వీరు ఎక్కడికి వెళ్లారు.. అసలేం జరిగింది? | Missing of mother and daughter | Sakshi
Sakshi News home page

వీరు ఎక్కడికి వెళ్లారు.. అసలేం జరిగింది?

Published Sat, Apr 22 2023 7:21 AM | Last Updated on Sat, Apr 22 2023 7:49 AM

Missing of mother and daughter - Sakshi

హైదరాబాద్: ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన తల్లీ కూతుళ్లు కనిపించకుండా పోయిన ఘటన శుక్రవారం మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై సందీప్‌కుమార్‌ వివరాల ప్రకారం మేడిపల్లి పీఅండ్‌టీ కాలనీలో నివసించే డి.వెంకటేశ్వర్లు, ఈశ్వరమ్మ(37) భార్యాభర్తలు. ఈశ్వరమ్మ గృహిణి.  వీరికి పూర్వజ(19), హరిణి(18) కూతుళ్లు. ప్రస్తుతం వీరు చదువుకుంటున్నారు.

ఈ నెల 20వ తేదీన మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో ఇంట్లో చెప్పకుండా ఈశ్వరమ్మ, ఇద్దరు కుమార్తెలు వెళ్లిపోయారు. ఎంత వెతికినా కనిపించకపోవడంతో వెంకటేశ్వర్లు మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  

అన్నదమ్ములను చిదిమేసిన రోడ్డు ప్రమాదం!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement