ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో హైలైట్ అవడం కోసం ఓ వ్యక్తి ఎక్స్‌ట్రాలకు పోయాడు. తానేదో పెద్ద తోపుననే ఫీలింగ్‌లో ఏకంగా రైల్వే ప్లాట్‌ఫామ్‌పైనే కారు డ్రైవింగ్ చేశాడు. దీంతో, రైల్వేపోలీసులకు చిక్కడంతో కథ అడ్డం తిరిగింది. ఈ ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది.
వివరాల ప్రకారం.. ఆగ్రాలోని కంటోన్మెంట్ పరిధిలో ఉన్న రైల్వేస్టేషన్‌లో ఓ రైలు ఆగి ఉంది. ప్రయాణీకులందరూ రైలులో ఎక్కారు. మరికొందరు ప్యాసింజర్లు వారి కావాల్సిన రైలు కోసం వేచి చూస్తుండగా.. ఇంతలో ఓ కారు(ఎంజీ కారు) సర్రున రైల్వే ప్లాట్‌ఫామ్ మీదకు దూసుకొచ్చింది. ఇదేంట్రా బాబు అనుకునేలోపే డ్రైవర్ ఎంచక్కా.. ప్లాట్‌ఫ్లామ్ మీద డ్రైవింగ్ చేస్తూ ముందుకెళ్లాడు. అక్కడే ఉన్న మరో వ్యక్తి ఆయన డ్రైవింగ్ చేస్తుండగా వీడియో తీశాడు.
ఇదేంటబ్బా.. రైల్లు వెళ్లాల్సిన చోట కారు ఏంటని అందరూ అనుకుంటుండగా.. డ్రైవర్ కారును యూటర్న్ తీసుకుని బయటకు వెళ్లిపోయాడు. అయితే, ఇదంతా ఇన్స్‌స్టాగ్రామ్‌లో రీల్ కోసం తీసినట్టి తెలిసింది. దీంతో, వారంతా అవాక్కయ్యారు. ఈ విషయం కాస్తా రైల్వే పోలీసులకు తెలియడంతో ఈ ఘటనపై రైల్వే యాక్ట్‌్ 159, 147 కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ఇక, కారు డ్రైవర్‌ను జగదీష్‌పురా ప్రాంతానికి చెందిన సునీల్ కుమార్‌గా గుర్తించారు. కాగా, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
RPF Agra cantt has booked Sunil Kumar of Jagdispura area for driving SUV at railway station platform in order to create #Instagram #reel. Accused has been booked under railway act 159, 147. https://t.co/X2no22lLQZ pic.twitter.com/VnMiE8B6ip
— Arvind Chauhan (@Arv_Ind_Chauhan) March 15, 2023
Comments
Please login to add a commentAdd a comment