
నేలకొండపల్లి : పోలీసు ఉద్యోగాల భర్తీకి నిర్వహిస్తున్న దేహ దారుఢ్య పరీక్షల్లో తల్లీకుమార్తెలిద్దరూ సత్తా చాటి ఎస్‌ఐ మెయిన్స్‌కు ఎంపికయ్యారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం చెన్నారానికి చెందిన తోళ్ల వెంకన్న భార్య నాగమణి, కుమార్తె త్రిలోకిని ఖమ్మంలో జరుగుతున్న పోలీసు ఈవెంట్స్‌కు బుధవారం హాజరయ్యారు. ఈ సందర్భంగా పరుగు పందెం, ఎత్తు కొలత, లాంగ్ జంప్, షాట్‌పుట్ ఇలా అన్ని ఈవెంట్లలో విజయం సాధించి తుది పరీక్షకు అర్హత సాధించారు.
తోళ్ల వెంకన్న కుటుంబం చెన్నారం నుంచి జీవనోపాధి కోసం కొన్నేళ్ల క్రితమే ఖమ్మం జిల్లా కేంద్రానికి వెళ్లింది. తొలుత నాగమణి అంగన్‌వాడీ టీచర్‌గా ఖమ్మం బురహాన్‌పురంలో కొంతకాలం పనిచేశాక.. పదేళ్ల క్రితం జిల్లా కేంద్రంలో హోంగార్డుగా విధులు నిర్వర్తించారు. రెండేళ్ల క్రితం కానిస్టేబుల్‌గా ఎంపికైన ఆమె ప్రస్తుతం ములుగు జిల్లా కేంద్రంలో పనిచేస్తున్నారు. ఎస్‌ఐ కావాలన్న లక్ష్యంతో సాధన చేస్తుండగా, డిగ్రీ పూర్తి చేసిన నాగమణి కుమార్తె త్రిలోకిని కూడా పరీక్షలకు సిద్ధమయ్యారు. ఎస్‌ఐ ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించి దేహ దారుఢ్య పరీక్షలకు హాజరైన వీరిద్దరు.. ఇందులోనూ సత్తా చాటి మెయిన్స్‌కు ఎంపికయ్యారు.
ఇదీ చదవండి: షికారుకెళ్లి నరకయాతన.. బండరాళ్ల మధ్య చిక్కుకున్న యువకుడు
Comments
Please login to add a commentAdd a comment