Mulakalapally: Mother and Daughter Drowned in the River While Returning From the Field - Sakshi
Sakshi News home page

భద్రాద్రి వీడియో: ఇంటికి చేరాలనే ఆత్రుత.. కళ్లముందే కొట్టుకుపోయారు

Published Thu, Jul 27 2023 5:54 AM | Last Updated on Thu, Jul 27 2023 8:28 PM

Washed away before the eyes - Sakshi

ములకలపల్లి: వరినాట్లు వేసేందుకు వెళ్లి తిరిగి వస్తూ తల్లీకూతుళ్లు వాగులో కొట్టుకు పోయారు. కుమార్తె క్షేమంగా బయటపడగా, తల్లి మాత్రం గల్లంతయ్యింది. వివరాలు ఇలా ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కుమ్మరి పాడు గ్రామానికి చెందిన సుమారు 20 మంది మహిళల బృందం బుధవారం చాపరాల పల్లిలో వరినాట్లు వేశారు. తిరిగి వెళ్లే సమయంలో గ్రామ శివారులోని పాములేరు వాగు లోలెవల్‌ చప్టాపై ఉధృతంగా ప్రవహిస్తోంది.

ఇంటికి చేరాలనే ఆత్రుతతో అందరూ గుంపులుగా చేతులు పట్టుకుని వాగు దాటే ప్రయత్నం చేశారు. అయితే మధ్యలో వరద ధాటికి తల్లీకూతుళ్లైన కుంజా సీత, కుర్సం జ్యోతి కొట్టుకుపోయారు. వరద ఉధృతితో సహచర కూలీలు వారిని రక్షించలేకపోయారు. కాసేపటికి జ్యోతి ఓ చెట్టు కొమ్మను పట్టుకుని ఉండగా స్థానికులు కాపాడారు. సీత జాడ మాత్రం రాత్రి వరకు లభించలేదు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement