‘నా బిడ్డ ఎక్కడుందో.. ఎలా ఉందో..’
► కుమార్తె అదృశ్యంపై ఆందోళనలో తల్లిదండ్రులు
► 44 రోజులక్రితం బాలిక అదృశ్యం
► రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలి విచారణ
► దర్యాప్తు వేగవంతం చేయాలని పోలీసులకు ఆదేశం
ఆచంట : ‘నా బిడ్డ చెప్పాపెట్టకుండా వెళ్లి పోయి 44 రోజులైంది.. ఎక్కడుంతో ఎ లా ఉందో తెలియడం లేదు.. తిండి కూడా తినాలనిపించడంలేదు.. వెతకని చోటులేదు.. మొక్కని దేవుడు లేడు.. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు.. మీరైనా నా బిడ్డ ఆచూకీ తెలుసుకుని తీ సుకురండమ్మా..’ అంటూ ఓ తల్లి గుండెలవిసేలా మహిళా కమిషన్ సభ్యుల ఎ దుట బోరుమంది. వివరాల్లోకి వెళితే ఆ చంట పంచాయతీ పోరకు చెందిన వేండ్ర శ్రీనివాసు, శ్రీదేవి దంపతుల కుమార్తె వి జయభవాని (17) గత నెల 6న అదృశ్యమైంది.
తండ్రి టైలరింగ్ చేసుకుంటూ గుంటూరులో ఉంటుండగా, తల్లి శ్రీదేవి ఉపాధి నిమిత్తం రెండేళ్ల క్రితం గల్ఫ్ దేశాలకు వెళ్లింది. దీంతో భవాని తాత, నా నమ్మ సంరక్షణలో ఉంటోంది. ఇంటర్ వరకూ చదువిని భవాని ఆచంటలో టైలరింగ్ నేర్చుకుంటోంది. గతనెల 6న టైలరింగ్ షాపునకు వెళ్లిన భవాని సైకిల్‌కు తా ళం వేసి బ్యాంకుకు వెళ్లి వస్తానని చెప్పి తి రిగి రాలేదు. మరుసటి రోజు బంధువులు ఆచంట పోలీసులకు ఫిర్యాదు చేశా రు. గుంటూరు నుంచి తండ్రి రాగా ఇటీవల తల్లి గల్ఫ్ నుంచి వచ్చింది. వీరంతా దుర్గాభవాని కోసం కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు.
విచారణ చేపట్టిన మహిళా కమిషన్
భవాని అదృశ్యమైన విషయం తెలుసుకున్న రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు శిరిగినీడి రాజ్యలక్ష్మి శనివారం గ్రామంలో బాధితులు, స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. ఎస్సై ఏజీఎస్ మూర్తి నుం చి కేసు దర్యాప్తు వివరాలు తీసుకున్నారు. ఎస్సై ఏజీఎస్ మూర్తి మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని పోలీస్‌స్టేషన్‌లకు సమాచారం ఇచ్చామని, కొందరు అనుమానితులను కూడా విచారించామని చెప్పా రు.
బాధిత కుటుంబానికి తాము అండగా ఉంటామని, భవానీని క్షేమంగా తీసుకువస్తామని మహిళా కమిషన్ సభ్యురాలు రాజ్యలక్ష్మి చెప్పారు. కేసు దర్యాప్తును ప్రతిష్టాత్మకంగా తీసుకుని వేగవంతం చేయాలని ఎస్సైను ఆదేశించారు. రాష్ట్ర కమిటీ, జిల్లా ఉన్నతాధికారులను కలిసి దర్యాప్తు వేగవంతానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. పోడూరు ఐసీడీఎస్ సీడీపీఓ సత్యకల్యాణి, టీడీపీ మండల మహిళా కమిటీ మాజీ అధ్యక్షురాలు చిలుకూరి సత్యవతి పాల్గొన్నారు.