క్యూ2 లాభం రూ. 6,506 కోట్లు
ముంబై: సాఫ్ట్‌వేర్ సేవల ఎగుమతుల దిగ్గజం ఇన్ఫోసిస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) రెండో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. జులై–సెపె్టంబర్(క్యూ2)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 5 శాతం పుంజుకుని రూ. 6,506 కోట్లను తాకింది. 4.4 శాతం అధికంగా రూ. 8,649 కోట్ల నిర్వహణ లాభం(ఇబిట్) ఆర్జించింది. 21.1 శాతం ఇబిట్ మార్జిన్లు సాధించింది. మొత్తం ఆదాయం సైతం 5 శాతం ఎగసి రూ. 40,986 కోట్లకు చేరింది.
పూర్తి ఏడాదికి ఆదాయ అంచనాల(గైడెన్స్)ను తాజాగా మెరుగుపరచింది. 3.75–4.5 శాతం మధ్య వృద్ధి సాధించగలమని ప్రకటించింది. ఇంతక్రితం క్యూ1 ఫలితాల సమయంలోనూ ఆదాయ వృద్ధి అంచనాలను 1–3 శాతం నుంచి 3–4 శాతానికి పెంచిన విషయం విదితమే. వాటాదారులకు షేరుకి రూ. 21 చొప్పున మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. రికార్డ్ డేట్ ఈ నెల 29కాగా.. నవంబర్ 8కల్లా చెల్లించనుంది. డాలర్లలో ఆదాయం త్రైమాసికవారీగా 4 శాతం ఎగసి 4.89 బిలియన్లను అధిగమించింది.
ఇతర విశేషాలు..
→ మొత్తం 2.4 బిలియన్ డాలర్ల విలువైన భారీ డీల్స్‌ను కుదుర్చుకుంది.
→ ఆరు త్రైమాసికాలుగా ఉద్యోగుల సంఖ్య తగ్గుతూ వస్తున్న ట్రెండ్‌కు క్యూ2లో చెక్ పడింది. నికరంగా 2,500 మందిని జత చేసుకుంది.
→ సెప్టెంబర్‌కల్లా మొత్తం సిబ్బంది సంఖ్య 3,17,788 కు చేరుకుంది.
→ ఉద్యోగ వలసల రేటు 14.6% నుంచి 12.9 శాతానికి తగ్గింది.
→ ఈ ఏడాది 15,000–20,000 మంది ఫ్రెషర్స్‌ను నియమించుకోనుంది. ఇప్పటికే తొలి అర్ధభాగంలో కొంత మందికి చోటిచి్చంది.
డిమాండ్ జూమ్
అన్నివైపుల నుంచి సాఫ్ట్‌వేర్ సేవలకు డిమాండ్ బలపడటం మెరుగైన గైడెన్స్‌కు సహకరించింది. ప్రధానంగా ఐటీ పరిశ్రమలో కీలకమైన ఫైనాన్షియల్ రంగ క్లయింట్ల నుంచి భారీ డీల్స్ పెరుగుతుండటం ప్రభావం చూపింది. కోబాల్ట్‌తో క్లౌడ్, టోపజ్‌తో జెన్‌ఏఐ ద్వారా కంపెనీ సామర్థ్యాలు మరింత బలపడ్డాయి. దీంతో క్లయింట్లు ఇన్ఫోసిస్‌తో జత కట్టేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు.
– సలీల్ పరేఖ్, సీఈవో, ఎండీ
షేరు బీఎస్‌ఈలో 3% బలపడి రూ. 1,975 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment