![Butter Chai Being Made At Agra Baba Stall Goes Viral - Sakshi](/styles/webp/s3/article_images/2021/01/18/butter.jpg.webp?itok=Y3p0k_Y7)
న్యూఢిల్లీ: పొద్దున్నే ఒక కప్పు చాయ్, కాఫీ కడుపులో పడితేగాని ఆ రోజు రోజులా ఉండదు. లేవగానే గరం గరం చాయ్ తాగిన తర్వాతే ఏ పని అయిన మొదలు పెడతాం. అయితే ఉదయాన్నే తీసుకునే ఈ టీని ప్రజలంతా రకరకాలుగా తయరు చేసుకుంటారు. అల్లం టీ, లెమన్ టీ, మసాలా టీ, ఇలా కొన్ని రకాలుంటాయి. అయితే ఎప్పుడైన బటర్ చాయ్ తాగారా. ఆ రకం చాయ్ ఉంటుందని కనీసం ఊహించారా? అయితే ఓసారి చూడండి మరి. ఆగ్రాలోని ఓ టీ నిర్వహకుడు మరుగుతున్న టీలో బటర్ కట్ చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోకు ఇప్పటికి వరకు 2.5 లక్షలకు పైగా వ్యూస్ రాగా వేడి వేడి బటర్ టీ అందిస్తున్న టీ స్టాల్ నిర్వహకుడిపై నెటిజన్‌లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. (చదవండి: వేడి వేడి బటర్ చాయ్.. నిర్వహకుడిపై వ్యంగ్యాస్త్రాలు)
ఆగ్రాలో బాబా స్టాల్ షాపు నిర్వహకుడు వెరైటీగా ఆలోచించాడు. ఇందుకోసం మరుగుతున్న టీలో బటర్ ముక్కలుగా కట్ చేసి వేశాడు. బటర్ కరిగాక ఆ చాయ్‌ని వడపోపి పెట్టాడు. ఈ వీడియోను ఫుడ్డీస్ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. ఇక అది చూసిన నెటిజన్‌లు ‘చాయ్‌లో వెన్న వేయడం ఏంట్రా బాబు’ అంటూ తల పట్టుకుంటుండగా మరికొందరూ వ్యంగ్యాస్త్రాలు వదులుతున్నారు. ‘టీలో బటర్‌తో పాటు సాస్, మయోన్నైస్ కూడా కాస్తా వేయ్’, ‘కొంచం పావ్ బాజీ కూడా వేయండి’ అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. (చదవండి: కొడుకుతో పెళ్లి.. బిడ్డకు జన్మనిచ్చిన సెలబ్రిటీ)
Comments
Please login to add a commentAdd a comment