నెయ్యి లేదా వెన్న ఏదైన డెజర్ట్ లేదా రెసిపీ రుచిని అమాంతం పెంచేస్తుంది. అయినా నెయ్యిని జోడించగానే ఏ స్వీట్ అయినా కమ్మగా మారిపోతుంది. ఎవ్వరికైనా..నెయ్యి లేదా వెన్నని తినే అలవాటు ఉంటే అంత ఈజీగా మానుకోలేరు. ఆ రుచి అలా కట్టిపడేస్తుంది. అయితే లాక్టోస్ పడని వారు ఇవి తీసుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి వారు ఏం చేస్తే బెటర్? నెయ్యికి ప్రత్యామ్నాయాలు ఏం ఉన్నాయి వంటి వాటి గురించి సవివరంగా చూద్దామా..!.
లాక్టోస్ అసహనం అంటే..
లాక్టోస్ అసహనం అనేది జీర్ణక్రియ పరిస్థితి. ఇది పాలల్లో ఉండే చక్కెర అయిన లాక్టోస్‌ను జీర్ణం చేయడం కష్టతరం చేస్తుంది. లాక్టేజ్ అనే ఎంజైమ్ లోపం వల్ల ఈ సమస్య వస్తుంది. ఈ లాక్టోస్ సరిపడని కారణంగా ఆయ వ్యక్తులు ఈ కింది సమస్యలను ఫేస్ చేస్తుంటారు. అవేంటంటే..
కడుపు నొప్పి
వాంతులు
విరేచనాలు
నిరంతర కడుపు ఉబ్బరం
గ్యాస్ సమస్య
అలాంటి వారు వెన్న కంటే నెయ్యి తీసుకోవడం మంచిదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే నెయ్యిలో తక్కువ లాక్టోస్ ఉంటుంది. కాచినప్పుడు లాక్టోస్ కోల్పోయి కొవ్వులు మాత్రమే ఉంటాయి. అదే వెన్నలో ఎక్కువ లాక్టోస్ ఉంటుంది. అందువల్ల లాక్టోస్ అసహనం ఉన్నవారికి ఇది అంత సురక్షితం కాదు.
ప్రత్యామ్నాయాలు..
సాధారణ పాలకు ప్రత్యామ్నాయంగా సోయా పాలు, బాదం పాలు, బియ్యం పాలు మంచివి.
అలాగే కొబ్బరి లేదా బఠానీ పాలను కూడా ఉపయోగించొచ్చు.
ఇవన్నీ పోషకమైనవి సాధారణ ఆవు పాలకు బెస్ట్ ప్రత్యామ్నాయాలు.
నోట్: ఈ కథనం కేవలం అవగాహన కొరకు మాత్రమే!
Comments
Please login to add a commentAdd a comment