విశాల్‌ సిక్కా జీతం తగ్గిందా? | vishal sikka gets only 46 percent of variable pay | Sakshi
Sakshi News home page

విశాల్‌ సిక్కా జీతం తగ్గిందా?

Published Fri, Apr 14 2017 10:14 AM | Last Updated on Tue, Sep 5 2017 8:46 AM

విశాల్‌ సిక్కా జీతం తగ్గిందా?

విశాల్‌ సిక్కా జీతం తగ్గిందా?

ఇన్ఫోసిస్‌ సీఈఓ విశాల్‌ సిక్కాకు జీతం చాలా ఎక్కువగా ఇస్తున్నారని చాలామంది అంటుంటారు. కానీ, 2016-17 సంవత్సరానికి ఆయనకు అందిన వేరియబుల్‌ పే ఎంతో తెలుసా.. కేవలం 46 శాతం మాత్రమే. సాధారణంగా ఉద్యోగుల వేతనంలో కొంత భాగాన్ని వేరియబుల్‌ పే అని పక‍్కన పెడతారు. ఆ సంవత్సరంలో వారి పనితీరు ఆధారంగా అందులో ఎంత శాతం ఇవ్వాలనేది నిర్ణయిస్తారు. ఇన్ఫోసిస్‌లో అయితే ఫస్ట్‌ గ్రేడ్‌ వచ్చినవారికి నూరుశాతం వేరియబుల్‌ పే ఇస్తారు. కానీ ఇప్పుడు ఏకంగా సీఈఓ విశాల్‌ సిక్కాకే 46% వేరియబుల్‌ పే మాత్రమే ఇచ్చారంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. 2016-17 సంవత్సరంలో మొత్తం 51 కోట్ల వేరియబుల​ పే రావాల్సి ఉండగా, అందులో ఆయనకు కేవలం 24 కోట్లు మాత్రమే వచ్చింది. అదికాక ఆయన స్థిరవేతనం మరో రూ. 19 కోట్లు. దాంతో ఈ ఏడాది మొత్తం సుమారు 43 కోట్ల రూపాయలు సంపాదించినట్లయింది. 2015-16లో వచ్చిన 48 కోట్ల కంటే ఇది 5 కోట్ల రూపాయలు తక్కువ.

విశాల్‌ సిక్కాకు వేతనం పెరిగిందని చాలామంది భావించినా, వాస్తవానికి అది వేరియబుల్‌ పేలో పెంపు మాత్రమేనని కంపెనీ బోర్డుతో పాటు స్వయంగా సిక్కా కూడా చాలాసార్లు చెప్పారు. లక్ష్యాలను పూర్తిగా సాధిస్తేనే పూర్తి మొత్తం చెల్లిస్తారు. అయితే ఆ లక్ష్యాలేంటనే విషయాన్ని మాత్రం కంపెనీ బహిరంగపరచలేదు. శుక్రవారం ప్రకటించిన క్యూ4 ఫలితాల్లో ఆదాయ వృద్ధి కేవలం 3.4 శాతం ఉండటంతో పాటు లాభాల్లో వృద్ధి అసలు లేకపోవడం లాంటివి కూడా సిక్కా వేతనం మీద ప్రభావం కనబర్చి ఉంటాయని భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement