
భోపాల్: బాలీవుడ్ నటి దీపికా పదుకుణె ఒక వలస కూలీ!. మధ్యప్రదేశ్‌లో గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఆమెకి ఒక జాబ్ కార్డు .. అందులో ఆమె ఫొటో కూడా ఉంది. మధ్యప్రదేశ్ ఖర్గోన్ జిల్లాలో అధికారుల నిర్వాకం ఇది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి చట్టం కింద దీపిక ఫొటోతో ఉన్న నకిలీకార్డు వ్యవహారం వెలుగులోకొచ్చింది. సోను శాంతిలాల్ పేరు మీద ఉన్న కార్డులో దీపిక ఫోటో ఉంది. ఆ గ్రామంలో పది మంది వరకు వలస కూలీలు ప్రముఖ బాలీవుడ్ నటుల ఫొటోలతో నకిలీ కార్డుల్ని తీసుకున్నారు.
పీపర్‌ఖేడనాక గ్రామంలోని ఈ నకిలీ కార్డుల్ని వినియోగిస్తూ ఉపాధి హామీ పథకం కింద మంజూరయ్యే నగదును పొందుతున్నారు. మనోజ్ దూబే పేరు మీదనున్న నకిలీ కార్డు ద్వారా ప్రతీ నెల రూ.30 వేలు తీసుకుంటున్నట్టుగా జిల్లా అధికారులు చెబుతున్నారు. ఇలా నకిలీ కార్డులతో లక్షల నగదు స్వాహా చేసినట్టుగా వెల్లడించారు. అయితే ఈ కార్డుల్లో పేరున్న వారు అసలు ఆ కార్డులు ఎవరో చేశారో తమకు తెలీదని సోను శాంతిలాల్ భర్త చెప్పారు. ఈ కార్డుల కింద ఎవరు ప్రతీ నెల డబ్బులు తీసుకుంటున్నారనే దానిపై జిల్లా అధికారులు విచారణ చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment