‘ఉపాధి’ అంతంతే! | 'Employment' end! | Sakshi
Sakshi News home page

‘ఉపాధి’ అంతంతే!

Published Fri, Jan 23 2015 3:55 AM | Last Updated on Mon, Oct 8 2018 7:16 PM

‘ఉపాధి’ అంతంతే! - Sakshi

‘ఉపాధి’ అంతంతే!

నిజామాబాద్ అర్బన్ : మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధిహామీ పథకంపై కూలీలు నిరాసక్తత ప్రదర్శిస్తున్నారు. ఉపాధిహామీ పని కంటే ఇతర పనులపై ఆసక్తి చూపిస్తున్నారు. వారికి అవగాహన కల్పించి తీసుకురావడంలో అధికారులు విఫలమవుతున్నారు. ప్రస్తుతం వ్యవసాయ పనులు ఉండడం తో కూలీలు ఈ రంగంలోనే పనిచేస్తున్నారు. జిల్లాలో 5,45, 117 మందికి అధికారులు జాబ్‌కార్డులు జారీ చేశారు.

2014-15 సంవత్సరానికి 1,90,950 విలువ గల పనులను గుర్తిం   చారు. 2014 డిసెంబర్ రెండు నాటికి 86.25 లక్ష ల విలువ గల పనులను పూర్తి చేశారు. మొత్తం 2012-14 సంవత్సరానికిగాను రూ. 269.89 కోట్ల రూపాయలు కేటాయిస్తే, రూ. 153.29 కోట్లు ఖర్చు చేశారు. 2014-1 5 సంవత్సరానికి 2,19,236 కుటుంబాలకు 100 రోజు లు పని కల్పించాల్సి ఉంది. కానీ, 100 రోజులు పని  పూర్తి చేసిన కుటుంబాలు 10,619 మాత్ర మే ఉన్నాయి. జిల్లాలో జనవరి 14వరకు కేవ లం 18 వేల మంది మాత్రమే పనిచేస్తున్నారు.
 
ఇదీ పరిస్థితి
బోధన్ నియోజకవర్గంలో ఉపాధిహామీ పథకం కొందరికే అమలవుతోంది. పనులూ మందకొడిగా సాగుతున్నాయి. నవీపేట మండల కేంద్రంలో ఉపాధి పనుల గుర్తింపు ప్రక్రియ పూర్తి కాలేదు. పనులు ప్రారంభం కాలేదు. బోధన్ మండలంలో 14 వేల జాబ్‌కార్డులు ఉండగా, వెయ్యి మంది మాత్రమే పనిచేస్తున్నారు. కొత్త బడ్జెట్ రాలేదని అధికారులు అంటున్నారు. నిధుల కొరతతో పనులు ముందుకు సాగడం లేదు. రెంజల్ మండలంలో 420 జాబ్‌కార్డులు ఉండగా 200పైగా మాత్రమే పనులు చే స్తున్నారు.

బాల్కొండ నియోజకవర్గంలో ఉపాధి పను  లు సరిగా సాగడం లేదు. పసుపు తవ్వకాలకు కూలీ ఎక్కువగా ఇస్తుండటంతో కూలీలు అటు వైపున ఆసక్తి చూపు తున్నారు. మోర్తాడ్ మండలంలో ఐదు వేల మంది కూలీలకు గాను 150 మంది పని చేస్తున్నారు. భీమ్‌గల్, కమ్మర్‌పల్లి మండలాలలో మాత్రమే చాలా మంది కూలీలు  నర్సరీలు, భూమి అభివృద్ధి పనులు చేస్తున్నా  రు.

భీమ్‌గల్ మండలంలో కట్టలు కట్టే పని, భూమి అభివృద్ధి, నర్సరీల్లో 750 మంది కూ  లీలు పని చేస్తున్నారు. కమ్మర్‌పల్లి మండలం లో 800 మంది కూలీలు పని చేస్తున్నారు. బా ల్కొండ మండలంలో 200 మంది ఆరు నర్సరీలలో పని చేస్తున్నారు. వేల్పూర్ మండలంలో వంద మంది మాత్రమే పని చేస్తున్నారు. వేసవిలోనే పనులు పుంజుకునే అవకాశం ఉంది.
 
అరకొర పనులే
బాన్సువాడ నియోజకవర్గంలోని వర్ని, బాన్సువాడ మండలాలలోనే ప్రస్తుతం ఉపాధిహామీ పనులు కొనసాగుతున్నాయి. ఇక్కడ నర్సరీల పెంపకం, పంట కాలువలకు దారి, గుట్ట ప్రాం  తాలలో ట్రెంచ్ కటింగ్, ఫీడర్ చానల్ పనులు జరుగుతున్నాయి. బాన్సువాడ మండలంలోని ఎనిమిది గ్రామాలలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, నర్సరీల పెంపకం జరుగుతోంది. సుమారు ఎనిమిది వేల మంది కూలీలు ఉండ గా, ఇక్కడ కేవలం 200 మంది కూలీలకే ఉపా ధి పనులు అందిస్తున్నారు.

కోటగిరి, బీర్కూర్, మండలాలలో గత నెల రోజులుగా పనులు నిలి చిపోయాయి. బీర్కూర్ మండలంలో గత ఏడా ది సుమారు రూ. రెండు కోట్ల పనులు జరుగగా, గత నెల రోజులుగా పనులు మాత్రం సా గడం లేదు. కోటగిరి మండలంలోనూ ఇదే పరి    స్థితి. నిజాంసాగర్ మండలంలో హరితహారం కింద నర్సరీలు, ఫీడర్ చానళ్ల తవ్వకం, రోడ్ల ఏ  ర్పాటులో 257 మంది కూలీలు ఉపాధి పను లు చేస్తున్నారు. మొత్తం ఐదువేల మంది ఉన్నా రు
 
మారుమూల ప్రాంతాలలోనూ అంతే
జుక్కల్ మండలంలోని నాలుగు గ్రామాలలో 350 మంది కూలీలు పొలం గట్లు వేయడం, కా లువలు తీయడం పనులు చేస్తున్నారు. ఇక్కడ మొత్తం ఏడు వందల మంది కూలీలున్నారు. మద్నూర్ మండలంలో రెండు వేల మంది కూ లీలు పనులు చేస్తున్నారు. మొత్తం 4,600 మం ది కూలీలు ఉన్నారు. కామారెడ్డి నియోజకవర్గంలో ఉపాధిహామీ పనులు కొన్ని గ్రామాలలో  నే మొదలయ్యాయి. మాచారెడ్డి మండలంలో 24 పంచాయతీలకుగాను 9 పంచాయతీలలోనే పనులు మొదలయ్యాయి.

కూలీలకు చెల్లింపుల లో ఆలస్యం జరుగుతోంది. దోమకొండ మండలంలో 17 పంచాయతీలకు గాను అన్ని గ్రామాలలో పనులు మొదలయ్యాయి. బిక్కనూరు మండలంలో 18 పంచాయతీలకు గాను 10 గ్రా మాలలో పనులు నడుస్తున్నాయి. నిజామాబా ద్ రూరల్ నియోజకవర్గంలోని అన్ని మండలాలలో ఉపాధిహామీ పనులు కొనసాగుతున్నాయి.  

ఇక్కడ నర్సరీల పెంపకం, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, పంట కాలువలకు దారి, గుట్ట ప్రాంతాలలో ట్రెంచ్ కటింగ్, ఫీడర్ చాన  ల్ తీత పనులు జరుగుతున్నాయి. డిచ్‌పల్లి మం డలంలోని అన్ని గ్రామాల్లో ఉపాధి పనులు కొ  నసాగుతున్నాయి.గత ఏప్రిల్ ఒకటి నుంచి ఇ ప్పటి వరకు రూ. 6.92 కోట్లు పనులు చేశారు.7,437 కుటుంబాలకు పనులు కల్పించారు.
 
తప్పని వలసలు
ధర్పల్లి మండలంలోని తొమ్మిది గ్రామాలలో నర్సరీల పెంపకం జరుగుతోంది. సుమారు ఎ నిమిది వేల మంది కూలీలు ఉండగా, కేవలం 200 మంది కూలీలకే ఉపాధి పనులు అందిస్తున్నారు. జక్రాన్‌పల్లి, సిరికొండ మండలాలోని గ్రామాలలో ఉపాధి పనులు కొనసాగుతున్నాయి. నిజామాబాద్ మండలంలోని 23 గ్రామాలలో పనులు కొనసాగుతున్నాయి.

1200 మంది కూలీలు పనులు చేస్తున్నారు. రూ. 70 లక్షల పనులు పూర్తయ్యాయి. ఆర్మూర్ మండలంలో ఉపాధిహామీ పనులు కొనసాగడం లేదు. పను లు కావాలని కూలీలు కోరుతున్నప్పటికీ పను లు కల్పించడం లేదు. ఉపాధిహామీ పనులు ప్రస్తుతం నడవడం లేదు. ఉపాధిహామీ పనులు కొనసాగుతున్నాయి. ఎల్లారెడ్డి నియోజకవర్గం లో పనులు మందకొడిగా సాగుతున్నాయి.

లింగంపేట, నాగిరెడ్డిపేట, సదాశివనగర్, గాంధా రి, తాడ్వాయి, ఎల్లారెడ్డి మండలాలలో పనులు పూర్తి స్థాయిలో జరుగడంలేదు. సదాశివనగర్ మండలంలోని కుప్రియాల్ గ్రామంలో మినహా ఎక్కడ పనుల జాడలేదు.మిగతా ఐదు మండలాలలో కొన్ని గ్రామాలలో మాత్రమే పనులు కొనసాగుతున్నాయి.వర్షాలు కురవని కారణం గా వ్యవసాయ పనులు సాగకపోవడంతో పా టు ఉపాది పనులు కూడా సాగక పోవ డంతో నిరుపేద కూలీలు కొందరు ఉపాధి కోసం వల స  పోతున్నారు. చాలా గ్రామాలలో నెలల తరబడి పనులు జరుగడం లేదు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement