సాక్షి, తిరుపతి: రైలు దిగేటపుడు ఎక్కేటపుడు జాగ్రత్తగా ఉండాలని ఎంత చెబుతున్నా కొందరు పట్టించుకోరు అంతే. అదే నిర్లక్ష్య ధోరణి. కన్ను మూసి తెరిచే లోపు ప్రాణాలు పోతున్నా.. క్షణంపాటు వేచి ఉండేందుకు ఇష్టపడరు. కానీ ఇలాంటి అజాగ్రత‍్త చర్యల పట్ల చాలా అప్రమత్తంగా ఉంటూ అక్కడి సిబ్బంది ప్రాణదాతలుగా నిలుస్తున్న ఘటనలు చాలానే ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి తిరుపతి రేల్వే స్టేషన్‌లో బుధవారం ఉదయం చేసుకుంది. ఈ విషయం తలుచుకుంటేనే ఒళ్లు గగుర్పొడవక మానదు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి.
రైలు ప్లాట్‌ఫాంపై ఆగుతుండగానే కదులుతున్న రైలు నుంచి ఒక మహిళ హడావిడిగా దిగేందేకు ప్రయత్నించింది. ఈ క్రమంలో అదుపు తప్పింది. ఈ విషయాన్ని గమనించిన కానిస్టేబుల్ సతీష్ మెరుపు వేగంగా కదిలి ఆమెను వెనుకకు లాగారు. దీంతో ఆమెకు ప్రాణాపాయం తప్పింది. లేదంటే రైలుకు, ప్లాట్‌పాంకు మధ్య ఉన్న గ్యాప్ ద్వారా ఆ మహిళ రైలు పట్టాలపైకి జారి పోయి ఉండేది. మొత్తానికి మహిళ సురక్షితంగా ఉండటంతో రైల్వే సిబ్బంది, తోటి ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. సో.. బీకేర్ ఫుల్.. నిదానమే ప్రధానం.
Comments
Please login to add a commentAdd a comment