Infosys CEO
-
ఇన్ఫోసిస్ 20 వేలమంది ఫ్రెషర్స్‌కు ఛాన్స్
ముంబై: సాఫ్ట్వేర్ సేవల ఎగుమతుల దిగ్గజం ఇన్ఫోసిస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) రెండో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. జులై–సెపె్టంబర్(క్యూ2)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 5 శాతం పుంజుకుని రూ. 6,506 కోట్లను తాకింది. 4.4 శాతం అధికంగా రూ. 8,649 కోట్ల నిర్వహణ లాభం(ఇబిట్) ఆర్జించింది. 21.1 శాతం ఇబిట్ మార్జిన్లు సాధించింది. మొత్తం ఆదాయం సైతం 5 శాతం ఎగసి రూ. 40,986 కోట్లకు చేరింది. పూర్తి ఏడాదికి ఆదాయ అంచనాల(గైడెన్స్)ను తాజాగా మెరుగుపరచింది. 3.75–4.5 శాతం మధ్య వృద్ధి సాధించగలమని ప్రకటించింది. ఇంతక్రితం క్యూ1 ఫలితాల సమయంలోనూ ఆదాయ వృద్ధి అంచనాలను 1–3 శాతం నుంచి 3–4 శాతానికి పెంచిన విషయం విదితమే. వాటాదారులకు షేరుకి రూ. 21 చొప్పున మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. రికార్డ్ డేట్ ఈ నెల 29కాగా.. నవంబర్ 8కల్లా చెల్లించనుంది. డాలర్లలో ఆదాయం త్రైమాసికవారీగా 4 శాతం ఎగసి 4.89 బిలియన్లను అధిగమించింది. ఇతర విశేషాలు.. → మొత్తం 2.4 బిలియన్ డాలర్ల విలువైన భారీ డీల్స్‌ను కుదుర్చుకుంది. → ఆరు త్రైమాసికాలుగా ఉద్యోగుల సంఖ్య తగ్గుతూ వస్తున్న ట్రెండ్‌కు క్యూ2లో చెక్ పడింది. నికరంగా 2,500 మందిని జత చేసుకుంది. → సెప్టెంబర్‌కల్లా మొత్తం సిబ్బంది సంఖ్య 3,17,788 కు చేరుకుంది. → ఉద్యోగ వలసల రేటు 14.6% నుంచి 12.9 శాతానికి తగ్గింది. → ఈ ఏడాది 15,000–20,000 మంది ఫ్రెషర్స్‌ను నియమించుకోనుంది. ఇప్పటికే తొలి అర్ధభాగంలో కొంత మందికి చోటిచి్చంది. డిమాండ్ జూమ్ అన్నివైపుల నుంచి సాఫ్ట్వేర్ సేవలకు డిమాండ్ బలపడటం మెరుగైన గైడెన్స్‌కు సహకరించింది. ప్రధానంగా ఐటీ పరిశ్రమలో కీలకమైన ఫైనాన్షియల్ రంగ క్లయింట్ల నుంచి భారీ డీల్స్ పెరుగుతుండటం ప్రభావం చూపింది. కోబాల్ట్‌తో క్లౌడ్, టోపజ్తో జెన్ఏఐ ద్వారా కంపెనీ సామర్థ్యాలు మరింత బలపడ్డాయి. దీంతో క్లయింట్లు ఇన్ఫోసిస్‌తో జత కట్టేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. – సలీల్ పరేఖ్, సీఈవో, ఎండీషేరు బీఎస్ఈలో 3% బలపడి రూ. 1,975 వద్ద ముగిసింది. -
ఇన్ఫోసిస్.. గుడ్
న్యూఢిల్లీ: సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) తొలి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 7 శాతం పుంజుకుని రూ. 6,368 కోట్లను తాకింది. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 5,945 కోట్లు ఆర్జించింది. అయితే త్రైమాసిక(క్యూ4)వారీగా చూస్తే నికర లాభం రూ. 7,969 కోట్ల నుంచి 20 శాతం క్షీణించింది. మొత్తం ఆదాయం 3.6 శాతం మెరుగుపడి రూ. 39,315 కోట్లకు చేరింది. గత క్యూ1లో రూ. 37,933 కోట్ల టర్నోవర్ సాధించింది. ప్రస్తుత ఆరి్థక సంవత్సరాన్ని ప్రోత్సాహకరంగా ప్రారంభించిననట్లు ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్ పేర్కొన్నారు. మెరుగైన మార్జిన్లు, భారీ డీల్స్, రికార్డ్ నగదు ఆర్జనను సాధించినట్లు తెలియజేశారు. ఈ షేరు బీఎస్ఈలో 2% ఎగసి రూ. 1,759 వద్ద ముగిసింది. 3–4 శాతం వృద్ధి తాజా త్రైమాసికంలో ఇన్ఫోసిస్ నిర్వహణ లాభ మార్జిన్లు 0.3 శాతం బలపడి 21.1 శాతంగా నమోదయ్యాయి. పూర్తి ఏడాదికి 20–22 శాతం మార్జిన్లు సాధించగలమని అంచనా వేస్తోంది. పూర్తి ఏడాదికి ఆదాయంలో నిలకడైన కరెన్సీ ప్రాతిపదికన 3–4 శాతం వృద్ధిని సాధించగలమని కంపెనీ తాజాగా అంచనా వేసింది. గతంలో విడుదల చేసిన 1–3 శాతం వృద్ధి అంచనాల (గైడెన్స్)ను ఎగువముఖంగా సవరించింది. ఇతర విశేషాలు → క్యూ1లో కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా రూ. 9,155 కోట్ల ఫ్రీ క్యాష్ ఫ్లో సాధించింది. ఇది 59 శాతం వృద్ధి. → ఈ ఏడాది సాధించగల వృద్ధి ఆధారంగా 15,000 నుంచి 20,000మంది వరకూ ఫ్రెషర్స్‌కు ఉపాధి కలి్పంచే వీలున్నట్లు ఇన్ఫోసిస్ సీఎఫ్‌వో జయేష్ ఎస్. తెలియజేశారు. → క్యూ1లో కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా 4.1 బిలియన్ డాలర్ల విలువైన 34 భారీ డీల్స్‌ను కుదుర్చుకుంది. ఇవి 78 శాతం అధికంకాగా.. వీటిలో కొత్త కాంట్రాక్టుల వాటా 58 శాతం. → ఉద్యోగుల సంఖ్య 6 శాతం తగ్గి 3,15,332కు పరిమితమైంది. గతేడాది క్యూ1లో మొత్తం సిబ్బంది సంఖ్య 3,36,294కాగా.. జనవరి–మార్చి(క్యూ4)లో 3,17,240గా నమోదైంది. → స్వచ్ఛంద ఉద్యోగ వలసల(అట్రిషన్) రేటు 12.7 శాతంగా నమోదైంది. గత క్యూ1లో ఇది 17.3 శాతంకాగా.. క్యూ4లో 12.6 శాతంగా నమోదైంది. -
ఐటీ పోర్టల్‌లో సాంకేతిక సమస్యలు.. కేంద్రం సీరియస్
Glitches in New I-T Portal: న్యూఢిల్లీ: కొత్త ఐటీ (ఆదాయ పన్ను) పోర్టల్‌ను సాంకేతిక లోపాలు వెన్నాడుతూనే ఉన్నాయి. రెండు రోజులుగా పోర్టల్ పూర్తిగా అందుబాటులోనే లేకుండా పోవడంతో కేంద్రం ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుంది. ప్రారంభించి రెండున్నర నెలలు అవుతున్నా ఇలా సమస్యలు కొనసాగుతుండటంపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు సోమవారం వచ్చి వివరణ ఇవ్వాలంటూ పోర్టల్‌ను రూపొందించిన టెక్నాలజీ దిగ్గజం ఇన్ఫోసిస్ సీఈవో సలిల్ పరేఖ్‌ను కేంద్ర ఆర్థిక శాఖ ఆదేశించింది. చదవండి: లోకేశ్ రచ్చ.. సామాన్య కుటుంబానికి శిక్ష ‘కొత్త ఈ–ఫైలింగ్ పోర్టల్‌ను ప్రారంభించి 2.5 నెలలు అయిపోతున్నప్పటికీ పోర్టల్‌లో సమస్యలను ఇంకా ఎందుకు పరిష్కరించలేదనే అంశంపై ఆగస్టు 23న (సోమవారం) కేంద్ర ఆర్థిక మంత్రికి వివరణ ఇవ్వాలని ఇన్ఫోసిస్ సీఈవో సలిల్ పరేఖ్‌ను కేంద్ర ఆర్థిక శాఖ ఆదేశించింది. ఆగస్టు 21 నుంచి ఏకంగా పోర్టల్ అందుబాటులోనే లేదు‘ అని ఆదాయ పన్ను శాఖ మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్లో ట్వీట్ చేసింది. మరోవైపు, నిర్వహణ పనుల కోసం ట్యాక్స్ పోర్టల్ అందుబాటులో ఉండదని ట్విటర్లో శనివారం ఇన్ఫోసిస్ ట్వీట్ చేసింది. అత్యవసర మెయింటెనెన్స్ పనులు ఇంకా కొనసాగుతున్నాయని, పూర్తయ్యాక అప్డేట్ చేస్తామంటూ ఆదివారం మరో ట్వీట్ చేసింది. అప్పుడు జీఎస్టీ, ఇప్పుడు ఐటీ.. అటు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ (ఐఅండ్‌బీ) కూడా దీనిపై తీవ్రంగా స్పందించింది. ‘ప్రభుత్వ ప్రాజెక్టులకు సంబంధించి ఇన్ఫోసిస్ గందరగోళం చేసిన రెండో ప్రాజెక్టు ఇది. మొదటిది జీఎస్టీ పోర్టల్ కాగా ఇప్పుడు ఇన్‌కం ట్యాక్స్ పోర్టల్. రెండు వరుస వైఫల్యాలనేవి కాకతాళీయంగా అనుకోవడానికి లేదు. దీనితో కంపెనీకి సామర్థ్యాలైనా లేకపోవచ్చు లేదా పనిని సజావుగా పూర్తి చేసి ఇచ్చే ఉద్దేశమైనా లేకపోవచ్చని స్పష్టంగా తెలుస్తోంది‘ అని ఐటీ శాఖ ట్వీట్‌ను ప్రస్తావిస్తూ ఐఅండ్‌బీ శాఖ సీనియర్ సలహాదారు కంచన్ గుప్తా ట్విటర్లో వ్యాఖ్యానించారు. చదవండి: ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ వివరాలు ఇలా.. రిటర్నుల ప్రాసెసింగ్ వ్యవధిని 63 రోజుల నుంచి ఒక్క రోజుకు తగ్గించడం, రిఫండ్ల వేగవంతం లక్ష్యంగా కొత్త ఐటీ పోర్టల్ అభివృద్ధికి రూ.4,242 కోట్ల ప్రాజెక్టుకు కేంద్రం 2019 జనవరి 19న ఆమోదముద్ర వేసింది. జూన్ వరకూ రూ.164.5 కోట్లు చెల్లించింది. నిర్వహణ, జీఎస్టీ, రెంట్, పోస్టేజ్‌సహా 8.5 సంవత్సరాల్లో ప్రా జెక్టు నిధుల మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఏడాది జూన్ 7న పోర్టల్‌ను ప్రభు త్వం ప్రారంభించింది. అయితే, అప్పట్నుంచీ వెబ్సైటును సాంకేతిక లోపాలు వెన్నాడుతూనే ఉన్నాయి. -
ఇన్ఫోసిస్ కొత్త సీఈవోగా ఆయనే..
ముంబై : విశాల్ సిక్కా రాజీనామాతో ఖాళీ అయిన ఇన్ఫోసిస్ సీఈవో పదవిపై ఇంకా ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. అయితే సిక్కా రాజీనామా అనంతరం ఇన్ఫోసిస్ తాత్కాలిక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన యూబీ ప్రవీణ్ రావే, ఈ పదవిలో కొనసాగుతారని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. బీజీ శ్రీనివాస్, అశోక్ వేమూరిలు కంపెనీ కొత్త సీఈవో రేసులో ఉన్నారంటూ వచ్చిన రిపోర్టులను సంబంధిత వర్గాలు కొట్టిపారేస్తున్నాయి. కంపెనీలో భాగమైన వారినే కొత్త సీఈవోగా నియమించాలని మేనేజ్మెంట్ చేస్తుందని, అప్పుడైతేనే కంపెనీ నీతులను అర్థం చేసుకోవడానికి వీలవుతుందని పేర్కొన్నాయి. బీజీ శ్రీనివాస్ మళ్లీ కంపెనీలోకి వచ్చే అవకాశం లేదంటూ తాజా రిపోర్టులు పేర్కొంటున్నాయి. కంపెనీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ నందన్ నిలేకని ఎక్కువగా కంపెనీ అంతర్గత అభ్యర్థిని కొత్త సీఈవోగా ఎంపికచేయాలని కసరత్తు చేయడమే దీనికి ప్రధాన కారణమని తెలిపాయి. ప్రస్తుతం శ్రీనివాస్ హాంకాంగ్‌కు చెందిన పీసీసీడబ్ల్యూ గ్రూప్‌కు సీఈవోగా ఉన్నారు. అశోక్ వేమూరి కూడా జిరాక్స్ బీపీఓకి సీఈవోగా కొనసాగుతున్నారు. దీంతో కొత్త సీఈవోగా యూబీ ప్రవీణ్ రావునే కొనసాగించనున్నారని సంబంధిత వర్గాలు చాలా బలంగా నొక్కిచెబుతున్నాయి. -
చేతకాకే మూర్తిపై నిందలు
సిక్కా రాజీనామాపై ఇన్ఫీ మాజీ సీఎఫ్ఓ పాయ్ మండిపాటు చెత్త పనితీరును కప్పిపుచ్చుకోవడానికే డ్రామాలని వ్యాఖ్య బెంగళూరు: ఇన్ఫోసిస్ సీఈఓ పదవికి అర్ధంతరంగా గుడ్‌బై చెప్పిన విశాల్ సిక్కాపై కంపెనీ మాజీల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సిక్కా తన చెత్త పనితీరును కప్పిపుచ్చుకోవడానికే మూర్తిపై ఆరోపణలు గుప్పించారని.. చేతకాక పదవినుంచి తప్పుకున్నారని ఇన్ఫీ మాజీ సీఎఫ్ఓ మోహన్‌దాస్ పాయ్ మండిపడ్డారు. తనపై పదేపదే నిరాధార ఆరోపణలు, వ్యక్తిగతంగా కూడా దూషణలను భరించలేకపోవడంవల్లే తప్పనిసరి పరిస్థితుల్లో ఇన్ఫీని వీడుతున్నానంటూ రాజీనామా లేఖలో సిక్కా పేర్కొన్న సంగతి తెలిసిందే. నేరుగా మూర్తిపేరును ఆయన ప్రస్తావించకపోయినప్పటికీ... ఇన్ఫీ బోర్డు మాత్రం సిక్కా రాజీనామాకు మూర్తే కారణమని కుండబద్దలుకొట్టింది. దీంతో దాదాపు ఏడాదికాలంగా బోర్డుతో మూర్తి సాగిస్తున్న పోరు తారస్థాయికి చేరింది. ‘ఈ ఏడాది ఫిబ్రవరిలోనే సిక్కా తనంతటతానుగా వైదొలగారనుకున్నారు. తన వైఫల్యాలను బయటపడకుండా చేసుకోవడం కోసం మూర్తిని టార్గెట్ చేసుకొని సిక్కా ఆరోపణలు చేశారు’ అని పాయ్ వ్యాఖ్యానించారు. ఒకపక్క, కొత్త సీఈఓ ఎంపిక కత్తిమీదసాముగా మారగా.. కంపెనీలో కార్పొరేట్ గవర్నెన్స్ లోపాలపై అమెరికాలోని కొన్ని న్యాయ సంస్థలు క్లాస్యాక్షన్ దావాలు వేసేందుకు సిద్ధమవుతున్నాయి. దీంతో అటు ఇన్వెస్టర్లతోపాటు కంపెనీ క్లయింట్లలో కూడా తీవ్ర ఆందోళనలు చెలరేగుతున్నాయి. షేర్ల బైబ్యాక్ ప్రకటనను చేసినప్పటికీ(షేరుకు రూ.1,150 చొప్పున ధరతో) స్టాక్ మార్కెట్లో ఇన్ఫీ స్టాక్ కుప్పకూలుతూనే ఉంది. వరుసగా రెండురోజుల్లో 14 శాతంపైగా దిగజారి... రూ.873 స్థాయికి పడిపోయింది. మళ్లీ కొత్త పోస్టు ఎందుకు...: పూర్తిస్థాయి కొత్త సీఈఓ నియామకం జరిగేవరకూ సిక్కాను ఎగ్జిక్యూటివ్ వైస్–చైర్మన్‌గా కొనసాగించాలని బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని కూడా పాయ్ తప్పుబట్టారు. ‘కంపెనీకి ఇప్పటికే చైర్మన్(ఆర్.శేషసాయి), సహ–చైర్మన్(రవి వెంకటేశన్)లు ఉన్నారు. తాత్కాలిక సీఈఓను(యూబీ ప్రవీణ్ రావు) కూడా నియమించారు మళ్లీ కొత్తగా ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ ఎందుకు? ఇదంతా తీవ్ర గందరగోళానికి దారితీస్తుంది’ అని పేర్కొన్నారు. కాగా, కాబోయే సీఈఓగా కంపెనీకి చెందినవారు ఉండలా, బయటివ్యక్తి అయితే మంచిదా అన్న ప్రశ్నకు... పొగరుబోతుగా, సొంత నిర్ణయాలతో వ్యవహరించే వ్యక్తులు కాకుండా... ఇన్ఫోసిస్ సంస్కృతి, విలువను గౌరవించే వ్యక్తి అయి ఉండాలని బదులిచ్చారు. ఇన్ఫీ చైర్మన్, కో–చైర్మన్లు వైదొలగాలి మాజీ సీఎఫ్ఓ వి.