physical fitness tests
-
‘ఖాకీ’ కొలువుల్లో ‘ఏజ్’ మెలిక!
చిత్తూరు అర్బన్: పోలీసు కానిస్టేబుల్ అభ్యర్థుల పట్ల కూటమి సర్కారు నిర్దయతో వ్యవహరిస్తోంది. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన పలువురిని దేహదారుఢ్య పరీక్షలకు అనుమతించకుండా తీరని అన్యాయం చేస్తోంది. రెండేళ్ల క్రితం ఇచ్చిన నోటిఫికేషన్నాటికి వారు వయసు రీత్యా కూడా అర్హులే. కానీ, కోర్టులో కేసు, ఎన్నికల కారణంగా దేహదారుఢ్య పరీక్షలు ఆగిపోయాయి. ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వెంటనే ఈవెంట్స్ పెట్టి, నియామకాలు చేపట్టకుండా ఆరు నెలలు సాగదీసి, ఇప్పుడు వయసు పెరిగిందంటూ అనేక మందిని ఇళ్లకు పంపేస్తోంది. వారి తప్పేమీ లేకపోయినా నిర్దయగా తిరస్కరిస్తోంది. దీంతో అభ్యర్థులు తీవ్ర ఆవేదనకు లోనవుతున్నారు. ఇదేమిటని అభ్యర్థులు అడిగితే తామేమీ చేయలేమని, ఏదైనా ఉంటే రిక్రూట్మెంట్ బోర్డుతో తేల్చుకోండని జిల్లా ఎస్పీలు చెబుతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం 2022లో రాష్ట్రవ్యాప్తంగా 411 ఎస్ఐ పోస్టులు, 6,100 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎస్ఐ పోస్టులకు ప్రిలిమ్స్, దేహదారుఢ్య పరీక్షలు పూర్తయ్యాయి. కానిస్టేబుల్ పోస్టులకు 5,03,487 మంది దరఖాస్తు చేసుకోగా 4,58,219 మంది ప్రిలిమ్స్ పరీక్షలకు హాజరయ్యారు. 2023 జనవరి 22న జరిగిన ప్రిలిమ్స్‌లో 91,507 మంది అర్హత సాధించారు. తమ సర్వీసును పరిగణనలోకి తీసుకోవాలంటూ హోంగార్డులు హైకోర్టును ఆశ్రయించడంతో ఈవెంట్స్ నిలిచిపోయాయి. తరువాత రాష్ట్రంలో ఎన్నికల కోడ్ వచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు నెలలు ఈ పోస్టులను పట్టించుకోలేదు. ప్రిలిమ్స్‌లో అర్హత పొందిన అభ్యర్థులంతా మళ్లీ ఆన్లైన్లో ఈవెంట్స్ కోసం దరఖాస్తు చేసుకోవాలని రెండు నెలల క్రితం ప్రకటించింది. రెండేళ్లుగా రన్నింగ్, హైజంప్‌పై దృష్టి సారించిన అభ్యర్థులు తుది ఈవెంట్స్‌కు సిద్ధమయ్యారు. అందరికీ కాల్ లెటర్లు వచ్చాయి. వారంతా చిత్తూరులో దేహదారుఢ్య పరీక్షలకు హాజరవుతున్నారు. నోటిఫికేషన్ నాటికి, ఇప్పటికి రెండేళ్లు గ్యాప్ వచ్చింది. దీంతో వయస్సు పైబడిందంటూ కొందరిని ఈవెంట్స్‌కు అనుమతించడంలేదు. వీరిని గ్రౌండ్లో ఓ పక్కన కూర్చోబెట్టి, ఈవెంట్స్ ముగిసిన తర్వాత వయసు పెరిగినందున మీరు అర్హులు కారంటూ ఓ కాగితం చేతిలో పెడుతున్నారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా వందలాది మంది ఉద్యోగార్హత కోల్పోయారు. రెండేళ్ల కిందట ఇచ్చిన నోటిఫికేషన్ సమయంలో తాము అర్హులమేనని, ఇప్పుడు కాదనడం అన్యాయమని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండేళ్లుగా కష్టపడి దేహదారుఢ్య పరీక్షలకు సిద్ధమైన తమను అనుమతించకపోవడం ఏమి న్యాయమని ప్రశ్నిస్తున్నారు. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు, రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేయాలని కోరుతున్నారు. లేదంటే కోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరిస్తున్నారు.ఇది దారుణం.. నోటిఫికేషన్ ఇచ్చేనాటికి నాకు ఏజ్ సరిపోయింది. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించి రెండేళ్లుగా ఈవెంట్స్ కోసం ప్రాక్టీస్ చేస్తున్నా. ఇప్పుడు వయస్సు పైబడి 33 రోజులైపోయింది, ఈవెంట్స్‌లో అనుమతించడం కుదరదని అంటున్నారు. ఇది దారుణం. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. లేకుంటే హైకోర్టును ఆశ్రయిస్తాం. – వి.రాజేష్, పుత్తూరు, తిరుపతి జిల్లా తప్పు మాదికాదు.. ప్రిలిమ్స్‌లో క్వాలిఫై అయ్యాక ఫిజికల్ ఈవెంట్స్‌కు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోమన్నారు. అప్పుడే ఏజ్ లేదని చెబితే సైలెంట్ అయిపోదుము. కానీ కాల్ లెటర్ కూడా పంపించి, ఇప్పుడు ఫిజికల్స్కు పంపబోమంటున్నారు. అసలు టైమ్‌లో ఈవెంట్స్ పెట్టకపోవడం మా తప్పా? బోర్డు తప్పా? – కె.కన్యాకుమారి, అనంతపురం ఏడాది ముందే పెట్టుంటే.. నాకు ఇప్పుడు 32 ఏళ్లు. ఫిజికల్ ఈవెంట్స్‌కు అనుమతించలేదు. అడిగితే ఏజ్ పైబడి ఏడాది అయ్యిందన్నారు. ఏడాది ముందే ఈవెంట్స్ పెట్టొచ్చు కదా? కాల్ లెటర్లు పంపిన ప్రతి ఒక్కరినీ ఈవెంట్స్‌కు అనుమతించాలి. – కె.దిలీప్‌కుమార్, శ్రీకాకుళం జిల్లా -
30 నుంచి దేహదారుఢ్య పరీక్షలు
సాక్షి, అమరావతి: పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలను ఈనెల 30 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు నిర్వహించాలని రాష్ట్ర పోలీసు నియామక మండలి నిర్ణయించింది. రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ఈ దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తారు. కానిస్టేబుల్ పరీక్షల(స్టేజ్–2) కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ హాల్టికెట్లనువెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని పోలీసు నియామక మండలి గురువారం ఓ ప్రకటనలో సూచించింది. ఈ నెల 18వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుంచి 29వ తేదీ మధ్యాహ్నం 3 గంటల్లోపు డౌన్లోడ్ చేసుకోవాలని స్పష్టం చేసింది. సందేహాల నివృత్తి కోసం హెల్ప్‌లైన్ నంబర్లు 9441450639, 9100203323ను సంప్రదించాలని సూచించింది. -
‘కానిస్టేబుల్’ పరీక్షలకు 1 నుంచి వెబ్సైట్లో కాల్‌లెటర్లు
సాక్షి, అమరావతి: పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకోసం దేహదారుఢ్య, మెయిన్ పరీక్షలకు కాల్ లెటర్లను మార్చి 1 నుంచి 10వ తేదీలోగా తమ వెబ్సైట్ slprb.ap.gov.in నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని పోలీసు నియామక మండలి సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్రంలో 6,100 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకోసం ప్రిలిమినరీ పరీక్షను జనవరిలో నిర్వహించారు. అందులో అర్హత సాధించిన అభ్యర్థులకు దేహదారుఢ్య, మెయిన్ పరీక్షలు నిర్వహించనున్నారు. దేహదారుఢ్య పరీక్షలను మార్చి 13 నుంచి నిర్వహించాలని పోలీసు నియామక మండలి సూత్రప్రాయంగా నిర్ణయించింది. మెయిన్ పరీక్షను ఏప్రిల్ మొదటివారంలో నిర్వహించాలని భావిస్తోంది. ఈ పరీక్షల తేదీలను పోలీసు నియామక మండలి త్వరలో అధికారికంగా ప్రకటించనుంది. -
TS: ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. వారందరికీ మరోసారి ఈవెంట్స్!
సాక్షి, హైదరాబాద్: యూనిఫాం సర్వీసెస్ కొలువుల భర్తీకి సంబంధించి తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి (టీఎస్ఎల్పీఆర్బీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులకు నిర్వహించిన ప్రాథమిక రాత పరీక్షల్లో బహుళ సమాధాన ప్రశ్నల (మల్టిపుల్ ఆన్సర్ క్వశ్చన్స్)కు సమాధానాలు రాసిన అభ్యర్థులకు మార్కులు కలపాలని, ఈ మేరకు అర్హులైన వారికి మరోమారు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ విషయంలో హైకోర్టు ఆదేశాలను అమలుచేస్తూ వచ్చే నెల 15 నుంచి ఫిజికల్ ఈవెంట్స్ నిర్వహించనున్నట్లు బోర్డు చైర్మన్ వీవీ శ్రీనివాసరావు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇలా అర్హత సాధించిన అభ్యర్థుల హాల్‌టికెట్ నంబర్లను సోమవారం www.tslprb.in వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నట్టు పేర్కొన్నారు. దరఖాస్తులు నింపండి.. ఇప్పుడు మార్కులు కలపడంతో అర్హత సాధించే అభ్యర్థులు ఆన్లైన్లో పార్ట్–2 దరఖాస్తును నింపాలని టీఎస్ఎల్పీఆర్బీ వెల్లడించింది. వీటిని నింపేందుకు ఫిబ్రవరి 1 ఉదయం 8 గంటల నుంచి ఫిబ్రవరి 5వ తేదీ రాత్రి 10 గంటల వరకు సమయం ఇవ్వనున్నట్టు తెలిపింది. ఇప్పటికే దేహదారుఢ్య పరీక్షల్లో (ఎస్సై లేదా కానిస్టేబుల్) అర్హత సాధించి, బోర్డు తాజా నిర్ణయంతో రాతపరీక్షలో అర్హత సాధించే అభ్యర్థులు కూడా మళ్లీ పార్ట్–2 దరఖాస్తు నింపాల్సి ఉంటుంది. అయితే, ఇప్పటికే దేహదారుఢ్య పరీక్షలకు హాజరై అర్హత సాధించలేకపోయిన అభ్యర్థులు.. ఇప్పుడు కొత్తగా మార్కులు కలపడం వల్ల రాతపరీక్షలో ఉత్తీర్ణులైనప్పటికీ వారికి మరో అవకాశం ఇచ్చేది లేదని పోలీస్ బోర్డు స్పష్టం చేసింది. వీరికి మాత్రమే ఫిజికల్ ఈవెంట్స్ గతంలో దేహదారుఢ్య పరీక్షల్లో పాల్గొనని, ఇప్పుడు మార్కులు కలిపితే కొత్తగా అర్హత సాధించే అభ్యర్థులకు మాత్రమే ఫిబ్రవరి 15 నుంచి దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించనున్నట్టు బోర్డు ఛైర్మన్ వివి శ్రీనివాసరావు వెల్లడించారు. హైదరాబాద్, సైబరాబాద్, వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్, నల్లగొండ, ఆదిలాబాద్‌ల్లో నిర్వహించనున్న ఈ ఫిజికల్ ఈవెంట్స్‌ను పదిరోజుల్లో పూర్తి చేస్తామని తెలిపారు. వీటి అడ్మిట్ కార్డులను ఫిబ్రవరి 8 ఉదయం 8 గంటల నుంచి ఫిబ్రవరి 10వ తేదీ రాత్రి 12 గంటల వరకు టీఎస్ఎలీ్పఆర్బీ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. డౌన్‌లోడ్‌లో ఏవైనా సమస్యలుంటే 9393711110, 9391005006 నంబర్లలో సంప్రదించవ్చని చెప్పారు. -
Warangal: పోలీస్ దేహదారుఢ్య పరీక్షల్లో అస్వస్థతకు గురైన అభ్యర్ధి మృతి
సాక్షి, వరంగల్: పోలీస్ దేహదారుఢ్య పరీక్షల్లో అస్వస్థతకు గురైన అభ్యర్థి బాణోత్ రాజేందర్ మృతి చెందారు. వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో అతడి మృతదేహాన్ని స్వగ్రామం ములుగు జిల్లా పందికుంట శివారు శివతాండకు తరలించారు. కాగా, శనివారం 1600 మీటర్ల పరుగు పందెంలో రాజేందర్ కుప్పకూలిపోయాడు. వెంటనే ఆస్పత్రిలో చేర్పించి వైద్యం అందించారు. రెండుసార్లు కార్డియాక్ అరెస్ట్ కావడంతో వైద్యులు రాజేందర్‌ను ఆర్ఎస్ఐసీయూ వార్డుకి తరలించి.. వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. అయితే పరిస్థితి విషమించడంతో సోమవారం అర్ధరాత్రి చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతుడికి భార్య సుజాత, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఉద్యోగం సాధించి కుటుంబానికి ఆసరాగా ఉంటాడనుకుంటే రన్నింగ్‌లో అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. చదవండి: (భర్త ఇంటికి లేటుగా వచ్చాడని.. బాత్రూమ్లోకి వెళ్లి యాసిడ్..) -
పోలీసు ఎంపికల్లో తల్లీ కూతుళ్ల తడాఖా
నేలకొండపల్లి : పోలీసు ఉద్యోగాల భర్తీకి నిర్వహిస్తున్న దేహ దారుఢ్య పరీక్షల్లో తల్లీకుమార్తెలిద్దరూ సత్తా చాటి ఎస్ఐ మెయిన్స్‌కు ఎంపికయ్యారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం చెన్నారానికి చెందిన తోళ్ల వెంకన్న భార్య నాగమణి, కుమార్తె త్రిలోకిని ఖమ్మంలో జరుగుతున్న పోలీసు ఈవెంట్స్‌కు బుధవారం హాజరయ్యారు. ఈ సందర్భంగా పరుగు పందెం, ఎత్తు కొలత, లాంగ్ జంప్, షాట్‌పుట్ ఇలా అన్ని ఈవెంట్లలో విజయం సాధించి తుది పరీక్షకు అర్హత సాధించారు. తోళ్ల వెంకన్న కుటుంబం చెన్నారం నుంచి జీవనోపాధి కోసం కొన్నేళ్ల క్రితమే ఖమ్మం జిల్లా కేంద్రానికి వెళ్లింది. తొలుత నాగమణి అంగన్వాడీ టీచర్‌గా ఖమ్మం బురహాన్‌పురంలో కొంతకాలం పనిచేశాక.. పదేళ్ల క్రితం జిల్లా కేంద్రంలో హోంగార్డుగా విధులు నిర్వర్తించారు. రెండేళ్ల క్రితం కానిస్టేబుల్‌గా ఎంపికైన ఆమె ప్రస్తుతం ములుగు జిల్లా కేంద్రంలో పనిచేస్తున్నారు. ఎస్ఐ కావాలన్న లక్ష్యంతో సాధన చేస్తుండగా, డిగ్రీ పూర్తి చేసిన నాగమణి కుమార్తె త్రిలోకిని కూడా పరీక్షలకు సిద్ధమయ్యారు. ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించి దేహ దారుఢ్య పరీక్షలకు హాజరైన వీరిద్దరు.. ఇందులోనూ సత్తా చాటి మెయిన్స్‌కు ఎంపికయ్యారు. ఇదీ చదవండి: షికారుకెళ్లి నరకయాతన.. బండరాళ్ల మధ్య చిక్కుకున్న యువకుడు -
పోలీస్కానిస్టేబుల్ ఎంపిక ప్రారంభం
మచిలీపట్నం : పోలీస్కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలు పోలీస్‌పెరేడ్ గ్రౌండ్లో సోమవారం ప్రారంభమయ్యాయి. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అభ్యర్థులు దేహదారుఢ్య పరీక్షలో ఎంపికయ్యేందుకు చెమటోడ్చారు. 1600 మీటర్లు, వంద మీటర్ల పరుగుపందెంలో ముందంజలో సాగేందుకు తమవంతు ప్రయత్నాలు చేశారు. 1600 మీటర్ల పరుగుపందెంకు ఎనిమిది నిమిషాల సమయం, 100 మీటర్ల పరుగుపందెంకు 15 సెక్షన్ల సమయం చొప్పున కేటాయించారు. లాంగ్‌జంప్ 3.8 మీటర్లుగా నిర్ణయించారు. గతంలో మాదిరిగా కాకుండా పరుగుపందెం పోటీలను సెన్సార్ ద్వారా ఎప్పటికప్పుడు రికార్డు చేశారు. అభ్యర్ధికి కేటాయించిన నెంబరు, సంబంధిత అభ్యర్ధి ఎంత సమయంలో పరుగుపందెంను పూర్తి చేశాడు, ఛాతీ కొలతలు, ఎత్తు తదితర వివరాలు సెన్సార్ ద్వారా కంప్యూటర్లో నిక్షిప్తమయ్యేలా ఏర్పాట్లు చేశారు. అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలను ఎస్పీ జి విజయకుమార్ దగ్గరుండి మరీ పర్యవేక్షించారు. 366 మంది అభ్యర్థులు హాజరు : పోలీస్కానిస్టేబుల్ పోస్టు కోసం సోమవారం నుంచి దేహదారుఢ్య పరీక్షలు ప్రారంభం కాగా సోమవారం 800 మంది అభ్యర్థులు హాజరుకావాల్సి ఉంది. 366 మంది అభ్యర్థులు ఈ పరీక్షలలో పాల్గొన్నారు. మరో 150 మందికి పైగా అభ్యర్థులు సర్టిఫికెట్లు తదితర వివరాలు సక్రమంగా లేకపోవటంతో వెనుతిరగాల్సి వచ్చింది. 1600 మీటర్ల పరుగుపందెంలో పోలీస్‌పెరేడ్ గ్రౌండ్లో నాలుగు రౌండ్లు పరిగెత్తాల్సి ఉంది. కొంత మంది అభ్యర్థులు పరిగెత్తలేక సొమ్మసిల్లిపడిపోయారు. వారికి పెరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన వైద్యశిబిరంలో వైద్యసేవలు అందించారు. విపత్కర పరిస్థితి ఎదురైతే అభ్యర్థులను ఆసుపత్రికి తరలించేందుకు 108ను సిద్ధంగా ఉంచారు. దేహదారుఢ్య పరీక్షలలో ఎంపికైన వారికి అప్పటికప్పుడే పాయింట్ల మెమోలను జారీ చేశారు. అభ్యర్థులు వారి సామాజిక వర్గాల వారిగా ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి సర్టిఫికెట్ల పరిశీలన చేశారు. -
ఫిజికల్ ఫిట్నెస్ పరీక్షలు ప్రారంభం
► కానిస్టేబుల్ అభ్యర్థులకు రెండో దశ పరీక్షలు ►ఒరిజినల్ సర్టిఫికెట్లు లేనివారు 6వ తేదీలోపు తీసుకొచ్చి హాజరు కావొచ్చు ►ఛాతి కొలతలో అనర్హత అరుుతే తిరిగి అప్పీలు చేసుకోవచ్చు ►దళారుల మాటలు విని మోసపోవద్దు ►పరీక్షలన్నీ పారదర్శకమే ►ఎస్పీ త్రివిక్రమ వర్మ ఒంగోలు క్రైం : పోలీసు కానిస్టేబుళ్లు, జైలు వార్డర్ల రెండో దశ పరీక్షల్లో భాగంగా స్థానిక పోలీసు పరేడ్ గ్రౌండ్లో గురువారం ఫిజికల్ ఫిట్నెస్ పరీక్షలు ప్రారంభించారు. పరీక్షలు ఎస్పీ డాక్టర్ సీఎం త్రివిక్రమ వర్మ పర్యవేక్షణలో జరిగాయి. పరీక్షలు ఈ నెల 6వ తేదీ వరకు కొనసాగుతాయి. మొదటి రోజు పరీక్షల్లో భాగంగా మొత్తం 840 మంది హాజరు కావాల్సి ఉంది. 644 మంది హాజరయ్యారు. ఫిజికల్ ఫిట్నెస్ పరీక్షల్లో భాగంగా జిల్లా పోలీసు యంత్రాంగం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసింది. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు క లగకుండా అన్ని వసతులు కల్పించింది. క్యాంటిన్ సౌకర్యంతో పాటు మంచినీటి వసతి, వైద్యం కోసం పత్యేకంగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చే సింది. ఫిజికల్ ఫిట్నెస్ పరీక్షల ప్రారంభం సందర్భంగా ఎత్తు కొలతలు, ఛాతి కొలతల నమోదును ఎస్పీ దగ్గరుండి పర్యవేక్షించారు. ఒరిజినల్ సర్టిఫికెట్లు తప్పనిసరి ఎస్పీ త్రివిక్రమవర్మ మాట్లాడుతూ అభ్యర్థులు కొంతమంది ఒరిజినల్ సర్టిఫికెట్లు లేకుండా ఫిజికల్ ఫిట్నెస్ పరీక్షకు హజరయ్యారని, తప్పకుండా ఒరిజనల్ సర్టిఫికెట్లు తీసుకొస్తేనే పరీక్షలకు అనుమతిస్తామన్నారు. అలాంటి వారికి కొంత వెసులుబాటు కల్పించామని, ఫిట్నెస్ పరీక్షల చివరి రోజు అంటే ఈ నెల 6వ తేదీ లోపు ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకొని హాజరు కావచ్చన్నారు. ఈ అవకాశాన్ని అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఒరిజనల్ సర్టిఫికెట్లు తీసుకురాకుంటే ఎలాంటి పరిస్థితుల్లో అనుమతించేది లేదని తేల్చి చెప్పారు. అన్ని పరీక్షలు సాంకేతిక పరిజ్ఞానంతో నిర్వహిస్తున్నామన్నారు. ఒక్క లాంగ్ జంప్ మాత్రం మాన్యువల్‌గా నమోదు చేస్తున్నామని చెప్పారు. అక్కడ కూడా అభ్యర్థులకు వచ్చిన పాయింట్లు వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లోడ్ చేస్తామన్నారు. ఎత్తు కొలత, ఛాతి కొలత కూడా ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారానే చూస్తున్నామని వివరించారు. పరుగు పందేలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా సెన్సార్ వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. మానవ తప్పిదాలకు ఆస్కారం లేకుండా చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నామని తెలిపారు. ఎత్తు కొలతల్లో అర్హత కోల్పోతే అలాంటి వారిని నచ్చజెప్పి పంపిస్తున్నామన్నారు. ఛాతి కొలతల్లో ఊపిరి పీల్చినప్పుడు తగ్గి అనర్హత పొందితే అలాంటి అభ్యర్థులు తిరిగి అప్పీలు చేసుకోవచ్చని, దీనిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రెండో దశ పరీక్షలు పారదర్శకంగా నిర్వహిస్తున్నామని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రతిభే ఆధారం దళారులు రంగంలోకి దిగి కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెబుతున్నారని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఎస్పీ త్రివిక్రమ వర్మ సమాధానం ఇస్తూ అలాంటి వారి మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. ప్రతిభే ఆధారంగా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దళారులపై తనకు ఫిర్యాదు చేయాలన్నారు. ిఫిట్‌నెస్ పరీక్షలను ఇన్చార్జి అదనపు ఎస్పీ ఏ.దేవదానం, ఏఆర్ ఏఎస్పీ టి.శివారెడ్డిల పర్యవేక్షణలో జరుగుతున్నాయి. మొదటి దశలో 189 మంది అర్హత... రెండో దశ అభ్యర్థుల ఎంపిక ఫిట్నెస్ పరీక్షలో మొదటి రోజు 189 మంది అర్హత సాధించారు. ఫిజికల్ మెడికల్ టెస్ట్‌లో 157 మంది అనర్హత పొందారు. వారిలో ఎత్తు తక్కువ ఉన్న వారు, ఛాతి పీల్చినప్పుడు, సాధారణంగా ఉన్నప్పుడు నిబంధనల ప్రకారం కొలతలు చాలని వారు ఉన్నారు. 