butter
-
అలాంటి వాళ్లు నెయ్యి లేదా వెన్న తినొచ్చా..?
నెయ్యి లేదా వెన్న ఏదైన డెజర్ట్ లేదా రెసిపీ రుచిని అమాంతం పెంచేస్తుంది. అయినా నెయ్యిని జోడించగానే ఏ స్వీట్ అయినా కమ్మగా మారిపోతుంది. ఎవ్వరికైనా..నెయ్యి లేదా వెన్నని తినే అలవాటు ఉంటే అంత ఈజీగా మానుకోలేరు. ఆ రుచి అలా కట్టిపడేస్తుంది. అయితే లాక్టోస్ పడని వారు ఇవి తీసుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి వారు ఏం చేస్తే బెటర్? నెయ్యికి ప్రత్యామ్నాయాలు ఏం ఉన్నాయి వంటి వాటి గురించి సవివరంగా చూద్దామా..!.లాక్టోస్ అసహనం అంటే..లాక్టోస్ అసహనం అనేది జీర్ణక్రియ పరిస్థితి. ఇది పాలల్లో ఉండే చక్కెర అయిన లాక్టోస్‌ను జీర్ణం చేయడం కష్టతరం చేస్తుంది. లాక్టేజ్ అనే ఎంజైమ్ లోపం వల్ల ఈ సమస్య వస్తుంది. ఈ లాక్టోస్ సరిపడని కారణంగా ఆయ వ్యక్తులు ఈ కింది సమస్యలను ఫేస్ చేస్తుంటారు. అవేంటంటే..కడుపు నొప్పివాంతులువిరేచనాలునిరంతర కడుపు ఉబ్బరంగ్యాస్ సమస్య అలాంటి వారు వెన్న కంటే నెయ్యి తీసుకోవడం మంచిదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే నెయ్యిలో తక్కువ లాక్టోస్ ఉంటుంది. కాచినప్పుడు లాక్టోస్ కోల్పోయి కొవ్వులు మాత్రమే ఉంటాయి. అదే వెన్నలో ఎక్కువ లాక్టోస్ ఉంటుంది. అందువల్ల లాక్టోస్ అసహనం ఉన్నవారికి ఇది అంత సురక్షితం కాదు. ప్రత్యామ్నాయాలు..సాధారణ పాలకు ప్రత్యామ్నాయంగా సోయా పాలు, బాదం పాలు, బియ్యం పాలు మంచివి. అలాగే కొబ్బరి లేదా బఠానీ పాలను కూడా ఉపయోగించొచ్చు. ఇవన్నీ పోషకమైనవి సాధారణ ఆవు పాలకు బెస్ట్ ప్రత్యామ్నాయాలు. నోట్: ఈ కథనం కేవలం అవగాహన కొరకు మాత్రమే! View this post on Instagram A post shared by Amita Gadre | Nutritionist (@amitagadre) (చదవండి: మరమరాల చాట్ అమ్ముతూ బ్రిటిష్ వ్యక్తి..!) -
పాలు లేకుండా వెన్న.. ఇది కదా టెక్నాలజీ అంటే!
వెన్న కావాలంటే పాలు ఉండాల్సిందే అంటారు ఎవ్వరైనా.. అయితే వెన్న కోసం పాలు ఏ మాత్రం అవసరం లేదంటోంది కాలిఫోర్నియాకు చెందిన 'సావోర్' (Savor) కంపెనీ. ఇంతకీ ఇది నిజమైన వెన్నెనా? తినడానికి పనికొస్తోందా? దీన్ని ఎలా తయారు చేశారనే ఆసక్తికర విషయాలు ఇక్కడ చూసేద్దాం..కాలిఫోర్నియాకు చెందిన సావోర్ కంపెనీ పాలు లేదా మరే ఇతర పాల ఉత్పత్తులను ఉపయోగించకుండా వెన్నని సృష్టించే ప్రక్రియను అభివృద్ధి చేసింది. ఈ కంపెనీ టెక్ దిగ్గజం, బిలినీయర్ బిల్ గేట్స్ మద్దతుతో నడుస్తున్నట్లు సమాచారం.సావోర్.. వెన్నను కార్బన్ డయాక్సైడ్, హైడ్రోజన్, ఆక్సిజన్ కలయికతో వెన్నను సృష్టిస్తోంది. ఇది సాధారణ వెన్న మాదిరిగానే అదే రుచిని కలిగి ఉంటుందని పేర్కొంది. ఈ కంపెనీ ఐస్‌క్రీమ్, చీజ్, పాలతో సహా పలు ఉత్పత్తులకు పాల రహిత ప్రత్యామ్నాయాలను రూపొందించడానికి ప్రయోగాలు చేస్తోంది. ఇందులో భాగంగానే వెన్నను తయారు చేసింది.సాంప్రదాయ పాల వనరులపై ఆధారపడకుండా, వాయువులను ఉపయోగించి కొవ్వు అణువులను అభివృద్ధి చేయడానికి కంపెనీ థర్మోకెమికల్ ప్రక్రియను ఉపయోగిస్తుంది. గ్రీన్హౌస్ వాయువులు పశు పరిశ్రమ నుంచి సుమారు 14.5 శాతం వెలువడుతున్నట్లు ఐక్యరాజ్యసమితి పేర్కొంది. ఈ శాతాన్ని తగ్గించడానికి ప్రయత్నించాలని సూచించింది.పశు పరిశ్రమ నుంచి వచ్చే ఉద్గారాలను తగ్గించడానికి సరైన మార్గం.. మాంసం, పాల ఉత్పత్తుల వినియోగాన్ని తగ్గించడమే. దీనిని దృష్టిలో ఉంచుకుని సావర్ పాల అవసరం లేకుండానే వెన్నను విజయవంతంగా తయారు చేసింది. నిజమైన వెన్నలో కేజీకి 16.9 కేజీ కార్బన్ డై ఆక్సైడ్‌కు సమానమైన కార్బన్ ఉంటుంది. పాల అవసరం లేకుండా చేసిన వెన్న కేజీకి 0.8 గ్రామ్స్ CO2 కంటే తక్కువ కార్బన్ పాదముద్రను కలిగి ఉంటుందని చెబుతున్నారు. ఈ వెన్న రుచి చాలా బాగుందని బిల్‌గేట్స్ ఓ వీడియోలో పేర్కొన్నారు. -
మీరెప్పుడైనా బొప్పాయి బన్స్ ట్రై చేసారా..!
కావలసినవి: బొప్పాయి గుజ్జు, బాదం పౌడర్ – 1 కప్పు చొప్పున పీనట్ బటర్, అవిసెగింజల పొడి – అర కప్పు చొప్పున, వెనీలా ఎక్స్ట్రాక్ట్ – అర టీ స్పూ¯Œ , బాదం – జీడిపప్పు ముక్కలు, మినీ చాక్లెట్ చిప్స్ – 2 టేబుల్ స్పూన్ల చొప్పున కొబ్బరి తురుము – కొద్దిగా (గార్నిష్‌కి) తయారీ విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకుని.. అందులో బొప్పాయి గుజ్జు, అవిసెగింజల పొడి, బాదం పౌడర్ వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత వెనీలా ఎక్స్ట్రాక్ట్, పీనట్స్ బటర్, బాదం – జీడిపప్పు ముక్కలు వేసుకుని.. మరోసారి బాగా కలుపుకోవాలి. అనంతరం చాక్లెట్ చిప్స్ వేసుకుని ఒకసారి కలుపుకుని.. చేతులకు కొద్దిగా నెయ్యి రాసుకుని.. ఆ మొత్తం మిశ్రమాన్ని చిన్నచిన్న ఉండలుగా చేసుకోవాలి. వాటిని కొబ్బరి కోరులో వేసి, దొర్లించి.. సర్వ్ చేసుకోవాలి. ఇవి చదవండి: స్వీట్ పొటాటో బన్స్.. క్షణాలలో ఇలా రెడీ చెయొచ్చు! -
రొయ్యలతో.. టేస్టీ టేస్టీగా బట్టర్ గార్లిక్ ఫ్రాన్స్ చేయండిలా..!
గ్లారిక్ బటర్ ప్రాన్స్‌కి కావలసినవి: పచ్చిరొయ్యలు – అరకేజీ వెల్లుల్లి రెబ్బలు – ఐదు వెన్న – రెండు టేబుల్ స్పూన్లు నూనె – టేబుల్ స్పూను కారం – టీస్పూను మిరియాల పొడి – అర టీస్పూను నిమ్మరసం – టేబుల్ స్పూను కొత్తిమీర తరుగు – పావు కప్పు ఉప్పు – రుచికి సరిపడా. తయారీ విధానం: రొయ్యలను శుభ్రం చేసి, నాలుగైదు సార్లు కడగాలి. మందపాటి బాణలిలో టేబుల్ స్పూను వెన్న, నూనె వేసి మంటమీద పెట్టాలి. వెన్న కరిగిన వెంటనే కడిగిన రొయ్యలు వేసి రెండు నిమిషాలు వేయించాలి. తరువాత రుచికి సరిపడా ఉప్పు, మిరియాలపొడి వేసి కలపాలి. ఐదు నిమిషాలు మగ్గిన తరువాత వెల్లుల్లి రెబ్బలను సన్నగా తరిగి వేయాలి. రెండు నిమిషాలు తరువాత మిగిలిన వెన్న, కారం నిమ్మరసం వేసి అన్ని కలిసేలా కలపాలి. వెన్న పైకి తేలేంత వరకు వేయించాలి. వెన్న పైకి తేలిన తరువాత సన్నగా తరిగిన కొత్తిమీర చల్లి దించేయాలి. (చదవండి: ఈజీగా బరువు తగ్గేలా..ఈ ఓట్స్ లడ్డూ ట్రై చేయండిలా!) -
Srikrishna Janmashtami: కన్నయ్యకు ఇష్టమైన వెన్న, అటుకులతో ప్రొటిన్ లడ్డు, అవల్ పుట్టు!
Srikrishna Janmashtami 2022- Protein Laddu- Aval Puttu Recipes: శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని కృష్ణునికి ప్రియమైన అటుకులు, నెయ్యితో విభిన్న రకాల నైవేద్యాలను సమర్పిద్దాం... రుచులను ఆస్వాదిద్దాం.. ప్రోటీన్ లడ్డు కావలసినవి: ►వెన్న – టేబుల్ స్పూను ►జీడిపప్పు పలుకులు – మూడు టేబుల్ స్పూన్లు ►కిస్మిస్ – మూడు టేబుల్ స్పూన్లు ►పచ్చికొబ్బరి తురుము – ముప్పావు కప్పు ►బెల్లం తరుగు – అరకప్పు ►అటుకులు – రెండు కప్పులు ►యాలకులు – ఆరు. తయారీ: ►జీడిపప్పు, కిస్మిస్లను వెన్నలో వేయించాలి. ►ఇవి వేగిన తరువాత కొబ్బరి తురుము వేసి దోరగా వేయించాలి ►కొబ్బరి కూడా వేగాక బెల్లం వేయాలి ►మరో బాణలిలో అటుకులను దోరగా వేయించి, యాలకులు వేసి మిక్సీజార్ లో పొడిచేసి పెట్టుకోవాలి ►బెల్లం కరిగిన తరువాత అటుకుల పొడి వేసి చక్కగా కలుపుకుని లడ్డులా చుట్టుకుంటే ప్రోటీన్ లడ్డు రెడీ. అవల్ పుట్టు కావలసినవి: ►అటుకులు – అరకప్పు ►బెల్లం – అరకప్పు ►పచ్చికొబ్బరి తురుము – రెండు టేబుల్ స్పూన్లు ►జీడిపప్పు పలుకులు – ఆరు ►యాలకుల పొడి – పావు టీస్పూను ►నెయ్యి – రెండు టీస్పూన్లు ►ఉప్పు – చిటికెడు. తయారీ: ►అటుకులను మూడు నిమిషాలపాటు రంగు మారకుండా దోరగా వేయించుకుని, చల్లారాక మిక్సీ జార్లో వేసి రవ్వలా గ్రైండ్ చేయాలి ►రవ్వను వెడల్పాటి పాత్రలో పోసుకుని, చిటికెడు ఉప్పు వేసి కలపాలి. ►దీనిలో కొద్దికొద్దిగా వేడి నీళ్లు చల్లుతూ కలుపుకోవాలి. ►రవ్వ మరీ మెత్తగా కాకుండా గుప్పెట్లో పట్టుకుని వత్తితే ఉండయ్యేంత మెత్తగా కలిపి పదినిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ►టీస్పూను నెయ్యిలో జీడిపప్పుని బంగారు వర్ణంలోకి మారేంత వరకు వేయించి పక్కనపెట్టుకోవాలి ►ఇప్పుడు మందపాటి పాత్రలో బెల్లం, పావు కప్పు నీళ్లుపోసి మరిగించాలి. ►బెల్లం కరిగిన వెంటనే ద్రావణాన్ని వడగట్టాలి ∙వడగట్టిన ద్రావణాన్ని ఉండపాకం రానివ్వాలి. ►పాకం రాగానే స్టవ్ ఆపేసి.. తడిపిపెట్టుకున్న అటుకుల రవ్వ వేసి తిప్పాలి ►రవ్వను చక్కగా కలుపుకున్న తరువాత జీడిపప్పు, కొబ్బరి తురుము, మిగిలిన నెయ్యి వేసి అందంగా గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవాలి. ఇవి కూడా ట్రే చేయండి: Bread Jamun Recipe: బ్రెడ్ జామూన్ ఇంట్లోనే తయారు చేసుకోండిలా! దాల్ బనానా ఖీర్, కలాకండ్ లడ్డూ తయారీ ఇలా! -
ట్విటర్లో ‘పన్నీర్ బటర్ మసాలా’ నడుస్తోంది.. మీమ్స్‌తో రెచ్చిపోతున్న నెటిజన్లు!
పాలతో ఏ వంటకం చేసిన రుచి అదిరిపోతుంది. అందుకే పాల ఉత్పత్తులతో చేసే ఏ వ్యాపారమైన మంచి లాభాలను తెచ్చిపెడుతుంది. అందుకే మార్కెట్లో కూడా వాటికి గిరాకీ బాగానే ఉంటుంది. అయితే గత రెండు సంవత్సరాలుగా కరోనా లాక్డౌన్, ధరల పెరుగుదల వంటి కారణలతో చాలా వ్యాపారాలు దెబ్బతిన్నాయి. ప్రజల ఆదాయ మార్గాలు కూడా చాలా వరకు తగ్గు ముఖంపట్టాయి. ఇప్పుడిప్పుడే ప్రజలు మునుపటి పరిస్థితుల్లోకి అడుగుపెడుతున్నారు. ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం నూతనంగా సవరించిన జీఎస్టీతో ప్రజలకు షాకిచ్చిందనే చెప్పాలి. ఈ సారి జీఎస్టీ స్లాబ్‌లో పాల ఉత్పత్తులను చేర్చడంతో వ్యాపారులకు షాక్, ప్రజలపై మరింత భారం పడనుంది. గత నెలలో జరిగిన రెండు రోజుల జీఎస్టీ కౌన్సిల్ 47వ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కొత్తగా కొన్ని వస్తువులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడంతో పాటు మరికొన్ని వస్తువుల స్లాబ్‌ను పెంచారు. సవరించిన ధరలు జూలై 18 నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో పన్నీర్, ఇతర పాల ఉత్పత్తులు ఇకపై మునుపటి కంటే ఎక్కువ ధర ఉంటుంది. ఈ జీఎస్టీ విధింపులపై ట్విటర్ వేదికగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొత్త జీఎస్టీ ప్రకారం.. పన్నీర్ పై 5 శాతం, బటర్‌పై 12 శాతం, మసాలాపై 5 శాతం విధించారు. ఈ క్రమంలో నెటిజన్లు కేంద్రం పై వ్యంగ్యంగా విమర్శలు చేస్తూ ట్విట్ చేస్తున్నారు. దీంతో ట్విటర్లో #PaneerButterMasala ( పన్నీర్ బటర్ మసాలా) ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. నెటిజన్లు కేంద్రాన్ని విమర్శిస్తూనే ఫన్నీగా పోస్ట్‌లు పెడుతున్నారు. GST on Paneer butter masala after this GST mathmatics Exam comes new Calculation 🤣😃😂 Keep Solve pic.twitter.com/74DPCjaa58 — A. AHMAD (@ASGARAHMAD84) July 20, 2022 Paneer Butter Masala at Middle Class Homes After New GST slabs. pic.twitter.com/mfFzw5TziA — Garima Kaushik (@Garimakaushikk) July 20, 2022 Paneer Butter Masala is trending. Me in hostel : pic.twitter.com/oZHOTjhRDC — Varsha saandilyae (@saandilyae) July 20, 2022 -
Trendy Toaster: నిమిషాల్లో టోస్ట్ చేసుకోవచ్చు.. ధర రూ.3,733!
బిజీ షెడ్యూల్లో వండి, వేయించే వంటకాలకంటే.. ఏ బటరో, సాసో పూసుకుని తినే టోస్టర్ రుచులే బెటరనిపిస్తుంది. అలాంటి వారి కోసం ఈ మేకర్. ఇందులో బ్రెడ్ టోస్ట్, బేగెల్స్, మఫిన్స్, బన్స్ (పెద్దగా ఉంటే మధ్యకు కట్ చేసుకుని పెట్టుకోవాలి).. ఇలా ఎన్నో రుచులను నిమిషాల్లో టోస్ట్ చేసుకోవచ్చు. బేగెల్ లేదా మఫిన్, రీ–హీట్, డిఫ్రాస్ట్.. వంటి పలు ఆప్షన్స్‌తో పాటు 7 స్థాయిల్లో టెంపరేచర్ పెంచుకునేందుకు ప్రత్యేకమైన రెగ్యులేటర్ కూడా ఉంటుంది. దాంతో ఇందులో ప్రతి ఐటమ్‌ని ఏడు షేడ్స్‌లో టోస్ట్ చేసుకోవచ్చు. డివైజ్ కింద భాగంలో ఒక ట్రే ఉంటుంది. దానిలోకి చేరిన వ్యర్థాలను తొలగించి, దీన్ని శుభ్రం చేసుకోవడం కూడా తేలికే. ఈ స్టయిలిష్ టోస్టర్.. కౌంటర్ టాప్‌లో స్థలాన్ని ఆదా చేస్తుంది. ఇదే మోడల్లో లైట్ ఎల్లోతో పాటు లైట్ గ్రీన్, బ్లాక్, సిల్వర్ కలర్ డివైజ్‌లు మార్కెట్లో బాగా అమ్ముడుపోతున్నాయి. ధర 49 డాలర్లు- (రూ.3,733) చదవండి: Electric Citrus Juicer: ఇంట్లోనే ఇలా జ్యూస్ చేసుకోండి.. దీని ధర రూ.8,909! -
ఇమ్యూనిటీని పెంచడంలో ఇదే కీలకం.. దూరంపెట్టకండి
కొవ్వు పెరిగేందుకు దోహదం చేస్తుందని, అనారోగ్య కారకమనీ వెన్నను దూరం పెట్టడం సరైంది కాదంటున్నారు న్యూట్రిషనిస్ట్‌లు. విభిన్న రకాల ఆరోగ్య ప్రయోజనాలను వెన్న అందిస్తుందంటున్నారు. యువత వెన్నను ఆహారంలో భాగం చేయడం అన్ని రకాలుగా ఉపయుక్తమవుతుందంటున్నారు. ఇమ్యూనిటీని పెంచడంలో పోషకవిలువలు అందించడంలో బటర్/వెన్నలు కీలక పాత్ర పోషిస్తాయని సహజాహార నిపుణులు కిశోర్ ఇందుకూరి తెలిపారు. హైదరాబాద్ కేంద్రంగా డైరీ ఉత్పత్తులను అందించే సిథ్స్ ఫార్మ్ తయారు చేసిన ఆవు/గేదె వెన్నలను మంగళవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా కిశోర్ ఇందుకూరి మాట్లాడుతూ వెన్న వల్ల బరువు పెరుగుతాము అనే అపోహలను ఖండించారు. వెన్నలో 740కిలో కేలరీల శక్తి, 0.6 గ్రాముల ప్రొటీన్స్ లభ్యమవుతాయని, అలాగే ఎ,డి,ఇ విటమిన్లను కూడా ఇవి అందిస్తాయని కిశోర్ వివరించారు. అయితే ఇంట్లో వండుకునే వంటల్లో వీలున్నంత వరకూ ఆవు పాల నుంచి తయారైన వెన్నను వినియోగించాలని ఆయన సూచించారు. అదే ఆరోగ్యకరమన్నారు. అలాగే బేకరీ ఉత్పత్తుల్లో మాత్రం గేదె పాల నుంచి తయారైన వెన్నను వాడుకోవడం... ఇలా విభజిస్తే అటు రుచితో పాటు ఇటు ఆరోగ్యకరం కూడా అని స్పష్టం చేశారు. చదవండి: Nutraceutical: ట్యాబ్లెట్స్ రూపంలో పోషకాలు.. మస్తుగా కెరీర్ అవకాశాలు!! -
BTS Butter Music Video: గంటలో రికార్డులు బద్ధలు!
'బీటీఎస్'... వరల్డ్ వైడ్‌గా పిచ్చి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న మ్యూజిక్ బ్యాండ్. ఇండియాలోనూ ఈ గ్రూప్‌కి డై హార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు. ఏడుగురు సౌత్ కొరియన్ బాయ్స్‌తో ఉండే ఈ గుంపు.. పాప్ ప్రపంచంలో ఓ ప్రభంజనం. కొరియా నుంచి మొదలై జపాన్, అమెరికా.. ఇలా వరుస దేశాల్లో అభిమానుల్ని ఉర్రూతలూగిస్తూ.. ఇంటర్నేషనల్ సెన్సేషన్‌గా మారింది. వీళ్ల ఆల్బమ్స్ మిలియన్ల కొద్దీ కాపీల్ని అమ్ముడు పోతుంటాయి. రీసెంట్గా ట్విట్టర్, యూట్యూబ్‌లతో అదిరిపోయే రికార్డులతో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది బీటీఎస్. బీటీఎస్ లేటెస్ట్ ఆల్బమ్ ‘బటర్’ శుక్రవారం ఉదయం రిలీజ్ అయ్యింది. అయితే రిలీజ్ అయిన కాసేపటికే రికార్డుల మోత మొదలైంది. సాంగ్ లాంచ్ లైవ్‌ను 3.89 మిలియన్ల మంది యూట్యూబ్ ప్రీమియర్‌లో వీక్షించగా, కేవలం పదమూడు నిమిషాల్లోనే కోటి మంది యూట్యూబ్‌లో ఈ ఆల్బమ్‌ను చూశారు. 54 నిమిషాల్లో రెండు కోట్ల మంది వీక్షించడం కూడా యూట్యూబ్‌లో ఓ రికార్డే. ఇది వరకు ఈ రికార్డు బీటీఎస్ వాళ్ల ‘డైనమైట్’ ఆల్బమ్ పేరిటే ఉండేది. ఇక నాలుగు గంటల్లో యూట్యూబ్‌లో 37 మిలియన్ల వ్యూస్ దాటేసి దూసుకుపోతోంది బటర్. ఇది బీటీఎస్కి రెండో ఇంగ్లీష్ సింగిల్ ఆల్బమ్. ఇంకోవైపు వరల్డ్‌వైడ్‌గా బటర్‌కి సంబంధించిన హ్యాష్‌ట్యాగులు ట్విట్టర్లో టాప్ ట్రెండ్‌లో కొనసాగుతున్నాయి. -
వెన్న రుచికరమే కాదు...ఆరోగ్యకరం కూడా!
ఇటీవల నూనెల వాడకం బాగా పెరిగాక వెన్నను గతంలోలా మునపటంత విరివిగా ఉపయోగించడం లేదు. కానీ నిజానికి వెన్న చాలా మంచి ఆరోగ్యకరమైన ఆహారం. వెన్నలోని కొన్ని పోషకాలూ, వాటితో కలిగే కొన్ని ఆరోగ్య ప్రయోజనాలేమిటో చూద్దాం. వెన్నలో విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ ఇ, విటమిన్ కె2 చాలా ఎక్కువ. వాటితో పాటు ఇందులో బ్యుటిరేట్, కాంజుగేటెడ్ లినోలిక్ యాసిడ్ (సీఎల్ఏ) అనే పోషకాలు ఉన్నాయి. వెన్నలోని కాంజుగేటెడ్ లినోలిక్ యాసిడ్ (సీఎల్ఏ) గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. వెన్నలోని బ్యుటిరేట్ అనే పోషకం అనేక మానసిక వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది. అంతేకాదు... ఇది మంచి శక్తివనరు. మన జీవక్రియలకు అవసరమైన శక్తిని ఇది సమకూరుస్తుంది. మనం తిన్న ఆహారం చిన్నపేగుల్లోకి ప్రవేశించాక... అక్కడ ఆ జీర్ణాహారం ఏమాత్రం వృథాపోకుండా అంతా ఒంటికి పట్టేలా చేస్తుంది వెన్నలోని ఈ బ్యుటిరేట్. బ్యూటిరేట్కు మరో మంచి లక్షణం కూడా ఉంది. చిన్న పేగుల్లో ఇన్ఫ్లమేషన్ను కూడా అది సమర్థంగా తగ్గిస్తుంది. -
వేడి వేడి బటర్ చాయ్.. నిర్వాహకుడిపై వ్యంగ్యాస్త్రాలు
న్యూఢిల్లీ: పొద్దున్నే ఒక కప్పు చాయ్, కాఫీ కడుపులో పడితేగాని ఆ రోజు రోజులా ఉండదు. లేవగానే గరం గరం చాయ్ తాగిన తర్వాతే ఏ పని అయిన మొదలు పెడతాం. అయితే ఉదయాన్నే తీసుకునే ఈ టీని ప్రజలంతా రకరకాలుగా తయరు చేసుకుంటారు. అల్లం టీ, లెమన్ టీ, మసాలా టీ, ఇలా కొన్ని రకాలుంటాయి. అయితే ఎప్పుడైన బటర్ చాయ్ తాగారా. ఆ రకం చాయ్ ఉంటుందని కనీసం ఊహించారా? అయితే ఓసారి చూడండి మరి. ఆగ్రాలోని ఓ టీ నిర్వహకుడు మరుగుతున్న టీలో బటర్ కట్ చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోకు ఇప్పటికి వరకు 2.5 లక్షలకు పైగా వ్యూస్ రాగా వేడి వేడి బటర్ టీ అందిస్తున్న టీ స్టాల్ నిర్వహకుడిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. (చదవండి: వేడి వేడి బటర్ చాయ్.. నిర్వహకుడిపై వ్యంగ్యాస్త్రాలు) ఆగ్రాలో బాబా స్టాల్ షాపు నిర్వహకుడు వెరైటీగా ఆలోచించాడు. ఇందుకోసం మరుగుతున్న టీలో బటర్ ముక్కలుగా కట్ చేసి వేశాడు. బటర్ కరిగాక ఆ చాయ్‌ని వడపోపి పెట్టాడు. ఈ వీడియోను ఫుడ్డీస్ అనే ఇన్స్టాగ్రామ్ పేజీలో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. ఇక అది చూసిన నెటిజన్లు ‘చాయ్‌లో వెన్న వేయడం ఏంట్రా బాబు’ అంటూ తల పట్టుకుంటుండగా మరికొందరూ వ్యంగ్యాస్త్రాలు వదులుతున్నారు. ‘టీలో బటర్‌తో పాటు సాస్, మయోన్నైస్ కూడా కాస్తా వేయ్’, ‘కొంచం పావ్ బాజీ కూడా వేయండి’ అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. (చదవండి: కొడుకుతో పెళ్లి.. బిడ్డకు జన్మనిచ్చిన సెలబ్రిటీ) View this post on Instagram A post shared by FOODIEAGRA (@foodieagraaaaa) -
పురుగుల లార్వాతో కేకులు, కుకీలు
-
పుట్టినరోజు నాడే ప్రాణం తీసిన వెన్న
లండన్: ఒవెన్ కారీ అనే యువకుడు తన 18వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవడం కోసం లండన్ థేమ్స్ నది ప్రాంతాన్ని ఎంచుకున్నాడు. స్నేహితులతో కలిసి పుట్టిన రోజు వేడుకల నిమిత్తం నది పక్కనే ఉన్న బైరన్ చైన్ అనే రెస్టారెంట్‌కు వెళ్లాడు. కేక్ కటింగ్ లాంటి కార్యక్రమాలు ముగిసిన తర్వాత భోజనం ఆర్డర్ చేశాడు. అయితే ఒవెన్‌కు డెయిరీ ఎలర్జీ(పాల సంబంధిత ఉత్పత్తులు పడకపోవడం) ఉంది. చికెన్ బ్రెస్ట్ ఆర్డర్ చేసిన ఒవెన్ ఎందుకైనా మంచిదని తనకున్న డెయిరీ ఎలర్జీ గురించి హోటల్ యాజమాన్యానికి సమాచారం ఇచ్చాడు. ఆ తర్వాత ఆహారం రావడంతో స్నేహితులతో కలిసి సరదాగా ఎంజాయ్ చేస్తూ భోజనం చేశాడు. ఆహారం స్వీకరించిన కాసేటికే ఒవెన్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. ముందు అతని పెదవులు ఒంకర్లు పోవడం.. కడుపులో మంట.. ఆ తర్వాత ఆకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తరలించే లోపే ఒవెన్ మరణించాడు. ఈ సంఘటన 2017లో జరిగింది. నాటి నుంచి నేటి వరకు ఒవెన్ మృతికి గల కారణం మాత్రం తెలియలేదు. ఈ నేపథ్యంలో సౌత్వార్స్ కరోనర్స్ కోర్టు తాజాగా ఒవెన్ మృతికి గల కారణాల్ని వెల్లడించింది. తీవ్రమైన ఫుడ్ ఎలర్జీ వల్లే ఒవెన్ మరణించినట్లు కోర్టు ప్రకటించింది. పుట్టిన రోజునాడు ఒవెన్, బైరన్ చైన్ రెస్టారెంట్లో ఆహారం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తనకు డెయిరీ ఎలర్జీ ఉందని ఒవెన్ హోటల్ సిబ్బందికి తెలిపాడు. కానీ వారు ఆ విషయాన్ని మర్చిపోయి.. ఒవెన్ ఆర్డర్ చేసిన చికెన్ బ్రెస్ట్ పీస్‌ను వెన్నతో కలిపి ఉడికించారు. సదరు పదార్థంలో వెన్న ఉందనే విషయాన్ని తెలిపారు కానీ.. దాన్ని చాలా సూక్ష్మంగా ముద్రించడంతో ఆ విషయం ఒవెన్ దృష్టికి రాలేదు. దాంతో అతడు ఆ ఆహారాన్ని స్వీకరించడం.. మరణించడం క్షణాల్లో జరిగిపోయాయి. ఒవెన్ మరణం అతడి కుటుంబానికి తీవ్ర విషాదం మిగిల్చినప్పటికి.. ఓ కొత్త చట్టం రావడానికి మాత్రం దోహదపడింది. ఒవెన్ కేసు విచారణ సందర్భంగా కోర్టు ఇక మీదట రెస్టారెంట్లలో ప్రతి ఆహారం మీద ఎలర్జీ లేబుల్స్‌ను ఉంచాలని ఆదేశించింది. ప్రతి వంటకం మీద.. దానిలో వాడిన పదార్థాల వివవరాలతో పాటు కలిగే ఎలర్జీల గురించి ఖచ్చితంగా పేర్కొనాలని స్పష్టం చేసింది. రెస్టారెంట్లు తీసుకునే ఈ చిన్న చిన్న చర్యల వల్ల నిండు ప్రాణాన్ని కాపాడగల్గుతామని కోర్టు స్పష్టం చేసింది. -
డ్యూక్స్ ‘బటర్ ఫ్లేవర్డ్’ వాఫీ
హైదరాబాద్: రవి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ తాజాగా ‘బటర్ ఫ్లేవర్డ్’ వాఫీ ని మార్కెట్లో ఆవిష్కరించింది. ఈ క్రీమీ, క్రంచ్ వాఫీ వినియోగదారులకు కొత్త ఫ్లేవర్‌తో మంచి అనుభూతిని ఇస్తుందని కంపెనీ తెలిపింది. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రవిందర్ అగర్వాల్ ఆలోచనలకు అనుగుణంగా వినియోగదారుల అభిరుచుల మేరకు కొత్త ఫ్లేవర్లను ఆవిష్కరించడానికి రవి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ డ్యూక్స్ ముందుంటుందని పేర్కొంది. చాకొలెట్స్, వాఫీలు, కుకీస్, బిస్కెట్లసహా పలు ప్యాకేజ్డ్ ఫుడ్ ఇండస్ట్రీలో రెండు దశాబ్దాలుగా సంస్థ కీలకపాత్ర పోషిస్తోందని వివరించింది. ‘‘క్రీమీ వాఫర్ విభాగం మార్కెట్లో రవి ఫుడ్స్ వాటా దాదాపు రూ.45,000 కోట్లు. ఏడాదికి 10 శాతం నుంచి 12 శాతం వృద్ధి నమోదుచేసుకుంటోందని ఎండీ అగర్వాల్ ఇటీవల ఒక ప్రకటనలో తెలిపారు. -
అయ్యంగార్ బేకరీ
పొట్ట చేత పట్టుకుని హసన్ నుంచి బెంగళూరు చేరుకున్నారు... కోట్లకు అధిపతి అయినా, వినయమే ఆభరణంగా ఎదిగారు... సంప్రదాయాన్ని పాటిస్తూ, శుచిశుభ్రతలతో రంగరించిన రుచులను అందిస్తున్నారు... బేకరీ వస్తువులకు భారతదేశంలోనే ఐకాన్‌గా నిలిచారు... ఆయనే హెచ్ఆర్ తిరుమలాచార్... మొట్టమొదటి అయ్యంగార్ బేకరీ బిబి (బెంగళూరు బ్రదర్స్) బేకరీ పేరున 1898లో సోదరుడితో కలిపి స్థాపించారు తిరుమలాచార్. చిక్పేట్ ప్రాంతంలో ప్రారంభించిన కొత్తల్లో్ల స్వీట్స్ మాత్రమే అమ్మేవారు. ఆ స్వీట్ల రుచులను ఆస్వాదించడానికి అక్కడకు ప్రతిరోజూ ఒక ఇంగ్లిష్ వ్యక్తి వచ్చేవారు. ఆయన స్వీట్లు తింటూ, తిరుమలాచార్తో పిచ్చాపాటీ మాట్లాడుతూ, మాటల మధ్యలో బేకింగ్ ఉత్పత్తుల గురించి ప్రస్తావించారు. తిరుమలాచార్ మనసులో బేకింగ్ ఉత్పత్తులను ప్రారంభించాలనే ఆలోచన కలిగింది. అంతే, ఏవిధంగా బేక్ చేయాలి అనే విషయాన్ని ఆ ఇంగ్లిష్ వ్యక్తి దగ్గర నేర్చేసుకున్నారు తిరుమలాచార్. రుచికరమైన బ్రెడ్, బన్, బిస్కెట్ల అమ్మకంతో బేకరీకి లాభాలు రావడం ప్రారంభమయ్యాయి. చాలా వేగంగా బేకరీ పేరుప్రఖ్యాతులు నగరమంతా వ్యాపించాయి. 1970లో ఈ బేకరీని ‘బెంగళూరు బ్రాహ్మణ బేకరీ’ గా పేరు మార్చారు. బేకరీ లాభాల బాటలో నడుస్తుండటంతో, చాలామంది అయ్యంగార్లు హసన్ నుంచి బెంగళూరు వలస వచ్చి, బేకరీ వస్తువుల తయారీ నేర్చుకోవడం ప్రారంభించారు. చిన్న వీధి చివరన ప్రారంభమైన అయ్యంగార్ బేకరీ కొన్ని దశాబ్దాలుగా గర్వంగా తల ఎత్తుకుని నిలబడే స్థాయికి చేరుకుంది. ఒక తీపి జ్ఞాపకాన్ని నిరంతరం గుర్తు చేస్తూనే ఉంటుంది. సువాసనల కూడలి... బెంగళూరులోని జయానగర్ నాలుగో బ్లాక్ గుండా నడుస్తుంటే, అప్పుడే తాజాగా తయారవుతున్న బ్రెడ్ ఘుమఘుమలు ఆ వీధి చివరి దాకా వ్యాపించేస్తాయి. బటర్ కుకీస్ నుంచి వస్తున్న సువాసనలు మనలను ఒక్కసారిగా అక్కడ నిలబెట్టేస్తాయి. అక్కడ దొరికే వెజిటబుల్ పఫ్ కోసం లోపలకు అడుగులు వేస్తారు ఆహార ప్రియులు. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో బేకరీని పరిశీలిస్తే, గంటన్నర రెండు గంటల లోగా ఆహారపదార్థాలన్నీ కస్టమర్ల కడుపులు నింపేసి కనిపిస్తాయి. బెంగళూరులో ఉన్న అయ్యంగార్ బేకరీలలో నిత్యం కనిపించే సన్నివేశం ఇది. అయ్యంగార్ బేకరీలు నగరానికి కలికితురాయిగా నిలుస్తాయి. సుమారు వంద సంవత్సరాలుగా ఈ బేకరీలు కస్టమర్లను ఎంతో మర్యాదగా చూసుకుంటున్నాయి. ఎన్ని కొత్త రుచులు పుట్టుకొస్తున్నా, అయ్యంగార్ బేకరీ రుచులకు దీటుగా నిలబడవంటారు కస్టమర్లు. పెద్దలు ఏర్పరచిన సంప్రదాయాన్ని అనుసరిస్తూనే, అవసరాలకు అనుగుణంగా కొత్తదనాన్ని కూడా అందిపుచ్చుకుంటున్నాయి ఈ బేకరీలు. అయ్యంగార్ బేకరీలు బెంగళూరులో అంతర్భాగంగా మారిపోయాయి. తాజాగా... రుచిగా... బేకరీ ఐటతమ్స్ని సాయంత్రం తయారుచేసి, మరుసటి రోజు సాయంత్రంలోగా అమ్మేస్తుంటారు. బటర్, ఖారా, కొబ్బరి బిస్కెట్లు, రకరకాల పఫ్‌లు, బన్స్, బ్రెడ్స్, కేక్స్ చాలా ప్రత్యేకంగా ఉంటాయి. వెజిటబుల్ పఫ్, పొటాటో బన్స్, సుగరీ స్వీట్ హనీ కేక్స్ వంటి డెజర్ట్స్, దిల్పసంద్... వంటివి ఇక్కడ మాత్రమే తినాలి అనేంత రుచిగా ఉంటాయి. ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు ఆ రుచిని కాపాడుకుంటూ వస్తున్నారు. నాణ్యత కలిగిన వస్తువులను మాత్రమే ఉపయోగిస్తారు. ఈ పేరుతో ఉన్నవన్నీ వీరివే అని చెప్పడానికి వీలు లేదు అంటారు బెంగళూరులోని గాంధీ బజార్లో 62 సంవత్సరాలుగా శ్రీనివాస బ్రాహ్మణ బేకరీని నడుపుతున్న రామ్‌ప్రసాద్.. ఈ బేకరీలలో పనిచేస్తూ, వీటిని తయారుచేయడంలో నైపుణ్యం సాధించిన కొంతమంది, అక్కడ నుంచి విడిగా వెళ్లి, సొంతంగా ప్రారంభించుకున్నారు. అయ్యంగార్ల నుదుటన ఉండే నామమే వారికి గుర్తింపు. మేం ‘అష్టగ్రామ’ ప్రాంతం నుంచి వలస వచ్చాం. 1950–1960 ప్రాంతంలో అక్కడ కరువుకాటకాలు రావడంతో, మా తండ్రిగారు వ్యవసాయం చేయలేకపోయారు. చాలామంది అక్కడ నుంచి బెంగళూరుకు వలస వచ్చారు. ప్రభుత్వ ఉద్యోగాలు తక్కువగా ఉండేవి. అందువల్ల చాలామంది బేకరీ ఉత్పత్తుల తయారీని వృత్తిగా ఎంచుకున్నారు. సుమారు 120 సంవత్సరాలుగా ఈ వ్యాపారం నడుస్తోంది. తాజాగా, నాణ్యతతో ఉండే ఉత్పత్తులను మాత్రమే తయారుచేయడం అయ్యంగార్ బేకరీ విజయ రహస్యం. – హెచ్ఆర్ రామ్‌ప్రసాద్, శ్రీనివాస బ్రాహ్మణ బేకరీ, బెంగళూరు -
వెన్నతో వేయి లాభాలు!
గతంలో ఆహారాలలో వెన్నను బాగా వాడేవాళ్లం. రొట్టెలపైన వెన్న రాసుకుని తినేవాళ్లం. వేడి అన్నంలో వెన్నపూస వేసుకునే వాళ్లం. అయితే నూనెల వాడకం బాగా పెరిగాక వెన్న వాడకం తగ్గింది. కానీ నిజానికి వెన్న చాలా శ్రేష్ఠమైన, ఆరోగ్యకరమైన ఆహారం. ► వెన్నలో విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ ఇ, విటమిన్ కె2 చాలా ఎక్కువ. వాటితో పాటు ఇందులో బ్యుటిరేట్, కాంజుగేటెడ్ లినోలిక్ యాసిడ్ (సీఎల్ఏ) అనే పోషకాలు ఉన్నాయి. ► వెన్నలోని బ్యుటిరేట్ అనే పోషకం అనేక మానసిక వ్యాధుల నుంచి మనకు రక్షణ కల్పిస్తుంది. అంతేకాదు... ఇది మంచి శక్తివనరు. మన జీవక్రియలకు అవసరమైన శక్తిని ఇది సమకూరుస్తుంది. ► మనం తిన్న ఆహారం చిన్నపేగుల్లోకి ప్రవేశించాక... అక్కడ ఆ జీర్ణాహారం ఏమాత్రం వృథాపోకుండా అంతా ఒంటికి పట్టేలా చేస్తుంది వెన్నలోని బ్యుటిరేట్. దీనికి మరో సుగుణం కూడా ఉంది. చిన్న పేగుల్లో ఇన్ఫ్లమేషన్ను కూడా సమర్థంగా తగ్గిస్తుంది. ► వెన్నలోని బ్యుటిరేట్ పెద్ద పేగుల క్యాన్సర్‌ను సమర్థంగా నివారిస్తుంది. ► వెన్నలోని కాంజుగేటెడ్ లినోలిక్ యాసిడ్ (సీఎల్ఏ) విషయానికి వస్తే – మనకు అవసరమైన పోషకాలలో దానికీ ఎంతో ప్రాధాన్యం ఉంది. గుండె ఆరోగ్యానికి అదెంతో మంచిది. నిజానికి చాలామంది వెన్న తినడం వల్ల కొవ్వు పెరిగి, గుండె ఆరోగ్యానికి అదంత మంచిది కాదని అనుకుంటారు. కానీ పరిమితమైన వెన్న వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ► వెన్నలో యాంటీఆక్సిడెంట్స్, ఒమెగా–3, ఒమెగా–6 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఎక్కువే. ఇవి వ్యాధి నిరోధకశక్తి పెంచేందుకు, అనేక క్యాన్సర్ల నుంచి రక్షణ కల్పించేందుకు దోహదపడతాయి. ► చాలామందికి వెన్న వల్ల స్థూలకాయం వస్తుందనే అపోహ ఉంటుంది. కానీ పరిమితమైన వెన్న వల్ల స్థూలకాయుల్లో కొవ్వు పాళ్లు తగ్గుతాయి. వెన్న తిన్న తర్వాత ఉండే సంతృప్త భావన మితిమీరి తినడాన్ని ఆపుతుంది. ఆ చర్య ద్వారా బరువు పెరగకుండా చూస్తుంది. మరీ ముఖ్యంగా పొట్టలోని కొవ్వు తగ్గడానికి వెన్న దోహదపడుతుంది. ఇలా మన ఆహారంలో పరిమితంగా వెన్న తీసుకోవడం వల్ల కలిగే లాభాలు అన్నీ ఇన్నీ కావు. అయితే వెన్నతో ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి కదా అని ఎక్కువగా తీసుకోవడం మాత్రం సరికాదు. రోజుకు 25 గ్రాములు మితం. -
వెన్నతో గుండెకు నష్టం లేదు
వాషింగ్టన్ : వెన్న తినడం వల్ల గుండెకు వచ్చిన ప్రమాదమేమీ లేదని తాజాగా ఒక అధ్యయనంలో తేలింది. నిర్ణీత పరిమాణంలో వెన్నని తీసుకుంటే మధుమేహం నుంచి కూడా తప్పించుకోవచ్చని టఫ్ట్స్ యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు. వెన్న తీసుకోవడం వల్ల హృదయ సంబంధ వ్యాధులు రావని పేర్కొన్నారు. మొత్తం 15 దేశాల్లో ఈ సర్వేను నిర్వహించారు. రోజుకు 14 గ్రాముల (ఒక టేబుల్ టీ స్పూన్) వెన్నను ఆహారంలో తీసుకోవచ్చని వివరించారు. మరీ ఎక్కువ పరిమాణంలో వెన్న తీసుకుంటే గుండె సంబంధిత వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని పరిశోధకులు ల్యూరా పింపిన్ పేర్కొన్నారు. పిండిపదార్థాలు, చక్కెర, వంట నూనెల కన్నా వెన్న మేలని తెలిపారు. -
ఫాస్ట్ ఫుడ్ పోటీల్లో అందాల భామ!
గ్లామర్ ప్రపంచంలో... అందాల భామలు వారి వారి శరీరారోగ్యాన్ని, సౌందర్యాన్ని కాపాడుకునేందుకు ఆహారం విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకుంటుంటారు. ఏది పడితే అది తినకపోగా... ఫాస్ట్ ఫుడ్‌కు మరీ దూరంగా ఉంటారు. కానీ ఆ సుందరి అభిరుచులు మాత్రం అందుకు పూర్తి భిన్నంగా కనిపిస్తాయి. ఒకప్పుడు మిస్ ఎర్త్ న్యూజిలాండ్ పోటీలలో పాల్గొన్న నేలా జిస్సెర్ అనే అమ్మాయి.. ఇటీవల ఓ ఫాస్ట్ ఫుడ్ పోటీలో పాల్గొని కేవలం వంద సెకన్లలో ఏకంగా 27 కప్పుల వేరుశనగ వెన్నను లాగించేసి అందర్నీ ఆశ్చర్యంలో పడేసింది. 23 ఏళ్ల జిస్సెర్.. కావడానికి గ్లామర్ గాళ్ అయినా తినడం మొదలుపెడితే మాత్రం ఆమెను తలదన్నేవారే ఉండరట. ఆమెకు ఇదే మొదటిసారి కాదు. ఇంతకుముందు ఎన్నో పోటీల్లో పాల్గొని తనదైన శైలిలో రకరకాల ఆహార పదార్థాలను అలవోకగా లాగించేసి కప్పులు కొట్టేసింది. అందులో భాగంగానే తాజాగా 2,970 కాలరీస్ కలిగిన 27 కప్పుల పీనట్ బటర్‌ను వంద సెకన్లలో.. మధ్య మధ్యలో కాసిన్ని పాలు తాగుతూ లాగించింది. మోడల్స్ సాధారణంగా చాక్లెట్ ట్రీట్స్కు దూరంగా ఉంటారు. కానీ ఈ ముద్దుగుమ్మ మాత్రం ఎక్కడ పోటీ జరిగినా వదలకుండా... తన ప్రతాపం చూపిస్తుంటుంది. ఈసారి నిజానికి 35 కప్పుల పీనట్ బట్టర్ తినాలని ప్లాన్ చేసిన జిస్సర్.. వంద సెకన్లలో 27 కప్పులను మాత్రమే పూర్తి చేయగలిగింది. ఆమె మరింత వేగంగా తినేందుకు వెనుక నృత్య, సంగీతాలతో ప్రోత్సాహాన్ని కూడా అందించారు. అయితే ఆమె.. ఎక్కువ నములుతూ తినడం వల్ల సమయం వేగంగా గడిచిపోయింది. వంద సెకన్లు పూర్తయ్యేసరికి మొత్తం 27 ప్యాకెట్లు తినగలిగింది. న్యూజిల్యాండ్ లోని క్రైస్ట్ చర్చ్ ప్రాంతంలో జన్మించిన జిస్సర్.. పదహారేళ్ల ప్రాయంలోనే లోకల్ మోడలింగ్ ఏజెన్సీ ద్వారా మోడలింగ్ రంగంలో అడుగు పెట్టింది. తన కెరీర్ ను కొనసాగించేందుకు ఆమె 18 ఏళ్ల వయసులో ఆక్లాండ్‌కు తరలి వెళ్లింది. 2013 లో మిస్ ఎర్త్ న్యూజిల్యాండ్ పోటీలలో పాల్గొంది. ''నిజానికి మోడల్స్ సాధారణంగా ఫొటో షూట్స్, ఫ్యాషన్ షోలకు ప్రాధ్యాన్యం ఇస్తూ, తెరవెనుక ఫాస్ట్ ఫుడ్ తింటుంటారు. అలా ఉండటం నాకు నచ్చదు. నేను 20/80ని నమ్ముతూ... 80 శాతం సమయం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ, ఫిట్‌గా ఉండేందుకు కృషి చేస్తుంటాను'' అంటుంది జిస్సర్. -
వెన్నతో అల్జీమర్స్‌కు స్వస్తి!
రియో డిజనిరో: పాలను నుంచి వేరుచేసిన లినోలిక్ ఆమ్లంతో కూడిన వెన్నను తింటే అల్జీమర్స్‌ను తగ్గించుకోవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ వెన్నను తింటే జ్ఞాపకశక్తికి కారణమయ్యే ఎంజైమ్ 'ఫోస్ఫోలిపాస్ ఏ2' పనితీరు మెరుగవుతుందని బ్రెజిల్‌లోని యూనివర్సిటీ ఆఫ్ సావో పాలో శాస్త్రవేత్తలు తెలిపారు. జ్ఞాపకశక్తికి కారణమయ్యే కణత్వచాల నిర్మాణంలో పాలుపంచుకునే కొవ్వుఆమ్లాలపై ఈ ఎంజైమ్ ప్రత్యక్ష ప్రభావం చూపుతుందని పరిశోధకులు వెల్లడించారు. ఆరోగ్యవంతుల్లో ఈ కణత్వచాలు ఎప్పటికప్పుడూ మారుతూ, కొత్తవి ఏర్పడుతాయి. అదే అల్జీమర్స్ రోగుల్లో కొవ్వు ఆమ్లాలు బంధించి ఉండటం వల్ల కణత్వచాలు స్తబ్దుగా ఉంటాయని పేర్కొన్నారు. ఎలుకలపై ఐదేళ్లు పరిశోధన చేసి శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని కనుగొన్నారు. -
శాకారుణ్యాహారం...
అక్టోబర్-1శాకాహార దినోత్సవం ఇటీవల ఆరోగ్యరీత్యా కొందరు... జీవకారుణ్య దృష్టితో చాలా మంది ఇప్పుడు శాకాహారాన్ని స్వీకరించడమే కాదు... దాని ప్రాధాన్యాన్ని ప్రచారం చేస్తున్నారు. శాకాహారంలోనూ ఎన్నో తేడాలు చాలామంది కూరగాయలు, ఆకుకూరలు తినడంతో పాటు జంతువుల నుంచి వచ్చే ఉత్సాదనలైన పాలు, పెరుగు, వెన్న, నెయ్యి వంటి వాటిని తీసుకుంటారు. మొదటి నుంచి అమల్లో ఉన్న సాంస్కృతిక ఆహారపు అలవాట్ల కారణంగా వారు తమను తాము శాకాహారులుగానే పరిగణిస్తారు. శాకాహారం తీసుకుంటూ, జంతు ఉత్పాదనలైన పాలు, పెరుగు వాడేవారిని ‘లాక్టో వెజిటేరియన్స్’గా పరిగణిస్తారు. ఇక మరికొందరు ఇటీవల లభ్యమయ్యే గుడ్లలో పొదిగిస్తే ఎదిగే పిండం ఉండదు కాబట్టి వాటిని శాకాహారంగా పరిగణిస్తారు. వీరిని ‘లాక్టో-ఓవో వెజిటేరియన్స్’గా పిలుస్తారు. అయితే మొదటి నుంచీ ఉన్న సాంస్కృతిక అలవాటు కారణంగా కొందరు పిండం లేని గుడ్డును కూడా మాంసాహారంగానే పరిగణిస్తారు. ఇక మరికొందరు చేపలను పూర్తిగా శాకాహారంగా పరిగణిస్తారుగానీ... మిగతా జీవరాశులను మాంసాహారంగా చూస్తారు. ఇక మరికొందరైతే పాలు, పెరుగు, గుడ్లు... ఇలా జంతుసంబంధమైన ఏ ఉత్పాదననైనా మాంసాహారంగానే పరిగణిస్తారు. వీరు జంతు ఉత్పాదనలు ఏవైనా సరే వాటిని ఆహారంగా తీసుకోరు. ఇలాంటి వారిని ‘వేగన్స్’ అని అంటారు. వీరు తీసుకునే శుద్ధశాకాహారాన్ని వైగన్ డైట్ అంటారు. ఈ వేగన్ డైట్ తీసుకునే వారు ఎంత కఠినంగా ఉంటారంటే... తేనెను తేనెటీగలు తయారు చేస్తాయి కాబట్టి మకరందం వాటి ఆహారం కాబట్టి తేనెను కూడా జంతుసంబంధమైన ఉత్పత్తిగానే పరిగణించి శాకాహారంలో దానికి స్థానమివ్వరు. ఫ్లెక్సిటేరియన్ డైట్ : పై కారణాల వల్ల ఫలానాదే నిర్దిష్టంగా శాకాహారంగా చెప్పడం కష్టం. దాంతో చాలామంది జీవకారుణ్యంతో జంతువుల ప్రాణాలకు గాని లేదా వాటి ఉనికికి గాని ఎలాంటి హానీ లేకుండా వచ్చే జంతు ఉత్పాదనలను ఆహారంగా స్వీకరిస్తూ, వాటిని చంపి మాంసం తీసుకోవడాన్నే వ్యతిరేకిస్తారు. అందుకే వీళ్లు తీసుకునే ఆహారాన్ని ‘ఫ్లెక్సిటేరియన్ డైట్’గా పేర్కొంటారు. వాదనలు ఎలా ఉన్నాప్పటికీ ఆహారం పట్ల అభిరుచి అన్నది వ్యక్తిగత అంశంగా కొందరు ఇలాంటి వివాదాల జోలికి వెళ్లరు. తేనెను కూడా వ్యతిరేకించేంత వేగనిజమ్ను కలిగి ఉండటమూ తప్పేననీ, అలాగే జీవహింసనూ చేయడమూ సరికాదనేది ఫ్లెక్సిటేరియన్స్ దృక్పథం. మాంసాహారంతో అనర్థాలెన్నో... శాకాహారాన్ని నిర్వచించే తీరుతెన్నులు ఎన్ని ఉన్నా... మనం సాధారణంగా శాకాహారంగా పరిగణించే ఆకుకూరలు, కూరగాయలు, పాలు, పండ్లతో సమకూరే ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువే. మాంసాహారంతో మన శరీరంలోకి కొన్ని అవాంఛిత సూక్ష్మజీవులు చేరే అవకాశాలున్నాయి. ఉదాహరణకు సరిగా ఉడకని పోర్క్ తినేవారిలో ‘టేప్ వార్మ్స్’ పెరుగుతాయి. సీఫుడ్స్‌తో అలర్జీలు ఎక్కువే ఉంటాయి. మాంసాహారంలోని అధిక కొవ్వుల వల్ల కొలెస్ట్రాల్ స్థాయులు పెరిగి గుండెజబ్బులు, పక్షవాతం, హైబీపీ వంటి వాటికి దారితీస్తున్నాయి. మాంసాహారం జీర్ణమయ్యేందుకు పట్టే సమయం ఎక్కువ. మాంసాహారాన్ని జీర్ణం చేయడానికి అవసరమైన హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉత్పాదన పెరగడం వల్ల అల్సర్లు వచ్చే అవకాశాలు ఎక్కువ. శాకాహారంతో చేకూరే ప్రయోజనాలెన్నో ... శాకాహారం తీసుకునే వారికి అనేక ఆరోగ్యకరమైన ప్రయోనాలు చేకూరుతాయి. వాటిలో కొన్ని... శాకాహారం మన శరీరంలో పేరుకునే చాలా విషపదార్థాలను స్వాభావికంగా బయటకు పంపుతుంది. అందుకే వీటిని ‘డీ-టాక్స్’ డైట్ అని కూడా చెబుతుంటారు. శాకాహారంలో పీచుపదార్థాలు (డయటరీ ఫైబర్) ఎక్కువ. దాంతో అది తేలిగ్గా జీర్ణమవుతుంది. కొలోన్ క్యాన్సరు నివారితమవుతాయి. శాకాహారంలోని పీచు వల్ల మొలలు, స్థూలకాయం, డయాబెటిస్, మలబద్దకం, హయటస్ హెర్నియా, డైవర్టిక్యులైటిస్, ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్, పిత్తాశయంలో రాళ్లు వంటి అనేక వ్యాధుల నివారణ సాధ్యం. దీంతో లభ్యమయ్యే ఫోలేట్స్, ఫైటోన్యూట్రియెంట్స్, యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల చర్మానికి ఎప్పటికప్పుడు మంచి పోషణ, విటమిన్స్ లభిస్తాయి కాబట్టి వాళ్లలో మేని మెరుపు చాలా బాగుంటుంది. శాకాహారంతో తేలిగ్గా బరువును నియంత్రించుకోవచ్చు. ఫలితంగా బీపీ నియంత్రణలో ఉండటం, గుండెజబ్బులకు ఆస్కారం లేకపోవడం వంటివి ప్రయోజనాలు చేకూరతాయి. ఆకుకూరలు, పండ్లలో కాపర్, మెగ్నీషియమ్ వంటి ఖనిజాలు, లవణాలు ఉంటాయి. ఆరోగ్యానికి మేలు చేసే ఫ్లేవనాయిడ్స్ లభిస్తాయి. అంతా మేలేనా... మరి పరిమితులు లేవా? శాకాహారం వల్ల అంతా మేలేననీ, పరిమితులేవీ లేవని చెప్పడం కూడా వైద్యశాస్త్రపరంగా సరికాదు. అయితే వాటిని కొన్ని శాకాహార ప్రత్యామ్నాయాలతో అధిగమించవచ్చు. ఉదా: ప్రోటీన్లు : శాకాహారం కంటే మాంసాహారంలో ప్రోటీన్లు ఎక్కువ. అయితే మాంసాహారం నుంచి దూరంగా ఉండి కేవలం శాకాహారంతోనే ప్రోటీన్లు పొందడం కూడా సాధ్యమే. అందుకోసం చిక్కుళ్లు, సోయా ఉత్పాదనలు బాగా ఉపకరిస్తాయి. శాకాహారం ద్వారానే ప్రొటీన్ కోరుకునేవారు తమ ఆహారంలో ఈ కింది పదార్ధాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. అవి: గుమ్మడి గింజలు బ్లాక్ బీన్స్ సోయామిల్క్ పీనట్ బటర్ బాదం రాజ్మా క్యాల్షియమ్ : యుక్తవయసులో ఉన్నవారు మొదలుకొని యాభైలలో పడ్డ వారి వరకూ... ప్రతి ఒక్కరికీ ఎముకల ఆరోగ్యం, పటిష్టత, నిర్వహణ కోసం క్యాల్షియమ్ పుష్కలంగా అందాలి. సాధారణంగా పాల ఉత్పాదనల్లో క్యాల్షియమ్ ఎక్కువ. కానీ వెజిటేరియనిజమ్ కారణాలతో క్యాల్షియమ్‌ను శాకాహారం నుంచి పొందాలనుకుంటే ఆకుకూరలైన పాలకూర వంటివీ, బ్రకోలీ, పొద్దుతిరుగుడు గింజలు, సోయా మిల్స్ ఉత్పాదనలను రోజూ తీసుకోవాలి. విటమిన్ డి : మన శరీరంలోకి క్యాల్షియమ్ చక్కగా ఇంకిపోవాలంటే విటమిన్-డి అవసరం. ఇది పాల ఉత్పాదన్లో, సూర్యకాంతిలో లభ్యమవుతుంది. సాధారణ ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరికీ ప్రతిరోజూ 2000 ఇంటర్నేషనల్ యూనిట్స్ (ఐయూ)ల విటమిన్-డి అవసరం. ఒకవేళ జంతువుల నుంచి కాకుండా కేవలం శాకాహారం నుంచి మాత్రమే లభ్యం కావాలనుకుంటే సోయా మిల్క్ ఉత్పాదనలు వాటిని భర్తీ చేస్తాయి. ఐరన్ : మనలో రక్తహీనత రాకుండా ఉండటానికి ఐరన్ చాలా అవసరం. ఇది మాంసాహారంలో తక్షణం లభిస్తుంది. అయితే శాకాహారం ద్వారానే ఇది లభ్యం కావాలంటే ముదురు ఆకుపచ్చరంగులో ఉండే ఆకుకూరలు (పాలకూర, బ్రకోలీ), డ్రైఫ్రూట్స్, గుమ్మడి గింజలు, నువ్వులు, సోయాబిన్ నట్స్ వంటివి పుష్కలంగా తీసుకోవాలి. విటమిన్-సి ఎక్కువగా ఉండే నిమ్మజాతి పండ్లు టమాటాలు తినడం వల్ల కూడా ఐరన్ తేలిగ్గా శరీరంలోకి ఇంకుతుంది. విటమిన్ బి12 : ఇది మాంసాహారంలోనే పుష్కలంగా లభిస్తుంది. ఆ తర్వాత పాలలో అధికంగా ఉంటుంది. ఇక శాకాహారం నుంచే దీన్ని తీసుకోవాలంటే సోయామీల్ వంటి వాటిపై ఆధారపడాలి. దీని లోపం వల్ల మెదడు నరాల నుంచి అవయవాలకు ఆదేశాలు అందడంలో ఆటంకాలు, స్పృహతప్పడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ఎండలో తగినంతగా తిరగకుండా ఇన్‌డోర్స్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తూ, కేవలం శాకాహారాన్ని మాత్రమే తీసుకునే వారిలో విటమిన్-డి, విటమిన్-బి12 లోపంతో వచ్చే నరాల సమస్యలు ఇటీవల చాలా పెరిగాయి. అందుకే కేవలం వెజిటేరియన్ ఆహారంపైనే ఆధారపడే వారు, విటమిన్-డి, విటమిన్-బి12, ఐరన్ వంటి కీలకమైన పోషకాల కోసం ప్రత్యామ్నాయాలపై మరింత ఎక్కువ దృష్టిపెట్టాలి. ఇలా ప్రత్యామ్నాయ ఆహారం ద్వారా జంతువుల నుంచి లభ్యమయ్యే వాటిని శాకాహారంతోనే పొంది జీవహింసను నివారించడంలోని తృప్తినీ, ఆరోగ్యాన్నీ ఏకకాలంలో పొందవచ్చు.