30 నుంచి దేహదారుఢ్య పరీక్షలు | Physical fitness tests from 30th | Sakshi
Sakshi News home page

30 నుంచి దేహదారుఢ్య పరీక్షలు

Published Fri, Dec 13 2024 5:53 AM | Last Updated on Fri, Dec 13 2024 5:53 AM

Physical fitness tests from 30th

పోలీసు నియామక మండలి వెల్లడి

సాక్షి, అమరావతి: పోలీస్‌ కానిస్టేబుల్‌ అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలను ఈనెల 30 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు నిర్వహించాలని రాష్ట్ర పోలీసు నియామక మండలి నిర్ణయించింది. రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ఈ దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తారు. 

కానిస్టేబుల్‌ పరీక్షల(స్టేజ్‌–2) కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ హాల్‌టికెట్లనువెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవా­లని పోలీసు నియామక మండలి గురువారం ఓ ప్రకటనలో సూచించింది. 

ఈ నెల 18వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుంచి 29వ తేదీ మధ్యాహ్నం 3 గంటల్లోపు డౌన్‌లోడ్‌ చేసుకోవాలని స్పష్టం చేసింది. సందేహాల నివృత్తి కోసం హెల్ప్‌లైన్‌ నంబర్లు 9441450639, 9100203323ను సంప్రదించాలని సూచించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement