ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా రామకృష్ణాపూర్లో శుక్రవారం తెల్లవారుజామున విషాదం చోటు చేసుకుంది. రైలు కిందపడి తల్లీకూతుళ్లు ఆత్మహత్య చేసుకున్నారు. ఆ మృతదేహాలు రైలు ఇంజన్లో చిక్కుకున్నాయి. ఆ విషయాన్ని గమనించిన రైలు ఇంజన్ డ్రైవర్... రైల్వే పోలీసులకు సమాచారం అందించారు.
దీంతో మంచిర్యాలలో తల్లీకూతుళ్ల మృతదేహాలను రైల్వే పోలీసులు... ఇంజన్లో నుంచి వెలికి తీశారు. అనంతరం మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.