railway platform
-
ప్లాట్‌ఫామ్‌పై పిచ్చి చేష్టలు..వీడియో వైరల్
-
ఇంత బలుపేంటి భయ్యా.. దెబ్బకు తిక్క కుదిరిందిగా..
ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో హైలైట్ అవడం కోసం ఓ వ్యక్తి ఎక్స్ట్రాలకు పోయాడు. తానేదో పెద్ద తోపుననే ఫీలింగ్‌లో ఏకంగా రైల్వే ప్లాట్‌ఫామ్‌పైనే కారు డ్రైవింగ్ చేశాడు. దీంతో, రైల్వేపోలీసులకు చిక్కడంతో కథ అడ్డం తిరిగింది. ఈ ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ఆగ్రాలోని కంటోన్మెంట్ పరిధిలో ఉన్న రైల్వేస్టేషన్లో ఓ రైలు ఆగి ఉంది. ప్రయాణీకులందరూ రైలులో ఎక్కారు. మరికొందరు ప్యాసింజర్లు వారి కావాల్సిన రైలు కోసం వేచి చూస్తుండగా.. ఇంతలో ఓ కారు(ఎంజీ కారు) సర్రున రైల్వే ప్లాట్‌ఫామ్ మీదకు దూసుకొచ్చింది. ఇదేంట్రా బాబు అనుకునేలోపే డ్రైవర్ ఎంచక్కా.. ప్లాట్ఫ్లామ్ మీద డ్రైవింగ్ చేస్తూ ముందుకెళ్లాడు. అక్కడే ఉన్న మరో వ్యక్తి ఆయన డ్రైవింగ్ చేస్తుండగా వీడియో తీశాడు. ఇదేంటబ్బా.. రైల్లు వెళ్లాల్సిన చోట కారు ఏంటని అందరూ అనుకుంటుండగా.. డ్రైవర్ కారును యూటర్న్ తీసుకుని బయటకు వెళ్లిపోయాడు. అయితే, ఇదంతా ఇన్స్‌స్టాగ్రామ్‌లో రీల్ కోసం తీసినట్టి తెలిసింది. దీంతో, వారంతా అవాక్కయ్యారు. ఈ విషయం కాస్తా రైల్వే పోలీసులకు తెలియడంతో ఈ ఘటనపై రైల్వే యాక్ట్్ 159, 147 కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ఇక, కారు డ్రైవర్‌ను జగదీష్‌పురా ప్రాంతానికి చెందిన సునీల్ కుమార్‌గా గుర్తించారు. కాగా, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. RPF Agra cantt has booked Sunil Kumar of Jagdispura area for driving SUV at railway station platform in order to create #Instagram #reel. Accused has been booked under railway act 159, 147. https://t.co/X2no22lLQZ pic.twitter.com/VnMiE8B6ip — Arvind Chauhan (@Arv_Ind_Chauhan) March 15, 2023 -
రద్దీగా ఉన్న రైల్వే ప్లాట్‌ఫామ్‌పైకి లారీ.. వీడియో వైరల్
లఖ్‌నవూ: రైల్వే స్టేషన్ లోపలికి ఎలాంటి వాహనాలు వెళ్లేందుకు వీలు లేదు. ప్రధాన స్టేషన్లలో ప్రయాణికులతో రద్దీగా ఉండి కలుపెట్టే సంధు సైతం ఉండని పరిస్థితులు ఉంటాయి. అయితే, అలాంటి ఓ రద్దీ ప్లాట్‌ఫామ్‌పై భారీ ట్రక్కు కనిపించటం అక్కడి ప్రయాణికులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని జరిగిన సంఘటన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. కొద్ది నెలల క్రితం ముంబైలో ఓ ఆటో రిక్షా ఏవిధంగా అయితే ప్లాట్‌ఫామ్‌పైకి వచ్చిందో.. అదే విధంగా ప్లాట్‌ఫామ్‌పై నుంచి లారీని నడపటం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఆ ప్లాట్‌ఫామ్‌పై ప్రయాణికులు భారీగానే ఉన్నారు. అయితే, ఏ రైల్వే స్టేషన్ అనేది స్పష్టత లేదు కానీ, ప్లాట్‌ఫామ్ నంబర్ 9 అని వీడియో ద్వారా తెలుస్తోంది. ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసిన ప్లాట్ఫామ్స్పైకి వాహనాలను తీసుకురావటమేంటని సామాజిక మాధ్యమాల వేదికగా పలువురు ప్రశ్నిస్తున్నారు. #UttarPradesh pic.twitter.com/gsfMhakbZJ — HP Live News (@hplivenews1) December 21, 2022 ఇదీ చదవండి: హ్యాట్సాఫ్ యశోధరా.. ‘ఎంబీబీఎస్’ చదువుతూనే ‘సర్పంచ్’గా ఎన్నిక -
Video: ఏకంగా రైల్వే ప్లాట్‌ఫామ్ మీదకు ఆటో.. తరువాత ఏం జరిగిందంటే.
మహారాష్ట్రలో వింత ఘటన చోటుచేసుకుంది. ముంబైలోని కుర్లా రైల్వే స్టేషన్లో ఓ ఆటో డ్రైవర్ తన వాహనంతో రైల్వేస్టేషన్‌లోకి వచ్చాడు. ప్రయాణికులతో రైల్వే స్టేషన్‌కు వచ్చిన ఆటో డ్రైవర్ ఏకంగా ఏకంగా తన ఆటోను ప్లాట్‌ఫామ్ మీదకే పోనిచ్చాడు. ఈ దృశ్యాలు రైల్వేస్టేషన్‌లోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చివరికి రైల్వే పోలీసులు దృష్టికి చేరింది. దీంతో వారు ట్విటర్ ద్వారా వివరణ ఇచ్చారు. కుర్లా రైల్వే స్టేషన్లో ప్లాట్‌ఫామ్ మీదకు ఆటో తీసుకొచ్చిన డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. రైల్వే యాక్ట్ ప్రకారం నిందితుడిపై తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఈ ఘటన శనివారం జరగ్గా.. తాజాగా నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొంతమంది ఫన్నీగా కామెంట్ పెడుతుంటే మరికొందరు రైల్వే అధికారులను తీరును తప్పబడుతున్నారు. ఆటో ఏకంగా ప్లాట్‌ఫామ్‌పైకి వచ్చేదాక రైల్వే సిబ్బంది ఏం చేస్తున్నారని మండిడుతున్నారు. Kurla station auto mafia on the platform. Please check & verify this. Too much freedom given by Kurla @MTPHereToHelp & @RPFCRBB Coincidentally on the first day of new @drmmumbaicr Isn't this a safety hazard for trains? @SrdsoM @RailMinIndia @RPF_INDIA pic.twitter.com/dXGd95jkHL — Rajendra B. Aklekar (@rajtoday) October 15, 2022 -
క్షణాల్లో కదిలిన సీఆర్పీఎఫ్ సిబ్బంది, షాకింగ్ వీడియో
సాక్షి,లక్నో: రెప్పపాటులో మృత్యుముఖం నుంచి ఒక వ్యక్తిని కాపాడిన షాకింగ్ వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. రైల్వే ప్లాట్‌ఫాంల వద్ద అప్రమత్తంగా ఉండాలని, , కదులుతున్న రైళ్లను ఎక్కొద్దు, దిగవద్దు అంటూ పదే పదే ర్వైల్వే శాఖ హెచ్చరిస్తున్నా, చాలామంది ప్రమాదం అంచున నిలబడుతున్నారు. కానీ రక్షణ సిబ్బంది మెరుపు వేగంతో కదిలి వారిని కాపాడుతున్నారు. ఉత్తరప్రదేశ్, ఘజియాబాద్ రైల్వే స్టేషన్లో చోటుచేసుకున్నఇలాంటి షాకింగ్ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సీఆర్పీఎఫ్ సిబ్బంది స్పందించి, కాపాడిన తీరుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. రెప్పపాటు నిర్లక్ష్యం నిండు జీవితాన్ని బలితీసుకుంటుంది. ఇలాంటి ఘటనలు ఇప్పటికే చాలా చూశాం. గుండెల్లో రైళ్లు పరిగెట్టించే ఇలాంటి వీడియోలు హల్చల్ చేస్తూనే ఉన్నాయి. అయినా పట్టించుకోకుండా చాలామంది అదే నిర్లక్క్ష్యంతో ప్రాణాల మీదకు తెచ్చుకోవడం ఆందోళన పుట్టిస్తోంది. తాజా ఘటన వివరాల్లోకి వెళితే..ఘజియాబాద్ రైల్వే స్టేషన్లో గోమతి ఎక్స్‌ప్రెస్ ప్లాట్‌ఫాంపైకి వస్తోంది. అంతలోనే ఒక వృద్ధుడు రైల్లోంచి దిగుతూ పట్టు తప్పి జారి పోయాడు. దీన్ని గమనించిన ఆర్పీఎఫ్ అధికారి శరవేగంతో ఆ వృద్ధుడిని సురక్షితంగా కాపాడారు.వృద్ధుడు రైల్లోంచి జారి పట్టాలపై పడిపోతున్న దృశ్యం అక్కడి వారిని తీవ్ర భయాందోళనకు గురిచేసింది. కానీ పోలీసులు సకాలంలో స్పందించడంతో లిప్తపాటులో అతను ప్రాణాలతో బయటపడ్డాడు. దీంతో ప్లాట్‌ఫాంపై ఉన్న వారంతా ఊపిరి పీల్చు కున్నారు. మరోవైపు చాకచక్యంగా వ్యవహరించి వృద్ధుడిని కాపాడిన ఆర్పీఎఫ్ కానిస్టేబుల్స్ త్రిలోక్ శర్మ, శ్యామ్ సింగ్‌లను పొగడ్తలతో ముంచెత్తారు. गाज़ियाबाद रेलवे स्टेशन पर एक बुजुर्ग यात्री को मौत के मुँह से बचाया @RPF_INDIA के कॉन्स्टेबल त्रिलोक शर्मा और कांस्टेबल श्याम सिंह को रेलवे पुलिस ने इस काम के लिए सराहा है pic.twitter.com/FwCsjvrQzC — Mukesh singh sengar मुकेश सिंह सेंगर (@mukeshmukeshs) July 6, 2021 -
తిరుపతి: ఒళ్లు గగుర్పొడిచే ఘటన
-
Tirupati: కానిస్టేబుల్ సాహసం.. ఒళ్లు గగుర్పొడిచే ఘటన
సాక్షి, తిరుపతి: రైలు దిగేటపుడు ఎక్కేటపుడు జాగ్రత్తగా ఉండాలని ఎంత చెబుతున్నా కొందరు పట్టించుకోరు అంతే. అదే నిర్లక్ష్య ధోరణి. కన్ను మూసి తెరిచే లోపు ప్రాణాలు పోతున్నా.. క్షణంపాటు వేచి ఉండేందుకు ఇష్టపడరు. కానీ ఇలాంటి అజాగ్రత్త చర్యల పట్ల చాలా అప్రమత్తంగా ఉంటూ అక్కడి సిబ్బంది ప్రాణదాతలుగా నిలుస్తున్న ఘటనలు చాలానే ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి తిరుపతి రేల్వే స్టేషన్లో బుధవారం ఉదయం చేసుకుంది. ఈ విషయం తలుచుకుంటేనే ఒళ్లు గగుర్పొడవక మానదు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. రైలు ప్లాట్‌ఫాంపై ఆగుతుండగానే కదులుతున్న రైలు నుంచి ఒక మహిళ హడావిడిగా దిగేందేకు ప్రయత్నించింది. ఈ క్రమంలో అదుపు తప్పింది. ఈ విషయాన్ని గమనించిన కానిస్టేబుల్ సతీష్ మెరుపు వేగంగా కదిలి ఆమెను వెనుకకు లాగారు. దీంతో ఆమెకు ప్రాణాపాయం తప్పింది. లేదంటే రైలుకు, ప్లాట్‌పాంకు మధ్య ఉన్న గ్యాప్ ద్వారా ఆ మహిళ రైలు పట్టాలపైకి జారి పోయి ఉండేది. మొత్తానికి మహిళ సురక్షితంగా ఉండటంతో రైల్వే సిబ్బంది, తోటి ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. సో.. బీకేర్ ఫుల్.. నిదానమే ప్రధానం. -
ప్లాట్ఫారం టికెట్ రూ.50.. రద్దీని తగ్గించేందుకే
ముంబై సెంట్రల్: ప్లాట్ఫారం టికెట్ ధరను రైల్వే ఏకంగా రూ.50కి పెంచేసింది. ఒకవైపు కరోనా, మరోవైపు పెరుగుతున్న ధరలతో ఇప్పటికే ముంబైకర్లు సతమతమవుతుంటే ప్రభుత్వం పెంచిన ప్లాట్ఫారం టికెట్ల ధరలు వారికి అశనిపాతంగా మారాయి. గత కొద్ది రోజులుగా ముంబై పరిసర నగరాల్లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న దృష్టా, ప్రభుత్వం అనవసరమైన అధిక రద్దీని తగ్గించేందుకు తగిన చర్యలు చేపడుతోంది. అందులో భాగంగానే రైల్వే స్టేషన్స్‌లో ప్రయాణీకులతో పాటు అనవసరంగా జనం గుంపు కడుతున్నారనీ, జనాల రద్ధీని తగ్గించేందుకు ప్లాట్ఫారం టికెట్ల ధరలు అమాంతం పెంచేసి యాభై రూపాయలు చేసింది. గతంలో ఈ ప్లాట్ఫారం టికెట్ ధర పది రూపాయలు ఉండేది. నిజానికి ధరలు పెంచాలనే నిర్ణయం 24 ఫిబ్రవరి రోజే తీసుకున్నామనీ, ఈ పెంచిన ధరలు జూన్ 15 వరకు అమలులో ఉంటాయని మధ్య రైల్వే ప్రధాన పౌర సంబంధాల అధికారి శివాజీ సుతార్ తెలిపారు. ముంబై మహానగరంలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్, దాదర్, లోకమాన్య తిలక్ టెర్మినస్, థానే, కల్యాణ్, పన్వేల్, భివండీ రోడ్ స్టేషన్లలో ప్లాట్ ఫారం టికెట్ల ధరలు యాభై రూపాయలు ఉంటాయనీ, ఇవే స్టేషన్లలో రద్దీని తగ్గించేందుకు రేట్లను పెంచామనీ ఆయన అన్నారు. చదవండి: (మరోసారి కరోనా విజృంభణ.. 14 వరకు కర్ఫ్యూ) -
వలస కష్టం కాటేసింది పసివాడిని వీడేసింది
న్యూఢిల్లీ: పాపం పుణ్యం, ప్రపంచమార్గం ఏదీ తెలియని ఓ పసివాడు, రైల్వే ప్లాట్‌ఫాంపై విగతజీవిగా పడివున్న తల్లి శవంపై కప్పిన గుడ్డతో ఆడుకుంటోన్న దృశ్యం సోషల్ మీడియాలో నెటిజన్లను కన్నీళ్ళు పెట్టించింది. బిహార్‌లోని ముజఫర్‌పూర్ ఫ్లాట్‌ఫాంపై ఓ తల్లి మృతదేహంపై కప్పి ఉంచిన వస్త్రంతో ఆడుకుంటూ, తల్లిని నిద్రలేపే యత్నం చేస్తోన్న ఓ పసివాడి దృశ్యం దేశంలో వలసకార్మికుల కష్టాలను కళ్ళకు కట్టింది. ఎంత తట్టినా లేవని తల్లి తన కోసం లేచిరాకపోతుందా..తనను ఒడిచేర్చుకోకపోతుందా అని ఆ పసివాడు పదే పదే తల్లిని లేపేందుకు చేస్తోన్న ప్రయత్నం స్టేషన్‌లోని ప్రయాణికుల హృదయాలను కలచివేసింది. రైళ్ళ రాకపోకలపై మైకులో అనౌన్స్మెంట్ కొనసాగుతుండగా.. తల్లిపై అస్తవ్యస్తంగా కప్పి ఉంచిన వస్త్రంతో అమాయకంగా ఆడుకుంటోన్న ఈ వీడియోని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు సంజయ్ యాదవ్ ట్వీట్ చేయడంతో ఇది వైరల్ అయ్యింది. -
వైరల్: రైల్వే ప్లాట్‌ఫాం మీదుగా ఆటో..!
ముంబై : మానవత్వం పరిమళించింది. పురిటి నొప్పులతో తల్లడిల్లుతున్న ఓ గర్భిణినీకి సాయమందించేందుకు ఓ ఆటోవాలా సాసహోపేత నిర్ణయం తీసుకున్నాడు. ఏకంగా రైల్వే ఫ్లాట్‌ఫాం మీదుగా ఆటోరిక్షాను తీసుకెళ్లి ఆమెను ఆస్పత్రికి చేర్చాడు. ఈ హృద్యమైన ఘటన ముంబైలోని విరార్ రైల్వే స్టేషన్లో గత ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. ఏడు నెలల గర్భిణీ, ఆమె భర్త ఓ రైలులోని దివ్యాంగుల కంపార్ట్మెంట్లో ప్రయాణిస్తున్నారు. అయితే, భారీ వర్షాల కారణంగా ముంబై జలమయమైన సంగతి తెలిసిందే. దాంతో రైలు సర్వీసులు ఎక్కడికక్కడ రద్దయ్యాయి. దాంతో ఆ దంపతులు ప్రయాణిస్తున్న ట్రెయిన్‌ను విరార్ రైల్వే స్టేషన్లో నిలిపేశారు. అదే సమయంలో ఆమెకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. గర్భిణీని రోడ్డుపైకి తీసుకొచ్చేందుకు ఆమె భర్త పలువురి సాయం కోరాడు. లాభం లేకపోయింది. స్టేషన్ ఆవరణలో ఉన్న ఆటోవాలా కమలాకర్ గవాడ్‌కు విషయం చెప్పి సాయం అర్థించాడు. దీంతో కమలాకర్ నేరుగా ఫ్లాట్‌ఫాం మీదుగా ఆటోను పోనిచ్చాడు. గర్భిణీని తీసుకెళ్లి సంజీవని ఆస్పత్రిలో చేర్పించారు. ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అయితే, నిబంధనల్ని ఉల్లంఘించిన ఆటోవాలాపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులో సోమవారం హాజరుపరిచారు. అతన్ని కోర్టు మందలించింది. బెయిల్ మంజూరు చేసింది. కమలాకర్ ఉద్దేశం మంచిదే అయినప్పటీకీ, నిబంధనల అతిక్రమణ నేరమని రైల్వే పోలీస్ అధికారి ప్రవీణ్‌కుమార్ అన్నారు. ప్లాట్‌ఫాం మీదుగా ఆటో వెళ్తున్న క్రమంలో ప్రయాణికులు ప్రమాదానికి లోనయ్యే అవకాశం ఉందని అన్నారు. సెక్షన్ 154 (రాష్ డ్రైవింగ్), రైల్వే నిబంధనల అతిక్రమణ కింద ఆటోడ్రైవర్‌పై కేసులు నమోదయ్యాయి. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. సాయం చేస్తే శిక్షిస్తారా అని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
సినిమాను తలపించే లైవ్ సూసైడ్..
సాక్షి, ముంబై: ముంబైలోని మలాద్ రైల్వే స్టేషన్లో ఓ దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి ప్లాట్‌ఫామ్‌పై నడుచుకుంటూ వెళ్తూ.. వెనుక వస్తున్న రైలు ముందుకు దూకాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డవ్వడంతో ఘటన బయటకొచ్చింది. వివరాల్లోకి వెళితే.. రైల్వే బ్రిడ్జి నుంచి కిందకు దిగిన ఓ వ్యక్తి ప్లాట్‌ఫామ్‌పై నడుస్తూ వస్తున్నాడు. ఇంతలో ఓ రైలు అతని వెనుక నుంచి వస్తోంది. ఈ విషయాన్ని గమనించిన వ్యక్తి ఒక్కసారిగా రైలు ముందుకు దూకాడు. ఇటీవల జరిగిన ఈ ఘటనకు సంబంధించిన ఈ వీడియోను పోలీసులు తాజాగా విడుదల చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆ వ్యక్తి ఎవరు.. ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడన్న విషయం తెలియాల్సి ఉంది. -
రైలు ప్రయాణికులకు విజ్ఞప్తి..
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఫ్లాట్‌ఫాం టికెట్ చార్జీ పెంపు సాక్షి, హైదరాబాద్: దసరా సెలవులకు ఊరికి వెళుతున్న మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులకు వీడ్కోలు పలికేందుకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వెళుతున్నారా? అయితే ఇది గమనించండి. గురువారం నుంచి ఫ్లాట్‌ఫాం టికెట్ చార్జీలు పెరుగుతున్నాయి. దసరా రద్దీని దృష్టిలో పెట్టుకుని ఈ నెల 21 నుంచి అక్టోబర్ 3 వరకు ఫ్లాట్‌ఫాం టికెట్ చార్జీలు తాత్కాలికంగా పెంచుతున్నట్టు దక్షిణమధ్య రైల్వే బుధవారం తెలిపింది. సాధారణ రోజుల్లో ఉండే రూ.10 టికెట్‌ను రూ.20కి పెంచుతున్నట్టు ప్రకటించింది. 13 రోజుల పాటు పెంచిన చార్జీలు అమలవుతాయని వెల్లడించింది. స్టేషన్‌పై ఒత్తిడిని తగ్గించేందుకు, ప్రయాణికులు కాని వాళ్ల ప్రవేశాన్ని నియంత్రించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. అనవసరమైన వ్యక్తుల ప్రవేశాన్ని నియంత్రించి, ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చూసేందుకు ఫ్లాట్‌ఫాం టికెట్ చార్జీ పెంచామని వివరించింది. పండుగల రోజుల్లో ప్రయాణికులతో రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతుంటాయి. తమ వారిని ఊళ్లకు సాగనంపేందుకు ప్రయాణికులతో పాటు వారి కుటుంబ సభ్యులు, స్నేహితులు స్టేషన్‌కు తరలివస్తుంటారు. దీంతో రద్దీ అనూహ్యంగా పెరుగుతుంది. రద్దీకి అనుగుణంగా స్టేషన్ నిర్వహణ చేపట్టడంతో పాటు, భద్రత కూడా నిర్వాహకులకు సవాల్‌గా మారుతుంది. దీంతో పండుగ సీజన్లలో అనవసర రద్దీని నియంత్రించేందుకు గత కొన్నేళ్లుగా ఫ్లాట్‌ఫాం టికెట్ చార్జీలను తాత్కాలికంగా పెంచుతూ వస్తున్నారు. -
విశాఖలోనూ నయీమ్ కదలికలు
రైల్వే ప్లాట్‌ఫారాల సీసీటీవీ ఫుటేజీలను స్వాధీనం చేసుకున్న సిట్ సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: గ్యాంగ్‌స్టర్ నయీముద్దీన్ నవ్యాంధ్ర ఆర్థిక రాజధాని విశాఖపట్నంలో కూడా నేర సామ్రాజ్యాన్ని విస్తరించాలని చూశాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నయీ మ్ గత రెండు, మూడు నెలల్లో పలుమార్లు విశాఖకు వచ్చి వెళ్లాడని సిట్ అధికారులు నిర్ధారణకు వచ్చారు. ఆదివారం సిట్ అధికారులు విశాఖలో పర్యటించారు. ప్రధానంగా రైల్వేస్టేషన్‌పై దృష్టి సారించి.. ఆర్పీఎఫ్, రైల్వే పోలీసు, ఇతర ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. విశాఖ నుంచి వెళ్లే గోదావరి, దురంతో ఎక్స్‌ప్రెస్‌ల రిజర్వేషన్ టికెట్ల వివరాలను తీసుకున్నారు. ప్లాట్‌ఫారాల సీసీ టీవీ ఫుటేజీలను తీసుకున్నారు. విశాఖ నుంచి హైదరాబాద్‌కు రైళ్లలో ప్రయాణించిన సందర్భాల్లో నయీమ్ నేరుగా సికింద్రాబాద్, నాంపల్లి స్టేషన్లలో కాకుండా ముందు స్టేషన్లలోనే దిగిన ట్టు అధికారులు గుర్తించారు. వరంగల్, జనగామ, ఘట్కేసర్లలో దిగినట్టు అనుమానిస్తున్నారు. హైదరాబాద్ కేంద్రంగా నేరసామాజ్రాన్ని విస్తరించుకున్న నయీమ్ విశాఖ ఎందుకొచ్చినట్టు? ఏమైనా సెటిల్మెంట్లు, దందాలు చేశాడా? ఇక్కడ పోలీసు అధికారులతో కూడా అతనికి పరిచయాలు ఉన్నాయా? ఇక్కడ కూడా అతనికి అనుచరులు ఉన్నా రా? అన్న అంశాలపై సిట్ అధికారులు విచారణ చేపట్టినట్టు సమాచారం. -
రెప్పపాటులో ప్రాణాలు పోయాయి
ముంబై: ముంబైలోని బోరివాలి రైల్వేస్టేషన్లో విషాదం చోటుచేసుకుంది. రైల్వే ప్లాట్పాంకి, పట్టాలకు మధ్యనున్న గ్యాప్ కిరణ్ కొఠారి (55)ని పొట్టనపెట్టుకుంది. అనారోగ్యంతో ఉన్న సోదరుడిని పరామర్శించేందుకు వచ్చిన తమ బంధువు, తిరిగిరాని లోకాలకు తరలిపోవడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. కిరణ్ కొఠారి ముంబైలో తన సోదరుడిని చూసి తిరిగి గుజరాత్ వెళ్లేందుకు రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. పొరపాటున వేరే రైలు ఎక్కిన విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన ఆమె.. కదులుతున్న రైల్లోంచి దిగుతూ.. రైలుకు, ప్లాట్ ఫాంకు మధ్య ఉన్న సందులో చిక్కుకుపోయింది. వెంటవున్న బంధువు తరుణ్ సిధ్వి ఆమెను రక్షించడానికి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. అందరూ చూస్తుండగానే.. విలవిల్లాడుతూ అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. దీంతో అక్కడున్నవారంతా దిగ్ర్భాంతికి లోనయ్యారు. ఈ దృశ్యాలు స్టేషన్ లోని సీసీ టీవీలో స్పష్టంగా రికార్డయ్యాయి. దీంతో రైల్వేశాఖ నిర్లక్ష్యంపై విమర్శలు చెలరేగాయి. ఇది చాలా విచారకరమైన సంఘటన అని ప్రభుత్వ రైల్వే పోలీసు అధికారి వ్యాఖ్యానించారు. కాగా అధికారిక గణాంకాల ప్రకారం బోరివలి స్టేషన్ లో ఇలాంటివి మొత్తం 28 అటువంటి సంఘటనలు చోటుచేసుకోగా 13 మంది ప్రాణాలు కోల్పోయారు. రైల్వే ప్లాట్పాంకి, పట్టాలకు మధ్య గ్యాప్ తక్కువగా ఉండటమే ఇందుకు కారణమని తెలుస్తోంది. -
రోజూ కనబడే కథలు
స్టేషన్లో బామ్మ... సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో జనరల్ బోగీ ప్రయాణీకులు వేచి ఉండే ప్రాంగణం... కొంతకాలంగా అదే ఆమె ఇల్లు. ప్లాట్‌ఫాం ఊడ్చే వారి దగ్గర్నుంచి రైల్వే పోలీసుల దాకా అందరూ కొడుకులూ కూతుర్లే... పాసింజర్లేమో చుట్టాలు. కొన్ని నెలల క్రితం కొడుకే రైల్వేస్టేషన్లో వదిలేసాడని, అప్పటి నుంచి కొడుకు కోసం ఎదురు చూస్తూ అక్కడే ఉండిపోయిందని లేదు... తనంతట తానే వచ్చిందని నెలలు కాదు ఏళ్ల నుంచి అక్కడే ఉందని.... ఇందులో ఏది నిజమో చెప్పాల్సిన బామ్మ... ఆ ఒక్కటి తప్ప అన్నీ చెబుతుంది. ఆమెని చూస్తే... ఇలాంటి అమ్మమ్మ ఉంటే ఎంత బాగుండో అనిపిస్తుంది. ఆమెతో మాట్లాడితే... ఆ అనుభవాల మూటను ఇంటికి భధ్రంగా తెచ్చుకోవాలనిపిస్తుంది. తన పేరు చంద్రావతి (85) అని చెబుతున్న ఈ బామ్మ... పుట్టపర్తిలో తనకు కంటి ఆపరేషన్ ఉచితంగా చేశారని, అక్కడంత మంచి మనుషుల్ని ఇంకెక్కడా తను చూడలేదంది. రైల్వే ప్లాట్‌ఫాం మీది చిరువ్యాపారుల దగ్గర్నుంచి ప్రతి ఒక్కరికీ ఈ బామ్మ చిరపరిచితమే. ఎవరినీ చేయి చాచి యాచించదు. అక్కడి రెస్టారెంట్ వాళ్లిచ్చే ఇడ్లీ తప్ప మరేదీ తిన దు. మినరల్ వాటర్ మాత్రం డిమాండ్ చేసి తీసుకుంటుంది. గతంలో పలుమార్లు వృద్ధాశ్రమాలకు తరలించినా... తిరిగి రైల్వేస్టేషన్‌కే వచ్చేసింది. ప్లాట్‌ఫాం ‘సాక్షి’గా... ‘కన్న’ కధలెన్నో... ‘‘ఒక పోలీసాయన అమ్మా అని పిలిచేవాడు. కబుర్లు చెప్పేవాడు కాని ఎప్పుడూ ఆడవాళ్లతో గడిపేవాడు. అందుకే ఇక్కడ పనిచేసేవాళ్లంతా అతడ్ని తిట్టుకునేవారు. ఒకసారి తన భార్యను తీసుకొచ్చి నాకు పరిచయం చేశాడు. ఆ పిల్ల ఒఠ్టి అమాయకురాలు. మీ ఆయన ఆడాళ్లతో తిరుగుతున్నాడే అని చెబితే... వాళ్లకి డబ్బులివ్వడు.. ఇంకా వాళ్ల దగ్గర ఉన్న నగా నట్రా కూడా లాక్కొచ్చేసి నాకిచ్చేస్తాడు అనింది పిచ్చిది. చివరికా పోలీసుని సస్పెండ్ చేశార్లే’’అంటూ చెప్పుకొచ్చిన చంద్రావతి దగ్గర అలాంటి కథలు బోలెడు. ఎక్కడెక్కడి నుంచో ఎక్కడెక్కడికో ప్రయాణించే వారిలో మంచోళ్లు, చెడ్డోళ్లు, పిచ్చోళ్లు, అల్లరోళ్లు.. ఇలా ఎందరినో చూసిన ఆ బామ్మ... తనతో బాగా మాట్లాడినవారితో ఎంచక్కా కబుర్లు పంచుకుంటుంది. రాత్రుళ్లు నిద్రపోని ఈ బామ్మ... పలుమార్లు దొంగల సమాచారాన్ని పోలీసులకు అందించిందట కూడా. అక్కడ పనిచేసేవాళ్లు తనను బాగా చూసుకుంటున్నారని... ప్లాట్‌ఫాం ఊడ్చే మహిళకి మగబిడ్డ పుట్టాడని... మనవడికి జుబ్బా కొనమని రూ.50 ఇచ్చానని గొప్పగా చెప్పింది. బామ్మ మాట... బంగారు బాట... ‘‘మనం ఎప్పుడూ సుఖపడకూడదు. సుఖపడితే ఆ తర్వాత కష్టపడలేం’’ ‘‘పిల్లలు మనల్ని చూస్తారా చూడరా అని లెక్కేయకూడదు. వాళ్లని చక్కగా చదివించాలి. విద్యావంతుల్ని చేయాలి అది మన బాధ్యత’’ ‘‘చేపని పట్టాలని వలవేసేవాడు వానపామును ఎరవేస్తాడు. వానపామును తింటూ చేప సంతోషిస్తుంటే... నిన్ను తినేవాడు పైనున్నాడులే అని వానపాము అనుకుంటుంది. ఎవరి మీదైనా గెలిచానని విర్రవీగితే మనిషైనా అంతే’’ ఇంటి వెనకాల రేగిచెట్టు ఇంటి ముందు పోలీసోడు ఉండకూడదట’’ఇప్పుడు మనుషుల మధ్య కులాల తేడాలు లేవు. మంచోళ్లు చెడ్డోళ్లు రెండే జాతులున్నారు’’చెంప నిమురుతూ... ఆప్యాయంగా ఈ బామ్మ చెప్పే ఇలాంటివే ఎన్నో.. సూక్తులు వింటే గొప్ప పుస్తకాలు చదివిన ఫీలింగ్ కలుగుతుంది. వృద్ధాప్యం వంకతో పెద్దవాళ్లను దూరం చేసుకుంటున్న నేటి తరం ఎన్ని కోల్పోతోందో అర్థమవుతుంది.. ఏ తల్లి కన్న కూతురో, ఏ బిడ్డను కన్నతల్లో... రెలైక్కే చోటునే తన శేష జీవితానికి నీడగా మార్చుకుంది. ఏమీ కాని వారి మధ్య అంతా తనవారే అనుకుంటూ బతుకు బండిని నడిపిస్తోంది. చివరి మజిలీ వరకూ ఆ ప్రయాణం ఆమె కోరుకున్నట్టుగా ఆరోగ్యంగా కొనసాగాలని ఆశిద్దాం. - ఎస్.సత్యబాబు ఎఫ్‌బిలో హల్చల్... గోవాకు చెందిన అభిసాహి ఒక సామాజిక కార్యకర్త ఈ బామ్మ గురించి రాసి ఫేస్బుక్లో పోస్ట్ చేయడంతో జంటనగరవాసులు పలువురు ఆమెను కలుస్తున్నారు. ఎవరి దగ్గరా ఏమీ తీసుకోవడానికి ఇష్టపడని చంద్రావతి... అందులో ఏముందో ఏమో గాని తనకున్న బ్యాగ్‌ను మాత్రం ఎవరు ముట్టుకున్నా ఊరుకోదు. ‘‘నాకు డబ్బులెందుకయ్యా? ఏం చేసుకుంటా? ప్రేమగా ఎవరు వచ్చినా మాట్లాడుతా. అందర్నీ నా బిడ్డలే అనుకుంటా’’ అంటుందామె. -
ట్రెయిన్, ప్లాట్‌ఫామ్ మధ్య పడి మహిళ దుర్మరణం
ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో దారుణం జరిగింది. ట్రెయిన్, ప్లాట్‌ఫామ్ మధ్య చిక్కుకుని ఓ మహిళ దుర్మరణం పాలైంది. కాన్పూర్ రైల్వేస్టేషన్లో గత రాత్రి ఈ ఘటన జరిగింది. ఓ మహిళ కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నిస్తూ పట్టు తప్పి కిందపడిపోయింది. దాంతో ఆమె రైలుకు ప్లాట్‌ఫామ్‌కి మధ్యన ఉన్న సందులో పడిపోయింది. తీవ్రంగా గాయపడిన మహిళను బయటకు తీసేందుకు రైల్వే సిబ్బంది సుమారు 45 నిమిషాలు పాటు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. చివరకు ప్లాట్‌ఫామ్‌ను పగలగొట్టి మృతదేహాన్ని అధికారులు బయటకు తీశారు. కాగా రైల్వే సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే తన కుమార్తె మృతి చెందిందని మృతురాలి తల్లి ఆరోపించింది. తన కుమార్తె రైలు ఎక్కుతున్న సమయంలో విద్యార్థులు తోయటంతో పట్టు తప్పిపడిపోయిందని తల్లి తెలిపింది. అయితే రైల్వే అధికారులు ఈ ఘటనపై మాట్లాడుతూ తమ తప్పిందమని ఆరోపించటం తగదని, మహిళ కదులుతున్న రైలు ఎక్కుతున్న సమయంలో ప్రమాదం జరిగిందని తెలిపారు. ప్రయాణికురాలి అప్రమత్తంగా లేకపోవటం వల్లే ఈ ప్రమాదం జరిగినందున ఆ కుటుంబానికి ఎలాంటి పరిహారం చెల్లించలేమని నార్త్ సెంట్రల్ రైల్వే సీపీఆర్వో నవీన్ బారు స్పష్టం చేశారు.