salil parekh
-
ఇన్ఫోసిస్ 20 వేలమంది ఫ్రెషర్స్‌కు ఛాన్స్
ముంబై: సాఫ్ట్వేర్ సేవల ఎగుమతుల దిగ్గజం ఇన్ఫోసిస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) రెండో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. జులై–సెపె్టంబర్(క్యూ2)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 5 శాతం పుంజుకుని రూ. 6,506 కోట్లను తాకింది. 4.4 శాతం అధికంగా రూ. 8,649 కోట్ల నిర్వహణ లాభం(ఇబిట్) ఆర్జించింది. 21.1 శాతం ఇబిట్ మార్జిన్లు సాధించింది. మొత్తం ఆదాయం సైతం 5 శాతం ఎగసి రూ. 40,986 కోట్లకు చేరింది. పూర్తి ఏడాదికి ఆదాయ అంచనాల(గైడెన్స్)ను తాజాగా మెరుగుపరచింది. 3.75–4.5 శాతం మధ్య వృద్ధి సాధించగలమని ప్రకటించింది. ఇంతక్రితం క్యూ1 ఫలితాల సమయంలోనూ ఆదాయ వృద్ధి అంచనాలను 1–3 శాతం నుంచి 3–4 శాతానికి పెంచిన విషయం విదితమే. వాటాదారులకు షేరుకి రూ. 21 చొప్పున మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. రికార్డ్ డేట్ ఈ నెల 29కాగా.. నవంబర్ 8కల్లా చెల్లించనుంది. డాలర్లలో ఆదాయం త్రైమాసికవారీగా 4 శాతం ఎగసి 4.89 బిలియన్లను అధిగమించింది. ఇతర విశేషాలు.. → మొత్తం 2.4 బిలియన్ డాలర్ల విలువైన భారీ డీల్స్‌ను కుదుర్చుకుంది. → ఆరు త్రైమాసికాలుగా ఉద్యోగుల సంఖ్య తగ్గుతూ వస్తున్న ట్రెండ్‌కు క్యూ2లో చెక్ పడింది. నికరంగా 2,500 మందిని జత చేసుకుంది. → సెప్టెంబర్‌కల్లా మొత్తం సిబ్బంది సంఖ్య 3,17,788 కు చేరుకుంది. → ఉద్యోగ వలసల రేటు 14.6% నుంచి 12.9 శాతానికి తగ్గింది. → ఈ ఏడాది 15,000–20,000 మంది ఫ్రెషర్స్‌ను నియమించుకోనుంది. ఇప్పటికే తొలి అర్ధభాగంలో కొంత మందికి చోటిచి్చంది. డిమాండ్ జూమ్ అన్నివైపుల నుంచి సాఫ్ట్వేర్ సేవలకు డిమాండ్ బలపడటం మెరుగైన గైడెన్స్‌కు సహకరించింది. ప్రధానంగా ఐటీ పరిశ్రమలో కీలకమైన ఫైనాన్షియల్ రంగ క్లయింట్ల నుంచి భారీ డీల్స్ పెరుగుతుండటం ప్రభావం చూపింది. కోబాల్ట్‌తో క్లౌడ్, టోపజ్తో జెన్ఏఐ ద్వారా కంపెనీ సామర్థ్యాలు మరింత బలపడ్డాయి. దీంతో క్లయింట్లు ఇన్ఫోసిస్‌తో జత కట్టేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. – సలీల్ పరేఖ్, సీఈవో, ఎండీషేరు బీఎస్ఈలో 3% బలపడి రూ. 1,975 వద్ద ముగిసింది. -
అందరూ భయపడుతుంటే.. ఇన్ఫోసిస్ మాత్రం ఓకే..
ప్రైవేటు సంస్థల్లో స్థానికులకు రిజర్వేషన్లు కల్పిస్తూ కర్ణాటక ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లు కంపెనీల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. దీని గురించి అన్ని కంపెనీలు భయోందోళన చెందుతుంటే ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ మాత్రం తమకు ఓకే అంటోంది.ప్రైవేట్ సంస్థల్లో స్థానిక నియామకాలకు రాష్ట్ర ప్రతిపాదిత రిజర్వేషన్లకు ప్రతిస్పందనగా కర్ణాటక ఏ కొత్త నిబంధనలు, మార్గదర్శకాలను ప్రవేశపెట్టినా తమ కంపెనీ పాటిస్తుందని ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్ తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తామని పరేఖ్ స్పష్టం చేశారు. ఎలాంటి నిబంధనలు, మార్గదర్శకాలు వచ్చినా మద్దతిస్తాం.పరిశ్రమలు, కర్మాగారాలు, ఇతర సంస్థలలో స్థానిక అభ్యర్థులకు రిజర్వేషన్ కల్పించే కర్ణాటక రాష్ట్ర ఉపాధి బిల్లు, 2024 ను ఆ రాష్ట్ర మంత్రివర్గం ఈ వారం ప్రారంభంలో ఆమోదించింది. ఏ పరిశ్రమ, కర్మాగారం లేదా ఇతర సంస్థలు అయినా మేనేజ్ మెంట్ కేటగిరీల్లో 50 శాతం, నాన్ మేనేజ్ మెంట్ కేటగిరీల్లో 70 శాతం స్థానిక అభ్యర్థులను నియమించాలని ఈ బిల్లు నిర్దేశిస్తోంది.ఈ బిల్లు గురువారం శాసనసభలో ప్రవేశపెట్టాల్సి ఉంది. అయితే వ్యాపార ప్రముఖులు, టెక్నాలజీ రంగ ప్రముఖుల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో దీన్ని నిలిపివేశారు. ఈ ఆంక్షల వల్ల స్థానిక నైపుణ్యం కలిగిన ప్రతిభావంతుల కొరత ఏర్పడితే కంపెనీలు తరలిపోతాయని నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్ వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్ (నాస్కామ్) హెచ్చరించింది.ఫోన్ పే సీఈఓ సమీర్ నిగమ్ ఈ ప్రతిపాదనను సోషల్ మీడియాలో ‘షేమ్’ అంటూ తీవ్రంగా తప్పుపట్టారు. ప్రతిపాదిత కోటాను 'ఫాసిస్టు', 'స్వల్పదృష్టి'గా అభివర్ణిస్తూ పరిశ్రమ పెద్దలు కూడా ఈ కోటాపై తీవ్రంగా స్పందించారు. ఇన్ఫోసిస్ మాజీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ టీవీ మోహన్ దాస్ పాయ్ ఈ బిల్లును తిరోగమనంగా అభివర్ణించారు. బయోకాన్ మేనేజింగ్ డైరెక్టర్ కిరణ్ మజుందార్ షా, అసోచామ్ కర్ణాటక కో-చైర్మన్ ఆర్కే మిశ్రా వ్యతిరేక స్వరం వినిపించారు. -
ఇన్ఫోసిస్.. గుడ్
న్యూఢిల్లీ: సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) తొలి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 7 శాతం పుంజుకుని రూ. 6,368 కోట్లను తాకింది. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 5,945 కోట్లు ఆర్జించింది. అయితే త్రైమాసిక(క్యూ4)వారీగా చూస్తే నికర లాభం రూ. 7,969 కోట్ల నుంచి 20 శాతం క్షీణించింది. మొత్తం ఆదాయం 3.6 శాతం మెరుగుపడి రూ. 39,315 కోట్లకు చేరింది. గత క్యూ1లో రూ. 37,933 కోట్ల టర్నోవర్ సాధించింది. ప్రస్తుత ఆరి్థక సంవత్సరాన్ని ప్రోత్సాహకరంగా ప్రారంభించిననట్లు ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్ పేర్కొన్నారు. మెరుగైన మార్జిన్లు, భారీ డీల్స్, రికార్డ్ నగదు ఆర్జనను సాధించినట్లు తెలియజేశారు. ఈ షేరు బీఎస్ఈలో 2% ఎగసి రూ. 1,759 వద్ద ముగిసింది. 3–4 శాతం వృద్ధి తాజా త్రైమాసికంలో ఇన్ఫోసిస్ నిర్వహణ లాభ మార్జిన్లు 0.3 శాతం బలపడి 21.1 శాతంగా నమోదయ్యాయి. పూర్తి ఏడాదికి 20–22 శాతం మార్జిన్లు సాధించగలమని అంచనా వేస్తోంది. పూర్తి ఏడాదికి ఆదాయంలో నిలకడైన కరెన్సీ ప్రాతిపదికన 3–4 శాతం వృద్ధిని సాధించగలమని కంపెనీ తాజాగా అంచనా వేసింది. గతంలో విడుదల చేసిన 1–3 శాతం వృద్ధి అంచనాల (గైడెన్స్)ను ఎగువముఖంగా సవరించింది. ఇతర విశేషాలు → క్యూ1లో కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా రూ. 9,155 కోట్ల ఫ్రీ క్యాష్ ఫ్లో సాధించింది. ఇది 59 శాతం వృద్ధి. → ఈ ఏడాది సాధించగల వృద్ధి ఆధారంగా 15,000 నుంచి 20,000మంది వరకూ ఫ్రెషర్స్‌కు ఉపాధి కలి్పంచే వీలున్నట్లు ఇన్ఫోసిస్ సీఎఫ్‌వో జయేష్ ఎస్. తెలియజేశారు. → క్యూ1లో కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా 4.1 బిలియన్ డాలర్ల విలువైన 34 భారీ డీల్స్‌ను కుదుర్చుకుంది. ఇవి 78 శాతం అధికంకాగా.. వీటిలో కొత్త కాంట్రాక్టుల వాటా 58 శాతం. → ఉద్యోగుల సంఖ్య 6 శాతం తగ్గి 3,15,332కు పరిమితమైంది. గతేడాది క్యూ1లో మొత్తం సిబ్బంది సంఖ్య 3,36,294కాగా.. జనవరి–మార్చి(క్యూ4)లో 3,17,240గా నమోదైంది. → స్వచ్ఛంద ఉద్యోగ వలసల(అట్రిషన్) రేటు 12.7 శాతంగా నమోదైంది. గత క్యూ1లో ఇది 17.3 శాతంకాగా.. క్యూ4లో 12.6 శాతంగా నమోదైంది. -
మాదేం లేదు! వర్క్ ఫ్రం ఆఫీస్‌పై ఇన్ఫోసిస్ సీఈవో కీలక వ్యాఖ్యలు
Work From Office: వర్క్ ఫ్రం ఆఫీస్ విధానంపై ఇన్ఫోసిస్ (Infosys) సీఈవో కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగులు ఇంటి నుంచి లేదా ఆఫీస్ నుంచి పనిచేసేలా వారికి అనువైన అవకాశాన్ని కంపెనీ కల్పిస్తోందని, అయితే తమ క్లయింట్లలో కొందరు వారి ప్రాజెక్ట్‌లను ఆఫీస్ నుంచే నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారని తాజాగా పేర్కొన్నారు. ఇన్ఫోసిస్ 42వ వార్షిక సర్వసభ్య సమావేశంలో షేర్‌హోల్డర్ అడిగిన ప్రశ్నకు కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మేనేజింగ్ డైరెక్టర్ సలీల్ పరేఖ్ స్పందిస్తూ.. భవిష్యత్తులో మరింత సామాజిక మూలధనం అవసరమని, కొత్త విషయాలు నేర్చుకునేందుకు, శిక్షణ మొదలైన వాటి కోసం ఒకరితో ఒకరు కనెక్ట్ అవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు. "మేము ఉద్యోగులకు అనువైన విధానాన్ని అమలు చేస్తున్నాం. ఉద్యోగులు ఇంటి నుంచి లేదా హైబ్రిడ్ విధానంలో పని చేసే సామర్థ్యాన్ని కలిగి ఉన్నారని విశ్వసిస్తున్నాం. క్లయింట్లకు అవసరం అయినప్పుడు మాకు క్యాంపస్‌లో పనిచేసే ఉద్యోగులు ఉన్నారు. దీర్ఘకాలిక ప్రాతిపదికన సామాజిక అనుసంధానం, బృందంగా పని చేయాల్సిన చోట ఆ మేరకు పనిచేసే ఉద్యోగులు ఉంటారు" అని సీఈవో పరేఖ్ చెప్పారు. ఇదీ చదవండి: ఇన్ఫోసిస్ జాక్‌పాట్! రూ. 3,722 కోట్ల భారీ డీల్ కైవసం.. సీఈవో పరేఖ్ అభిప్రాయాలను ఇన్ఫోసిస్ ప్రతిధ్వనిస్తోందని ఇన్ఫోసిస్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నిలంజన్ రాయ్ అన్నారు. "ఉద్యోగులు కొన్నిరోజులపాటు ఆఫీస్‌కు వచ్చి పని చేసేలా ప్రోత్సహిస్తున్నాం. ఇది సామాజిక మూలధనాన్ని పెంచుతుందని నమ్ముతున్నాం. వర్క్ ఫ్రం ఆఫీస్ అన్నది మా క్లయింట్ అవసరాలపై ఆధారపడి ఉంటుంది. క్లయింట్లు పట్టుబట్టినట్లయితే ఉద్యోగులు ఆఫీస్ వచ్చి పని చేయాల్సి ఉంటుంది" అని వివరించారు. దక్షిణ అమెరికా, మిడిలీస్ట్ ప్రాంతాల్లో వ్యాపారం గురించి మరొక షేర్ హోల్డర్ అడిన ప్రశ్నకు పరేఖ్ బదులిస్తూ.. ఇన్ఫోసిస్ ఆ రెండు ప్రాంతాలలో ఉనికిని కలిగి ఉందని, అయితే ఆదాయంలో వాటి వాటా చాలా తక్కువగా ఉందని చెప్పారు. కాగా ఇన్ఫోసిస్‌లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 3.4 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. ఇదీ చదవండి: No Work From Home: ఇన్ఫోసిస్ మొదలుపెట్టేసింది.. ఉద్యోగులు ఇక ఇల్లు వదలకతప్పదు! -
ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్ వేతనంలో భారీ కోత: కారణాలివే!
దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ కూడా ఖర్చులను తగ్గించుకునే పనిలో పడింది. ముఖ్యంగా కంపెనీ సీఈఓ సలీల్ పరేఖ్ కూడా 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వేతనంలో కోత విధించినట్టు తెలుస్తోంది.గత ఏడాది అందుకున్న రూ.71 కోట్లతో పోలిస్తే కేవలం రూ.56.44 కోట్లు మాత్రమే అందుకున్నారట. ఇదీ చదవండి: షాకింగ్: 100కు పైగా డేంజరస్ యాప్స్, వెంటనే డిలీట్ చేయకపోతే బిజినెస్ టుడే నివేదిక ప్రకారం, ఇన్ఫోస్ సీఈఓ సలీల్ పరేఖ్ గతేడాది తన వార్షిక వేతనంలో 21 శాతం తగ్గింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో వేతనంగా రూ. 56.44 కోట్లుగా ఉంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో, పరేఖ్ మొత్తం రూ.71 కోట్ల జీతం పొందారు. ఇదే విషయాన్ని కంపెనీ వార్షిక నివేదికలో వెల్లడించింది. (బుగట్టి రెసిడెన్షియల్ టవర్...నెక్ట్స్ లెవల్: దిమ్మదిరిగే ఫోటోలు) పరేఖ్ మొత్తం వేతనంలో రూ. 6.67 కోట్ల మూల వేతనం, రూ. 18.73 కోట్ల పనితీరు ఆధారిత బోనస్, 9.71 కోట్ల స్టాక్ అవార్డులు మరియు 45 లక్షల ఇతర ప్రయోజనాలు ఉన్నాయి.స్టాక్ యూనిట్స్ ఆధారంగా వచ్చే రాబడి క్షీణత, ఇన్ఫోసిస్ బోనస్ ప్లాన్‌లో మార్పు వంటి కారణాల రీత్యా వేతనం భారీగా తగ్గినట్టు తెలుస్తోంది. కాగా మార్చి 2023తో ముగిసిన త్రైమాసికంలో ఇన్ఫోసిస్ తన ఉద్యోగుల సగటు వేరియబుల్ వేతనాన్ని 40 శాతం కోత విధించిన సంగతి తెలిసిందే. 2022-23లో సగటు ఇన్ఫోసిస్ ఉద్యోగి మొత్తం జీతం రూ. 10.3 లక్షలు. -
నిలకడగా ఇన్ఫోసిస్ వృద్ధి
న్యూఢిల్లీ: ఎల్లప్పుడూ పటిష్టంగా నిలవడంతోపాటు.. నిలకడగా కొనసాగే కంపెనీగా ఐటీ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్ టెక్నాలజీస్‌ను సంస్థ సీఈవో సలీల్ పరేఖ్ పేర్కొన్నారు. కొన్నేళ్ల క్రితం కంపెనీ వ్యవస్థాపకులు, యాజమాన్యం మధ్య వివాదాలు తలెత్తిన సమయంలో సలీల్ కంపెనీ పగ్గాలు అందుకున్నారు. 2018 జనవరిలో అప్పటి సీఈవో విశాల్ సిక్కా నుంచి ఇన్ఫోసిస్ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించాక కంపెనీ కార్యకలాపాలలో నిలకడను తీసుకురావడమేకాకుండా వృద్ధి బాటను కొనసాగించారు. ఈ కాలంలో కంపెనీకి ఎదురైన సవాళ్లను సమర్థవంతంగా అధిగమించడంతోపాటు.. కార్యకలాపాలను వేగవంతం చేశారు. ఇన్ఫోసిస్‌ను వ్యవస్థాపకులు అద్భుతమైన సంస్థగా తీర్చిదిద్దినట్లు ఒక ఇంటర్వ్యూలో పరేఖ్ ప్రశంసించారు. దీంతో కంపెనీ ఎల్లప్పుడూ పటిష్టంగా నిలుస్తూనే ఉన్నట్లు పేర్కొన్నారు. ఇకపైన కూడా ఇదే బాటలో కొనసాగనున్నట్లు తెలియజేశారు. 2022–23లో 16 శాతం వరకు వృద్ధి ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) ఆదాయంలో కంపెనీ 14–16 శాతం వృద్ధిని సాధించే వీలున్నట్లు అంచనా వేశారు. ఇందుకు పటిష్ట డీల్ పైప్‌లైన్ దోహదపడనున్నట్లు తెలియజేశారు. గత ఐదేళ్లలో ఇన్ఫోసిస్ ఆదాయం రూ. 73,715 కోట్ల నుంచి రూ. 1,23,936 కోట్లకు ఎగసింది. 2018 నుంచి 2022 మార్చి మధ్య కన్సాలిడేటెడ్ నికర లాభాలు సైతం రూ. 16,029 కోట్ల నుంచి రూ. 22,110 కోట్లకు జంప్ చేశాయి. -
అత్యధిక వేతనం పొందే ఐటీ కంపెనీ సీఈవో ఎవరో తెలుసా?
సాక్షి, ముంబై: దేశీయ రెండవ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్ జీతం 88 శాతం పెరిగిందట. మునుపటి ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2021-22 ఏడాదిలో పరేఖ్ వార్షిక వేతనం రూ. 79.75 కోట్లకు చేరింది. 2020-21లో రూ. 49.68 కోట్ల నుంచి వేతనం 88 శాతం పెరిగిందని ఎక్స్ఛేంజ్ఫైలింగ్లో కంపెనీ వెల్లడించింది. గురువారం విడుదల చేసిన కంపెనీ వార్షిక నివేదిక ప్రకారం, వాటాదారుల ఆమోదానికి లోబడి కొత్త ఉపాధి ఒప్పందం జూలై 2 నుండి అమలులోకి వస్తుంది. దీంతో భారతదేశంలో అత్యధిక వేతనం పొందే ఎగ్జిక్యూటివ్‌లలో ఒకరిగా నిలిచారు సలీల్ పరేఖ్. మరో దిగ్గజ ఐటీ కంపెనీ టీసీఎస్ సీఈవో రాజేష్ గోపీనాథన్ వార్షిక వేతనం రూ. 25.76 కోట్లు, విప్రో పారిస్ ఆధారిత సీఈవో వేతనం రూ. 64.34 కోట్లు. హెచ్‌సిఎల్ టెక్ సిఇఓ రూ.32.21 కోట్లు టెక్ మహీంద్రా సీఈవో రూ.22 కోట్ల వేతనం అందుకుంటున్నారు. అలాగే కంపెనీ సీఎండీగా సలీల్ పరేఖ్ పదవీకాలాన్ని మరో ఐదేళ్లు (మార్చి 2027 వరకు) పొడిగింపునకు ఇన్ఫోసిస్ బోర్డు నిర్ణయించింది. 2018 జనవరి నుంచి పరేఖ్ ఇన్ఫోసిస్ సీఎండీగా ఉన్నారు. ఇన్ఫోసిస్‌కు ముందు క్యాప్‌జెమినీలో గ్రూప్ ఎగ్జిక్యూటివ్ బోర్డ్‌లో సభ్యుడిగా ఉన్న పరేఖ్ 25 సంవత్సరాల పాటు అనేక నాయకత్వ పదవులను నిర్వహించారు. పరేఖ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇన్ఫోసిస్ స్టాక్ 183శాతం పెరిగింది. నీలేకని-పరేఖ్ కాంబోలో 2021-22 ఆర్థిక సంవత్సరంలో 19.7శాతం వృద్ధి రేటును సాధించింది. అలాగే ఆరుగురు కీలకమైన మేనేజ్మెంట్ సిబ్బందికి 104,000 షేర్లు,88 మంది ఇతర సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లకు మరో 375,760 షేర్ల మంజూరుకు ఇన్ఫోసిస్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆమోదం తెలిపింది. కానీ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ నందన్ నీలేకని ఎలాంటి పారితోషికం తీసుకోకూడదని నిర్ణయించుకున్నారు. 2022 ఆర్థిక సంవత్సరానికి గాను ఇన్ఫోసిస్‌లో అత్యధిక వేతనం పొందిన సీనియర్లుగా 37.25 కోట్లతో సీఓఓ యూబీ ప్రవీణ్ రావు, తరువాత 35.82 కోట్లతో ప్రెసిడెంట్ రవి కుమార్ ఉన్నారు.