డాలర్ల విలువైన కాంట్రాక్టులు సంపాదించింది. ► ఉద్యోగ వలసల(అట్రిషన్) రేటు క్యూ3తో పో లిస్తే 24.3% నుంచి 20.9 శాతానికి దిగివచ్చింది. ► మొత్తం సిబ్బంది సంఖ్య 3,43,234కు చేరింది. గత త్రైమాసికంతో పోలిస్తే నికరంగా 3,611 మంది ఉద్యోగులు తగ్గారు. క్లయింట్ల ఆసక్తి... ‘డిజిటల్, క్లౌడ్, ఆటోమేషన్ సామర్థ్యాలపై ప్రత్యేక దృష్టితో 2022–23లో పటిష్ట పనితీరును చూపాం. పరిస్థితులు మారినప్పటికీ కంపెనీ సామర్థ్యం, చౌక వ్యయాలు, సమీకృత అవకాశాలు వంటివి క్లయింట్లను ఆకట్టు కుంటున్నాయి. ఇది భారీ డీల్స్‌కు దారి చూపుతోంది’ అని ఇన్ఫోసిస్ సీఈఓ ఎండీ సలీల్ పరేఖ్ వ్యాఖ్యానించారు. ఫలితాల నేపథ్యంలో ఇన్ఫోసిస్ షేరు ఎన్ఎస్ఈలో 3 శాతంపైగా క్షీణించి రూ. 1,389 వద్ద ముగిసింది. అక్షతకు రూ. 68 కోట్లు ఇన్ఫోసిస్ తాజాగా షేరుకి రూ. 17.5 చొప్పున డివిడెండ్ ప్రకటించింది. దీంతో కంపెనీలో 3.89 కోట్ల షేర్లుగల బ్రిటిష్ ప్రధాని రిషీ సునక్ భార్య అక్షత రూ. 68.17 కోట్లు అందుకోనున్నారు. ఇందుకు జూన్ 2 రికార్డ్ డేట్. కంపెనీ ఇప్పటికే రూ. 16.5 మధ్యంతర డివిడెండ్ చెల్లించింది. దీంతో అక్షత మొత్తం రూ. 132 కోట్లకుపైగా డివిడెండ్ అందుకోనున్నారు. గురువారం షేరు ధర రూ. 1,389(బీఎస్ఈ)తో చూస్తే ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకుడు నారాయణ మూర్తి కుమార్తె అక్షతకు గల వాటా విలువ రూ. 5,400 కోట్లు. కాగా.. 2021–22 ఏడాదిలోనూ డివిడెండ్ రూపేణా అక్షత ఇన్ఫోసిస్ నుంచి దాదాపు రూ. 121 కోట్లు అందుకోవడం గమనార్హం! -
ఇన్ఫోసిస్ లో ఏం జరుగుతోంది!
దేశ టెక్నాలజీ రంగంలో ఐటీ దిగ్గజం ఇన్పోసిస్ లిమిటెడ్ అగ్రస్థానమేనని చెప్పడానికి ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఎన్నో ఐటీ కంపెనీలకు మార్గదర్శకంగా నిలిచిన ఇన్పోసిస్ కంపెనీ ఇటీవల కాలంలో కొన్ని ఒడిదుడుకులకు లోనవుతున్నట్టు కనిపిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇన్ఫోసిస్ ను కొన్ని సమస్యలు చుట్టుముడుతున్నాయి. గతంలో ఎంతో ఘనకీర్తిని సంపాదించుకున్న ఇన్పోసిస్ సహవ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి చైర్మన్ స్థానం నుంచి తప్పుకున్న తర్వాత పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ఇటీవల కాలంలో సీనియర్లే కాక యువ సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు కూడా ఇన్పోసిస్ ను భారీ సంఖ్యలో వదిలి వెళ్లినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గత 12 నెలల కాలంలో 12 మంది సీనియర్లు తమ పదవుల నుంచి తప్పుకోవడం చర్చనీయాంశమవుతోంది. జనవరి-మార్చి మధ్యకాలంలోనే 8996 మంది ఉద్యోగులు ఇన్పోసిస్ ను వదిలి వెళ్లినట్టు తెలుస్తోంది. వివిధ కారణాలతో గత 12 నెలల్లో దాదాపు 36 వేలకు పైగానే ఐటీ దిగ్గజానికి టాటా చెప్పనట్టు తెలుస్తోంది. మార్చి 2015 సంవత్సరంలో ఇన్పోసిస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎస్.డీ శిబులాల్ కూడా రిటైరయ్యేందుకు సిద్దమవుతున్నారు. ఇన్పోసిస్ కంపెనీ వదిలేసి వెళ్తున్న ఉద్యోగులను ఆపేందుకు ఏడు శాతం మేరకు జీతాలను పెంపు చేశారు. ఐనా కంపెనీ నుంచి ఉద్యోగుల వెళ్లడం మాత్రం తగ్గుముఖం పట్టలేదనే వార్తలు వినిపిస్తున్నాయి. 1981లో నారాయణ మూర్తితో పాటు ఇన్పోసిస్ ను స్థాపించిన ఎన్ఎస్ రాఘవన్, ఎస్ గోపాలకృష్ణన్, నందన్ నీలెకని, శిబులాల్, కే.