బాలకృష్ణన్ న్యూఢిల్లీ: ఇన్ఫీలో సిక్కా రాజీనామా ప్రకంపనలు ఇప్పట్లో ఆగేలాలేవు. కొత్త సీఈఓ కోసం అన్వేషణ మొదలుపెట్టడానికిముందే కంపెనీ డైరెక్టర్ల బోర్డును పూర్తిగా ప్రక్షాళన చేయాలని కంపెనీ మాజీ సీఎఫ్ఓ వి.బాలకృష్ణన్ డిమాండ్ చేశారు. చైర్మన్ ఆర్.శేషసాయి, సహ–చైర్మన్ రవి వెంకటేశన్లు కూడా బోర్డు నుంచి తప్పుకోవాల్సిందేనని ఆయన పేర్కొన్నారు. కాగా, ఇన్ఫోసిస్‌లో కార్పొరేట్ గవర్నెన్స్ లోపాలకు ఆడిట్ విభాగం హెడ్ రూపా కుద్వా, రెమ్యూనరేషన్ విభాగం హెడ్ జెఫ్రీ ఎస్. లేమాన్లే బాధ్యత వహించాల్సి ఉంటుందని కంపెనీ ప్రమోటర్ నారాయణమూర్తి ఆరోపించిన నేపథ్యంలో బాలకృష్ణన్ వ్యాఖ్యలు కూడా ఇదే తరహాలో ఉండటం గమనార్హం. ముందుగా బోర్డును ప్రక్షాళన చేయకుండా కొత్త సీఈఓను తీసుకురావడం కంపెనీకి ఆత్మహత్యాసదృశంగా మారుతుందని బాలకృష్ణన్ అన్నారు. ‘పెద్ద ఇన్వెస్టర్లు, వ్యవస్థాపకులతో తగినవిధంగా చర్చించి బోర్డులోకి మంచి వ్యక్తులకు చోటుకల్పించాలి. ఇప్పుడున్న బోర్డును చూస్తే... ఇన్ఫీకి సారథ్యం వహించేందుకు మంచి సీఈఓలు ఎవరూ ముందుకొచ్చే పరిస్థితి కనబడటం లేదు’ అని బాలకృష్ణన్ వ్యాఖ్యానించారు. కొత్త సీఈఓ నియామకానికి వచ్చే ఏడాది మార్చి 31 వరకూ గడువును ఇన్ఫీ బోర్డు నిర్దేశించిన సంగతి తెలిసిందే. కాగా, ఇజ్రాయిల్ కంపెనీ పనయా కొనుగోలు వ్యవహారంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో ఈ డీల్‌పై దర్యాప్తు నివేదికను ఇన్ఫోసిస్ బయటపెట్టాల్సిందేనని కూడా బాలకృష్ణన్ పేర్కొన్నారు. -
ఐటీ ఇండస్ట్రీకి విశాల్ సిక్కా గుడ్ న్యూస్
ముంబై : ఇన్ఫోసిస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ విశాల్ సిక్కా.. ఇటీవల చేసిన కామెంట్లు ఇండస్ట్రీపై ఆశలు పెంచుతున్నాయి. 2014-15 రెండో క్వార్టర్ నుంచి మొదటిసారి ఐటీ రంగంలో ధర స్థిరత్వం ఉన్నట్టు సిక్కా చెప్పారు. ఇది ఐటీ ఇండస్ట్రీకి పాజిటివ్ డెవలప్ మెంట్ అని బ్రోకరేజ్ యూబీఎస్ అభివర్ణించింది. విశాల్ సిక్కా చేసిన కామెంట్ తో బ్యాంకింగ్, ఫైనాన్సియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ కంపెనీలలో భారీ ఎత్తున ఐటీ బడ్జెట్ పెరుగుతాయని, ముఖ్యంగా అమెరికాలో పెరుగుతాయని బ్రోకరేజ్ తెలిపింది. భారతీయ ఐటీ వెండర్స్ కు మేజర్ క్లయింట్స్ గా అమెరికానే ఉండటం విశేషం. 2017లో ఇండస్ట్రి వృద్ధికి కూడా ఇది సహకరించనున్నట్టు పేర్కొంది. మంచి డిమాండ్ పరిస్థితులను ఈ ధర స్థిరత్వ వాతావరణం సూచిస్తుందని బ్రోకరేజ్ సంస్థ వివరించింది. ఆటోమేషన్, వీసా సమస్యలు, రూపాయి విలువ పెరగడం మాత్రమే కాక, సాంప్రదాయ ఐటీ సర్వీసు బిజినెస్ లలో ఒకానొక ప్రధాన సమస్యలో ధరల ఒత్తిడి కూడా ఒకటి. ఈ సమస్యలతో 2016లో బీఎస్ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇండెక్స్ 5.5 శాతం పడిపోయింది. ఇదే సమయంలో సెన్సెక్స్ 12.4 శాతం పైకి ఎగిసింది. కానీ ప్రస్తుతం ధరల స్థిరత్వం ఏర్పడటం సానుకూల అంశమని బ్రోకరేజ్ సంస్థ చెబుతోంది. -
విశాల్ సిక్కా జీతం తగ్గిందా?
