mother and daughter
-
ఆస్పత్రికి వెళ్తూ.. అనంత లోకాలకు
పహాడీషరీఫ్: అనారోగ్యంతో ఉన్న కూతురుకు చికిత్స చేయించేందుకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు వెంటాడింది. ఈ ప్రమాదంలో మృతి చెందిన తల్లీకూతుళ్లు చివరకు అదే ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం విగతజీవులుగా వెళ్లాల్సి వచ్చింది. ఈ హృదయ విదారక ఘటన పహాడీషరీఫ్ ఠాణా పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని తిమ్మరాసిపల్లికి చెందిన చిత్తారి గోపాల్(36), లక్ష్మమ్మ(34) దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు సంతానం.వీరి పెద్ద కూతురు విజయ(14)కు రక్తకణాలు తక్కువగా ఉండడంతో చికిత్స నిమిత్తం ఉదయం 7.30గంటలకు వారిబైక్పై హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి బయలుదేరారు. ఉదయం 9.45గంటల సమయంలో తుక్కుగూడ ఓఆర్ఆర్ బ్రిడ్జి సమీపంలోకి రాగానే వెనుక ఉంచి వస్తున్న టిప్పర్ డ్రైవర్ ఒక్కసారిగా శంషాబాద్ టోల్ వైపునకు వాహనాన్ని మళ్లించాడు. ఈ క్రమంలో టిప్పర్ బైక్‌ను ఢీకొట్టడంతో పడిపోయిన లక్ష్మమ్మ, విజయ తల మీదుగా లారీ వెనుక చక్రాలు వెళ్లడంతో తల్లీకూతురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. గోపాల్ కాలు, చేతులకు తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నారు. -
ఆ తల్లీ కూతుళ్లకి అందుకే అంత ధైర్యం..!
ధైర్యంగా ఉండమని చెప్పడం అందరూ చేసే పనే. ధైర్యాన్ని ప్రదర్శించడం కొందరు చేసేది. ప్రమాదంలోనూ ధైర్యాన్ని చూపడం అతి కొద్ది మందే చేస్తారు. ఆ అతి కొద్దిమందిలోనూ మేటిగా నిలుస్తున్నారు హైదరాబాద్‌లోని బేగంపేట వాసులైన ఈ తల్లీ కూతుళ్లు. ఇంట్లోకి అకస్మాత్తుగా చొరబడిన ఆగంతకులపైకి చిరుతపులుల్లా విరుచుకుపడ్డారు. మారణాయుధాలతో బెదిరించినా ఆత్మస్థైర్యాన్ని బెదరనివ్వలేదు. ఇద్దరు దండుగులను తరిమి తరిమి కొట్టిన తల్లి అమిత మెహోత్. తల్లిని కాపాడుకునేందుకు దుండగులతో వీరోచితంగా పోరాడిన కూతురు బాబీ. దుండగులు ఎలా ఎప్పుడు ఎక్కడ నుంచి వస్తారో, ఎలా దాడి చేస్తారో మనం ఊహించలేం. అకస్మాత్తుగా ఎదురయ్యే ప్రమాదాలను ఎలా ఎదుర్కోవాలో తెలియక ధనాన్నే కాదు ప్రాణాలను సైతం కోల్పోయేవారెందరో. కానీ, ప్రాణాలను కూడా లెక్క చేయకుండా దుండగుల దుశ్చర్యను క్షణమాత్రంలోనే గుర్తించి, ఆ వెంటనే తమ స్థైర్యాన్ని చూపి నేడు ఎంతో మంది ప్రశంసలు అందుకుంటున్నారు అమిత, బాబీ. స్త్రీలు సబలలు అని నిరూపించిన ఈ వనితలు నేడు ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తున్నారు. ‘‘ఎప్పుడో ప్రాక్టీస్ చేసిన బాక్సింగ్‌తో పాటు 15 ఏళ్లుగా చేస్తున్న జిమ్ వ్యాయామాలు, వీటికి తోడు మార్షల్ ఆర్ట్స్‌పై అవగాహన.. ఇవన్నీ దుండగులు తుపాకీ గురి పెట్టినా ఏమాత్రం బెదరక ధైర్యంగా నిలబడేలా చేశాయి. దోచుకోవడానికి వచ్చిన వారిని తరిమి కొట్టేలా చేశాయి’’ అని తెలిపింది నలభై ఆరేళ్ల అమిత. ఊహించని విధంగా ఆ తల్లీకూతుళ్ల నుంచి ప్రతిఘటన ఎదురవడంతో దుండగులు కాళ్లకు బుద్ధి చెప్పాల్సి వచ్చింది. కొరియర్ బాయ్స్ వేషంలో.. ఆన్లైన్ అమ్మకాలు పెరిగాక కొరియర్ బాయ్స్ మన ఇళ్ల ముందుకు వస్తుంటారు. వారి గురించి మనకేవిధంగానూ తెలియదు. అలాగని, కొరియర్ వారంతా ప్రమాదకారులే అని మనం చెప్పలేం. కానీ, ఒక్కోసారి సమస్య ఈ విధంగానూ మనల్ని పలకరించవచ్చు అని గ్రహించాలి అనడానికి గురువారం మధ్యాహ్నం జరిగిన ఈ సంఘటన మన కళ్లకు కడుతుంది. ‘‘మా ఇంటి గుమ్మానికి, ప్రధాన గేటుకు 200 ఫీట్ల దూరం ఉంటుంది. కొరియర్బాయ్స్ ఎవరొచ్చినా గేటు బయటనే ఉండి పిలుస్తారు. గురువారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో బ్యాగ్‌తో ఇద్దరు వ్యక్తులు వచ్చారు. ఒకరు హెల్మెట్ ధరించి ఉండగా మరొకరు మాస్క్ ధరించి ఉన్నారు. నేను మొదటి అంతస్తులోనే ఉండి కొరియర్ వివరాలు అడిగాను. అమిత (నా పేరు), ఎన్‌కె జైన్ (నా భర్త) పేర్లు చెప్పి కొరియర్ వచ్చిందని చెప్పారు. అక్కడే ఉండాలని, వచ్చి తీసుకుంటామని చెప్పాను. నేను కిందికి వచ్చేసరికి గేటు లోపలి నుంచి గుమ్మం వద్దకు వచ్చేశారు. ఎదుర్కొని .. కనిపెట్టి.. బ్యాగ్‌లో నుంచి కొరియర్ పార్శిల్ తీస్తున్నట్లుగా తీసి ఒకరు తపంచా (నాటు తుపాకీ)తో నాపై ఎక్కుపెట్టాడు. మరొకరు నన్ను తోసుకుంటూ లోపలికి వచ్చి కిచెన్ లో ఉన్న పనిమనిషి మెడపై కత్తి పెట్టాడు. నా అరుపులకు మొదటి అంతస్తులో ఉన్న కుమార్తె కూడా వచ్చింది. మాపై అటాక్ చేస్తుండగా మేం కూడా తిరిగి అటాక్చేశాం. ఇద్దరం కలిసి ఆ వ్యక్తి చేతులను గట్టిగా పట్టుకుని వెనక్కి తిప్పి, తపంచాను లాగేసుకున్నాం. దీంతో అచేతనుడైన ఆ వ్యక్తి వెంట తెచ్చుకున్న తాళ్లతో మమ్మల్ని కట్టేసేందుకు ప్రయత్నించగా, ఎదురుతిరిగాం. దాదాపు 20 నిమిషాల సేపు ఘర్షణ జరిగింది. చివరకు ఆ వ్యక్తి పారిపోయే ప్రయత్నం చేశాడు. మమ్మల్ని బలవంతంగా తోసుకుంటూ బయటకు వచ్చేసిన వ్యక్తిని పట్టుకునేందుకు మేము ఎంతగానో వెంబడించాం. ఆ వ్యక్తి పారిపోయాడని తెలుసుకుని కిచెన్ లో ఉన్న మరో వ్యక్తి ఎక్కడ దొరికిపోతాడో అని ఆందోళనపడ్డాం. అతను కూడా పారిపోయేందుకు కత్తితో బెదిరిస్తూ బయటకు వచ్చాడు. మా అరుపులకు ఈ లోగా స్థానికులు రావడంతో అతన్ని పట్టుకోగలిగాం. తెలిసిన వారే అయ్యుంటారని మేం వారు ధరించిన హెల్మెట్, మాస్క్‌ను తీసేయడంతో వారెవరో కనిపెట్టగలిగాం. కిందటేడాది దీపావళి సమయంలో పది రోజులపాటు మా ఇంటి క్లీనింగ్ విషయంలో ఓ ఏజెన్సీని సంప్రదిస్తే, వారు పంపించిన వ్యక్తులే వీళ్లు. మా ఇంటిని క్లీన్ చేసే సమయంలో ఏయే వస్తువులు ఎక్కడ ఉన్నాయో గమనించి, ఇంట్లో ఆడవాళ్లం మాత్రమే ఉండే సమయం చూసి, ఇలా దొంగతనం చేయడానికి ప్లాన్ చేసుకున్నారని తెలిసింది. మేం ఎదురు తిరగడంతో వచ్చిన పని గురించి కాకుండా మేము తమ ముఖాలను చూడకుండా కాపాడుకునేందుకే ఎక్కువ ప్రయత్నం చేశారు. ఆ ధైర్యం ఎలా వచ్చిందంటే.. గతంలో ఐదేళ్లు బాక్సింగ్ ప్రాక్టీస్ చేశాను. రోజూ జిమ్‌కు వెళ్తుంటాను. మార్షల్ ఆర్ట్స్‌పై కూడా అవగాహన ఉంది. అవే నన్ను ధైర్యంగా ఉండేలా, సాహసం చూపేలా చేశాయి. ఎదురొచ్చిన విపత్తు నుంచి కాపాడేలా చేశాయి. ఒక తపంచా, రెండు కత్తులు, తాళ్ల సహాయంతో వారు మమ్ముల్ని లొంగదీసుకునేందుకు చేయని ప్రయత్నమంటూ లేదు. వారి ప్రతి చర్యను తిప్పికొట్టగాలిగామంటే బాక్సింగ్, ఫిట్నెస్లే కారణమని కచ్చితంగా చెప్పగలను’’ అని తామ ఎదుర్కొన్న సంఘటనను వివరించారు అమిత. ఈ తల్లీకూతుళ్లు దుండగులను ధైర్యంగా ఎదుర్కొన్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ఈ ఘటన తర్వాత అమిత, ఆమె భర్త, స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. డీసీపీ ప్రశంసలు.. సన్మానం.. అమిత, ఆమె కుమార్తె బాబీ ఇద్దరూ చూపిన ధైర్యసాహసాలు ఆదర్శప్రాయం అని నార్త్‌జోన్ డీసీపీ రోహిణి ప్రియదర్శిని అన్నారు. బేగంపేట పైగా కాలనీలోని అమిత నివాసానికి నేరుగా వచ్చిన డీసీపీ అమితతో పాటు ఆమె కుమార్తెనూ ప్రశంసించి, శాలువాతో సత్కరించారు. మైనర్ బాలిక అయినా ఆమె చూపిన తెగువ ఎంతో అభినందనీయమన్నారు. ఆత్మరక్షణకై మెలకువలు అవసరం మహిళలు ఆత్మరక్షణ దిశగా మెలకువలను నేర్చుకోవాలి. ఇప్పుడు నా జీవితంలో ఎదురైన అనుభవం లాగా ఎవరి జీవితాల్లోనూ రాకూడదని కోరుకుంటాను. ఒకవేళ వస్తే మాత్రం అందుకు సిద్ధంగా ఉండాలి. ధైర్యంగా ముందడుగు వేయాలి. – అమిత – కోట కృష్ణారావు, సాక్షి, హైదరాబాద్ -
దొంగలొస్తే.. దొరకబుచ్చుకుని..
సనత్‌నగర్ (హైదరాబాద్): ఇద్దరు దుండగులు ఓ ఇంట్లోకి చొరబడ్డారు. తపంచా (నాటు తుపాకీ), కత్తి చూపించి తల్లీకూతుళ్లను బెదిరించి, దోపిడీకి ప్రయత్నించారు. కానీ వారు దుండగులను ధైర్యంగా ఎదుర్కొన్నారు. ఒకరిని గదిలో బంధించారు. మరొకరిని పట్టుకునేందుకు ప్రయత్నించినా, పరారయ్యాడు. ఈ ఘటన సీసీ కెమెరాల్లో రికార్డయింది. హైదరాబాద్‌లోని బేగంపేట పైగాకాలనీలో గురువారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. పోలీసులు, బాధితులు చెప్పిన వివరాల మేరకు.. మాస్్క, హెల్మెట్ పెట్టుకుని.. బేగంపేట పైగాకాలనీకి చెందిన నవరతన్ జైన్, అమిత్ మహోత్ (46) భార్యాభర్తలు. వారికి ఒక మైనర్ కుమార్తె ఉంది. గురువారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో నవరతన్ ఇంట్లో లేని సమయంలో.. ఇద్దరు దుండగులు ఆ ఇంట్లోకి చొరబడ్డారు. ముఖాలు కనిపించకుండా ఒకరు మాస్క్, మరొకరు హెల్మెట్ పెట్టుకున్నారు. తమ వెంట తెచ్చుకున్న తపంచా (నాటు తుపాకీ), కత్తి చూపించి.. ఇంట్లోని నగలు, నగదును తీసుకురావాలని, లేకుంటే చంపేస్తామని బెదిరించారు. అమిత అరుపులతో ఇంట్లోనే ఉన్న ఆమె మైనర్ కుమార్తె ధైర్యంగా ముందుకొచ్చింది. తల్లీకూతురు కలిసి దుండగులతో పెనుగులాడారు. ఈ క్రమంలో వారి నుంచి నాటు తుపాకీని అమిత లాగేసుకుంది. అప్పటికే తల్లీకూతురు కలసి ఒకరిని లోపల బంధించారు. మరొకరు పారిపోతుండగా.. వెంటపడి పట్టుకునేందుకు ప్రయత్నించారు. కానీ ఆ వ్యక్తి వారిని నెట్టేసి పరారయ్యాడు. లోపల బంధించిన రెండో వ్యక్తి కూడా బయటపడి కత్తితో బెదిరిస్తూ, పారిపోయే యత్నం చేశాడు. అప్పటికే అక్కడికి చేరుకున్న స్థానికులు అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. గతంలో పనిచేసిన వ్యక్తే.. ఆ ఇంట్లో గతంలో క్లీనింగ్ పనులు చేసిన ప్రేమ్‌చంద్, అతడి స్నేహితుడు సుశీల్‌కుమార్ కలసి ఈ దోపిడీ యత్నానికి పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. వీరిలో ప్రేమ్‌చంద్‌ను స్థానికులు పట్టుకోగా.. పరారైన సుశీల్‌కుమార్‌ను పోలీసులు కాజీపేటలో అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. వారి నుంచి రెండు కత్తులు, తపంచా (నాటు తుపాకీ)లను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. దుండగులు మారణాయుధాలతో వచ్చినా తల్లి, కుమార్తె భయపడకుండా ఎదుర్కోవడంపై పోలీసులు, ప్రజల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. -
ఆ విమానంలో ఇద్దరే ప్రయాణికులు! అదికూడా..
విమానంలో వెళ్తున్నప్పుడూ మనం మాత్రమే ఉండి మిగతా ప్రయాణికులు లేకపోతే ఆశ్చర్యంగా ఉంటుంది కదు. అందులోనూ విమానంలో అలా జరిగితే మాములుగా అనిపించదు. అదికూడా కేవలం మన కోసమే ఏదో కారు బుక్ చేసుకున్నట్లు విమానంలో వెళ్తున్నామా! అనిపిస్తుంది. అదికూడా విమానంలో ప్రయాణిస్తున్నప్పుడే తెలిస్తే ఆ ఆనందం వేరే లెవెల్లో ఉంటుంది కదా! అలాంటి ఘటనే ఇక్కడ స్విట్జర్లాండ్‌కు వెళ్తున్న ఎమిరేట్స్ విమానంలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..సీషెల్స్ నుంచి స్విట్జర్లాండ్‌కి వెళ్తున్న ఎమిరేట్స్ మిమానంలో ఇద్దరే ప్రయాణికులు. 25 ఏళ్ల జో డోయల్, ఆమె తల్లి 59 ఏళ్ల కిమ్మీ చెడెల్ మాత్రమే ఆ విమానంలో ప్రయాణిస్తున్నారు. మిగతా సీట్లన్నీ ఖాళీగా ఉన్నాయి. వారిద్దరు ఎకనామీ క్లాస్ క్యాబిన్లో ఉన్నారు. ఫ్లైట్ జర్నీ చేసేంతవరకు తామిద్దరమే ప్రయాణికులని వారివురికి తెలియదు. దీంతో ఒక్కసారిగా ఆ తల్లికూతుళ్ల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. అయితే బిజినెస్ క్లాస్‌లో నలుగురు ప్రయాణికులు ఉన్నారు గానీ వాళ్లు ప్రయాణిస్తున్న ఎకనామీ క్లాస్‌లో మాత్రం లేరు. తాము మాత్రమే ఫ్లైట్‌లో జర్నీ చేస్తున్నామని తెలిసి ఆనందంగా ఆ విమానంలో ఉన్న ఫ్లైట్ అటెండెంట్లతో చాట్ చేస్తూ గడిపామని టిక్‌టాక్‌లో వెల్లడించింది జో డోయల్. "ఈ రోజు ఎమిరేట్స్ విమానంలో ఎగురుతున్న ఏకైక మహిళలు మేమే" అని క్యాప్షన్ పెట్టి మరీ వీడియో పోస్ట్ చేసింది. బహుశా క్రిస్మస్‌టైం, పైగా సీషెల్స్‌లో వర్షాకాలం కావడంతో ప్రయాణికులు లేరని చెప్పుకొచ్చింది. ఇద్దరే విమానంలో ప్రయాణించడం చాలా ఆనందంగా ఉందని రాసింది. ఇలాంటి ఘటన జరగడం తొలిసారి కాదు. గతంలోనూ ఇలాంటి సంఘటనలు రెండు జరిగాయి. వారు కూడా ఇలానే సంబరపడ్డారు. పైగా ఏదో ప్రైవేట్ జెట్‌లో ప్రయాణిస్తున్న ఫీల్ కలిగిందని వారు చెప్పుకొచ్చారు కూడా. (చదవండి: మిసెస్ ఇండియాగా 55 ఏళ్ల మహిళ! గెలుపుకి ఏజ్‌తో పనిలేదని ప్రూవ్ చేసింది!) -
తల్లీకూతుళ్లు రోడ్డు దాటుతుండగా.. దూసుకొచ్చిన మృత్యువు!
మంచిర్యాల: కొత్త సంవత్సరం సందర్భంగా ప్రార్థనల్లో చర్చికి వెళ్తున్న తల్లీకూతురుపైకి లారీ మృత్యువు రూపంలో దూసుకువచ్చింది. జాతీయ రహదారి దాటుతుండగా ఇద్దరినీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడిక్కడే దుర్మరణం చెందారు. ఈ విషాద ఘటన కాసిపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని కల్వరి చర్చి సమీపంలో ఆదివారం రాత్రి జరిగింది. మందమర్రి సీఐ మహేందర్‌రెడ్డి కథనం ప్రకారం.. జిల్లాలోని నస్పూర్‌కు చెందిన వేల్పుల నిర్మల(44), వేల్పుల స్వాతి(21) ప్రార్థనల కోసం కాసిపేట సమీపంలోని కల్వరి బయల్దేరారు. చర్చి సమీపంలో రాత్రి వాహనం దిగి రోడ్డు దాటుతుండగా మందమర్రి నుంచి బెల్లంపల్లి వైపునకు వెళ్తున్న బొలేరో వ్యాన్ వేగంగా దూసుకొచ్చి ఢీకొట్టింది. ఈ చర్చి సమీపంలోనే ఘటన జరుగడంతో స్థానికులు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. కొన ఊపిరితో కొట్టుకుంటున్న వారిని 108లో బెల్లంపల్లి ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఇద్దరూ మృతిచెందినట్లు తెలిపారు. మృతుల వద్ద ఉన్న బ్యాగ్‌లో లభించిన ఆధార్‌కార్డు ఆధారంగా మృతులు నస్పూర్‌కు చెందిన వారిగా గుర్తించారు. ఇదిలా ఉండగా ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదైనట్లు సీఐ తెలిపారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇవి చదవండి: ఆర్టీసీ బస్సు, డీసీఎం ఘోర రోడ్డు ప్రమాదం! పొగ మంచు, అతివేగమే కారణమా? -
రోడ్డు ప్రమాదంలో తల్లీకూతుళ్లు మృతి
చెరుకుపల్లి: గుర్తు తెలియని వాహనం ఢీకొని తల్లీకూతుళ్లు దుర్మరణం పాలైన ఘటన ఆరుంబాక గ్రామంలో విషాదఛాయలు నింపింది. స్థానికుల కథనం ప్రకారం చెరుకుపల్లి మండలం ఆరుంబాక గ్రామానికి చెందిన న్యాయవాది కర్రా ప్రతాప్ భార్య కర్రా విజయ కుమారి(43), కుమార్తె ఆశ్రిత(20)శుక్రవారం తెల్లవారుజామున నడుచుకుంటూ చర్చికి వెళ్తుండగా చెరుకుపల్లి హైవేపై గుర్తుతెలియని వాహనం ఢీకొంది. తీవ్రంగా గాయపడిన విజయకుమారి, ఆశ్రితను స్థానికులు చెరుకుపల్లిలోని వైద్యశాలకు తరలించారు. అయితే అప్పటికే ఇద్దరూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఘటనా స్థలాన్ని ఎస్ఐ వై.సురేష్ పరిశీలించి కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరామర్శించిన ఎంపీ మోపిదేవి ప్రమాద విషయాన్ని తెలుసుకున్న రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణారావు మృతదేహాలను సందర్శించారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. అన్నివిధాలా అండగా ఉంటామని భరోసానిచ్చి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. మోపిదేవి వెంట ఎంపీపీ మత్తి దివాకర రత్నప్రసాద్, రాష్ట్ర గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ కామినేని కోటేశ్వరరావు, పలువురు వైఎస్సార్ సీపీ నాయకులు తదితరులు ఉన్నారు. -
భద్రాద్రి వీడియో.. కళ్లముందే కొట్టుకుపోయారు
ములకలపల్లి: వరినాట్లు వేసేందుకు వెళ్లి తిరిగి వస్తూ తల్లీకూతుళ్లు వాగులో కొట్టుకు పోయారు. కుమార్తె క్షేమంగా బయటపడగా, తల్లి మాత్రం గల్లంతయ్యింది. వివరాలు ఇలా ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కుమ్మరి పాడు గ్రామానికి చెందిన సుమారు 20 మంది మహిళల బృందం బుధవారం చాపరాల పల్లిలో వరినాట్లు వేశారు. తిరిగి వెళ్లే సమయంలో గ్రామ శివారులోని పాములేరు వాగు లోలెవల్ చప్టాపై ఉధృతంగా ప్రవహిస్తోంది. ఇంటికి చేరాలనే ఆత్రుతతో అందరూ గుంపులుగా చేతులు పట్టుకుని వాగు దాటే ప్రయత్నం చేశారు. అయితే మధ్యలో వరద ధాటికి తల్లీకూతుళ్లైన కుంజా సీత, కుర్సం జ్యోతి కొట్టుకుపోయారు. వరద ఉధృతితో సహచర కూలీలు వారిని రక్షించలేకపోయారు. కాసేపటికి జ్యోతి ఓ చెట్టు కొమ్మను పట్టుకుని ఉండగా స్థానికులు కాపాడారు. సీత జాడ మాత్రం రాత్రి వరకు లభించలేదు. ತೆಲಂಗಾಣದ ಭದ್ರಾದ್ರಿ ಕೊತ್ತಗುಡ್ಡಂ ಜಿಲ್ಲೆಯ ಮುಲಕಪಲ್ಲಿ ಮಂಡಲ್ನ ಮಹಿಳೆಯರು ಗುಂಪಾಗಿ ಸೇತುವೆ ದಾಟುವಾಗ ಓರ್ವ ಮಹಿಳೆಯೊಬ್ಬರು ನೀರಿನಲ್ಲಿ ಕೊಚ್ಚಿಕೊಂಡು ಹೋಗಿದ್ದಾರೆ. #KannadaNews #Newsfirstlive #Telangana #kothagudem #Mulakapally #Rains #Flood pic.twitter.com/BnL3Wq54w4 — NewsFirst Kannada (@NewsFirstKan) July 27, 2023 -
వీరు ఎక్కడికి వెళ్లారు.. అసలేం జరిగింది?
హైదరాబాద్: ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన తల్లీ కూతుళ్లు కనిపించకుండా పోయిన ఘటన శుక్రవారం మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై సందీప్‌కుమార్ వివరాల ప్రకారం మేడిపల్లి పీఅండ్‌టీ కాలనీలో నివసించే డి.వెంకటేశ్వర్లు, ఈశ్వరమ్మ(37) భార్యాభర్తలు. ఈశ్వరమ్మ గృహిణి. వీరికి పూర్వజ(19), హరిణి(18) కూతుళ్లు. ప్రస్తుతం వీరు చదువుకుంటున్నారు. ఈ నెల 20వ తేదీన మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో ఇంట్లో చెప్పకుండా ఈశ్వరమ్మ, ఇద్దరు కుమార్తెలు వెళ్లిపోయారు. ఎంత వెతికినా కనిపించకపోవడంతో వెంకటేశ్వర్లు మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అన్నదమ్ములను చిదిమేసిన రోడ్డు ప్రమాదం! -
తల్లికి కారు గిఫ్ట్ ఇచ్చి సర్ప్రైజ్ చేసిన అషూరెడ్డి.. వీడియో వైరల్
బోల్డ్ బ్యూటీ అషూరెడ్డి గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన పనిలేదు. టిక్‌టాక్ వీడియోలతో జూనియర్ సమంతలా పేరు తెచ్చుకున్న అషూ బిగ్‌బాస్ షోతో మరింత గుర్తింపు పొందింది. సోషల్ మీడియాలో బోల్డ్ ఫోటోషూట్స్‌తో వార్తల్లో నిలిచే అషూ ఆర్జీవీ ఇంటర్వ్యూతో ఒక్కసారిగా స్టార్ డమ్‌ను సొంతం చేసుకుంది. దీంతో ఆమె ఫాలోయింగ్ అమాంతం పెరిగింది. ఇక నెట్టింట గ్లామర్ షో చేయడంలో ముందుండే అషూరెడ్డి ఇన్‌స్టా యూజర్లతో ఎప్పుడూ టచ్‌లో ఉంటుంది. తనకు సంబంధించిన విషయాలను నెటిజన్లతో షేర్ చేసుకుంటుంది. తాజాగా తన తల్లి బర్త్‌డే సందర్భంగా అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి సర్ప్రైజ్ చేసింది. సరికొత్త సుజూకీ కారును ఆమె పుట్టినరోజు కానుకగా అందించింది. కూతురి గిఫ్ట్ చూసి సంతోషంలో అషూ తల్లి ఎమోషనల్ అయ్యింది. దీనికి సంబంధించిన వీడియోను అషూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా.. మంచి సర్ప్రైజ్ ఇచ్చావంటూ నెటిజన్లు ఆమెను అభినందిస్తున్నారు. View this post on Instagram A post shared by Ashu Reddy (@ashu_uuu) -
పోలీసు ఎంపికల్లో తల్లీ కూతుళ్ల తడాఖా
నేలకొండపల్లి : పోలీసు ఉద్యోగాల భర్తీకి నిర్వహిస్తున్న దేహ దారుఢ్య పరీక్షల్లో తల్లీకుమార్తెలిద్దరూ సత్తా చాటి ఎస్ఐ మెయిన్స్‌కు ఎంపికయ్యారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం చెన్నారానికి చెందిన తోళ్ల వెంకన్న భార్య నాగమణి, కుమార్తె త్రిలోకిని ఖమ్మంలో జరుగుతున్న పోలీసు ఈవెంట్స్‌కు బుధవారం హాజరయ్యారు. ఈ సందర్భంగా పరుగు పందెం, ఎత్తు కొలత, లాంగ్ జంప్, షాట్‌పుట్ ఇలా అన్ని ఈవెంట్లలో విజయం సాధించి తుది పరీక్షకు అర్హత సాధించారు. తోళ్ల వెంకన్న కుటుంబం చెన్నారం నుంచి జీవనోపాధి కోసం కొన్నేళ్ల క్రితమే ఖమ్మం జిల్లా కేంద్రానికి వెళ్లింది. తొలుత నాగమణి అంగన్వాడీ టీచర్‌గా ఖమ్మం బురహాన్‌పురంలో కొంతకాలం పనిచేశాక.. పదేళ్ల క్రితం జిల్లా కేంద్రంలో హోంగార్డుగా విధులు నిర్వర్తించారు. రెండేళ్ల క్రితం కానిస్టేబుల్‌గా ఎంపికైన ఆమె ప్రస్తుతం ములుగు జిల్లా కేంద్రంలో పనిచేస్తున్నారు. ఎస్ఐ కావాలన్న లక్ష్యంతో సాధన చేస్తుండగా, డిగ్రీ పూర్తి చేసిన నాగమణి కుమార్తె త్రిలోకిని కూడా పరీక్షలకు సిద్ధమయ్యారు. ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించి దేహ దారుఢ్య పరీక్షలకు హాజరైన వీరిద్దరు.. ఇందులోనూ సత్తా చాటి మెయిన్స్‌కు ఎంపికయ్యారు. ఇదీ చదవండి: షికారుకెళ్లి నరకయాతన.. బండరాళ్ల మధ్య చిక్కుకున్న యువకుడు -
Guntur Road Accident: అమ్మా లెగమ్మా.. చెల్లీ మాట్లాడు
సాక్షి, గుంటూరు(మేడికొండూరు): పొట్టకూటి కోసం వలస వచ్చి కూలీనాలీ చేసుకుని జీవిస్తూ ఇద్దరు బిడ్డల బంగారు భవిష్యత్తు గురించి కలలుగంటున్న పేద దంపతుల ఆశలను రోడ్డు ప్రమాదం చిదిమేసింది. శుభకార్యానికి వెళ్లి ఆనందంగా తిరిగి వస్తున్న ఆ చిన్న కుటుంబం సంతోషాలను అంతలోనే ఆవిరి చేసింది. టిప్పర్ రూపంలో వచ్చిన మృత్యువు తల్లీకూతుళ్లను బలితీసుకుంది. స్వల్పగాయాలతో బయట పడిన తండ్రీకూతుళ్లను శోక సముద్రంలో ముంచింది. ఈ హృదయ విదారక ఘటన మేడికొండూరు మండలం పేరేచర్ల నరసరావుపేటలోని బ్రిడ్జి దిగువన రైల్వే ట్రాక్ సమీపంలో సోమవారం జరిగింది. ప్రకాశం జిల్లా చీమకుర్తికి చెందిన వేల్పుల వెంకటేశ్వర్లు, లక్ష్మి(35) దంపతులు. వీరికి ఇద్దరు కుమార్తెలు తేజశ్విని, నాగమల్లేశ్వరి(5) ఉన్నారు. రెక్కాడితేగానీ డొక్కాడని పేద కుటుంబం. స్వగ్రామంలో పనులు లేకపోవడంతో కొద్దినెలల క్రితం గుంటూరు చుట్టుగుంట సమీపంలోని కొత్త కాలనీకి వలస వచ్చారు. మిర్చియార్డులో భార్యాభర్తలిద్దరూ కూలిపనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. పిల్లలను చదివించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పల్నాడు జిల్లా, కారంపూడి మండలం, ఒప్పిచర్ల గ్రామంలోని బంధువుల ఇంట జరిగిన శుభకార్యానికి ఆదివారం కుటుంబమంతా ద్విచక్రవాహనంపై వెళ్లింది. సోమవారం వారు గుంటూరుకు తిరుగుపయనమయ్యారు. కొద్దిసేపట్లో ఇంటికి చేరుకుంటామనగా.. పేరేచర్ల నరసరావుపేటరోడ్డులోని బ్రిడ్జి కింద వెనుకగా వస్తున్న టిప్పర్ బలంగా ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో లక్ష్మితోపాటు ఆమె చిన్నకూతురు నాగమల్లేశ్వరి అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. వెంటేశ్వర్లు, పెద్ద కుమార్తె తేజశ్విని స్వల్పగాయాలతో బయటపడ్డారు. తల్లడిల్లిన బాలిక తల్లి, చెల్లి దుర్మరణంతో ఎనిమిదేళ్ల తేజశ్విని తల్లడిల్లిపోయింది. అమ్మా.. అమ్మా.. లెగమ్మా.. చెల్లీ మాట్లాడు చెల్లీ.. అంటూ గుండెలవిసేలా విలపించింది. ఆ బాలికను ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు. మృతదేహాలపై పడి బాలిక రోదించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. క్లీనర్ లేకపోవడం వల్లేనా..! టిప్పర్‌లో క్లీనర్ లేకపోవడం వల్ల రోడ్డుపై ఎడమవైపు ఉన్న వాహనాలను డ్రైవర్ గుర్తించలేకపోయాడని, అందువల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. దుర్ఘటనపై మేడికొండూరు సీఐ ఎండీ ఎ.ఆల్తాఫ్ హుస్సేన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన టిప్పర్ డ్రైవర్ పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. -
శ్రీకాకుళం జిల్లాలో అమానుష ఘటన.. బతికున్న తల్లి కూతుళ్లను మట్టితో పూడ్చి..
సాక్షి, శ్రీకాకుళం జిల్లా: హరిపురంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. తల్లికూతుళ్లను సజీవ సమాధి చేసేందుకు బంధువులు యత్నించారు. స్థలం ఆక్రమణపై ప్రశ్నించినందుకు మూడు ట్రాక్టర్లతో మట్టి కుమ్మరించి హత్యాయత్నం చేశారు. ఆ మహిళలు గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు కాపాడారు. ఊరొదిలి వెళ్లిపోవాలంటూ 7 ఏళ్లుగా బంధువులు వేధిస్తున్నారు. బంధువుల మధ్య కొన్నేళ్లుగా ఆస్తి వివాదం కొనసాగుతోంది. ఈ దారుణ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. చదవండి: ఏపీపై ‘దుష్టచతుష్టయం’ పగబట్టిందా.. వచ్చే ఎన్నికల వరకు భరించాల్సిందేనా? -
ఒకే విమానంలో కో పైలెట్లుగా తల్లి కూతుళ్లు: వీడియో వైరల్
పిల్లలు పెద్దవాళ్లను ఆదర్శంగా తీసుకుని వాళ్లలా ఉన్నతోద్యోగం సంపాదించాలనుకుంటారు. డాక్టర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్‌ల పిల్లలు వాళ్లాలాగే సేమ్ ప్రోఫెషిన్ని ఎంచుకోవడం అత్యంత అరుదు. కానీ ఇక్కడొక కూతురు తన తల్లి చేసే వృత్తిని ఎంచుకోవడమే ఇద్దరు ఒకేచోట తమ వృత్తిని కొనసాగించడం కూడా అరుదే. వివరాల్లోకెళ్తే...ఇక్కడొక కూతురు తన తల్లిలా పైలెట్ అయ్యింది. పైగా తల్లికూతుళ్లు ఇద్దరు కో పైలెట్లుగా విమానాన్ని నడిపారు. ఇలా జరగడం అత్యంత అరుదు. ఈ మేరకు సౌత్వెస్ట ఎయిర్‌లైన్స్ తన ఇన్స్టాగ్రాం పేజీలో ఈ వీడియోని పోస్ట్ చేస్తూ తొలిసారిగా తల్లి కూతుళ్ల ద్వయం పైలెట్లుగా విమానాన్ని నడిపి చరిత్ర సృష్టించారని పేర్కొంది. అంతేకాదు నీవు నీ సొంత కాళ్లపై నిలబడటమే కాకుండా తల్లితో కలిసి విమానాన్ని ప్రయాణాన్ని పూర్తి చేసినందుకు అబినందనలు అని సదరు మహిళకి తెలిపింది. ఈ మేరకు ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోకి లక్షల్లో వ్యూస్, లైక్‌లు వచ్చాయి. మీరు కూడా ఓ లుక్కేయండి. View this post on Instagram A post shared by Southwest Airlines (@southwestair) (చదవండి: నడిరోడ్డు పై అనూహ్య ఘటన....ఒక్కసారిగా ఆగిపోయిన వాహనాలు: వీడియో వైరల్) -
కూరగాయల కోసం వెళ్లి.. ఇంటికి రాకపోవడంతో..
పిచ్చాటూరు(తిరుపతి జిల్లా): మండలంలోని కీళపూడి గ్రామానికి చెందిన రమ్య(20), ఆమె కుమార్తె శ్రీ (1) అదృశ్యమయ్యారు. స్థానిక ఎస్ఐ శ్రీకాంత్‌రెడ్డి కథనం.. కీళపూడి గ్రామానికి చెందిన వేలు కుమార్తె రమ్యకు చిత్తూరు మండలం, ఓబునపల్లెకి చెందిన బాలాజీతో వివాహమైంది. వీరికి శ్రీ అనే ఏడాది పాప ఉంది. గత వారం కీళపూడిలోని అమ్మగారింటికి వచ్చిన రమ్య, సోమవారం సాయంత్రం పిచ్చాటూరు సంతలో కూరగాయల కోసం తన బిడ్డతో కలిసి వెళ్లింది. చదవండి: Tirumala: టీడీపీ నేతలకు చేదు అనుభవం.. భక్తుల షాక్ రమ్య ఎంత సేపటికీ తిరిగి ఇంటికి రాకపోవడంతో బంధువులు చుట్టుపక్కల గాలించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. ఈ మేరకు మంగళవారం ఉదయం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆచూకీ తెలిస్తే ఫోన్ నం.9440900727కు సమాచారం అందించాలని ఎస్ఐ ప్రజలకు సూచించారు. -
ప్రాణాలకు తెగించి తల్లీకూతుళ్లకు ప్రాణం పోసిన కానిస్టేబుల్
-
తల్లీ కూతుళ్ల అదృశ్యం.. డెంటల్ ఆసుపత్రికి వెళుతున్నామని చెప్పి..
కొండాపురం(వైఎస్సార్ జిల్లా): తల్లీ కూతురు అదృశ్యమైన ఘటన మండల పరిధిలోని ఏటూరు గ్రామంలో చోటుచేసుకుంది. తాళ్లప్రొద్దుటూరు ఎస్ఐ జె.రవికుమార్ కథనం మేరకు ఏటూరులో వలంటీర్‌గా పనిచేస్తున్న సత్యవతి(26) ఆమె కుతురు వర్ష (6) ఈ నెల 6వతేదీన ప్రొద్దుటూరులోని డెంటల్ ఆసుపత్రికి వెళుతున్నామని చెప్పి వెళ్లారు. చదవండి: కిరాతక దుశ్చర్య.. కూరతో భోజనం పెట్టలేదని.. ఇప్పటిదాకా ఇంటికి రాలేదు. దీంతో సత్యవతి సోదరుడు ఏసుబాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని ఎస్ఐ తెలిపారు. వీరిని ఎవరైనా గుర్తిస్తే ఎస్ఐ 91211 00615, సీఐ 91211 00611కు సమాచారం ఇవ్వాలని ఎస్ఐ కోరారు. -
జగిత్యాల: వరద కాల్వలోకి దూకి తల్లి కుమార్తెల ఆత్మహత్య
సాక్షి, కరీంగనర్: జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం ఆత్మనగర్‌లో విషాదం నెలకొంది. ఏం కష్టం వచ్చిందో .. ఏమో కానీ కుమార్తెతో కలిసి ఓ మహిళ వరద కాల్వలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. మృతులు వనజ(28), శాన్వి(6)గా గుర్తించారు. ఇంట్లో గొడవ జరగడంతో వనజ కుమార్తెను తీసుకుని ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. (చదవండి: కనురెప్పకు ఏ కష్టమొచ్చిందో..!?) అనంతరం వీర్దిదరు ఆత్మనగర్ వద్ద ఉన్న వరద కాల్వలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఆదివారం వీరి మృతదేహాలను గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. చదవండి: ‘నా చావుకి ఎవరూ బాధ్యులు కారు’ -
కూతురు ఆనందం: హే.. నాన్న కూడా నాతో పాటే..!
న్యూఢిల్లీ: మనం ఎక్కడికైన వెళ్తున్నప్పుడూ అనుకోకుండా ఎవరైన మనకు ఇష్టమైన స్నేహితులో, బంధువులో ఎదురైతే మన ఆనందానికి అవధులే ఉండవు కదా. అందులోకి మనకు మరింత ఇష్టమైన వాళ్లైతే ఆ ఆనందం మాటల్లో చెప్పలేం. అచ్చం అలాంటి సంఘటనే ఇక్కడ చోటు చేసుకుంది. ఇంతకీ విషయం ఏమిటంటే ఓ తల్లి కూతుళ్లు ఒక విమానంలో ప్రయాణిస్తుంటారు. (చదవండి: జుట్టుతో లాగేస్తోంది.. ఇది చమురు ధరల ఎఫెక్టేనా?) ఇంతలో తాను ప్రయాణిస్తున్న అదే విమానంలో వాళ్ల నాన్న పైలెట్‌గా రావడం చూసి ఒక్కసారిగా ఆ పాప డాడీ అని అరుస్తుంది. ఈ మేరకు ఆ పాప తల్లి నాన్న కూడా మనతో పాటే ఈ విమానంలోనే వస్తారని చెప్పడంతో ఐలవ్ యూ పప్పా అంటూ ఆనందంతో గెత్తులేస్తుంది. అయితే ఆ పాప తల్లి ప్రియాంక మనోహత్ ఈ సంఘటనను వీడియో తీసి నా చిన్నారి తల్లి షనాయ్ మోతిహర్కి ఈ వీడియో అంకితం అంటూ ట్యాగ్ లైన్ జోడించి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు చిన్నారి షెనాయ నాన్న చూడగానే ఎంతలా సంబరపడింది అని ఒకరు, ఇది ఒక అపరూపమైన ఘటం అని మరోకరు అంటూ రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియోకి లక్షల్లో వ్యూస్, లైక్‌లు వస్తున్నాయి. మీరూ ఓ లుక్ వేయండి. (చదవండి: టైంకి ఎయిర్‌పోర్ట్‌కి చేరాలంటే ట్రాక్టర్‌పై వెళ్లక తప్పదు) -
గుంటూరు జిల్లాలో తల్లీ, కూతురు దారుణ హత్య
సాక్షి, గుంటూరు: సత్తెనపల్లి నాగార్జున నగర్లో దారుణం జరిగింది. తల్లీ, కుమార్తె హత్యకు గురయ్యారు. విజన్ స్కూల్ సమీపంలో తల్లీ, కుమార్తెలను దుండగుడు పొడిచి చంపాడు. మృతులను తల్లి పద్మావతి, కూతురు ప్రత్యూషగా గుర్తించారు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు పోలీసుల ముందు లొంగిపోయినట్లు సమాచారం. హత్యలకు భూ వివాదమే కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. \ ఇవీ చదవండి: కొత్త రకం మోసం: ఫిట్స్ వచ్చిన వాడిలా నటిస్తాడు.. ఆ తర్వాత.. సినిమా స్టైల్లో అదిరిపోయే ట్విస్ట్: నిన్న షాక్.. నేడు ప్రేమపెళ్లి -
స్నేహితుడితో సహజీవనం.. సొంత కుమార్తెనే కిడ్నాప్ చేసిన తల్లి
నెల్లూరు (క్రైమ్): కన్నతల్లి తన స్నేహితుడితో కలసి కుమార్తెను కిడ్నాప్ చేసింది. రెండురోజుల వ్యవధిలోనే పోలీసులు బాలిక ఆచూకీ కనిపెట్టి నిందితులను అరెస్ట్ చేశారు. మంగళవారం నెల్లూరు నగరంలోని తన కార్యాలయంలో రూరల్ డీఎస్పీ హరినాథరెడ్డి కేసు పూర్వాపరాలను విలేకరులకు వెల్లడించారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం మండలం జొన్నవాడ గ్రామానికి చెందిన మస్తాన్‌కు దగదర్తి మండలం లింగాలపాడు గ్రామానికి చెందిన నాగలక్ష్మితో వివాహం అయింది. వారికి ఇద్దరు ఆడపిల్లలు. దంపతుల నడుమ విభేదాలు రావడంతో నాలుగేళ్ల కిందట విడిపోయారు. వీరు పిల్లల కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. న్యాయస్థానం పిల్లలను నానమ్మ కృష్ణవేణమ్మ వద్ద ఉంచాలని సూచించింది. నాగలక్ష్మి నాయుడుపేట మండలం విన్నమాల గ్రామానికి చెందిన షేక్ అల్తాఫ్తో సహజీవనం చేస్తోంది. ఇటీవల వారిద్దరూ విజయవాడకు వెళ్లి అక్కడ హోటల్ ప్రారంభించారు. ఈ క్రమంలో గత నెల 30వ తేది రాత్రి నాగలక్ష్మి, ఆమె స్నేహితుడు అల్తాఫ్ జొన్నవాడకు వచ్చారు. కృష్ణవేణమ్మ ఇంటికి కాస్త దూరంగా ఆటోను నిలిపి, ముఖానికి మాస్క్‌లు ధరించి నేరుగా ఇంట్లోకి ప్రవేశించారు. కృష్ణవేణమ్మను బెదిరించి, పెద్దకుమార్తెను నోరుమూసి బలవంతంగా ఆటోలో ఎక్కించుకుని విజయవాడకు వెళ్లిపోయారు. రాత్రి వేళ ముఖానికి మాస్కులు ధరించి ఉండడంతో వచ్చిందెవరన్నది కృష్ణవేణమ్మ గుర్తించలేకపోయింది. అనంతరం ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్పీ ఆదేశాల మేరకు సీఐ కోటేశ్వరరావు, సీసీఎస్ ఇన్స్పెక్టర్ షేక్ బాజీజాన్‌సైదా, ఎస్ఐ ప్రసాద్‌రెడ్డి తమ సిబ్బందితో మూడు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేపట్టారు. కిడ్నాప్ చేసింది కన్నతల్లే అని గుర్తించారు. మంగళవారం విజయవాడకు చేరుకుని నాగలక్ష్మి, అల్తాఫ్ల చెర నుంచి బాలికను విడిపించి కృష్ణవేణమ్మకు అప్పగించారు. నిందితులను అరెస్ట్ చేశారు. -
బైక్‌పై తల్లీకూతురు..కేరళ To కాశ్మీర్
డ్రైవింగ్ రాని ఆమెకు పెళ్లిరోజు కానుకగా భర్త బుల్లెట్‌ను బహుమతిగా ఇచ్చాడు. దాంతో ముచ్చటపడి డ్రైవింగ్ నేర్చుకుంది. అది మామూలుగా కాదు... లాంగ్ డ్రైవ్‌కు వెళ్లగలిగేంతగా. ఇక ఊరుకోలేదు. కూతురును తీసుకుని కాశ్మీర్ యాత్రకు బయల్దేరింది. తల్లీ కూతుళ్లు ఇద్దరూ ఒంటరి మహిళలు చేసే పర్యటన గురించి, ముందస్తు ప్రణాళికల గురించి, జాగ్రత్తల గురించి అందరితో పంచుకుంటూ మరీ వెళుతున్నారు. కేరళలోని మణియారాలో ఉంటున్న అనీష స్థానిక పాఠశాలలో టీచర్‌గా ఉద్యోగం చేస్తోంది. కొత్తగా నేర్చుకున్న బైక్‌పై తిరుగుతున్న రుతుపవనాల ప్రయాణాన్ని ఆస్వాదించాలనుకుంది. అనుకున్నదే ఆలస్యం... కేరళ నుంచి కాశ్మీర్ వరకు బైక్‌పై సాగే ప్రయాణాన్ని డిగ్రీ చదువుతున్న తన కూతురు మధురిమతో కలిసి రైడింగ్ ప్రారంభించింది. జులై 14న మొదలుపెట్టిన ఈ ప్రయాణం రోజూ 300 కిలోమీటర్లు కవర్ చేస్తోంది. మహిళల ప్రయాణం ‘ఒంటరి మహిళలు పర్యటనలను ఆనందించాలనే అభిలాష ఉండగానే సరిపోదు... అందుకు ముందస్తు యాత్రను సరిగ్గా ప్లాన్ చేసుకోవాలి.. అనే ఆలోచనతోనే ఈ ట్రిప్ చేస్తున్నాం’ అని చెబుతుంది అనీషా. ఎవరైనా మహిళలు ఒంటరిగా పర్యటనలు చేస్తున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, వాటి గురించి తమ అనుభవాలతో వివరిస్తుంది అనీషా. వారం దాటాకే సమాచారం రెండు వారాలకు పైగా కొనసాగిన ప్రయాణంలో తాము ఎదుర్కొన్న సంఘటనలను, ఇతరులు ఎవరైనా తమలా ప్రయాణించాలనుకునేవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సోషల్ మీడియాలో పంచుకుంటుంది అనీష. మహిళలు తాము ఒంటరిగా పర్యటించేటప్పుడు Ðð ళ్లే మార్గం, బస చేసే స్థలం ముందే ఎంచుకోవాలి. సూర్యుడు అస్తమించే సమయానికి ఏ ప్రదేశానికి చేరుకోవాలో ముందే గమనింపు ఉండాలి. ఉండే స్థలం, హోటల్ లేదా ఇతర ప్రదేశాలు నచ్చకపోయినా రాత్రి అవడానికి ముందే ప్లానింగ్‌లో మార్పులు చేసుకోవచ్చు. భద్రత కోసం ఆయుధం, పెప్పర్ స్ప్రే వంటి వాటిని ఎప్పుడూ సిద్ధంగా ఉంచుకోవాలి. అలాంటప్పుడే కష్టసమయాలను సులువుగా ఎదుర్కోవడం అవుతుంది. అంతేకాదు, వెళ్లే మార్గం, ఫొటోలు.. వివరాలేవైనా ఎప్పటికప్పుడు కాకుండా వారం రోజులు దాటాకే వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం మంచిది. దీని వల్ల పర్యటన లో పెద్దగా ఇబ్బందులు ఎదురుకావు’ అంటూ తాము తీసుకున్న జాగ్రత్తలను, సమస్యలను ఎదుర్కొన్న విధానాన్ని వివరిస్తుంది అనీష. -
కరోనా సోకిందని తల్లి, కుమార్తె బలవన్మరణం
తిరువొత్తియూర్: మలేషియాలో నివాసం ఉంటున్న తమిళ కుటుంబానికి కరోనా సోకడంతో విరక్తి చెంది తల్లి, కుమార్తె మిద్దెపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకోగా, ఆస్పత్రిలో కరోనా చికిత్స పొందుతూ తండ్రి మృతిచెందాడు. కడలూరు జిల్లా దిట్టకుడి కి చెందిన రవిరాజా (40) కంప్యూటర్ ఇంజినీర్. 12ఏళ్లకు పైగా మలేషియాలో భార్య సత్య (37), కుమార్తె గుహదరాణి (5)తో నివాసముంటున్నారు. గత వారం రవిరాజా సహా భార్య, కుమార్తెకు కరోనా వైరస్ సోకినట్లు తెలిసింది. రవిరాజా ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రిలో చేరారు. సత్య, గుహదమణి హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిసింది. ఈ క్రమంలో విరక్తి చెందిన సత్య, గుహదమణి నాలుగు రోజుల ముందు ఇంటి మిద్దెపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. విషయం తెలిసి రవిరాజా ఆరోగ్యం మరింత క్షీణించడంతో శనివారం సాయంత్రం మృతిచెందాడు. రవిరాజా బంధువులు మాట్లాడుతూ మృతదేహాలను ఇవ్వడానికి మలేషియా ప్రభుత్వం తిరస్కరించిందని, భారత ప్రభుత్వం అనుమతిస్తే వారి అస్తికలు పంపేందుకు ఏర్పాట్లు చేస్తామని తెలిపారన్నారు. భారత రాయబార కార్యాలయం చర్చలు జరిపి అస్తికలు సొంత గ్రామానికి వచ్చేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. -
మంచిర్యాలలో తల్లీకూతుళ్ల హత్య
సాక్షి, మంచిర్యాలక్రైం: మంచిర్యాల జిల్లా కేంద్రంలో తల్లీకూతుళ్లు హత్యకు గురయ్యారు. శుక్రవారం ఉదయం మృతదేహాలను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఈ విషయం వెలుగు చూసింది. డీఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి, ఏసీపీ అఖిల్ మహాజన్, సీఐ లింగయ్య సంఘటన స్థలాన్ని పరిశీలించారు. డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. పూదరి విజయలక్ష్మి (47) ఆమె కూతురు రవీనా (23) స్థానిక బృందావన్‌కాలనీలో నివాసం ఉంటున్నారు. విజయలక్ష్మి భర్త శంకర్ సింగరేణిలో ఉద్యోగం చేసేవాడు. అనారోగ్యంతో ఆయన ఏడేళ్ల క్రితం మృతిచెందాడు. కాగా, హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేసే రవీనాకు నిజామాబాద్ జిల్లా బోధన్ సమీపంలోని శంకర్‌నగర్‌కు చెందిన కాలేరు అరుణ్‌కుమార్‌తో ఫేస్బుక్ పరిచయం ఏర్పడింది. ఇది కాస్త ప్రేమగా మారి, పెళ్లివరకు దారితీసింది. గత ఏడాది జూన్‌లో వీరు పెళ్లి చేసుకున్నారు. అయితే కొన్ని రోజులకే ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో రవీనా భర్తను వదిలేసి, తల్లి వద్ద ఉంటోంది. గత ఫిబ్రవరిలో రవీనా అరుణ్‌కుమార్‌పై వరకట్నం కేసు పెట్టింది. తర్వాత అరుణ్‌కుమార్.. విజయలక్ష్మి, రవీనాపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టడంతో మనస్తాపం చెందిన తల్లీకూతుళ్లు ఈనెల 8న స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో అరుణ్‌కుమార్‌పై మరో కేసు నమోదైంది. ఈ క్రమంలో గురువారం వాంగ్మూలం ఇచ్చేందుకు చెన్నూరు కోర్టుకు వెళ్లివచ్చారు. అంతలోనే తెల్లవారేసరికి హత్యకు గురయ్యారు. పోలీసులు డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంతో సంఘటన స్థలంలో ఆధారాలు సేకరించారు. ఎవరైనా దొంగతనానికి వచ్చి హత్య చేసి ఉంటారా, లేక దగ్గరివాళ్లు ఎవరైనా ఈ పనిచేసి ఉంటారా.. అనే కోణంలో విచారణ జరుపుతున్నట్లు డీఎస్పీ తెలిపారు. -
తాడిపత్రిలో విషాదం: తల్లీకూతుళ్ల ఆత్మహత్య
సాక్షి, అనంతపురం: తాడిపత్రిలో విషాదం చోటుచేసుకుంది. పురుగుల మందు తాగి తల్లీకూతురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఏడాది కిందట తండ్రి రామకృష్ణారెడ్డి కరోనా బారినపడి మృతి చెందగా, సోమవారం సచివాలయ కార్యదర్శి అపర్ణ, తల్లి వెంకటరమణమ్మ ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ పెద్ద లేడన్న బాధతోనే తల్లీకూతురు ఆత్మహత్య చేసుకున్నారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. చదవండి: రాజులమ్మతల్లి కలలో చెప్పిందని.. సాక్షి ఎఫెక్ట్: పల్లా ఆక్రమణలకు చెక్ -
దొరికినచోటల్లా అప్పులు.. ఆ కుటుంబంలో విషాదం..
ధర్మవరం అర్బన్: కుటుంబ కలహాలతో మనస్తాపం చెంది తల్లీకూతురు ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు తెలిపిన మేరకు.. చెన్నేకొత్తపల్లి మండలం గొల్లవాండ్లపల్లికి చెందిన గోపి కొన్నేళ్ల క్రితం ధర్మవరానికి వలస వచ్చాడు. శ్రీలక్ష్మీచెన్నకేశవపురంలో నివసిస్తూ రంగుల అద్దకం ఫ్యాక్టరీలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. అయితే గోపి జూదానికి బానిసై దొరికినచోటల్లా అప్పులు చేశాడు. అప్పులు తీర్చేందుకు ఉన్న ఇంటిని కూడా బేరం పెట్టి రూ.2 లక్షలు అడ్వాన్స్ తీసుకున్నాడు. విషయం తెలుసుకున్న భార్య వీరమ్మ (38) ఇంటిని అమ్మేస్తే పిల్లల భవిష్యత్తు ఏమిటని గోపిని నిలదీసింది. అయినా అతని ప్రవర్తనలో ఏమాత్రం మార్పు లేకపోవడంతో మనస్తాపం చెందిన వీరమ్మ తన కుమార్తె దీపిక(9)తో కలిసి గురువారం రాత్రి ధర్మవరం చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. శుక్రవారం ఉదయం వీరమ్మ మృతదేహం చెరువులో తేలియాడుతుండగా స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు చెరువు వద్దకు వెళ్లి మృతదేహాన్ని బయటకు తీయించి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. దీపిక మృతదేహం కోసం శనివారం చెరువులో వెతికించనున్నట్లు పోలీసులు తెలిపారు. చదవండి: గుంత తవ్వేందుకు ప్రయత్నం.. వెలుగులోకి షాకింగ్ నిజం తోటలోకి బాలుడు, ప్రశ్నించిన వృద్ధురాలిపై దారుణం -
పరువు కోసం తల్లి, ప్రేమ కోసం కూతురు..
పెదకూరపాడు: పరువు కోసం తల్లి, ప్రేమ కోసం కుమార్తె ఆత్మహత్య చేసుకున్నారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమార్తెను బయట సంబంధాలకు ఇస్తే కాపురం ఎలా ఉంటుందో అన్న భయతో సొంత తమ్ముడికే ఇచ్చి వివాహం చేసింది ఆ తల్లి. భార్యగా వచ్చిన మేనకోడలిని ఆమె కోరిక మేరకు డిగ్రీ చదివిస్తున్నాడు భర్త. నిత్యం 25 కిలోమీటర్ల దూరం తీసుకెళ్లి తీసుకొస్తున్నాడు. ఆమె ప్రస్తుతం నాలుగు నెలల గర్భిణి. భార్య ప్రేమ వ్యవహారం ఆ కుటుంబంలో కలకలం రేపింది. ఈ విషయమై తల్లీకుమార్తెల మధ్య గొడవ జరిగింది. తెల్లవారే సరికి ఇద్దరూ మృతిచెందడంతో పండగ పూట విషాదం నెలకొంది. పోలీసుల కథనం మేరకు.. పెదకూరపాడు మండలంలోని బుస్సాపురం గ్రామానికి చెందిన యువకుడికి గత ఏడాది అతని సోదరి కట్లగుంట నాగవర్థిని (40) కుమార్తె దివ్య సాయిశ్రీ(20)తో వివాహమైంది. అప్పటికే దివ్యసాయిశ్రీ సత్తెనపల్లిలో డిగ్రీ (బీఎస్సీ) రెండో సంవత్సరం చదువుతోంది. దివ్యసాయిశ్రీ భర్త కూడా సత్తెనపల్లిలోనే ఇనుము, సింమెట్ షాపులో పని చేస్తున్నాడు. అతను రోజూ భార్యను కాలేజీ వద్ద వదిలి తన విధులకు వెళ్లేవాడు. సాయంత్రం భార్యతో కలిసి బుస్సాపురం వచ్చేవాడు. ఈ క్రమంలో ఈ నెల పదో తేదీన పరీక్ష ఉండటంతో భార్యను కాలేజీ వద్ద వదిలి వెళ్లాడు. సాయంత్రం కాలేజీ వద్దకు రాగా భార్య కనిపించలేదు. ఆమె స్నేహితులను విచారించగా దివ్యసాయిశ్రీ తనతో కలిసి చదువుతున్న వ్యక్తిని ప్రేమిస్తోందని, అతడితో కలిసి వెళ్లిందని చెప్పారు. దివ్యసాయిశ్రీ భర్త పాత గుంటూరులో నివసిస్తున్న తన సోదరి నాగవర్థినికి ఈ విషయం చెప్పాడు. ఈ క్రమంలో దివ్యసాయిశ్రీని ప్రేమించిన వ్యక్తి కుటుంబ సభ్యులు పెళ్లయిన అమ్మాయితో ప్రేమ ఏమిటని మందలించారు. దివ్య సాయిశ్రీ తమ వద్దే ఉందని ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. పెదకూరపాడు పోలీసు స్టేషన్లో పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి ఇరువైపుల వారిని ఇంటికి పంపారు. పురుగు మందుతాగి ఆత్మహత్య కుమార్తె దివ్యసాయిశ్రీని తీసుకొని నాగవర్థిని సోమవారం తమ్ముడి ఇంటికి వచ్చింది. దీంతో వారి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో సోమవారం రాత్రి దివ్యసాయిశ్రీ, నాగవర్థిని ఇంటిపై నిద్రించారు. ఈ క్రమంలో దివ్యసాయిశ్రీ భర్త తన తల్లి ఇంటికి వెళ్లాడు. మంగళవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో తన బాబాయితో కలిసి తన ఇంటిపైకి వెళ్లే సరికి తన సోదరి, భార్య అచేతనంగా పడి ఉండటం, వారి వద్ద పురుగు మందు వాసన రావడంతో స్థానికుల సహాయంతో పెదకూరపాడు వైద్యశాలకు తీసుకెళ్లారు. పెదకూరపాడులో వైద్యులు లేకపోవడంతో సత్తెనపల్లి ప్రైవెట్ వైద్యశాలకు తరలించగా అప్పటికే తల్లీకుమార్తెలు మృతి చెందారని వైద్యులు నిర్ధారించారు. పెదకూరపాడు సీఐ గుంజి తిరుమలరావు ఆధ్వర్యంలో ఎస్ఐ పట్టాభిరామ్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: కోడలు ఉరేసుకుంటుంటే అత్తమామలు వీడియో తీస్తూ.. ఆన్లైన్ క్లాసులు వింటున్న బాలికపై అత్యాచారం -
కుక్క.. గొర్రెపై దాడి చేసిందని..!
మదనపల్లె టౌన్(చిత్తూరు జిల్లా): కుక్క గొర్రెపై దాడిచేసిందని ఆగ్రహించి తల్లి, కుమార్తెపై దాడికి పాల్పడి చిత్రహింసకు గురి చేసిన సంఘటన కురబలకోట మండలంలో చోటుచేసుకుంది. బాధితులు, ఆసుపత్రి ఔట్‌పోస్టు పోలీసుల కథనం.. తెట్టుకు చెందిన ఉత్తన్న, యశోదమ్మగొర్రెల పెంపకంపై ఆధారపడి జీవిస్తున్నారు. వారి ఇంటి ఆవరణలో ఉన్న కుక్క పొరుగింటి ఉప్ప ర ఓబులేష్, మునెమ్మల గొర్రెపై దాడి చేసిందని ఆదివారం అర్ధరాత్రి ఉత్తన్న, యశోదమ్మపై దాడిచేశారు. వారి కుమార్తె ఈశ్వరమ్మ(26)ను చితకబాదారు. తిరిగి ఉదయం మళ్లీ గొడవకు దిగి గంగమ్మ ఆలయం వద్ద బలవంతంగా వారి చేతిలో కర్పూరం వెలిగించారు. చేతులు కాలి అరుస్తున్నా వినకుండా తల్లి, కుమార్తె మీద తీటగింజరాకు పొడిచెల్లి, చేతిలో వేపాకు కొమ్మలు పెట్టి, నిజం చెప్పాలంటూ చిత్రహింసలకు గురి చేశారు. బాధితులు ముదివేడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. చదవండి: వీడిన మిస్టరీ: భార్యను ముక్కలుగా నరికి.. బాలకృష్ణ గోబ్యాక్.. -
మృత్యువులోనూ వీడని పేగు బంధం
ఈ సృష్టిలో తల్లిప్రేమకు సాటి ఏదీ లేదనేది జగమెరిగిన సత్యం. పుట్టినప్పటి నుంచికంటికి రెప్పలా కాపాడుకుంటూ తమ జీవితాలను పిల్లల కోసం అర్పించిన మాతృమూర్తులెందరో.. అలాంటి ఓ తల్లి కూతురి మరణాన్ని తట్టుకోలేక తానూ తనువు చాలించింది. వారి పేగు బంధాన్ని విడదీయ లేక మృత్యువు కూడా కన్న ప్రేమ ముందు ఓడిపోయింది.. పశ్చిమగోదావరి, దేవరపల్లి: ఈ విషాద సంఘటన దేవరపల్లిలో జరిగింది. ఒకే ఇంట్లో గంట వ్యవధిలో తల్లీకూతుళ్లు మృతి చెందారు. దీనికి సంబంధించి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. దేవరపల్లి–గోపాలపురం రోడ్డులో టుబాకో బోర్డు కార్యాలయం సమీపంలోని పూడి చలమయ్య ఇంట్లో శుక్రవారం విషాద సంఘటన జరిగింది. చలమయ్య కుమార్తె బల్లే సరిత(21) ఇటీవల దేవరపల్లిలోని పుట్టింటికి వచ్చింది. గురువారం పుట్టింట్లో జరిగిన గృహ ప్రవేశ కార్యక్రమంలో కుటుంబ సమేతంగా పాల్గొని కుటుంబ సభ్యులు, బంధువులతో ఆనందంగా గడిపింది. రాత్రి భోజనం అనంతరం పిచ్చాపాటి మాట్లాడుతూ అంతా నిద్రించారు. శుక్రవారం ఉదయం 5 గంటల సమయంలో సరిత బాత్రూమ్కి వెళ్లి కాలుజారి పడిపోయింది. ఎంతసేపటికీ సరిత బాత్రూమ్ నుంచి బయటకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు బాత్రూమ్ వద్దకు వెళ్లి చూడగా సరిత పడిపోయి ఉంది. వెంటనే బయటకు తీసుకురాగా అప్పటికే ఆమె మృతి చెందింది. ఈ సంఘటన చూసిన తల్లి వరలక్ష్మి బోరున విలపిస్తూ గుండెపోటుతో కుప్పకూలిపోయింది. అనంతరం కొద్ది నిమిషాల్లోనే వరలక్ష్మి గుండె ఆగిపోయింది. కుమార్తె మరణించిన కొద్ది సేపటికే తల్లి వరలక్ష్మి మృతి చెందడంతో ఆఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. సరితను మూడు సంవత్సరాల క్రితం మండలంలోని యాదవోలుకు చెందిన బల్లే గణేష్‌కు ఇచ్చి వివాహం చేశారు. తల్లీకూతుళ్ల మృతదేహాలను స్థానిక çశ్మశాన వాటికలో పక్కపక్కనే ఉంచి అంత్యక్రియలు చేశారు. మృతదేహాల వద్ద కుటుంబ సభ్యులు బోరున విలపించడం అందరినీ కంటతడి పెట్టించింది. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
శ్రీకాకుళం జిల్లాలో విషాదం..
శ్రీకాకుళం రూరల్: కట్టెలు కొట్టేందుకు నేలబావిలోకి దిగిన తల్లీకూతుళ్లు మృత్యువాత పడ్డారు. ముందు కుమార్తె కాలు జారి పడగా.. ఆమెను రక్షించేందుకు తల్లి బావిలోకి దూకింది. శ్రీకాకుళం రూరల్ మండలంలోని పంతులుపేట గ్రామ సమీపంలో ఆదివారం ఈ దుర్ఘటన జరిగింది. గూడెం గ్రామానికి చెందిన పొదిలాపు భాస్కరరావు కూలి పనులు చేస్తూ భార్యాబిడ్డలను పోషిస్తున్నాడు. అతని భార్య ఉమ (37), కుమార్తె అనురాధ (14) ఒక బంధువుతో కలిసి ఉదయం 9 గంటల ప్రాంతంలో వంట చెరుకు కోసం రెండు కిలోమీటర్ల దూరంలోని పంతులుపేట గ్రామం వెళ్లారు. జీడి, సరుగుడు తోటల్లో కట్టెలు ఏరుకొని, నేలబావిలో ఉన్న తాటి కమ్మలు కోసేందుకు ప్రయతి్నంచారు. ఈ ప్రయత్నంలో అనురాధ ప్రమాదవశాత్తు నూతిలో పడిపోయింది. కూతుర్ని రక్షించమని కేకలు వేస్తూ ఆమెను కాపాడేందుకు ఉమ కుడా దూకేసింది. చుట్టుపక్కల పొలం పనులు చేస్తున్న ఒకరిద్దరు కొబ్బరి కొమ్మల సహాయంతో వారిని నూతిలో నుంచి పైకి తీసుకువచ్చారు. అప్పటికే అనురాధ పూర్తిగా నీరు తాగి ప్రాణాలు కోల్పోయింది. కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న తల్లి ఉమను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. విషయం తెలుసుకున్న రూరల్ పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. రూరల్ ఎస్ఐ లక్ష్మణరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తల్లీకూతుళ్లు నేలబావిలో పడి ప్రాణాలు కోల్పోవడంతో గూడెం గ్రామమంతా శోకసంద్రంగా మారింది. ఈ ప్రమాదంలో మరణించిన అనురాధ రాగోలు ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి, ఆమె సోదరుడు పవన్‌కుమార్ ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ చదువుతున్నారు. -
ఆత్మహత్య: ఏం కష్టం వచ్చిందో..?
సాక్షి, పొట్టిరెడ్డిపాలెం(మర్రిపూడి): ఏం కష్టం వచ్చిందో..ఏమో తల్లీ, కూతుళ్లు ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని పొట్టిరెడ్డిపాలెం గ్రామంలో శుక్రవారం సాయంత్రం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం మండలంలోని పొట్టిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన సందల జనార్దన్ రెడ్డితో సుమారు పదిహేనేళ్ల క్రింత కోటేశ్వరమ్మతో వివాహమైంది. వీరికి ఒక అబ్బాయి, ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. రోజువారీ పనుల్లో భాగంగా భర్త జనార్దన్‌రెడ్డి పశుగ్రాసం కోసం పొలం వెళ్లాడు. అయితే ఫ్యాన్‌కు ఉరి వేసుకున్న సంఘటనను మృతురాలు మామ ఒక్కెయ్య చూసి కుమారుడుకు సమాచారం ఇచ్చాడు. కొడుకు పొలం నుంచి తిరిగి ఇంటికి వచ్చే సరికి భార్య కోటేశ్వరమ్మ(32), ఆమె కూతురు నందిని(13) ఇద్దరు ఒకే మంచంపై విగత జీవులుగా పడి ఉన్నారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో కూతురు నందినికి కుర్చీ ఎక్కించి చీరతో ఫ్యాన్‌కు ఉరి వేసి ఉండవచ్చని, అనంతరం ఇంట్లో ఉన్న కందుల బస్తాల పైకి ఎక్కి తల్లి కోటేశ్వరమ్మ కూడా అదే చీరతో మెడకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని ఉంటుందని సంఘటన స్థలాన్ని బట్టి తెలుస్తుందని ఎస్సై ఏ. సుబ్బరాజు తెలిపారు. భార్య, భర్తల మధ్య చిన్నపాటి గొడవలు ఉన్నాయని, ఈ నేపథ్యంలో తీవ్ర మనస్థాపానికి గురైన కోటేశ్వరమ్మ ఈ సంఘటనకు పాల్పడి ఉండవచ్చనే అనుమానాలు పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. కూతురు మర్రిపూడి జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి చదువుతుంది. సంఘటన జరిగిన విషయం తెలుసుకున్న బంధువులు, గ్రామస్తులు ఒక్కసారిగా దుఃఖ సాగరంలో మునిగిపోయారు. పొట్టిరెడ్డిపాలెం గ్రామంలో ఆరు నెలల వ్యవధిలో నలుగురు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుని చనిపోవడం కలకలం రేపింది. జనార్దన్ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. -
తల్లీకూతుళ్లపై మున్సిపల్ ఉద్యోగి దాడి
-
తల్లి, కూతురు అదృశ్యం
చాంద్రాయణగుట్ట: భర్తతో గొడవపడి ఓ మహిళ కుమార్తెతో సహా అదృశ్యమైన సంఘటన ఛత్రినాక పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. హనుమాన్‌నగర్ ప్రాంతంలో భాగ్యశ్రీ(26), అశ్విన్ కుమార్ దంపతులు నివాసం ఉంటున్నారు. ఇంటి మరమ్మతుల విషయంలో ఈ నెల 4న ఇద్దరి నడుమ గొడవ జరగడంతో మనస్తాపానికిలోనైన భాగ్యశ్రీ అదే రోజు సాయంత్రం ఇంట్లో ఎవరికి చెప్పకుండా తన కుమార్తె ప్రిష(1)తో కలిసి బయటికి వెళ్లిపోయింది. రాత్రి ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు ఆమె కోసం గాలించినా ప్రయోజనం కనిపించలేదు. భార్యశ్రీ భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
బ్యూటిఫుల్ ఫ్యామిలీ
అందం అంటే తెల్లటి మేను.. కొలతల ఆకృతి కాదు.. అందం అంటే అంతులేని ఆత్మవిశ్వాసమే అని మొన్న విశ్వసుందరిగా నిలిచిన జొజొబిని తుంజీ నిరూపించింది. అసంపూర్ణతలు అవకాశాలను అడ్డుకోలేవు.. వైకల్యాలు పరిధిని నిర్ణయించలేవు అని చాటారు అపర్ణ క్రోవి.. ఆమె ఇద్దరు కూతుళ్లు షీతల్, శ్రీనిధి! జొజొబిని తుంజి ఘనతకు వీళ్ల విజయానికి సంబంధం ఏంటీ? వీళ్లూ గెలుపొందింది బ్యూటీకాంటెస్ట్‌లోనే! అపర్ణ క్రోవి స్వస్థలం హైదరాబాద్. ప్రస్తుతం అమెరికాలోని బోస్టన్‌లో ఉంటున్నారు. భర్త వ్యాపారవేత్త. ముగ్గురు పిల్లలు షీతల్, శ్రీనిధి, సుహాస్. పెద్దమ్మాయి షీతల్ ఫ్యాషన్ డిజైనింగ్ చదువుతోంది. రెండో అమ్మాయి, అబ్బాయి కవలలు. టెన్త్‌క్లాస్‌లో ఉన్నారు. అపర్ణా, తన ఇద్దరు కూతుళ్లు ఇటీవల అమెరికాలోని న్యూజెర్సీలో జరిగిన ‘‘మిస్ భారత్ యూఎస్ఏ 2019’’ అందాల పోటీల్లో పాల్గొని ముగ్గురూ టైటిల్స్ గెలుచుకున్నారు. ‘‘మిస్ భారత్ యూఎస్ఏ 2019’’గా షీతల్, ‘‘మిసెస్ భారత్ ఫస్ట్ రన్నరప్’’గా 39 ఏళ్ల అపర్ణ, ఇండియా నెక్ట్స్ టాప్ మోడల్‌గా శ్రీనిధి విజేతలయ్యారు. ఒక పోటీలో తల్లీకూతుళ్లు గెలుపొందడం అరుదే. ఈ అచీవ్మెంట్ ఈ ముగ్గురికీ ప్రత్యేకం అనడానికి ఇదొక్కటే కారణం కాదు. దీని వెనక ఈ ముగ్గురికీ ఒకే రకమైన స్ట్రగుల్ ఉండడం కూడా! కన్నుమూసి తెరిచేలోగా తలకిందులు.. అయిదేళ్ల కిందటిదాకా ఆనందంగా ఉంది అపర్ణ కుటుంబం. 2015 కొత్త సంవత్సరం వేడుక వాళ్ల జీవితాన్ని తలకిందులు చేసింది. ఆ యేడు న్యూ ఇయర్‌ను జైపూర్‌లో జరుపుకుందామనుకున్నారు.ఆ సంతోషాన్ని ఆస్వాదిస్తున్న సమయంలో ఒక్కసారిగా బాణాసంచా పేలి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అపర్ణ, షీతల్, శ్రీనిధిలకి గాయాలయ్యాయి. చికిత్స కోసం వాళ్లు తిరగని దేశం లేదు. గాయాలకన్నా కాలిన మచ్చలతో ఉన్న తమను చూసే చూపులే ఎక్కువ బాధించాయి అంటారు అపర్ణ. ‘‘పిల్లలు కుంగిపోకుండా ఉండాలంటే ముందు నేను ధైర్యం కూడగట్టుకోవాలి. దానికి ఆ మచ్చలనే ప్రేరణగా తీసుకున్నా. మేము మేముగా నిలబడాలి. ఆ గుర్తింపు మాకు కావాలి అని తపన మొదలైంది. దానికి అందాల పోటీలను ఎందుకు వేదికగా మలచుకోకూడదు అనిపించింది. అందుకే ధైర్యాన్నే ఆయుధంగా చేసుకున్నా. పిల్లల్నీ ట్రైన్ చేశా. మొన్న జరిగిన ‘‘మిస్ భారత్ యూఎస్ఏ 2019’’కి దరఖాస్తు చేశాం. గెలిచాం’’ అని చెప్తారు అపర్ణ మునుపటి ఆనందాన్ని సొంతం చేసుకున్న విశ్వాసంతో. ఫుడ్ బ్లాగర్.. అపర్ణకు పందొమ్మిదేళ్లకు పెళ్లయింది. ఇరవై ఏళ్లు గృహిణిగానే సాగింది. ఆమె రచయిత, స్టోరీ టెల్లర్, మారథాన్ రన్నర్, ఫుడ్ బ్లాగర్ కూడా. ఇవన్నీ అగ్నిప్రమాదం అయిన తర్వాత సాధించినవే. ఈ కలలన్నీ ముందునుంచే ఉన్నా పెళ్లి, పిల్లలతో కొంతకాలం, ఫైర్ యాక్సిడెంట్‌తో మరి కొంతకాలం వెనకబడ్డాయి. ఇప్పుడు అన్నింటిలో రాణిస్తోంది. ‘‘కలలు అంటూ ఉంటే ఎప్పుడైనా సాధించవచ్చు. టైమ్ లిమిట్ ఉండదు. కావల్సిందల్లా మన మీద మనకు నమ్మకం, సామర్థ్యం, పట్టుదల అంతే! ఏ వైకల్యమూ మన అవకాశాలను కుదించలేదు’’ అంటుంది అపర్ణ. ఆమె కూతుళ్లూ అంతే ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. పెద్దమ్మాయి షీతల్ ఫ్యాషన్ డిజైనర్‌గా గ్లామర్ ప్రపంచంలోకి అడుగుపెట్టాలనుకుంటుందట. ఈ విజయం ఆ ప్రయాణాన్ని మరింత సులువు చేసింది అంటుంది షీతల్. సానుకూల దృక్పథం ఎంతటి లక్ష్యాన్నయినా ఛేదిస్తుంది.. కొత్త ప్రపంచాన్ని చూపిస్తుంది అనడానికి ఈ కుటుంబమే మంచి ఉదాహరణ. -
తల్లిపై కుమార్తె యాసిడ్ దాడి
సాక్షి, శ్రీకాకుళం : ప్రేమ వ్యవహారం ఇంట్లో తెలియడంతో ప్రేమించిన వాడినే పెళ్లి చేసుకుంటానని కుమార్తె పట్టుబట్టింది. వద్దని తల్లిదండ్రులు వారించారు. తాము తెచ్చిన సంబంధాన్నే చేసుకోవాలన్నారు. ఈ విషయంపై తల్లీకుమార్తెల మధ్య కొద్దిరోజులుగా తగాదా జరుగుతోంది. గురువారం మరోసారి తీవ్రస్థాయిలో ఇంట్లోనే వాగ్వాదం జరిగింది. ఆగ్రహానికి గురైన కుమార్తె ఇంట్లోని బాత్రూమ్లో వాడే యాసిడ్ బాటిల్‌తో తల్లి ముఖంపై కొట్టింది. ఈ ఘటన శ్రీకాకుళం పరిధిలోని ఏఎస్ఎన్ కాలనీలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. కాలనీలో నివసిస్తున్న రామప్పడు, ప్రభావతిల కుమార్తె జ్యోత్స్న వైజాగ్‌లోని ఓ ప్రైవేట్ కళాశాలలో చదివింది. ఆ సమయంలో ఓ అబ్బాయిని ప్రేమించింది. ఇటివలే బీటెక్ పూర్తయింది. ఓ అబ్బాయిని ప్రేమించానని, అతన్నే పెళ్లి చేసుకుంటానని ఇంట్లో చెప్పింది. దీనికి తల్లిదండ్రులు తిరస్కరించారు. ఇదే విషయంపై తల్లీకుమార్తె ప్రతి రోజూ తగాదా పడుతున్నారు. ప్రేమించిన వ్యక్తితోనే వివాహం జరిపిస్తామని తల్లి ప్రభావతి చెప్పినప్పటికీ కుమార్తె జ్యోత్స్న.. తనకున్న తెలివి తేటలతో బాండ్ పేపర్‌పై ‘కోరుకున్న వాడితోనే పెళ్లి చేస్తామని’ రాసి ఇవ్వాలన్నది. ఈ విషయంలో తల్లికి కోపం రావడంతో ఆమె ససేమిరా అనేసింది. బాత్రూంలో ఉన్న యాసిడ్ బాటిల్‌ను తీసిన జ్యోత్స్న తల్లి ప్రభావతిపై విసిరికొట్టింది. వెంటనే ముఖంపై బొబ్బలు ఏర్పడ్డాయి. దుస్తులన్నీ కాలిపోయాయి. ఆ సమయంలో ఇంట్లోనే ఉన్న తండ్రి 100కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. రెండో పట్టణ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని తల్లీకుమార్తెల నుంచి వివరాలు సేకరించారు. రిమ్స్‌లో ప్రాథమిక చికిత్స అందించారు. ఈ మేరకు విచారణ చేస్తున్నామని, తల్లీకుమార్తెలకు కౌన్సెలింగ్ ఇస్తున్నామని రెండో పట్టణ ఎస్ఐ ముకుందరావు తెలిపారు. -
పేదోళ్లకు పెద్ద కష్టం
ఆ ఇంట్లో గత 15 ఏళ్ల నుంచి ఓ మహిళ, ముగ్గురు బాలికలు నివాసం ఉంటున్నారు. భర్త అనారోగ్యంతో చనిపోవడంతో పాచి పనులు చేస్తూ ఒకటిన్నర దశాబ్ద కాలంగా ముగ్గురు బిడ్డలను ఆ తల్లే పోషిస్తోంది. బిడ్డలను ఉన్నత చదువులు చదివించాలని ఆశపడింది. ముగ్గురినీ పదో తరగతి పైగానే చదివించింది. ఓవైపు పెళ్లీడుకొచ్చిన బిడ్డలు, మరోవైపు వారి చదువులు.. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ముగ్గురూ చదువులు మానాల్సిన దుస్థితి ఏర్పడింది. ఒక్కొక్కరికైనా పెళ్లి చేసేందుకు నలుగురూ పనులకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. కానీ, ఇంతలోనే విధి వెక్కిరించింది. వారి జీవితాలను ఓ కుదుపుకుదిపేస్తోంది. తినడానికి సరైన తిండి లేక ‘ఆకలి’ ఆ ఇంట్లో తల్లీకూతురిని మంచాన పడేసింది. మండల కేంద్రం మెంటాడ దిగువ వీధిలోని ఓ నిరుపేద కుటుంబం దీనావస్థ ఇది. సాక్షి మెంటాడ: మెంటాడ దిగువ వీధిలో అరసాడ సత్యవమ్మ, తిరుపతిరావు కాపురం ఉంటుండే వారు. వీరికి ముగ్గురు కుమార్తెల సంతానం. అయితే సత్యవతమ్మ భర్త తిరుపతిరావు సుమారు 15 ఏళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో పిల్లలను పోషించేందుకు, వారిని చదివించడానికి సత్యవతమ్మ.. ఉపాధి, ఎంపీడీఓ, వెలుగు కార్యాలయాల్లో పాచి పనులు చేసేది. ఈ పనులు చేస్తూనే పెద్ద కుమార్తె లక్ష్మిని 10వ తరగతి, రెండో కుమార్తె రామకృష్ణమ్మను డైట్, మూడో కుమార్తె రాజేశ్వరిని ఇంటర్మీడియట్ వరకు చదివించింది. ఒక్క మహిళ సంపాదనతో నలుగురి పోషణ, ముగ్గురి చదువు భరించే ఆర్థిక స్తోమత లేకపోవడంతో మధ్యలోనే వారి చదువులు ఆగిపోయాయి. గంజి కూడా కాచుకోలేని దుస్థితి.. ముగ్గురు కూతుర్లూ, తాను ఏవో ఒక పనులు చేసుకోవాలని నిర్ణయించుకోగా, అంతలోనే సత్యవతమ్మకు వెన్ను, భుజం పక్క భాగంలో తీవ్రమైన నొప్పి రాసాగింది. దీంతో నెల్లిమర్ల మిమ్స్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకోగా, పరిస్థితి బట్టి వైద్యులు ఆమెకు అక్కడే ఆపరేషన్ చేశారు. కానీ మందులు కొనుగోలుకు, మూడు పూటలా కాస్తా గంజి నీళ్లు తాగేందుకు కూడా వారి వద్ద డబ్బు లేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో సరైన తిండి లేక సత్యవతమ్మ, ఆమె రెండో కుమార్తె అరసాడ రామకృష్ణమ్మ ఏకంగా మచ్చం పట్టారు. రామకృష్ణమ్మ కీళ్ల సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. తన పరిస్థితి ఇలా ఉండగా, కూతురు కూడా మంచాన పడటంతో సత్యవతమ్మ మరింత కుంగిపోయి పూర్తిగా మంచం పట్టింది. సాయం కోసం ఎదురుచూపులు.. రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబానికి ఇంతటి కష్టం వచ్చిపడటంతో ఇంట్లో అందరూ బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. మెరుగైన వైద్యం సంగతి పక్కనపెడితే.. కనీసం తిండి కూడా లేకపోవడంతో ఇంటిళ్లపాదీ ఆందోళన చెందుతున్నారు. ఎవరైనా దాతలు ముందుకొచ్చి తమ ప్రాణాలు కాపాడేందుకు సహకరిస్తారని వారు ఎదురు చూస్తున్నారు. తమకు సాయం చేయాలనుకునే వారు 9491769356 ఫోన్ నంబర్‌ను సంప్రదించాలని వారు అభ్యర్థిస్తున్నారు. వలంటీర్ పోస్ట్ కోసం కాళ్లు పట్టుకున్నా.. మా ఇంట్లో ఆర్థిక పరిస్థితి గురించి గ్రామస్తులకు, అధికారులకు తెలుసు. కనీసం గ్రామ వలంటీర్ పోస్టు ఇవ్వాలని గ్రామంలో ఉన్న అందరి కాళ్లు పట్టుకున్నాను. చివరకు ఎంపీడీఓకూ మా పరిస్థితి వివరించాను. ఏ ఒక్కరూ మా కుటుంబంపై కనికరం చూపించలేదు. ఇప్పటికైనా మమ్మల్ని ఆదుకోవాలని వేడుకుంటున్నా. – అరసాడ రామకృష్ణమ్మ (డైట్ , మెంటాడ ) -
ఏం కష్టమొచ్చిందో..!
సాక్షి, పెందుర్తి: ఏం కష్టమొచ్చిందో ఏమో తల్లీకూతురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. తల్లి పరిస్థితి విషమించి మృత్యువాత పడగా కుమార్తె పరిస్థితి విషమంగా ఉంది. భర్త బయట నుంచి ఇంటికి వచ్చేసరికి భార్య, కుమార్తె అపస్మారకస్థితిలో పడి ఉండడం చూసి కంగారులో అటూఇటూ పరిగెడుతూ జారిపడడంతో అతనూ తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలయ్యాడు. ఈ విషాద ఘటన పెందుర్తి పోలీస్‌స్టేషన్ పరిధిలోని జీవీఎంసీ 70వ వార్డు పురుషోత్తపురం సమీపంలోని గోకుల్ధామ్కాలనీలో శనివారం చోటు చేసుకుంది. వివరాలు...వ్యవసాయశాఖ విశ్రాంత అధికారి మేడేదల దివాకర్, లక్ష్మి (56) దంపతులు. గోకుల్ధామ్ కాలనీలో నివాసం ఉంటున్నారు. వీరి కుమార్తె గిరిజా ప్రసన్నరాణి భర్త కొన్నాళ్ల క్రితం మరణించడంతో ఆమె కూడా వీరితో పాటే ఉంటోంది. గిరిజ ఓ ప్రవేటు పాఠశాలలో పనిచేసి ఇటీవల మానేసింది. కాగా దివాకర్ శనివారం ఉదయం మెడికల్ రిపోర్ట్‌ల కోసం ఆసుపత్రికి వెళ్ళాడు. మంచినీరు సరఫరా చేసే వ్యక్తి మధ్యాహ్నం దివాకర్ ఇంటికి వచ్చి తలుపు తట్టగా ఎవరూ బయటకు రాలేదు. అనుమానం వచ్చి అతను కిటికిలో నుంచి చూడగా తల్లీకూతుళ్లు లక్ష్మి, గిరిజ ఇంటి హాల్లో అపస్మారకస్థితిలో పడి ఉన్నారు. వెంటనే ఆ వ్యక్తి స్థానికులను పిలవగా వారు 100 డయల్ ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి తలుపులు తెరిచి 108 ద్వారా ఇద్దరినీ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో లక్ష్మి మృతి చెందింది. గిరిజను కేజీహెచ్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. కూల్‌డ్రింక్‌లో పురుగుల మందు తాగి వీరు ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు పోలీసులు నిర్థారించారు. సీఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఎస్ఐ శ్రీనివాస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే వీరి ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియరాలేదు. మరోవైపు బయటకు వెళ్లిన దివాకర్‌కు పోలీసులు ఇంటి వద్ద పరిస్థితిపై సమాచారం ఇవ్వగా ఆయన ఇంటికి వచ్చారు. భార్య, కుమార్తెల పరిస్థితి చూసి హడలిపోయారు. పరిగెత్తుకుంటూ వెళ్లిన క్రమంలో జారి కిందపడిపోయారు. దీంతో ఆయన పక్కటెముక విరిగిపోయింది. దివాకర్‌ను కూడా అదే 108లో ఆసుపత్రికి తరలించారు. -
పీలేరులో తల్లీబిడ్డ అదృశ్యం
పీలేరు: బిడ్డతో సహా తల్లి అదృశ్యమైన ఘటన పీలేరులో సోమవారం చోటుచేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. పీలేరు యల్లమంద క్రాస్‌కు చెందిన గురునాథ్, శివరాణి దంపతులకు రుషికేశ్వర్(2) కుమారుడు ఉన్నాడు. ఆ చిన్నారికి ఆరోగ్యం సరిగా లేదని శివరాణి శనివారం ఉదయం 8 గంటలకు ఆస్పత్రికి తీసుకెళ్లింది. 10 గంటలవుతున్నా ఇంటికి రాకపోవడంతో గురునాథ్ భార్యకు ఫోన్ చేశాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో చుట్టుపక్కల, బంధువుల ఇళ్లలో విచారించాడు. ఫలితం లేకపోవడంతో సోమవారం పీలేరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
తల్లీ కూతుళ్లకు ఒకేసారి ప్రభుత్వ ఉద్యోగాలు
చదువు ఆపేసిన పన్నెండేళ్లకు తిరిగి ప్రారంభించి ఏకంగా లెక్చరర్ ఉద్యోగం సాధించిన ఘనత తల్లిది. చిన్న వయసులో చైల్డ్ డవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఉద్యోగం తెచ్చుకున్న ఘనత కూతురిది. ఇద్దరూ ఒకే ఏడు పోటీ పరీక్షలు రాసి ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించుకున్నతల్లి రౌతు పద్మ, కూతురు అలేఖ్య పటేల్ సక్సెస్ ఇది.. తల్లీ కూతుళ్లు పోటీ పడి చదువుకోవడం ఈ రోజుల్లో పెద్ద వింతేమీ కాకపోవచ్చు. కానీ ఇద్దరూ ఒకే ఏడు పోటీ పరీక్షలు రాసి, ఉత్తీర్ణత సాధించడం ఒక ఎత్తు అయితే .. విజయవంతంగా ప్రభుత్వ ఉద్యోగాలు పొందడం మరో ఎత్తు. పెద్ద కుటుంబంలో చిన్న కోడలు పెళ్లయిన 12 సంవత్సరాల తరువాత తిరిగి చదువును కొనసాగించాలనుకుంది పద్మ. అలా మొదలు పెట్టి.. రాసిన ప్రతి పరీక్షలో ఉత్తీర్ణత సాధించింది. డిగ్రీ పాసై అటు పైన పోస్టు గ్రాడ్యుయేషన్, బీఈడి, ఎంఈడీ, నెట్ అర్హతలు సాధించి అంతిమంగా టీఎస్పీఎస్సీ ద్వారా గురుకుల కళాశాలలో పీజీటీగా ఎంపికైంది. ఇపుడు సిరిసిల్ల జిల్లా చిన బోనాలలోని రెసిడెన్షియల్ కాలేజ్‌లో పీజీటీగా బాధ్యతలు నిర్వహిస్తోంది. తన విజయం గురించి పద్మ మాట్లాడుతూ – ‘మాది మంథని దగ్గరి రామకృష్ణాపూర్. పదో తరగతి పూర్తయ్యాక వివాహం అయింది. ఎనిమిది మంది సంతానం గల పెద్ద కుటుంబానికి చిన్న కోడలుని. మా అమ్మాయి అలేఖ్య ఆరో తరగతి వచ్చే వరకు ఇంటి పనులు చక్కదిద్దడం, పిల్లల్ని స్కూల్‌కి పంపడం, వంటా వార్పుతోనే సరిపోయేది. పాప తన పనులు తాను చేసుకునే స్థితికి చేరుకుంది. ఈ క్రమంలో చూస్తుండగానే 12 ఏళ్లు గడిచిపోయాయి. చాలా సార్లు చదువు పైన నాకు ఇష్టం ఉందని గ్రహించిన మా వారు తిరిగి చదువుకొమ్మని ప్రోత్సహించారు. అలా అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ప్రవేశ పరీక్ష ద్వారా డిగ్రీ పూర్తి చేశాను. తొలి ప్రయత్నంలోనే పాసవడంతో మరింత ప్రోత్సాహం లభించింది. ఆ తర్వాత రెగ్యులర్‌గా బీఈడి, ఆ పైన ఎంఈడి పూర్తి చేశాను. ఎంఈడిలో నాది రాష్ట్రంలో 9వ ర్యాంకు. జాతీయ పరీక్ష నెట్లో కూడా అర్హత సాధించాను. తొలి ప్రయత్నంలోనే రెసిడెన్షియల్ టీచర్‌గా ఎంపికయ్యాను. టీజీటి, పీజీటి స్థాయి పోస్టుల్లో రెండేసి సబ్జక్టుల్లో తెలుగు, సోషల్‌కు ఎంపికయ్యాను. ఫైనల్‌గా పీజీటి తెలుగులో జాయిన్ అయ్యాను’ అని వివరించింది పద్మ. అమ్మతో పోటీ పడిన కూతురు తనేమీ తక్కువ కాదనుకున్న కూతురు అలేఖ్య మరింత ఎక్కువగా శ్రమ పడి టీఎస్ పీఎస్సీలో రాష్ట్ర స్థాయి మొదటి ర్యాంకును సాధించింది. ఇప్పుడు శిశు సంక్షేమ శాఖలో రాజన్న సిరిసిల్ల జిల్లా సీడీపీవో(చైల్డ్ డవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్)గా బాధ్యతలు నిర్వహిస్తోంది. తన విజయం గురించి అలేఖ్య మాట్లాడుతూ –‘చిన్నప్పటి నుంచి చదువులో అమ్మా, నాన్నల ప్రోత్సాహం చాలా గొప్పది. నాన్న బాగా ఎంకరేజ్ చేశారు. çపది, ఇంటర్మీడియోట్ 95 శాతం మెరిట్‌తో పాసయ్యాను. అప్పట్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో స్మితా సభర్వాల్ అనే ఐఏఎస్ ఆఫీసర్ కలెక్టర్‌గా ఉండేవారు. పరిపాలనలో మేడమ్ డైనమిజం చూసి చాలా ఆకర్షితురాలినయ్యాను. నేను కూడా కలెక్టర్ కావాలనుకునేంతగా స్ఫూర్తి పొందాను. అందుకే ఐఏఎస్ అకాడమీలో చేరి మూడేళ్ల డిగ్రీ పూర్తి చేశాను. ఐసీడీఎస్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఉద్యోగం కోసం టీఎస్పీఎస్సీ పరీక్ష రాసి స్టేట్ ఫస్ట్‌లో మెరిట్ సాధించాను. ఉద్యోగంలో చేరేనాటికి 21 ఏండ్ల 10 నెలల వయసు. చిన్న వయసులోనే పెద్ద ఉద్యోగంలో చేరిపోయానని ఇంట్లో అందరూ మెచ్చుకున్నారు. రాష్ట్రంలోని అతి పెద్ద ప్రాజñ క్ట్ను మానిటర్ చేసే హోదాలో చేరడం చాలా సంతోషంగా ఉంది. ఇంతటితో ఆగిపోకుండా సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్నాను. సాధించగలననే నమ్మకం ఉంది’ అని తెలిపింది. ఇంట్లో స్నేహితులం తల్లీ కూతుళ్లుగా బంధం నిర్ణయించినప్పటికీ ఇంట్లో ఇద్దరం మంచి స్నేహితులం. ప్రతి చిన్న విషయాన్ని షేర్ చేసుకుంటాం. ‘ఇవి పెద్దవాళ్లు మాట్లాడుకునే మాటలు’ అని అమ్మ అనదు, ‘ఇది నాకు మాత్రమే సంబంధించిన విషయం’ అని నేను అనుకోను. చదువు, ప్రిపరేషన్ గురించే కాదు ఇంటి పనుల్లోనూ పక్కా ప్లానింగ్‌తో చేసేవాళ్లం. మా చుట్టుపక్కల వీళ్లు తల్లి కూతుళ్లు అనే కన్నా ఇద్దరినీ మంచి స్నేహితులు అంటుండేవారు. ఒక సిస్టమాటిక్ ఆర్డర్లో రూపొందించుకున్న టైమ్ టేబుల్‌ను అనుసరిస్తూ పరస్పరం ప్రోత్సహించుకుంటాం. అదృష్ట్టవశాత్తు ఇద్దరికీ ఒకే జిల్లాలో పోస్టింగ్ రావడం చాలా సంతోషాన్నిస్తోంది. మా ఇద్దరి గురించి అందరూ మాట్లాడుకుంటున్నారని తెలిస్తే చాలా గర్వంగా ఉంటుంది’ అని తెలిపింది అలేఖ్య. తల్లీ కూతుళ్లుగా తాము సాధించిన విజయాల వెనుక రౌతు రమేశ్ పాత్ర కీలకమైంది. పద్మ భర్త రమేశ్ సింగరేణి కాలనీలో చిరుద్యోగి. పెద్ద కుటుంబంలో చిన్నవాడు. అయితేనేం అర్థాంగి మనస్తత్వాన్ని, ఆమె అంతరంగాన్ని సరిగ్గా అర్థం చేసుకుని చదువుకోవాలని ప్రోత్సహించాడు. ఈ వయసులో చదువెందుకు అని ప్రశ్నించిన వారికి చిరునవ్వుతో సమాధానమిస్తూనే ఉన్నత విద్య విషయంలో రాజీ పడలేదు. అందుకే తాము సాధించిన ఈ విజయాలకు సంబంధించిన క్రెడిట్ మొత్తం రమేశ్‌కే దక్కుతుందని తల్లీ కూతుళ్లిద్దరూ ఆనందంగా చెబుతారు.– గెంట్యాల భూమేశ్, సిరిసిల్ల కల్చరల్ఫొటో: వంకాయల శ్రీకాంత్ -
చైన్ స్నాచింగ్, రఫ్పాడించిన తల్లీకూతుళ్లు
-
చైన్ స్నాచింగ్, రఫ్పాడించిన తల్లీకూతుళ్లు
సాక్షి, న్యూఢిల్లీ : మెడలో బంగారు గొలుసులతో ఆడవాళ్లు కనిపిస్తే.. చైన్ స్నాచింగ్‌లతో రెచ్చిపోయే కేటుగాళ్ల ఆగడాలకు చెక్ చెప్పే సంఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. తన మెడలో గొలుసు లాక్కునేందుకు ప్రయత్నించిన యువకుడికి కూతురుతో కలిసి తగిన శాస్తి చేసిందో మహిళ. ఆగస్టు 30న ఢిల్లీలో ఈ సంఘటన చోటు చేసుకుంది. తల్లీ కూతుళ్లు పక్కన నిలుచొని ఉండగా, బైక్‌పై వచ్చిన దుండగుల్లో ఒకడు మహిళ మెడలోని చెయిన్ లాక్కొని పారిపోయేందుకు ప్రయత్నించాడు. అంతే శరవేగంగా స్పందించిన ఆమె (తల్లి) బైక్‌పై వెనక కూర్చుని ఉన్న అతగాణ్ని గుంజి నాలుగు తగిలించింది. దీనికి యువతి (కూతురు) కూడా తోడయ్యింది. ఇంతలో చుట్టుపక్కల వారు కూడా జత కూడడంతో అతగాడి ఆట కట్టింది. ఈ దృశ్యాలు మొత్తం సీసీటీవీలో రికార్డయ్యాయి. మరోవైపు బైక్‌పై వున్న మరో యువకుడు పారిపోవడం కూడా కెమెరా కంటికి చిక్కింది. ఈ సమాచారం ఆధారంగా పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. -
తల్లీకూతురును కలిపిన వాట్సాప్
యాదగిరిగుట్ట: తప్పి పోయిన బాలికను తల్లి ఒడికి చేర్చింది వాట్సాప్. జనగామ జిల్లా కేంద్రానికి చెందిన అక్షిత అనే విద్యార్థిని శుక్రవారం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయింది. తల్లి నిర్మల మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చి చూడగా కూతురు కనిపించలేదు. కంగారు పడిన తల్లి.. అక్షితకు స్కూల్లో చదువు చెప్పిన అమ్మఒడి అనాథ ఆశ్రమ నిర్వాహకురాలు జెల్లా దివ్యకు తెలిపింది. వెంటనే ఆమె భర్త జెల్లా శంకర్‌కు అక్షిత ఫొటో, వివరాలతోపాటు తప్పిపోయిన సమాచారాన్ని తెలిపింది. ఆయన అమ్మఒడి అనాథ ఆశ్రమం వాట్సాప్ గ్రూప్‌లతోపాటు వివిధ గ్రూప్‌లలో పెట్టారు. దీంతో అక్షిత గుంటూరు జిల్లా కేంద్రం లో ఉందని, పోలీసులకు అప్పగించామని స్థానికులు.. ఆశ్రమ నిర్వాహకులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. బాలికలను పోలీసులు గుంటూరులోని సీడబ్ల్యూసీ కేంద్రానికి తరలించారు. శనివారం ఉదయం అక్షిత తల్లి నిర్మల, అమ్మఒడి ఆశ్రమ నిర్వాహకులు గుంటూరుకు వెళ్లి బాలికను తీసుకువచ్చారు. -
కుమార్తెతో సహా మహిళ అదృశ్యం.. పక్కింటి యువకుడిపై
లంగర్‌హౌస్: కుమార్తెతో సహా ఓ మహిళ అదృశ్యమైన సంఘటన గురువారం లంగర్‌హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఓ యువకుడిపై అనుమానం వ్యక్తం చేస్తూ కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిని విచారణ నిమిత్తం స్టేషన్‌కు రప్పించగా చేయి కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు నటించాడు.పోలీసులు, బాధితుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కర్నూలు జిల్లా, పారుమంచాల గ్రామానికి చెందిన ప్రసాద్, ప్రియాంక దంపతులకు ఇద్దరు కుమార్తెలు. బతుకుదెరువు నిమిత్తం ఆరేళ్ల క్రితం నగరానికి వలస వచ్చిన వీరు లంగర్‌హౌస్, ప్రశాంత్‌నగర్‌లో ఉంటున్నారు. ప్రసాద్ సెక్యూరిటీగార్డుగా పని చేసేవాడు. ఈ నెల 21న ప్రసాద్ డ్యూటీకి వెళ్లిపోగా ప్రియాంక, తన చిన్న కుమార్తె స్వరూప(4)ను తీసుకొని ఇంట్లో నుంచి బయటికి వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబసభ్యులు పరిసరాల్లో గాలించినా ప్రయోజనం లేక పోవడంతో ప్రసాద్ లంగర్‌హౌస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రియాంక పక్కింట్లో ఉంటున్న ఆదిత్యతో చనువుగా ఉండేదని ఈ విషయమై తమ మధ్య గతంలో గొడవలు జరిగినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆదిత్యతో పాటు అతని అక్క దీప కలిసి తన భార్యా పిల్లలను కిడ్నాప్ చేసి ఉంటారన్నాడు. చికిత్స పొందుతున్న నిందితుడు ఆదిత్య ఆత్మహత్యాయత్నం నాటకం.. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆదిత్య, అతని సోదరి దీపికను అదుపులోకి తీసుకుని విచారించారు. తన తమ్ముడు, ప్రియాంక చనువుగా ఉన్న మాట వాస్తవమేనని, దీంతో తమ సోదరుడిని కట్టడి చేసినట్లు దీపిక పోలీసులకు తెలిపింది. మధ్యాహ్నం భోజనం చేసేందుకు వెళ్లిన ఆదిత్య బ్లేడుతో చేతిపై గాటు పెట్టుకుని పోలీసులను బెదిరించే ప్రయత్నం చేశాడు. పోలీసుల వేధింపుల కారణంగా తాను ఆత్మహత్యాయత్నం చేసినట్లు చెప్పినా లంగర్‌హౌస్‌లోని ఓ ఆస్పత్రి వైద్యులు పోలీసులకు సమాచారం అందించకుండానే అతడికి చికిత్స అందించారు. దీంతో సదరు ఆస్పత్రి వైద్యులపై చర్యలు తీసుకోన్నట్లు పోలీసులు తెలిపారు. తల్లికూతుళ్ల ఆచూకీ తెలిసిన వారు 9490616567 నంబర్‌కు సమాచారం అందించాలని సూచించారు. -
అమ్మా.. నీ వెంటే నేను
కడప కార్పొరేషన్: ఆ ఇంట శోకసంద్రం నెలకొంది. 24 గంటల వ్యవధిలో తల్లీ కూతుర్లు మరణించిన వైనం తీవ్ర విషాదం నింపింది. కుటుంబ సభ్యులను దిగ్బ్రమలో ముంచెత్తింది. కడప నగరం రామాంజనేయపురం ఎలక్ట్రికల్ కాలనీలో ఉంటున్న మాధు సుబ్బమ్మ(75) కొంతకాలం నుంచి వృద్ధాప్యపరమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతోంది. భర్త కొండారెడ్డి గతంలోనే చనిపోయాడు. ఈమెకు ముగ్గురు కుమారులు..ఒక కుమార్తె. వీరి కుటుంబం అట్లూరు మండలంలో వ్యవసాయం చేసేవారు. ముంపు బాధితులుగా కడప వచ్చేశారు. సుబ్బమ్మ కుమార్తె ఇంట్లో ఉంటోంది. మంగళవారం సాయంత్రం సుబ్బమ్మ చనిపోయింది. దీంతో కుటుంబ సభ్యులందరూ చేరుకున్నారు. బుధవారం ఆమెకు అంత్యక్రియలు నిర్వహించారు. స్మశాన వాటిక నుంచి తిరిగి వచ్చేలోగా ఆ ఇంట మరో మరణం సంభవించింది. మృతురాలి కుమార్తె యండ్ల వెంకటసుబ్బమ్మ (50) ఉదయం 10–30గంటల ప్రాంతంలో ఆకస్మికంగా చనిపోయింది. దీంతో కుటుంబ సభ్యులంతా షాక్ అయ్యారు. తల్లి మరణంతో కుంగిపోయిన వెంకట సుబ్బమ్మ వడదెబ్బకు గురైందని కుటుంబ సభ్యులు తెలిపారు. మృతురాలు వెంకటసుబ్బమ్మకు భర్త నాగిరెడ్డితోపాటు కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఒక రోజు తిరగకమునుపే ఇద్దరు చనిపోవడంతో కుటుంబ సభ్యులందరూ దు:ఖ సాగరంలో మునిగిపోయారు. -
అవమానంతో తల్లీకూతుళ్ల ఆత్మహత్యాయత్నం
అనంతపురం, బత్తలపల్లి: విచారణ పేరిట రైల్వే పోలీసులు బెదిరింపులకు దిగడంతో అవమాన భారం భరించలేక తల్లీ కూతుళ్లు ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటనలో కూతురు మృతి చెందగా.. తల్లి పరిస్థితి విషమంగా ఉంది. వివరాల్లోకెళ్తే... పోట్లమర్రి గ్రామానికి చెందిన శ్రీరాములు, కృష్ణమ్మ దంపతులకు మతిస్థిమితంలేని కూతురు జయమ్మ, కుమారుడు మారుతి ఉన్నారు. కుమారుడు మారుతి గతంలో రైల్వేస్టేషన్లో ఏటీఎం కార్డు దొంగిలించి డబ్బును విత్‌డ్రా చేశాడనే కారణంతో ఏడాది క్రితం తన ఇంటికి వచ్చిన రైల్వే పోలీసులు తమ ఇంటిలోని రూ.65 వేల నగదుతోపాటు ఆరు తులాల బంగారు నగలు తీసుకెళ్లారని శ్రీరాములు తెలిపాడు. అందులో బంగారు మాత్రం వెనక్కి ఇచ్చారన్నారు. నాలుగు రోజుల క్రితం అర్ధరాత్రి వేళ రైల్వే పోలీసులు మరోసారి ఇంటికి వచ్చి తన కుమారుడిని అప్పగించాలని కోరారన్నారు. పోలీసులు కొడతారన్న భయంతో కుమారుడు ఇంటి నుంచి పారిపోయాడని తెలిపారు. పోలీసుల బెదిరింపులు.. అవమాన భారం భరించలేక తన భార్య కృష్ణమ్మ, బుద్ధిమాంద్యం గల కుమార్తె జయమ్మలు ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూలేని సమయంలో విషపుగుళికలు మింగి ఆత్మహత్యాయత్నం చేశారన్నారు. వెంటనే ఇద్దరినీ బత్తలపల్లి ఆర్డీటీ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ కుమార్తె జయమ్మ మృతిచెందింది. కృష్ణమ్మ పరిస్థితి విషమంగా ఉంది. తన కుమార్తె మృతికి, తన భార్య చావుబతుకుల్లో ఉండటానికి కారణం రైల్వే పోలీసులేనని బాధితుడు శ్రీరాములు బత్తలపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
మాల్ ఓనర్ కీచకత్వం..తల్లి ఆత్మహత్య
-
తల్లీ కూతురు అదృశ్యం
యాప్రాల్: నేరేడ్‌మెట్‌పోలీస్ స్టేషన్ పరిధిలో తల్లీకూతుళ్లు అదృశ్యమయ్యారు. సీఐ నర్సింహస్వామి శుక్రవారం తెలిపిన మేరకు.. ఈస్ట్‌కాకతీయనగర్‌కు చెందిన ఎం అరుణ(25) ఆమె కూతురు రేవతి( 5)తో ఈనెల 14న ఇంట్లో నుంచి బయటికి వెళ్లి తిరిగి రాలేదు. తెలిసిన వారి వద్ద వెతికినా జాడ తెలయలేదు. కుటుంబ సభ్యుల పిర్యాదు మేరకు , కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ తెలిపారు, -
తల్లీ కుమార్తె అదృశ్యం
విశాఖ క్రైం, గాజువాక: స్థానిక వై జంక్షన్‌కు సమీపంలో గల నోవాస్ ఫ్లోరెన్స్ అపార్ట్మెంట్స్ నుంచి ఒక మహిళతోపాటు ఆమె రెండేళ్ల కుమార్తె అదృశ్యమైనట్టు గాజువాక పోలీసులకు ఫిర్యాదు అందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... అస్సాం రాష్ట్రానికి చెందిన కస్టా బరుయాటీ డాక్టర్‌గా పని చేస్తూ కుటుంబ సభ్యులతో కలిసి నోవాస్ అపార్ట్‌మెంట్స్‌లో నివాసముంటున్నారు. ఈ నెల 11న రాత్రి అందరూ నిద్ర పోతున్న సమయంలో అతడి భార్య అంజలి సైకియా (26), తన రెండేళ్ల కుమార్తె లియాను తీసుకొని బయటకు వెళ్లిపోయింది. రెండు రోజులు గడిచినా తిరిగి రాలేదు. అన్నిచోట్లా వెతికినప్పటికీ ఆచూకీ లభించకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. ఆమె గతంలో కూడా రెండు సార్లు ఇదే మాదిరిగా ఇంటి నుంచి వెళ్లిపోయి తిరిగి వచ్చిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. డాక్టర్ బరుయాటీ ఫిర్యాదు మేరకు ఎస్ఐ శ్రీనివాసరావు కేసు నమోదు చేశారు. ఎవరికైనా ఆచూకీ లభిస్తే 9440796014, 9440933764 నంబర్లకు సమాచారం ఇవ్వాలని ఎస్ఐ కోరారు. -
కరీంనగర్ జిల్లాలో విషాదం
సాక్షి, కరీంనగర్ : కరీంనగర్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని సైదాపూర్ మండలం బొమ్మకల్‌లో ఒంటిపై కిరోసిన్ పోసుకొని తల్లి, కుమార్తె ఆత్మహత్య చేసుకున్నారు. మృతులను అనసూయ(70), విజయ(40)గా గుర్తించారు. వీరి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. -
గోదావరిలో దూకి తల్లీకూతుళ్ల ఆత్మహత్య
దండేపల్లి(మంచిర్యాల)/ధర్మపురి: కుటుంబ కలహాలు.. ఆర్థిక ఇబ్బందులతో ఓ తల్లి తన కూతురుతో సహా గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం రాయపట్నం వద్ద సోమవారం వెలుగుచూసింది. మృతులది మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం నంబాల గ్రామం. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. నంబాల గ్రామానికి చెందిన గోపతి సత్తయ్య, రాంబాయి దంపతులకు పంచకూల, పారిజాతం కూతుళ్లు. 2004 నుంచి సత్తయ్య సింగాపూర్ వెళ్లివస్తున్నాడు. అయినప్పటికీ నయాపైసా సంపాదించలేదు. ఏడేళ్ల క్రితం వారికున్న నాలుగెకరాల్లో రెండెకరాలు అమ్మి.. పెద్ద కూతురు పంచకూల వివాహం చేశారు. ప్రస్తుతం చిన్న కూతురు పెళ్లీడుకొచ్చింది. సింగాపూర్‌లో ఉన్నా.. ఇక్కడున్నా.. సత్తయ్య కుటుంబాన్ని ఏనాడూ పట్టించుకునేవాడుకాదు. ఇటీవలే సింగాపూర్ నుంచి వచ్చిన సత్తయ్యతో కూతురుకు పెళ్లి చేయాలనే విషయాన్ని రాంబాయి వివరించింది. దీనికి సమాధానం చెప్పకపోవడంతో ఉన్న రెండెకరాలు విక్రయించేందుకు రాంబాయి సిద్ధపడింది. దీనికి సత్తయ్య అడ్డుపడ్డాడు. 15రోజులుగా ఇంట్లో కలహాలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో విరక్తి చెందిన రాంబాయి జాతకం చూపిద్దామని ఆదివారం ఉదయం కూతురు పారిజాతంతో కలిసి ధర్మపురికి బయల్దేరింది. రాత్రివరకూ ఇంటికి రాకపోవడంతో సత్తయ్య, కుటుంబసభ్యులు గాలించారు. సోమవారం రాయపట్నం వద్ద గోదావరిలో రెండు మృతదేహాలు కనిపించిన విషయం తెలుసుకున్న గ్రామస్తులు.. బంధువులు చేరుకుని రాంబాయి(41), పారిజాతం(23)గా గుర్తించారు. సంఘటనా స్థలానికి సీఐ లక్ష్మీబాబు, ఎస్సై లక్ష్మీనారాయణ చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతురాలి సోదరుడు వెంకటస్వామి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. నంబాలలో విషాదఛాయలు రాయపట్నం వద్ద మృతదేహాలను చూసిన అనంతరం కుటుంబసభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. తల్లీ, కూతుళ్లు జంటగా ఆత్మహత్య చేసుకోవడంతో నంబాల గ్రామంలో విషాద చాయలు అలముకున్నాయి. -
ఒకరికొకరు...
తల్లికి 102 ఏళ్లు... కూతురికి 72 ఏళ్లు. తల్లీకూతుళ్ల అనుబంధానికి, ఆప్యాయతకు నిర్వచనం వీరు. ఫిలింనగర్ మహాత్మాగాంధీనగర్లోని చిన్ని గుడిసెలో నివసిస్తున్న వీరు... ఒకరికొకరు తోడుగా జీవనం సాగిస్తున్నారు. కూతురు జీహెచ్ఎంసీలో ఒప్పంద కార్మికురాలిగా పనిచేస్తుండగా... కూతురికి ఇంట్లో సాయపడుతోంది తల్లి. వృద్ధాప్యంలోనూ ఎలాంటి వ్యాధులూ వీరి దరిచేరలేదు. ఇప్పటికీ పనులు చేసుకుంటూ... ఒకరికి ఒకరై ఉంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారీ తల్లీకూతుళ్లు. వారే లక్ష్మమ్మ, మంగవేణి. బంజారాహిల్స్: లక్ష్మమ్మ స్వస్థలం కృష్ణాజిల్లా గుడివాడ సమీపంలోని గుడ్లవల్లేరు. ఈమెకుఐదుగురు కొడుకులు, ఒక కూతురు(మంగవేణి). వీరిలో ఇద్దరు కొడుకులు మరణించగా, మిగతా ముగ్గురు ఎవరి దారి వారు చూసుకున్నారు. ఒంటరి అయిన లక్ష్మమ్మ కూతురు చెంత చేరింది. తల్లిని బరువుగా భావించక.. బాధ్యతగా చూసుకుంటోంది మంగవేణి. తల్లికి తోడుగా తనయ... ‘కంటే కూతుర్నే కనాలి...’ అనే దానికి అసలైన నిర్వచనంగా నిలుస్తోంది మంగవేణి. వందేళ్ల వయసు పైబడిన తల్లికి అన్నీ తానైంది. తల్లిని కొడుకులు కాదంటే తానే కొడుకైంది. బతుకుదెరువు నిమిత్తం 30 ఏళ్ల క్రితం నగరానికి వచ్చి ఫిలింనగర్‌లోని మురికివాడల్లో గుడిసె వేసుకున్న మంగవేణి... తల్లికి సొంతూరిలో ఇల్లు కట్టించి కొన్ని రోజులు ఉంచింది. అయితే తల్లికి వృద్ధాప్యం రావడం, తరచూ వెళ్లిరావడం ఇబ్బందవుతుండడంతో తన దగ్గరికే తీసుకొచ్చి సాకుతోంది. పిల్లలకు పెళ్లిళ్లు చేసింది... మంగవేణికి కూడా ముగ్గురు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. భర్త 25ఏళ్ల క్రితమే చనిపోగా, పిల్లల్ని పెంచి పెద్దచేసింది. అందరికీ పెళ్లిళ్లు చేసింది. ఇప్పుడు తల్లి కోసం కొడుకును కాదని, లక్ష్మమ్మ దగ్గరే ఉంటోంది. భర్త చనిపోవడంతో కుటుంబ భారం మంగవేణి మీద పడింది. 20 ఏళ్ల క్రితం జీహెచ్ఎంసీలో స్వీపర్‌గా పని దొరికింది. అప్పటి నుంచి ఆ పని చేస్తూనే జీవితాన్ని నెట్టుకొస్తోంది. ఇప్పటికీ పనిచేస్తూ నెలవారీ ఖర్చులు చూసుకుంటోంది. లక్ష్మమ్మను చూస్తే మనందరికీ ఆశ్చర్యం వేస్తుంది. 102ఏళ్ల వయసులోనూ తన పనులు తానే చేసుకుంటుంది. ఇంటి పనుల్లో కూతురికి సాయం చేస్తుంది. ఇప్పటికీ ఎలాంటి అనారోగ్యానికి గురికాలేదని చెప్పే లక్ష్మమ్మ... నవ్వుతూ.. నవ్విస్తూ.. ఎలాంటి ఒత్తిడి లేకుండా ఉంటే ఎన్నేళ్లయినా బతికేయొచ్చు అంటోంది. టీవీ తెలీదు... కూతురు మంగవేణి స్వీపర్‌గా పనిచేస్తూ పోషిస్తుండగా... ఇంటి పనులు చూసుకుంటూ ఆమె కంటే చురుగ్గా ఉంటోంది లక్ష్మమ్మ. సమయానికి భోజనం.. అదీ మితంగా, ప్రతిరోజు పావుగంట నడక... వీటితోనే తాను ఆరోగ్యంగా ఉన్నానని చెబుతోందీ బామ్మ. ‘షుగర్, బీపీ, దంత, నేత్ర సమస్యలేవీ నాకు లేవు. ఎలాంటి ఒత్తిడి లేకపోవడంతోనే ఇది సాధ్యమైంది. రాత్రి 8గంటలకు నిద్రపోయి... తెల్లవారుజామున 4గంటలకు లేవడం అలవాటు. మధ్యాహ్నం కూడా కొంతసేపు కునుకు తీస్తాను. నా బట్టలు నేనే ఉతుక్కుంటాను. ఇప్పటికీ టీవీ అంటే తెలియద’ని చెప్పింది. అదే ఆరోగ్య రహస్యం.. దేవుడి భక్తి ఎక్కువున్న లక్ష్మమ్మకు భజనలు చేయడమంటే ఇష్టం. ఉదయం సూర్యనమస్కారాలు చేస్తుంది. ‘సంపాదనపై అనాసక్తి, ఇతరులపై ఈర‡్ష్య, ద్వేషాలు లేకపోవడం.. అలాంటి ఆలోచనలు కూడా నాదరి చేరకపోవడం.. జీవితంపై ఎలాంటి ఒత్తిడి లేకపోవడమే నా ఆరోగ్య రహస్యమ’ని చెప్పిందీ బామ్మ. ఇప్పటివరకు జ్వరమంటే తెలీదు. ఒక్కసారీ ఇంజక్షన్ వేయించుకోలేదు. ఏదైనా దెబ్బ తగిలితే, తలనొప్పి వస్తే ఆకు రసం పిండుకొని నెత్తికి రాసుకోవడమే తనకు తెలిసిన వైద్యమని చెప్పింది. తాటిబెల్లం.. జొన్నరొట్టె ‘నేను చాలా రోజులు వ్యవసాయం చేశాను. చిన్నప్పుడు తాటిబెల్లం బాగా తినేదాన్ని. ఈ వయసులోనూ చికెన్, మటన్ తింటాను. కట్టెల పొయ్యిపై జొన్నెరొట్టెలు చేసుకొని తింటాను. అంబలి తాగుతాను. నాకు దివంగత ప్రధాని ఇందిరాగాంధీ అంటే చాలా ఇష్టం. వయసులో ఉన్నప్పుడు సినిమాలు చూసేదాన్ని. ఎన్టీఆర్, ఏఎన్నార్, సావిత్రి సినిమాలంటే ఇష్టం. ఇప్పటికీ ప్రతి ఎన్నికల్లో ఓటు వేస్తుంటాన’ని చెప్పిందీ బామ్మ. ఆనందం.. ఆరోగ్యం ఈ తల్లీకూతుళ్లకు వృద్ధాప్యం మీద పడినా ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు. కేవలం శారీరక నొప్పులు తప్పితే తనకేమీ తెలియవని చెప్పుకొచ్చింది మంగవే ణి. చేతకాని తనంలో ఇంటి పట్టున ఉండొచ్చు కదా..? అంటే ‘నాకు ఇంకా సత్తువ ఉంది. ఇంట్లో కూర్చుంటే నాకు, నా తల్లికి బువ్వెట్ల వస్తుంద’ని చెప్పింది. మొత్తానికి వందేళ్లు పైబడిన తల్లికి 70ఏళ్లు పైబడిన బిడ్డ చేస్తున్న సేవ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ వయసులోనూ తెల్లవారుజామున 4 గంటలకే లేచి తల్లికింత వండిపెట్టి, చీపురు పట్టుకొని విధులకు హాజరవుతోంది. బంజారాహిల్స్ రోడ్ నెం.12లో రోడ్లు ఊడ్చే మంగవేణి.. ఆరోగ్యం బాగోలేదంటూ సెలవు పెట్టింది లేదని అధికారులు పేర్కొన్నారు. ఇంటికివెళ్లగానే తల్లికి స్నానం చేయించి, తినిపిస్తుంది. సాయంత్రానికి తల్లితో ముచ్చట్లు, రాత్రికి మళ్లీ వంట.. ఇదీ మంగవేణి దినచర్య. -
కన్నీళ్లు దిగమింగుతూ.. కష్టాలతో పోరాడుతూ..
‘కష్టాలు రానీ.. కన్నీళ్లు రానీ.. ఏమైనా కానీ.. ఎదురేది రానీ.. ఓడిపోవద్దు.. రాజీపడొద్దు’ అన్నట్టుగా బతుకు పోరు సాగిస్తోంది. భర్త తోడు లేకపోయినా బిడ్డకు బ్లడ్ క్యాన్సర్ అని తెలిసినా ఏమాత్రం వెరవలేదు. కష్టాలను పంటి బిగువన దాచి గాజుల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషించడంతో పాటు తన కంటి పాప (కూతురు)కు వైద్యం అందిస్తూ ముందుకు సాగుతోంది అన్నం వెంకటరమణ. పాప ఆరోగ్యమే తన శ్వాస.. ధ్యాసగా జీవిస్తూ.. ద్వారకాతిరుమల గుడి సెంటర్లో బండిపై గాజుల వ్యాపారం చేస్తున్న వెంకటరమణ జీవిత గాథ ఆమె మాటల్లోనే.. నేను పుట్టి పెరిగింది ద్వారకాతిరుమలలో నే. చిన్ననాటి నుంచి కష్టాలతో పోరాడుతున్నా. సుమారు 15 ఏళ్ల క్రితం నా భర్త అన్నం సత్యనా రాయణ గుండెపోటుతో మృతిచెందారు. చంటిబిడ్డగా ఉన్న నా కూతురు జ్యోతికి తల్లి, తండ్రి నేనే అయ్యా. జ్యోతికి నాలుగేళ్ల వయసులో అకస్మాత్తుగా జ్వరం సోకింది. వైద్యులకు చూపిస్తే బ్లడ్ క్యాన్సర్ అన్నారు. నా గుండెల్లో రాయి పడినంత పనయ్యింది. అంతే అప్పటివరకు సజావుగా సాగుతోందని అనుకున్న నా జీవితంలో క ల్లోలం రేగింది. నా పరిస్థితి తెలిసిన బంధువులు క్యాన్సర్ సోకిన బిడ్డను ఎక్కడన్నా వదిలేయమన్నారు. అలా చేస్తే నీ పోషణ మేం చూస్తామ ని చెప్పారు. ఇందుకు నా మనసు ఒప్పలేదు నా లుగేళ్ల పాటు కంటికి రెప్పలా సాకిన పాపను వ దల్లేక పోయాను. ధైర్యంగా ముందుకు వెళ్లడమే మంచిదనిపించింది. బిడ్డ ప్రాణాలను కాపాడుకోవాలని గట్టిగా నిశ్చయించుకున్నా ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపా బిడ్డకు పట్టెడన్నం పెట్టాలేకపోతున్నానన్న బాధతో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. చాలా సార్లు తిండి దొరక్క పస్తులు కూడా ఉన్నాను. ఎవరైనా చేయూత నిస్తారేమోనని ఆశగా ఎదు రు చూసేదాన్ని. నన్ను, నా బిడ్డను ఎవరూ ఆదరించలేదు సరికద.. నోరారా పలకరించేవారే క రువయ్యారు. దీనికి తోడు బిడ్డ జ్యోతి అనా రోగ్యం నన్ను మరింతగా కుంగదీసింది. జీవి తంపై విరక్తి చెందిన నేను ఒకానొక సందర్భం లో ఆత్మహత్య చేసుకుందామనుకున్నా అయినా నా బిడ్డను ఒంటరి దానిని చేసి చావడానికి మనసొప్పలేదు. ఎలాగైనా సరే.. చావుకు దగ్గరవుతున్న బిడ్డను బతికించుకోవాలని బ లంగా నిర్ణయించుకున్నా. ధైర్యాన్ని కూడదీసుకుని నా తల్లిదండ్రులు చేసిన గాజుల వ్యాపారంతోనే ముం దుకు సాగాను. ఇప్పటికీ ద్వారకాతిరుమల గు డిసెంటర్లో గాజుల బండితో వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నా. జ్యోతికి ఏ లోటూ లేకుండా చూసుకోవాలన్నదే నా ఆశ. నా బిడ్డకు హైదరాబాద్‌లోని ఎంఎన్జీ ఆస్పత్రిలో క్యాన్సర్ చికిత్స చేయిస్తున్నా. ఇందుకు నెలకు దాదాపు రూ.8 వేల వరకు ఖర్చు అవుతోంది. అష్టకష్టాలు పడి ఆ డబ్బును సమకూర్చుకుంటున్నా. గాజులు అమ్మితేనే మా బతుకు బండి నడుస్తుంది. అన్‌సీజన్‌లో అప్పుల బాధ తప్పడం లేదు. ఇన్ని కష్టాలు భరిస్తూనే నా బి డ్డకు వైద్యం చేయిస్తూ, ప్రస్తు తం గ్రామంలోని సంస్కృతోన్న త పాఠశాలలో పదో తరగతి చదివిస్తున్నా. స్వయం కృషితో ముందుకు సాగుతున్నాను. పాపే నా ప్రాణం నేను ఇప్పటికీ బతుకుతుంది నా పాప జ్యోతి కోసమే. ఆ బిడ్డే లేకుంటే నేను లేను. ఆమెకు మంచి భవిష్యత్ కల్పించాలనో.. ఏమో.. ఆ భగవంతుడు నాకు ఇంకా కష్టపడే శక్తినిచ్చాడు. ఉదయం జ్యోతిని పాఠశాలకు పంపిన తర్వాత వంట చేసుకుని గాజుల వ్యాపారానికి వెళతాను. సాయంత్రం వరకు వ్యాపారం చూసుకుని ఇంటికి చేరతాను. బడి నుంచి వచ్చిన జ్యోతికి కష్టాలు చెప్పుకుని సేదతీరుతుంటాను. ఒకరి కోసం ఒకరం జ్యోతి నేను ఒకరి కోసం ఒకరం అన్నట్టుగా జీవిస్తున్నాం. నా బిడ్డ భవిష్యత్‌కు బంగారు బాట వేయాలన్నదే నా సంకల్పం. అందుకు ఇంకెన్ని కష్టాలైనా భరిస్తాను. ప్రస్తుతం జ్యోతి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది. ఆమెకు మంచి చదువు చెప్పించి, ఓ అయ్య చేతిలో పెట్టాలన్నదే నా ఆకాంక్ష. మగతోడు లేకుండా ఇక్కడివరకు బతుకు బండిని నెట్టుకొచ్చా. అన్నింటికీ ఆ దేవుడే ఉన్నాడన్న ధైర్యంతో ముందుకు సాగుతున్నా. ఓ పక్క భర్త చనిపోయి పుట్టెడు కష్టంలో ఉన్న నా జీవితంలో బిడ్డకు బ్లడ్ క్యాన్సర్ అని తెలిసి మరింత కల్లోలం రేగింది. నా పరిస్థితి చూసి బిడ్డను ఎక్కడన్నా వదిలేయి.. నీ పోషణ మేం చూస్తాం అంటూ బంధువులు ఉచిత సలహా ఇచ్చారు. నాలుగేళ్ల పాటు కంటికి రెప్పలా సాకిన పాపను వదల్లేకపోయాను. ధైర్యంగా ముందుకు వెళ్లడమే మంచిదనిపించింది. కుటుంబాన్ని పోషించడంతో పాటు బిడ్డ ప్రాణాలను కాపాడుకోవడం సవాల్‌గా స్వీకరించా. -
అదృశ్యమైన తల్లీకూతుళ్లు శవాలయ్యారు
సాక్షి, పోలవరం: ఏడాది క్రితంనాటి తల్లీకూతుళ్ల అదృశ్యం కేసును పోలీసులు ఛేదించారు. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం ఎల్.ఎన్.డి.పేట గ్రామానికి చెందిన ఇళ్ల సావిత్రి (40), పులిబోయిన మంగతాయారు(19)లు తల్లీ కూతుళ్లు. వీరు గత ఏడాది నవంబర్ 2వ తేదీ నుండి కనబడకుండా పోయారు. ఈ అదృశ్యం కేసును ఛేదించిన పోలీసులు బుట్టాయగూడెం మండలం కోటరామచంద్రపురం ఐటీడీఏ నుంచి ఎర్రాయగూడెం వెళ్లే రహదారి పక్కన జీడిమామిడి తోటలో వీరి శవాలను కనుగొన్నారు. తల్లీకూతుళ్ళను హత్య చేసి మృతదేహాలను పాతిపెట్టినట్లు పోలీసులు గుర్తించారు. సావిత్రి భర్త రామాంజనేయులు, మంగతాయారు భర్త పులిబోయిన నాగరాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో భర్తలే వీరిని హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. -
ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు
నాయుడుపేటటౌన్: ఆగి ఉన్న లారీని ఢీకొన్న ప్రమాదంలో తల్లీకూతురు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన నాయుడుపేటకు సమీపంలో స్వర్ణముఖీ కాజ్‌వేపై గురువారం జరిగింది. పోలీసుల సమాచారం మేరకు.. డక్కిలి మండలం కమ్మపల్లికి చెందిన వళ్లూరు నాగార్జున కుటుంబం నెల్లూరులోని వేదాయపాళెంలో నివాసముంటుంది. నాగార్జున దుబాయిలో ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అతని కుమారుడు జన్మదిన వేడుకలతోపాటు సంక్రాంతి పండగ కోసం ఇటీవలే నెల్లూరుకు వచ్చాడు. రెండు రోజుల్లో జరిగే అతని కుమారుడు మొదటి జన్మదిన వేడుకలకు బంధువులను పిలిచేందుకు నాగార్జున కుమారుడితోపాటు భార్య వళ్లూరు నిరంజని (31), అతని అత్త ఈతమొక్కల సుబ్బమ్మ(60), అన్న కుమార్తె స్రవంతితో కలిసి కారులో సత్యవేడు, వరదాయపాళెం తదితర ప్రాంతాల్లో ఉన్న బంధువులను పిలిచి, తిరిగి వెంకటగిరికి వెళ్లేందుకు కారులో బయలుదేరారు. వీరు శ్రీకాళహస్తి నుంచి ఏర్పేడు మీదుగా వెంకటగిరి వెళ్లాల్సి ఉండటంతో దారి మరచి నాయుడుపేటకు చేరుకున్నారు. నాయుడుపేట మీదుగా వెంకటగిరికి ప్రయాణమయ్యారు. మార్గమధ్యంలో నాయుడుపేట సమీపంలో స్వర్ణముఖి కాజ్వే వద్ద రోడ్డుపై నిలిచి ఉన్న లారీని కారు అదుపుతప్పి ఢీకొంది. అక్కడ ఏటి పండగలో ఎగ్జిబిషన్ నిర్వహించేందుకు వివిధ వస్తువులను దించేందుకు లారీని కాజ్‌వేపై నిలిపి ఉంది. లారీలో అల్యూమినియం చానెళ్లు ఒక్కసారిగా కారులో ఒక పక్కన కూర్చొని ఉన్న నాగార్జున భార్య నిరంజని, అత్త సుబ్బమ్మకు తగలడంతో అక్కడికక్కడే రోడ్డు మీదపడి దుర్మరణం చెందారు. కారు నడుపుతున్న నాగార్జున, అతని కుమారుడు, స్రవంతి త్రుటిలో ప్రాణా పాయం నుంచి తప్పించుకున్నా రు. సమాచారం అందుకున్న ఎస్సై రవినాయక్ ఘటనా స్థలా న్ని పరిశీలించారు. స్వర్ణముఖినది కాజ్‌వేపై రెండు వైపులా స్తంభిం చిన ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. లారీని రోడ్డు పై నిర్లక్ష్యంగా నిలిపి ఉండటంతో వారిపై కేసు నమోదు చేశారు. మిన్నంటిన రోదనలు అప్పటి వరకు ఎంతో సంతోషంగా వచ్చి క్షణంలో రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన భార్య, అత్త మృతదేహాలను చూసి నాగార్జునతోపాటు అతని కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోయారు. ఏడాది బాలుడు తల్లి మృతి చెందిన విషయం తెలియకపోయిన రోదిస్తుండటం స్థానికులు సైతం కలత చెందారు. సమాచారం తెలుసుకున్న నాగార్జున కుటుంబ సభ్యులు నాయుడుపేటలోని ప్రభుత్వ వైద్యశాలకు చేరుకోవడంతో అక్కడ రోదనలు మిన్నంటాయి. -
సిరిసిల్లలో తల్లి,కుమార్తె ఆత్మహత్య
సాక్షి, సిరిసిల్ల: తల్లి, బిడ్డ ఆత్మహత్య చేసుకున్న విషాదకర సంఘటన సిరిసిల్లలో గురువారం చోటుచేసుుకంది. సిరిసిల్లలోని ఇందిరా నగర్లో నివాసం ఉంటున్న తల్లి గుడ్ల విజయ(60), కూతురు జ్యోతి (35) ఇంటి దూలానికి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఆస్తి తగాదాలు, కుటుంబ కలహాలతోనే వీళ్లు ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఫిబ్రవరిలో తల్లీకూతుళ్ల సాహసయాత్ర
సాక్షి, బెంగళూరు: నగరానికి చెందిన తల్లీకూతుళ్లు అయిన కెప్టెన్ దీపికా మాబెన్, కూతురు అమె మెహతా మహిళాసాధికారత పై జాగృతం క ల్పించడానికి వినూత్న పంథాను ఎంచుకున్నారు. వచ్చే ఫిబ్రవరి చివరి వారం నుంచి 80 రోజుల పాటు 21 దేశాల మీదుగా 50వేల కిలోమీటర్లు ప్రయాణం చేయనున్నట్లు బుధవారం ఇక్కడ తెలిపారు. రెండు సీ ట్లు, ఒక ఇంజన్ కలిగిన మోటర్ గ్లైడర్ విమానం ద్వారా ఈ యాత్ర చేపడతామని చెప్పారు. అన్ని అనుమతులు రావడానికి కనీసం మూడు నెలలు పడుతుందని, అందువల్లే ఫిబ్రవరి వరకూ వేచి ఉన్నట్లు చెప్పారు. -
నదిలో దూకి తల్లి, కూతురు ఆత్మహత్య
ఆదిలాబాద్ : పెన్ గంగ నదిలో దూకి కుమార్తెతో పాటు తల్లి ఆత్మహత్య చేసుకుంది. రెండేళ్ల కూతురు సహా తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లాలో జరిగింది. మృతులు ఆదిలాబాద్ పట్టణానికి చెందిన వారిగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతుల పేర్లు, వారి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఓ తల్లి తన కూతురితో పాటు నదిలో దూకి ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. ఈ విషాదం ఆదిలాబాద్ జిల్లాలో ఆదివారం చోటుచేసుకుంది. ఓ వివాహిత తన రెండేళ్ల కూతురిని వెంట పెట్టుకుని పెన్ గంగ నది వద్దకు వెళ్లింది. కుమార్తెతో పాటు తాను నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వీరు ఆదిలాబాద్ పట్టణానికి చెందినవారుగా గుర్తించారు. అయితే మృతుల పేర్లు, ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. -
మాదాపూర్‌లో తల్లీకూతుళ్లు అదృశ్యం
హైదరాబాద్: మాదాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో తల్లీకూతుళ్లు అదృశ్యమయ్యారు. మందాడ గంగ (27) ఇళ్లలో పనులు చేసుకుంటూ జీవిస్తోంది. మాదాపూర్ సిద్దిఖ్‌నగర్‌లో ప్లాట్ నెం.195 లో నివాసం ఉంటోంది. విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం పెద్దబొండపల్లికి ఈ నెల 11వ తేదీన తన కుమార్తె శిరీష(6)తో కలిసి వెళ్లింది. కానీ ఇప్పటివరకు తిరిగి ఇంటికి చేరుకోలేదు. ఆమె భర్త కృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై విజయ్‌కుమార్ తెలిపారు. -
కన్నకూతురికి 'అమ్మ'దనమే బహుమతి!
తల్లి కావడం ఆడవాళ్లకు దేవుడిచ్చిన వరం. కానీ అసలు గర్భసంచి అన్నదే లేకుండా పుట్టిన ఓ యువతికి కూడా బిడ్డలను కనాలని చాలా బలమైన కోరిక ఉంది. దాన్ని తీర్చడానికి స్వయంగా ఆమె తల్లే కదిలొచ్చింది. 21 ఏళ్ల వయసున్న కూతురికి తన గర్భసంచిని దానం చేసేందుకు 43 ఏళ్ల తల్లి అంగీకరించింది. తద్వారా ఆమె కూడా తనలాగే తల్లి కావడానికి మార్గం సుగమం చేసింది. ఇలా ఇద్దరూ సరేననడంతో భారతదేశ వైద్య చరిత్రలోనే ఓ అరుదైన ఘటన చోటుచేసుకుంది. మహారాష్ట్రలోని పుణెలో దేశంలోనే మొట్టమొదటి సారిగా గర్భసంచి మార్పిడి శస్త్రచికిత్స జరిగింది. ఇప్పటివరకు చాలాసార్లు గుండెలను కూడా మార్చిన వైద్యులు.. గర్భసంచిని మార్చడం మాత్రం ఇదే తొలిసారి. పుణెలోని గెలాక్సీ కేర్ ఆస్పత్రి మెడికల్ డైరెక్టర్ డాక్టర్ శైలేష్ పుంటంబేకర్ నేతృత్వంలోని బృందం ఈ శస్త్రచికిత్స చేసింది. ఈ ఆపరేషన్‌కు మొత్తం తొమ్మిదిన్నర గంటలు పట్టిందని డాక్టర్ శైలేష్ చెప్పారు. గర్భసంచికి చాలా పెద్ద సంఖ్యలో పెద్ద రక్తనాళాలు కలిసి ఉంటాయని, అలాగే చిన్న చిన్న నరాలు కూడా ఉంటాయని, వాటన్నింటినీ కొత్తగా గర్భసంచికి కలపడం సాంకేతికంగా చాలా కష్టమని ఆయన వివరించారు. శస్త్రచికిత్స పూర్తయినా.. కొత్త గర్భసంచి శరీరానికి అలవాటు పడేందుకు ఒక ఏడాది పాటు వేచి చూడాలని, ఆ తర్వాతే ఐవీఎఫ్ పద్ధతి ద్వారా గర్భం దాల్చేందుకు ప్రయత్నం చేయాలని తెలిపారు. ఇంతకుముందు ఎక్కడ.. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా స్వీడన్లో ఈ తరహా శస్త్రచికిత్స జరిగింది. అక్కడి యూనివర్సిటీ ఆఫ్ గోథెన్‌బర్గ్‌లో గైనకాలజీ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ మాట్స్ బ్రాన్‌స్ట్రామ్ నేతృత్వంలో ఈ చికిత్సలు చేశారు. ఇలాంటి చికిత్సల ద్వారా ఇప్పటివరకు కేవలం ఆరుగురు పిల్లలే పుట్టారు. వారిలో ఇద్దరు ఒకే తల్లికి పుట్టినవారు. నిజానికి ఈ బృందం మొదట చేసిన 11 శస్త్రచికిత్సలు విఫలమయ్యాయి. ఆ తర్వాత 2014లో చేసిన మార్పిడి విజయవంతం అయ్యింది. ఆరోగ్యవంతమైన శిశువు పుట్టింది. స్వీడిష్ బృందం చేసిన శస్త్రచికిత్సల ద్వారానే మిగిలిన ఐదుగురు పిల్లలు కూడా పుట్టారు. పిల్లలు పుడతారా? దేశంలో తొలిసారి జరిగిన గర్భసంచి మార్పిడి ఎంతవరకు సత్ఫలితాలను ఇస్తుందన్నది మాత్రం అనుమానంగానే కనిపిస్తోంది. తల్లి కావాలన్న ఆ మహిళ కలలను నిజం చేయడం తమ బాధ్యత అని, దాన్ని నెరవేర్చడానికి తమ శాయశక్తులా కృషి చేశామని డాక్టర్ శైలేష్ చెప్పారు. దేశంలో మొట్టమొదటి సారిగా చేసిన ఈ శస్త్రచికిత్స ఎంతవరకు ఫలితాన్నిస్తుందో చూడాల్సి ఉందన్నారు. ఈ ప్రొసీజర్ చాలా సంక్లిష్టమైనది కావడంతో ఇవి ఎంతవరకు విజయవంతం అవుతాయన్నది అనుమానమే. భారతదేశంలో ఇది మొట్టమొదటి ప్రయత్నం కాగా, ప్రపంచంలోనే 30వది. ఇప్పటివరకు అమెరికా, బ్రెజిల్, స్వీడన్, చైనా, జర్మనీ, సెర్బియా, చెక్ రిపబ్లిక్, సౌదీ అరేబియా, టర్కీ దేశాలలో కూడా ఇలాంటి ప్రయత్నాలు జరిగాయి గానీ ఒక్క స్వీడన్లోనే ఇంతవరకు విజయవంతం అయ్యాయి. -
నాలుగేళ్లు బందీలుగా తల్లీకూతుళ్లు!
దాదాపు నాలుగేళ్ల నుంచి ఢిల్లీలోని తమ ఇంట్లో తమను తామే బందీలుగా చేసుకున్న తల్లీకూతుళ్లను ఢిల్లీ పోలీసులు రక్షించారు. వాళ్లిద్దరూ డిప్రెషన్‌తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. కళావతి (42), దీప (20) అనే ఇద్దరూ ఇలా బందీలుగా ఉన్న విషయాన్ని వాళ్లింటి పొరుగున ఉండే ఓ వ్యక్తి పోలీసులకు తెలిపాడు. దాంతో వారు వెళ్లి తల్లీ కూతుళ్లిద్దరినీ బయటకు తీసుకొచ్చి, ఆస్పత్రిలో చేర్చారు. వాళ్లతో పాటు అదే ఇంట్లో ఉంటున్న మహిళ మామను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. మహిళలిద్దరూ పోషకాహారం లేక బాగా నీరసించిపోయారని, వాళ్లు చాలా అపరిశుభ్ర వాతావరణంలో ఉంటున్నారని చెప్పారు. అంతలా ఉన్నా పోలీసుల వెంట ఆస్పత్రికి వెళ్లేందుకు వారు నిరాకరించారు. వాళ్లిద్దరూ మానసిక వ్యాధితోను, భ్రమలతోను జీవిస్తున్నారని తెలిపారు. వాళ్లు భోజనం కావాలని అడిగినప్పుడు పక్క గదిలోనే ఉండే కళావతి మామగారు మహావీర్ మిశ్రా వాళ్లకు భోజనం పెట్టేవారు. తన భార్య 2000 సంవత్సరంలో మరణించిందని, కొడుకులిద్దరూ నాలుగేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించారని మిశ్రా చెప్పారు. అప్పటినుంచే కళావతి, దీప తమను తాము ఇంట్లో పెట్టుకుని గడియ వేసుకున్నారన్నారు. తాను ఎంటీఎన్ఎల్లో లైన్‌మన్‌గా పనిచేసేవాడినని, తనకు వచ్చే కొద్దిపాటి పెన్షన్‌తోనే అందరం బతుకుతున్నామని తెలిపారు. -
నదిలో పడి తల్లి, కూతురు మృతి
వికారాబాద్: బషీరాబాద్ సమీపంలో కాగ్నా నది దాటుతూ ప్రమాదవశాత్తూ తల్లీకూతురు మృతిచెందారు. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం గొట్టికకుర్దుకు చెందిన తలారి శివమ్మ (65), ఆమె కుమార్తె కాశమ్మ (45) రెండు రోజుల కిందట బంధువుల ఇంటికి వెళ్లారు. తిరిగి పయనమైన వారిద్దరూ కాగ్నా నది దాటుతూ ఈత రాక నీటిలో మునిగిపోయారు. స్థానికులు వారి మృతదేహాలను గుర్తించి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. -
బాపట్లలో జంట హత్యలు
బాపట్ల: కుటుంబ కలహం జంట హత్యలకు దారితీసింది. తల్లీకూతుళ్లను సమీప బంధువే రోకలిబండతో కొట్టి హత్య చేశాడు. బుధవారం అర్ధరాత్రి బాపట్లలో జరిగిన ఈ సంఘటన కలకలం రేపింది. మతురాలు గౌరు నాగమణి తల్లి కొట్టె పార్వతి పోలీసులకు చేసిన ఫిర్యాదు ప్రకారం... పట్టణంలోని నరాలశెట్టివారిపాలెంకు చెందిన గౌరు నాగేశ్వరరావు, నాగమణి(40) దంపతులకు ఇద్దరు కుమార్తెలు. ఒక కుమార్తె సాయిలక్ష్మిని(24) ప్రకాశం జిల్లా కోరిశపాడు మండలం పిచ్చుకులగుడిపాడులోని నాగమణికి వరుసకు తమ్ముడైన కొట్టె హనుమంతరావుకు ఇచ్చి వివాహం చెశారు. వివాహం జరిగిన మూడేళ్ళ తర్వాత కుటుంబంలో విభేదాలు పొడచూపాయి. దీంతో నాలుగు సంవత్సరాలుగా సాయిలక్ష్మి ఇద్దరు పిల్లలతో కలిసి తల్లిదండ్రుల వద్దనే ఉంటోంది. హత్యకు నేపథ్యం.. నరాలశెట్టివారిపాలెంలోనే ఉంటున్న గౌరు హనుమంతరావుకు నాగమణి సోదరుని కుమార్తెను ఇచ్చి వివాహం చేశారు. అయితే నాగమణి, సాయిలక్ష్మిలకు గౌరు హనుమంతరావులతో ఇటీవల గొడవలు జరుగుతున్నాయి. పదిరోజుల క్రితం నాగమణి హనుమంతరావుపై కేసు పెట్టింది. అయితే నాగమణి సోదరుడు వచ్చి కుటుంబ వ్యవహారాలను పరిష్కరించుకుంటామని చెప్పి స్టేషన్ నుంచి తీసుకువెళ్ళారు. అప్పటికే పలు గొడవల్లో ఉన్న గౌరు హనుమంతరావు నాగమణిపై కక్షపెంచుకుని చంపుతానని బెదిరిస్తే బంధువులు సర్దిచెప్పారు. ఎవరూ లేనప్పుడు చూసుకుని... నాగమణి భర్త నాగేశ్వరరావు పచ్చళ్ళ వ్యాపారం చేస్తూ వివిధ గ్రామాలకు వెళుతుంటాడు. బుధవారం ఇంట్లో నాగేశ్వరరావులేని సమయం చూసి రాత్రి 11 గంటల సమయంలో గౌరు హనుమంతరావు ఇంట్లోకి ప్రవేశించి ముందు నాగమణిని అక్కడే ఉన్న రోకలి బండతో కొట్టి చంపాడు. గొడవ జరగటంతో అక్కడే ఉన్న సాయిలక్ష్మి తన తాతయ్యకు ఫోన్ చేసేందుకు యత్నించగా ఫోన్‌ను పగలగొట్టి ఆమెను కూడా రోకలిబండతో కొట్టి చంపాడు. సాయిలక్ష్మి పిల్లలు సందీప్రియ,సందీప్ నిద్రలేవటంతో హనుమంతరావు తండ్రి భీమాంజనేయులు, తల్లి లక్ష్మి వచ్చి పిల్లలను పక్కనే ఉన్న వారి అత్తమామల వద్దకు పంపి..., అక్కడ నుంచి కారులో హనుమంతరావు భార్యను కూడా తీసుకుని నలుగురూ పరారయ్యారు. సంఘటన స్థలానికి వచ్చిన బంధువులు రక్తపుమడుగులో పడి ఉన్నవారిని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. సందీప్రియ జరిగిన విషయాన్ని పోలీసులకు, మీడియాకు తెలియజేసింది. ముగ్గురిపై కేసు నమోదు సంఘటన స్థలాన్ని డీఎస్పీ మహేష్ పరిశీలించారు. జంటహత్యల కేసులో గౌరు హనుమంతరావు, ఆయన తండ్రి భీమాంజనేయులు,తల్లి లక్ష్మీలపై కేసు నమోదు చేశామని, డాగ్‌స్వా్కడ్ కూడా వారి ఇళ్ళకే వెళ్ళినట్లు సీఐ ఆంజనేయులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని ప్రత్యేక టీములు ఏర్పాటు చేసి వారిని పట్టుకుంటామని సీఐ తెలిపారు. -
30 ఏళ్ల తర్వాత తల్లీకూతుళ్లను కలిపారు
హైదరాబాద్: దాదాపు 30 ఏళ్ల క్రితం విడిపోయిన తల్లికూతుళ్లను నగరపోలీసులు గురువారం ఒక్కటి చేశారు. సౌదీ అరేబియా నుంచి తల్లి నజియా కోసం నగరానికి కూతురు ఫాతిమా నగరానికి వచ్చింది. తల్లి ఆచూకీకోసం నగర పోలీసులను ఆశ్రయించింది. ఆరు నెలల పాట ఫాతిమా తల్లి కోసం వెతికిన పోలీసులు ఎట్టకేలకు ఇద్దరిని కలిపారు. ప్రస్తుతం తల్లీకూతుళ్లిద్దరూ సౌత్ జోన్ డిసీపీ కార్యాలయంలో ఉన్నారు. -
తల్లీకూతురు, మరో మహిళ అదృశ్యం
శంషాబాద్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో ఒకేసారి తల్లీకూతురు, మరో మహిళ అదృశ్యం కావడం కలకలం సృష్టిస్తోంది. సిద్ధేశ్వర కాలనీకి చెందిన కిష్టమ్మ(40)ఆమె కుమార్తె శిరీష(2), శంషాబాద్ మండలం పెద్దషాపూర్ గ్రామానికి చెందిన కవిత(39) ఆదివారం అదృశ్యమైనట్లు కుటుంబసభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కుమార్తెను తీసుకుని కూలిపనికి వెళ్లిన కిష్టమ్మ ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు ఎయిర్‌పోర్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అత్తగారింటికి బయలుదేరిన కవిత ఇల్లు చేరకపోవడంతో ఆమె తండ్రి శంషాబాద్ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కట్నం కార్చిచ్చుకు.. తల్లీకూతురు బలి
పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభించిన ఆ యువతికి రెండేళ్లకే కష్టాలు మొదలయ్యాయి. కట్నం కోసం భర్తపెట్టే చిత్రహింసలు తట్టుకోలేక పోయింది.. ఒంటిమీది ఆభరణాలను అమ్ముకున్నా ఓర్చుకుంది.. కడుపున పుట్టిన చిన్నారిని చూసుకుని బాధలను దిగమింగుకుంది.. ఇకనైనా మారతాడేమో అన్న చిన్న ఆశ కూడా ఆవిరైపోయింది.. ఇక తాను లేని లోకంలో కూతురు ఎన్ని కష్టాలు పడుతుందో అని.. మదనపడింది. చివరకు తనతో పాటే తీసుకెళ్లాలని నిర్ణయించుకుని.. ఆరునెలల చిన్నారిని నీటిసంపులో వేసి..తాను అగ్నికి ఆహుతైంది. * కూతురిని నీటిసంపులో పడేసి..తాను అగ్నికి ఆహుతై.. * భువనగిరి మండలంలో విషాదం భువనగిరి: కట్నం కార్చిచ్చుకు..తల్లీకూతురు బలయ్యారు. ఈ విషాదకర ఘటన భువనగిరి మండలం గౌస్‌నగర్‌లో ఆదివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. పోలీసులు, మృతుల బంధువులు తెలిపిన వివరాల ప్ర కారం.. భువనగిరి మండలం గౌస్‌నగర్‌కు చెందిన నల్లమాస వెంకటయ్య, లింగమ్మల కుమారుడు నల్లమాస భాస్కర్‌కు చౌటుప్పల్ మండలం తంగెడపల్లికి చెందిన చిక్కురి యాదగిరిస్వరూపల కుమార్తె మమత(22) తో 2014 ఏప్రిల్ 20న వివాహం జరిగింది. పెళ్లి సమయంలో ఒప్పుకున్న రూ.7.70 లక్షల వరకట్నంలో రూ.7.10 లక్షల వరకు నగదు,అభరణాలు, ఇతర వస్తువులను ము ట్టచెప్పారు. అయితే రెండున్నర సంవత్సరా లు అవుతున్నా కట్నం పూర్తిగా ఇవ్వలేదని ఆ డబ్బులు తేవాలని భాస్కర్ మమతను వే ధించసాగాడు. దీంతో పాటు భాస్కర్ కొంతకాలంగా పనిలేకుండా ఉన్నాడు. జేసీబీ ఆపరేటర్ అయిన భాస్కర్ ఏజీఐ గ్లాస్ఫ్యాక్టరీలో పనిచేస్తూ మానేశాడు. కొన్నినెలలుగా ఇంట్లోనే ఉంటున్నాడు. దీం తోపాటు మమతకు చెందిన బంగారు అభరణాలను తాకట్టు పెట్టాడు. అలాగే మమతకు చెందిన బుట్టాలు అమ్మినట్లు తెలియడంతో దంపతుల మధ్య గొడవలు మొదల య్యాయి. ఈ నేపథ్యంలో బాకి ఉన్న మిగతా కట్నం డబ్బు తీసుకురావాలని మమతను వేధించసాగారు. బంగారం అమ్మిన విషయం మమత తల్లిదండ్రులకు చెప్పడంతో వారు మాట్లాడడానికి వస్తామన్నారు. ఈ విషయంలోనే శనివారం రాత్రి దంపతులు గొడవ పడ్డారు. అందరూ నిద్రిస్తుండగా.. అందరు నిద్రిస్తున్న సమయంలో మమత తన కూతురు భానును నీళ్లసంపులో వేసింది. దీంతో చిన్నారి ఊపిరాడక చనిపోయింది. వెంటనే మరుగుదొడ్డిలోకి వెళ్లి కిరోసిన్ ఒంటిపై పోసుకుని నిప్పంటించుకుంది. దీంతో పెద్ద ఎత్తున మంటలు లేవడంతో ఇంట్లో నిద్రిస్తున్న వారు మేలుకుని బయటకు వచ్చారు. అప్పటికే మమత తలభాగం నుంచి మంటలు పెద్దగా లేవడంతో పందిరికూడా అంటుకుంది. చల్లార్చే ప్రయత్నం చేసినప్పటికీ ఆమె మంటల్లో కాలి చనిపోయింది. అనంతరం పాప కోసం వెతకగా సంపులో శవమై కన్పించింది. విషయం తెలుసుకున్న రూరల్ సీఐ అర్జునయ్య, ఎస్ఐ సాజిదుల్లాలు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ నిర్వహించారు. మమత తండ్రి యాదగిరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరారీలో భర్త భాస్కర్ ఈ సంఘటన జరిగిన వెంటనే మమత భర్త భాస్కర్ కన్పించకుండాపోయాడు.పోలీస్‌లు గ్రామానికి వచ్చి గట్టి బందోబస్తూ ఏర్పాటు చేశారు.సంఘటనకు సంబంధించిన అన్ని అంశాలను పరిశీలించారు. గ్రామస్తులను విచారించారు. నా కూతురును వేధించి చంపారు కట్నం కోసం తన కూతురుని వేధించడం వల్లే చనిపోయింది. పెళ్లి సమయంలో ఒప్పుకున్న కట్నం డబ్బులు ఇచ్చాను. కొంత ఇవ్వాల్సి ఉంటే త్వరలో ఇస్తానని చెప్పాను. అయినా వినకుండా నా కూతురిని చిత్రహింసలు పెట్టడంతో తన కూతురును చంపి తాను ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి. - చిక్కురి యాదగిరి మమత తండ్రి వేధింపుల వల్లే అత్తింటి వేధింపుల వల్లే మమత ఈ ఘాతుకానికి పాల్పడింది. కట్నం డబ్బుల కోసం భర్తభాస్కర్ తరుచు వేధించే వాడని తమ విచారణలో తేలింది. ఇందుకు సంబంధించి మృతురాలి తండ్రి ఫిర్యాదు చేశాడు. వేధింపుల కేసు నమోదు చేశాం. - అర్జునయ్య, భువనగిరి రూరల్‌సీఐ -
ప్రేతాత్మలున్నాయంటూ.. తల్లీకూతుళ్ల నిర్వాకం
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా బలగలో ఓ తల్లీకూతుళ్ల నిర్వాకానికి స్థానికులు విస్తుపోయారు. ప్రేతాత్మలున్నాయంటూ ఇంట్లో గొయ్యిను తీసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. సుమారు 20 అడుగుల గొయ్యిను తీసి అందులో తల్లీకూతుళ్లు నివాసముంటున్నారు. స్థానికులెవ్వరినీ ఆ ఇంటిలోనికి రాకుండా ఎప్పుటికప్పుడూ అడ్డుకుంటూ వచ్చారు. వీరి కదలికలపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో రంగంలోకి దిగారు. చాలా సేపటి వరకు పోలీసులను కూడా లోపలికి అనుమతించలేదు. ఇంటిలో ప్రేతాత్మలున్నాయని రావద్దని వారు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఎట్టకేలకు ఇంటిలోనికి ప్రవేశించిన పోలీసులు ఆశ్యర్యపోయారు. ఇంటి కింద భాగంలో తీసిన పెద్ద గొయ్యిను పోలీసులు గుర్తించారు. వారి మానసిక స్థితి సరిగ్గా లేక ఆ విధంగా ప్రవర్తిస్తున్నారని పోలీసులు చెబుతున్నారు. ఆ ఇద్దరినీ అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. -
నీటితొట్టెలో తల్లీకూతుళ్ల మృతదేహాలు
రామకుప్పం (చిత్తూరు జిల్లా) : రామకుప్పం మండలం కొంగనపల్లి గ్రామంలో తల్లీకూతుళ్లు నీటి తొట్టెలో శవాలై తేలారు. వీరి మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గ్రామానికి చెందిన సరస్వతి, ఆమె కుమార్తె పవిత్ర (13)లు పొలాల్లోని నీటితొట్టెలోనిర్జీవులై ఉండగా కొందరు రైతులు శనివారం మధ్యాహ్నం గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సరస్వతి భర్త రామకృష్ణప్ప ఆచూకీ లేకుండాపోవడంతో గ్రామస్తులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రైలు కింద పడి తల్లీకూతుళ్లు ఆత్మహత్య
ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా రామకృష్ణాపూర్లో శుక్రవారం తెల్లవారుజామున విషాదం చోటు చేసుకుంది. రైలు కిందపడి తల్లీకూతుళ్లు ఆత్మహత్య చేసుకున్నారు. ఆ మృతదేహాలు రైలు ఇంజన్లో చిక్కుకున్నాయి. ఆ విషయాన్ని గమనించిన రైలు ఇంజన్ డ్రైవర్... రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో మంచిర్యాలలో తల్లీకూతుళ్ల మృతదేహాలను రైల్వే పోలీసులు... ఇంజన్లో నుంచి వెలికి తీశారు. అనంతరం మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆర్టీసీ బస్సు - బైక్ ఢీ: తల్లీకూతురు మృతి
విశాఖపట్నం : విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలోని అయ్యన్నపాలెం సమీపంలో బుధవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు - బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తల్లీకూతరు అక్కడికక్కడే మరణించారు. స్థానికులు వెంటనే స్పందించి... పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... మృతదేహాలను స్వాధీనం చేసుకుని... పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఫణిదంలో విషాదం
గుంటూరు: గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం ఫణిదంలో శుక్రవారం విషాదం చోటు చేసుకుంది. కుమార్తెతో సహా తల్లి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. దీంతో స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... తల్లీకూతురు మృతదేహాన్ని బావిలోని బయటకు తీసి... పోస్ట్‌మార్టం నిమిత్తం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ ఆత్మహత్యకు కుటుంబ కలహాలే కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. -
పాముకాటుతో తల్లీకూతురు మృతి
అల్లాదుర్గం: మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం బిజిలీపూర్ గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన తల్లీకూతురిని పాము కాటుకు గురై అక్కడికక్కడే మృతి చెందారు. సోమవారం వేకువజామున ఇంట్లో నిద్రపోతున్న వినోద(28), ఆమె కుమార్తె అఖిల(9)ను నాగుపాము కాటువేసింది. పాము కాటుకు కేకలు విని నిద్రలేచిన కుటుంబసభ్యులు పాము చంపేసి, వారిని ఆస్పత్రికి తీసుకెళ్లే లోపల మృతి చెందారు. గత ఏడాది ఇదే రోజు వినోద భర్త రైతు శివశంకర్ అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఏడాది తర్వాత భార్య, బిడ్డ కూడా పాముకాటుకు మృతిచెందడం గ్రామస్తులను కలచివేసింది. ఈ సంఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. -
సనత్‌నగర్‌లో తల్లీకూతుళ్ల అదృశ్యం
హైదరాబాద్: నగరానికి చెందిన తల్లీకూతుళ్లు కనిపించకుండా పోవడం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. స్థానికంగా సనత్‌నగర్‌లో తల్లి చంద్రకళ, కూతురు నేహా నివాసం ఉంటున్నారు. అయితే వారం రోజుల కిందట కర్ణాటకలోని బీదర్‌లో ఉన్న బంధువుల ఇంటికి వెళ్లాలని రైలులో బయలుదేరారు. ఇదిలాఉండగా వారం రోజులైనా ఆ తల్లీకూతుళ్లు బంధువుల ఇంటికి చేరలేదని కుటుంబసభ్యులు చెబుతున్నారు. సనత్‌నగర్‌లో వారం రోజుల కిందట రైలు ఎక్కించామని, ఇప్పటి వరకూ తమ వాళ్ల జాడ కనిపించడం లేదంటూ వారు వాపోతున్నారు. వారిని ఎవరైనా కిడ్నాప్ చేశారా, వారికి ఏమైనా ఇబ్బందులు తలెత్తాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
కూతురితో కలిసి తల్లి ఆత్మహత్యాయత్నం.. కూతురి మృతి
ఆదిలాబాద్: కుటుంబ కలహాలతో కూతురితో సహా తల్లి పురుగుల మందు తాగింది. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా లక్సెట్టిపేట మండలం రంగంపేటలో గురువారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. వివరాలు.. రంగంపేట గ్రామానికి చెందిన పుట్టపాక భాగ్యలక్ష్మి (33) భర్తతో విడాకులు తీసుకొని తల్లి వద్ద ఉంటోంది. అక్కడే కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో అన్నతో వచ్చిన మనస్పర్థల కారణంగా గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో కూల్‌డ్రింక్ తీసుకువచ్చి అందులో పురుగులమందు కలిపి కూతురు వైశాలి(8)కి ఇచ్చి భాగ్యలక్ష్మి కూడా తాగింది. దీంతో వైశాలి అక్కడికక్కడే మృతిచెందగా.. భాగ్యలక్ష్మి పరిస్థితి విషమంగా ఉంది. ఇది గమనించిన స్థానికులు వెంటనే ఆమెను కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇంకా వివరాలు తెలియరావాల్సి ఉంది. -
పెళ్లి ట్రాక్టర్ బోల్తా: ముగ్గురు మృతి
కర్నూలు : కర్నూలు జిల్లా కొస్గి మండలం దొడ్డిబెళగల్ వద్ద పెళ్లి బృందంతో వెళ్తున్న ట్రాక్టర్ శుక్రవారం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో తల్లీకూతుళ్లు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 10 మంది గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరోకరు మరణించారు. పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం సంభవించిందని పోలీసులు తెలిపారు. డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడని పోలీసులు వెల్లడించారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని... అతడిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు. మృతి చెందిన తల్లీకూతుళ్లు కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారని పోలీసులు వెల్లడించారు. -
తల్లీకూతుళ్లపై అత్యాచారం
గుంటూరు: బట్టలు కొనుగోలు చేసి ఇంటికి తిరిగి వస్తున్న తల్లికూతురిపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేశారు. ఈ విషయం బయటకు వెల్లడిస్తే చంపేస్తామంటూ బెదిరించి... అక్కడి నుంచి పరారైయ్యారు. ఈ దారుణ ఘటన గుంటూరు జిల్లా పొన్నూరు మండలం కట్టెంపూడిలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. అయితే సదరు వ్యక్తుల బెదిరింపులతో భయపడిన వారు మిన్నకుండిపోయారు. అయితే బంధువుల చోరవతో బాధితులు పొన్నూరు పోలీసులను ఆశ్రయించారు. నిందితులు అదే గ్రామానికి చెందిన రమేష్, వినోద్‌లుగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి... దర్యాప్తు ప్రారంభించారు. నిందితుల గాలింపు కోసం ప్రత్యేక బలగాలను రంగంలోకి దింపినట్లు పోలీసులు తెలిపారు. బుధవారం రాత్రి పొన్నూరులో బట్టలు కొనుగోలు చేసి కట్టెంపూడి తిరిగి వస్తున్న క్రమంలో అత్యాచారానికి గురైయ్యారు. బాధితులను వైద్య పరీక్షల నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. -
నిందితులపై కేసు నమోదుకు కేసీఆర్ ఆదేశం
మెదక్ : మెదక్ జిల్లా రామక్కపేట అత్యాచార ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. నిందితులపై వెంటనే నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేయాలని ఆయన శనివారం ఆదేశించారు. బాధితులకు తక్షణ ఆర్థిక సాయం కింద రూ.25వేలు అందించాలని కేసీఆర్ ఎమ్మెల్యే రామలింగారెడ్డికి సూచించారు. ఈ ఘటనపై కేసీఆర్...రామలింగారెడ్డితో ఫోన్లో మాట్లాడారు. రామక్కపేటలో నలుగురు దుండగులు తల్లీకూతుళ్లపై అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే. -
తల్లీకూతుళ్లపై సామూహిక అత్యాచారం
-
తల్లీకూతుళ్లపై సామూహిక అత్యాచారం
(సాక్షి టీవీ రిపోర్టర్ విష్ణు) మెదక్ : మెదక్ జిల్లా దుబ్బాక మండలం రామక్కపేటలో దారుణం చోటుచేసుకుంది. గుర్తు తెలియని దుండగులు తల్లీకూతురుపై అత్యాచారం చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే రామక్కపేటకు చెందిన ఇంటర్ విద్యార్థిని దసరా వేడుకల్లో పాల్గొని ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో కొందరు గుర్తు తెలియని దుండగులు ముఖాలకు ముసుగులు ధరించి ఆమెను అపహరించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం దుండగులు...విద్యార్థిని ఇంటికి వెళ్లి మీ కూతురు అక్కడ పడిపోయిదని ఆమె తల్లికి సమాచారం అందించారు. దాంతో కంగారు పడిన ఆమె వారి వెంట వెళ్లగా...తల్లిపై కూడా దుండగులు అత్యాచారం చేశారు. అర్థరాత్రి ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ విషయాన్ని బాధితురాలు శనివారం ఉదయం గ్రామ సర్పంచ్‌కు ఫిర్యాదు చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ జరుపుతున్నారు. బాధితులను వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
కోరిక కాదన్నారని.. తలలు తెగ్గోశాడు!!
వివాహేతర సంబంధానికి నిరాకరించారని.. తల్లీ కూతుళ్లను అత్యంత కిరాతకంగా నరికి చంపాడో దుర్మార్గుడు. ఏకంగా వాళ్ల తలలను మొండేల నుంచి వేరు చేసి రోడ్డు మీద పారేసి.. చుట్టుపక్కల అందరినీ భయభ్రాంతులకు గురిచేశాడు. సభ్యసమాజం తలదించుకునే ఈ సంఘటన కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లిలో జరిగింది. తన భర్త చనిపోవడంతో చిన్ని అనే యువతి కొన్నాళ్లుగా తన తల్లి చంద్రమ్మ వద్దే ఉంటోంది. ఆమెపై అదే గ్రామానికి చెందిన అరటికాయల వ్యాపారి శివయ్య కన్ను పడింది. తనతో వివాహేతర సంబంధం పెట్టుకోవాలంటూ మూడు నెలలుగా ఆమెపై వేధింపులు మొదలుపెట్టాడు. గురువారం తెల్లవారుజామున చంద్రమ్మ ఇంటికి వచ్చిన శివయ్య, ఏకంగా చిన్నిపై లైంగిక దాడికి ప్రయత్నించాడు. ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో తనవెంట తెచ్చుకున్న కొడవలితో చిన్నిని, ఆమె తల్లి చంద్రమ్మను కూడా నరికి చంపాడు. అంతేకాదు.. ఆ తర్వాత ఏకంగా వాళ్లిద్దరి తలలను శరీరం నుంచి వేరుచేసి రోడ్డుమీద పారేసి అక్కడి నుంచి పారిపోయాడు. -
ఇంట్లో ఉన్న తల్లీకూతుళ్ల హత్య
న్యూఢిల్లీ: పశ్చిమ ఢిల్లీలోని తిలక్ నగర్లో తల్లి(40), కూతురు(18) హత్యకు గురయ్యారు. వారి నివాసంలోనే ఈ హత్యలు జరిగాయి. మృతదేహాలపై తీవ్ర గాయలను బట్టి వారిని చిత్రహింసలకు గురిచేసి హత్యలు చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ హత్యలు బుధవారం రాత్రి 7.30 గంటల ప్రాంతంలో జరిగినట్లు తెలుస్తోంది. ఆ సమయంలోనే హతురాలి కుమారుడు జస్పాల్ తీవ్ర గాయాలతో ఇంట్లో నుంచి బయటకు వచ్చినట్లు ఇరుగుపొరుగువారు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. జస్పాల్ బయటకు రావడంతో అనుమానంతో ఇరుగుపొరుగువారు ఇంట్లోకి వెళ్లి చూశారు. ఇంట్లో తల్లి జస్పీర్, కుమార్తె ప్రభాజోట్లు రక్తపు మడుగులో పడి ఉన్నారు. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే వారు మృతి చెందినట్లు డాక్టర్లు చెప్పారు. గుర్తు తెలియని వ్యక్తులు వీరి ముగ్గురిపై కత్తులతో దాడి చేసినట్లు తమ ప్రాథమిక విచారణలో తేలినట్లు పోలీస్ అధికారి ఒకరు చెప్పారు. అయితే వీరి ఇంట్లోకి ఎవరూ దౌర్జన్యంగా చొరబడిన దాఖలాలు లేవని తెలిపారు. నిందితులను గుర్తించేందుకు సమీపంలోని సిసిటివి కెమెరాలను పరిశీలిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. అలాగే ఇరుగుపొరుగువారిని కూడా విచారిస్తున్నట్లు తెలిపారు. -
తల్లీకూతురు @ ఎంపీటీసీ
నరసన్నపేట రూరల్, న్యూస్‌లైన్: ఎన్నికలంటే ఎన్నో తమాషాలు, ఎన్నో వింతలు ఉంటూనే ఉంటాయి. అలాగే నరసన్నపేటలోనూ చోటుచేసుకుంది. వేరు వేరు చోట్ల ఎంపీటీసీ అభ్యర్థులుగా పోటీ చేసిన తల్లీ, కూతురు ఇద్దరూ ఎన్నికల్లో విజయం సాధించారు. అంతేగాక ఇద్దరి మోజార్టీ కూడా ఒకటే కావడం మరో విశేషం. ఈ తల్లీ కూతురు ఇద్దరూ 375 మోజార్టీతో విజయం సాధించి అందరినీ ఆశ్చర్యపరిచారు. మాకివలస, నరసన్నపేట నుంచి టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థులుగా పోటీచేసిన తల్లి శిమ్మ పార్వతమ్మ, కూతురు నేతింటి భారతి ఇద్దరూ టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థులుగా పోటీ చేసి గెలుపొందారు.