దినేష్ రాజీనామాలు సమర్పించిన వారిలో ఉన్నారు. వారేకాకుండా సినియర్ ఎగ్జిక్యూటివ్స్ అశోక్ వేమూరి, బాసబ్ ప్రధాన్ లు కూడా ఇన్పోసిస్ కు గుడ్ బై చెప్పారు. లోకసభ ఎన్నికల్లో పోటి చేసేందుకుగాను బాలకృష్ణన్ తప్పుకున్నారు. ఇన్పోసిస్ ను వదిలి వెళ్లే జాబితాలో తాజాగా 19 ఏళ్లపాటు సేవలందించిన సేల్స్, మార్కెటింగ్ హెడ్, వైస్ ప్రెసిడెంట్ ప్రసాద్ త్రికూటం తన పదవికి రాజీనామా చేయడం ఉద్యోగుల్లో మరింత అభద్రతభావాన్ని పెంచే దిశగా దారి తీసినట్టు తెలుస్తోంది. ఐతే యువ ఉద్యోగులు కంపెనీని విడిచి వెళ్లడానికి వారానికోసారి కొత్త విధానాల్ని ఉద్యోగులపై రుద్దడం ప్రధాన కారణమని వినిపిస్తోంది. ఉద్యోగులను సంప్రదించకుండానే 8.8 పనిగంటల నుంచి 9.25 గంటలకు పెంచడం ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తికి కారణమైనట్టు సమాచారం. పనిగంటల పెంపు కూడా ఉద్యోగుల్లో అభద్రతాభావాన్ని పెంచడమే కాకుండా కంటి తుడుపు చర్యగా జీతాలను పెంపు చేయడం కూడా ఉద్యోగులను సంతృప్తి పరచలేకపోయింది. ముఖ్యంగా ప్రశ్నించిన ఉద్యోగులను ఎలాంటి సమాచారం లేకుండా తొలగించినట్టు తెలుస్తోంది. ఇన్పోసిస్ లో కొనసాగుతున్న అప్రజాస్వామిక విధానాలను బహిరంగంగా మాజీ ఉద్యోగులు, ప్రస్తుత ఉద్యోగులు ఇంటర్నెట్ వెబ్ సైట్లు, బ్లాగ్ ల్లో స్పందిస్తున్నారు. ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఉన్న సీనియర్ ఉద్యోగులు ఎలాంటి ప్రోడక్టవిటీ లేకుండా సేవలందించడం కూడా దిగువ తరగతి ఉద్యోగుల్లో నిరాసక్తత పెంచినట్టు తెలుస్తోంది. 13 ఏళ్లకు పైబడి అనుభవం ఉన్న ఉద్యోగులందరిని తొలగించినా.. కంపెనీపై ఎలాంటి ప్రభావం చూపబోదని యువ ఉద్యోగులు వివిధ బ్లాగుల్లో తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇన్పోసిస్ లో చోటు చేసుకుంటున్న పలు పరిస్థితులపై వీడియోల రూపంలో, ఇంటర్నెట్ బ్లాగుల్లో కథనాలు భారీగానే పబ్లిష్ అవుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో తీవ్ర ఒడిదుడుకులెదుర్కొంటున్న ఇన్పోసిస్ లో పరిస్థితులు సానుకూలంగా మారుతాయనే అభిప్రాయాన్ని పలువురు ఆశిస్తున్నారు. -
ఇన్పోసిస్ కు మరో సీనియర్ గుడ్ బై!
బెంగళూరు: భారత్ లో ఐటీ దిగ్గజం ఇన్పోసిస్ లిమిటెడ్ కు మరో సీనియర్ ఎగ్జిక్యూటివ్ గుడ్ బై చెప్పారు. సేల్స్, మార్కెటింగ్ హెడ్, వైస్ ప్రెసిడెంట్ ప్రసాద్ త్రికూటం తన పదవికి రాజీనామా చేశారని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ఇన్పోసిస్ కంపెనీలో పలు హోదాల్లో 19 ఏళ్లపాటు ఇన్పోసిస్ కు సేవలందించిన ప్రసాద్ రాజీనామా చేశారు అని కంపెనీ అధికార ప్రతినిధి వెల్లడించారు. ఇన్పోసిస్ అధ్యక్షుడు, బోర్డు మెంబర్ బీజీ శ్రీనివాస్ రాజీనామా చేసిన వారంలోపే మరో సీనియర్ ఉద్యోగి కంపెనీ నుంచి వైదొలగడం చర్చనీయాంశమైంది. బీజీ శ్రీనివాస్ మే 28 తేదిన రాజీనామా చేశారు. రిటైర్ మెంట్ తర్వాత నారాయణమూర్తి మళ్లీ ఇన్పోసిస్ కంపెనీలో చేరిన గత 12 నెలల్లో 12 మంది రాజీనామా సమర్పించారు. -
ఇన్ఫోసిస్ అధ్యక్షులుగా శ్రీనివాస్, ప్రవీణ్ రావు
భారత ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ లిమిటెడ్ ఇద్దరు డైరెక్టర్లను కంపెనీ అధ్యక్షులుగా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇన్ఫోసిస్ లో డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్న బీజీ శ్రీనివాస్, యూబీ ప్రవీణ్ రావ్ లను అధ్యక్షులుగా నియమించింది. శ్రీనివాస్, ప్రవీణ్ లిద్దరూ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎస్ డీ శిబులాల్ లకు రిపోర్ట్ చేస్తారని ఇన్ఫోసిస్ వర్గాలు వెల్లడించాయి. గ్లోబర్ మార్కెట్ వ్యవహారాలను శ్రీనివాస్ చూసుకుంటారని, గ్లోబల్ డెలివరీ, సర్వీస్ ఇన్నోవేషన్ కార్యక్రమాలను ప్రవీణ్ పర్యవేక్షిస్తారని కంపెనీ ఓ ప్రకటనలో వెల్లడించింది. క్లయింట్ రిలేషన్ షిప్, మార్కెట్ లో మెరుగైన ఫలితాలను సాధించడానికి ఈ మార్పులు చేశామన్నారు. డిసెంబర్ 20 తేదిన ప్రవీణ్ రావు కంపెనీ డైరెక్టర్ గా ఎంపికయ్యారు.