1,600 మీటర్ల పరుగు పందెంలో 21 మంది అనర్హత పొందారు. సర్వర్ సమస్యతో 277 మందికి ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించలేదు. వారికి ఈ నెల 7వ తేదీన నిర్వహించాలని ఎస్పీ నిర్ణరుుంచారు. ఫిజికల్ ఫిట్‌నెస్‌లో పది చోట్ల పరిశీలన కానిస్టేబుళ్ల ఎంపిక కోసం రెండో దశ పరీక్షల్లో భాగంగా ఫిజికల్ ఫిట్నెస్ టెస్టుల నిర్వహణ కోసం వచ్చే అభ్యర్థులు పది చోట్లకు హాజరు కావాల్సి ఉంది. ఆ ప్రాంతాల్లో సర్టిఫికేట్ల పరిశీలన, ఫిట్నెస్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా పోలీసు సిబ్బందిని ఎక్కడికక్కడ నియమించారు. ఎస్పీ డాక్టర్ సీఎం త్రివిక్రమవర్మ సారథ్యంలో ఇద్దరు ఏఎస్పీలు, దాదాపు ఏడుగురికిపైగా డీఎస్పీల పర్యవేక్షణలో పరిశీలనలు జరుగుతున్నారుు. మొదటి దశలో ఫిజికల్ ఫిట్నెస్ పరీక్షకు వచ్చిన అభ్యర్థులను నగరంలోని కర్నూల్ రోడ్డు బైపాస్ ఫ్లరుు ఓవర్‌కు ఆనుకొని ఉన్న జిల్లా పోలీసు కార్యాలయం ప్రధాన గేటు వద్ద రిసెప్షన్ ఏర్పాటు చేశారు. అభ్యర్థులకు ముందుగా హాల్ టెక్కెట్లలో ఇచ్చిన సమయం ప్రకారం అందరినీ సరిచూసి ఆ సమయంలో ఎంతమంది ఉంటే అంత మందినీ లోపలికి పంపిస్తారు. లోనికి వెళ్లిన తర్వాత బ్యాచీలుగా విడగొట్టి పదుల సంఖ్యలో చేసి రెండో దశ పరిశీలనకు పంపుతారు రెండో దశలో మాన్‌డేటరీ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేస్తారు. అక్కడ సర్టిఫికేట్లన్నింటినీ పరిశీలించి హాల్‌టిక్కెట్ ఆధారంగా, ఒరిజనల్ సర్టిఫికెట్లు సరి చూస్తారు. ఆ తర్వాత బయో మెట్రిక్ వెరిఫికేషన్ ఉంటుంది. హాల్ టిక్కెట్లోని బార్ కోడ్ ఆధారంగా వేలిముద్రలు సరి చూస్తారు. అంటే అభ్యర్తి కచ్చితంగా అతనేనని తేల్చేస్తారు. ఒకరి స్థానంలో మరొకరు రాకుండా ఇక్కడ ఫిల్టర్ చేస్తారు. ఇక్కడి నుంచి అంతా ఆన్లైన్లోనే... 4 అక్కడ నుంచి ఫిజికల్ మెజర్మెంట్ కౌంటర్‌కు చేరుకోవాలి. అక్కడ ఎస్పీ స్వయంగా కూర్చొని ఎత్తు, ఛాతి కొలతలను సాంకేతిక పరిజ్ఞానం ద్వారా పరీక్షిస్తారు. 4 అక్కడి నుంచి 1,600 మీటర్ల (ఒక కిలో మీటర్) పరుగు పందేనికి సన్నద్ధం కావాలి. పరుగు పందెంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సెన్సార్ సిస్టంను అభ్యర్థులకు కేటారుుంచిన నంబరు వెనుక, ఛాతీకి ఆనుకునే విధంగా అమరుస్తారు. సమయం, స్పీడు అన్నీ ఆన్లైన్ ద్వారానే రికార్డు అవుతారుు. 4 అనంతరం సర్టిఫికెట్ల స్కానింగ్, ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారు. 4 ఆ తర్వాత 100 మీటర్ల పరుగు పందెం నిర్వహిస్తారు. 4 ఆ తర్వాత లాంగ్ జంప్ ఉంటుంది. ఇందుకోసం మూడు ట్రాక్‌లు ఏర్పాటు చేశారు. ఇక్కడ దూకిన దూరాన్ని ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ (పీఈటీ)ల ద్వారా కొలతలు తీరుుంచి ఆన్లైన్లో వెంటనే అప్లోడ్ చేస్తారు. 4 ఇక్కడ డాటా ఎడిటింగ్ ఉంటుంది. ఆన్లైన్ ఏమైనా పొరపాట్లు దొర్లినా, అభ్యర్థుల పేర్లు, మరేమైనా జరిగితే వెంటనే సరిచేస్తారు. సవరణలు చేపడతారు. 4 అన్ని పరీక్షల్లో వచ్చిన పారుుంట్లు, మార్కులు సరి చూసి రిజల్ట్ ఇక్కడ ఫైనల్ చేస్తారు.