
మన కళ్ల ముందే కొన్నిసార్లు వింత సంఘటనలు జరగడం చూస్తూ ఉంటాం. అందులో కొన్ని ఫన్నీగా ఉంటే మరికొన్ని భయంకరంగా ఉండొచ్చు. ఇలాంటి దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ లారీ రోడ్డు ప్రమాదానికి గురై రెండు ముక్కలైనప్పటికీ.. లారీ ఇంజన్ భాగం మాత్రం ఆగకుండా ముందుకు వెళ్లిపోయిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ ఘటన ఎక్కడ, ఎప్పుడు జరిగిందో తెలియరాలేదు. కానీ, 14 సెకండ్ల వీడియోలో ఇద్దరు వ్యక్తులు బురద రోడ్డుపై నడుస్తూ వెళ్తున్నారు.
వారి వెనకవైపునే ఓ లారీ భారీ లోడ్‌తో వస్తూ మూల మలుపు వద్ద టర్న్ అయ్యింది. రోడ్డు బురదగా ఉండటం, ఒక్క సారిగా టర్న్ కావడంతో అదుపు తప్పి కింద పడిపోయింది. అయితే లారీ పైభాగం మొత్తం పడిపోయినా.. చక్రాలతోపాటు కింది భాగం అలాగే ఉండి రోడ్డుపై పరుగులు పెట్టింది. లారీలో నుంచి క్షేమంగా బయటపడిన డ్రైవర్‌కు ఇదంతా అయోమయంగా అనిపించింది. అతను లారీ ఇంజన్ భాగం వెంట పరుగెడుతున్న దృశ్యాలు నవ్వు తెప్పించేవిగా ఉన్నాయి.
ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే.. లారీ రెండుగా విడిపోయి రోడ్డుపై వెళుతున్న ఇద్దరు వ్యక్తులు బయటపడ్డారు లేదంటే వారు ప్రమాదం బారినపడేవారు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే, ఫన్నీగా ఉన్న ఈ దృశ్యాలపై కొందరు భిన్నంగా స్పందించారు. లారీకి దెయ్యం పట్టిందని అందుకే ఇలా రెండుగా చీలి పరుగులు పెట్టిందని కామెంట్లు చేశారు. మరికొందరేమో అతి అన్నిటికీ అనర్థమే.. భారీ లోడ్ కారణంగా లారీ రెండుగా విరిగిపోయిందని అంటున్నారు.
చదవండి: వైరల్: అంతా మ్యాచ్‌లో లీనం.. ఒక్కసారిగా స్టేడియంలో..
కూతురు పుట్టిందని.. పానీపూరి వ్యాపారి గొప్పతనం
शरीर का त्याग करके आत्मा निकल गई #FunKiBaat pic.twitter.com/Iry5vmQNRc
— Ashok Kumar ◆ (@ashokism) September 13, 2021
Comments
Please login to add a commentAdd a comment