వలస కష్టం కాటేసింది పసివాడిని వీడేసింది | Migrant woman dies on railway platform then child plays beside body | Sakshi
Sakshi News home page

వలస కష్టం కాటేసింది పసివాడిని వీడేసింది

Published Thu, May 28 2020 6:11 AM | Last Updated on Thu, May 28 2020 6:11 AM

Migrant woman dies on railway platform then child plays beside body - Sakshi

న్యూఢిల్లీ: పాపం పుణ్యం, ప్రపంచమార్గం ఏదీ తెలియని ఓ పసివాడు, రైల్వే ప్లాట్‌ఫాంపై విగతజీవిగా పడివున్న తల్లి శవంపై కప్పిన గుడ్డతో ఆడుకుంటోన్న దృశ్యం సోషల్‌ మీడియాలో నెటిజన్లను కన్నీళ్ళు పెట్టించింది. బిహార్‌లోని ముజఫర్‌పూర్‌ ఫ్లాట్‌ఫాంపై ఓ తల్లి మృతదేహంపై కప్పి ఉంచిన వస్త్రంతో ఆడుకుంటూ, తల్లిని నిద్రలేపే యత్నం చేస్తోన్న ఓ పసివాడి దృశ్యం దేశంలో వలసకార్మికుల కష్టాలను కళ్ళకు కట్టింది. ఎంత తట్టినా లేవని తల్లి తన కోసం లేచిరాకపోతుందా..తనను ఒడిచేర్చుకోకపోతుందా అని ఆ పసివాడు పదే పదే తల్లిని లేపేందుకు చేస్తోన్న ప్రయత్నం స్టేషన్‌లోని ప్రయాణికుల హృదయాలను కలచివేసింది. రైళ్ళ రాకపోకలపై మైకులో అనౌన్స్‌మెంట్‌ కొనసాగుతుండగా.. తల్లిపై అస్తవ్యస్తంగా కప్పి ఉంచిన వస్త్రంతో అమాయకంగా ఆడుకుంటోన్న ఈ వీడియోని ఆమ్‌ ఆద్మీ పార్టీ నాయకుడు సంజయ్‌ యాదవ్‌ ట్వీట్‌ చేయడంతో ఇది వైరల్‌ అయ్యింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement