ఇన్ఫోసిస్ అధ్యక్షులుగా శ్రీనివాస్, ప్రవీణ్ రావు
ఇన్ఫోసిస్ అధ్యక్షులుగా శ్రీనివాస్, ప్రవీణ్ రావు
Published Fri, Jan 3 2014 6:03 PM | Last Updated on Sat, Sep 2 2017 2:15 AM
భారత ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ లిమిటెడ్ ఇద్దరు డైరెక్టర్లను కంపెనీ అధ్యక్షులుగా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇన్ఫోసిస్ లో డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్న బీజీ శ్రీనివాస్, యూబీ ప్రవీణ్ రావ్ లను అధ్యక్షులుగా నియమించింది. శ్రీనివాస్, ప్రవీణ్ లిద్దరూ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎస్ డీ శిబులాల్ లకు రిపోర్ట్ చేస్తారని ఇన్ఫోసిస్ వర్గాలు వెల్లడించాయి.
గ్లోబర్ మార్కెట్ వ్యవహారాలను శ్రీనివాస్ చూసుకుంటారని, గ్లోబల్ డెలివరీ, సర్వీస్ ఇన్నోవేషన్ కార్యక్రమాలను ప్రవీణ్ పర్యవేక్షిస్తారని కంపెనీ ఓ ప్రకటనలో వెల్లడించింది. క్లయింట్ రిలేషన్ షిప్, మార్కెట్ లో మెరుగైన ఫలితాలను సాధించడానికి ఈ మార్పులు చేశామన్నారు. డిసెంబర్ 20 తేదిన ప్రవీణ్ రావు కంపెనీ డైరెక్టర్ గా ఎంపికయ్యారు.
Advertisement
Advertisement