ఇన్ఫోసిస్ సీఈఓ విశాల్ సిక్కాకు జీతం చాలా ఎక్కువగా ఇస్తున్నారని చాలామంది అంటుంటారు. కానీ, 2016-17 సంవత్సరానికి ఆయనకు అందిన వేరియబుల్ పే ఎంతో తెలుసా.. కేవలం 46 శాతం మాత్రమే. సాధారణంగా ఉద్యోగుల వేతనంలో కొంత భాగాన్ని వేరియబుల్ పే అని పక్కన పెడతారు. ఆ సంవత్సరంలో వారి పనితీరు ఆధారంగా అందులో ఎంత శాతం ఇవ్వాలనేది నిర్ణయిస్తారు. ఇన్ఫోసిస్‌లో అయితే ఫస్ట్ గ్రేడ్ వచ్చినవారికి నూరుశాతం వేరియబుల్ పే ఇస్తారు. కానీ ఇప్పుడు ఏకంగా సీఈఓ విశాల్ సిక్కాకే 46% వేరియబుల్ పే మాత్రమే ఇచ్చారంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. 2016-17 సంవత్సరంలో మొత్తం 51 కోట్ల వేరియబుల పే రావాల్సి ఉండగా, అందులో ఆయనకు కేవలం 24 కోట్లు మాత్రమే వచ్చింది. అదికాక ఆయన స్థిరవేతనం మరో రూ. 19 కోట్లు. దాంతో ఈ ఏడాది మొత్తం సుమారు 43 కోట్ల రూపాయలు సంపాదించినట్లయింది. 2015-16లో వచ్చిన 48 కోట్ల కంటే ఇది 5 కోట్ల రూపాయలు తక్కువ. విశాల్ సిక్కాకు వేతనం పెరిగిందని చాలామంది భావించినా, వాస్తవానికి అది వేరియబుల్ పేలో పెంపు మాత్రమేనని కంపెనీ బోర్డుతో పాటు స్వయంగా సిక్కా కూడా చాలాసార్లు చెప్పారు. లక్ష్యాలను పూర్తిగా సాధిస్తేనే పూర్తి మొత్తం చెల్లిస్తారు. అయితే ఆ లక్ష్యాలేంటనే విషయాన్ని మాత్రం కంపెనీ బహిరంగపరచలేదు. శుక్రవారం ప్రకటించిన క్యూ4 ఫలితాల్లో ఆదాయ వృద్ధి కేవలం 3.4 శాతం ఉండటంతో పాటు లాభాల్లో వృద్ధి అసలు లేకపోవడం లాంటివి కూడా సిక్కా వేతనం మీద ప్రభావం కనబర్చి ఉంటాయని భావిస్తున్నారు. -
ఇన్ఫోసిస్ బోనస్ బొనాంజా
1:1 నిష్పత్తిలో... ఒక షేరుకి మరో షేరు ఫ్రీ అంచనాలను మించిన క్యూ2 ఫలితాలు... నికర లాభం రూ. 3,096 కోట్లు.. వార్షికంగా 28.6 శాతం, త్రైమాసికంగా 7.3 శాతం వృద్ధి ఆదాయం రూ.13,342 కోట్లు ఈ ఏడాది ఆదాయ గెడైన్స్ 7-9% యథాతథం షేరుకి రూ.30 చొప్పున మధ్యంతర డివిడెండ్ మా క్లయింట్లలో ప్రతిఒక్కరి వ్యాపారాల్లోనూ డిజిటల్ పరిజ్ఞానం వినియోగం జోరందుకుంటోంది. వాళ్లకు మరింత మెరుగ్గా సేవలందించేందుకు, అదేవిధంగా కొత్త విభాగాల్లోకి ప్రవేశించేందుకు ఈ పరిణామం మాకు ఉపయోగపడనుంది. సాధ్యమైనంత వేగంగానే దీని ఫలితాలు అందుకోనున్నాం. భవిష్యత్తులో కంపెనీ వృద్ధికి ఇదే ప్రధాన చోదకంగా నిలవనుంది. మా సొంత వ్యాపారంలోకూడా ఇదే వ్యూహాన్ని అమలు చేసి వృద్ధిని పెంచుకుంటాం. -విశాల్ సిక్కా, ఇన్ఫోసిస్ సీఈఓ దేశంలో రెండో అతిపెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ అంచనాలను మించిన ఆర్థిక ఫలితాలతో అదరగొట్టింది. కంపెనీకి తొలి నాన్-ప్రమోటర్ సీఈఓగా రెండు నెలల క్రితం బాధ్యతలు చేపట్టిన విశాల్ సిక్కా.. తన ఆగమనాన్ని ఘనంగా చాటుకున్నారు. అనూహ్యరీతిలో బోనస్ షేర్లను ప్రకటించి ఇన్వెస్టర్లలో కొత్త ఉత్సాహాన్ని నింపారు. దీంతో షేరు ధర కూడా రివ్వుమంటూ 7 శాతం ఎగబాకింది. బెంగళూరు: ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్... ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం(2014-15, క్యూ2)లో మంచి పనితీరును కనబరిచింది. కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం రూ.3,096 కోట్లకు ఎగబాకింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.2,407 కోట్లతో పోలిస్తే వార్షిక ప్రాతిపదిక 28.6 శాతం వృద్ధి నమోదైంది. ఇక కన్సాలిడేటెడ్ ఆదాయం రూ.13,342 కోట్లకు ఎగసింది. గతేడాది క్యూ2లో ఆదాయం రూ.12,965 కోట్లుగా ఉంది. దీంతో పోలిస్తే ఈ క్యూ2లో ఆదాయం 2.9 శాతం పెరిగింది. నికర లాభం జోరుకు పటిష్టమైన ఆదాయం, నిర్వహణపరంగా మెరుగైన పనితీరు చేదోడుగా నిలిచాయని కంపెనీ పేర్కొంది. సీక్వెన్షియల్‌గానూ... ఈ ఏడాది తొలి త్రైమాసికం(క్యూ1)లో ఇన్ఫీ నికర లాభం రూ.2,886 కోట్లుగా నమోదైంది. దీంతో పోల్చి చూస్తే.. సీక్వెన్షియల్‌గా క్యూ2లో లాభం 7.3 శాతం ఎగసింది. ఇక క్యూ1 ఆదాయంతో పోలిస్తే(రూ.12,770 కోట్లు) జూలై-సెప్టెంబర్ క్వార్టర్లో 4.5 శాతం మెరుగుపడింది. మార్కెట్ వర్గాలు క్యూ2లో రూ.2,985 కోట్ల నికర లాభం, రూ.13,307 కోట్ల ఆదాయాన్ని అంచనా వేశారు. దీనికంటే మెరుగైన గణాంకాలను ఇన్ఫీ నమోదుచేయడం విశేషం. గైడన్స్‌లో మార్పులేదు... ప్రస్తుత 2014-15 పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఆదాయ వృద్ధి అంచనా(గెడైన్స్)లో కంపెనీ ఎలాంటి మార్పులు చేయలేదు. ఏప్రిల్‌లో ప్రకటించినట్లుగానే 7-9 శాతం గెడైన్స్(డాలర్ల రూపంలో)ను యథాతథంగా కొనసాగించింది. రూపాయిల్లో గెడైన్స్ 6.7-8.7 శాతంగా ఉంది. ఇతర ముఖ్యాంశాలివీ... జూలై-సెప్టెంబర్ క్వార్టర్లో ఇన్ఫీ, దాని సబ్సిడరీలు కొత్తగా 49 క్లయింట్లను దక్కించుకున్నాయి. దీంతో మొత్తం యాక్టివ్ క్లయింట్ల సంఖ్య 912కి చేరింది. ఇక సెప్టెంబర్ చివరినాటికి కంపెనీ వద్ద నగదు, తత్సంబంధ ఇతరత్రా నిల్వలు 5,444 మిలియన్ డాలర్లకు ఎగసింది. జూన్ చివరికి ఈ మొత్తం 4,943 మిలియన్ డాలర్లు. బోనస్ షేర్లు, మెరుగైన ఫలితాల నేపథ్యంలో కంపెనీ షేరు దూసుకెళ్లింది. శుక్రవారం బీఎస్ఈలో ఇన్ఫోసిస్ షేరు ధర 7 శాతం మేర ఎగబాకి కొత్త రికార్డును(రూ.3,909) తాకింది. చివరకు 6.68 శాతం లాభంతో రూ.3,889 వద్ద స్థిరపడింది. పెరిగిన ఉద్యోగుల వలస... క్యూ2లో ఇన్ఫోసిస్ స్థూలంగా 14,255 మంది ఉద్యోగులను నియమించుకుంది. అయితే, 10,128 మంది కంపెనీని వీడటంతో నికరంగా 4,127 మంది సిబ్బందే జతయ్యారు. దీంతో జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో ఉద్యోగుల వలస(అట్రిషన్) రేటు 20.1 శాతానికి ఎగసింది. క్రితం ఏడాది ఇదే క్వార్టర్లో ఆట్రిషన్ రేటు 17.3 శాతం కాగా.. ఈ ఏడాది క్యూ1లో 19.5 శాతం. మొత్తంమీద సెప్టెంబర్ చివరినాటికి ఇన్ఫోసిస్, దాని సబ్సిడరీ సంస్థలన్నింటిలో కలిపి ఉద్యోగుల సంఖ్య 1,65,411కి చేరింది. బోనస్ షేర్లు.. బంపర్ డివిడెండ్.. ఇన్ఫోసిస్ డెరైక్టర్ల బోర్డు తమ ఇన్వెస్టర్లకు దీపావళి ధమాకాను ప్రకటించింది. ఒక్కో షేరుకి మరో షేరు(1:1 నిష్పత్తిలో)ను బోనస్‌గా ఇవ్వాలని నిర్ణయించింది.అదేవిధంగా న్యూయార్స్ స్టాక్ ఎక్స్ఛేంజీలో లిస్టయిన ఒక్కో అమెరికా డిపాజిటరీ షేరు(ఏడీఎస్)కు కూడా మరో ఏడీఎస్ను బోనస్‌గా ఇవ్వనుంది. బోనస్ షేర్ల జారీకి రికార్డు తేదీని త్వరలోనే ప్రకటించనున్నట్లు కంపెనీ తెలిపింది. దీనివల్ల స్టాక్ మార్కెట్లో షేర్ల సరఫరా(లిక్విడిటీ)ని పెరగడంతోపాటు, రిటైల్ ఇన్వెస్టర్ల సంఖ్యను కూడా పెంచేందుకు దోహదం చేయనుందని ఇన్ఫోసిస్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్(సీఎఫ్ఓ) రాజీవ్ బన్సల్ చెప్పారు. మరోపక్క, రూ.5 ముఖ విలువగల ఒకో షేరుపై ఆరు రెట్లు అధికంగా రూ.30 చొప్పున మధ్యంతర డివిడెండ్‌ను కూడా కంపెనీ ప్రకటించింది. క్రితం ఏడాది క్యూ2లో మధ్యంతర డివిడెండ్ రూ.20 మాత్రమే కావడం గమనార్హం. కాగా, షేర్ల బైబ్యాక్ ద్వారా కంపెనీవద్దనున్న అదనపు క్యాపిటల్(నగదు నిల్వలను)ను సద్వినియోగం చేసుకోవడానికి వీలవుతుందని ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్ఓ, బోర్డు సభ్యుడు మోహన్ దాస్ పాయ్ వ్యాఖ్యానించారు. మార్కెట్ నుంచి షేర్లను కంపెనీ కొనుగోలు చేయడంద్వారా ఈక్విటీ తగ్గి.. పీఈ నిష్పత్తి(షేరు వారీ ఆర్జన) మెరుగవుతుందన్నారు. గతంలో కూడా బైబ్యాక్‌లు కంపెనీ పనితీరును పెంచాయని చెప్పారు. భారీ నగదు నిల్వలను ఏవిధంగా వెచ్చిస్తారో యాజమాన్యాన్ని వాటాదారులు అడగాలన్నారు. బ్యాలెన్స్‌షీట్లలో ఇంతపెద్ద మొత్తం నిరుపయోగంగా పడిఉంటే.. ఏదోఒకసమయంలో ఒత్తిడికిలోనై బడా కంపెనీని దేన్నైనా కొనుగోలు చేసే అవకాశాలు ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు.