క్యూ4 నికర లాభం 30 శాతం అప్
మొత్తం ఆదాయం రూ. 37,923 కోట్లు
2024–25 ఆదాయ అంచనాలు అంతంతే
జర్మన్ సంస్థ ఇన్‌టెక్ కొనుగోలుకు రెడీ
న్యూఢిల్లీ: సాఫ్ట్‌వేర్ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్ లిమిటెడ్ గత ఆర్థిక సంవత్సరం(2023–24) చివరి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో కన్సాలిడేటెడ్ నికర లాభం వార్షికంగా 30 శాతం జంప్ చేసింది. రూ. 7,969 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది(2022–23) ఇదే కాలంలో రూ. 6,128 కోట్లు మాత్రమే ఆర్జించింది.
మొత్తం ఆదాయం మాత్రం నామమాత్ర(1 శాతం) వృద్ధితో రూ. 37,923 కోట్లకు చేరింది. అంతక్రితం క్యూ4లో రూ. 37,441 కోట్ల టర్నోవర్ నమోదైంది. తయారీ రంగ సేవలు నెమ్మదించగా.. 20.1 శాతం నిర్వహణ మార్జిన్లను అందుకుంది. క్యూ4లో 84.8 కోట్ల డాలర్ల ఫ్రీక్యాష్ ఫ్లో సాధించింది. గత 11 త్రైమాసికాలలోనే ఇది అత్యధికం.
1–3 శాతం వృద్ధి
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25)లో ఇన్ఫోసిస్ ఆదాయంలో 1–3 శాతం వృద్ధిని అంచనా(గైడెన్స్) వేసింది. 20–22 శాతం నిర్వహణ లాభ మార్జిన్లను ఆశిస్తోంది. అయితే గతేడాది ప్రకటించిన 4–7 శాతం వృద్ధితో పోలిస్తే తాజాగా బలహీన గైడెన్స్‌ను వెలువరించింది. గతేడాది సాధించిన ఫలితాలతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో ఆదాయ వృద్ధి అంచనాలు(గైడెన్స్) అధికమేనని సీఈవో పరేఖ్ పేర్కొన్నారు.
విభాగాలవారీగా చూస్తే గతేడాదికంటే రానున్న 12 నెలల్లో ఫైనాన్షియల్ సరీ్వసుల్లో ఉత్తమ పనితీరు చూపేందుకు అవకాశమున్నట్లు తెలియజేశారు. విచక్షణా వ్యయాల తీరు, కన్సాలిడేషన్, వ్యయ నియంత్రణపై దృష్టి ద్వారా గైడెన్స్‌ను ప్రకటించినట్లు వెల్లడించారు. కాగా.. మార్చితో ముగిసిన గతేడాదికి 20.7 శాతం నిర్వహణ మార్జిన్లు సాధించింది. ఈ కాలంలో నికర లాభం 9% ఎగసి రూ. 26,233 కోట్లను తాకింది.
మొత్తం ఆదాయం 4.7% బలపడి రూ. 1,53,670 కోట్లయ్యింది. 2022–23లో రూ. 24,095 కోట్ల నికర లాభం, రూ. 1,46,767 కోట్ల టర్నోవర్ నమోదైంది. వ్యూహాత్మక, నిర్వహణ సంబంధ నగదు అవసరాలను పరిగణించాక రానున్న ఐదేళ్ల కాలానికి పెట్టుబడుల కేటాయింపుల విధానాన్ని బోర్డు సమీక్షించడంతోపాటు, అనుమతించినట్లు సీఎఫ్‌వో జయే‹Ù.ఎస్ పేర్కొన్నారు. ఈ కాలంలో వాటాదారులకు వార్షికంగా డివిడెండ్‌ను పెంచడం ద్వారా 85 శాతం కేటాయింపుల(రిటర్నులు)కు వీలున్నట్లు అంచనా వేశారు.
ఇతర విశేషాలు..
► పూర్తి ఏడాది(2023–24)కి కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా 17.7 బిలియన్ డాలర్ల విలువైన భారీ కాంట్రాక్టులు(టీసీవీ) కుదుర్చుకుంది. వీటిలో 52 శాతం కొత్త ఆర్డర్లు.
► షేరుకి రూ. 28 తుది డివిడెండ్ ప్రకటించింది. దీనిలో రూ. 8 ప్రత్యేక డివిడెండ్ కలసి ఉంది.
► పూర్తి ఏడాదిలో 25,994 మంది ఉద్యోగులు తగ్గారు. దీంతో 2001 తదుపరి మొత్తం ఉద్యోగుల సంఖ్య(7.5%) క్షీణించింది. 3,17,240కు పరిమితమైంది. 2022–23లో సిబ్బంది సంఖ్య 3,43,234గా నమోదైంది.
► ఉద్యోగ వలసల (అట్రిషన్) రేటు 12.6% గా నమోదైంది.
రూ. 4,000 కోట్లతో..
జర్మనీ సంస్థ ఇన్‌టెక్‌లో 100 శాతం వాటాను పూర్తి నగదు చెల్లింపు ద్వారా కొనుగోలు చేయనున్నట్లు ఇన్ఫోసిస్ వెల్లడించింది. ఇందుకు 45 కోట్ల యూరోలు(రూ. 4,000 కోట్లు) వెచి్చంచనుంది. ఈమొబిలిటీ, కనెక్టెడ్, అటానమస్ డ్రైవింగ్, ఈవీలు, ఆఫ్‌రోడ్ వాహనాల విభాగంలో కంపెనీ సొల్యూషన్లను అభివృద్ధి చేస్తున్నట్లు ఇన్ఫోసిస్ పేర్కొంది. ఈ కొనుగోలుతో జర్మన్ ఓఈఎం క్లయింట్లను పొందడంతోపాటు 2,200 మంది సుశిక్షిత సిబ్బందిని సొంతం చేసుకోనున్నట్లు తెలియజేసింది. ఈ ఏడాది తొలి అర్ధభాగానికల్లా డీల్ పూర్తికాగలదని అంచనా వేస్తోంది.
డీల్స్‌లో రికార్డ్
గతేడాది భారీ డీల్స్‌లో కొత్త రికార్డు సాధించాం. ఇది కంపెనీపట్ల క్లయింట్లకున్న విశ్వాసాన్ని ప్రతిబింబిస్తోంది. జనరేటివ్ ఏఐలో సిబ్బంది సామర్థ్యాల విస్తరణ కొనసాగుతుంది.
క్లయింట్ల ప్రోగ్రామ్‌లు, విభిన్న లాంగ్వేజీలపై పనిచేయడం, కస్టమర్ సపోర్ట్, సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్ ప్రాసెస్ వినిమయం తదితరాలకు ప్రాధాన్యత ఇస్తున్నాం.
– సలీల్ పరేఖ్, ఎండీ, సీఈవో, ఇన్ఫోసిస్ లిమిటెడ్
Comments
Please login to add a commentAdd a comment