
తల్లీకూతురు, మరో మహిళ అదృశ్యం
శంషాబాద్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో ఒకేసారి తల్లీకూతురు, మరో మహిళ అదృశ్యం కావడం కలకలం సృష్టిస్తోంది. సిద్ధేశ్వర కాలనీకి చెందిన కిష్టమ్మ(40)ఆమె కుమార్తె శిరీష(2), శంషాబాద్ మండలం పెద్దషాపూర్ గ్రామానికి చెందిన కవిత(39) ఆదివారం అదృశ్యమైనట్లు కుటుంబసభ్యులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
కుమార్తెను తీసుకుని కూలిపనికి వెళ్లిన కిష్టమ్మ ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు ఎయిర్‌పోర్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అత్తగారింటికి బయలుదేరిన కవిత ఇల్లు చేరకపోవడంతో ఆమె తండ్రి శంషాబాద్ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.