coolies
-
భద్రాద్రి వీడియో.. కళ్లముందే కొట్టుకుపోయారు
ములకలపల్లి: వరినాట్లు వేసేందుకు వెళ్లి తిరిగి వస్తూ తల్లీకూతుళ్లు వాగులో కొట్టుకు పోయారు. కుమార్తె క్షేమంగా బయటపడగా, తల్లి మాత్రం గల్లంతయ్యింది. వివరాలు ఇలా ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కుమ్మరి పాడు గ్రామానికి చెందిన సుమారు 20 మంది మహిళల బృందం బుధవారం చాపరాల పల్లిలో వరినాట్లు వేశారు. తిరిగి వెళ్లే సమయంలో గ్రామ శివారులోని పాములేరు వాగు లోలెవల్ చప్టాపై ఉధృతంగా ప్రవహిస్తోంది. ఇంటికి చేరాలనే ఆత్రుతతో అందరూ గుంపులుగా చేతులు పట్టుకుని వాగు దాటే ప్రయత్నం చేశారు. అయితే మధ్యలో వరద ధాటికి తల్లీకూతుళ్లైన కుంజా సీత, కుర్సం జ్యోతి కొట్టుకుపోయారు. వరద ఉధృతితో సహచర కూలీలు వారిని రక్షించలేకపోయారు. కాసేపటికి జ్యోతి ఓ చెట్టు కొమ్మను పట్టుకుని ఉండగా స్థానికులు కాపాడారు. సీత జాడ మాత్రం రాత్రి వరకు లభించలేదు. ತೆಲಂಗಾಣದ ಭದ್ರಾದ್ರಿ ಕೊತ್ತಗುಡ್ಡಂ ಜಿಲ್ಲೆಯ ಮುಲಕಪಲ್ಲಿ ಮಂಡಲ್ನ ಮಹಿಳೆಯರು ಗುಂಪಾಗಿ ಸೇತುವೆ ದಾಟುವಾಗ ಓರ್ವ ಮಹಿಳೆಯೊಬ್ಬರು ನೀರಿನಲ್ಲಿ ಕೊಚ್ಚಿಕೊಂಡು ಹೋಗಿದ್ದಾರೆ. #KannadaNews #Newsfirstlive #Telangana #kothagudem #Mulakapally #Rains #Flood pic.twitter.com/BnL3Wq54w4 — NewsFirst Kannada (@NewsFirstKan) July 27, 2023 -
'ఉపాధి'కి మరింత భరోసా
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. వ్యవసాయ పనులు ముగిసిన నేపథ్యంలో కూలీలు వలస వెళ్లకుండా గ్రామాల్లో ముమ్మరంగా ఉపాధి పనులు కల్పిస్తోంది. అడిగిన వారందరికీ జాబ్‌కార్డు ఇచ్చి, పని చూపిస్తోంది. రోజువారీ వేతనం పెంచడంతోపాటు ఎండల నుంచి ఉపమశనం పొందేలా పనివేళలు మార్చి ‘ఊపాధి’కి మరింత భరోసా కల్పించింది. కర్నూలు(అగ్రికల్చర్): మండే ఎండాకాలం ‘ఉపాధి’ పనులకు వెళ్తున్న కూలీలకు రాష్ట్ర ప్రభుత్వం చల్లని కబురు అందించింది. ఈ నెల 1వ తేదీ నుంచి గరిష్ట వేతనాన్ని రూ.237 నుంచి రూ.245కు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున ప్రత్యేకంగా 30 శాతం అలవెన్స్ ఇవ్వాలని ఆదేశించింది. ఫలితంగా పనిలో 30 శాతం తక్కువ చేసినా కూలీలకు పూర్తి వేతనం లభిస్తుంది. కుటుంబానికి ఒకటి చొప్పున జిల్లాలో 5,75,231 జాబ్ కార్డులు ఉన్నాయి. ఇందులో 11,39,439 మంది సభ్యులుగా ఉన్నారు. మొత్తం 3,70,449 కుటుంబాలకు చెందిన 6,59,538 మంది ఊపాధి పనులకు వెళ్తున్నారు. ప్రస్తుతం ప్రతి రోజూ 1.50 లక్షల మంది కూలీలు పనులకు హాజరవుతున్నారు. అడిగిన వారందరికీ పని.. అడిగిన వారందరికీ పని కల్పించే విధంగా జిల్లా నీటియాజమాన్య సంస్థ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గ్రామాల వారీగా ఇంటింటికి వెళ్లి డిమాండ్ తీసుకొని పనులు కల్పిస్తున్నారు. వలసలు లేకుండా గ్రామగ్రామాన పనులు కల్పిస్తున్నారు. వడదెబ్బకు గురికాకుండా.. ఎండల తీవ్రత పెరుగుతున్నందున ఉపాధి పనులకు హజరయ్యే కూలీలు వడ దెబ్బకు గురికాకుండా ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కూలీలు ఉదయం 6 నుంచి 10.30 గంటల వరకు పనులు చేసే విధంగా కార్యాచరణ రూపొందించి, అమలు చేస్తున్నారు. మధ్యాహ్నానికి ఇంటికి చేరుకునే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పనులు చేసే ప్రాంతంలో నీడను కల్పించే బాధ్యతను శ్రమశక్తి సంఘాలకు అప్పగించారు. పని ప్రదేశంలో ఎవరైనా వడదెబ్బకు గురైతే తక్షణం ప్రథ«మ చికిత్స చేసేందుకు వీలుగా ఫస్ట్ ఎయిడ్ బాక్స్‌ను అందుబాటులో ఉంచుతున్నారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లను కూడా ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు. ఉపాధి కూలీలకు మజ్జిగ సరఫరా చేయాలనే ప్రతిపాదన ఉంది. మెరుగైన సదుపాయాలు జిల్లాలో ఉపాధి పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఎండల తీవ్రత నుంచి కూలీలకు రక్షణ కల్పిస్తున్నాం. పని ప్రదేశంలో మెరుగైన సదుపాయాలు కల్పిస్తున్నాం. ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను కూలీలు సద్వినియోగం చేసుకోవాలి. – అమరనాథరెడ్డి, డ్వామా పీడీ వలస వెళ్లడం మానుకున్నాం గతంలో ఉపాధి కూలీ అరకొర వచ్చేది. గుంటూరుకు వలస వెళ్లేవాళ్లం. ఈ సారి కూలీ గిట్టుబాటు అవుతోంది. ఉన్న ఊర్లోనే పనులు దొరుకుతున్నాయి. సౌకర్యాలు కూడా బాగున్నాయి. వలస వెళ్లడం మానుకున్నాం. – సీతమ్మ, ఉపాధి కూలి,బాటతాండ, తుగ్గలి మండలం -
అడ్డాకూలీలుగా టీఎస్ఎస్పీ అభ్యర్థులు
సూర్యాపేట జిల్లా నూతన్‌కల్ మండలం తాళ్లసింగారానికి చెందిన జటంగి వెంకన్న (27) పంతంగి నరేశ్ (22) ఇటీవల టీఎస్ఎస్పీ కానిస్టేబుళ్లుగా ఎంపికయ్యారు. పనిమీద బైకుపై వెళ్తుండగా.. కారు ఢీకొట్టడంతో ఇద్దరూ దుర్మరణం పాలయ్యారు. టీఎస్ఎస్పీ కానిస్టేబుల్‌గా ఎంపికైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఓ అభ్యర్థి.. శిక్షణ కోసం ఎంతకీ పిలుపు రాకపోవడంతో జీవనోపాధి కోసం కూలీగా మారాడు. సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ (టీఎస్ఎస్పీ) కానిస్టేబుళ్లుగా ఎన్నికైన పలువురు అభ్యర్థుల పరిస్థితి దయనీయంగా మారింది. వేలాదిమంది తాము చేస్తోన్న ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలకు రాజీనామాచేసి శిక్షణ కోసం తొమ్మిది నెలలుగా ఎదురుచూస్తున్నారు. ఎంతకీ పిలుపు రాక.. ఆర్థిక ఇబ్బందులు పెరిగి, పలువురు అడ్డాకూలీలుగా మారుతున్నారు. ఇంకొందరు వ్యవసాయ పనులకు వెళ్తున్నారు. వీరిలో ఇద్దరు కానిస్టేబుల్ అభ్యర్థులు రోడ్డు ప్రమాదంలో మరణించారు. మరి కొందరు అభ్యర్థులు గాయాలు, అనారోగ్యాల బారినపడి శిక్షణకు పనికిరాకుండా మారా రు. అధికారులు సివిల్, ఏఆర్ కానిస్టేబుళ్లతోపాటు టీఎస్ఎస్పీ కానిస్టేబుళ్లకూ శిక్షణ ప్రారం భించి ఉంటే అంతా సురక్షితంగా ఉండేవారని అభ్యర్థులు, వారి కుటుంబసభ్యులు వాపోతున్నారు. వ్యవసాయ, అడ్డా కూలీలుగా.. రాష్ట్రవ్యాప్తంగా 17వేలకుపైగా సివిల్, ఏఆర్, టీఎస్ఎస్పీ కానిస్టేబుల్ పోస్టులకు రాతపరీక్షల అనంతరం 2019 సెప్టెంబరు 24న ఫలితాలు విడుదలయ్యాయి. ఎంపికైనవారిలో దాదాపు 4,200 మంది అభ్యర్థులు టీఎస్ఎస్పీ కానిస్టేబుల్ అభ్యర్థులు. ఈ ఏడాది జనవరి 17న దాదాపు 12వేల మంది సివిల్, ఏఆర్ అభ్యర్థులకు కానిస్టేబుల్ శిక్షణ మొదలైంది. వీరికి మొదటి సెమిస్టర్ పూర్తయి, రెండో సెమిస్టర్ పాఠాలూ నడుస్తున్నాయి. కానీ, టీఎస్ఎస్పీ అభ్యర్థులకు 6నెలలుగా ఎలాంటి పిలుపూలేదు. అక్టోబరు 12 తరువాతే అవకాశం? రాతపరీక్షల్లో ఎంపికైన మొత్తం 17వేల మంది అభ్యర్థులుకు ఏకకాలంలో శిక్షణ ప్రారంభించాలని పోలీసుశాఖ భావించింది. వీరిలో 12వేల మంది సివిల్, ఏఆర్ కానిస్టేబుళ్లకు రాష్ట్రంలో, మిగిలిన 4,200 మంది టీఎస్ఎస్పీ పీసీ కేడెట్లకు ఆంధ్రపదేశ్‌లో శిక్షణ ఇద్దామనుకున్నారు. సాంకేతిక కారణాలతో వీరిని ఏపీకి పంపడం కుదరలేదు. దీంతో కర్ణాటక, మధ్యప్రదేశ్‌కు పంపే ప్రయత్నాలు మొదలుపెట్టగానే.. కరోనా కలకలం రేగింది. ఇప్పుడు జూన్ కూడా గడిచిపోతోంది. మరోవైపు సివిల్, ఏఆర్ కానిస్టేబుళ్లుకు మొదటి సెమిస్టర్ పూర్తయింది. అక్టోబరు తొలి వారంలో వీరి శిక్షణ పూర్తయి పాసిం గ్ ఔట్ పరేడ్ జరగనుంది. ఆ తరువాత టీఎస్ఎస్పీ అభ్యర్థులకు శిక్షణ మొదలు కానుందని సమాచారం. -
కుప్పకూలిన స్లాబ్
భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయ భవనం నిర్మాణ సమయంలోనే కుప్పకూలింది. అయితే, తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఇద్దరు వ్యక్తులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. భూపాలపల్లి జిల్లా ఏర్పాటయ్యాక మున్సిపల్ కార్యాలయ సమీపంలోని ప్రభుత్వ స్థలంలో జిల్లా పోలీసు కార్యాలయాన్ని నిర్మిస్తున్నారు. భవనానికి ముందు పోర్టికో నిర్మాణానికి కాంట్రాక్టర్ రెండు నెలల క్రితం సెంట్రింగ్ ఏర్పాటు చేయించాడు. ఇంతలోనే లాక్డౌన్ విధించడంతో కూలీలు స్వగ్రామాలకు వెళ్లిపోయారు. ఇటీవలే నిర్మాణ పనులను ప్రారంభించాడు. శనివారం పోర్టికో స్లాబ్ వేస్తుండగా సాయంత్రం సేద తీరేందుకు కూలీలు మొత్తం స్లాబ్ నుంచి కిందకు దిగారు. నలుగురు మేస్త్రీలు మాత్రమే పైన ఉన్నారు. ఈ క్రమంలో ఒక్కసారిగా స్లాబ్ కుప్పకూలింది. ఈ ఘటనలో మేస్త్రీలు గణపురం మండలం చెల్పూరుకు చెందిన ఆంటోని, బ్రహ్మయ్యలకు స్వల్ప గాయాలయ్యాయి. కాగా కాంట్రాక్టర్, అధికారుల నిర్లక్ష్యం మూలంగానే ఈ ప్రమాదం చోటుచేసుకుందనే ప్రచారం సాగుతోంది. రెండు నెలల క్రితం సెంట్రింగ్ వేయించడం... ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న సమయంలో స్లాబ్ వేయడం మూలంగానే ప్రమాదం జరిగిందని పలువురు చెబుతున్నారు. -
పనే ప్రామాణికం
నల్లబెల్లి: పల్లెల నుంచి పట్నాలకు వలసలను నివారించేందుకు జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం విధితమే. గ్రామాల్లో వ్యవసాయం పనులు లేనప్పుడు కూలీలకు స్థానికంగానే పనులు కల్పించాలనేది ఈ పథక ఉద్దేశం. ఇప్పటివరకు పల్లెల్లో సత్ఫలితాలు ఇస్తూ వచ్చింది. అసలు సమస్య ఇక్కడే వచ్చింది.. పథకం ప్రారంభం నుంచి క్షేత్ర సహాయకులుగా పని చేసిన వారికి ప్రభుత్వం తాజాగా తీసుకొన్న నిర్ణయంతో ఆందో ళన చెందుతున్నారు. ప్రభుత్వం జారీ చేసిన సర్క్యూలర్‌తో ఉన్న ఉద్యోగం ఎప్పుడు ఊడుతుందోనని దిగులుగా ఉన్నారు. సర్క్యూలర్ జారీ తర్వాత కూలీలకు కనీస పనిదినాలు ఖచ్చితంగా కల్పించాల్సిందే. లేదంటే సదరు ఫీల్డ్ అసిస్టెంట్లను తగ్గించడం, లేదా తొలగించేలా కఠిన చర్యలు తీసుకునేందుకు కసరత్తు జరుగుతోంది. కనీస పనిదినాలు కల్పించని ఫీల్డ్ అసిస్టెంట్‌ను తొలగించాలని ఇటీవల గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ సర్క్యూలర్ 9333 జారీ చేశారు. జిల్లాలో 264 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు పని చేస్తుండగా ఈ ఆదేశాలతో సుమారు 60 మందికి పైగా ఫీల్డ్ అసిస్టెంట్లపై వేటుపడే అవకాశాలున్నాయి. చిన్న గ్రామాలకు ఫీల్డ్ అసిస్టెంట్లు లేనట్టే..! జిల్లాలో 15 మండలాల పరిధిలో 264 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు పని చేస్తున్నారు. ఉపాధి హామి పథకం ప్రారంభంలో గ్రామానికి ఒకరి చొప్పున ఫీల్డ్ అసిస్టెంట్లను నియమించారు. అయితే చిన్న గ్రామాలకు సైతం క్షేత్ర సహాయకులను నియమించడంతో ప్రభుత్వ ఉద్యోగమని భావించి ఉన్నత చదువులు ఆపేసి కొందరు.. ప్రైవేట్ ఉద్యోగాలు వదిలేసి మరికొందరు ఫీల్డ్ అసిస్టెంట్లుగా చేరారు. పని అడిగిన కూలీలకు పనులు కల్పిస్తూ వస్తున్నారు. కాగా పని నిర్థారణ, కేటాయింపు, కూలీల విషయంల్లో పలు మార్పులు చోటు చేసుకోగా సరికొత్తగా కూలీల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతూ సర్క్యులర్ జారీ చేసింది. విధులపై నిర్లక్ష్యంగా వ్యవహరించే ఉపాధి హామి సిబ్బందిపై చర్యలు తీసుకొనేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగానే ప్రతి కుటుంబానికి 25 రోజులకు తగ్గకుండా పని కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. 40 రోజులకు పైగా పని కల్పించేలా నిర్ణయించి.. పని అడిగిన ప్రతి ఒక్కరికీ పనులు చూపించాలి. దినసరి ససగటు కూలి రూ.180 కంటే తగ్గకుండా చూడాలి. 100 శాతం జాబ్ కార్డులను అప్డేట్ చేయాల్సి ఉంటుంది. పని ప్రదేశంలో మస్టర్‌రోల్‌ను నిర్వహించాలి. కూలీలకు పే స్లిప్‌లు తప్పకుండా పంపిణీ చేయాల్సి ఉంది. గ్రామాల్లో నర్సరీ పనులను తప్పకుండా పర్యవేక్షించాలి. పని దినాలను బట్టే వేతనం.. ఉపాధి హామి పథకంలో పని అడిగిన ప్రతి కుటుంబానికీ ప్రభుత్వం జాబ్ కార్డు అందించింది. ప్రస్తుతం ఈ పథకంలో గ్రామాల్లో కూలీలకు కల్పించే పనిదినాలను బట్టి ఫీల్డ్ అసిస్టెంట్లకు వేతనాల చెల్లింపు అర్హత లిస్టులను రూపొందించేందుకు సిద్ధమవుతున్నారు. అందులో జాబ్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి ఫీల్డ్ అసిస్టెంట్ ఒక ఏడాదిలో 40 పనిదినాలు కల్పించాల్సి ఉంటుంది. ఆయా గ్రామ పంచాయతీల జాబితా 1, 2, 3 గా విభజించారు. సగటున 40 దినాల పనిచూపితే ఆ గ్రామ పంచాయతీ లీస్టు–1 అర్హత పొందుతుంది. ఈ గ్రామపంచాయతీల్లో పనిచేసే ఫీల్డ్ అసిస్టెంట్‌కు నెలకు వేతనం రూ.10 వేలు అందిస్తారు. 25 నుంచి 40 రోజుల మధ్యలో పని కల్పిస్తే లీస్టు–2 గ్రామపంచాయతీగా పరిగణిస్తారు. వీరికి రూ.5 వేల వేతనం అందిస్తారు. 25 రోజులలోపు పని దినాలు కల్పిస్తే లిస్ట్–3 గ్రామ పంచాయతీగా పరిగణిస్తారు. ఇక్కడ సీనియర్ మేట్‌తో పనులు నిర్వహిస్తారు. 2018 జూలై 1 నుంచి 2019 జూన్ 30 వరకు ఆయా గ్రామపంచాయతీల్లో ఫీల్డ్ అసిస్టెంట్లు కల్పించిన పని దినాలను లెక్కించి కుటుంబాల వారీగా విభజించి వారిని లిస్ట్–1, 2, 3 గా విభజించనున్నారు. ఈ నిబంధనలతో ఫీల్డ్ అసిస్టెంట్లు ఆందోళన చెందుతున్నారు. నిబంధనలు పాటించాల్సిందే ఉపాధి హామి పథకానికి సంబంధించి ప్రభుత్వ నిబంధనలు ప్రతి ఫీల్డ్ అసిస్టెంట్ పాటించాల్సిందే. కూలీలకు ఎ క్కువ పనిదినాలు కల్పించాలనే లక్ష్యం తో ప్రభుత్వం ఈ నిబంధనలు తీసుకొ చ్చింది. దానికి అనుగుణంగా ఫీల్డ్ అసిస్టెంట్లు పనిచేయాల్సి ఉంటుంది. పనులకు సక్రమంగా రాని ఉపాధి కూలీల జాబ్ కార్డులను రద్దుచేసే అవకాశాలు ఉన్నాయి. – పంజ వెంకట్‌నారాయణ, ఏపీఓ, నల్లబెల్లి -
ఉపాధి‘హామీ’ గాలికి!
ఆదిలాబాద్‌రూరల్: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద గ్రామాల్లో జరుగుతున్న పనులను సోమవారం ‘సాక్షి’ బృందం విజిట్ చేయగా.. కూలీలు పడుతున్న పలు ఇబ్బందులు వెలుగులోకి వచ్చాయి. మండే ఎండల్లో పని చేసేందుకు వారు నానా అవస్థలు పడుతున్నారు. వారికి కనీస సౌకర్యాలు కల్పించాల్సిన అధికారులు మాత్రం ఆ దిశగా చర్యలు తీసుకుంటున్న దాఖలాలేవీ కనిపించలేదు. పనులు జరుగుతున్న చోట దగ్గర టెంట్లు, తాగునీటి వసతులు కూడా ఏర్పాటు చేయలేదు. ఇంటి నుంచి తెచ్చుకున్న నీళ్లే తాగుతున్నామని కూలీలు ‘సాక్షి’ ఎదుట వాపోయారు. ఇక ఓఆర్ఎస్ ప్యాకెట్లు, వైద్యం వంటి సౌకర్యాల జాడే కానరాలేదు. చాలా మందికి పనులు కల్పించకపోవడం వల్ల కూడా వలసబాట పడుతున్నట్లు తెలిసింది. ఆదిలాబాద్‌రూరల్: మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న కూలీలకు క్షేత్రస్థాయిలో వసతులు కరువయ్యాయి. రోజురోజుకూ జిల్లాలో ఎండలు మండుతున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో కూలీలు సేదతీరడానికి టార్పిన్లు అందించకపోవడంతో ఎండలోనే సేదతీరాల్సిన దుస్థితి నెలకొంది. ప్రతీ సంవత్సరం ఉపాధి హామీ కూలీలకు ఫస్ట్ ఎయిడ్ బాక్సులు పంపిణీ చేస్తారు. కానీ ఈ ఏడాది వాటి పంపిణీ కూడా జరగకపోవడంతో ఏదైనా గాయమైతే కూలీలు ఇబ్బందులు పడుతున్నారు. గతేడాదికి సంబంధించిన పస్ట్ ఎయిడ్ బాక్సులను వినియోగించుకోవాలని అధికారులు చెబుతున్నా.. అవి మాత్రం క్షేత్రస్థాయిలో ఎక్కడ కనిపించడం లేదు. ఇదిలా ఉండగా 2018–19లో కూలీలకు కనీస వేతనంగా రూ.205 అందించారు. కేంద్ర ప్రభుత్వం ఏటా ప్రకటించే కనీస వేతన కొలమానం ప్రకారం.. ఈ ఏడాది 2019–20 ప్రకారం కూలీలకు రోజు వారీ వేతనాన్ని మరో రూ.6 పెంచారు. కానీ నిధులు అందుబాటులో లేకపోవడంతో వాటిని కూడా సకాలంలో అందించడం లేదని తెలుస్తోంది. పెంచిన వేతనంతో జిల్లాలో లక్షలాది మందికి మేలు కలుగనుంది. జిల్లాలో 2018–19 ఆర్థిక సంవత్సరానికి 40 లక్షల పని దినాలు కల్పించాలని లక్ష్యంగా నిర్ణయించగా ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి 38 లక్షల పని దినాలను కల్పించారు. ఇందులో 6,550 కుటుంబాలకు వంద రోజుల పని దినాలు కల్పించిన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఈ మేరకు కూలీలకు ఆర్థిక సంవత్సరం మొత్తంలో రూ.64 కోట్లు చెల్లించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 40 లక్షల పని దినాలు కల్పించాలని లక్ష్యంగా నిర్ణయించి ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపారు. సకాలంలో కూలీలకు డబ్బులు రాకపోవడంతో పనులకు సైతం వెళ్లేందుకు అంతగా ఆసక్తి కనబర్చడం లేదని కూలీలు పేర్కొంటున్నారు. రెండు నెలల కూలి పెండింగ్.. ఎండల్లో పని చేస్తున్న కూలీలకు సకాలంలో వేతనాలు రాకపోవడంతో నిరాశ చెందుతున్నారు. పనులు చేసి కూడా సకాలంలో డబ్బులు రాకపోతే తమ కుటుంబాలను పోషించుకేనేదేలా అంటూ కూలీలు ప్రశ్నిస్తున్నారు. రెండు నెలల నుంచి వేతనాలు రావడం లేదని అధికారులు చెబుతున్నప్పటికీ కొంతమంది కూలీలకు గతేడాది డిసెంబర్ నుంచి డబ్బులు రావడం లేదని కూలీలు వాపోతున్నారు. జిల్లాలో 13 మండలల్లో ఉపాధి హామీ పనులు కొనసాగుతుండగా, రెండు నెలల నుంచి ఒక్కో మండలానికి రూ.5లక్షల నుంచి రూ.6లక్షల వరకు డబ్బులు రావాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. కనీసం 40 దినాల పని లభించేనా.. ఉపాధి పనుల్లో జాబ్ కార్డుపై నమోదైన ఒక కుటుంబానికి ఏడాదికి కనీసం వంద పనిదినాలు కల్పించాలనేది ప్రభుత్వ లక్ష్యం. కుటుంబంలో ముగ్గురు కంటే ఎక్కువ సభ్యులు ఉన్న వారికి కనీసం వంద పనిదినాలు కల్పిస్తారు. ఇద్దరు సభ్యులు ఉన్న కుటుంబాలు అనేకం ఉన్నాయి. వీరికి న్యాయం చేసేలా ఒక్కొక్కరికి కనీసం 40 రోజులు పని కల్పించాలన్నది ప్రభుత్వ నిర్ణయం. హరిత హారం కోసం పంచాయతీకి ఒక నర్సరీని ఏర్పాటు చేశారు. ఎక్కువ పనులు చేయడం ద్వారా కూలీలకు అందించే సగటు వేతనం భారీగా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. జిల్లాలో రోజుకు కనీసం రూ. 190 వేతనం వచ్చేలా చేయాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు. కాగా 2018–19లో జిల్లాలో కూలీలకు సగటు వేతనం 178 మాత్రమే అందింది. పనికి వెళ్తున్న కూలీలు.. 63 వేల మంది.. వేసవిని దృష్టిలో ఉంచుకొని కూలీలు ఉదయం పూటనే ఉపాధి హామీ పనులకు వెళ్తున్నారు. జిల్లాలో ప్రస్తుతం 63 వేల మంది కూలీలు ఉపాధి హామీ పనులకు వెళ్తున్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు లక్ష మంది కూలీలకు ఉపాధి కల్పిం చేందుకు అధికారులు ప్రణాళికలను రూపొందిస్తున్నారు. జిల్లాలో 18 మండలాలు ఉండగా ఇందులో 13 మండలలోని ఉపాధి హామీ కూలీలకు ఉపాధి హామీ పనులను కల్పిస్తున్నారు. లక్ష్యం నేరవేరేనా.. జిల్లాలో ఆయా మండలల్లోని ఉపాధి హామీ కూలీలకు వేసవి కాలంలో లక్ష మందికి రోజు కూలీ పని కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ సకాలంలో డబ్బులు రాకపోవడంతో కూలీలు పనులకు వెళ్లేందుకు మొగ్గు చూపడం లేదు. దీంతో వారి లక్ష్యం చేరడం కష్టంగా మారింది. డబ్బులు రాలేదు.. వడూర్‌లో ఉపాధి పనులు చేసిన. ఇప్పటికీ డబ్బులు రాలేదు. అధి కారులకు తెలిపినా పట్టించుకోవడంలేదు. కూలీలను ఆదుకుం టామని చెప్పే మాటలు మాటలకే పరిమితమైనాయి. అధికారులు స్పందించి కూలీలకు డబ్బులు సకాలంలో చెల్లించేలా చర్యలు తీసుకుంటే బాగుంటుంది. – సింగం పరమేశ్వర్, కూలీ, వడూర్ ఇంటి నుంచే నీళ్లు తెచ్చుకుంటున్నాం పనులు చేస్తున్న చోట నీళ్ల సరఫరా లేదు. తాగే నీళ్లను ఇంటి నుంచే తెచ్చుకోవాలని చెప్తున్నరు. నీళ్లకు డబ్బులు ఇస్తున్నామంటున్నారు కానీ అవి వస్తున్నాయో లేదో నాకు మాత్రం తెలియదు. మెడికల్ కిట్లు లేవు. ఎండ ఎక్కువగా ఉన్నందున కనీసం ఓఆర్ఎస్ ప్యాకెట్లైనా ఇస్తే బాగుంటుంది. నీడ కోసం టెంట్లు లేవు. సేదతీరాలంటే ఎక్కడైనా చెట్టు ఉంటే కొద్దిసేపు ఉంటున్నం లేకపోతే లేదు.– హెచ్‌కే రమేష్, కూలీ, చిట్యాల్బోరి -
మున్సిపాలిటీ వచ్చే.. ఉపాధి పోయే..!
ఇబ్రహీంపట్నంరూరల్: మున్సిపాలిటీల్లో విలీనమైన గ్రామాల్లో కూలీలు ఉపాధి హామీ పనులు కోల్పోయారు. నిబంధనల ప్రకారం మున్సిపాలిటీలలో ఉపాధి హామీ పథకం వర్తించదు. ఇబ్రహీంపట్నం నియో జవర్గంలోని తుర్కయంజాల్, ఆదిబట్ల మున్సిపాలిటీలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మంగళ్‌పల్లి, యంపీ పటేల్‌గూడ, రాందాస్‌పల్లి, బొంగ్లూర్, కొంగరకలాన్, ఆదిబట్ల గ్రామాలతో ఆదిబట్ల మున్సిపాలిటీ ఏర్పడింది. ఇంతకుముందు ఈ ఆరు గ్రామాల్లో 1728 మంది కూలీ లు ఉపాధి హామీ జాబ్‌కార్డులు పొందారు. ఉపా ధి పనులు జరిగే సమయంలో వీరు రోజుకు రూ. 150 నుంచి రూ.180 వరకు సంపాదిస్తారు. అయితే వారు ఇప్పుడు మున్సిపాలిటీ ఏర్పాటుతో ఉపాధి కోల్పోయారు. సూమారు 5వేల మందికి పైగా కూలీలు పనులకు దూరమయ్యారు. పనులు ఆగిపోవడంతో కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లకు భరోసా .. గత 12 సంవత్సరాలుగా గ్రామాల్లో ఉపాధి హామీ పథకం కింద కూలీలు, ఫీల్డ్ అసిస్టెంట్లు పనిచేస్తున్నారు. అయితే, మున్సిపాలిటీ ఏర్పాటు తర్వాత కూలీలను పట్టించుకోని ప్రభుత్వం ఫీల్డ్ అసిస్టెంట్లకు మాత్రం భరోసా కల్పించింది. మున్సిపాలిటీల్లో విలీనం అయ్యే గ్రామాల్లో పనిచేస్తున్న ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్లను ఇతర గ్రామాల్లో ఖాళీగా ఉన్న చోట పనిచేసే విధంగా వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. కూలీలకు ఎలాంటి హామీ ఇవ్వకపోవడంతో వారు ఆందోళనలో ఉన్నారు. -
ఉపాధి ఉత్తిమాటేనా?
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: పేదల కడుపు నింపడం, వలసల నివారణ కోసం చేపట్టిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లక్ష్యం నీరుగారుతోంది. కూలీలకు ఉన్నచోటే పనులు కల్పించి జీవనోపాధికి భరోసా ఇవ్వాల్సిన ఈ పథకం అమలు పేరుగొప్ప ఊరు దిబ్బలా మారుతోంది. సరైన ఉపాధి లభించక గ్రామీణ ప్రాంతాల ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఈ ఏడాది ఉపాధి హామీ పనుల కోసం రాష్ట్రవ్యాప్తంగా 61.42 లక్షల మంది నమోదు చేసుకోగా.. 41.49 లక్షల మందికి మాత్రమే, అదీ అరకొరగా పనులు దొరికాయి. దీంతో గ్రామీణ ప్రాంతాల్లోని పేదలు కూలీ పని కోసం ఎంతదూరమైనా వెళుతున్నారు. అలా పత్తి ఏరే పని కోసం కరీంనగర్ జిల్లా చామనపల్లి నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం నర్సక్కపల్లెకు ఆటోలో వెళుతున్న కూలీలు.. ప్రమాదంలో మరణించారు. భరోసా ఇవ్వని ‘ఉపాధి’ ఉపాధి హామీ చట్టం ప్రకారం కూలీలకు ఏడాదిలో కనీసం 100 రోజుల పాటు పని కల్పించాలి. కానీ ఇది అమలు కావడం లేదు. ఈ ఏడాది ఉపా«ధి హామీ కింద పనుల కోసం 61.42 లక్షల మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు. అందులో ఇప్పటివరకు 41.49 లక్షల మందికి మాత్రమే, అదీ అరకొరగా పనులు లభించాయి. అంటే సుమారు 20 లక్షల మందికి మొత్తానికే ‘ఉపాధి’పనులు లభించలేదు. ఇక పని దొరికినవారిలోనూ హామీ మేరకు ‘వంద రోజుల పని’పూర్తి చేసుకున్న కుటుంబాలు 1,31,103 మాత్రమే. ముఖ్యంగా పాత కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో ఉపాధి హామీ పనులు కూలీలకు భరోసా ఇవ్వడం లేదు. తగిన వేతనమూ దిక్కులేదు పని లభించని ఉపాధి కూలీల మాటేమోగానీ.. పనులకు వెళ్లినవారికీ తగిన వేతనం అందించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం రోజుకు కూలీ సగటున రూ.194కు తగ్గకుండా చూడాలి. కానీ ఈ ఏడాది ఇప్పటివరకు ఉపాధి కూలీలకు అందిన సగటు రోజు కూలీ రూ.139.8 మాత్రమే. దీంతో కూలీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలు జిల్లాల్లో కూలీలకు రెండు నెలలుగా సొమ్ము చెల్లించలేదని చెబుతున్నారు. ఉపాధి హామీ అమలు తీరు.. జారీ అయిన మొత్తం జాబ్‌కార్డులు: 66.84 లక్షలు ఈ ఏడాది పనుల కోసం నమోదు చేసుకున్న వారు: 61.42 లక్షలు పనిపొందినవారు: 41.49 లక్షలు 100 రోజుల పని పూర్తి చేసిన కుటుంబాలు: 1,31,103 అందాల్సిన కూలీ: రూ.194 సగటున లభించిన కూలీ: రూ.139.80 పని లేదు.. పైసలూ రాలేదు ‘‘ఈ ఏడాది ఉపాధి హామీ పనులు సరిగా దొరకలేదు. దీంతో పత్తి ఏరేందుకు వెళ్తున్నా. ఉపాధి హామీలో చేసిన పనులకు ఇప్పటివరకు డబ్బులు రాలేదు. కుటుంబం గడవడం కష్టంగా ఉంది. అధికారులు చొరవ చూపి ఊళ్లోనే ఉపాధి హామీ పనులు జరిగేలా చూడాలి..’’ – గోపరవేన రాజమ్మ, ఉపాధి కూలీ, దమ్మక్కపేట కరీంనగర్ జిల్లా దూరం పోతే.. ప్రాణాలు పోతున్నాయి ‘‘ఉపాధి పని దొరకక పత్తి ఏరేందుకు, వేరే కూలీ పనుల కోసం దూరంగా ఉన్న ఊళ్లకు పోవాల్సి వస్తోంది. పనికోసం తీసుకెళ్లేవారు.. ఆటోలు, ట్రాక్టర్లలో ఇష్టం వచ్చినంత మందిని ఎక్కించుకుని తీసుకెళుతున్నారు. దాంతో ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి..’’ – ఎన్.సాంబశివారెడ్డి, కూలీ, పెద్దపాపయ్యపల్లి, కరీంనగర్ జిల్లా -
బడికి వెళ్లని ‘బాల్యం’
పొట్ట చేతపట్టుకొని కర్నూలు నుంచి వందల సంఖ్యలో వ్యవసాయ కూలీలు తాడికొండ, మేడికొండూరు మండలాల్లోని పలు గ్రామాలకు వచ్చారు. వీరంతా పిల్లా పాపలతో తరలివచ్చారు. వీరు పొలాల్లోనే తాత్కాలిక నివాసాలు ఏర్పరచుకొని జీవనం సాగిస్తున్నారు. నిర్బంధ విద్యాహక్కు చట్టం అమలు కాగితాల్లోనే తప్ప.. ఇటువంటి వలస కూలీల పిల్లల విషయంలో ఏనాడూ పట్టించుకున్న దాఖలాలు లేవు. తల్లిదండ్రులతో పాటు ఊరూరా తిరిగే వీరు కూడా చదువు సంధ్యల్లేక కాస్త వయసు రాగానే పొలం పనులకే వెళుతూ తల్లిదండ్రుల బాటే పట్టక తప్పదు. దీంతో వీరికి నిరక్షరాస్యత తరతరాల వారసత్వంగా సంక్రమిస్తుంటుంది. - తాడికొండ రూరల్ -
మద్యం వ్యాపారుల నయా ట్రెండ్
మందుబాబులకు కాంబో సాక్షి, హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దుతో గిరాకీ తగ్గిన మద్యం వ్యాపారులు సరికొత్త ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు. రూ.500, వెయ్యి నోటుతో మద్యం దుకాణాలకు వస్తున్న వారిని ఆకర్షించేందుకు సరికొత్త కాంబో ఆఫర్‌ను అందిస్తున్నారు. ఉదాహరణకు రూ.500 నోటుతో వచ్చేవారికి అరసీసా ప్రీమియం బ్రాండు మందు (375ఎంఎల్), ఒక లీటరు వాటర్ బాటిల్, మరో లీటరు సోడా అందిస్తుండటం గమనార్హం. ఇక రూ.వెయ్యి నోటుతో వచ్చినవారికీ బంపర్ ఆఫర్ ప్రకటిస్తున్నారు. వీరికి ఫుల్బాటిల్తోపాటు రెండు లీటర్ల నీళ్ల బాటిల్, ఒక లీటరు సోడా, తినేందుకు స్నాక్స్ చేతిలో పెట్టడం గమనార్హం. మహానగరం పరిధిలో 500 మద్యం దుకాణాలు, 570 వరకు బార్లున్నాయి. పెద్ద నోట్ల రద్దుతో వీటికి గిరాకీ ఇటీవల సుమారు 50 శాతం మేర పడిపోరుుంది. పలు దుకాణాల్లో క్రెడిట్, డెబిట్ కార్డులతో మద్యం సరఫరా చేస్తున్నారు. ఇక దినసరి కూలీలు, చిరుద్యోగులు కొనుగోలు చేసే చీప్‌లిక్కర్ గిరాకీ అమాంతం పడిపోయినట్లు పలువురు వ్యాపారులు చెబుతున్నారు. -
ఎర్రచందనం దుంగలు స్వాధీనం
రుద్రవరం: రుద్రవరం అటవీ రేంజ్ పరిధిలోని డి. వనిపెంట బీటు ప్రాంతంలో రూ. 50 లక్షలు విలువ చేసే ఎర్రచందనం దుంగలను ఫారెస్ట్ అధికారులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. వివరాలను రేంజర్ రామ్‌సింగ్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. 20 మంది కూలీలు ఎర్రచందనం దుంగలను తరలిస్తున్నారని సమాచారం అందడంతో సిబ్బందితో దాడులు నిర్వహించామన్నారు. డి. వనిపెంట ప్రాంతంలోని ముచ్చుగుంత వద్ద వెళ్తుంగా గమనించిన ఎర్రచందనం కూలీలు దుంగలను పడేసి పరారు అయ్యారన్నారు. ఈ దుంగలను స్వాధీనం చేసుకుని తూకం నిర్వహించగా 551 కిలోల బరువు ఉన్నాయన్నారు. దాడుల్లో సెక్షన్ అధికారులు మక్తర్ బాషా, తేజ, బీటు అధికారులు ప్రతాప్, నాగప్ప, పెద్దన్న పోటెక్షన్ వాచర్లు పాల్గొన్నట్లు వెల్లడించారు. -
కూలీ బతుకులపై పిడుగు
♦ పిడుగుపాటుకు గురై ఇద్దరి మహిళల మృతి ♦ అపస్మారక స్థితిలో ఉన్న మరొక మహిళ బూర్జ/సరుబుజ్జిలి(ఆమదాలవలస రూరల్): ఆమదాలవలస నియోజకవర్గంలో పిడుగుపాటుకు గురై ఇద్దరు మహిళలు మృతి చెందారు. మరో మహిళ అపస్మారక స్థితిలో ఉంది. బూర్జ, సరుబుజ్జిలి మండలాల్లో శనివారం సాయంత్రం పొలం పనులు చేస్తున్న వీరిని పిడుగులు బలి తీసుకున్నాయి. వివరాలు ఇలావున్నాయి. బూర్జ మండలంలోని ఏ.పి.పేట(అప్పలపేట) గ్రామానికి సమీపంలోని పొలాల్లో శనివారం సాయంత్రం పిడుగుపడడంతో గ్రామానికి చెందిన రేవాడ చిన్నమ్మడు(45) మృతి చెందింది. మరొక మహిళ నట్ల చిన్నమ్మడు అపస్మారక స్థితిలో ఉంది. ఆ గ్రామానికి చెందిన 15 మంది ఒక పొలంలో వరి నాట్లు వేస్తుండగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. భయంకరమైన శబ్ధంతో కూడిన పిడుగు పడటంతో వారందరూ చెల్లా చెదురయ్యారు. ఇద్దరు మాత్రం అపస్మారక స్థితిలో పడిపోయారు. వెంటనే స్థానికులు వారిని పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రేవాడ చిన్నమ్మడు మృతి చెందింది. ఆమె మృతితో భర్త, కుమార్తె, బంధువులు ఆస్పత్రిలో భోరున విలపిస్తున్నారు. నట్ల చిన్నమ్మడు పరిస్థితి విషమించటంతో శ్రీకాకుళం రిమ్స్‌కు రిఫర్ చేశారు. ఇద్దరి కుటుంబాలు నిరుపేదలు. రెక్కాడితే గాని డొక్కాడని జీవితాలు వారివి. పొలంకెళ్లి తిరిగివస్తూ.... సరుబుజ్జిలి మండలంలోని వీరభద్రాపురం గ్రామానికి చెందిన బురిడి అనసూయమ్మ(50) పిడుగుపాటుకుగురై మృతి చెందింది. స్థానికులు చెప్పిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. పొలంలో కలుపుతీతకు వెళ్లి తిరిగివస్తున్న తరుణంలో గ్రామానికి సమీపంలోని కోనేరు గట్టువద్ద పిడుగుపాటుకు గురై ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలికి భర్త సత్యం, ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. అనసూయమ్మ హఠాన్మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. మృతురాలి కుటుంబాన్ని సర్పంచ్ మునకాల సూర్యారావు పరామర్శించి ప్రభుత్వం నుంచి సహాయంకు కృషిచేస్తానని చెప్పారు. -
పట్నం రోడ్డుపై పల్లె తల్లి
♦ కరువు కాటుతో హైదరాబాద్‌కు వలస వచ్చిన లక్షల మంది రైతులు, కూలీలు ♦ అడ్డాకూలీలుగా మారి పనుల కోసం ఎదురుచూపులు.. ♦ సెక్యూరిటీ గార్డులుగా, వాచ్మన్లుగా చేరిన వైనం ♦ ఇరుకు గదులు, మురికివాడల్లో జీవనం ♦ కూకట్పల్లి నుంచి ఉప్పల్ దాకా ఎక్కడ చూసినా రైతుల వెతలే ♦ ఛిద్రమైన పల్లె బతుకుపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం ⇒ పచ్చని పొలాలు.. భూతల్లికి తీరొక్క పంటల తోరణాలు.. నల్లరేగళ్లలో నాగళ్ల సాళ్లు.. ⇒ ఎద్దూ ఎవుసం.. వాగూవంక, చేనూచెలక.. ఎక్కడ చూసినా తడిసిన మట్టివాసనే..! ఇదంతా గతం.. ⇒ పొట్ట చేతబట్టుకొని హైదరాబాద్‌కు వలస వచ్చిన లక్షల మంది రైతులు, కూలీలు ⇒ అడ్డాకూలీలుగా మారి పనుల కోసం ఎదురుచూపులు.. సెక్యూరిటీ గార్డులుగా, వాచ్మెన్లుగా చేరిన వైనం మరి ఇప్పుడు.. పల్లె తల్లడిల్లుతోంది. నీళ్లు లేక కన్నీళ్లు పెట్టుకుంటోంది. చేన్లు, చెలకలన్నీ బీడు పడ్డాయి. బోర్లన్నీ ఎత్తిపోయాయి. చెరువులు నైచ్చాయి. కాస్తోకూస్తో నిలబడ్డ పంటలూ నిలువునా ఎండిపోయాయి. కనీవినీ ఎరుగని ఈ కరువు, దుర్భిక్ష పరిస్థితులు పల్లె జీవనాన్ని ఛిద్రం చేస్తున్నాయి. నలుగురికి పట్టెడన్నం పెట్టే రైతన్నను పట్నానికి తరుముతున్నాయి. నలుగురికి పని కల్పించిన చేతులే ఇప్పుడు పనికోసం చేయి చాస్తున్నాయి. భార్యాబిడ్డలను పస్తులుంచలేక పొట్ట చేతబట్టుకొని ఎందరో రైతులు పట్నం బాట పట్టారు. హైదరాబాద్ మహానగరంలో అడ్డాకూలీల అవతారమెత్తారు. గతంలో ఎప్పు డూ లేనట్లుగా వివిధ జిల్లాల నుంచి రైతులు, రైతు కూలీలు, బడుగు జీవులు రాజధానికి చేరుకుంటున్నారు. మట్టిపని, తట్టపని, పారపని.. ఏది దొరికినా సరేనంటూ రోడ్లపై నిలబడు తున్నారు. ఊళ్లో నాలుగెకరాల పొలమున్న రైతులు సైతం నగరంలో అపార్ట్మెంట్ల వద్ద సెక్యూరిటీ గార్డుగా, నిర్మాణంలో ఉన్న భవనాల వద్ద వాచ్మన్లుగా చేరిపోయారు. ఇరుకు గదుల్లో, మురికివాడల్లో కాలం వెళ్లదీస్తున్నారు. 80 ఏళ్ల వయసులోనూ ఓ గుడి వద్ద వాచ్‌మన్‌గా చేరిన మైల ఐలయ్య... మూడెకరాల పొలం ఉండీ పంటలు పండే పరిస్థితి లేక నగరానికి వచ్చిన మెదక్ రైతు సాయమ్మ.. ఇలా లక్షలాదిగా రైతులు, పేదలు ఉపాధి కోసం నగరానికి తరలి వచ్చారు. నగరంలోని కూకట్పల్లి, మూసాపేట్, మియాపూర్, బొల్లారం చౌరస్తా, చందానగర్, సికింద్రాబాద్, రామంతాపూర్, చంపాపేట్, అఫ్జల్‌గంజ్, ఉప్పల్, రామంతాపూర్, తార్నాక, అంబర్పేట్ వంటి ప్రాంతాలన్నీ అడ్డాకూలీలతో కిటకిటలాడుతున్నాయి. వారి వ్యథాభరిత బతుకుల కన్నీటిగాథలపై ప్రత్యేక ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. కూటి కోసం కూలి కోసం ఉన్న ఊళ్లో పనుల్లేక పట్టణంలో బతుకుదామని బయలుదేరిన బడుగు రైతుకు మండుటెండలో ఒక్కతీరుగ వెదుకుతున్న పనులు దొరకక భాగ్యనగరిలో బిక్కుబిక్కుగా పంటను తలచుకు బాధపడుతూ..అప్పును తలచి భయపడుతూ..తిరుగుతుంటే..చండ ప్రచండం ఎండ కాస్తే బండలు కొట్టే కూలీగా బంగ్లా కట్టే మేస్త్రీగా జ్యూస్‌లు పిండే వ్యాపారిగా అలవాటు లేని అడ్డాపై తడబడి నిలబడి తల్లడిల్లుతున్న నేలపుత్రుడికి ఎంత కష్టం.. ఎంత కష్టం..!! హైదరాబాద్‌లోని కూలీల అడ్డాలన్నీ కిటకిటలాడుతున్నాయి. ఎక్కడ చూసినా పల్లెల నుంచి వచ్చిన రైతులు, కూలీలు, వారి కుటుంబీకులతో నిండిపోతున్నాయి. కరువు దెబ్బకు పల్లె నుంచి పొట్టచేతబట్టుకొని వచ్చిన వీరంతా ఇక్కడ పనుల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. ఏడాదంతా చేతినిండా పనితో గడిపిన రైతులు.. ఇప్పుడు ‘ఈ రోజు పని దొరికితే చాలు..’ అన్నట్టుగా కాలం గడుపుతున్నారు. మట్టిపని, తట్టపని, పారపని.. ఇలా ఏది దొరికినా సరేనంటూ కదులుతున్నారు. ఘట్కేసర్ నుంచి సికింద్రాబాద్ వరకు, శంషాబాద్ నుంచి అఫ్జల్‌గంజ్ వరకు, మొయినాబాద్ నుంచి మొహదీపట్నం వరకు, కొంపల్లి నుంచి ప్యారడైజ్ వరకు ‘సాక్షి’ పలువురు రైతుల్ని, కూలీలను పలకరించింది. వారి గోడు ఇదిగో... - సాక్షి, హైదరాబాద్ పొలం వదులుకొని పండ్లు అమ్ముకొంటూ... ఇరవై రోజుల క్రితం మహబూబ్‌నగర్ జిల్లా ఆత్మకూరు నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఈమె పేరు చెన్నమ్మ. మహానగరంలో మేడిపల్లి వద్ద పండ్ల వ్యాపారం చేసుకుంటూ పొట్టబోసుకుంటోంది. ఈమెకు రెండెకరాల పొలం ఉన్నా.. ఎండిపోయింది. ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లకు పెళ్లిళ్లయ్యాయి. కరువు కాటుతో వారంతా నగరానికి వచ్చి కూలి పని చేసుకుంటున్నారు. తలోదిక్కు పని చేసుకున్నారు. రూ.2 వేలు అప్పు చేసి పండ్ల వ్యాపారం మొదలుపెట్టింది చెన్నమ్మ. ‘‘వానలు పడి నీళ్లొస్తే మా ఊరుకు మేం వెళ్లిపోతం. అప్పటిదాకా ఏదో ఒక పని చేసుకొని ఇక్కడ బతుకుదామని వచ్చినం’’ అని ఆమె చెప్పింది. మూడెకరాలు ఉన్నా ఏం లాభం? మెదక్ జిల్లా తుర్కపల్లికి చెందిన కొండ భిక్షపతి, బాలలక్ష్మి దంపతులకు మూడెకరాల భూమి ఉంది. బోర్లు ఎండిపోవడంతో పంటలూ ఎండాయి. గత్యంతరం లేక ఉప్పల్‌కు వచ్చి ఇలా భవన నిర్మాణ కూలీలుగా బతుకీడుస్తున్నారు. ఇద్దరూ రోజంతా కష్టపడితే రోజుకు రూ.400 నుంచి రూ.500 వరకు వస్తున్నాయి. ‘‘ఇక్కడ ఎంతకాలం బతుకుత ం? ఎన్ని రోజులు ఉన్నా మా ఊరుకు పోవాల్సిందే. అక్కడ పని ఉంటే ఏ బాధ ఉండదు’’ అని చెప్పాడు భిక్షపతి. పంట చేతికొచ్చే సమయానికి బోరు ఎండింది.. ఈయన పేరు శ్రీనివాస్. మెదక్ జిల్లా పెద్దశంకరంపేట్ మండలం దానంపల్లి. ఊళ్లో రెండెకరాల పొలం ఉంది. ఏడాది క్రితం అప్పు తెచ్చి బోరు వేశాడు. తొలినాళ్లలో కాసింత నీళ్లు వచ్చినా మొక్కజొన్న పంట చేతికొచ్చే సమయానికి బోరు ఎండిపోయింది. దీంతో గుండె దిటవు చేసుకొని భార్య, కొడుకుతో కలిసి పట్నం దారి పట్టాడు. అప్పు తెచ్చి మొయినాబాద్‌లో చెరుకు బండి పెట్టుకున్నాడు. ‘‘పొద్దంతా కష్టపడితే రూ.300 వరకు మిగులుతున్నాయి. బండి కోసం చేసిన అప్పు తీరితే చాలు..’’ అని ఆయన చెప్పాడు. పంటలు పండితే... ఇలా రాళ్లు కొట్టాల్సి వచ్చేది కాదు మహబూబ్‌నగర్‌కు చెందిన రాములు, ఖమ్మం నుంచి వచ్చిన లింగయ్యను కరువు ఇలా ఒక్కటి చేసింది! ఇద్దరికి వారి ఊళ్లో చెరో రెండెకరాల పొలం ఉంది. బోర్లల్లో నీళ్లు ఉండి పంటలు పండి ఉంటే హైదరాబాద్‌కు వచ్చి ఇలా రాళ్లు కొట్టుకోవల్సి వచ్చేది కాదని వారు ఆవేదన వ్యక్తంచేశారు. వీరు ఇప్పుడు నారపల్లి వద్ద ఒకచోట కూర్చొని రోళ్లు తయారు చేస్తున్నారు. ఒక్క రోలు అమ్మితే రూ.వంద వస్తాయని చెప్పారు. ‘‘రాళ్లు కొట్టి కొట్టి చేతులు నొప్పి పెడుతున్నాయి. రోజంతా కష్టపడితే ఒక్క రోలు తయారైతది. ఎవరన్నా కొంటేనే ఆ రోజుకు పూట గడిచినట్లు లెక్క’’ అని ఇద్దరు రైతులు గోడు వెళ్లబోసుకున్నారు. కరువుతో రోడ్డున పడ్డం.. వీరు సోమ్లానాయక్, ఈరమ్మ దంపతులు. ఊరు నల్లగొండ జిల్లా భువనగిరి దగ్గర ఉన్న జేపల్లె తండా. కాలం లేక నగరానికి వచ్చి ఇలా తాటి ముంజలు అమ్ముకుంటూ బతుకుతున్నారు. ‘‘ఇన్నాళ్లూ రెండెకరాల పొలం మీదనే బతికినం. ఇద్దరు బిడ్డల పెళ్లి చేసిన. కష్టాలు తీరినై అ నుకున్నాం గానీ కరువుతో బతుకులు రోడ్డున పడ్డయి. ఇగో ఇట్ల తాటి ముం జలు అమ్ముకొని బతుకుతున్నం’’ అని గోడు వెళ్లబోసుకున్నాడు సోమ్లానాయక్. ఎనభై ఏళ్ల వయస్సులో వాచ్‌మెన్‌గా.. ఈయన పేరు మైల ఐలయ్య. వయసు 80 ఏళ్లు. ఊరు వరంగల్ జిల్లా జనగామ సమీపంలోని కోడూరు. సొంతూళ్లో రెండెకరాల భూమి ఉంది. పంటల్లేక ఇద్దరు కొడుకులతో కలిసి నగరానికి వలస వచ్చాడు. ఈ వయసులో మహానగరంలో ఓ గుడి దగ్గర చిన్న చిన్న పనులు చేసి ఎవరైనా నాలుగు డబ్బులిస్తారేమోనని ఆశగా ఎదురు చూస్తున్నాడు. మొన్నటి వరకు వాచ్‌మెన్‌గా పని చేశాడు. అయితే పెద్ద వయసు కావడంతో పనిలోంచి తీసేశారు. ఆయన ఇద్దరు కొడుకులు ఆటో నడుపుకొంటున్నారు. ఇంత కరువు ఎప్పుడూ చూడలేదు ఈయన పేరు విశ్వనాథం. మెదక్ జిల్లా శంకర్పల్లి. ఈయన్ను పలకరించగా.. ‘‘నా 50 ఏళ్ల జీవితాన్ని గ్రామంలోనే గడిపా. ఇలాంటి కరువును ఎప్పుడూ చూడలేదు. నీటి చుక్క లేక పొలాలన్నీ ఎండిపోయాయి. ఉన్న కొద్దిపాటి పొలాన్ని వదులుకుని ఏదైనా పని చేద్దామని నగరానికి వచ్చా. మట్టి పని, సిమెంట్ పని, మాల్ కలిపే పని.. ఇలా ఏది దొరికితే అది చేసుకుని పొట్ట నింపుకుంటున్నాం. ఇంటిల్లిపాదిది ఇదే పరిస్థితి. ఇక్కడ కూడా కూలీ పని కోసం పోటీ పెరిగిపోవడంతో కొందరికి ఆ పని దొరకడం లేదు’’ అని ఆవేదన వ్యక్తం చేశాడు. ఐదెకరాలున్నా.. సెక్యూరిటీ గార్డుగా.. ఈయన పేరు బతుకన్న(45). కర్నూలు జిల్లా నందనగి రి మండలం అలాద్రి. ఊళ్లో ఐదెకరాల భూమి ఉంది. వానల్లే క, పంటల్లేక ఐదు నెలల కిందట నగరానికి వలస వ చ్చి.. డీ మార్ట్ షాపింగ్ మాల్లో సెక్యూరిటీ గార్డుగా పనికి కుదిరాడు. మధ్యాహ్నం జీహెచ్ఎంసీ అందించే రూ.5 భోజనం చేస్తానని, రాత్రిళ్లు పస్తులుంటానని చెప్పాడు. వర్షాలు కురిస్తే ఊరెళ్లి వ్యవసాయం చేసుకుంటానని చెబుతున్నాడు. ఊళ్లో పనుల్లేక వచ్చా.. మహబూబ్‌నగర్ జిల్లా కొడంగల్‌కు చెందిన ఈయన పేరు అనిల్ కుమార్. నాలుగెకరాల్లో ఉల్లి గడ్డ వేసినా నీళ్లు లేక పంట పూర్తిగా ఎండిపోయింది. రూ.80 వేలు మట్టిపాలయ్యాయి. అంతకుముందు పత్తి వేసినా నష్టాలే పలకరించాయి. ఈ ఏడాది చుక్క నీరు లేకపోవడంతో అసలు పంటే వేయలేదు. ‘‘పంటలు వేసి నష్టపోవడం కంటే బీళ్లుగా ఉంచడమే మేలనుకున్న. అప్పులు తీరుద్దామంటే ఊళ్లో పనుల్లేవు. అందుకే హైదరాబాద్ బస్సు ఎక్కి వచ్చా’’ అని చెప్పాడు. ఈయన వచ్చి వారం రోజులైంది. ఇప్పటివరకు వ్యవసాయమే చేసిన చేతులు ఇప్పుడు ఏ పని దొరికితే ఆ పనికి సిద్ధపడుతున్నాయి. ఉపాధి పనులు కూడా లేవు... ఈయన పేరు రాములు. నిజామాబాద్ జిల్లా జూకల్. హైదరాబాద్ వచ్చి వారం రోజులైంది. ఊళ్లో సాగుభూమి ఉన్నా నీళ్లు లేక పట్నం బాటపట్టాడు. ‘‘కరువు తీవ్రంగా ఉంది. గతంలో ప్రభుత్వం వారి ఉపాధి హామీ పనులు ఉండేవి. అవి కాస్తా బతుకుదెరువుగా ఉండేవి. ఇప్పుడు అవి కూడా లేకపోవడంతో నాలాగా చాలామంది బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి ఏదో ఒక పని చేసుకుంటున్నారు’’ అని ఆయన ఆవేదన వ్యక్తంచేశాడు. మూడేళ్ల నుంచి పంటల్లేక.. నెల్లూరు జిల్లా ఆత్మకూరుకు చెందిన ఈయన పేరు బదిలయ్య. వృత్తిపరంగా తాపీ మేస్త్రీ. ఊళ్లో రెండెకరాల పొలం ఉంది. ఒకప్పుడు మేస్త్రీ పనితో బాగానే డబ్బులు సంపాదించినా.. తన నలుగురు కుమారులను చదివించేందు కోసం నానా కష్టాలు పడ్డాడు. అంతా బాగుందనుకున్న సమయంలో ప్రకృతి కన్నెర్ర జేసింది. మూడేళ్ల నుంచి పంటల్లేవు. అప్పులు పెరిగాయి. ఇప్పుడు నగరానికి వలస వచ్చి నిమ్మరసం బండి పెట్టుకున్నాడు. ఆయన నలుగురు కొడుకులు అదే పని చేస్తున్నారు. ఈ 2 నెలలు వ్యాపారం చేసి ఊరె ళ్తానని, వానలు పడితే వ్యవసాయం చేసుకొని బతుకుతానని చెబుతున్నాడు. సరస్వతీ పుత్రుల వలస బాట సరస్వతీ పుత్రులను సైతం కరువు వదల్లేదు! ఈ చిత్రంలో కనిపిస్తున్న అన్నదమ్ముల పేర్లు శివ, విష్ణు. మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోట మండలం రామకృష్ణాపురం. మల్లికార్జున్, లక్ష్మి దంపతులకు వీరిద్దరితోపాటు కూతురు అనిత ఉంది. వరుస కరువుతో సాగులో అప్పులు రెట్టింపయ్యాయి. దీంతో నగరానికి వలస వచ్చారు. మొదట్లో తండ్రి మల్లికార్జున్ మేస్త్రీ పని చేసేవాడు. ఇటీవల ఆయన కిడ్నీలు దెబ్బతినడంతో కుటుంబ భారం పెద్ద కుమారుడు శివపై పడింది. శివ గతేడాది టెన్త్ పూర్తి చేశాడు. 8.2 జీపీఏ గ్రేడ్ సాధించాడు. అతడి ప్రతిభను గుర్తించి నగరంలోని ఓ ప్రైవేటు కాలేజీ ఎలాంటి ఫీజులు లేకుండా చేర్చుకొనేందుకు ఆహ్వానం పంపింది. అక్కడ ఇంటర్ మొదటి సంవత్సరం పూర్తి చేశాడు. ఓవైపు ఊళ్లో కరువు.. మరోవైపు తండ్రి అనారోగ్యంతో చదువు వదిలేసి హైదరాబాద్‌లో ఇలా చెరుకు బండి ఏర్పాటు చేసుకున్నారు. ఈయన తమ్ముడు విష్ణు ఇటీవలే టెన్త్ పరీక్షలు రాసి, ఫలితాల కోసం ఎదురు చూస్తున్నాడు. విష్ణుతో కలిసి ఈ చెరుకు బండితో ఉపాధి పొందుతున్నారు. ‘‘మా అమ్మ ఒంటిపై ఉన్న రెండు తులాల బంగారం అమ్ముకొని చెరుకు బండి పెట్టుకున్నాం. ఏదో ఒక విధంగా బతకాలి కదా సార్..’’ అని శివ అన్నాడు. తల్లి చెరుకు గడలను ఇరుసుల మధ్య పెడుతుంటే అన్నదమ్ములిద్దరూ కాడిని తిప్పుతూ చెరుకు రసం తీస్తున్నారు. ఒకప్పుడు సర్పంచ్‌గా పనిచేసి.. ఈమె పేరు నాగమణి. భర్త కిష్టాగౌడ్. స్వస్థలం నిజామాబాద్ జిల్లా నాగిరెడ్డిపేట మండలం రాఘవ్పల్లి. ఒకప్పుడు ఆ గ్రామానికి సర్పంచ్‌గా పనిచేసిన నాగమణి.. నేడు ఇళ్లలో పనులు చేసుకుంటూ భర్తకు చేదోడు వాదోడుగా ఉంది. వీరికి ఇద్దరు కుమార్తెలు. పెళ్లిళ్లు చేశారు. సర్పంచ్‌గా పని చేసిన సమయంలో ఐదున్నర ఎకరాల భూమిలో పోచారం డ్యామ్ కింద పంటలు సమృద్ధిగా పండేవి. ఇద్దరు పనివారు ఉండేవారు. కరువు దెబ్బకు సాగులో అప్పులయ్యాయి. రెండు బోర్లు వేసినా నీళ్లు పడలేదు. అప్పులు పెరగడంతో ఐదెకరాల భూమి అమ్మేశారు. ఆరేళ్ల కిందట పొట్ట చేత పట్టుకుని నగరానికి వలస వచ్చి సూరారం రాజ్యలక్ష్మినగర్‌లో ఓ గదిని రూ.1500లకు అద్దెకు తీసుకుని ఉంటున్నారు. కిష్టాగౌడ్ ఆటో నడుపుతుండగా.. నాగమణి టెక్ మహేంద్రలో కూలి పనులు చేస్తూ ఉదయం, సాయంత్రం ఇళ్లల్లో పాచిపని చేస్తోంది. -
ఆకలి కేకలు
ఉపాధికి దూరం చేసిపొట్టకొట్టారన్న కూలీలు రహదారిపై మహిళల బైఠాయింపు, రాస్తారోకో మున్సిపల్ కమిషనర్ ఘెరావ్ యలమంచిలి : ‘యలమంచిలిని మునిసిపాలిటీగా మార్చడంతో మా తలరాతలు మారిపోయాయి. రెండు పూటలా తిండికి నోచుకోని దుర్భర పరిస్థితిలో పనుల్లేక ఆకలితో అలమటిస్తున్నాం. మా గ్రామాలను మునిసిపాలిటీ నుంచి తొలగించి పుణ్యం కట్టుకోండి. ఎంత మంది అధికారుల చుట్టూ తిరిగినా ఎవరూ మా బాధ పట్టించుకోవడంలేదు. మూకుమ్మడిగా ఆత్మహత్యలే శరణ్యం..’ అంటూ పట్టణం పరిధిలోని సోమలింగపాలెం, కొక్కిరాపల్లి, వెంకటాపురం, వి.ఎన్.పేట, గొల్లలపాలెం మహిళలు బుధవారం మునిసిపల్ కార్యాలయం ఎదుట ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. ఒకవైపు ఉపాధి హామీ పథకానికి దూరమై అవస్థలు పడుతుంటే, మరోవైపు ఆస్తిపన్ను మోతతో రెండు వైపులా ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ మహిళలు వాపోయారు. ఇందుకు నిరసనగా మున్సిపల్ కార్యాలయం వద్ద కమిషనర్ శ్రీనివాసరావును ఘెరావ్‌చేశారు. పేదలమైన తమకు ఉపాధి హామీ పథకం ఆకలితీర్చేదని, దానికి దూరం చేసి రోడ్డున పడేశారంటూ బాధిత మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. తమ గ్రామాలను మునిసిపాలిటీ నుంచి తొలగించాలని మహిళలు మున్సిపల్ కమిషనర్‌ను కోరారు. ఆస్తిపన్ను కూడా తగ్గించాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పథకానికి ప్రత్యామ్నాయం చూపుతామని, మీఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని మునిసిపల్ కమిషనర్ వారికి చెప్పారు. మరోసారి సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఆందోళనకారులు ప్రధాన రహదారిపై బైఠాయించి వాహనాల రాకపోకలు అడ్డుకోవడంతో గంటకుపైగా రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళనకారులకు నచ్చజెప్పి కమిషనర్‌తో చర్చలు జరిపేందుకు ఆహ్వానించారు. ఈ చర్చల్లో మహిళలు ఉపాధి హామీ పథకం అమలుకాకపోవడంతో తాము ఎలా ఇబ్బంది పడుతున్నదీ వారు కమిషనర్‌కు వివరించి కన్నీటి పర్యంతమయ్యారు. -
‘ఉపాధి’ అంతంతే!
నిజామాబాద్ అర్బన్ : మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధిహామీ పథకంపై కూలీలు నిరాసక్తత ప్రదర్శిస్తున్నారు. ఉపాధిహామీ పని కంటే ఇతర పనులపై ఆసక్తి చూపిస్తున్నారు. వారికి అవగాహన కల్పించి తీసుకురావడంలో అధికారులు విఫలమవుతున్నారు. ప్రస్తుతం వ్యవసాయ పనులు ఉండడం తో కూలీలు ఈ రంగంలోనే పనిచేస్తున్నారు. జిల్లాలో 5,45, 117 మందికి అధికారులు జాబ్‌కార్డులు జారీ చేశారు. 2014-15 సంవత్సరానికి 1,90,950 విలువ గల పనులను గుర్తిం చారు. 2014 డిసెంబర్ రెండు నాటికి 86.25 లక్ష ల విలువ గల పనులను పూర్తి చేశారు. మొత్తం 2012-14 సంవత్సరానికిగాను రూ. 269.89 కోట్ల రూపాయలు కేటాయిస్తే, రూ. 153.29 కోట్లు ఖర్చు చేశారు. 2014-1 5 సంవత్సరానికి 2,19,236 కుటుంబాలకు 100 రోజు లు పని కల్పించాల్సి ఉంది. కానీ, 100 రోజులు పని పూర్తి చేసిన కుటుంబాలు 10,619 మాత్ర మే ఉన్నాయి. జిల్లాలో జనవరి 14వరకు కేవ లం 18 వేల మంది మాత్రమే పనిచేస్తున్నారు. ఇదీ పరిస్థితి బోధన్ నియోజకవర్గంలో ఉపాధిహామీ పథకం కొందరికే అమలవుతోంది. పనులూ మందకొడిగా సాగుతున్నాయి. నవీపేట మండల కేంద్రంలో ఉపాధి పనుల గుర్తింపు ప్రక్రియ పూర్తి కాలేదు. పనులు ప్రారంభం కాలేదు. బోధన్ మండలంలో 14 వేల జాబ్‌కార్డులు ఉండగా, వెయ్యి మంది మాత్రమే పనిచేస్తున్నారు. కొత్త బడ్జెట్ రాలేదని అధికారులు అంటున్నారు. నిధుల కొరతతో పనులు ముందుకు సాగడం లేదు. రెంజల్ మండలంలో 420 జాబ్‌కార్డులు ఉండగా 200పైగా మాత్రమే పనులు చే స్తున్నారు. బాల్కొండ నియోజకవర్గంలో ఉపాధి పను లు సరిగా సాగడం లేదు. పసుపు తవ్వకాలకు కూలీ ఎక్కువగా ఇస్తుండటంతో కూలీలు అటు వైపున ఆసక్తి చూపు తున్నారు. మోర్తాడ్ మండలంలో ఐదు వేల మంది కూలీలకు గాను 150 మంది పని చేస్తున్నారు. భీమ్‌గల్, కమ్మర్పల్లి మండలాలలో మాత్రమే చాలా మంది కూలీలు నర్సరీలు, భూమి అభివృద్ధి పనులు చేస్తున్నా రు. భీమ్‌గల్ మండలంలో కట్టలు కట్టే పని, భూమి అభివృద్ధి, నర్సరీల్లో 750 మంది కూ లీలు పని చేస్తున్నారు. కమ్మర్పల్లి మండలం లో 800 మంది కూలీలు పని చేస్తున్నారు. బా ల్కొండ మండలంలో 200 మంది ఆరు నర్సరీలలో పని చేస్తున్నారు. వేల్పూర్ మండలంలో వంద మంది మాత్రమే పని చేస్తున్నారు. వేసవిలోనే పనులు పుంజుకునే అవకాశం ఉంది. అరకొర పనులే బాన్సువాడ నియోజకవర్గంలోని వర్ని, బాన్సువాడ మండలాలలోనే ప్రస్తుతం ఉపాధిహామీ పనులు కొనసాగుతున్నాయి. ఇక్కడ నర్సరీల పెంపకం, పంట కాలువలకు దారి, గుట్ట ప్రాం తాలలో ట్రెంచ్ కటింగ్, ఫీడర్ చానల్ పనులు జరుగుతున్నాయి. బాన్సువాడ మండలంలోని ఎనిమిది గ్రామాలలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, నర్సరీల పెంపకం జరుగుతోంది. సుమారు ఎనిమిది వేల మంది కూలీలు ఉండ గా, ఇక్కడ కేవలం 200 మంది కూలీలకే ఉపా ధి పనులు అందిస్తున్నారు. కోటగిరి, బీర్కూర్, మండలాలలో గత నెల రోజులుగా పనులు నిలి చిపోయాయి. బీర్కూర్ మండలంలో గత ఏడా ది సుమారు రూ. రెండు కోట్ల పనులు జరుగగా, గత నెల రోజులుగా పనులు మాత్రం సా గడం లేదు. కోటగిరి మండలంలోనూ ఇదే పరి స్థితి. నిజాంసాగర్ మండలంలో హరితహారం కింద నర్సరీలు, ఫీడర్ చానళ్ల తవ్వకం, రోడ్ల ఏ ర్పాటులో 257 మంది కూలీలు ఉపాధి పను లు చేస్తున్నారు. మొత్తం ఐదువేల మంది ఉన్నా రు మారుమూల ప్రాంతాలలోనూ అంతే జుక్కల్ మండలంలోని నాలుగు గ్రామాలలో 350 మంది కూలీలు పొలం గట్లు వేయడం, కా లువలు తీయడం పనులు చేస్తున్నారు. ఇక్కడ మొత్తం ఏడు వందల మంది కూలీలున్నారు. మద్నూర్ మండలంలో రెండు వేల మంది కూ లీలు పనులు చేస్తున్నారు. మొత్తం 4,600 మం ది కూలీలు ఉన్నారు. కామారెడ్డి నియోజకవర్గంలో ఉపాధిహామీ పనులు కొన్ని గ్రామాలలో నే మొదలయ్యాయి. మాచారెడ్డి మండలంలో 24 పంచాయతీలకుగాను 9 పంచాయతీలలోనే పనులు మొదలయ్యాయి. కూలీలకు చెల్లింపుల లో ఆలస్యం జరుగుతోంది. దోమకొండ మండలంలో 17 పంచాయతీలకు గాను అన్ని గ్రామాలలో పనులు మొదలయ్యాయి. బిక్కనూరు మండలంలో 18 పంచాయతీలకు గాను 10 గ్రా మాలలో పనులు నడుస్తున్నాయి. నిజామాబా ద్ రూరల్ నియోజకవర్గంలోని అన్ని మండలాలలో ఉపాధిహామీ పనులు కొనసాగుతున్నాయి. ఇక్కడ నర్సరీల పెంపకం, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, పంట కాలువలకు దారి, గుట్ట ప్రాంతాలలో ట్రెంచ్ కటింగ్, ఫీడర్ చాన ల్ తీత పనులు జరుగుతున్నాయి. డిచ్పల్లి మం డలంలోని అన్ని గ్రామాల్లో ఉపాధి పనులు కొ నసాగుతున్నాయి.గత ఏప్రిల్ ఒకటి నుంచి ఇ ప్పటి వరకు రూ. 6.92 కోట్లు పనులు చేశారు.7,437 కుటుంబాలకు పనులు కల్పించారు. తప్పని వలసలు ధర్పల్లి మండలంలోని తొమ్మిది గ్రామాలలో నర్సరీల పెంపకం జరుగుతోంది. సుమారు ఎ నిమిది వేల మంది కూలీలు ఉండగా, కేవలం 200 మంది కూలీలకే ఉపాధి పనులు అందిస్తున్నారు. జక్రాన్‌పల్లి, సిరికొండ మండలాలోని గ్రామాలలో ఉపాధి పనులు కొనసాగుతున్నాయి. నిజామాబాద్ మండలంలోని 23 గ్రామాలలో పనులు కొనసాగుతున్నాయి. 1200 మంది కూలీలు పనులు చేస్తున్నారు. రూ. 70 లక్షల పనులు పూర్తయ్యాయి. ఆర్మూర్ మండలంలో ఉపాధిహామీ పనులు కొనసాగడం లేదు. పను లు కావాలని కూలీలు కోరుతున్నప్పటికీ పను లు కల్పించడం లేదు. ఉపాధిహామీ పనులు ప్రస్తుతం నడవడం లేదు. ఉపాధిహామీ పనులు కొనసాగుతున్నాయి. ఎల్లారెడ్డి నియోజకవర్గం లో పనులు మందకొడిగా సాగుతున్నాయి. లింగంపేట, నాగిరెడ్డిపేట, సదాశివనగర్, గాంధా రి, తాడ్వాయి, ఎల్లారెడ్డి మండలాలలో పనులు పూర్తి స్థాయిలో జరుగడంలేదు. సదాశివనగర్ మండలంలోని కుప్రియాల్ గ్రామంలో మినహా ఎక్కడ పనుల జాడలేదు.మిగతా ఐదు మండలాలలో కొన్ని గ్రామాలలో మాత్రమే పనులు కొనసాగుతున్నాయి.వర్షాలు కురవని కారణం గా వ్యవసాయ పనులు సాగకపోవడంతో పా టు ఉపాది పనులు కూడా సాగక పోవ డంతో నిరుపేద కూలీలు కొందరు ఉపాధి కోసం వల స పోతున్నారు. చాలా గ్రామాలలో నెలల తరబడి పనులు జరుగడం లేదు. -
'రైతులు, కూలీలపై అక్రమ కేసులు ఎత్తేయాలి'
గుంటూరు: రైతులకు అండగా నిలిచేందుకు తమ పార్టీ సన్నద్దంగానే ఉంటుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ రైతులు, కూలీల పరిరక్షణ కమిటీ స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో నూతన రాజధాని నిర్మాణం చేపట్టనున్న గ్రామాలలో కమిటీ గురువారం పర్యటించింది. ఉండవల్లి, ఉద్దండరాయుని పాలెం, లింగాయపాలెం గ్రామాల్లో కమిటీ సభ్యులు పర్యటించారు. పోలీసు బాధిత రైతులతో మాట్లాడారు. రైతులు, కూలీలపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి పార్థసారధి, మర్రి రాజశేఖర్, అంబటి రాంబాబు, ఎమ్మెల్యేలు ముస్తఫా, కొడాలి నాని, ఉప్పులేటి కల్పన, జలీల్ ఖాన్, కోన రఘుపతి తదితరులు గ్రామాల్లో పర్యటించిన వారిలో ఉన్నారు.