కొవ్వు పెరిగేందుకు దోహదం చేస్తుందని, అనారోగ్య కారకమనీ వెన్నను దూరం పెట్టడం సరైంది కాదంటున్నారు న్యూట్రిషనిస్ట్‌లు. విభిన్న రకాల ఆరోగ్య ప్రయోజనాలను వెన్న అందిస్తుందంటున్నారు. యువత వెన్నను ఆహారంలో భాగం చేయడం అన్ని రకాలుగా ఉపయుక్తమవుతుందంటున్నారు. ఇమ్యూనిటీని పెంచడంలో పోషకవిలువలు అందించడంలో బటర్/వెన్నలు కీలక పాత్ర పోషిస్తాయని సహజాహార నిపుణులు కిశోర్ ఇందుకూరి తెలిపారు.
హైదరాబాద్ కేంద్రంగా డైరీ ఉత్పత్తులను అందించే సిథ్స్ ఫార్మ్ తయారు చేసిన ఆవు/గేదె వెన్నలను మంగళవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా కిశోర్ ఇందుకూరి మాట్లాడుతూ వెన్న వల్ల బరువు పెరుగుతాము అనే అపోహలను ఖండించారు. వెన్నలో 740కిలో కేలరీల శక్తి, 0.6 గ్రాముల ప్రొటీన్స్ లభ్యమవుతాయని, అలాగే ఎ,డి,ఇ విటమిన్లను కూడా ఇవి అందిస్తాయని కిశోర్ వివరించారు. అయితే ఇంట్లో వండుకునే వంటల్లో వీలున్నంత వరకూ ఆవు పాల నుంచి తయారైన వెన్నను వినియోగించాలని ఆయన సూచించారు. అదే ఆరోగ్యకరమన్నారు. అలాగే బేకరీ ఉత్పత్తుల్లో మాత్రం గేదె పాల నుంచి తయారైన వెన్నను వాడుకోవడం... ఇలా విభజిస్తే అటు రుచితో పాటు ఇటు ఆరోగ్యకరం కూడా అని స్పష్టం చేశారు.
చదవండి: Nutraceutical: ట్యాబ్లెట్స్ రూపంలో పోషకాలు.. మస్తుగా కెరీర్ అవకాశాలు!!
Comments
Please login to add a commentAdd a comment