recrutement
-
30 నుంచి దేహదారుఢ్య పరీక్షలు
సాక్షి, అమరావతి: పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలను ఈనెల 30 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు నిర్వహించాలని రాష్ట్ర పోలీసు నియామక మండలి నిర్ణయించింది. రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ఈ దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తారు. కానిస్టేబుల్ పరీక్షల(స్టేజ్–2) కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ హాల్టికెట్లనువెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని పోలీసు నియామక మండలి గురువారం ఓ ప్రకటనలో సూచించింది. ఈ నెల 18వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుంచి 29వ తేదీ మధ్యాహ్నం 3 గంటల్లోపు డౌన్లోడ్ చేసుకోవాలని స్పష్టం చేసింది. సందేహాల నివృత్తి కోసం హెల్ప్‌లైన్ నంబర్లు 9441450639, 9100203323ను సంప్రదించాలని సూచించింది. -
ఇన్ఫోసిస్ 20 వేలమంది ఫ్రెషర్స్‌కు ఛాన్స్
ముంబై: సాఫ్ట్వేర్ సేవల ఎగుమతుల దిగ్గజం ఇన్ఫోసిస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) రెండో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. జులై–సెపె్టంబర్(క్యూ2)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 5 శాతం పుంజుకుని రూ. 6,506 కోట్లను తాకింది. 4.4 శాతం అధికంగా రూ. 8,649 కోట్ల నిర్వహణ లాభం(ఇబిట్) ఆర్జించింది. 21.1 శాతం ఇబిట్ మార్జిన్లు సాధించింది. మొత్తం ఆదాయం సైతం 5 శాతం ఎగసి రూ. 40,986 కోట్లకు చేరింది. పూర్తి ఏడాదికి ఆదాయ అంచనాల(గైడెన్స్)ను తాజాగా మెరుగుపరచింది. 3.75–4.5 శాతం మధ్య వృద్ధి సాధించగలమని ప్రకటించింది. ఇంతక్రితం క్యూ1 ఫలితాల సమయంలోనూ ఆదాయ వృద్ధి అంచనాలను 1–3 శాతం నుంచి 3–4 శాతానికి పెంచిన విషయం విదితమే. వాటాదారులకు షేరుకి రూ. 21 చొప్పున మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. రికార్డ్ డేట్ ఈ నెల 29కాగా.. నవంబర్ 8కల్లా చెల్లించనుంది. డాలర్లలో ఆదాయం త్రైమాసికవారీగా 4 శాతం ఎగసి 4.89 బిలియన్లను అధిగమించింది. ఇతర విశేషాలు.. → మొత్తం 2.4 బిలియన్ డాలర్ల విలువైన భారీ డీల్స్‌ను కుదుర్చుకుంది. → ఆరు త్రైమాసికాలుగా ఉద్యోగుల సంఖ్య తగ్గుతూ వస్తున్న ట్రెండ్‌కు క్యూ2లో చెక్ పడింది. నికరంగా 2,500 మందిని జత చేసుకుంది. → సెప్టెంబర్‌కల్లా మొత్తం సిబ్బంది సంఖ్య 3,17,788 కు చేరుకుంది. → ఉద్యోగ వలసల రేటు 14.6% నుంచి 12.9 శాతానికి తగ్గింది. → ఈ ఏడాది 15,000–20,000 మంది ఫ్రెషర్స్‌ను నియమించుకోనుంది. ఇప్పటికే తొలి అర్ధభాగంలో కొంత మందికి చోటిచి్చంది. డిమాండ్ జూమ్ అన్నివైపుల నుంచి సాఫ్ట్వేర్ సేవలకు డిమాండ్ బలపడటం మెరుగైన గైడెన్స్‌కు సహకరించింది. ప్రధానంగా ఐటీ పరిశ్రమలో కీలకమైన ఫైనాన్షియల్ రంగ క్లయింట్ల నుంచి భారీ డీల్స్ పెరుగుతుండటం ప్రభావం చూపింది. కోబాల్ట్‌తో క్లౌడ్, టోపజ్తో జెన్ఏఐ ద్వారా కంపెనీ సామర్థ్యాలు మరింత బలపడ్డాయి. దీంతో క్లయింట్లు ఇన్ఫోసిస్‌తో జత కట్టేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. – సలీల్ పరేఖ్, సీఈవో, ఎండీషేరు బీఎస్ఈలో 3% బలపడి రూ. 1,975 వద్ద ముగిసింది. -
‘కరెంట్’ కొలువులు
సాక్షి, హైదరాబాద్: దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) 2,500 జూనియర్ లైన్మెన్, 25 జూనియర్ పర్సనల్ ఆఫీసర్, 500 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులు కలిపి మొత్తం 3,025 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేసింది. సంస్థ వెబ్సైట్లు https://www.tssouthernpower.com లేదా https:// tssouthernpower.cgg.gov.inలో ఈ నోటిఫికేషన్లను పొందుపరిచింది. ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించనుంది. కొత్త జిల్లాల ప్రాతిపదికన పోస్టుల భర్తీని చేపట్టింది. జిల్లా, రిజర్వేషన్ కేటగిరీల వారీగా ఖాళీల వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు. అర్హత వివరాలు.. జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్, జూనియర్ పర్సనల్ ఆఫీసర్ పోస్టులకు బీఏ/బీకాం/బీఎస్సీ లేదా తత్సమాన విద్యార్హతతో పాటు 18–34 ఏళ్ల వయసు కలిగి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 5 ఏళ్లు, శారీరక వికలాంగులకు 10 ఏళ్ల వయోపరిమితి మినహాయింపు. జూనియర్ లైన్మెన్ పోస్టులకు 18–35 ఏళ్ల వయసుతో పాటు పదో తరగతితో పాటు ఎలక్ట్రికల్/వైర్‌మెన్ ట్రేడ్‌లో ఐటీఐ లేదా ఎలక్ట్రికల్ ట్రేడ్‌లో ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్సు పూర్తి చేసి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 5 ఏళ్ల వయోపరిమితి మినహాయింపు. జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ ఫీజుల చెల్లింపు ప్రారంభ తేదీ: 30.10.2019 దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: 31.10.2019 ఫీజుల చెల్లింపునకు చివరి తేదీ: 20.11.2019 (సాయంత్రం 5 వరకు) ఆన్లైన్ దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: 20.11.2019 (రాత్రి 11.59 వరకు) హాల్ టికెట్ల డౌన్లోడింగ్ ప్రారంభం: 11.12.2019 పరీక్ష తేదీ: 22.12.2019 జూనియర్ లైన్మెన్, జూనియర్ పర్సనల్ ఆఫీసర్ ఫీజుల చెల్లింపు ప్రారంభ తేదీ: 21.10.2019 దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: 22.10.2019 ఫీజుల చెల్లింపునకు చివరి తేదీ: 10.11.2019 (సాయంత్రం 5 వరకు) ఆన్లైన్ దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: 10.11.2019 (రాత్రి 11.59 వరకు) హాల్ టికెట్ల డౌన్లోడింగ్ ప్రారంభం: 05.12.2019 పరీక్ష తేదీ: 15.12.2019 -
కొత్త ఏడాదికి కొలువుల స్వాగతం
9,281 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ నిరుద్యోగులకు సర్కారు తీపి కబురు జనవరి 11 నుంచి ఫిబ్రవరి 4 వరకు దరఖాస్తుల స్వీకరణ.. ఏప్రిల్ 3న ప్రాథమిక పరీక్ష సాక్షి, హైదరాబాద్: నిరుద్యోగులకు కొత్త సంవత్సరం తొలి రోజునే రాష్ట్ర సర్కారు తీపి కబురు అందించింది. పోలీసు శాఖలో వివిధ విభాగాల్లో 9,281 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి పచ్చజెండా ఊపింది. ఈ మేరకు పోలీసు శాఖ గురువారం రాత్రి నోటిఫికేషన్ విడుదల చేసింది. 439 గ్రూప్-2 పోస్టులు సహా వివిధ విభాగాల్లో మొత్తం 796 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన మరుసటి రోజే ఈ ప్రకటన వెలువడటంతో నిరుద్యోగుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సివిల్, ఆర్మ్డ్ రిజర్వ్, స్పెషల్ ఆర్మ్డ్ రిజర్వ్, స్పెషల్ పోలీసు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, అగ్నిమాపక దళం.. ఇలా పలు విభాగాల్లో కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆన్లైన్ ద్వారా జనవరి 11 నుంచి ఫిబ్రవరి 4 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. తెలంగాణ పోలీస్ స్టేట్ లెవల్ రిక్రూట్మెంట్ బోర్డు వెబ్సైట్ (ఠీఠీఠీ.్టటఞటఛ.జీ)లో దరఖాస్తులు అందుబాటులో ఉంటాయి. ఏప్రిల్ 3న ప్రాథమిక రాత పరీక్ష నిర్వహిస్తారు. దానికి వారం ముందు నుంచి హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం పేర్కొన్న పోస్టుల సంఖ్యలో అవసరమైతే మార్పుచేర్పులు చేసే అవకాశం ఉందని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఏ పోస్టులు ఎన్ని... స్టైపెండరీ క్యాడెట్ ట్రెయినీ(ఎస్సీటీ) పోలీసు కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించిన ఖాళీల వివరాలివీ.. పోస్టు కోడ్ విభాగం ఖాళీల సంఖ్య 21 సివిల్ 1,810 22 ఆర్మ్డ్ రిజర్వ్ 2,760 23 స్పెషల్ అర్మ్డ్ రిజర్వ్ 56 24 స్పెషల్ పోలీసు 4,065 25 స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్సు 174 26 డిజాస్టర్ రెస్పాన్స్/ఫైర్ సర్వీసెస్ ఫైర్‌మెన్ 416 ----------------------------------------- మొత్తం 9,281 ---------------------------------------- వయోపరిమితి ఇలా.. పోస్టు కోడ్ నెం.21 నుంచి 25 వరకు: జూలై 2015 నాటికి 18 ఏళ్ల నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. (1990 జూలై 2 - 1997 జూలై 1 మధ్య జన్మించి ఉండాలి). ఈ పోస్టులకు హోమ్‌గార్డులు దరఖాస్తు చేసుకుంటే.. వారు రెండేళ్ల కాలంలో కనీసం 360 రోజులు విధులు నిర్వహించాలి. వారి వయసు 18 ఏళ్ల నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే 1982 జూలై 2-1997 జూలై1 మధ్య జన్మించి ఉండాలి. పోస్టు కోడ్ 26: వయసు 18-33 ఏళ్ల మధ్య ఉండాలి (1982 జూలై 2- 1997 జూలై1) ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఐదేళ్ల వయోపరిమితి సడ లింపు ఇచ్చారు. విద్యార్హత: జూలై 1, 2015 నాటికి ఇంటర్మీడియెట్ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ, ఎస్టీలైతే పదో తరగతి ఉత్తీర్ణులై ఇంటర్ పరీక్షలకు హాజరై ఉండాలి. దరఖాస్తు ఫీజు: ఓసీ, బీసీ అభ్యర్థులకు రూ.400, ఎస్సీ, ఎస్టీలకు రూ.200. మీ సేవ/టీఎస్ఆన్లైన్/ఏపీఆన్‌లైన్ సెంటర్లలో నిర్ధారిత ఫీజు చెల్లించి రశీదు తీసుకోవాలి. తర్వాత వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ప్రాథమిక రాత పరీక్ష: అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ 3న జరిగే ప్రాథమిక రాత పరీక్షకు హాజరు కావాలి. ఇది 200 మార్కులకు ఉంటుంది. ఇందులో క్వాలిఫై కావాలంటే ఓసీలు 40 శాతం, బీసీలు 35 శాతం, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్‌మెన్ 30 శాతం మార్కులు పొందాలి. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి దేహ దారుఢ్య పరీక్ష ఉంటుంది. -
పోటీ పరీక్షలకు ప్రత్యేకం
♦ తెలుగులో తెలంగాణ సామాజిక ఆర్థిక సర్వే ♦ అందుబాటులోకి తెచ్చిన ప్రణాళిక విభాగం ♦ పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం సాక్షి, హైదరాబాద్: తొలిసారిగా రాష్ట్ర ఆర్థిక సామాజిక సర్వేను ప్రణాళిక విభాగం తెలుగులో ప్రచురించింది. ‘బంగారు తెలంగాణ దిశగా తొలి అడుగులు-తెలంగాణ సామాజిక ఆర్థిక చిత్రం-2015’ పేరుతో ఈ పుస్తకాన్ని అందుబాటులోకి తెచ్చింది. సీఎం కేసీఆర్, ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి, సమాచార, ప్రజా సంబంధాల కమిషనర్ బీపీ ఆచార్య శుక్రవారం ఈ పుస్తకాన్ని విడుదల చేశారు. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రానికి సంబంధించి వివిధ రంగాల వారీగా సమాచారాన్ని ఇందులో పొందుపరిచారు. వ్యవసాయ రంగం, సంక్షే మం, సామాజిక అభివృద్ధి, ఆర్థిక, మౌలిక సదుపాయాలు, నూతన పారిశ్రామిక విధానం, విశ్వనగరంగా హైదరాబాద్, గణాంకాల్లో తెలంగాణ.. తదితర అంశాలు ఇందులో ఉన్నాయి. రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను పుస్తకంలో సమగ్రంగా విశ్లేషించారు. అభ్యర్థులు పుస్తకాలను కొనుగోలు చేసేందుకు వీలుగా.. జిల్లా కేంద్రాల్లో ముఖ్య ప్రణాళికాధికారి కార్యాలయాల్లో, హైదరాబాద్‌లో ఖైరతాబాద్‌లోని డెరైక్టర్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ కార్యాలయంలో కాపీలను అందుబాటులో ఉంచుతున్నారు. ప్రైవేటు పబ్లిషర్స్‌కు ఇవ్వకుండా ప్రభుత్వమే దీని కాపీరైట్స్ తీసుకుంది. పుస్తకం ధర రూ.250గా నిర్ణయించింది. దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ వెబ్సైట్ నుంచి ఈ పుస్తకం ప్రతిని పీడీఎఫ్ ఫార్మాట్లో ఉచితంగా డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు. -
కొలువుల ఫైళ్లు నత్తనడక
ఉద్యోగ నియామకాల ఫైళ్లన్నీ ఎక్కడివక్కడే కీలకాంశాలపై స్పష్టత కరువు వయో పరిమితి పెంపుపై సందిగ్ధత పరీక్ష విధానం, జోన్ల వ్యవస్థ, టీఎస్పీఎస్సీ భర్తీ చేసే పోస్టులపై రాని స్పష్టత కమిటీలు, పరిశీలనతోనే కాలం వెళ్లబుచ్చుతున్న సర్కారు జూలై వచ్చినా జాడ లేని నోటిఫికేషన్లు ఆందోళనలో నిరుద్యోగులు సాక్షి, హైదరాబాద్: 'త్వరలోనే 25 వేల ఉద్యోగాల భర్తీ...' అంటూ సర్కారు వెలువరించిన ప్రకటన నిరుద్యోగులను ఊరిస్తున్నా నియామకాలకు సంబంధించిన కసరత్తు నత్తనడకన సాగుతోంది. జూలై నుంచి నోటిఫికేషన్ల ప్రక్రియ మొదలవుతుందని స్వయంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించినా పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగానే ఉంది. నోటిఫికేషన్లకు ఎంచుకున్న ముహూర్తం ముంచుకొస్తున్నా.. ఫైళ్లన్నీ పెండింగ్‌లోనే ఉన్నాయి. శాఖల వారీగా ఖాళీల గుర్తింపు మినహా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ అడుగు ముందుకు పడలేదు. కీలకమైన నిర్ణయాలన్నీ సీఎం వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. అభ్యర్థుల వయో పరిమితి ఎంత మేరకు సడలిస్తారు? జోనల్ విధానంలో మార్పుచేర్పులు ఉండబోతున్నాయా? అసలు పరీక్షల విధానం ఎలా ఉండబోతోంది? వీటికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేదు. దీంతో లక్షలాది మంది నిరుద్యోగులు ఆందోళనకు గురవుతున్నారు. మూడు వారాలు గడచినా.. సీఎం ఉద్యోగ నియామకాలపై ప్రకటన చేసి మూడు వారాలైంది. తొలి వారంలో 24 గంటల వ్యవధిలో ఖాళీల సమాచారం ఇవ్వాలని హడావుడి చేసిన సర్కారు.. ఆ తర్వాత వేగం తగ్గించింది. ఇంకా ఖాళీల గుర్తింపు ప్రక్రియే కొనసాగుతోంది. ఖాళీల వివరాలు కోరటం.. ప్రాధాన్యతా క్రమంలో ఏయే పోస్టులు భర్తీ చేయాలనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ రెండుసార్లు సమీక్ష నిర్వహించారు. 56 వేల ఖాళీలున్నట్టు వివిధ శాఖల నుంచి ఆర్థిక శాఖకు సమాచారం అందింది. నాలుగో తరగతి పోస్టులకు సంబంధించి ఖాళీల వివరాలు కూడా ఇందులో ఉన్నాయి. కానీ జూనియర్ అసిస్టెంట్ స్థాయికి మించి ఎక్స్క్యూటివ్ పోస్టుల జాబితా సిద్ధం చేయాలని సర్కారు సూచింది. దీంతో ఆర్థికశాఖ తమ దగ్గరున్న ఖాళీల వివరాలను వడస్తోంది. తొలి విడతలో విద్య, వైద్యారోగ్యం, పురపాలక శాఖ, పంచాయతీరాజ్, హోంశాఖలోని ఖాళీలు భర్తీ చేసే అవకాశాలున్నాయి. ఈ అయిదు విభాగాల్లోని ఖాళీలపైనే సీఎస్ ఇటీవల ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించటం గమనార్హం. ఈ ఏడాది రాష్ట్ర స్థాయి పోస్టులు మినహా జోనల్, జిల్లా స్థాయి పోస్టులను భర్తీ చేయనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. వయో పరిమితిపై సందిగ్ధత అభ్యర్థుల వయో పరిమితి పెంపుపై ప్రభుత్వం ఇప్పటికీ మార్గదర్శకాలు విడుదల చేయలేదు. జూన్ 10న జరిగిన రాష్ట్ర మంత్రివర్గ భేటీలోనూ దీనిపై చర్చించారు. 'అయిదేళ్లు పెంచాలా.. పదేళ్లా.. అనే దానిపై భిన్నమైన అభిప్రాయాలున్నాయి. చీఫ్ సెక్రెటరీ సారథ్యంలోని కార్యదర్శుల కమిటీ దీనిపై నిర్ణయం తీసుకుంటుంది. వారం రోజుల్లో నాకు నివేదిక ఇస్తుంది' అని సీఎం కేసీఆర్ ప్రకటించారు. కానీ ఇప్పటికీ నిర్ణయం వెలువడలేదు. ఉద్యోగ నియామకాలకు ప్రస్తుతమున్న సాధారణ వయో పరిమితి 34 ఏళ్లు. యూనిఫాం సర్వీసులకు 28 ఏళ్లు. నిరుద్యోగులకు మాత్రమే వయోపరిమితి సడలింపు ఇవ్వాలని, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న అభ్యర్థులకు గతంలో ఉన్న అయిదేళ్ల సడలింపు మాత్రమే వర్తింపజేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. టీఎస్పీఎస్సీ పోస్టులేవీ ? తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ద్వారా ఏయే పోస్టులు భర్తీ చేయాలన్న లెక్క తేలలేదు. టీఎస్పీఎస్సీ తొలి నోటిఫికేషన్ ఎప్పుడు వెలువడుతుంది? ఏయే పోస్టులు భర్తీ చేస్తారనేది సర్కారు వెల్లడించలేదు. ప్రభుత్వం భర్తీ చేయదలిచిన 25 వేల ఉద్యోగాల్లో వేటిని టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేస్తారు.. వేటిని డిపార్టుమెంట్ బోర్డుల ద్వారా భర్తీ చేస్తారో తేలాల్సి ఉంది. చీఫ్ సెక్రెటరీలు, డిపార్టుమెంట్ సెక్రెటరీలు చర్చించి దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందని సీఎం చెప్పినా.. ఇప్పటికీ ఆ దిశగా తుది కసరత్తు జరగలేదు. పరీక్ష విధానంపై సందిగ్ధత టీఎస్పీఎస్సీ అధ్వర్యంలో నిర్వహించే పరీక్షల విధానం ఎలా ఉండబోతుందన్నది ఇప్పటికీ తేలలేదు. ఉద్యోగాల ప్రకటన అనంతరం డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి సారథ్యంలో ముగ్గురు మంత్రుల సబ్ కమిటీని ప్రభుత్వం నియమించింది. నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికలు, టీఎస్పీఎస్సీ చేసిన సిఫారసులు, వివిధ శాఖల ముఖ్య కార్యదర్శుల కమిటీ ఇచ్చిన సలహాలను పరిశీలించి నిర్ణయం తీసుకోవాల్సిన సబ్ కమిటీ ఎప్పుడు తమ నివేదిక ఇస్తుందో వేచి చూడాల్సిందే! జోనల్ వ్యవస్థపై మల్లగుల్లాలు జోనల్ వ్యవస్థపై అనేక సందేహాలు నిరుద్యోగులను పట్టి పీడిస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో 371(డీ) కింద ఆరు జోన్ల వ్యవస్థ ఉంది. విభజన అనంతరం తెలంగాణలో రెండే జోన్లు ఉన్నాయి. వీటిని రద్దు చేసి ఒక్కటిగా విలీనం చేయాలా లేదా నాలుగు జోన్లుగా పునర్వ్యవస్థీకరించాలా అన్నది చర్చనీయాంశంగానే ఉంది. పునర్విభజన చట్టం ప్రకారం రెండు రాష్ట్రాల్లోనూ జోన్ల విధానం అమల్లో ఉంది. దీనికి మార్పులు చేర్పులు చేయాలంటే కేంద్రం అనుమతి పొందడంతోపాటు ప్రస్తుతమున్న చట్టానికి సవరణ చేయాల్సి ఉంటుంది. -
'గిరిజనేతరులతో ఎలా భర్తీ చేస్తారు'
విజయనగరం(పార్వతీపురం): గిరిజన సంస్థల్లో ఉద్యోగాల భర్తీని గిరిజనేతరులతో చేయడాన్ని గిరిజన సంఘాలు తప్పు బట్టాయి. సోమవారం విజయనగరం జిల్లా పార్వతీపురంలో ఐటీడీఏ ఆఫీస్ ఎదుట గిరిజన సంఘాలు ధర్నాకు దిగాయి. ఖాళీగా ఉన్న పోస్టులకు నొటిఫికేషన్ విడుదల చేసి గిరిజనలతో నింపాలని వారు డిమాండ్ చేశారు. -
ఉపాధ్యాయ నియామకాలకు కొత్త సిలబస్
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ నియామకాలకు కొత్త సిలబస్‌ను ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యా శాఖ శుక్రవారం విడుదల చేసింది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్), ఉపాధ్యాయ నియామక పరీక్ష (టెర్ట్)లను కలిపి ఈసారి ఒకే పరీక్షను 200 మార్కులకు నిర్వహిస్తున్నందున ఈ కొత్త సిలబస్‌ను రూపొందించారు. ఈసారి టెర్ట్లో మండల, జిల్లా పరిషత్, ప్రభుత్వ, మున్సిపల్ పాఠశాలలన్నిటినీ కలుపుకొని 10,313 పోస్టులు భర్తీ చేస్తున్న సంగతి తెలిసిందే. స్కూల్ అసిస్టెంట్లు (లాంగ్వేజెస్, నాన్ లాంగ్వేజెస్), లాంగ్వేజ్ పండిట్లు, ఫిజికల్, సెకండరీ ఎడ్యుకేషన్ టీచర్లు (ఎస్జీటీ)కు వేర్వేరు సిలబస్‌ను ప్రకటించారు. ఆయా విభగాల పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల్లోని నైపుణ్యాలను సమగ్రంగా అంచనా వేసేలా పలు అంశాలను ఇందులో చేర్చారు. గతంలో టెట్‌కు ఒక సిలబస్, డీఎస్సీకి మరో సిలబస్ ఉండేది. ఈసారి అందుకు భిన్నంగా రెండింటినీ కలపడంతో పాటు మరిన్ని కొత్త అంశాలను కూడా జోడించారు. అభ్యర్థుల నైపుణ్యాల పరిశీలన లక్ష్యంగా, వారికి అన్ని అంశాలపై సమగ్ర అవగాహన ఉండేలా దీనిని రూపొందించారు. ఈ సిలబస్ సమగ్ర సమాచారాన్ని ‘ఏపీడీఎస్సీ.సీజీజీ.జీఓవీ.ఇన్’ అనే వెబ్సైట్లో పొందుపరిచారు. ఈ సిలబస్ ప్రకారం భాషా పండితుల పోస్టులకు ఆయా భాషలపై ప్రాధాన్యమిస్తూ ఇచ్చే ప్రశ్నలు 70 మార్కులకు మాత్రమే ఉంటాయి. మిగతా 130 మార్కులు భాషా పండితులకు సంబంధం లేనివే ఉంటాయి. ఇంగ్లిష్ (గ్రామర్), గణితం, సైన్స్, సోషల్ సబ్జెక్టు అంశాలతో పాటు బోధనాంశాలపై వారికి ప్రత్యేక సిలబస్‌ను ఇచ్చారు. పీఈటీలకు 180 మార్కులకు, మిగతా అన్ని విభాగాల్లో 200 మార్కులకు సిలబస్‌ను ఇచ్చారు. పీఈటీలకు కూడా ఈసారి కొత్త అంశాలను చేర్చారు. స్కూల్ అసిస్టెంట్లు (లాంగ్వేజెస్) పోస్టులకు సిలబస్ * తెలుగు, ఉర్దూ, హింద, తమిళ్, కన్నడ, ఒరి యా, సంస్కృతం పోస్టులకు పార్ట్ - 1లో జనరల్ నాలెడ్జి, కరెంట్ అఫైర్స్లలో 10 మార్కుల ప్రశ్నలుంటాయి. * పార్టు- 2లో శిశు అభివృద్ధి, బోధన అంశాలపై 30 మార్కులకు ప్రశ్నలు ఇస్తా రు. పార్టు - 3లో భాషలకు సంబంధించిన అం శాలతో పాటు అందులోని బోధనా పద్ధతులపై 70 మార్కులు ఉంటాయి. * పార్టు - 4లో ఇంగ్లిష్ గ్రామర్, బోధనాంశాలపై 30 మార్కులకు ప్రశ్న లు ఉంటాయి. పార్టు - 5లో గణితం, సైన్స్, సోషల్ స్టడీస్ సబ్జెక్టులు, వాటి బోధనా విధానాల పై 60 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి. స్కూల్ అసిస్టెంట్లు (నాన్ లాంగ్వేజెస్) సిలబస్ వీరికి నాన్ లాంగ్వేజెస్‌లో ఇంగ్లిష్, గణితం, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఫిజికల్ సైన్స్, సోషల్ స్టడీస్, బయోలాజికల్ సైన్స్లకు వేర్వేరు సిలబస్‌లను ప్రకటించారు. ప్రతి పేపర్లో పార్టు - 1లో జనరల్ నాలెడ్జి, కరెంటు అఫైర్స్‌పై 10 మార్కులకు, పార్టు - 2లో శిశు అభివృద్ధి, బోధనాంశాలపై 30 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి. * పార్టు - 3 నుంచి సబ్జెక్టులవారీగా కొన్ని మార్కులకు ప్రశ్నలు ఇస్తారు. ఇంగ్లిష్‌లో పార్టు - 3లో ఇంగ్లిష్ భాష, బోధన నైపుణ్యాలపై 70 మార్కులకు, పార్టు- 4 లో తెలుగు, ఉర్దూ, హిందీ, తమిళ, కన్నడ, ఒరియా, సంస్కృతం భాషలపై అభ్యర్థి ఆప్షన్‌ను అనుసరించి సంబంధిత భాషల సాహిత్యాంశాలపై 30 మార్కులకు ప్రశ్నలిస్తారు. * పార్టు - 5లో గణితం, సైన్స్, సోషల్ స్టడీస్‌లలో 60 మార్కులకు ప్రశ్నలిస్తారు. గణితంలో పార్టు - 3లో తెలుగు, ఉర్దూ, హిందీ, తమిళ, కన్నడ, ఒరియా, సంస్కతం భాషలను ఆప్షన్‌గా పెట్టుకున్న వారికి ఆయా భాషల సాహిత్యాంశాలపై 30 మార్కులకు ప్రశ్నలిస్తారు. * పార్టు - 4 లో ఇంగ్లిష్ భాష, బోధన నైపుణ్యాలపై 30 మార్కులకు, పార్టు - 5లో గణితం, సైన్సు సబ్జెక్టు బోధన పద్ధతులపై 100 మార్కులకు ప్రశ్నలుంటాయి. ఇందులో గణితంలో 70 మార్కులకు, ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్ సబ్జెక్టులలో చెరొక 15 మార్కులకు ప్రశ్నలిస్తారు. ఇదే కేటగిరీలోని ఫిజికల్ ఎడ్యుకేషన్, ఫిజికల్ సైన్స్, సోషల్ స్టడీస్, బయోలాజికల్ సైన్స్ పోస్టులకు ఆయా సబ్జెక్టులకు ప్రాధాన్యమిస్తూ 200 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి. భాషా పండితులు భాషా పండితుల పోస్టులకు పార్టు - 1లో జనరల్ నాలెడ్జి, కరెంటు అఫైర్స్‌పై 10 మార్కులకు, పార్టు - 2లో శిశు అృవద్ధి, బోధనాంశాలపై 30 మార్కులకు ప్రశ్నలుంటాయి. పార్టు - 3లో తెలుగు, ఉర్దూ, హిందీ, తమిళ, కన్నడ, ఒరియా, సంస్కతం భాషల్లో అభ్యర్థి ఎంచుకున్న భాషలో సాహిత్యాంశాలు, బోధనాంశాతో 70 మార్కులకు ప్రశ్నలు ఇస్తారు. పార్టు - 4లో ఇంగ్లిష్ గ్రామర్, బోధన పద్ధతులపై 30 మార్కులకు, పార్టు - 5లో గణితం, సైన్స్, సోషల్ స్టడీస్‌లో సబ్జెక్టు, బోధనాంశాలపై 60 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి. పీఈటీ పోస్టులకు పీఈటీ పోస్టులకు పార్టు - 1లో జనరల్ నాలెడ్జి, కరెంటు అఫైర్స్‌పై 30 మార్కులకు, పార్టు- 2లో ఇంగ్లిష్ గ్రామర్ బోధనాంశాలపై 30 మార్కులకు ప్రశ్నలు ఇస్తారు. పార్టు - 3లో ఫిజికల్ ఎడ్యుకేషన్ సబ్జెక్టులో 120 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి. ఇందులో ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్స్, ఫిలాసఫీ, చరిత్ర, ఆర్గనైజేషన్, అడ్మినిస్ట్రేషన్, సైకాలజీ, మెటీరియల్స్ అండ్ మెథ డ్స్, అనాటమీ, ఫిజియాలజీ, కినెసియాలజీ (అవయవాల కదలిక), హెల్త్ ఎడ్యుకేషన్, సేఫ్టీ ఎడ్యుకేషన్, ఫిజియాలజీ ఆఫ్ ఎక్సర్సైజ్, యోగా, ఆఫీషియేటింగ్, కోచింగ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్‌పై సిలబస్ ప్రకటించారు. ఎస్జీటీ పోస్టులకు సిలబస్ * ఎస్జీటీ పోస్టులకు పార్టు - 1లో జనరల్ నాలెడ్జి, కరెంటు అఫైర్స్‌పై 10 మార్కులకు ప్రశ్నలుంటాయి. * పార్టు - 2లో శిశు అృవద్ధి, బోధన పద్ధతులపై 30 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి. పార్టు - 3లో తెలుగు, ఉర్దూ, హిందీ, తమిళ, కన్నడ, ఒరియా, సంస్కతం భాషల్లో అభ్యర్థి ఎంచుకున్న భాషలో సాహిత్యాంశాలు, బోధనాంశాలతో 35 మార్కులకు ప్రశ్నలిస్తారు. * పార్టు - 4లో ఇంగ్లిష్ గ్రామర్, బోధన పద్ధతులపై 35 మార్కులకు, పార్టు - 5లో గణితం సబ్జెక్టు, బోధన పద్ధతులపై 30 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి. * పార్టు - 6లో పర్యావరణ శాస్త్రం 1, 2 కింద సబ్జెక్టు బోదన పద్ధతులపై 40 మార్కులకు సిలబస్ ఇచ్చారు. ఇందులో జియోగ్రఫీ, హిస్టరీ, సివిక్స్, ఎకనమిక్స్ తదితర అంశాలను పొందుపరిచారు.