Watch: Truck Enters Railway Platform In Uttar Pradesh Video Goes Viral - Sakshi
Sakshi News home page

రద్దీగా ఉన్న రైల్వే ప్లాట్‌ఫామ్‌పైకి లారీ.. వీడియో వైరల్‌

Published Wed, Dec 21 2022 6:39 PM | Last Updated on Wed, Dec 21 2022 7:17 PM

Truck Enters Railway Platform In Uttar Pradesh Video Goes Viral - Sakshi

లఖ్‌నవూ: రైల్వే స్టేషన్‌ లోపలికి ఎలాంటి వాహనాలు వెళ్లేందుకు వీలు లేదు. ప్రధాన స్టేషన్లలో ప్రయాణికులతో రద్దీగా ఉండి కలుపెట్టే సంధు సైతం ఉండని పరిస్థితులు ఉంటాయి. అయితే, అలాంటి ఓ రద్దీ ప్లాట్‌ఫామ్‌పై భారీ ట్రక్కు కనిపించటం అక్కడి ప్రయాణికులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని జరిగిన సంఘటన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. 

కొద్ది నెలల క్రితం ముంబైలో ఓ ఆటో రిక్షా ఏవిధంగా అయితే ప్లాట్‌ఫామ్‌పైకి వచ్చిందో.. అదే విధంగా ప్లాట్‌ఫామ్‌పై నుంచి లారీని నడపటం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఆ ప్లాట్‌ఫామ్‌పై ప్రయాణికులు భారీగానే ఉన్నారు. అయితే, ఏ రైల్వే స్టేషన్‌ అనేది స్పష్టత లేదు కానీ, ప్లాట్‌ఫామ్‌ నంబర్‌ 9 అని వీడియో ద్వారా తెలుస్తోంది. ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసిన ప్లాట్‌ఫామ్స్‌పైకి వాహనాలను తీసుకురావటమేంటని సామాజిక మాధ్యమాల వేదికగా పలువురు ప్రశ్నిస్తున్నారు.

ఇదీ చదవండి: హ్యాట్సాఫ్‌ యశోధరా.. ‘ఎంబీబీఎస్‌’ చదువుతూనే ‘సర్పంచ్‌’గా ఎన్నిక

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement