migrant worker
-
రేప్ చేసి, జననాంగంలో ఇనుప రాడ్ జొప్పించి...
వడోదర: గుజరాత్లో 11 ఏళ్ల బాలికపై ఒక 36 ఏళ్ల వలస కార్మికుడు దారుణ అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేగాక జననాంగంలో ఇనుప కడ్డీ చొప్పించాడు! భరూచ్ జిల్లాలోని ఝగాడియా పారిశ్రామికవాడలో ఆదివారం జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలిక పరిస్థితి విషమంగా ఉంది. ఆమె కుటుంబం జార్ఖండ్ నుంచి వలసవచ్చింది. నిందితుడు విజయ్ పాశ్వాన్ బాలిక తండ్రితోపాటు పనిచేస్తున్నాడు. సమీప గుడిసెలో ఉంటూ బాలికను కిడ్నాప్‌చేసి ఘోరానికి పాల్పడ్డాడని పోలీసులు చెప్పారు. పొదల్లోకి తీసుకెళ్లి రేప్‌చేసి పారిపోయాడు. రక్తమోడుతూ బాలిక ఏడుస్తుండటంతో తల్లి చూసి ఆస్పత్రకి తరలించింది. నిందితుడిని సోమవారం అరెస్ట్ చేశారు. పోక్సో సెక్షన్ల కింది కేసు నమోదు చేశారు. బాలికను అతను గత నెలలోనూ రేప్ చేశాడని ప్రాథమిక విచారణలో తేలింది. -
పుల్వామాలో మళ్లీ ఉగ్రదాడి.. వలసకూలీపై కాల్పులు
జమ్ము: జమ్ముకశ్మీర్‌లో మళ్లీ ఉగ్రతూటా పేలింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన వలస కూలీపై దుండగులు కాల్పులు జరిపారు. పుల్వామాలో ఈ ఘటన జరగగా.. బాధితుడు అక్కడికక్కడే మృతి చెందాడు. క్రికెట్ ఆడుతున్న ఎన్స్పెక్టర్పై ఉగ్రవాదులు కాల్పులు జరిపి మరుసటి రోజే ఈ ఘటన జరగడం కలకలం రేపుతోంది. "పుల్వామాలోని తుమ్చి నౌపోరా ప్రాంతంలో యూపీకి చెందిన వలస కూలీపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. మృతున్ని ముఖేష్‌గా గుర్తించాం. ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టాం." అని పోలీసులు తెలిపారు. గడిచిన 24 గంటల్లో పుల్వామాలో జరిగిన రెండో ఉగ్రదాడి ఇది. ఆదివారం ఈద్గా ప్రాంతంలో క్రికెట్ ఆడుతున్న ఇన్స్పెక్టర్ మస్రూర్ అహ్మద్ వానీపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఇదీ చదవండి: శివసేన, ఎన్సీపీ అనర్హత పటిషన్లపై స్పీకర్‌కు సుప్రీంకోర్టు తుది గడువు -
ఖతార్ మృతుడి కుటుంబాన్ని ఇంటర్వ్యూ చేసిన ఫ్రాన్స్ టీవీ
ఖతార్ లో పని ప్రదేశంలో జరిగిన ప్రమాదం (వర్క్ సైట్ యాక్సిడెంట్) లో గత సంవత్సరం మృతి చెందిన జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం చిట్టాపూర్ గ్రామానికి చెందిన సురుకంటి జగన్ కుటుంబాన్ని బుధవారం ఫ్రాన్స్ టీవీ ప్రతినిధి జెర్మేన్ బస్‌లే ఇంటర్వూ చేశారు. గల్ఫ్ జెఏసి చైర్మన్ గుగ్గిల్ల రవిగౌడ్, విదేశీ జర్నలిస్టుకు మార్గదర్శకులుగా వ్యవహరించారు. గల్ఫ్ మృతుడి కుటుంబ సభ్యుల తెలుగు సంభాషణను ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ అధ్యక్షులు స్వదేశ్ పరికిపండ్ల ఇంగ్లీష్ లోకి అనువాదం చేశారు. ఖతార్ లో చనిపోయిన భారతీయ వలస కూలీల కుటుంబాల స్థితిగతులపై ఇటీవల ఇండియన్ ఎక్స్ ప్రెస్ ఇంగ్లీష్ దిన పత్రికలో ప్రచురితమైన బ్యానర్ వార్తా కథనం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించింది. ఈ వార్తా కథనంలో పేర్కొన్న తొమ్మిది మంది మృతుల్లో ఏడుగురు తెలంగాణలోని జగిత్యాల, నిజామాబాద్ జిల్లాలకు చెందినవారే కావడం గమనార్హం. గల్ఫ్ వలసల విశ్లేషకులు, అంతర్జాతీయ కార్మిక నిపుణుడు మంద భీంరెడ్డి, వలస కార్మికుల హక్కుల కార్యకర్త స్వదేశ్ పరికిపండ్ల ఇద్దరు కలిసి ఈ సమాచారాన్ని ఇంగ్లీష్ పత్రికకు అందించారు. ఇండియన్ ఎక్స్ ప్రెస్ వార్తా కథనంపై భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి. మురళీధరన్ స్పందించి మృతుల కుటుంబాలకు పరిహారం అందేలా ప్రయత్నించాలని దోహా ఖతార్ లోని ఇండియన్ ఎంబసీ అధికారులను ఆదేశించారు. టీఆర్ఎస్ కు చెందిన చేవెళ్ల లోక్ సభ ఎంపీ డా. గడ్డం రంజిత్ రెడ్డి, కాంగ్రెస్ కు చెందిన రాజ్య సభ ఎంపీ రణదీప్ సింగ్ సూర్జేవాలా ఖతార్ లో మృతి చెందిన వలస కార్మికుల కుటుంబాలకు న్యాయం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ ని ట్విట్టర్ ద్వారా కోరారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే విషయం పరిశీలిస్తామని తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ చెప్పారు. ఈ కథనానికి స్పందించిన సిఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ చెన్నమనేని శ్రీనివాస రావు చిట్టాపూర్, ముత్యంపేట, డబ్బా గ్రామాల్లోని మూడు ఖతార్ మృతుల కుటుంబాలను కలిసి పరామర్శించి వారి పిల్లల చదువుల కోసం తలా రూ. 10 వేల ఆర్థిక సహాయం చేశారు. ఏ మరణం అయినా పరిహారం ఇవ్వాలి మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వడానికి... ఖతార్ ఫుట్ బాల్ స్టేడియం పని ప్రదేశంలో జరిగిన మరణాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటున్నారని వలస కార్మిక నాయకులు మంద భీంరెడ్డి అన్నారు. భారీ ఆదాయాన్ని సమకూర్చే ఫుట్ బాల్ ప్రాజెక్టులో ప్రాణాలు వదిలిన వలస కార్మికులను ఆదుకోవడం ఖతార్ తో సహా అంతర్జాతీయ సంస్థల కనీస ధర్మం అని గల్ఫ్ కాంగ్రెస్ చైర్మన్ సింగిరెడ్డి నరేష్ అన్నారు. గుండెపోటు, ఆత్మహత్యలు, తదితర కారణాల వలన చనిపోయిన వలస కార్మికుల మరణాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే అధిక ఉష్ణోగ్రత మరణాలు, పని ప్రదేశంలో ప్రమాద మరణాలను నివారించగలిగే వారు ఆయన అన్నారు. -
ఈ అమరుల కుటుంబాలను ఆదుకోండి..
చనిపోయిన వారిని స్మరించండి - బ్రతికున్న వారి కోసం పోరాడండి (రిమెంబర్ ది డెడ్ - ఫైట్ ఫర్ ది లివింగ్) అనే నినాదంతో గత కొన్నేళ్లుగా తెలంగాణ గల్ఫ్ ప్రవాసి కార్మిక సంఘాలు ప్రతి ఏటా ఏప్రిల్ 28న 'గల్ఫ్ అమరుల దినోత్సవం' (గల్ఫ్ మార్టియర్స్ డే) నిర్వహిస్తున్నారు. విధి నిర్వహణలో చనిపోయిన, గాయపడిన, వికలాంగులైన, అనారోగ్యానికి గురైన కార్మికుల స్మారకార్థం... ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఏప్రిల్ 28 న 'అంతర్జాతీయ కార్మికుల స్మారక దినోత్సవం' (ఇంటర్నేషనల్ వర్కర్స్ మెమోరియల్ డే) జరుపుకుంటారు. ఈ స్మారక దినోత్సవం సందర్భంగా గల్ఫ్ వలస కార్మికుల వెతలను బయటకి తేవడంతో పాటు వారికి చట్టపరమైన సహాయం అందేలా అనేక సంస్థలు రెండు రాష్ట్రాల్లో కృషి చేస్తున్నాయి. పదేళ్ల క్రితం... జగిత్యాల జిల్లా వెలగటూరు మండలం పాతగూడూరు కు చెందిన దుర్గం భీమయ్య అనే వలస కార్మికుడు ఓమాన్ దేశంలోని మస్కట్ లో నివసించేవాడు. ఓమాన్లో అక్రమ నివాసి (ఖల్లివెల్లి)గా ఉండటంతో ప్రతి దినం జరిమానాలు, జైలు శిక్షల భయంతో జీవించేవాడు. దీంతో ఏ భయాలు లేకుండా బతికేందుకు తిరిగి ఇండియా రావాలనుకున్నాడు. ఈ క్రమంలో ఇండియాకు చేరుకోవడానికి పక్క దేశమైన యూఏఈ (దుబాయి) ద్వారా వెళ్లిపోవడం సులభ మార్గమని ఎవరో చెప్పిన మాటను నమ్మాడు. అదే క్రమంలో కాలి నడకన మరికొందరితో కలిసి ఓమాన్ నుండి యుఏఈకి ఎడారిలో సరిహద్దు వెంబడి నడక ప్రారంభించారు. ఇంతలో 2 మే 2012 న ఓమాన్ సైన్యం జరిపిన కాల్పుల్లో మరణించాడు. అతి కష్టం మీద శవపేటిక ఇండియాకు వచ్చింది. 1976 నుంచి దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1976 నుంచి గల్ఫ్ దేశాలకు వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. కానీ ఎంత మంది వెళ్లారు? ఎక్కడ పని చేస్తున్నారు ? ఎవరెలా ఉన్నారనే గణాంకాలు పట్టించుకున్న వారు లేరు. స్వతంత్ర భారత దేశంలోనూ ఇంచుమించు ఇదే ధోరణి కొనసాగింది. కానీ 90వ దశకం తర్వాత తీసిన లెక్కల్లో దుర్గం భీమయ్య కంటే ముందే గల్ఫ్ దేశాల్లో అసువులు బాసిన వలస కార్మికుల సంఖ్య 1500లకు పై మాటగానే ఉంది. ఈ తరుణంలో భీమయ్య బాధకర మరణంతో ఒక్కసారిగా గల్ఫ్ వలస కార్మికుల కష్టాలు, వార కుటుంబాలు పడుతున్న బాధలు తెర మీదకు వచ్చాయి. దీంతో వలస కార్మికుల హక్కులు, రక్షణ కోసం పని చేయడంలో అనేక సంస్థలు శ్రద్ధ కనబరుస్తూ వస్తున్నాయి. సాయం అందిన తర్వాత మృతుడు దుర్గం భీమయ్య భార్య స్వప్న తన కుమారుడు శ్రవణ్, కూతురు శ్వేత వైష్ణవి లను కష్టపడి పెంచింది. ఎస్సీ కార్పొరేషన్ సహాయంతో బ్యాంక్ లోన్ తో బర్రెలను కొని పాల ఉత్పత్తి చేపట్టింది. సకాలంలో అప్పు తీర్చేసి బ్యాంకు అధికారుల మన్ననలను పొందింది. కొందరు దాతల చిరు సహాయం పిల్లల చదువుకు ఉపయోగపడింది. ప్రస్తుతం ఉపాధి హామీ కూలీగా పని చేస్తున్నది. రోజువారీ వ్యవసాయ కూలీ, భవన నిర్మాణ కూలీగా కూడా పనిచేస్తున్నది. ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్ లో 10వ తరగతి పాస్ అయిన కూతురు శ్వేత వైష్ణవికి బాల్య వివాహం చేసింది. కూతురుకు కూతురు పుట్టింది. పెళ్లి అయి కూతురు పుట్టినప్పటికీ శ్వేత వైష్ణవి ఇంటర్ ఎంపీసీ సెకండ్ ఇయర్ చదువుతున్నది. కుమారుడు శ్రవణ్ ఇంటర్ ఎంపీసీ పూర్తిచేసి, ఇప్పుడు బీకాం ఫస్టియర్ చదువుతున్నాడు. పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం కోసం కోచింగ్ కు వెళ్లాలని ప్రయత్నిస్తున్నాడు. కాలగర్భంలో బతుకుదెరువు కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి ఎందరో అమరులయ్యారు. కొందరి జీవితాల్లు కష్టాలు బయటకి రాగా మరెందరో కాలగర్భంలో కలిసిపోయారు. కానీ భీమయ్య ఘటన తర్వాత గల్ఫ్ కార్మికుల జీవితాలు, వాటి కుటుంబ సభ్యుల బాధలపై పట్టింపు పెరిగింది. ఈ క్రమంలో అనుకోని పరిస్థితుల్లో భీమయ్య చనిపోయినా.. అతనికి కుటుంబానికి దక్కిన చిరు సాయం (ఎస్సీ కార్పోరేషన్ రుణం)తో ఆ కుటుంబం తిరిగి నిలదొక్కుకోగలిగింది. కానీ ఇప్పటికీ ఎన్నో కుటుంబాలు ఇటు ప్రభుత్వాల నుంచి అటు సమాజం నుంచి ఎటువంటి సాయం అందక చితికి పోతున్నాయి. చేయూతనివ్వండి ఈ నేపథ్యంలో అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు బతుకుదెరువు వేటలో అమరులైన గల్ఫ్ కార్మికుల కుటుంబాలను ఆదుకునేందుకు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ సాయం కోసం రెండు రాష్ట్రాల్లో సుమారు ఆరు వేల మంది గల్ఫ్ దేశాల్లో అమరులయ్యారు. వారి కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు. - మంద భీంరెడ్డి (గల్ఫ్ వ్యవహారాల విశ్లేషకులు) +91 98494 22622 చదవండి: What Is ECR And ECNR: ఈసీఆర్, ఈసీఎన్నార్ పాస్‌పోర్టులు ఎందుకో తెలుసా ? -
Afghanistan: మమ్మల్ని రక్షించండి - తెలంగాణ వలస కార్మికుల వేడుకోలు
మోర్తాడ్ (బాల్కొండ): అఫ్గానిస్తాన్‌లో ప్రస్తుత దయనీయ పరిస్థితు లకు వీరిద్దరి గాథలు అద్దం పడుతున్నాయి. పొట్ట చేత పట్టుకుని అఫ్గాన్‌కు వెళ్లిన తెలంగాణ వాసుల దయనీయ స్థితి. కొందరు అక్కడి నుంచి క్షేమంగా ఇంటికి చేరుకోగా మరికొందరు అక్కడే చిక్కుకుని బిక్కు బిక్కుమంటూ కాలం గడుపు తున్నారు. అఫ్గాన్‌లోని మన విదే శాంగ కార్యాలయాన్ని ఉద్యోగులు ఖాళీ చేసినా అక్కడ చిక్కుకుపోయిన వారి సంఖ్య ఎంత? వారి స్థితి గతులేంటో ఇప్పటికీ తెలియట్లేదు. అఫ్గానిస్తాన్ నుంచి అమెరికా సైన్యం, నాటో సేనలు ఖాళీ చేస్తుండటం.. అంతలోనే తాలిబన్లు అఫ్గాన్‌ను తమ అధీనంలోకి తెచ్చుకోవడంతో వలస కార్మికుల్లో ఉపాధి కల చెదిరిపోయింది. ఫలితంగా తమ వీసాలకు గడువు ఉన్నా అఫ్గాన్‌ను వీడాల్సి వస్తుందని వలస కార్మికులు వాపోతున్నారు. అఫ్గాన్ నుంచి అమెరికా, నాటో దళాలు వెనక్కి వెళ్లిపోవడానికి గడువు సమీపించింది. కాగా అమెరికన్ సైన్యంకు సేవలు అందించే ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నామని గుర్తించిన కొందరు తెలంగాణ యువకులు అఫ్గాన్‌లోనే ఉండటానికి ప్రత్యామ్నాయ మార్గం వెతుక్కున్నారు. అఫ్గాన్ నుంచి అమెరికా, నాటో సైన్యం ఉపసంహరణ జరిగినా రాయబార కార్యాలయాలల్లో విధులు నిర్వహిస్తే తమ ఉద్యోగానికి ఢోకా ఉండదని వలస కార్మికులు భావించారు. ఈ క్రమంలో ఏజెన్సీల మెప్పు పొంది అమెరికా, ఇతర దేశాల రాయబార కార్యాలయాల్లో బాధ్యతలను నిర్వహిస్తున్నారు. అంతలోనే అంతా అయిపోయింది.. కానీ అంతలోనే తాలిబన్లు అఫ్గానిస్తాన్ మొత్తాన్ని వశం చేసుకోవడంతో అమెరికా సహా అన్ని దేశాల రాయబార కార్యాలయాలను ఖాళీ చేశాయి. ఈ క్రమంలో రాయబార కార్యాలయాల్లో ఉపాధి పొందుతున్న తెలంగాణ వలస కార్మికులు తప్పనిసరి పరిస్థితుల్లో ఇంటిబాట పట్టాల్సి వచ్చింది. అమెరికా ఎంబసీకి అనుబంధంగా పని చేసే కార్మికులను నాలుగు నెలలకు ఒకసారి ఇంటికి వెళ్లి రావడానికి సెలవులు ఇస్తున్నారు. ఇందులో భాగంగా ఇటీవల కొందరు సెలవులపై ఇంటికి రాగా అఫ్గాన్‌లో మారిన పరిస్థితులతో మళ్లీ అక్కడకు వెళ్లలేకపోతున్నారు. కాబుల్‌లో చిక్కుకుపోయాను నేను అఫ్గానిస్తాన్‌లోని అమెరికన్ మిలటరీ క్యాంపులో సహాయ కుడిగా పనిచేస్తాను. కాబూల్ పట్టణం కసబ్ అనే ప్రాంతంలో చిక్కుకున్నాను. రెండు మూడు రోజుల కింద తాలిబన్లు కాల్పుల మోత మోగిం చారు. బిక్కుబిక్కుమంటూ క్యాంపు గదిలోనే దాక్కున్నాం. సెల్ఫోన్లు వినియోగించ డానికి అనుమతి లేదు. రహస్యంగానే వాడుతున్నాం. తాలిబన్లు ఎప్పుడేం చేస్తారో తెలియట్లేదు. నాతో పాటు చాలామంది ఇక్కడ చిక్కుకున్నారు. - బొమ్మన రాజన్న( మంచి ర్యాల) ఎటుపోవాలో తెలియడం లేదు నేను అఫ్గానిస్తాన్‌లోని అమెరికా రాయబార కార్యాలయంలో పని చేస్తున్నాను. నాకు ఇక్కడ పని చేయడానికి వీసా గడువు ఇంకా ఉంది. కానీ తాలిబన్ల కారణంగా అమెరికా రాయబార కార్యాలయం ఖాళీ చేశారు. నాతో పాటు ఇక్కడ ఉపాధి పొందుతున్న విదేశీయులను రెండు రోజుల కింద ఖతర్‌కు తరలించారు. మమ్మల్ని ఇక్కడే ఉంచుతారో లేక ఇంటికి పంపుతారో తెలియట్లేదు. - బొమ్మెన మహేందర్ (మోర్తాడ్, నిజామాబాద్ జిల్లా) అమెరికా బాధ్యత తీసుకోవాలి- స్వదేశ్ పరికిపండ్ల (ప్రవాసీ మిత్ర లేబర్ యూనియన్ అధ్యక్షుడు) అఫ్గాన్‌లో 20 ఏళ్ల పాటు అమెరికా సైన్యం, నాటో దళాలకు సేవలు అందించిన తెలంగాణ వలస కార్మికులను అమెరికా ప్రభుత్వం చేరదీయాలనే డిమాండ్ వస్తోంది. అఫ్గాన్ పౌరులతోపాటు తెలంగాణ వలస కార్మికులకు కూడా అమెరికా తమ దేశ వీసాలను జారీ చేసి ఉపాధి కల్పించాలి. -
కాల్ చేస్తామని ఫోన్ కొట్టేసి బైక్‌తో ఈడ్చుకెళ్లారు, వైరల్ వీడియో
తిరువనంతపురం: కేరళలోని కోజిగోడ్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఫోన్‌కాల్ చేసుకుంటామని చెప్పి మొబైల్‌ఫోన్ కొట్టేయడమే కాకుండా అడ్డు వచ్చిన సదరు వ్యక్తిని బైక్‌తో కొద్దిదూరం పాటు ఈడ్చుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి. వివరాలు.. బిహార్‌కు చెందిన అలీ అక్బర్ కోజిగోడ్‌కు పనినిమిత్తం వచ్చారు. తన పని ముగించుకొని రోడ్డుపై వెళుతుండగా.. ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చారు. తమ ఫోన్ పాడైందని.. అర్జెంటుగా ఒక కాల్ చేసుకుంటామని చెప్పి అక్బర్‌ను అడిగారు. వారి మాటలు నమ్మిన అక్బర్ తన ఫోన్‌ను వారి చేతిలో పెట్టగానే యువకులిద్దరు వెంటనే బైక్‌ను స్టార్ట్ చేసి అక్కడినుంచి పారిపోయేందుకు యత్నించారు. అయితే బైకును అక్బర్ పట్టుకొని ఉండడంతో అతన్ని అలాగే రోడ్డుపై ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు. ఈ క్రమంలో అలీతో పాటు బైకుపై వెనకాల కూర్చున్న దొంగ కూడా కిందపడిపోయాడు. ఆ తర్వాత అక్బర్ బైకును వెంబడించినా ప్రయోజనం లేకపోయింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు అక్బర్ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారు. కాగా అక్బర్ వద్ద ఫోన్ దొంగలించిన ఇద్దరు యువకులను సాను కృష్ణన్, షమ్నాస్ అబ్దురాహిమాన్‌లుగా గుర్తించారు. అయితే దుండగులకు చెందిన ఒక ఫోన్ అక్కడపడిపోగా స్థానికులు దానిని పోలీసులకు అందించారు. దీనికి సంబంధించిన వీడియో దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. -
హమ్మయ్య.. శ్రీనివాస్ క్షేమంగా వచ్చేశాడు!
పెగడపల్లి(ధర్మపురి): లెబనాన్ నుంచి ఇంటికి తిరిగి వస్తూ షార్జాలో జైలు పాలయిన జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం మ్యాక వెంకయ్యపల్లికి చెందిన శ్రీనివాస్ ఎట్టకేలకు ఇంటికి చేరుకున్నాడు. శ్రీనివాస్ గల్ఫ్‌లో బందీ అయిన విషయంపై ‘సాక్షి’లో ‘జైలు నుంచి విడిపించరూ..’ శీర్షికన ప్రచురితమైన కథనానికి గల్ఫ్‌కార్మిక రక్షణ సమితి సభ్యులు స్పందించారు. షార్జా జైలు నుంచి ఇంటికొచ్చిన శ్రీనివాస్‌ను బుధవారం ‘సాక్షి’పలకరించింది. శ్రీనివాస్ 2013లో దుబాయ్‌కి వెళ్లగా జీతం తక్కువగా ఉండటంతో అక్కడే కల్లివెల్లి కార్మికుడిగా మారాడు. ఓ గదిలో పదిమందితో కలిసి ఉండేవాడు. ఈ క్రమంలో 2015లో గదిలో ఎవరో నల్లుల మందు పెట్టగా.. అది విషంగా మారి పక్క గదిలో ఉన్న ఒకరు చనిపోయారు. ఆ కేసులో సీఐడీ పోలీసులు శ్రీనివాస్‌ను జైలులో పెట్టి 20 రోజుల తర్వాత విడుదల చేయగా స్వగ్రామానికి వచ్చేశాడు. తర్వాత 2018లో లెబనాన్ వెళ్లిన శ్రీనివాస్ ఈ ఏడాది మార్చి 24న షార్జా నుంచి స్వదేశానికి తిరిగి వస్తుండగా శ్రీనివాస్‌పై కేసు ఉందని, రెండు నెలలు జైలుతోపాటు రూ.45 లక్షలు జరిమానా చెల్లించాలని చెప్పారు. ఆయన స్నేహితుడు ఈ విషయాన్ని గల్ఫ్‌కార్మిక రక్షణ సమితి అధ్యక్షుడు గుండెల్లి నరసింహకు తెలపగా, ఆయన చొరవతో ఎలాంటి జైలుశిక్ష, జరిమానా లేకుండానే విడుదలై, స్వగ్రామం చేరుకున్నాడు. గల్ఫ్‌లో కార్మికుల గోస.. ఆదుకోవాలని వేడుకోలు -
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద రద్దీ ఇంటి బాట పట్టిన వలస కార్మికులు
-
చేయని తప్పునకు గల్ఫ్‌లో జైలు పాలై..
కథలాపూర్ (వేములవాడ): చేయని తప్పునకు జైలు పాలై.. పాస్‌పోర్టు లేక దుబాయ్‌లో చిక్కుకున్న జగిత్యాల జిల్లావాసికి ఊరట లభించింది. గల్ఫ్ సంక్షేమ సంఘాల చొరవతో అతను స్వగ్రామానికి వచ్చేందుకు మార్గం సుగమమైంది. కథలాపూర్ మండలం గంభీర్‌పూర్‌కు చెందిన పిట్టల కొండగట్టు రెండేళ్ల క్రితం దుబాయ్ వెళ్లాడు. గతేడాది మార్చిలో కొండగట్టు పేరిట రిజిస్టర్ అయిన సిమ్‌కార్డు పాకిస్తాన్ దేశానికి చెందిన ఓ వ్యక్తి ఉపయోగించాడు. అతను చేసిన తప్పులకు కొండగట్టును అక్కడి పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. 8 నెలలు జైలు జీవితం గడిపిన కొండగట్టు.. ఇటీవల విడుదలయ్యాడు. అయితే.. కొండగట్టు వద్ద పాస్‌పోర్టు లేకపోవడంతో స్వదేశానికి రాలేకపోయాడు. ఈ విషయమై గత నెల 21న ‘స్వదేశానికి రప్పించండి’శీర్షికన సాక్షి మెయిన్‌లో ప్రచురితమైన కథనానికి గల్ఫ్ సంక్షేమ సంఘాల ప్రతినిధులు స్పందించారు. కొండగట్టు స్వదేశానికి వచ్చేందుకు కోర్టు అనుమతి పత్రం, ఎన్ఓసీ దుబాయ్‌లోని రాయబార కార్యాలయానికి అందేలా చర్యలు తీసుకున్నారు. దీంతో అతను స్వగ్రామానికి వచ్చేందుకు మార్గం సుగమమైంది. ఇక్కడ చదవండి: శ్రీనివాస్‌ను జైలు నుంచి విడిపించరూ..! ఆరేళ్లుగా కుమార్తె అస్థికలు భద్రపరిచి.. -
జైలు నుంచి విడిపించరూ..!
పెగడపల్లి (ధర్మపురి): జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలంలోని మ్యాక వెంకయ్యపల్లికి చెందిన లింగంపల్లి శ్రీనివాస్(27) ఉపాధి కోసం లెబనాన్ వెళ్లి తిరిగి వస్తుండగా షార్జా విమానాశ్రయంలో పోలీసులు అరెస్టు చేశారు. శ్రీనివాస్ 2013లో కంపెనీ వీసాపై దుబాయి వెళ్లి 2016 వరకు పనిచేశాడు. అక్కడి కంపెనీలో పని సక్రమంగా లేకపోవడం, జీతం తక్కువగా ఉండటంతో తిరిగి రావాలని భావించాడు. అయితే అప్పటికే వీసా గడువు సమయం ముగియడంతో శ్రీనివాస్‌పై అక్కడి ప్రభుత్వం కేసుపెట్టి అరెస్టు చేసింది. 15 రోజుల తర్వాత జైలు నుంచి విడుదలై భారత్‌కు వచ్చాడు. 2018లో తిరిగి కంపెనీ వీసాతో లెబనాన్ వెళ్లాడు. తాజాగా లెబనాన్ నుంచి తిరిగొచ్చేందుకు ఈ నెల 25న బయల్దేరి షార్జాకు చేరుకున్నాడు. విమానాశ్రయంలో శ్రీనివాస్ పాసుపోర్టు స్కాన్ చేస్తుండగా దుబాయిలో కేసు ఉన్నట్లు తేలి, పాసుపోర్టు ఎర్రర్ చూపింది. దీంతో పోలీసులు శ్రీనివాస్‌ను అరెస్టుచేసి జైలుకు పంపారు. కాగా, రెండు రోజుల కింద లెబనాన్ నుంచి బయల్దేరుతూ తమకు ఫోన్ చేసి ఇంటికి వస్తున్నానని చెప్పాడని తల్లిదండ్రులు బాలయ్య, కొమురమ్మ, భార్య మమత రోదిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అక్కడి రాయబార కార్యాలయ అధికారులతో మాట్లాడి, తమ కొడుకు ఇక్కడికి వచ్చేలా చూడాలని కోరుతున్నారు. హృదయవిదారకం.. రోడ్డుపక్క గర్భిణి ప్రసవం -
వలస దుర్గమ్మ..
కష్టం అంటే ఏంటో.. లాక్డౌన్లో చూశాం. ఎంతమంది తల్లులు.. కార్మిక వలస మాతలు! కష్టమొస్తే ఏంటి?! అనే.. ధైర్యాన్నీ లాక్‌డౌన్‌లోనే చూశాం. ప్రతి మహిళా ఒక శక్తి. శక్తిమాత! ఆ శక్తిమాత స్వరూపమే వలస దుర్గమ్మ. కాయ కష్టం చేయందే పూట గడవని వలస కార్మికులు ఉపాధిని కోల్పోతే బతుకు ఎంత దుర్భరంగా ఉంటుందో కరోనా చూపించింది. çసమానమైన కష్టానికి సమానమైన ప్రతిఫలం రాకున్నా, కుటుంబ పోషణ కోసం మగవాళ్లతో సమానంగా గడపదాటి, ఊరు దాటి, రాష్ట్రమే దాటి వెళ్లిన మహిళలు లాక్డౌన్లో కూలి దొరికే దారి లేక కట్టుబట్టలతో, కాళ్లకు చెప్పులు లేకుండా, బిడ్డల్ని చంకలో వేసుకుని, వెంట బెట్టుకుని సొంత ఊళ్లకు మైళ్లకు మైళ్లు నడిచారు. కన్నీళ్లు వాళ్లకు రాలేదు. చూసిన వాళ్లకు వచ్చాయి! ఏ శక్తి ఆ తల్లుల్ని నడిపించిందో కానీ, ఆ శక్తి రూపంలో వలస మహిళా కార్మికులు ఈ ఏడాది శరన్నవరాత్రులకు దేశంలో చాలా చోట్ల ‘వలస మాత’ దుర్గమ్మలుగా దర్శనం ఇవ్వబోతున్నారు! కోల్‌కతాలో ఇప్పటికే అనేకచోట్ల వలస దుర్గమ్మల మండపాలు వెలశాయి. దుర్గమ్మ ఆదిశక్తికి ప్రతిరూపం. మహిళాశక్తి ఆ దుర్గమ్మకు ప్రతీక. దుర్గమ్మ తొమ్మిది శక్తి అవతారాలను యేటా చూస్తూనే ఉంటాం. ఆ తొమ్మిది శక్తులు కలిసిన మహాశక్తి ‘వలస కార్మిక తల్లి’! బాలాత్రిపుర సుందరి, గాయత్రీ దేవి, శ్రీమహాలక్ష్మి, అన్నపూర్ణమ్మ, లలితాదేవి, మహాసరస్వతి, శ్రీదుర్గ, మహిషాసుర మర్దినీ దేవి, శ్రీరాజరాజేశ్వరి.. వీళ్లందరి అంశతో కోల్‌కతాలోని బరిషా దుర్గా పూజా కమిటి ఈ ఏడాది కార్మికశక్తి మాతను మండపాలన్నిటా విగ్రహాలను నెలకొల్పుతోంది! మొదట నైరుతి కోల్‌కతాలోని బెహాలాలో కమిటీ తన మండపంలో వలసమాతను ప్రతిష్ఠించింది. మండే ఎండల్లో, కాలే కడుపుతో, ఆకలిదప్పికలను ఓర్చుకుంటూ పిల్లల్ని నడిపించుకుంటూ వెళుతున్న ఆ వలస కార్మిక మహిళను దుర్గాశక్తిగా రింతూ దాస్ అనే కళాకారుడు మలిచాడు. ఆ తల్లి పక్కన నడుస్తున్న కూతుళ్లు లక్ష్మీ, సరస్వతి. లక్ష్మీదేవి చేతిలో ఆమె వాహనమైన గుడ్లగూబ ఉంటుంది. సరస్వతీ దేవి చేతిలో ఆమె వాహనం హంస ఉంటుంది. చూడండి, ఎంత గొప్ప అంతరార్థమో! తమను మోసే వాహనాలను తామే మోసుకెళుతున్నారు! స్త్రీని శక్తిమాతగానే కాదు, కారుణ్యమూర్తి గానూ చూపడం అది. -
దీపికా పదుకొణె ఒక వలస కూలీ!
భోపాల్: బాలీవుడ్ నటి దీపికా పదుకుణె ఒక వలస కూలీ!. మధ్యప్రదేశ్‌లో గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఆమెకి ఒక జాబ్ కార్డు .. అందులో ఆమె ఫొటో కూడా ఉంది. మధ్యప్రదేశ్ ఖర్గోన్ జిల్లాలో అధికారుల నిర్వాకం ఇది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి చట్టం కింద దీపిక ఫొటోతో ఉన్న నకిలీకార్డు వ్యవహారం వెలుగులోకొచ్చింది. సోను శాంతిలాల్ పేరు మీద ఉన్న కార్డులో దీపిక ఫోటో ఉంది. ఆ గ్రామంలో పది మంది వరకు వలస కూలీలు ప్రముఖ బాలీవుడ్ నటుల ఫొటోలతో నకిలీ కార్డుల్ని తీసుకున్నారు. పీపర్‌ఖేడనాక గ్రామంలోని ఈ నకిలీ కార్డుల్ని వినియోగిస్తూ ఉపాధి హామీ పథకం కింద మంజూరయ్యే నగదును పొందుతున్నారు. మనోజ్ దూబే పేరు మీదనున్న నకిలీ కార్డు ద్వారా ప్రతీ నెల రూ.30 వేలు తీసుకుంటున్నట్టుగా జిల్లా అధికారులు చెబుతున్నారు. ఇలా నకిలీ కార్డులతో లక్షల నగదు స్వాహా చేసినట్టుగా వెల్లడించారు. అయితే ఈ కార్డుల్లో పేరున్న వారు అసలు ఆ కార్డులు ఎవరో చేశారో తమకు తెలీదని సోను శాంతిలాల్ భర్త చెప్పారు. ఈ కార్డుల కింద ఎవరు ప్రతీ నెల డబ్బులు తీసుకుంటున్నారనే దానిపై జిల్లా అధికారులు విచారణ చేపట్టారు. -
‘నా కొడుకును చిత్ర హింసలు పెట్టారు’
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. లాక్డౌన్ నేపథ్యంలో స్వస్థలానికి తిరిగి వచ్చిన ఓ వలస కార్మికుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. దొంగతనం ఆరోపణలతో అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు చిత్ర హింసలు పెట్టిన కారణంగానే బాధితుడు ఇంతటి కఠిన నిర్ణయం తీసుకున్నాడని అతడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వివరాలు.. బీర్భూం జిల్లా రూపుష్‌పూర్ అనే గ్రామానికి చెందిన సౌవిక్ గొరాయి(22) అనే యువకుడు కొంతకాలం క్రితం ఉపాధి కోసం గుజరాత్‌కు వలస వెళ్లాడు. కరోనా వ్యాప్తి, లాక్డౌన్ నేపథ్యంలో ఇటీవలే ఇంటికి తిరిగి వచ్చాడు. (లవ్ జిహాద్ : పేరు మార్చుకుని వలపు వల) ఈ క్రమంలో షిబు రాయ్ అనే దుకాణ యజమాని సోమవారం తన సైకిల్, షాపులోని సిలిండర్ చోరీకి గురయ్యాయని పోలీసులకు సమాచారమిచ్చాడు. సౌవికే ఈ దొంగతనానికి పాల్పడ్డాడని ఆరోపించాడు. ఈ నేపథ్యంలో ఎలాంటి రాతపూర్వక ఫిర్యాదు అందకపోయినప్పటికీ పోలీసులు సౌవిక్‌ను అదుపులోకి తీసుకున్నారు. కొన్ని గంటల తర్వాత అతడిని విడిచిపెట్టారు. అయితే కూలోనాలో చేసుకుని బతుకుతూ పొట్టపోసుకుంటున్న తనపై దొంగ అనే ముద్ర వేసారని ఆవేదన చెందిన బాధితుడు భుజాలకు బరువైన సంచీ ఒకటి తగిలించుకుని తన ఇంట్లో అదే రోజు ఉరివేసుకున్నాడు. ఈ ఘటనతో ఒక్కసారిగా గ్రామంలో అలజడి రేగింది. పోలీసుల తీరు వల్లే అమాయకుడైన సౌవిక్ ప్రాణాలు కోల్పోయాడంటూ స్థానికులు ఆరోపించారు. చిన్నతనంలోనే తల్లిని పోగొట్టుకున్న సౌవిక్ ఎంతో మర్యాదగా ప్రవర్తించేవాడని, అతడు దొంగతనం చేశాడంటే నమ్మబుద్ధికావడం లేదని చెప్పుకొచ్చారు.(ప్రేమించాడు.. పెళ్లంటే వద్దన్నాడు!) చిత్ర హింసలు పెట్టారు ఇక ఒక్కగానొక్క కొడుకు శాశ్వతంగా తనకు దూరం కావడంతో సౌవిక్ తండ్రి గుండెపగిలేలా రోదిస్తున్నాడు. ‘‘నా కొడుకును పోలీస్ స్టేషన్‌కు లాక్కెళ్లారు. ఇష్టం వచ్చినట్లు కొట్టారు. చేయని నేరం మీద వేసుకోవాలని వేధించారు. తనని విడిచిపెట్టమని నేనెంతగానో బతిమిలాడాను. నన్ను కూడా దూషించారు. ఓ అధికారి నా కళ్ల ముందే నా కొడుకును చిత్ర హింసలు పెట్టారు. న్యాయం చేయాల్సిన పోలీసులే మనం ఇంకా ఎక్కడికి వెళ్తాం. లాక్డౌన్ వల్ల మూడు నెలల క్రితం ఇంటికి వచ్చిన నా కొడుకు ఇప్పుడు శాశ్వతంగా దూరమైపోయాడు’’అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా ఈ ఘటనపై స్పందించిన బిర్భూం జిల్లా ఎస్పీ శ్యామ్ సింగ్ బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. -
చలించిన ‘నిహారిక’ : వారికి విమాన టికెట్లు
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్, లాక్డౌన్ సంక్షోభంలో ఇబ్బందులు పడుతున్న వలస కార్మికులను ఆదుకునేందుకు కార్పొరేట్ సంస్థల నుంచి చిన్న సంస్థల దాకా, సెలబ్రిటీల నుంచి సామాన్యుల దాకా ముందుకు వస్తున్నారు. ఈక్రమంలోనే తమ స్వస్థలాలకు చేరకునేందుకు వేల కీలోమీటర్లు కాలినడకన పోతున్న వారి గాథలను విన్న ఓ బాలిక (12) మనసు ద్రవించింది. అందుకే తను పిగ్గీ బ్యాంకులో దాచుకున్న సొమ్మును వారికోసం వెచ్చించి పలువురికి స్ఫూర్తిగా నిలిచింది.(మనసు బంగారం) నోయిడాకు చెందిన ఎనిమిదో తరగతి విద్యార్థిని నిహారికా ద్వివేది గత రెండేళ్లుగా తను దాచుకున్న రూ .48,530 మొత్తాన్ని వలస కార్మికులు తమ సొంత రాష్ట్రానికి చేరుకోవడానికి సహాయంగా ప్రకటించింది. వలస కార్మికుల కష్టాలను చానళ్లలో చూసి చలించిపోయాననీ, అలాగే చాలామంది దాతలు ఇస్తున్న విరాళాలు కూడా తనను ఈ నిర్ణయం తీసుకునేందుకు ప్రేరేపించిందని తెలిపింది. తన వంతు బాధ్యతగా సాయం అందిస్తున్న ముగ్గురిలో ఒకరు క్యాన్సర్ రోగి కూడా ఉన్నారని నిహారికా చెప్పారు. దీనిపై నిహారిక తల్లి, సుర్బీ ద్వివేది మాట్లాడుతూ వలస కూలీల గురించి వార్తలు చూసినప్పుడల్లా పాప చాలా బాధపడటం గమనించాము. అందుకే సన్నిహితుల ద్వారా వివరాలు సేకరించి ఆమె కోరిక మేరకు, ముగ్గురికి విమాన టికెట్లకు ఏర్పాటు చేసి పంపించామని తెలిపారు. ఇందుకు తమకు చాలా గర్వంగానూ, సంతోషంగానూ వుందన్నారు. చదవండి :అతిపెద్ద మొబైల్ మేకర్‌గా భారత్: కొత్త పథకాలు ఫ్లిప్‌కార్ట్‌కు భారీ ఎదురుదెబ్బ -
శ్రామిక్ రైలులో విషాదం.. 5 రోజుల తర్వాత..
లక్నో: నిద్రాహారాలు లేక ఫ్లాట్‌ఫామ్‌పైనే ప్రాణాలు వదిలిన బిహార్ మహిళా వలస కూలీ ఉదంతం మరువకముందే.. ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో అలాంటి ఘటనే మరొకటి చోటుచేసుకుంది. ముంబై వలస వెళ్లిన ఓ వ్యక్తి ఇంటికి తిరుగు పయనమయ్యే క్రమంలో ప్రాణాలు విడిచాడు. ఇంకో 70 కిలోమీటర్లు చేరితే ఇల్లు చేరుతానని మురిసిన ఆ వ్యక్తి.. చివరకు రైలు టాయ్లెట్లో శవమై కనిపించాడు. అయితే, చనిపోయిన ఐదు రోజుల వరకూ అతని మృతదేహం ఎవరికంటా బయటపడకపోవడం మరో విషాదం. (చదవండి: ఆ పదం తొలగించే అవకాశం ఉంటుందా?) వివరాలు.. రాష్ట్రంలోని బస్తీ జిల్లాకు చెందిన మోహన్ లాల్ శర్మ (38) ముంబైలో రోజూ కూలీ చేసే కార్మికుడు. అందరిలాగే అతనికీ కరోనా లాక్‌డౌన్‌తో దుర్భర పరిస్థితులు ఎదురయ్యాయి. దాంతో శ్రామిక్ రైలులో ఇంటికి బయల్దేరాడు. అందరితోపాటు మే 23న ఝాన్సీకి చేరుకున్నాడు. అనంతరం ఝాన్సీ జిల్లా యంత్రాంగం శ్రామిక్ రైలులో వచ్చిన వారిని ఆయా ప్రాంతాలకు వెళ్లే స్థానిక రైళ్లలో ఎక్కించింది. ఈ క్రమంలో శర్మ తన బంధువొకరికి కాల్ చేసి.. తనను గోరఖ్‌పూర్ రైల్వేస్టేషన్లో కలుసుకోవాలని కోరాడు. అయితే, ఆ బంధువు మే 24న శర్మ ఫోన్‌కు కాల్ చేయగా.. స్విచ్డ్ ఆఫ్ వచ్చింది. గోరఖ్‌పూర్‌లో ప్రయాణికులను దించిన తర్వాత రైలు మే 27న తిరిగి ఝాన్సీకి వెళ్లిపోయింది. అదేరోజు సాయంత్రం రైల్వే కోచ్‌లు శుభ్రం చేస్తున్న క్లీనింగ్ సిబ్బంది రైలు టాయ్లెట్లో శర్మ శవం చూసి షాక్‌కు గురయ్యారు. పై అధికారులకు సమాచారం ఇచ్చారు. ఝాన్సీలో ప్రయాణికులను దించిన తర్వాత.. టాయ్లెట్లో పడిపోయిన శర్మను ఎవరూ చూడలేదని అధికారులు తెలిపారు. శర్మకు కోవిడ్ స్క్రీనింగ్ చేసిన తర్వాతనే శ్రామిక్ రైలులో అనుమతించామని చెప్పారు. అతనికి ఆరోగ్య సమస్యలు ఉన్నట్టు వెల్లడి కాలేదని పేర్కొన్నారు. ప్రయాణ సమయంలో.. ఎవరూ అనారోగ్యంతో బాధపడుతున్న సమాచారం లేదని అన్నారు. కరోనా నిర్ధారణ పరీక్షలు చేసిన తర్వాత శర్మ మృతదేహాన్ని అతని కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని పోలీసులు వెల్లడించారు. కాగా, గడిచిన రెండు నెలల్లో దాదాపు 20 లక్షల వలస కార్మికులు సొంత రాష్ట్రం ఉత్తర్‌ప్రదేశ్‌కు చేరుకున్నారు. (చదవండి: 'ఆ ఘటన కలచివేసింది.. నిజంగా దురదృష్టకరం') -
ఆ బాలుడి సంరక్షణ ఎవరు చూస్తారు?
పట్నా : రెండు రోజుల క్రితం బిహార్‌లోని ముజఫర్‌నగర్ రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై తల్లి మృతదేహాన్ని తట్టి లేపేందుకు ప్రయత్నించిన ఒక బాలుడి హృదయ విదారక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. బీహార్‌కు చెందిన అర్బినా ఇన్ఫాత్ వలస కార్మికురాలు. లాక్డౌన్ నేపథ్యంలో ఉపాధి కోసం వలస వెళ్లిన ఆమె తన కొడుకు రహమత్‌తో కలసి గుజరాత్ నుంచి శనివారం శ్రామిక్ రైలులో తిరుగు పయనమైంది. అయితే ఎండ వేడిమితో పాటు వందల కిలోమీటర్లు తిండీ, తిప్పలు లేకపోవడంతో అనారోగ్యానికి గురై రైలులోనే తుది శ్వాస విడిచారు. తాజాగా ఈ వీడియోను పరిగణలోకి తీసుకొని పట్నా హైకోర్టు సుమోటోగా స్వీకరించి గురువారం కేసుపై విచారణ జరిపింది. (హృదయ విదారకం: చనిపోయిన తల్లిని లేపుతూ..) ఈ సందర్భంగా హైకోర్టు స్పందిస్తూ.. 'ఆ ఘటన ఇప్పటికి షాకింగ్‌గా ఉంది.. నిజంగా అలా జరగడం దురదృష్టకరం' అంటూ పేర్కొంది. ఈ సంఘటన తమను తీవ్రంగా కలచివేసిందని ఇకపై ఇలాంటివి జరగకుండా చూడాలంటూ హైకోర్టు రాష్ట్రాన్ని ఆదేశించింది. ఇందులో భాగంగా బీహార్ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించింది. 'చనిపోయిన మహిళ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారా? నిజంగానే అర్బీనా ఆకలితో చనిపొయిందా లేక ఇంకా ఏమైనా కారణముందా? చట్టం అమలు చేసే విధంగా ఏజెన్సీలు ఏం చర్య తీసుకుంటాయి? ఒకవేళ ఆ మహిళకు అంత్యక్రియలు నిర్వహించాల్సి వస్తే ప్రభుత్వ ఆదేశాల మేరకు సంప్రదాయ పద్దతిలో నిర్వహించారా? తల్లి చనిపోవడంతో అనాథగా మారిన ఆ బాలుడి సంరక్షణ ఎవరు చూస్తారు? ' అంటూ హైకోర్టు జడ్జీలు ప్రశ్నల వర్షం కురిపించారు. ('కేసీఆర్‌ను ప్రజలు రాళ్లతో కొట్టే రోజులు వస్తాయి') దీనిపై ప్రభుత్వం తరపున రాష్ట్ర అడిషనల్ అడ్వొకేట్ జనరల్ ఎస్డీ యాదవ్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ..' అర్బినా ఇన్ఫాత్‌ది సహజ మరణమే. సూరత్ నుంచి రైలులో ప్రయాణం చేస్తున్న సమయంలో సమయానికి తిండి లేక ఆమె ఆరోగ్య పరిస్థితి దెబ్బతినడంతోనే మృతి చెందింది. ఈ విషయాన్ని మృతురాలి చెల్లి, ఆమె భర్త స్వయంగా తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే అర్బీనా మృతదేహానికి పోస్టుమార్టమ్ నిర్వహించలేదు. అంతేగాక ఆమె మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు కుటుంబసభ్యులకు అనుమతి కూడా ఇచ్చాము. మృతదేహాన్ని ముజఫర్ రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై విడిచిపెట్టి వెళ్లడంపై అధికారుల వద్ద వివరాలను ఆరా తీశాము. అర్బీనా స్వస్థలం కతిహార్ అని, తన భర్తతో విడిపోయాక చెల్లి ఆమె భర్తతో కలిసి ఉంటుంది. అర్బినాకు మొదట కొడుకు ఒకడే అని పొరబడ్డాం. తరువాత అర్బినాకు ఇద్దరు కొడుకులని రహమాన్‌కు అన్న ఉన్నాడని, అతని పేరు ఫర్మాణ్ అని తెలిసింది. ప్రస్తుతం వారిద్దరిని తామే సంరక్షిస్తామని అర్బినా చెల్లి, ఆమె భర్త పేర్కొన్నారు. అంతేగాక ఈ కేసును మేము ప్రత్యేకంగా తీసుకున్నాం. అర్బినా కుటుంబాన్ని కలవడానికి కొంతమంది అధికారులను పంపించాం. వారికి ఇంకా ఏమైనా అవసరాలు ఉంటే సహాయం చేయాలని నిర్ణయించాం' అంటూ తెలిపారు.(మాజీ సీఎం అజిత్ జోగి కన్నుమూత) ఎస్డీ యాదవ్ వాదనలు విన్న హైకోర్టు జూన్ 3న మరోసారి కేసును పరిశీలిస్తామని పేర్కొన్నారు. అప్పటిలోగా మీరు చెప్పిన ఆధారాలను ప్రత్యేక నివేదిక రూపంలో అందజేయాలని కోరింది. అయితే అర్భినా తండ్రి మహ్మద్ నెహ్రూల్ స్పందిస్తూ.. 'నా కూతురు ఏ వ్యాధితో బాధపడడం లేదని, కానీ ఆమె మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నా' అంటూ ఆవేదనతో తెలిపాడు. -
సోనియా వ్యాఖ్యలను ఖండించిన స్మృతి ఇరానీ
న్యూఢిల్లీ: వలస కూలీల వెతలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అంటూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తీవ్రంగా ఖండించారు. దేశం ఎదుర్కొంటున్న సవాళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ లబ్ధి పొందాలని చూస్తుందంటూ ఆమె ఎదురు దాడికి దిగారు. ఈ సందర్భంగా స్మృతి ఇరానీ మాట్లాడుతూ.. ‘కోవిడ్-19కు వ్యతిరేకంగా దేశం ఐక్యంగా నిలబడాల్సిన సమయంలో ప్రతిపక్షాలు స్వంత ప్రయోజనాలు చూసుకోవడం నిజంగా దురదృష్టకరం. సంక్షోభ సమయంలో సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ నీచ రాజకీయాలకు అద్దం పడుతున్నాయి. కాంగ్రెస్ నాయకులు దేశ ఐక్యతను విచ్ఛినం చేసి.. తాము లబ్ధి పొందాలని చూస్తున్నారు. వారి ప్రయత్నాలు చూస్తే నాకు ఆశ్చర్యంగా ఉంది. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పాలిత ప్రభుత్వాలతో సహా ప్రతి రాష్ట్రానికి కేంద్రం ‘పీఎమ్ గరీబ్ కళ్యాణ్ యోజన’ ద్వారా 1.76 లక్షల కోట్ల రూపాయలు లబ్ది చేకూర్చింది. ఈ పథకం దేశంలోని బలహీన వర్గాలకు అండగా నిలిచింది’ అన్నారు.(వారి ఆవేదన ప్రభుత్వానికి పట్టదు!) ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాలు, జిల్లా అధికారులంతా ఈ సంక్షోభ సమయంలో ఒక్క చోట చేరి కరోనా కట్టడి కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారని స్మృతి ఇరానీ పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో కాంగ్రెస్ పార్టీ, కేంద్రంపై రాజకీయ విమర్శలు చేయడం సిగ్గు చేటు అన్నారు. దేశ నిర్మాణాత్మక అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం దోహదపడదని ఆమె ఆరోపించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నీచ రాజకీయాలు చేయడం మానాలని స్మృతి ఇరానీ సూచించారు. (‘అబ్బాయిలు కూడా తెలుసుకోవాలి’) -
షెల్టర్ హోంలో వలస కూలీ మృతి
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని యమునా స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో వలస కూలీల కోసం ఏర్పాటు చేసిన షెల్టర్ హోంలో ఓ వలస కార్మికుడు గురువారం మరణించారు. వివేక్ విహార్ ప్రాంతంలో ఉన్న ఈ షెల్టర్ హోంలో గత కొద్దిరోజులుగా మృతుడు ఉంటున్నట్టు సమాచారం. కాగా షెల్టర్ హోంలో మరణించిన వ్యక్తి మృతికి కారణాలు తెలియరాలేదు. కరోనా కట్టడికి విధించిన దేశవ్యాప్త లాక్‌డౌన్‌తో వలస కూలీలు, నిరాశ్రయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. పనులు లేక వేలాది మంది వలస కూలీలు రోడ్లపై నడుచుకుంటూ శ్రామిక్ రైళ్ల ద్వారా స్వగ్రామాల బాట పడుతున్నారు. ఇళ్లకు వెళ్లేలోపే మంచినీరు, ఆహారం లభించక పలువురు ప్రాణాలు విడిచిన ఘటనలు చోటుచేసుకున్నాయి. మరోవైపు వలస కూలీలకు ఊరటగా సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రైళ్లు, బస్సుల్లో ప్రయాణించే వలస కూలీల చార్జీలను ప్రభుత్వమే భరించాలని, వారికి ఉచితంగా భోజనం, మంచినీరు సమకూర్చాలని సర్వోన్నత న్యాయస్ధానం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. చదవండి : కార్మికుల రైలు బండికి ‘టైం టేబుల్’ లేదట! -
ముజఫర్‌పూర్ ఘటనపై కేసు నమోదు
న్యూఢిల్లీ: నిన్నంతా సోషల్ మీడియాతో పాటు పలు న్యూస్ చానళ్లు, వెబ్సైట్లలో ఓ వార్త బాగా ప్రచారం అయ్యింది. సరైన ఆహారం, నీరు లేక ఓ మహిళా వలస కూలీ మృతి చెందింది. విషయం తెలియని ఆ అభాగ్యురాలి కుమారుడు తల్లి చీర పట్టుకుని ఆమెను లేపేందుకు ప్రయత్నం చేస్తున్న దృశ్యం ప్రతి ఒక్కరిని కదిలించింది. ఈ నేపథ్యంలో దారుణానికి కారకులైన రైల్వే అధికారులు, బిహార్ ప్రభుత్వం మీద చర్యలు తీసుకోవాలంటూ ఓ లాయర్ జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించాడు. వివరాలు.. బదర్ మహ్మద్ అనే లాయర్ ‘రాజ్యాంగంలోని 21వ ప్రకరణ దేశంలోని ప్రతి ఒక్కరికి జీవించే హక్కుతో పాటు వ్యక్తిగత గౌరవానికి హామీ ఇస్తుంది. అలానే ఆదేశ సూత్రాలు ప్రతి రాష్ట్రం తన పౌరులకు కావాల్సిన కనీస సౌకర్యాలు కల్పించడం ద్వారా వారి సంక్షేమానికి కృషి చేయాలని తెలుపుతున్నాయి. అయితే రైల్వే శాఖ, బిహార్ ప్రభుత్వాలు మాత్రం వీటిని పట్టించుకోలేదు. వలస కూలీలకు అవసరమైన ఆహారం, ఆరోగ్య సేవలు కల్పించడంలో విఫలమయ్యాయి. ఫలితంగా సదరు మహిళ చనిపోయింది. ఈ నేపథ్యంలో మే 25 నాటి ముజఫర్‌పూర్ రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫామ్ సీసీటీవీ ఫుటేజిని స్వాధీనం చేసుకుని ఈ దారుణానికి కారకులైన రైల్వే శాఖ, బిహార్ ప్రభుత్వాల మీద తగిన చర్యలు తీసుకోవాలి. అంతేకాక మృతురాలి కుటుంబానికి తగిన నష్టపరిహారం అందేలా చూడాలి’ అంటూ మానవ హక్కుల కమిషన్‌ను కోరాడుబదర్ మహ్మద్.(వలస కష్టం కాటేసింది పసివాడిని వీడేసింది) -
వారి ఆకలి కేకలు వినపించడం లేదా?
న్యూఢిల్లీ : దేశం మొత్తానికి వలస కార్మికుల కష్టాలు కనిపిస్తుంటే ప్రభుత్వానికి మాత్రం కనిపించడం లేదని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ అన్నారు. నిరుపేదలు, చిరు వ్యాపారులు, వలస కూలీల సహాయార్థం ఏర్పాటు చేసిన 'స్పీక్ అప్ ఇండియా' క్యాంపెయిన్‌లో భాగంగా ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్‌లో గురువారం సోనియా మాట్లాడారు. తినడానికి తిండిలేక కాలిబాటనే స్వస్థలాలకు చేరుకుంటున్న వలస కూలీల బాధలు వర్ణణాతీతం అని పేర్కొన్న సోనియా.. కేంద్రప్రభుత్వం తక్షణమే వారికి సహాయం అందించాలని డిమాండ్ చేశారు. లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన వలస కూలీలకు భరోసానిచ్చే బాధ్యత కేంద్రంపై ఉందని గుర్తుచేశారు. ప్రతి పేద కుటుంబానికి తక్షణ సహాయం కింద 10,000 రూపాయలను అందివ్వాలని, వచ్చే ఆరు నెలల పాటు 7,500 రూపాయలను వారి ఖాతాల్లో జమచేయాలని కోరారు. లాక్డౌన్ కారణంగా పనులు లేక ఆకలితో అలమటిస్తూ.. కిలోమీటర్ల మేర రహదారుల వెంబడి కాలినడకన ప్రయాణిస్తున్న వలసకూలీల ఆకలి కేకలు కేంద్రానికి ఎందుకు వినిపించడం లేదని సూటిగా ప్రశ్నించారు. (‘సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రం తీరు’ ) దేశంలోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులను వారి స్వస్థలాలకు చేర్చేందుకు అవసరమైన రవాణా సదుపాయాలను ఏర్పాటు చేయాలని మంగళవారం సుప్రీంకోర్టు.. కేంద్రాన్నీ, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించిన సంగతి తెలిసిందే. వలస కూలీలకు ఆహారం, ఆశ్రయం ఉచితంగా ఇవ్వాలని సూచించింది. లాక్డౌన్ కారణంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న కార్మికుల సమస్యలపై తనంత తానుగా సుప్రీంకోర్టు స్పందించింది. తదుపరి విచారణను మే28కి వాయిదా వేసింది. (వలస జీవుల కష్టాలు తీర్చండి! ) -
వలస కష్టం కాటేసింది పసివాడిని వీడేసింది
న్యూఢిల్లీ: పాపం పుణ్యం, ప్రపంచమార్గం ఏదీ తెలియని ఓ పసివాడు, రైల్వే ప్లాట్‌ఫాంపై విగతజీవిగా పడివున్న తల్లి శవంపై కప్పిన గుడ్డతో ఆడుకుంటోన్న దృశ్యం సోషల్ మీడియాలో నెటిజన్లను కన్నీళ్ళు పెట్టించింది. బిహార్‌లోని ముజఫర్‌పూర్ ఫ్లాట్‌ఫాంపై ఓ తల్లి మృతదేహంపై కప్పి ఉంచిన వస్త్రంతో ఆడుకుంటూ, తల్లిని నిద్రలేపే యత్నం చేస్తోన్న ఓ పసివాడి దృశ్యం దేశంలో వలసకార్మికుల కష్టాలను కళ్ళకు కట్టింది. ఎంత తట్టినా లేవని తల్లి తన కోసం లేచిరాకపోతుందా..తనను ఒడిచేర్చుకోకపోతుందా అని ఆ పసివాడు పదే పదే తల్లిని లేపేందుకు చేస్తోన్న ప్రయత్నం స్టేషన్‌లోని ప్రయాణికుల హృదయాలను కలచివేసింది. రైళ్ళ రాకపోకలపై మైకులో అనౌన్స్మెంట్ కొనసాగుతుండగా.. తల్లిపై అస్తవ్యస్తంగా కప్పి ఉంచిన వస్త్రంతో అమాయకంగా ఆడుకుంటోన్న ఈ వీడియోని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు సంజయ్ యాదవ్ ట్వీట్ చేయడంతో ఇది వైరల్ అయ్యింది. -
హృదయ విదారకం: చనిపోయిన తల్లిని లేపుతూ..
పట్నా: వలస కార్మికుల వెతలు అన్నీ ఇన్నీకావు. బతువు దెరువు కోసం పట్నం వచ్చినవారిని కరోనా కన్నా ముందు ఆకలి కాటేస్తోంది. రోజుల తరబడి ఆకలి దప్పికలను ఓర్చుకోలేని ఓ వలస కార్మికురాలు ప్రాణాలు విడిచింది. ఆమె శాశ్వతంగా నిద్రపోయిందని తెలియని ఆమె కుమారుడు అమ్మను లేపడానికి ప్రయత్నించాడు. గుండెల్ని పిండేస్తోన్న ఈ వీడియో అందరినీ కంటతడి పెట్టిస్తోంది. బీహార్‌కు చెందిన వలస కార్మికురాలు ఉపాధి కోసం వెళ్లిన గుజరాత్ నుంచి శనివారం శ్రామిక్ రైలులో స్వస్థలానికి తిరుగు పయనమైంది. అయితే ఆ రైలు తన గమ్యం చేరుకోకముందే ఆమె తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. దీంతో ఆమె మృతదేహాన్ని ముజఫర్‌నగర్ స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై ఉంచారు. (సొంత ఊరెళ్లాలని బస్సు చోరీ) అయితే ఆమె కుమారుడికి తల్లి మరణవార్త తెలీక ఆమెను లేపేందుకు ప్రయత్నించాడు. ఆమె ఒంటిపై కప్పిన దుప్పటినీ లాగుతూ తల్లిని లేవమని చెప్పకనే వేడుకున్నాడు. ఈ హృదయ విదారక దృశ్యం ప్రస్తుతం సోషల్ మీడియయాలో చక్కర్లు కొడుతోంది. తిండీ, నీళ్లు లేకే రైలులో అనారోగ్యానికి గురైందని ఆమె బంధువులు పేర్కొంటున్నారు. కాగా ఇలాంటి ఎన్నో దృశ్యాలు నిత్యం వెలుగు చూస్తూనే ఉన్నాయి. గూడు చేరేందుకు బహదూరపు బాటసారులుగా మారిన వలస కార్మికులను రోడ్డు ప్రమాదాలు, ఆకలి కేకలు బలి తీసుకుంటున్నాయి. (నీరింకిన కళ్లు..!) -
కేవలం నీళ్లు తాగి బతుకుతున్నాం : వలస కూలీ
లక్నో : వలస కార్మికుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. తినడానికి తిండి లేక, ఉండటానికి చోటు లేక వారు పడుతున్న బాధలు వర్ణణాతీతం. తాజాగా ఓ కుటుంబం మూడు రోజులుగా కేవలం మంచినీళ్లు తాగి కాలం గడిపారు. వివరాలిలా ఉన్నాయి..ముంబైకి చెందిన ఆశిష్ విశ్వకర్మ భార్య, ఏడాది వయసున్న చిన్నారితో కలిసి పనికోసం ఉత్తరప్రదేశ్‌కి వలస వెళ్లారు. స్వతహాగా వడ్రంగి అయిన ఆశిష్ విశ్మకర్మ ఉత్తరప్రదేశ్ చేరుకున్నాక లాక్డౌన్ ప్రకటించారు. దీంతో చేతిలో పనిలో లేక తినడానికి తిండి లేక తీవ్ర అవస్థలు పడ్డారు. నల్లాసోపారాలో నివాసం ఉండే వీరు ఎలాగైనా స్వస్థలానికి చేరుకోవాలని చాలా ప్రయత్నాలు చేశారు. (9 ఏళ్ల బాలికపై 14 ఏళ్ల బాలుడు అత్యాచారయత్నం, హత్య ) చివరకి ఆరు వేల రూపాయలకి ఓ ట్రక్కులో ముంబై వెళ్లేందుకు ఒప్పందం చేసుకున్నారు. తీరా అక్కడికి చేరుకున్నాక తిరిగి ముంబై వెళ్లారా అసలు ఏం జరిగింది ఆయన మాటల్లోనే.. “ 35 మందితో కలిసి ట్రక్ రాత్రికి బయలుదేరుతుందని చెప్పారు. కానీ తీరా అక్కడికి చేరుకున్నాక 50 మంది ఉన్నారు. అంతేకాకుండా నేను నివాసం ఉంటున్న ప్రాంతంలో కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయని పుకార్లు రావడంతో మమ్మల్ని మధ్యలోనే దించేశారు. తినడానికి తిండి లేదు. నడుచుకుంటూనే జాన్పూర్కి చేరుకున్నాం. మార్గమధ్యంలో ఓపిక నశించి ఏమైనా తిందామంటే హోటళ్లు లేవు. మండే ఎండలో కనీసం చెప్పులు లేకుండా కిలోమీటర్లు ప్రయాణించాం. రోజుల తరబడి మంచి నీళ్లతోనే కడుపునింపుకుంటున్నాం. పని చేద్దామని వస్తే ఇప్పడు సొంతూరు చేరుకోకుండానే ప్రాణం పోతుందేమో అనిపిస్తుంది. సాధారణ రైలు సర్వీసులు ప్రారంభం అవ్వగానే ముంబై వెళ్లిపోతాం. ఈ కరోనా మా జీవితాల్లో చెప్పలేనంత బాధను మిగిల్చింది. ” అంటూ ఆశిష్ కన్నీటిపర్యంతమయ్యాడు. (చచ్చిపడిన గబ్బిలాలు.. స్థానికుల్లో ఆందోళన! ) -
సొంత ఊరెళ్లాలని బస్సు చోరీ
ధర్మవరం అర్బన్: సొంత ఊరెళ్లాలనే తపన ఆ వలస కార్మికుడితో బస్సునే చోరీ చేయించింది. మద్యం మత్తులో బస్సు నడుపుకొంటూ వెళుతున్న అతడిని పోలీసులు నిలువరించి కేసు నమోదు చేశారు. ప్రస్తుతం అతడు అనంతపురం జిల్లా ధర్మవరం అర్బన్ పోలీసుల అదుపులో ఉన్నాడు. ధర్మవరం పరిసరాల్లోని వలస కార్మికులను శుక్రవారం అనంతపురం రైల్వే స్టేషన్ నుంచి శ్రామికరైలులో బెంగళూరు పంపేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. వీరిని రైల్వేస్టేషన్‌కు తీసుకెళుతున్న ధర్మవరం ఆర్టీసీ డిపో బస్సు (ఏపీ02జెడ్ 0552)ను అధికారులు మధ్యలోనే వెనక్కు రప్పించారు. కార్మికుల కోసం మరో బస్సు పంపించారు. దీంతో మధ్యలోనే కార్మికులు బస్సు దిగేశారు. కర్ణాటక రాష్ట్రం విజయపుర గ్రామానికి చెందిన ముజామిల్‌ఖాన్ మద్యం మత్తులో బస్సు వెనక సీట్లో నిద్రపోయాడు. ఎవరూ గమనించకపోవడంతో అతడు ఆ బస్సులోనే ధర్మవరం ఆర్టీసీ గ్యారేజికి వచ్చేశాడు. కొద్దిసేపటికి మెలకువ వచ్చిన అతడు బస్సు ఇంజన్ తాళంచెవి కూడా అక్కడే ఉండటంతో స్టార్ట్‌చేసి బయటకు తీసుకొచ్చేశాడు. బస్టాండ్ బయట ఉన్న డ్రైవర్ వెంకటేశ్ గమనించి డిపో మేనేజరు మల్లికార్జునకు, డయల్ 100కు ఫోన్‌చేసి చెప్పి బైక్‌పై బస్సును వెంబడించారు. బస్సు పెనుకొండ హైవేలో వెళ్తుండగా కియా ఇండస్ట్రియల్ ఏరియా పోలీస్‌స్టేషన్ ఎస్ఐ గణేష్, చెన్నేకొత్తపల్లి ఎస్ఐ రమేష్ రోడ్డుకు అడ్డంగా లారీ కంటైనర్‌ను పెట్టి బస్సును ఆపి ముజామిల్‌ఖాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడితో పాటు బస్సును ధర్మవరం అర్బన్ పోలీసులకు అప్పగించారు. -
కాగజ్‌నగర్‌లో వలస కార్మికుడి ఆత్మహత్య
కాగజ్‌నగర్‌టౌన్: కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లోని సిర్పూర్ పేపర్ మిల్లులో కాంట్రాక్టు కార్మికుడిగా పనిచేస్తున్న వలస కార్మికుడు గురువారం ఉదయం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉత్తరప్రదేశ్ వారణాసి జిల్లా సోలాపూర్ తాలూకా ధాన్గంజ్ ప్రాంతానికి చెందిన వికాస్ చౌహాన్ (21), కొంతమంది అక్కడి యువకులతో కలిసి జనవరిలో గుజరాత్‌కు చెందిన అవినాష్ అనే కాంట్రాక్టర్ ఆధ్వర్యంలో స్థానిక సిర్పూర్ పేపర్ మిల్లులో కాంట్రాక్టు కార్మికుడి (కూలి)గా చేరాడు. కాంట్రాక్టు కార్మికులకు మిల్లు యాజమాన్యం స్థానిక ఓల్డ్ కాలనీలోగల కంపెనీకి సంబంధించిన డి టైప్ క్వార్టర్ కేటాయించింది. అందులో వికాస్‌తోపాటు ఐదు గురు కార్మికులు నివాసముంటున్నారు. లాక్డౌన్ అమలుతో వీరంతా ఇక్కడే చిక్కుకున్నారు. మిల్లు యాజమాన్యం, కాంట్రాక్టర్ కార్మికులకు ఆహార సామగ్రి అందిస్తున్నా.. ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. ఉపాధి లేక 15 రోజులుగా వికాస్ చౌహాన్ సొంతూరుకు వెళ్లడానికి ప్రయత్నాలు చేశాడు. శ్రామిక్ రైలు ద్వారా వారణాసి వెళ్లేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో మనస్తాపానికి గురైన ఆయన క్వార్టర్‌లోనే గురువారం ఉరేసుకున్నాడు. తోటి కార్మికుడు పోలీసులకు సమాచారం అందించారు. వికాస్ చౌహాన్‌ను ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. వికాస్ చౌహాన్ మృతదేహం -
ఆకలి కేకలు: కుక్క కళేబరమే ఆహారం
జైపూర్: ఆకలి.. ఆకలి.. ఆకలి.. ఎన్నిసార్లు రోదించాడో, ఎందరిని వేడుకున్నాడో. కనికరం లేని విధి, జాలి చూపని సమాజం అతని పాలిట శాపంగా మారాయి. ఆకలి తీర్చే నాథుడు లేక, క్షణక్షణానికి కడుపులో పేగులు మాడిపోతుంటే కళ్ల ముందు కనిపించిన కుక్కే ఆహారంగా తోచింది. చచ్చి, పేగులు ఊడి, కళేబరం మిగిలి ఉన్న కుక్క శవాన్ని గత్యంతరం లేని పరిస్థితుల్లో విందుగా ఆరగించాడు. సభ్య సమాజం తలదించుకునే ఈ హృదయ విదారక ఘటన బుధవారం రాజస్థాన్‌లో జరిగింది. వలస కార్మికులు రోడ్ల వెంబడి మండుటెండలో పిల్లాజెల్లాను ఓవైపు, సామానో వైపు మోస్తూ స్వస్థలాలకు చేరేందుకు బహుదూరపు బాటసారులుగా మారుతున్నారు. (ఎప్పుడు ప్రాణం పోతుందో తెలీదు..!) ఈ క్రమంలో గమ్యం చేరేలోపు తనువు చాలించిన వాళ్లు కొందరు. దహిస్తున్న ఆకలితో మధ్యలోనే ప్రాణాలు వదిలిన వాళ్లు మరికొందరు. తాజాగా ఢిల్లీ-జైపూర్ జాతీయ రహదారిపై ఓ వలస కార్మికుడు ఆకలితో అలమటించిపోయాడు. గుప్పెడు మెతుకులు తినక ఎన్నాళ్లయ్యిందో.., కళ్లెదురుగా రోడ్డు మీద పడి ఉన్న కుక్క శవాన్ని భుజించాడు. దీన్ని అటుగా వెళ్తున్న ప్రధుమన్ సింగ్ నరుక అనే ప్రయాణికుడు వీడియో తీశాడు. అతని పరిస్థితిని అర్థం చేసుకున్న ప్రధుమన్ అతడికి కాసింత భోజనం అందించడంతో పాటు డబ్బులు కూడా ఇచ్చాడు. దీన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అందరినీ కంటతడి పెట్టిస్తోంది. (వలస కూలీల దుస్థితి జాతి క్షేమానికి ప్రమాదం) Person witnesses a man purportedly eating dead dog's meat he found on road. Helps him by offering food.#Hunger #MigrantWorkers #MigrantsOnTheRoad #migrants pic.twitter.com/51LpXQ7qUj — The Rational Daily (@RationalDaily) May 19, 2020 -
రామ్‌పుకార్ కథ సుఖాంతం
న్యూఢిల్లీ: బిహార్‌కు చెందిన వలసజీవి రామ్‌పుకార్ పండిట్(38) కథ సుఖాంతమైంది. ఢిల్లీలో నిర్మాణ రంగ కార్మికుడిగా పొట్టపోసుకుంటున్న ఇతడు.. కొడుకు మృత్యు ఒడిలో ఉన్నాడని తెలిసి ఢిల్లీ నుంచి 1,200 కి.మీ.ల దూరంలోని సొంతూరుకు కాలినడకన బయల్దేరడం, లాక్డౌన్ కారణంగా పోలీసులు అడ్డుకోవడం తెల్సిందే. తన వేదనను బంధువుకు ఫోన్లో మొరపెట్టుకుంటూ రోదిస్తున్న ఫొటో సమాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో దాతలు స్పందించి సాయం చేశారు. దీంతో శ్రామిక్ రైలులో సొంతూరు బిహార్‌లోని బెగూసరాయ్‌కు చేరుకున్నాడు. బలహీనంగా ఉన్న రామ్‌ను అధికారులు ఆస్పత్రిలో చేర్చారు. విషయం తెల్సి భార్య, కూతురు(9) ఎట్టకేలకు ఆదివారం ఆయను ఆస్పత్రిలో కలుసుకున్నారు. చదవండి: ప్రతీ లక్షకు 7.1 కరోనా కేసులు చదవండి: కర్ణాటకలో వారికి నో ఎంట్రీ -
ఎంత కష్టం: కావడిలో కన్నబిడ్డలను మోస్తూ
ఆనాడు శ్రవణుడు తల్లిదండ్రుల సంతోషం కోసం వారిని కావడిలో మోసుకుంటూ రాజ్యాలు తిరిగాడు. కానీ ఈనాడు వలస కార్మికుడు తన పిల్లలను దుఃఖం నుంచి తప్పించేందుకు వారిని కష్టాల కావడిలో మోసుకుంటూ మండుటెండలో, కాలినడకన స్వస్థలానికి పయనమయ్యాడు. ఈ విషాద ఘటన ఒడిశాలో చోటు చేసుకుంది. ఒడిశాలోని మయూర్‌భంజ్‌కు చెందిన రుపయ తుడు అనే గిరిజన కూలీ బతుకుదెరువును వెతుక్కుంటూ జైపూర్‌కు వెళ్లాడు. లాక్డౌన్ వల్ల అతను ఉండేచోట పని ఆగిపోగా అప్పటివరకు చేసిన శ్రమకు కూడా యజమాని చిల్లిగవ్వ చెల్లించలేదు. దీంతో నాటి నుంచి అక్కడే పని లేక పస్తులుంటున్నాడు. ఆకలితో ఊరు కాని ఊరులో చావడం ఇష్టం లేక స్వస్థలానికి పయనమయ్యాడు. తన భార్య మాత్రిక, ఆరేళ్ల కూతురు పుష్పాంజలి నడవగలరు. కానీ నాలుగు, రెండున్నరేళ్లు ఉన్న మరో ఇద్దరు పిల్లలు అంతదూరం ఎలా నడవగలరని ఆలోచనలో పడ్డాడు. దీంతో కావడిలో తన ఇద్దరు పిల్లలను ఓవైపు, సామన్లన్నీ మరోవైపు పెట్టుకుని దాన్ని భుజానికెత్తుకున్నాడు. అలా 160 కి.మీ. కాలినడకన ప్రయాణించి శుక్రవారం నాటికి ఇల్లు చేరుకున్నాడు. (ఉండలేము.. వెళ్లలేము!) ఈ విషయం గురించి రుపయ తుడు మాట్లాడుతూ... "నా దగ్గర తగినంతగా డబ్బు లేదు. అందువల్ల కాళ్లను నమ్ముకుని, నడుస్తూ ఇంటికెళ్లాం. ఏడు రోజులు నడక తర్వాత శుక్రవారం సాయంత్రం ఇంటికి చేరుకున్నాం. కొన్నిసార్లు ఎంతో కష్టంగా అనిపించింది కానీ తప్పదు కదా!" అని చెప్పుకొచ్చాడు. ఒడిశా ప్రభుత్వం నిబంధనల ప్రకారం అతడు ముందుగా 21 రోజులపాటు క్వారంటైన్ కేంద్రంలో, తర్వాతి ఏడు రోజులు ఇంటి నిర్బంధంలో ఉండాలి. ప్రస్తుతం అతడితోపాటు, కుటుంబ సభ్యులను గ్రామంలోని క్వారంటైన్ కేంద్రంలో ఉంచారు. కానీ అక్కడ ఎలాంటి ఆహార సదుపాయం లేదు. ఈ విషయం దృష్టికి వచ్చిన బీజేపీ అధికారి దెబశీష్ మోహంతి వెంటనే సదరు క్వారంటైన్లో ఉన్న రుపయ తుడు కుటుంబ సభ్యులతో పాటు, మిగతా కూలీలకు ఆహారాన్ని అందించారు. (మమ్మల్ని పట్టించుకోవడం లేదు..) -
నీరింకిన కళ్లు..!
కొడుకు చావుబతుకుల మధ్య ఉన్నాడని తెలిసి రోదిస్తున్న ఈ వలసకార్మికుని పేరు రామ్‌పుకార్ పండిట్. బిహార్‌లోని బెగూసరాయ్ ఈయన సొంతూరు. కొడుకును చూసేందుకు 1,200 కి.మీ.ల దూరమున్న సొంతూరుకు కాలినడకన బయల్దేరగా ఢిల్లీ సరిహద్దుల్లోని ఓ బ్రిడ్జిపై పోలీసులు ఆపేశారు. ఆకలిదప్పులకు సహిస్తూ మూడ్రోజులపాటు అక్కడే ఉండిపోయాడు. కొడుకు ఆఖరి చూపునకు నోచుకోకుండానే చనిపోయినట్లు తెలిసింది. వలస కార్మికుల వేదనకు అద్దంపడుతున్న ఇటీవలి ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. -
అయ్యో పాపం ఆ తండ్రి బాధ ఎవరికి రాకూడదు!
లక్నో: కరోనా కారణంగా ప్రతి ఒక్కరు అనేక కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే ఉపాధి కోల్పొయి ఆహారం దొరకక వలసకార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలి నడక సొంత ఊర్లకు బయలుదేరి మధ్యలో ప్రమాదాలకు గురయ్యి ప్రాణాలు కోల్పొతున్న దయనీయ పరిస్థితులను మనం చూస్తున్నాం. అంతకన్నా దయనీయమైన పరిస్థితి ఒకటి బీహార్‌లో చోటుచేసుకుంది. సంవత్సరం వయసున్న కొడుకు చనిపోతే కరోనా కారణంగా ఆ బిడ్డను చివరి చూపు చూడటానికి కూడా ఆ తండ్రి నోచుకోలేకపోయాడు. తన బిడ్డని కడసారయిన చూసుకోవాలని ఆశపడిన ఆ తండ్రికి నిరాశే మిగిలింది. ఆ తండ్రి తన బిడ్డని చూడలేక కంటతడి పెట్టుకుంటున్న ఫోటో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. రామ్ పుకార్ పండిట్(38) దశాబ్ధం నుంచి ఢిల్లీలో రోజు వారీ కూలీ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. రెండు మూడు నెలలకు ఒకసారి బీహార్‌లో ఉన్న తన కుటుంబం దగ్గరకు వెళ్లి చూసి వస్తుంటాడు. కరోనా కారణంగా ఢిల్లీలోనే చిక్కుకుపోయిన అతనికి సోమవారం యేడాది వయసున్న తన కుమారుడు చనిపోయాడని తన భార్య దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. అంతే తన బిడ్డను కడసారయిన కళ్లారా చూసుకుందాం అని హుటా హుటిన బయలు దేరాడు. బస్సులు, రైళ్లు ఏవి అందుబాటులో లేకపోవడంతో నడుచుకుంటూనే తన ప్రయాణాన్ని మొదలు పెట్టాడు. అయితే ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ వద్ద పోలీసులు అతనిని అడ్డుకున్నారు. తన కొడుకును చూడటానికి వెళ్లనివ్వాలంటూ అతను పోలీసులను వేడుకున్నాడు. అయిన పోలీసులు అతనిని విడిచిపెట్టలేదు. ఘాజీపూర్ ప్లైఓవర్ దగ్గరే అతను మూడు రోజులు ఉండిపోవాల్సి వచ్చింది. తాను ఎంత చెప్పినా పోలీసులు తన మాట వినిపించుకోలేదని పండిట్ ఆరోపిస్తున్నారు. అయితే కొంత మంది ఎన్జీఓలు, పోలీసులు తనకి అహారం అందించారని తెలిపాడు. ('తినడానికి తిండి లేదు.. నడిచేందుకు ఓపిక లేదు') గురువారం రోజు అతనిని కొంత మంది అధికారులు ఢిల్లీ రైల్వే స్టేషన్లో బీహార్ వెళ్లే ట్రైన్ ఎక్కించారు. అతడు తన గ్రామం బెగుసారై చేరుకోగానే అతనిని కోవిడ్-19 పరీక్షల కోసం తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ ‘నేను నా కుటుంబాన్ని తొందరలోనే కలుసుకుంటా అనుకుంటున్నాను. నేను సరిహద్దు దగ్గర ఎదుర్కొన్న ఘర్షణ కంటే నేను లేకుండా నా కొడుకు అంత్యక్రియలు నా కుటుంబమే నిర్వహించడం నాకు బాధగా ఉంది. నేను ఇంకెప్పటకీ నా కొడుకును చూడలేను’ అని పండిట్ కన్నీటి పర్యంతమవుతుంటే అక్కడ ఉన్నవారందరి మనసులు బాధతో బరువెక్కిపోయాయి. తన కొడుకు స్టమక్ ఇన్ఫ్ఫెక్షన్తో చనిపోయినట్లు రామ్ పండిట్ తెలిపారు. (యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం: 24 మంది మృతి) ఈ విషయం పై ఘజియాబాద్ పోలీసులు మాట్లాడుతూ దీనికి సంబంధించి వారికి ఎలాంటి సమాచారం అందలేదని తెలిపారు. ఇక తూర్పు ఢిల్లీ మేజిస్టేట్ అరుణ్‌కుమార్ మిశ్రా మాట్లాడుతూ... ‘మా బృందం ఇలాంటి వారిని వెతికి వారికి ఆహారాన్ని అందిస్తోంది. మాకు పండిట్ గురించి తెలియగానే మేం అతనిని ఢీల్లీలో బీహార్ వెళ్లే రైలు ఎక్కించాం’ అని తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న ప్రతి ఒక్కరూ పండిట్ పరిస్థితి చూసి అయ్యో పాపం అంటున్నారు. ('పర్యావరణం కాపాడేవారైతే అక్కడెందుకున్నారు') -
కరోనా మృత్యుపాశం: కార్మికుడు బలి
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ మహమ్మారి కారణంగా విధించిన లాక్డౌన్ కార్మికుల పాలిట మృత్యు పాశమవుతోంది. తాజాగా మరో విషాధ గాథ వెలుగు చూసింది. బిహార్‌కు చెందిన వలసకార్మికుడు సఘీర్ అన్సారీ(26) ఢిల్లీ నుంచి బిహార్‌లోని తన స్వస్థలమైన తూర్పు చంపారన్‌కు వెళ్లిపోవాలని నిశ్చయించుకున్నాడు. ఎలాగైనా సొంత ఊరికి చేరుకోవాలనే తపనతో 1000 కిలోమీటర్ల దూరాన్ని సైతం సైకిల్‌పై గెలవాలని నిర్ణయించుకున్నాడు. కానీ మధ్యలోనే మృత్యువు మింగేస్తుందని ఊహించ లేకపోయాడు. కరోనావైరస్ లాక్డౌన్ కారణంగా పని దొరకక పోవడంతో తన సహచరులు ఏడుగురితో కలిసి మే 5న తన ప్రయాణాన్ని మొదలు పెట్టాడు అన్సారీ. అయిదురోజుల తరువాత సగం దూరం లక్నో చేరుకున్నారు. శనివారం ఉదయం 10 గంటలకు అల్పాహారం (అటుకులు) తినేందుకు రోడ్డు పక్కన ఆగారు. ఇంతలో అతివేగంతో వచ్చిన ఓ కారు వీరిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సఘీర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. అయితే అక్కడ వున్న ఒక చెట్టు ఇతరులను రక్షించింది. మొదట కొంత డబ్బు ముట్టజెప్పేందుకు బేరాలాడిన కారు డ్రైవరు ఆ తరువాత నిరాకరించి అక్కడినుంచి ఉడాయించాడు. స్థానికఎన్జీవోసహాయంతో సఘీర్ అన్సారీ మృతదేహాన్ని అంబులెన్స్ ద్వారా ఇంటికి తరలించారు అతడి స్నేహితులు. బాధితునికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. గుర్తు తెలియని కారు డ్రైవర్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దేశవ్యాప్త లాక్డౌన్ పరిస్థితి ఉపాధిని దెబ్బతీయడంతో లక్షలాది మంది వలస కార్మికులు ఇబ్బందుల్లో చిక్కుకుపోయారు. వీరిని స్వగ్రామాలకు చేర్చేందుకు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినప్పటికీ, వేలాదిమంది ఇప్పటికీ సైకిళ్లపైనో, కాలిబాటనో ఇళ్లకు చేరేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో మార్గం మధ్యలో ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నఘటనలు నమోదవుతున్నాయి. ఇటీవల ఛత్తీస్‌గడ్‌కు చెందిన భార్యాభర్తలు రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఇద్దరు చిన్నారులు అనాధలుగా మారారు. అలాగే మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో రైల్వే ట్రాక్ ఘటనలో16 మంది వలస కార్మికులు మరణించిన ఘటనలు తీవ్ర విషాదాన్ని నింపాయి. -
శ్రామిక్ రైలులో ఆగిన గుండె
లక్నో: వలస కార్మికులతో వెళుతున్న శ్రామిక్ ప్రత్యేక రైలులో మృతదేహం వెలుగు చూసిన ఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటు చేసుకుంది. రైల్వే శాఖ ఎస్పీ సుమిత్రా యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం.. బతుకు దెరువు కోసం వచ్చి చిక్కుకుపోయిన వలస కూలీలను స్వస్థలాలకు చేర్చేందుకు శనివారం సాయంత్రం గుజరాత్‌లోని ధోలా ప్రాంతం నుంచి శ్రామిక్ రైలు లక్నోకు బయలు దేరింది. ముందుగా అందరికీ పరీక్షలు చేసిన తర్వాతే ప్రయాణానికి అనుమతించారు. అయితే రైలు లక్నోకు చేరిన తర్వాత వలస కూలీలందరూ దిగి వెళ్లిపోగా ముప్పై యేళ్ల వ్యక్తి మాత్రం అందులోనే ఉండిపోయాడు. (సీతమ్మ కష్టం తీరింది) అతడు అచేతన స్థితిలో ఉండటం గమనించిన అధికారులు వెంటనే బలరాంపూర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అతడు అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. మృతుడిని యూపీలోని సీతాపూర్ జిల్లాకు చెందిన కన్హయ్యగా గుర్తించారు. అతడి మరణవార్తను కుటుంబ సభ్యులకు చేరవేయగా నేడు ఆసుపత్రికి చేరుకుని మృతదేహాన్ని తీసుకెళ్లనున్నారు. దీనిపై ఎస్పీ సుమిత్రా యాదవ్ మాట్లాడుతూ అతని ఆరోగ్య పరిస్థితి తోటి కార్మికులెవరూ సమాచారం ఇవ్వలేదని తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. (స్వస్థలాలకు పంపండి.. మహాప్రభో!) -
కర్ణాటక నుంచి నడిచివస్తున్న మహిళకు సాయం
చంకన బిడ్డ.. కడుపున నలుసు.. పొట్టకూటి కోసం పొరుగు ప్రాంతం వెళ్లిందా మహిళ.. అంతలోనే కరోనా మహమ్మారి కసిరింది ఉన్న ప్రాంతం వదిలి సొంతూరికి బయల్దేరింది.. బండ్లు తిరగలేదు.. బస్సులు కదలలేదు నెత్తిన భగభగ మండే ఎండ నిప్పుల కొలిమిలా కాలుతున్న నేల భుజాన బిడ్డను ఎత్తుకొని ఆకలి ఎరుగక.. కాలినడకన వడివడిగా అడుగులు వేస్తూ.. స్వగ్రామానికి పయనమైంది దారిపొడవునా కష్టాలే.. ఆ అమ్మను చూసి ‘అయ్యో..’ అనడమే అందరి వంతైది.. అష్టకష్టాలతో అనంత చేరుకోగా.. అధికారి పద్మావతమ్మ సాయంగా నిలిచారుపోలీసుల సాయంతో సొంతూరికి సాగనంపేందుకు ఏర్పాట్లు చేసింది. సాక్షి, మర్రిపూడి: ఉపాధి కోసం పొరుగు రాష్ట్రం కర్ణాటకకు వలస వెళ్లిన ఓ కుటుంబం లాక్డౌన్ నేపథ్యంలో పనుల్లేక స్వగ్రామానికి కాలినడకన బయలుదేరింది. ఆ కుటుంబంలోని మహిళ నిండు గర్భిణి కావడంతో ఆపసోపాలు పడుతూ సుమారు 150 కిలోమీటర్లు నడిచి ఆంధ్రాలో ప్రవేశించిన తర్వాత.. అనంతపురం జిల్లా అధికారులు ఆ కుటుంబానికి అండగా నిలిచి.. స్వగ్రామానికి తరలించారు. రాష్ట్ర అధికారుల ఔదార్యానికి ఆ కుటుంబం ఎంతో ఆనందం వ్యక్తం చేస్తోంది. వివరాలు ఇలా ఉన్నాయి.. ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలంలోని చిమట దళితవాడకు చెందిన కొమ్ము కృపానందం, సలోమి దంపతులకు ముగ్గురు సంతానం. ప్రస్తుతం సలోమి 8 నెలల గర్భిణి. చిమట గ్రామంలో కూలీ పనులు దొరక్క.. బేల్దారీ మేస్త్రీ వద్ద పనులు చేయడానికి ఈ ఏడాది ఫిబ్రవరిలో కర్ణాటకలోని బళ్లారి వద్ద గల చెలికేరికి వెళ్లారు. తమతో పాటు మూడేళ్ల చిన్న కుమారుడిని తీసుకెళ్లారు. లాక్డౌన్ విధించాక బేల్దారీ మేస్త్రీ డబ్బులు ఇవ్వలేదు. దీంతో కుటుంబం గడవడం కష్టంగా మారింది. మరో ముగ్గురుతో కలసి కృపానందం దంపతులు ఈ నెల ఒకటిన కాలినడకన స్వగ్రామానికి బయలుదేరారు. రెండ్రోజుల అనంతరం వారు అనంతపురం జిల్లాలో ప్రవేశించారు. చేతిలో చిల్లిగవ్వలేదు. తెచ్చుకున్న తిండి అయిపోయిన తరుణంలో అనంతపురం జిల్లా సీటీవో కార్యాలయంలో అధికారి పద్మావతమ్మ ఆ కుటుంబ పడుతున్న అవస్థలను గుర్తించి ఆదుకున్నారు. వారికి భోజనం పెట్టించారు. వైద్య పరీక్షలు చేయించి, కలెక్టర్, ఎస్పీల వద్ద నుంచి తరలింపునకు అనుమతి పత్రాలు తీసుకున్నారు. ఆ కుటుంబాన్ని ఆదివారం కారులో స్వగ్రామం చిమటకు తరలించారు. బతిమాలినా బండ్లు ఆపలేదు: సలోమి నడిచి వచ్చేటప్పుడు ఎంతో మందిని బతిమలాడాను. అయినా ఎవరూ వాహనాలు ఆపలేదు. నడిచి వచ్చేటప్పుడు నా బిడ్డను చూసి కనికరించి కొందరు పండ్లు, తినుబండారాలు ఇచ్చారు. చెప్పులు సైతం తెగిపోయాయి. అనంతపురంలో ప్రభుత్వ అధికారి పద్మావతమ్మ భోజనం పెట్టించి వైద్యపరీక్షలు చేయించి కారు మాట్లాడి మా ఇంటికి పంపించారు. ఆవిడకు ప్రత్యేక ధన్యవాదాలు. కంట తడిపెట్టించింది.. కృపానందం కరోనా నేపథ్యంలో మమ్మల్ని కర్ణాటక రాష్ట్రం తీసుకెళ్లిన మేస్త్రీ మాకు కూలి డబ్బులు ఇవ్వలేదు. చేతిలో చిల్లి గవ్వలేక జీవనం కష్టంగా మారింది. నడిచి ఇంటికి వెళ్లాలనుకుని ఈ నెల ఒకటో తేదీన బయలు దేరాం. 8 నెలల నిండు గర్భిణి అయిన నా భార్య సలోమి మాతో నడవడం నాకు బాధేసింది. పైగా మూడు ఏళ్ల వయసున్న నా మూడో కుమారుడు జైపాల్‌ను ఎత్తుకుని నడవడం మరీ కష్టం అయిపోయింది. -
మృతురాలికి ‘ఠాగూర్’ తరహాలో చికిత్స
సాక్షి, చెన్నై: నగర శివారులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిపై ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వలస కార్మికులు తీవ్ర ఆరోపణలు చేశారు. మరణించిన మహిళకు ఠాకూర్ చిత్రం తరహాలో చికిత్స అందించి, చికిత్సకు తగ్గ ఫీజుల్ని కట్టించుకున్నారని ఆరోపించారు. అంతేకాకుండా ఓ కాంగ్రెస్ ప్రముఖుడు రంగంలోకి దిగి పంచాయితీ పెట్టే పరిస్థితి నెలకొంది. ఆదివారం వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలు..... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరం, శ్రీకాకుళం పరిసరాలకు చెందిన వలస కూలీలు అనేక మంది పళ్లికరణై – పెరుంబాక్కం మార్గంలో ఉన్నారు. వీరంతా భవన నిర్మాణ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. నిర్మాణాలు జరిగే ప్రాంతాలే వీరికి ఆశ్రయంగా మారింది. ఈ పరిస్థితుల్లో లాక్డౌన్ కష్టాల్ని ఎదుర్కొంటున్న ఈ కూలీల్లో ఓ కుటుంబం రెండు రోజుల నుంచి తీవ్ర మనో వేదనలో మునిగింది. ఈ ప్రాంతానికి చెందిన వెంకటరావు భార్య సుజాత హఠాత్తుగా స్పృహ తప్పింది. అపస్మారక స్థితిలోకి ఆమె వెళ్లడంతో ఆందోళన చెందిన వలస కూలీలు చేసేది లేక సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. లాక్డౌన్ వేళ వైద్య సేవలు కష్టమేనని పేర్కొన్న ఆస్పత్రి వర్గాలు చివరకు రూ. 40 వేలు చెల్లిస్తే అడ్మిట్ చేసుకుంటామని సలహా ఇచ్చినట్టు సమాచారం. లక్షా 24 వేలు బిల్లు.. కడుపు మాడ్చుకుని రేయింబవళ్లు కూలి నాలి చేసుకుని సంపాదించిన మొత్తంలో తమ వద్ద ఉన్న రూ. 35 వేలు చెల్లించి సుజాతను ఆస్పత్రిలో చేర్చారు. ఠాకూర్ సినిమా తరహాలో చికిత్స సుజాతకు సాగినట్టు సమాచారం. రూ.60 వేలుకు మందులు, మాత్రులు, స్కానింగ్‌లు, ఇతర వెద్యపరికరాల బిల్లు వెంకట్రావు చేతికి చేరింది. అయితే, తన వద్ద అంత మొత్తం లేదని ఆస్పత్రి వర్గాల వద్ద వెంకట్రావు ఆందోళన వ్యక్తం చేశాడు. ఉదయాన్నే గవర్నమెంట్ ఆస్పత్రికి తీసుకెళ్తామని, అంత వరకు చికిత్స అందించాలని వేడుకున్నాడు. అంగీకరించిన ఆస్పత్రి వర్గాలు మరుసటి రోజు సుజాత మరణించినట్టు, రూ.లక్షా 24 వేలు చెల్లించి మృతదేహాన్ని తీసుకెళ్లాలని వెంకట్రావుకు సలహా ఇచ్చాయి. అయితే తన భార్యకు రాత్రంతా ఏం చికిత్స చేశారంటూ వెంకట్రావు నిలదీశాడు. ఠాకూర్ సినిమా ఘటనను గుర్తు చేసుకుని ఆస్పత్రి వర్గాలపై వలస కూలీలు విరుచుకు పడ్డాయి. ఇక, చేసేది లేఖ ఆంధ్రాలో ఉన్న బంధువుల ద్వారా ఓ కాంగ్రెస్ నాయకుడిని వెంకట్రావు సంప్రదించినట్టున్నారు. ఆయన ఇక్కడున్న కాంగ్రెస్ నాయకుడికి చెప్పడంతో శనివారం వ్యవహారం మీడియా దృష్టి చేరింది. దీంతో మీడియాలో రచ్చ మొదలు కావడం, కాంగ్రెస్ నాయకుడు పంచాయితీ వెరసి రూ.50 వేలు చెల్లించి మృతదేహాన్ని తీసుకెళ్లాలని ఆస్పత్రి వర్గాలు సలహా ఇవ్వడం గమనార్హం. చివరకు 30 వేలు ఇచ్చి మృతదేహాన్ని తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఈ వలస కూలీలకు ఏర్పడింది. అయితే, మీడియాలో వ్యవహారం రచ్చకెక్కడంతో ఆస్పత్రి వర్గాలు హెల్త్ బులిటెన్ విడుదల చేశాయి. ఆమెను 11.30 గంటలకు ఆస్పత్రికి తీసుకొచ్చారని, 12.30 గంటలకు తొలిసారిగా గుండె పోటు వచ్చినట్టు, మళ్లీ..మళ్లీ గుండె పోటు రావడంతో 3.30 గంటలకు మరణించినట్టు వివరించారు. ఆస్పత్రి బిల్లు చెల్లించకుండా ఎగ్గొట్టేందుకు తమపై నిందలు వేస్తున్నారని ఆ బులిటెన్‌లో ఆస్పత్రి వర్గాలు వివరించి చేతులు దులుపుకున్నాయి. -
లాక్డౌన్: నాలుక కోసుకున్న కార్మికుడు
గాంధీనగర్: లాక్డౌన్ వల్ల ఇంటికి వెళ్లలేకపోయిన ఓ కార్మికుడు మనస్థాపంతో తన నాలుక కోసుకున్నాడు. ఈ దిగ్భ్రాంతికర ఘటన శనివారం గుజరాత్లో చోటుచేసుకుంది. వివరాలు.. మధ్యప్రదేశ్‌కు చెందిన వివేక్ శర్మ శిల్పాలు చెక్కుతుంటాడు. ఈ క్రమంలో అతను ప్రస్తుతం గుజరాత్‌లోని బనస్కంత జిల్లాలోని నాదేశ్వరి మాతాజీ ఆలయంలో పని చేస్తున్నాడు. లాక్డౌన్ వల్ల ఇంటికి వెళ్లడానికి ఏ దారి లేకపోవడంతో అతను ఇంటిపై బెంగ పెట్టుకున్నాడు. దీంతో శనివారం నాడు ఆలయం ఎదుట నాలుక కోసుకున్నాడు. అపస్మారక స్థితిలో, రక్తపు మడుగులో పడి ఉన్న అతడిని బీఎస్ఎఫ్ బలగాలు గుర్తించి ఆసుపత్రికి తరలించారు. కరోనా వైరస్ తనకూ సోకుతుందన్న భయంతో ఈ పని చేసుంటాడని కొందరు అనుమానిస్తుండగా, మరికొందరు మాత్రం దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి నాలుకను బలి ఇచ్చి ఉంటాడని భావిస్తున్నారు. (వధూవరుల అరెస్ట్) -
ఉపాధి వేటలో ఓడిన నిరుపేద
బాయికాడి శివకుమార్, నవాబ్‌పేట (వికారాబాద్ జిల్లా): బతుకుదెరువు కోసం దుబాయికి వెళ్లిన వ్యక్తి ఉపాధి వేటలో అక్కడే తుదిశ్వాస విడిచాడు. కుటుంబ పెద్ద మృతిచెందడంతో ఆ కుటుంబం దిక్కులేనిదైంది. వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలంలోని ఎత్రాజ్పల్లి గ్రామానికి చెందిన మల్గారి అనంత్‌రెడ్డికి భార్య బిచ్చమ్మతో పాటు ఇద్దరు కుమారులు, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. అనంత్‌రెడ్డికి పెద్దగా ఆస్తులు లేకపోవడంతో పెద్ద కొడుకు మల్రెడ్డి వేరే ఊరికి ఇళ్లరికం వెళ్లాడు. కాగా, అనంత్‌రెడ్డి పదేళ్ల క్రితం అనారోగ్యంతో మృతిచెందాడు. అప్పటి వరకు పదో తరగతి వరకు చదివి ఖాళీగా ఉన్న చిన్న కుమారుడు పాండురంగారెడ్డిపై కుటుంబ భారం పడింది. అయితే, గల్ఫ్ దేశాలకు వెళ్లి మెరుగైన ఉపాధి పొందాలని భావించిన పాండురంగారెడ్డి తెలిసిన వారి సహాయంతో 2004లో దుబాయికి వెళ్లాడు. అక్కడ కొన్ని రోజులు ఉండి 2007లో తిరిగి ఇంటికి వచ్చి హోటల్ పెట్టుకున్నాడు. 2010లో వివాహం చేసుకున్నాడు. హోటల్ వ్యాపారంలో నష్టం రావడంతో అప్పుల పాలయ్యాడు. దాంతో హోటల్ మూసివేశాడు. ఆ తర్వాత 8 గేదెలను కొనుగోలు చేసి పాల వ్యాపారం ప్రారంభించాడు. అది కూడా అతనికి కలిసి రాలేదు. పెట్టుబడులు కూడా చేతికి రాకపోవడంతో మరింత అప్పుల పాలయ్యాడు. అప్పులు తీర్చే మార్గం కనిపించక ఉన్న ఎకరంన్నర పొలాన్ని అమ్మి కొంత మేరకు అప్పులు చెల్లించాడు. అనంతరం కొంత డబ్బు కట్టి రెండు డీసీఎం వ్యాన్లను ఫైనాన్స్‌లో కొనుగోలు చేశాడు. ఆ వాహనాలను సరుకు రవాణా కిరాయిలకు నడిపాడు. అందులో కూడా పాండురంగారెడ్డికి నష్టం వచ్చింది. ఫైనాన్స్‌లో తీసుకున్న డబ్బులు చెల్లించకపోవడంతో ఫైనాన్స్ వారు రెండు డీసీఎంలను తీసుకెళ్లారు. అప్పటికి రూ.4లక్షలు అప్పులు ఉన్నాయి. ఇక ఇక్కడ ఉంటే బతకడం కష్టమని భావించి.. మరో రూ.3 లక్షలు అప్పులు చేసి గతేడాది సెప్టెంబర్ 25న దుబాయికి వెళ్లాడు. అక్కడ ఓ సోలార్ కంపెనీలో పనికి కుదిరాడు. అయితే, పాండురంగారెడ్డికి డిసెంబర్ 24న ఉదయం 6.30 గంటలకు గుండెనొప్పి వచ్చింది. గమనించిన తోటి కార్మికులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ అదే రోజు ఉదయం 8.30 గంటలకు మృతి చెందాడు. అతనితో పాటు పని చేసే వారు విషయాన్ని కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి తెలిపారు. భార్య జమున అక్కడికి పోలేని పరిస్థితి ఉండటంతో అతను పని చేసే కంపెనీ వారు ఒక వ్యక్తిని ఇచ్చి మృత దేహాన్ని ఈ నెల 7న ఇంటికి పంపారు. కుటుంబాన్ని పోషించాల్సిన వ్యక్తి మృతిచెందడంతో.. ఆయననే నమ్ముకొని ఉన్న భార్య జమున, కొడుకు అభిలాష్‌రెడ్డి(4ఏళ్లు), కూతురు అన్షిత(రెండేళ్లు), తల్లి బిచ్చమ్మ దిక్కులేని వారయ్యారు. ఇప్పుడు కుటుంబ పోషణే కష్టమైన తరుణంలో రూ.7లక్షల వరకు అప్పులు ఉన్నాయి. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని పాండురంగారెడ్డి కుటుంబం కోరుతోంది. -
బాలింతపై లైంగిక దాడి...
- నగదు చోరీ నరసరావుపేట(గుంటూరు జిల్లా) గుంటూరు జిల్లా నరసరావుపేటలో బుధవారం ఉదయం ఒక బాలింతపై గుర్తుతెలియని వ్యక్తి లైంగికదాడి చేశాడు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఒక కుటుంబం పదిహేను రోజులక్రితం కూలిపనుల కోసం నరసరావుపేటకు వచ్చింది. భార్యాభర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. బంధువులను రైలు ఎక్కించేందుకు భర్త రైల్వే స్టేషన్‌కు వెళ్లగా నెల రోజుల బాలింత అయిన మహిళ ఇంట్లోనే ఒంటరిగా ఉంది. ఇది గమనించిన ఆగంతకుడు ఇంట్లో దూరి మహిళ నోట్లో బట్టకుక్కి ఆమెపై లైంగికదాడి చేశాడు. ఇంట్లో ఉన్న 12 వేల నగదు అపహరించుకువెళ్లాడు. భర్త ఇంటికి వస్తూనే విషయం చెప్పడంతో బాధితురాలితో సహా భర్త టూ టౌన్ పోలీస్ స్టేషన్ చేరుకుని ఫిర్యాదుచేశాడు. కేసు నమోదుచేసిన పోలీసులు దుండగుని కోసం గాలిస్తున్నారు. -
సౌదీలో గుండెపోటుతో తెలుగు వ్యక్తి మృతి
సదాశివనగర్ మండలం అడ్లూరుఎల్లారెడ్డి గ్రామానికి చెందిన తోకల నర్సింగరావు(40) అనే వ్యక్తి సౌదీలో గుండెపోటుతో మృతిచెందాడు. రెండు రోజుల క్రితమే నర్సింగ రావు మృతిచెందినట్లు అక్కడి వారు తెలిపారు. రెండు సంవత్సరాల క్రితం పొట్టకూటి కోసం సౌదీ వెళ్లినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. నర్సింగరావు మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. -
కరీంనగర్లో వలస కూలీ ఆత్మహత్య
పొట్టకూటి కోసం వరంగల్ జిల్లా హసన్‌పర్తి నుంచి కరీంనగర్ జిల్లా కమలాపురం మండలం అంబాల గ్రామానికి వలస వచ్చిన వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సంచార వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న శ్రీనివాస్(42) బుధవారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అతిగా మద్యం సేవించే అలవాటు ఉండటంతో పాటు ఆర్థిక ఇబ్బందులతోనే ఆత్మహత్య చేసుకొని ఉంటాడని స్థానికులు భావిస్తున్నారు. -
వలస కూలీకి రూ. కోటి
కోజికోడ్: ఒక వలస కార్మికుడి పంట పండింది. కూలీ పని కోసం వలస వచ్చిన మూడో రోజే కోటీశ్వరుడై పోయాడు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం మాల్దా జిల్లాలోని లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన 22 ఏళ్ల మొఫీజుల్ రహానా షేక్ మార్చి 4న కూలీ పనుల నిమిత్తం కేరళకు వచ్చాడు. వచ్చిన వెంటనే ఒక వ్యాపారి వద్ద రూ. 50 వెచ్చించి కారుణ్య లాటరీ టికెట్‌ను కొనుగోలు చేశాడు. కాగా తర్వాత రోజు తీసిన డ్రాలో రహానా రూ. కోటి గెలుపొందినట్లు తెలుసుకుని ఒకవైపు ఆనందంలో మునిగి తేలుతుంటే మరోవైపు లాటరీ టికెట్ కోసం సహచర కార్మికులు దాడి చేస్తారని భయంతో తనకు భద్రత కల్పించాలని పోలీసులను ఆశ్రయించాడు. అయితే పోలీసులు అతనిని బ్యాంకుకు తీసుకెళ్లి ఖాతా తెరిపించి టికెట్‌ను అక్కడ భద్రపరిచారు. -
కారు ఢీకొని బాలుని మృతి
నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం చెన్నంపల్లి శివారులో మంగళవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డుప్రమాదంలో ఏడేళ్ల బాలుడు మృతిచెందాడు. వసలకార్మికుల కుటుంబానికి చెందిన ఏడేళ్ల బాలుడు రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో బాలుడు అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుని వివరాలు తెలియరాలేదు. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
60గంటలపాటు మృత్యువుతో పోరాడి..
బీజింగ్: కొండచరియలు విరిగిపడటంతో కూలిపోయిన భవంతి శిథిలాలకిందపడి దాదాపు 60 గంటల తర్వాత కూడా ఓ వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. చైనాలోని షింజెన్ ఇండస్ట్రియల్ పార్క్ సమీపంలో కొండచరియలు విరిగిపడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మొత్తం 70మంది ప్రాణాలుకోల్పోగా కూలిన భవంతుల శిథిలాల కింద గాలింపులు చేపడుతున్నారు. ఈ క్రమంలో చాంకింగ్ ప్రాంతానికి చెందిన తియాన్ జెమింగ్ అనే వలస కూలిని శిథిలాలు తొలగిస్తూ గుర్తించారు. అతడిని జాగ్రత్తగా బయటకు తీశారు. దాదాపు 60గంటలపాటు శిథిలాలకిందే ఉండిపోయిన తియాన్ మెల్లగా మాట్లాడగలుగుతున్నాడు. అతడి నాడీ వ్యవస్థ నెమ్మదించింది. దీంతో వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించి వైద్యం ఇప్పిస్తున్నారు. అంత భారీ మొత్తంలో శిథిలాలు మీదపడిన పైకి ఎలాంటి గాయాలుకాకపోవడం, 60 గంటలు గడిచినా సురక్షితంగా ఉండటం సహాయబృందాలకు ఆశ్చర్యాన్ని కలిగించింది.