ghee
-
హీరోయిన్ రకుల్ ప్రీత్ ఫిట్నెస్ సీక్రెట్ ఇదేనట!
టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఫిట్నెస్ మీద ఎక్కువ శ్రద్ధపెడుతోంది. ముఖ్యంగా జాకీ భగ్నాన్తో పెళ్లి తరువాత జంటగా అనేక ఆసనాలు, వ్యాయామాలు చేస్తూ సోషల్ మీడియాలో అనేక వర్కౌట్ వీడియోలుపోస్ట్ చేస్తూ ఉంటుంది. తాజాగా ప్రముఖ పోడ్కాస్టర్ , యూట్యూబర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, బాలీవుడ్ నటి రకుల్ ప్రీత్ సింగ్ తన వివరణాత్మక డైట్ ప్లాన్ గురించి వివరించింది.రకుల్ ప్రీత్ సింగ్ డైట్ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడి నీళ్లు తాగుతుందిట. ఆ తరువాత దాల్చినచెక్క నీరు లేదా పసుపు నీటిని తీసుకుంటుందట. ఆపై నానబెట్టిన బాదం గింజలు ఐదు, వాల్నట్ తీసుకుంటుందట. ఆ తరువాత ఘీ కాఫీ తాగుతానని చెప్పుకొచ్చింది రకుల్. వర్కవుట్ పూర్తి చేసిన తరువాత అల్పాహారం మాత్రం భారీగా తీసుకుంటుందట. ముఖ్యంగా ప్రోటీన్ స్మూతీలోగా పోహా (అటుకులు) లేదా మొలకలు లేదా గుడ్లని తీసుకుంటుందట. తన డైట్ గురించి రకుల్ ఇంకా ఇలా వివరించింది. భోజనం సాధారణంగా అన్నం లేదా జొన్న రొట్టె, కూర ,చేపలు లేదా చికెన్ వంటి కొన్ని రకాల ప్రోటీన్లు, సాయంత్రం 4:35 గంటలకు స్నాక్స్‌గా ప్రోటీన్ చియా సీడ్స్ పుడ్డింగ్, పండు, పెరుగు, పీనట్ బటర్ వంటివి తీసుకుంటుందట. డిన్నర్‌ను ఏడు గంటలకు పూర్తి చేయడానికి ప్రయత్నిస్తానని కూడా తెలిపింది. అది కూడా మధ్యాహ్నం తినే దాని కంటే కాస్త తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉండేలా డిన్నర్‌ను ప్లాన్ చేసుకుంటుంది. -
సెన్సేషనల్ స్టార్ బ్యూటీ సీక్రెట్స్ : మేక పెరుగు, నెయ్యి, జ్యూస్‌లు
ఆర్ట్ కలెక్టర్, దాత సోషల్ మీడియా సెన్సేషన్, రియాలిటీ టీవీ స్టార్ షాలిని పాసి 'ఫ్యాబులస్ లైవ్స్ వర్సెస్ బాలీవుడ్ వైవ్స్' సిరీస్‌తో మరింత పాపులర్ అయిపోయింది. ఆమె అదిరిపోయే పంచ్ డైలాగులు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాదు 49 ఏళ్ల వయసులో ఇంత అందంగానా? శిల్పం లాంటి ఆకృతి, మెరిసే చర్మం కోసం, ఆమె ఏమి తింటుంది అనేది చర్చకు తెరతీసింది. ఈ నేపథ్యంలో ఒక ఇంటర్వ్యూలో తన ఆహార నియమాలు, సౌందర్య రహస్యాలను బహిర్గతం చేసింది. షాలిని రోజువారీ ఆహారంలో ఎటువంటి ఘనమైన ఆహారం తీసుకోదట. సెలెరీ (ఆకుకూరలు)జ్యూస్, కూరగాయలతో చేసిన జ్యూస్‌లు, నెయ్యి, మేక పెరుగు ఖచ్చితంగా తీసుకుంటానని తాగా వెల్లడించింది. ప్రధానంగాకొంచెం వింతగా అనిపించినా తాను మేక పెరుగును ఎక్కువగా తీసుకుంటానని చెప్పింది. మేక పెరుగుతో ఎముకలు ,దంతాలు బలంగా ఉంటాయని వివరించింది. డైట్ మాత్రమే కాదు, రోజుకు రెండు గంటల వ్యాయామం తప్పకుండా చేస్తుందట.షానిలి డైట్ సీక్రెట్, ఆమె మాటల్లో ఉదయం ఒక స్పూన్ నెయ్యి తీసుకుంటా.తర్వాత ఉసిరి అల్లం కలిపిన బీట్రూట్ రసం.డైట్లో హెర్బల్ లిక్విడ్లు, కూరగాయలజ్యూస్లు ఎక్కువ భాగం ఉంటాయి. రెండు గిన్నెల మొలకలను నమలడం కష్టం. అదే జ్యూస్ అయితే సులభంగా తాగవచ్చు. సెలెరీ జ్యూస్, రెడ్ జ్యూస్, స్ప్రౌట్ జ్యూస్, మిరియాలతో చేసే క్యాప్సికమ్ జ్యూస్ ఇలా చాలా ఉంటాయి.సాయంత్రం ఆహారంలో ప్రతిదీ సూప్ రూపంలో ఉంటుంది. వడకట్టకుండా, చిక్కగా ఉండే కూరగాయలను జ్యూస్‌లను తాగుతాను. ఇంకా బచ్చలికూర, బ్రోకలీ సూప్, టొమాటో, బెండ, తామర కాండం, బఠానీలు ఇలా ఏదైనా జ్యూస్ రూపంలోనే.సాయంత్రం 6 గంటల వరకు పచ్చి ఆహారం మాత్రమే .. రాత్రి 7 గంటలకు భోజనం. అదీ కూడా 'ఘర్ కా ఖానా (ఇంట్లో వండిన ఆహారం)'ఉండేలా చూసుకుంటా. కొల్లాజెన్ ఉత్పత్తిలో సహాయపడే సహజమైన వాటిని మాత్రమే తీసుకుంటాను.డిన్నర్లో అవకాడో, రాగి లేదా జొన్న పిండితో చేసిన దోసలు తింటానుఇక గుడికి వెళ్లని రోజుల్లో ప్రోటీన్ కోసం గుడ్డు, చేపలు లేదా చికెన్ తీసుకుంటా.సాయంత్రం 4 నుండి 6 వరకు నా వర్కౌట్ సమయం. కండరాలకు బలం చేకూర్చే పైలేట్స్ , డ్యాన్స్ చేస్తాను. ఆ సమయంలో నన్ను డిస్టర్బ్ చేయకూడదు. (ఫ్యాషన్‌తో దుమ్మురేపుతున్న షాలిని పాసి, ఒక్కో బ్యాగు ధర..!) -
అలాంటి వాళ్లు నెయ్యి లేదా వెన్న తినొచ్చా..?
నెయ్యి లేదా వెన్న ఏదైన డెజర్ట్ లేదా రెసిపీ రుచిని అమాంతం పెంచేస్తుంది. అయినా నెయ్యిని జోడించగానే ఏ స్వీట్ అయినా కమ్మగా మారిపోతుంది. ఎవ్వరికైనా..నెయ్యి లేదా వెన్నని తినే అలవాటు ఉంటే అంత ఈజీగా మానుకోలేరు. ఆ రుచి అలా కట్టిపడేస్తుంది. అయితే లాక్టోస్ పడని వారు ఇవి తీసుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి వారు ఏం చేస్తే బెటర్? నెయ్యికి ప్రత్యామ్నాయాలు ఏం ఉన్నాయి వంటి వాటి గురించి సవివరంగా చూద్దామా..!.లాక్టోస్ అసహనం అంటే..లాక్టోస్ అసహనం అనేది జీర్ణక్రియ పరిస్థితి. ఇది పాలల్లో ఉండే చక్కెర అయిన లాక్టోస్‌ను జీర్ణం చేయడం కష్టతరం చేస్తుంది. లాక్టేజ్ అనే ఎంజైమ్ లోపం వల్ల ఈ సమస్య వస్తుంది. ఈ లాక్టోస్ సరిపడని కారణంగా ఆయ వ్యక్తులు ఈ కింది సమస్యలను ఫేస్ చేస్తుంటారు. అవేంటంటే..కడుపు నొప్పివాంతులువిరేచనాలునిరంతర కడుపు ఉబ్బరంగ్యాస్ సమస్య అలాంటి వారు వెన్న కంటే నెయ్యి తీసుకోవడం మంచిదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే నెయ్యిలో తక్కువ లాక్టోస్ ఉంటుంది. కాచినప్పుడు లాక్టోస్ కోల్పోయి కొవ్వులు మాత్రమే ఉంటాయి. అదే వెన్నలో ఎక్కువ లాక్టోస్ ఉంటుంది. అందువల్ల లాక్టోస్ అసహనం ఉన్నవారికి ఇది అంత సురక్షితం కాదు. ప్రత్యామ్నాయాలు..సాధారణ పాలకు ప్రత్యామ్నాయంగా సోయా పాలు, బాదం పాలు, బియ్యం పాలు మంచివి. అలాగే కొబ్బరి లేదా బఠానీ పాలను కూడా ఉపయోగించొచ్చు. ఇవన్నీ పోషకమైనవి సాధారణ ఆవు పాలకు బెస్ట్ ప్రత్యామ్నాయాలు. నోట్: ఈ కథనం కేవలం అవగాహన కొరకు మాత్రమే! View this post on Instagram A post shared by Amita Gadre | Nutritionist (@amitagadre) (చదవండి: మరమరాల చాట్ అమ్ముతూ బ్రిటిష్ వ్యక్తి..!) -
‘బాబు సిట్’ను పక్కన పెట్టిన ‘సుప్రీం..’ ఇక 'సీబీఐ సిట్'
ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ప్రజల మనోభావాలు ముడిపడి ఉన్నందున తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై స్వతంత్ర, నిష్పాక్షిక దర్యాప్తు అవసరం. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ స్థానంలో ఈ వ్యవహారంపై దర్యాప్తు చేసేందుకు ఓ స్వతంత్ర ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఇందులో సీబీఐ డైరెక్టర్ నామినేట్ చేసిన ఇద్దరు సీనియర్ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసిన ఇద్దరు సీనియర్ పోలీసు అధికారులు, ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) చైర్పర్సన్ నామినేట్ చేసిన ఓ అధికారి ఉంటారు. ఈ సిట్ దర్యాప్తును సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షించాలి. ఈ మొత్తం వ్యవహారాన్ని ఎంతమాత్రం రాజకీయ డ్రామాగా మారనివ్వబోం. రాజకీయ పోరాటాలకు న్యాయస్థానాన్ని వేదిక కానివ్వబోము.– సుప్రీంకోర్టు సాక్షి, అమరావతి: తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి వినియోగించే నెయ్యి కల్తీ జరిగిందన్న ఆరోపణలపై విచారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) సుప్రీంకోర్టు పక్కన పెట్టింది. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ప్రజల మనోభావాలు ముడిపడి ఉన్నందున ఈ వ్యవహారంపై స్వతంత్ర, నిష్పాక్షిక దర్యాప్తు అవసరమని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. తద్వారా దర్యాప్తు విశ్వసనీయత పెరుగుతుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ స్థానంలో ఈ వ్యవహారంపై దర్యాప్తు చేసేందుకు తామే ఓ స్వతంత్ర ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ సిట్‌లో సీబీఐ డైరెక్టర్ నామినేట్ చేసిన ఇద్దరు సీనియర్ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసిన ఇద్దరు సీనియర్ పోలీసు అధికారులు, ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) చైర్పర్సన్ నామినేట్ చేసిన ఓ అధికారికి స్థానం కల్పించింది. ఈ సిట్ దర్యాప్తును స్వయంగా పర్యవేక్షించాలని సీబీఐ డైరెక్టర్‌ను ఆదేశించింది. ఈ మొత్తం వ్యవహారాన్ని ఎంతమాత్రం రాజకీయ డ్రామాగా మారనివ్వబోమంది. రాజకీయ పోరాటాలకు న్యాయస్థానాన్ని వేదిక కానివ్వబోమని తేల్చి చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్, జస్టిస్ కల్పతి వెంకటరామన్ విశ్వనాథన్ ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులతో నెయ్యి కల్తీపై స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలను పరిÙ్కరిస్తున్నట్లు ప్రకటించింది. స్వతంత్ర దర్యాప్తు కోసం వైవీ తదితరుల పిటిషన్లు... తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి లడ్డూ తయారీకి ఉపయోగించే నెయ్యిలో జంతు కొవ్వులను కలిపారన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపణలపై వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఓ కమిటీని ఏర్పాటు చేయాలని కోరుతూ బీజేపీ సీనియర్ నేత, ప్రముఖ ఆర్థికవేత డాక్టర్ సుబ్రమణియన్ స్వామి ఇటీవల సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. అలాగే లడ్డూ నెయ్యి కల్తీ వ్యవహారంలో దర్యాప్తు, స్వతంత్ర విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తిని నియమించాలని కోరుతూ రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్సీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి కూడా పిల్ దాఖలు చేశారు. ఇదే అంశంపై ఇతర రాష్ట్రాలకు చెందిన సంపత్, శ్రీధర్, సురేష్ చవంకే వేర్వేరుగా రెండు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ నాలుగు వ్యాజ్యాలపై ఇటీవల విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. నెయ్యిలో జంతు కొవ్వులు కలిపారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన రాజకీయ ప్రకటనలపై అసహనం వ్యక్తం చేసింది. శ్రీవారి లడ్డూ నెయ్యిలో జంతు కొవ్వులు కలిశాయనేందుకు ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేవని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ను కొనసాగించాలా?లేక స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించాలా అనే విషయంపై కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి చెప్పాలని సొలిసిటర్ జనరల్ (ఎస్జీ) తుషార్ మెహతాను ఆదేశించిన విషయం తెలిసిందే. పత్రికా కథనాలను పట్టించుకోకండి.... తాజాగా శుక్రవారం ఈ వ్యాజ్యాలు మరోసారి విచారణకు వచ్చాయి. ఈ సందర్భంగా తుషార్ మెహతా స్పందిస్తూ.. ఇది దేశవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల మనోభావాలకు సంబంధించిన వ్యవహారమని పేర్కొనగా.. ధర్మాసనం స్పందిస్తూ, దేశం కాదని.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల మనోభావాలకు సంబంధించిందని తెలిపింది. ఈ వ్యవహారంలో ఆహార భద్రత కూడా ముడిపడి ఉందని ధర్మాసనం పేర్కొంది. తాము రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌కు వ్యతిరేకం కాదని, అయితే కేంద్ర ప్రభుత్వానికి చెందిన అధికారుల పర్యవేక్షణలో దర్యాప్తు జరగడం సబబుగా ఉంటుందని మెహతా చెప్పారు. ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. స్వతంత్ర సంస్థ ద్వారా దర్యాప్తు చేయిస్తే అభ్యంతరం లేదని ముఖ్యమంత్రి చెప్పినట్లు తాము పత్రికల్లో చదివామని గుర్తు చేసింది. ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ, టీటీడీ తరఫు సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూథ్రా జోక్యం చేసుకుంటూ పత్రికలు చాలా రాస్తున్నాయని, వాటిని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. టీటీడీ ఈవో చెప్పిన వాస్తవాలను వక్రీకరించాయని లూథ్రా తెలిపారు. దర్యాప్తు విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, దాన్ని కోర్టు పర్యవేక్షించినా కూడా ఇబ్బంది లేదని నివేదించారు. సీఎం వ్యాఖ్యలతో సిట్ దర్యాప్తు నిష్పాక్షికంగా జరిగే అవకాశమే లేదు... ఈ సమయంలో వైవీ సుబ్బారెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ జోక్యం చేసుకుంటూ.. ముఖ్యమంత్రి వ్యాఖ్యల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ దర్యాప్తు నిష్పాక్షికంగా ఉండేందుకు అవకాశం లేదన్నారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలకు భిన్నంగా సిట్ దర్యాప్తు ఉండబోదని తెలిపారు. ముఖ్యమంత్రి చేసిన ప్రకటనలకు ఓ విలువ ఉంటుందన్నారు. చంద్రబాబు వ్యాఖ్యలు ఖచ్చితంగా సిట్ దర్యాప్తుపై ప్రభావం చూపుతాయన్నారు. ఈ సమయంలో ముకుల్ రోహత్గీ జోక్యం చేసుకుంటూ 100 రోజుల పాలనపై ముఖ్యమంత్రి మాట్లాడారని చెప్పారు. ఆయన మాట్లాడిన సందర్భం వేరన్నారు. నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు (ఎన్డీడీబీ) జూలైలో నివేదిక ఇచ్చిందన్నారు. దాని ఆధారంగా ముఖ్యమంత్రి మాట్లాడారని తెలిపారు. ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. జూలైలో నివేదిక వస్తే ముఖ్యమంత్రి సెపె్టంబర్లో ఎందుకు మాట్లాడారని ప్రశ్నించింది. ఆరోపణలు చాలా తీవ్రమైనవని, అందులో ఎలాంటి సందేహం లేదని వ్యాఖ్యానించింది. దీనిపై సిబల్ జోక్యం చేసుకుంటూ.. ఎన్డీడీబీ తన నివేదికలో ఎక్కడా జంతు కొవ్వు కలిసినట్లు చెప్పలేదని, వెజిటబుల్ ఫ్యాట్ మాత్రమే ఉన్నట్లు చెప్పిందని నివేదించారు. అయితే ఇందుకు విరుద్ధంగా జంతు కొవ్వు అంటూ ముఖ్యమంత్రి రాజకీయ ప్రకటనలు చేశారన్నారు. ఈ నేపథ్యంలో స్వతంత్ర దర్యాప్తు అవసరం ఎంతైనా ఉందని, ఆ దిశగా ఆదేశాలు జారీ చేయాలని ధర్మాసనాన్ని కోరారు. కల్తీ నెయ్యిని కొండపైకి ఎందుకు అనుమతించారు..? అనంతరం ధర్మాసనం స్పందిస్తూ.. జూలై 6, 12వ తేదీల్లో వచ్చిన ట్యాంకులను వెనక్కి పంపామని, ఆ నెయ్యిని లడ్డూ తయారీలో అసలు ఉపయోగించలేదని టీటీడీ ఈవో పలుమార్లు చెప్పారని గుర్తు చేసింది. మరి అలాంటప్పుడు కల్తీ జరిగిందని దేని ఆధారంగా చెబుతున్నారని ప్రశ్నించింది. ఆ రెండు తేదీల్లో వచ్చిన ట్యాంకర్లలో కల్తీ నెయ్యి ఉందని లూథ్రా పేర్కొనగా.. అలాంటప్పుడు కల్తీ నెయ్యిని కొండపైకి ఎందుకు అనుమతించారని సిబల్ ప్రశ్నించారు. అప్పుడు అధికారంలో ఉన్నది తాము కాదని, మీరేనని ఆయన లూథ్రాకు గుర్తు చేశారు. దీనిపై ధర్మాసనం జోక్యం చేసుకుంటూ స్వతంత్ర దర్యాప్తు అవసరమని, తద్వారా కోట్ల మంది భక్తుల్లో విశ్వాసం కలిగించినట్లు అవుతుందని తెలిపింది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ను పక్కనబెట్టి తామే ప్రత్యేక సిట్‌ను ఏర్పాటు చేస్తున్నామని స్పష్టం చేస్తూ ఆ మేరకు ఉత్తర్వులు వెలువరించింది. రాజకీయ పోరాటాలకు వేదికగా చేసుకునేందుకు అనుమతించం... ‘మేం ఆరోపణలు, ప్రత్యారోపణల జోలికి వెళ్లడం లేదు. ఇక్కడ మేం ఓ విషయం స్పష్టంగా చెప్పదలచుకున్నాం. కోర్టును రాజకీయ పోరాటాలకు వేదికగా వాడుకునేందుకు అనుమతించం. కోట్ల మంది భక్తుల మనోభావాలను పరిగణలోకి తీసుకుంటూ.. వారికి ఉపశమనం కలిగించేందుకు వీలుగా సీబీఐ, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, ఎఫ్ఎస్ఎస్ఏఐ అధికారులతో కూడిన స్వతంత్ర సిట్‌ను దర్యాప్తు నిమిత్తం ఏర్పాటు చేస్తున్నాం. ఈ ప్రత్యేక సిట్ దర్యాప్తు సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో జరగాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ స్థానంలో సీబీఐ డైరెక్టర్ నామినేట్ చేసిన ఇద్దరు సీబీఐ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసిన ఇద్దరు పోలీసు అధికారులు, ఎఫ్ఎస్ఎస్ఏఐ చైర్పర్సన్ సిఫారసు చేసిన ఓ అధికారి ప్రత్యేక సిట్‌లో ఉంటారు’ ధర్మాసనం ఉత్తర్వుల సారాంశం ఇదీ..‘జూలై 6, 12వ తేదీల్లో రెండు ట్యాంకర్లలో సరఫరా చేసిన నెయ్యి కల్తీ అయినట్లు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎఫ్ఐఆర్లోని ఆరోపణల ప్రకారం కల్తీ అయిన నెయ్యిని లడ్డూ ప్రసాదంలో వినియోగించినట్లు చెప్పారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్ల మంది భక్తుల మనసులను గాయపరిచినట్లు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. నెయ్యి కల్తీపై దర్యాప్తు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ను కొనసాగించాలా? లేక స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించాలా? అనే విషయంపై కేంద్ర హోంశాఖతో సంప్రదించి ఏ విషయం మాకు చెప్పాలని గత విచారణ సమయంలో సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను కోరాం. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌లోని సభ్యులు సీనియర్ అధికారులని, వారికి మంచి పేరు ఉందని మెహతా ఈ రోజు మాకు చెప్పారు. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ద్వారా దర్యాప్తును కొనసాగించాలని, అయితే ఆ దర్యాప్తును కేంద్ర ప్రభుత్వ అధికారులు పర్యవేక్షిస్తారని ఆయన మాకు నివేదించారు’ -
కొనసాగుతున్న సిట్ దర్యాప్తు
తిరుమల: తిరుమల లడ్డూలో నెయ్యి కల్తీ అంటూ అసత్య ఆరోపణలు చేసిన చంద్రబాబే వేసిన సిట్ సోమవారం కూడా విచారణ కొనసాగించింది. సిట్ చీఫ్ సర్వశ్రేష్ఠ త్రిపాఠీ నేతృత్వంలోని బృందం తిరుమలలో ల్యాబ్‌ను పరిశీలించి నాణ్యతా ప్రమాణాలను ఎలా గుర్తిస్తారో సిబ్బందిని అడిగి తెలుసుకుంది. అనంతరం నెయ్యిని నిల్వ చేసే గోదాముకు చేరుకుని ఇక్కడ ఎన్ని రోజులు ఉంచుతారు, నాణ్యతా పరీక్షల నిమిత్తం ఎప్పుడు శాంపిళ్లు తీసుకుంటారు, శాంపిల్ తీసుకున్న అనంతరం ఎలాంటి పరీక్షలు నిర్వహిస్తారు, టెండర్‌దారుడు ప్రమాణాల మేరకు సరఫరా చేశారా లేదా అనేది ఎలా నిర్ధారిస్తారు, ఒకవేళ కల్తీ జరిగితే.. ఆ విషయాన్ని పసిగట్టే పరికరాలు ల్యాబ్‌లో ఉన్నాయా వంటి వివరాలను అధికారులు, సిబ్బంది నుంచి సేకరించారు.ల్యాబ్‌లో తనిఖీలు నిర్వహిస్తుండగా.. అప్పటికే ల్యాబ్‌కు చేరుకున్న ట్యాంకర్లలోని నెయ్యిని పరిశీలించిన అధికారులు, ల్యాబ్ సిబ్బంది నెయ్యి నాణ్యతా పరీక్షలు ఎలా జరుపుతారో ప్రత్యక్షంగా పరిశీలించారు. గతంలో టీటీడీకి నెయ్యి సరఫరా చేసిన టెండర్‌దారుల వివరాలను, నాణ్యతా పరీక్షల నివేదికలను అధికారులు సేకరించారు. కల్తీ నెయ్యి సరఫరా చేసిన ఏఆర్ డెయిరీ ఎప్పటి నుంచి నెయ్యి సరఫరా చేసింది, ఆ నెయ్యిలో నాణ్యత లేదని ఎప్పుడు గుర్తించారు, నెయ్యిని పరీక్షల కోసం పంపించాలని ఎవరు ఆదేశించారన్న సమాచారాన్ని కూడా అధికారులు సేకరించారు. అనంతరం త్రిపాఠీ నేతృత్వంలోని అధికారుల బృందం పోలీస్ గెస్ట్‌హౌస్‌కు చేరుకుని గత మూడు రోజులుగా లభ్యమైన ఆధారాలపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. తరువాత సిట్ చీఫ్ నేతృత్వంలోని బృందం తిరుపతి బయలుదేరి వెళ్లిపోగా.. డీఎస్పీ స్థాయి నేతృత్వంలోని అధికార బృందం మాత్రం ఇంకా ల్యాబ్‌లో తనిఖీలు నిర్వహిస్తూ.. పాత రికార్డులను పరిశీలించింది.నేడు లడ్డూ పోటు, విక్రయ కేంద్రాల్లో విచారణ మంగళవారం లడ్డూ పోటు, లడ్డూ విక్రయ కేంద్రాలు, లడ్డూ తయారీకి వినియోగించే ముడి సరుకులను పరిశీలించి.. లడ్డూ తయారీలో పాల్గొంటున్న శ్రీవైష్ణవులను విచారించనున్నట్టు సమాచారం. మరో బృందం తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో నెయ్యి కొనుగోలు, ఒప్పందాలు, నాణ్యమైన నెయ్యి సరఫరా కోసం టీటీడీ, ఏఆర్ డెయిరీ మధ్య జరిగిన ఒప్పందాలను పరిశీలించనుంది. టెండర్ల నిబంధనల్లో మార్పులు చేయడానికి దారి తీసిన పరిస్ధితులపై కూడా సిట్ బృందం దర్యాప్తు చేయనుంది. సిట్ బృందం మరో రెండు రోజుల పాటు తిరుమల, తిరుపతిలో ఉండి విచారణ నిర్వహించనుంది. సిట్ కార్యకలాపాల కోసం టీటీడీ శ్వేత భవనంలో కార్యాలయం ఏర్పాటు చేసేందుకు ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. -
ఏఆర్ ఫుడ్స్‌పై ఫిర్యాదులో జాప్యం ఎందుకు: ‘సిట్’ ఆరా
సాక్షి,తిరుపతి: తిరుమల లడ్డూ వివాదంపై ఏర్పాటైన సిట్ మూడోరోజు విచారణను సోమవారం(సెప్టెంబర్30) కొనసాగిస్తోంది. లడ్డూలో వాడే నెయ్యి కల్తీ వ్యవహారంపై తిరుమల మార్కెటింగ్ జీఎం రెండు నెలల తర్వాత ఫిర్యాదు చేయడంపై సిట్ ఆరా తీస్తోంది.నెయ్యి సరఫరా చేసిన ఏఆర్ ఫుడ్స్‌పై ఫిర్యాదు చేయడంలో జాప్యంపై సిట్ ప్రత్యేక దృష్టి పెట్టింది. లడ్డూ తయారీకి సంబంధించి భాగమైన ఫ్లోర్‌మిల్, ల్యాబ్, ఇతర ముడిసరుకుల నాణ్యతను సిట్ పరిశీలించింది.ఇదీ చదవండి: తిరుమల లడ్డూ వివాదం..సుప్రీంకోర్టులో విచారణ -
కల్తీ.. బాబు సృష్టే
చంద్రబాబు పాపాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న నేపథ్యంలో ప్రజలంతా కూడా ఆయనను వేలెత్తి చూపించడం మొదలైంది. ఈ నేపథ్యంలో లడ్డూ టాపిక్‌పై చంద్రబాబు చేసిన తప్పును ప్రశి్నంచడం మొదలుపెట్టారు. వారికి వాస్తవాలు తెలియడంతో టాపిక్ డైవర్షన్ కోసం డిక్లరేషన్ అంటున్నాడు. నేను గుడికి వెళ్లలేకపోయినా ఫరవాలేదు. కానీ చంద్రబాబు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా మన పార్టీ తరపున మీ ఊళ్లలో పూజలు చేయండి. తప్పు చేసింది మేం కాదు.. చంద్రబాబు అని వేడుకోండి. ఆ కోపాన్ని ప్రజలపై కాకుండా చంద్రబాబుపై చూపమని వేడుకోమని కోరుతున్నా. వైఎస్సార్సీపీ అభిమానులే కాదు.. రాష్ట్ర శ్రేయస్సు కాంక్షించే ప్రతి ఒక్కరినీ కోరుతున్నా. – మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిసాక్షి, అమరావతి: తిరుమల శ్రీవారి లడ్డూల తయారీలో కల్తీ నెయ్యిని అసలు వాడనేలేదని టీటీడీ ఈవో అత్యంత స్పష్టంగా చెప్పినా సీఎం చంద్రబాబు రాజకీయం చేస్తూనే ఉన్నారని.. ఆయన చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలని ఒక్కొక్కటిగా రుజువు అవుతూ కనిపిస్తున్నాయని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు. ఆ నాలుగు నెయ్యి ట్యాంకర్లను రిజెక్ట్ చేసి సరఫరాదారులకు షోకాజ్ నోటీస్ ఇచ్చామని.. వాటిలో వనస్పతి ఆయిల్ కలిపినట్లు తేలిందని చాలా క్రిస్టల్ క్లియర్‌గా జూలై 23న, సెప్టెంబర్ 20న ఈవో రెండుసార్లు ప్రెస్‌మీట్ పెట్టి మరీ చెప్పినా నీ నీచ రాజకీయం కోసం లడ్డూల తయారీలో జంతువుల కొవ్వు కలిసిందంటూ స్వామివారిని అపవిత్రం చేశావ్.. అంటూ చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. రిజెక్ట్ చేసిన ట్యాంకర్లలోని కల్తీ నెయ్యిని అసలు వాడలేదని ప్రభుత్వానికిచ్చిన నివేదికలోనూ చాలా స్పష్టంగా ఉందన్నారు. వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే డైవర్షన్ పాలిటిక్స్‌కు తెర తీశారని చంద్రబాబుపై ధ్వజమెత్తారు. శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. లడ్డూ ప్రసాదంపై సీఎం చంద్రబాబు చేస్తున్న దుష్ఫ్రచారాన్ని సాక్ష్యాధారాలతో కడిగి పారేశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఏమన్నారంటే...తప్పు చేయలేని విధంగా రొబస్ట్ విధానం.. ‘తిరుమలకు సరఫరా చేసే నెయ్యికి సంబంధించి రొబస్ట్ (పకడ్బందీ) విధానం ఉంటుంది. నెయ్యి సరఫరాదారులు ప్రతి ట్యాంకర్‌కు ఎన్ఏబీఎల్ (నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ క్యాలిబ్రేషన్ ల్యాబరేటరీస్) సర్టిఫై చేసిన క్వాలిటీ సర్టిఫికెట్ తేవాలి. అలా వచ్చిన నెయ్యిని కూడా ప్రతి ట్యాంకర్ నుంచి శాంపిల్ తీసి మూడు టెస్టులు చేస్తారు. అవన్నీ పాస్ అయితేనే ట్యాంకర్‌ను ముందుకు పంపుతారు. ఒక్క టెస్టు ఫెయిల్ అయినా ట్యాంకర్‌ను తిరిగి వెనక్కి పంపిస్తారు. 2014–19 మధ్యచంద్రబాబు హయాంలో 14 నుంచి 15 ట్యాంకర్లు అలా వెనక్కి వెళ్లాయి. మా ప్రభుత్వ హయాంలో కూడా 18 ట్యాంకర్లు వెనక్కు పంపారు. అంటే ఎవరూ తప్పు చేయలేని విధంగా అక్కడ రొబస్ట్ విధానం ఉంది. ఏ సరుకులైనా సరే క్వాలిటీ టెస్టులో ఫెయిల్ అయితే వెనక్కు పంపిస్తారు’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. ‘తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామిని ఎవరైతే అబద్ధాలతో అవమానించి అగౌరవపర్చాడో.. లడ్డూపై దుష్ప్రచారం చేశాడో.. ఆధారాలతో సహా కనిపిస్తోంది. చంద్రబాబు చేసిన ఈ పాపం కడగబడాలి. అది రాష్ట్ర ప్రజల మీదకు రావొద్దు. పాపం చేసిన చంద్రబాబు మీదే కట్టడి కావాలి. దాని కోసమే టాపిక్ డైవర్ట్ కాకూడదన్న ఉద్దేశంతో వెంకటేశ్వరస్వామిని ప్రేమించే వ్యక్తిగా, గౌరవించే వ్యక్తిగా నా పర్యటనను వాయిదా వేసుకున్నా’ అని పేర్కొన్నారు. వాడని నెయ్యి.. తయారుకాని లడ్డూటీటీడీ ట్రస్ట్ బోర్డు అనుమతించిన బిడ్డర్లు జూన్ 12 నుంచి సరఫరా మొదలుపెట్టారు. అంటే అప్పటికే చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడింది. ఆ తర్వాతే నెయ్యి సరఫరా మొదలైంది. జూన్ 12, జూన్ 21, జూన్ 25, జూలై 4న వచ్చిన ట్యాంకర్లన్నీ టెస్టుల్లో పాస్ అయి ముందుకు కదిలాయి. వాటిని లడ్డూల తయారీలో వాడారు. ఆ తర్వాత జూలై 6న రెండు ట్యాంకర్లు, జూలై 12న మరో రెండు ట్యాంకర్లలో వచ్చిన నెయ్యి టీటీడీ టెస్టుల్లో ఫెయిల్ కావడంతో వెనక్కు పంపడానికి సిద్ధం చేశారు. సాధారణంగా మరోసారి ఆ శాంపిళ్లను పరీక్షించేందుకు మైసూర్‌లోని సీఎఫ్టీఆర్ఐ (సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్)కు పంపిస్తారు. కానీ ఇక్కడ మాత్రం గుజరాత్‌లోని ఎన్డీడీబీ (నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డ్)కి పంపారు. ఇది టీటీడీ చరిత్రలో తొలిసారి. టీటీడీ పంపించిన శాంపిల్స్‌పై ఎన్డీడీబీ జూలై 23న రిపోర్ట్ పంపింది. నెయ్యిలో కల్తీ ఉందన్న విషయం చెప్పారు. దాంతో ఆ ట్యాంకర్లను వెనక్కు పంపించారు. అలా 4 ట్యాంకర్లను వెనక్కు పంపడంతో పాటు ఆ కంపెనీకి షోకాజ్ నోటీస్ కూడా ఇచ్చారు. మరి ఆ నాలుగు ట్యాంకర్ల నెయ్యి వాడకపోయినా.. ఆ నెయ్యిని వాడారని రెండు నెలల తర్వాత సెప్టెంబరు 18న చంద్రబాబు ఉద్దేశపూర్వకంగా ఎందుకు అన్నారు? (చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక నియమించిన టీటీడీ ఈవో నెయ్యి నాణ్యత గురించి జూలై 23న ఏమన్నారో వీడియోను ప్రదర్శించారు). ఆ నాలుగు ట్యాంకర్లను రిజెక్ట్ చేశాం. షోకాజ్ నోటీస్ ఇచ్చామని, వాటిలో వనస్పతి ఆయిల్ కలిపినట్లు తేలిందని చాలా క్రిస్టల్ క్లియర్‌గా ఈవో చెప్పినా... రెండు నెలల తర్వాత చంద్రబాబు సెప్టెంబరు 18న ఏ రకంగా అబద్ధాలు మాట్లాడారో చూడండి (ఆ వీడియో కూడా ప్రదర్శించి చూపారు). అన్నీ తెలిసినా.. నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వాడారని.. లడ్డూలు తయారు చేశారని.. వాటిని భక్తులు తిన్నారని చంద్రబాబు అబద్ధాలు చెప్పారు.టీడీపీ ఆఫీస్‌లో కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్చంద్రబాబు సెప్టెంబరు 18న ఆరోపణలు చేస్తే ఆ మర్నాడే.. అంటే సెప్టెంబరు 19న తెలుగుదేశం పార్టీ ఆఫీస్‌లో ఎన్డీడీబీ రిపోర్ట్‌ను రిలీజ్ చేశారు. నిజానికి అది కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్. అయినా దాన్ని టీడీపీ ఆఫీస్‌లో రిలీజ్ చేశారు. ఆ వెంటనే మర్నాడు అంటే సెప్టెంబరు 20 టీటీడీ ఈవో మళ్లీ ఏం మాట్లాడారో చూద్దాం.. (ఆ వీడియోను ప్రదర్శించారు). ట్యాంకర్లలో వచ్చిన నెయ్యిలో నాణ్యత లేదని తేలినందువల్ల ఆ నెయ్యిని వెనక్కి పంపామని, వాడలేదని చెప్పారు. అంతే కాకుండా సెప్టెంబరు 22న ఈవో స్వయంగా సంతకం చేసి ప్రభుత్వానికి ఒక నివేదిక కూడా ఇచ్చారు (అందులోని అంశాలు చదివి వినిపించారు). కల్తీ నెయ్యితో వచ్చిన ట్యాంకర్లను వెనక్కు పంపాం.. ఆ కంపెనీకి షోకాజ్ నోటీస్ కూడా ఇచ్చాం.. ఎన్డీడీబీ రిపోర్టు చాలా గోప్యమని అందులో ప్రస్తావించారు. మరి దాన్ని అంతకు ముందే టీడీపీ ఆఫీస్‌లో ఎలా రిలీజ్ చేశారు.అది ఎలా అపవిత్రత కాదా?మళ్లీ సెప్టెంబరు 22న మీడియాతో మాట్లాడిన చంద్రబాబు అవే పచ్చి అబద్ధాలు వల్లించారు. కల్తీ నెయ్యి వాడారని చెప్పారు. స్వామివారి ప్రసాదం విశిష్టతను, తిరుమల తిరుపతి ప్రతిష్టను, శ్రీ వెంకటేశ్వరస్వామివారి ప్రసాదం పేరు ప్రఖ్యాతులను రాజకీయ లబ్ధి కోసం ఇలా అబద్ధాలతో తగ్గించడం, కుట్ర పూరితంగా వ్యవహరించడం అపవిత్రత కాదా?ఎన్డీడీబీ రిపోర్ట్ కచ్చితమైనది కాదుపోనీ.. ఆ ఎన్డీడీబీ రిపోర్టు అయినా కచ్చితమైందా? అని చూస్తే ఆ రిపోర్టులో వాళ్లే డిస్‌క్లెయిమర్ రాశారు. ‘నెయ్యిలో ఉండాల్సిన స్టాండర్డ్ వాల్యూ కన్నా శాంపిల్స్‌లోని స్టాండర్డ్ వాల్యూస్‌లో డీవియేషన్స్ ఉన్నాయి. అయినా ఈ పరిస్థితుల్లో ఒక ఫాల్స్ పాజిటివ్ ఫలితం కూడా రావొచ్చు. (ఆ పరిస్థితులు ఏమిటంటే అని వివరిస్తూ పాల సేకరణ, ఆవులు, వాటికి అందించే దాణా గురించి ప్రస్తావించారు). అలాగే ఆవులకు సరైన ఆహారం లేనప్పుడు, అవి సరిగ్గా తినకుండా బలహీనంగా ఉన్నప్పుడు తీసిన పాల నుంచి కూడా ఇలాంటి ఫలితాలు వస్తాయని పేర్కొన్నారు.పచ్చి అబద్ధాలు... అపవిత్రం కాదా?ఇవన్నీ తెలిసినా చంద్రబాబు కావాలని అబద్ధాలాడుతున్నారు. ప్రసాదం స్వీకరించే ప్రతి ఒక్కరిలో అనుమానపు బీజాలు రేకెత్తించడం దుర్మార్గం కాదా? నీ రాజకీయ స్వార్థం కోసం వెంకటేశ్వరస్వామి ప్రతిష్టను దిగజారుస్తున్నావు చంద్రబాబూ! స్వామి ప్రసాదానికి సంబంధించిన విశిష్టతను దిగజారుస్తున్నావ్. జరగనిది జరిగినట్లుగా.. జంతువుల కొవ్వుతో ప్రసాదం తయారు చేసినట్లుగా అబద్ధాలను ప్రచారం చేస్తున్నావు. ఇది ధర్మమేనా?మీ హయాంలో ఎందుకు వాడలేదు?నందిని బ్రాండ్ ఎందుకు వాడడం లేదని అంటున్నారు. మరి గతంలో చంద్రబాబు పాలన సమయంలో 2015 నుంచి 2018 అక్టోబరు వరకు కేఎంఎఫ్‌కు చెందిన నందిని బ్రాండ్ నెయ్యి ఎందుకు లేదు? అప్పుడు కూడా టెండర్లు పిలిచారు కదా? అప్పుడు ఇంత కంటే తక్కువ ధరకే..రూ.320కి కిలో నెయ్యి ఎలా వస్తుందని చంద్రబాబు అంటారు. మరి చంద్రబాబు 2014–19 మధ్య నెయ్యిని ఏ ధరకు సేకరించారు? ఇప్పుడు కూడా అదే క్వాలిటీ నెయ్యి కదా? దశాబ్దాలుగా అదే క్వాలిటీ. అదే నెయ్యి. చంద్రబాబు హయాంలో 2015లో కిలో నెయ్యి రూ.276కి కొన్నారు. అదే 2019 జనవరిలో కిలో ఆవు నెయ్యిని రూ.324కు కొన్నారు. మరి ఇక్కడ రూ.320కి కొంటే తప్పేం జరిగింది?దశాబ్దాల ఆనవాయితీ..తిరుమలలో లడ్డూల తయారీ కోసం నెయ్యి కొనుగోలు కార్యక్రమం దశాబ్దాలుగా జరుగుతోంది. ఆర్నెళ్లకు ఒకసారి ఈ–టెండర్ పిలుస్తారు. అర్హులు బిడ్ వేస్తారు. ఎల్–1 గా వచ్చిన వారికి టెండర్ ఖరారు చేస్తారు. ఇందులో ప్రభుత్వ ప్రమేయం ఉండదు. ఎల్–1గా వచ్చిన వారికి కూడా పూర్తి టెండర్ ఖరారు చేయరు. 65 శాతం వారికిచ్చి మిగతా వారిని కూడా రేటు తగ్గించాలని సూచించి వారికి టెండర్ ఇస్తారు. నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా. తిరుపతి లడ్డూకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఆ టేస్ట్ మరెక్కడా ఉండదు. తాము సూచించిన ప్రముఖులను టీటీడీ బోర్డులో సభ్యులుగా నియమించాలని కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల సీఎంలు కూడా రికమెండ్ చేస్తారు. అలాంటి ప్రముఖులతో బోర్డు ఏర్పాటవుతుంది. వారంతా దేవుడికి ఇంకా సేవ చేయాలని, భక్తులకు మంచి చేయాలని నిర్ణయాలు తీసుకుంటారు.ఇది రాక్షస రాజ్యం కాదా?» చంద్రబాబు చేసిన పాపం కడగబడాలి» అందుకే పూజలు చేయమని అందరినీ వేడుకుంటున్నా‘రాష్ట్రంలో గతంలో ఎన్నడూ చూడని రాక్షస రాజ్యం నడుస్తోంది.. దేవుడిని దర్శించుకునే కార్యక్రమాన్ని కూడా అడ్డుకుంటున్నారు. వైఎస్సార్సీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు, కార్యకర్తలకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. నా రాజకీయ జీవితంలో ఇలాంటి రాక్షస రాజ్యాన్ని రాష్ట్రంలోనే కాదు.. దేశంలో కూడా చూడలేదు’ అని మాజీ సీఎం వైఎస్ జగన్ మండిపడ్డారు. (తిరుమల వెళ్లకుండా వైఎస్సార్సీపీ శ్రేణులకు పోలీసులు ఇచ్చిన నోటీసులను ఈ సందర్భంగా ఆయన చదివి వినిపించారు). ‘జగన్ అనే వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి. ఆయన దేవుడిని దర్శించుకునేందుకు తిరుమల వెళ్తుంటే.. మీకు పర్మిషన్ లేదు.. మీరు వెళ్తే అరెస్టు చేస్తామని నోటీసులు ఇస్తున్నారు. దీనిపై అందరూ ఒక్కసారి ఆలోచన చేయండి’ అని విజ్ఞప్తి చేశారు. ‘ఏ ప్రపంచంలో ఉన్నాం? ఇది రాక్షస రాజ్యం కాదా? ఒకవైపు నన్ను వెళ్లనివ్వకుండా చేసి వైఎస్సార్సీపీ శ్రేణులు వెళ్లకుండా నోటీసులు ఇస్తున్నారు. మరోవైపు చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి బీజేపీ శ్రేణులను రప్పిస్తున్నారు. ఇది ఆ పార్టీ నాయకత్వానికి తెలుసో? లేదో? వేల మంది పోలీసులను మోహరించారు. టాపిక్ డైవర్షన్ కోసం ఎందుకింద ఆరాటం?’ అని సీఎం చంద్రబాబును నిలదీశారు. ప్రతి గుడిలో పూజలు చేయండి..చంద్రబాబు చేసిన పాపం వల్ల వెంకటేశ్వరస్వామికి కోపం వచ్చి రాష్ట్రంపై చూపకుండా, కోపం కేవలం చంద్రబాబుమీదే చూపించే విధంగా పూజలు చేయండి. ఎందుకంటే జరిగింది ఘోర అపచారం. వెంకటేశ్వరస్వామిని పలుచన చేస్తూ, ఆయన ప్రసాదాన్ని లోకువ చేస్తూ.. జరగనిది జరిగినట్లుగా.. జంతువుల కొవ్వు వాడనిది వాడినట్లుగా, ఆ లడ్డూలుపంపిణీ చేసినట్లుగా పచ్చి అబద్ధాలాడుతూఇంత ఘోరం చేసిన వ్యక్తి చంద్రబాబు. ఆ పాపం కడగబడాలి. అందుకే అందరినీ కోరుతున్నా. పూజలు చేయమని వేడుకుంటున్నా.మీ హయాం అంతా అవే రేట్లకు కొన్నారు. మరి ఇప్పుడు కూడా అవే ధరలు. చంద్రబాబు తన హెరిటేజ్ డెయిరీ కోసం, పాలు కార్టల్ ఫామ్ చేసి, నెయ్యి రేట్లుపెంచేసి, ఆ కార్టల్‌లో చంద్రబాబునాయుడు, హెరిటేజ్ కంపెనీ లాభపడాలనే ఉద్దేశంతో, కొత్తగా రేట్లు పెంచడం కోసం మాట్లాడుతున్నాడు. అదే క్వాలిటీ నెయ్యి. అవే స్పెసిఫికేషన్స్. అప్పుడు.. ఇప్పుడూ ఒకటే. తిరుపతి లడ్డూ చాలా టేస్టుగా ఉంటుందని గొప్పగా చెప్పుకుంటాం. ఆ లడ్డూ అప్పుడూ.. ఇప్పుడూ ఒకటే. – వైఎస్ జగన్డైవర్షన్ పాలిటిక్స్..తన 100 రోజుల పాలన గురించి ప్రజల దృష్టి మళ్లించేందుకు లడ్డూల టాపిక్ తెచ్చారు. గుడి పవిత్రత దెబ్బతీస్తూ అడ్డంగా దొరికిపోయేసరికి లడ్డూల టాపిక్‌ను డైవర్ట్ చేసేందుకు కొత్తగా డిక్లరేషన్ అంశాన్ని తెచ్చి రాజకీయం చేస్తున్నారు. తిరుమల పవిత్రత, స్వామివారి ప్రసాదం విశిష్టత, దేవస్థానం పేరు ప్రఖ్యాతులను రాజకీయ దుద్బుద్ధితో రచ్చకీడ్చి రాద్ధాంతం చేశారు. జంతువుల కొవ్వుతో లడ్డూలు తయారైనట్టుగా.. ఒక జరగని విషయాన్ని జరిగినట్లుగా.. ఆ కల్తీ ప్రసాదాన్ని భక్తులు తిన్నట్లుగా.. సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి అబద్ధాలాడుతూ, అసత్యాలు పలుకుతూ స్వామి వారి పేరు ప్రఖ్యాతులను, తిరుపతి లడ్డూ విశిష్టతను దగ్గరుండి అపవిత్రం చేసే కార్యక్రమాన్ని సాక్షాత్తూ ఒక ముఖ్యమంత్రే చేస్తుంటే ఇంత కంటే దారుణం, అధర్మం ఎక్కడైనా ఉంటుందా? ఒక్కసారి ఆలోచించండి. చంద్రబాబు ఏ రకంగా అబద్ధాలు చెప్పి రెక్కలు కట్టాడనేది ఆధారాలతో చూపిస్తా. దీన్ని రాష్ట్ర ప్రజలే కాదు.. దేశ ప్రజలంతా గమనించాలని విజ్ఞప్తి చేస్తున్నా.టాపిక్ డైవర్షన్ కోసమే డిక్లరేషన్» వైఎస్సార్, జగన్ ఇవాళ ఏమైనా కొత్తా?» స్వామివారికి పదేళ్లు పట్టువస్త్రాలు సమర్పించాం» నా పాదయాత్ర తరువాత స్వామిని దర్శించుకున్నాకే ఇంటికి వెళ్లాసీఎంగా వరసగా 5 ఏళ్లు స్వామివారికి భక్తి శ్రద్ధలతో, సంప్రదాయబద్ధంగా బ్రహ్మోత్సవాల్లో పట్టువస్త్రాలు సమర్పించాను కదా? ఎన్నోసార్లు స్వామి వారిని దర్శించుకున్నా. తొలిసారి ఎవరైనా వెళ్తుంటే అడగొచ్చు. కానీ 10, 11 సార్లు వెళ్లిన తరువాత.. ఈరోజు నేను తిరుపతి వెళ్తానంటే అడ్డుకుంటూ నోటీసులు ఇవ్వడం ఏమిటి?. డిక్లరేషన్ అడగడం ఏమిటి? మా ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లకు నోటీసులు పంపడం ఏమిటి?’’ అని వైఎస్ జగన్ సూటిగా ప్రశ్నించారు.చంద్రబాబు పాపాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న నేపథ్యంలో ప్రజలంతా ఆయన్ను వేలెత్తి చూపుతుండటంతో టాపిక్ డైవర్షన్ కోసమే డిక్లరేషన్ అంటున్నాడు. జగన్ ఇవాళ ఏమైనా కొత్తనా? రాజశేఖర్‌రెడ్డిగారు కొత్తనా? ఆయన ఏమిటో తెలియదా? నా మతం ఏమిటో రాష్ట్రంలో, దేశంలో తెలియదా? నా కులం ఏమిటో తెలియదా? రాజశేఖర్‌రెడ్డిగారు సీఎంగా 5 ఏళ్లు వరుసగా స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. నేనూ గతంలో చాలాసార్లు వెళ్లాను కదా! సీఎం కాక ముందు కూడా వెళ్లాను కదా! అంతెందుకు.. నా పాదయాత్ర మొదలుపెట్టే ముందు కూడా స్వామివారిని దర్శించుకున్నా. 3,648 కిలోమీటర్ల పాదయాత్రకు ముందు, ముగిసిన తర్వాత తిరుమల శ్రీవారిని దర్శించుకున్నా. తిరుపతి నుంచి కాలి నడకన కొండ ఎక్కా. స్వామివారిని దర్శించుకున్న తర్వాతే ఇంటికి వెళ్లా. అప్పుడు ఉన్నది చంద్రబాబు ప్రభుత్వం. – వైఎస్ జగన్ -
ఆ నెయ్యి ఎక్కడ వాడారు అనేది అప్రస్తుతం
సాక్షి, అమరావతి: కలియుగ దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ప్రసాదమైన లడ్డూలో కల్తీ జరిగిపోయిందంటూ నిన్నటివరకు ప్రచారం చేసిన సీఎం చంద్రబాబు నాయుడు.. అదంతా ఉత్తి అసత్య ప్రచారమని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విశదీకరించి, వాస్తవాలను ప్రజల ముందుంచడంతో కంగుతిన్నారు. కల్తీ జరిగిన నెయ్యిని ఎక్కడ వాడారన్నది అప్రస్తుతమంటూ చంద్రబాబు తప్పించుకొనే ప్రయత్నం చేశారు. బాబు శుక్రవారం సాయంత్రం సచివాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి.. ఏఆర్ డెయిరీ నెయ్యిని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో వినియోగించారా లేక దేనికోసం ఎక్కడ వాడారు అన్నది అప్రస్తుతమంటూ మాట మార్చారు. ఏఆర్ డెయిరీ మొత్తం ఎనిమిది ట్యాంకర్ల నెయ్యి పంపితే అందులో నాలుగు ట్యాంకర్ల నెయ్యి వినియోగించామని, మరో నాలుగు ట్యాంకర్లను పరీక్ష కోసం ఎన్డీడీబీకి పంపితే ఆ నివేదిక ఆధారంగా వాటిని తిరస్కరించామని అన్నారు. ముందు వినియోగించిన నాలుగు ట్యాంకర్లలో కల్తీ జరిగిందా అని అడగ్గా.. ఆ తర్వాత ట్యాంకర్లలో జరిగింది కదా అంటూ అడ్డంగా బుకాయించారు. తన తప్పుడు ప్రచారాన్ని సమర్థించుకోవడానికి ఆపసోపాలు పడ్డారు. ఇప్పటివరకు తిరుమలలో ఎటువంటి ల్యాబులు లేవన్న చంద్రబాబు.. ఇప్పుడు కేవలం నాణ్యత ప్రమాణాలు పరిశీలించే ల్యాబులు మాత్రమే ఉన్నాయని ఒప్పుకొంటూనే.. మరోపక్క కల్తీ జరిగిందా లేదా అన్న విషయాన్ని నిర్థారించే అడల్ట్రేషన్ ల్యాబులు లేవంటూ తప్పును సమర్థించుకునే ప్రయత్నం చేశారు. త్వరలోనే తిరుమలలో ప్రపంచస్థాయి అల్రడ్టేషన్ ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. వేంకటేశ్వర స్వామి ప్రతిష్టకు భంగం కలుగుతుందంటూ ఎన్డీడీబీ నివేదికను బయట పెట్టకుండా తాము దాచిపెడితే, ఆ తర్వాత అది బయటకు వస్తే ఆ స్వామి మమ్మల్ని క్షమిస్తాడా అంటూ ఎదురుదాడి చేశారు. ఆ 4 ట్యాంకుల కల్తీ నెయ్యి వాడకుండా ఉంటే సంతోíÙంచేవాడినని, అవి వాడినందునే బాధపడుతున్నా అని అన్నారు. తెలిసీ తెలీక తప్పులు జరిగాయని, క్షమించాలని ప్రతి ఏటా ఆగస్టు 15 తర్వాత తిరుమలలో పవిత్రోత్సవాలు చేస్తారని, కానీ నెయ్యి కల్తీ జరగడంతో ఇటీవల సంప్రోక్షణ, శాంతియాగం చేశారని చెప్పారు. కొత్త చట్టం తెస్తాం ఎవరు ఏ ప్రార్థనాలయాలకు వెళ్లినా అక్కడి సంప్రదాయాలను తప్పనిసరిగా గౌరవించేలా త్వరలో కొత్త చట్టం కూడా తీసుకొస్తామని చంద్రబాబు చెప్పారు. వివిధ ప్రాంతాల వారిని టీటీడీ బోర్డు సభ్యులుగా పెట్టడం తప్పుకాదని, దాన్ని జంబో బోర్డుగా మార్చడమే తప్పు అని అన్నారు. తిరుమల పవిత్రతను కాపాడేందుకు త్వరలోనే దేశవ్యాప్తంగా మేధావులతో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. టీటీడీ ప్రక్షాళన కోసమే ఈవోగా శ్యామలరావును నియమించామని చెప్పారు. ఆ తర్వాత విజిలెన్స్ ఎంక్వైరీ వేశామని, ఇప్పుడు సిట్ వేశామని చెప్పారు. సిట్ దర్యాప్తు తర్వాత కల్తీ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. జగన్‌పై అక్కసు వెళ్లగక్కిన బాబు జగన్ తిరుమలకు రాకుండా తాము ఎక్కడా అడ్డుకోలేదని, ఎటువంటి నోటీసులు ఇవ్వలేదని, అటువంటి నోటీసులు ఉంటే చూపించాలని అన్నారు. తిరుమల వెళ్లినప్పుడు నియమాలు, ఆచారాలు, సంప్రదాయాలు పాటించకపోతే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయన్నారు. రౌడీయిజం చేస్తామంటే కుదరదన్నారు. ఇతర మతస్తులు ఎవరొచ్చినా తిరుమలలో డిక్లరేషన్ ఇచ్చి వెళ్లారని చెప్పారు. పదే పదే అబద్ధాలు తిరిగి చెప్తున్నారని అన్నారు. తెలీసో, తెలీక తప్పులు జరిగితే క్షమించమనడానికి దేవుడికి పూజ చేస్తారని చెప్పారు. మాజీ ముఖ్యమంత్రినే రానివ్వకుంటే దళితులను రానిస్తారా అని మాట్లాడుతున్నారని, దళితులను రానివ్వరని ఎవరు చెప్తున్నారంటూ ప్రశ్నించారు. తిరుమల వెళ్లడం ఇష్టంలేకే వివిధ రకాలుగా బురదజల్లుతున్నారన్నారు. జగన్ మాటలకు విశ్వసనీయత ఉండదని అన్నారు. వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా తిరుమల, తిరుపతిల్లో స్థానికులు పోటీగా జనసమీకరణ చేస్తామని సమాచారం రావడంతో ముందు జాగ్రత్త చర్యగా పోలీసు యాక్ట్ 30ని అమలు చేసి, పది మందికంటే ఎక్కువ ఉండకూడదని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. -
‘రివర్స్’తో నందిని నెయ్యి
సాక్షి ప్రతినిధి, తిరుపతి: లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించారని.. మహాపచారానికి పాల్పడ్డారని పచ్చి అబద్ధాలు వల్లిస్తూ శ్రీవారి సన్నిధిలో రివర్స్ టెండర్లు ఏమిటంటూ గద్దించిన సీఎం చంద్రబాబు తాజాగా అదే విధానంలో నిబంధనలకు విరుద్ధంగా నెయ్యి సరఫరా కాంట్రాక్టును ఆల్ఫా మిల్క్ ఫుడ్స్ సంస్థకు కేటాయించడంపై తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది.టెండర్లో ఎల్ 1గా నిలిచిన కర్ణాటకకు చెందిన నందిని డెయిరీకి పూర్తి స్థాయిలో నెయ్యి సరఫరా కాంట్రాక్టు ఇవ్వకుండా రివర్స్ టెండర్ పిలిచి అత్యధికంగా ఆల్ఫా మిల్క్ సంస్థకు కేటాయించడం గమనార్హం. నెయ్యి సరఫరా కాంట్రాక్టును ఆల్ఫా మిల్క్ ఫుడ్స్‌కు కట్టబెట్టేందుకే లడ్డూలో జంతు కొవ్వు అవశేషాలు ఉన్నాయనే ఆరోపణలు తెరపైకి తెచ్చి రివర్స్ టెండర్ విషయాన్ని పక్కదారి పట్టించారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎల్ 1 కాదని ఎల్ 2కి ఎలా ఇస్తారు? ‘రివర్స్’ మతలబేంటి?తిరుమలలో స్వామి వారి ప్రసాదాలకు వినియోగించే నెయ్యి సరఫరా కాంట్రాక్టును తమకు అనుకూలమైన వారికి కట్టబెట్టాలని కూటమి పెద్దలు ముందుగానే నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా టీటీడీ గత నెల 7 తేదీన మూడు నెలలకు సరిపడా నెయ్యి సరఫరాకు ఈ టెండర్లు పిలిచింది. ఇందులో కర్ణాటకకు చెందిన నందిని(కర్ణాటక కో–ఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ ఫెడరేషన్ లిమిటెడ్) కిలో నెయ్యి రూ.470 చొప్పున సరఫరా చేసేందుకు కోట్ చేసి ఎల్ 1గా నిలిచింది.ఢిల్లీకి చెందిన ఆల్ఫా మిల్క్ ఫుడ్స్ సంస్థ రూ.530 కోట్ చేసి ఎల్ 2గా నిలిచింది. నిబంధనల ప్రకారం ఎల్ 1గా నిలిచిన నందినికే టెండర్ దక్కాలి. అయితే నందినిని కాదని ‘ముఖ్య’ నేత ఆల్ఫా ఫుడ్స్ సంస్థకు నెయ్యి టెండర్ కేటాయించాలని నిర్ణయించుకున్నారు. దీంతో టీటీడీ వెంటనే రివర్స్ టెండర్లు పిలిచింది. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ నిబంధనల ప్రకారం ఈ టెండర్లు పిలిచిన తరువాత తిరిగి టెండర్లు పిలవాల్సి వస్తే మళ్లీ ఈ టెండర్‌నే పిలవాలి.రివర్స్ టెండర్‌కి అవకాశమే లేదు. అయితే టీటీడీ ఈవో ఆదేశాల మేరకు గత నెల 9న రివర్స్ టెండర్స్ నిర్వహించారు. ఈసారి ఆల్ఫా మిల్క్ ఫుడ్స్ కిలో నెయ్యి రూ.450 చొప్పున కోట్ చేయగా నందిని కిలో రూ.475కి కోట్ చేసింది. ఈ టెండర్లో ఆల్ఫా మిల్క్ ఫుడ్స్‌కి 65 శాతం నెయ్యి సరఫరా కాంట్రాక్టు ఖరారు చేశారు. రివర్స్ టెండర్‌పై వివాదాన్ని తెరపైకి తేకుండా నందినికి 35 శాతం నెయ్యి సరఫరా అవకాశం కల్పించారు. -
దేవుడిపై కూడా బాబు రాజకీయాలే: గడికోట శ్రీకాంత్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: సీఎం స్థాయిలో చంద్రబాబు మాటలు బాధ కలిగించాయని అన్నారు మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి. దేవుడిని కూడా చంద్రబాబు రాజకీయాలకు వాడుకుంటున్నారని మండిపడ్డారు. ప్రజలను బాబు భయబ్రాంతులకు గురిచేశారని విమర్శలు గుప్పించారు. ప్రతి 6 నెలలకోసారి టెండర్ల ద్వారా నెయ్యి సేకరణ జరుగుతుందని, ట్యాంకర్లలో వచ్చిన నెయ్యిని పరిశీలించిన తర్వాతే వినియోగిస్తారని తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో సోమవారం గడికోట మాట్లాడుతూ.. కేవలం రాజకీయం కోసమే చంద్రబాబు విషప్రచారం చేస్తున్నారని అన్నారు. శ్రీవారిని అడ్డం పెట్టుకొని పొలిటికల్ గేమ్స్ ఆడుతున్నారని దుయ్యబట్టారు. జులైలో వచ్చిన రిపోర్ట్‌ను సెప్టెంబర్‌లో బయటపెట్టారని, తిరుమల లడ్డూపై తప్పుడు ప్రచారం మంచిది కాదని తెలుసుకోవాలని హితవు పలికారు.చదవండి: బాబూ.. భక్తుల మనోభావాలతో ఆడుకుంటావా?: మాజీ మంత్రి కాకాణి‘నెయ్యి ట్యాంకర్లను మూడు దశల్లో టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేసిన తర్వాత కూడా లడ్డూ తయారీకి ఎలా పంపించారు?. ఒక కేజీ నెయ్యి తయారు చేయాలంటే 40 లీటర్ల పాలు అవసరం. ప్రతిరోజూ ఇలాంటి నెయ్యి 30 లీటర్లను అభిషేకం చేస్తారు. ఈ పద్ధతిలో 50 టన్నుల నెయ్యి తయారు చేయలేము. నైవేద్యం తయారీకి పవిత్రమైన నెయ్యిని వాడతారు. అభిషేకానికి, నైవేద్యానికి, దీపాలకు పవిత్రమైన నెయ్యిని ఉపయోగిస్తారు.వెన్నతో నవనీత సేవ కోసం కొండపైనే అవులను పెంచి వెన్నను తయారు చేస్తున్నారు. జూన్‌లో వచ్చిన నెయ్యి ని వెనక్కి పంపించకుండా అదే నెయ్యితో లడ్డూ ఎలా తయారు చేయించారు ?తప్పు చంద్రబాబు చేశారు.. డ్రామాలు ఎన్ని రోజులు చేస్తారు?. సెంటిమెంట్ క్రియేట్ చేసి తిరుమలను కలుషితం చేసే కుట్రలు చేస్తున్నారు. ప్రత్యర్థులపై చంద్రబాబు నిందలు మోపే ప్రయత్నం చేస్తున్నారు. మహానేత రాజశేఖర్ రెడ్డి.. వేద పాఠశాలను ప్రారంభించారు. 2014 - 2019 వరకు దేవాలయాలకు ఎన్ని నిధులు కేటాయించారు? 2019 - 2024 వరకు ఎన్ని నిధులు మంజూరు చేశారు ?. స్టీల్ ప్లాంట్, వరద నష్టం, మెడికల్ కాలేజీ, వంద రోజుల పాలన అంశాలను దృష్టి మళ్లించడానికి.. డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారునింద వేయడమే మా విధానం అన్నట్లుగా ఉంది చంద్రబాబు తీరు. వైఎస్సార్సీపీని భుజాన వేసుకొని మాట్లాడటానికి రాలేదు. శ్రీవారి భక్తుడిగా మాట్లాడుతున్నా. చిత్తశుద్ధి లోపించినప్పుడు ఇలాంటి పనులు చేస్తారు. సెంటిమెంట్‌కు అనుగుణంగా ప్రభుత్వం పనిచేయాలి. తాపత్రయ పడి తిరుమలను రోడ్డున పడేయకుండి. అందరూ బాధ్యతగా వ్యవహరించాలి. తిరుమలలో ఏ తప్పూ జరగలేదు. జరిగిన ప్రచారానికి ఇకనైనా ఫుల్‌స్టాఫ్ పెట్టాలి. వాస్తవాలను వక్రీకరించకుండా నిజాలని ప్రజలకు తెలియజేసే విధంగా విచారణ జరపాలి. రాజకీయ కోణంలో చూడొద్దు. తిరుమలలో పూజ విధానం జియ్యర్ల ద్వారానే జరుగుతోంది’ అని గడికోట శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. -
లడ్డూ ప్రసాదం స్వచ్ఛం, శుద్ధం, పవిత్రం
సాక్షి, అమరావతి : తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం స్వచ్ఛం..శుద్ధం అని ఆహార శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు. జంతువుల కొవ్వు కలిసిన నెయ్యితో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం ఏనాడూ తయారు చేయనేలేదని స్పష్టం చేశారు. భారత ఆహార భద్రత– ప్రమాణాల సాధికారిక సంస్థ(ఎఫ్ఎస్ఎస్ఐ) అధ్యయనాన్ని ఉటంకిస్తూ శాస్త్రీయమైన ఆధారాలతో సహా నిగ్గు తేల్చారు. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఆహార పరిశోధన రంగం శాస్త్రవేత్తలు రుచి శ్రీవాస్తవ, నేహా దీపక్ షాలు ఈ మేరకు సాధికారికంగా వెల్లడించారు. పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై టీడీపీ కూటమి ప్రభుత్వం చేస్తున్న రాద్ధాంతం అంతా దుష్ప్రచారమేనని తేల్చి చెప్పారు. జంతువుల కొవ్వు కలిపిన నెయ్యితో తయారు చేసే ఆహార పదార్థాలు విపరీతమైన దుర్వాసన వస్తుందని వారు స్పష్టం చేశారు. ఎటువంటి ప్రత్యామ్నాయ దినుసులు వాడినప్పటికీ ఆ దుర్వాసనను తొలగించలేమని చెప్పారు. అత్తరు, ఇతరత్రా సుగంధ ద్రవ్యాలు కుమ్మరించినా సరే ఆ దుర్వాసన పోదు. ఇక జంతువుల కొవ్వు కలిపిన నెయ్యితో తయారు చేసే లడ్డూలు గుండ్రంగా ఉండలా ఉండవు. లడ్డూ బూందీ విడిపోతుంది. ఆ నెయ్యి లడ్డూ బూందీని కలిపి ఉంచ లేదు.వైఎస్సార్సీపీ ప్రభుత్వం అయిదేళ్ల కాలంలో తిరుమల లడ్డూ ప్రసాదంపై అటువంటి ఆరోపణలుగానీ ఫిర్యాదులుగానీ రానే లేదు. ఎప్పటి మాదిరిగానే ఆ ఐదేళ్లలో కూడా రోజూ వేలాది మంది భక్తులు లక్షలాది లడ్డూలు భక్తితో తిన్నారు. ఆ అయిదేళ్లలో తిరుమల దర్శనం చేసుకున్న కోట్లాది మంది భక్తుల్లో ఒక్కరు కూడా లడ్డూ ప్రసాదంపై ఎటువంటి ఫిర్యాదు చేయలేదు. దుర్వాసన వచ్చినట్టు ఆరోపించనే లేదు. అంతెందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ కూడా పలుమార్లు తిరుమల వెళ్లారు. శ్రీవారి లడ్డూ ప్రసాదం తిన్నారు. ఉప రాష్ట్రపతి హోదాలో వెంకయ్య నాయుడుతోపాటు బీజేపీ అగ్రనేతలు అందరూ తిరుమల లడ్డూ ప్రసాదం స్వీకరించిన వారే. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా తిరుమల వెళ్లారు. లడ్డూ ప్రసాదం తిన్నారు. కానీ వారిలో ఒక్కరు కూడా లడ్డూ ప్రసాదం నాణ్యత బాగోలేదని గానీ దుర్వాసన వస్తోందని గానీ ఆరోపించనే లేదన్నది అందరికీ తెలుసు. కానీ ప్రస్తుతం రాజకీయ ప్రయోజనాల కోసం కుట్ర పూరితంగానే తిరుమల లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచారం చేస్తున్నారన్నది సుస్పష్టం. ఎలా కల్తీ జరిగిందో ఎన్డీడీబీ చెప్పలేదు నెయ్యి కల్తీ జరిగిందని మాత్రమే ఎన్డీడీబీ నివేదిక వెల్లడించగలదు. కానీ, జంతువుల కొవ్వు కలపడం వల్ల ఆ కల్తీ జరిగిందని నిరూపించే అవకాశమే లేదని ఆహార శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. సోయాబీన్, పొద్దు తిరుగుడు పువ్వు, రేపీడ్స్, గోధుమ జెర్మ్, మొక్క జొన్న జెర్మ్, పత్తి విత్తనాలు, కొబ్బరి, పామ్ ఆయిల్ ద్వారా కూడా కల్తీ చేసే అవకాశాలున్నాయి.నెయ్యిలో కల్తీ చేయాలంటే వ్యాపారులు సాధారణంగా పాల్పడే అక్రమ విధానం ఏమిటంటే.. పామాయిల్, హైడ్రోజనేటెడ్ కూరగాయల కొవ్వును కలుపుతూ ఉంటారని ఆహార శాస్త్రవేత్తలు చెప్పారు. ఎందుకంటే అవి అయితేనే తక్కువ వ్యయంతో కల్తీ చేయవచ్చన్నారు. టీటీడీకి సరఫరా చేసిన నెయ్యిలో ఎటువంటి కల్తీ చేశారన్నది ఎన్డీడీబీ నివేదికలో స్పష్టం చేయనే లేదు. కానీ చంద్రబాబు, ఆయన ముఠా సభ్యులు జంతువుల కొవ్వు కలిపారని రాద్ధాంతం చేయడం రాజకీయ కుట్రేనన్నది సుస్పష్టం.జంతువుల కొవ్వు కలిసిందని నివేదికలో లేదుటీటీడీకి సరఫరా చేసిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని ఎన్డీడీబీ ల్యాబ్ నివేదిక వెల్లడించ లేదు. ఆ నివేదిక కల్తీని సూచిస్తుందని తప్ప.. ఎటువంటి కల్తీనో చెప్ప లేదు. కల్తీ చేయాలనుకునే వ్యాపార సంస్థలు సాధారణంగా పామాయిల్ మరియు హైడ్రోజనేటెడ్ కూరగాయల కొవ్వు కలుపుతారు.అంతేగానీ జంతువుల కొవ్వును కలపరు. ఎందుకంటే జంతువుల కొవ్వు కలిపితే వ్యయం పెరుగుతుంది. వారికి లాభం ఉండదు. తక్కువ వ్యయంతో ఎక్కువ లాభం పొందేందుకే ఎవరైనా కల్తీ చేస్తారు. కానీ తయారీ వ్యయం పెంచుకునేందుకు కల్తీ చేయరు. – నేహా దీపక్ షా, ఆహార శాస్త్రవేత్తఆ నెయ్యిలో జంతువుల కొవ్వు లేదుజంతువుల కొవ్వు కలిపిన నెయ్యితో తయారు చేసే లడ్డూలుగానీ ఇతర ఆహార పదార్థాల నుంచిగానీ విపరీతమైన దుర్వాసన వస్తుంది. ఎటువంటి సువాసన ద్రవ్యం వేసినా సరే ఆ దుర్వాసన పోదు. దుర్వాసన వచ్చే లడ్డూలుగానీ ఆహార పదార్థాలు గానీ ఎవరూ తయారు చేయరు. తయారు చేసినా ఎవరూ స్వీకరించరు. తిరుమల లడ్డూ ప్రసాదంపై గత ఐదేళ్లలో అటువంటి ఫిర్యాదు రాలేదన్నది గుర్తుంచుకోవాలి. లడ్డూలో కల్తీ లేదని నేను కచ్చితంగా చెప్పగలను. – రుచి శ్రీవాస్తవ, ఆహార పరిశోధకురాలు -
ఏఆర్ డెయిరీ నెయ్యిలో కల్తీ జరిగింది: టీటీడీ ఈవో
సాక్షి,తిరుమల: ఏఆర్ డెయిరీ టీటీడీకి సరఫరా చేసిన నెయ్యిలో కల్తీ జరిగినట్లు తేలిందని, తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)ఈవో శ్యామలరావు తెలిపారు. శుక్రవారం(సెప్టెంబర్20) తిరుమలలో నిర్వహించిన మీడియా సమావేవంలో ఈవో మాట్లాడారు. కల్తీ జరిగినట్లు తేలడంతో లడ్డూ తయారీలో ఏఆర్ డెయిరీ నెయ్యి వాడడం ఆపేశామని చెప్పారు. లడ్డూ తయారీకి ఏఆర్ డెయిరీ నెయ్యి సరఫరా చేసింది. టీటీడీకి సొంత టెస్ట్ ల్యాబ్ లేదు. జులై5,6 తేదీల్లో రెండు నెయ్యి ట్యాంకర్లలోని శాంపిల్స్‌ను బయట ల్యాబ్‌లలో టెస్ట్‌కు పంపాం. ఏఆర్ డెయిరీ నెయ్యిలో కల్తీ జరిగినట్లు ఈ టెస్ట్‌లలో తేలింది. దీంతో సరఫరాదారులందరికీ వార్నింగ్ ఇచ్చాం. నెయ్యి సరఫరా కోసం కొత్త కాంట్రాక్టర్‌తో టెండర్ ఖరారైంది’అని ఈవో తెలిపారు. ఇదీ చదవండి.. శ్రీవారి లడ్డూపై సీబీఎన్ ఉన్మాద రాజకీయం -
ఇడ్లీ మీద నెయ్యి వేసుకుని తినే అలవాటు మంచిదేనా?
ఇడ్లీ మీద నెయ్యి వేసుకునే అలవాటు మంచిదేనా? ఇలా తింటే బరువు పెరుగుతారా? అని చాలామంది మదిలే మెదిలే సందేహం. అయితే ఇలా ఇడ్లీ మీద నెయ్యి రాసుకుని తినే అలవాటు మంచిదే అంటున్నారు నిపుణులు. అలాగే ఇలా తింటే బరువు పెరుగుతారా అనే సందేహం కూడా వాస్తవమే అని చెబుతున్నారు. మరి తినోచ్చా ?లేదా అంటే..నెయ్యి వేసుకుని తింటే కచ్చితంగా బరువు పెరుగుతారు. అయితే ఇడ్లీ, నెయ్యి ఆరోగ్యకరమైనవే. కాబట్టి ఆరోగ్యంగా బరువు పెరగడం, వ్యాయామంతో ఫిట్నెస్ సాధించడమే హెల్దీ లైఫ్ స్టైల్. ఇడ్లీలో కేలరీలు, ప్రోటీన్, ఫ్యాట్ తక్కువ, కార్బొహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఒక టేబుల్ స్పూన్ నెయ్యిలో 120 నుంచి 130 కేలరీలు, అరవై శాతం సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. కార్బొహైడ్రేట్లు, ప్రోటీన్లు తక్కువ. ఇడ్లీలో నెయ్యి వేసుకుని తిన్నప్పుడు నెయ్యి మోతాదును బట్టి మూడు వందల నుంచి ఆరు వందల కేలరీలు అందుతాయి. నెయ్యి కావాలి! కొవ్వులో కరిగే ఎ,డి,ఇ,కె విటమిన్ల కోసం దేహానికి నెయ్యి అవసరమే. అలాగే దేహంలో వాపులను నివారించే కాంజుగేటెడ్ లినోలిక్ యాసిడ్‌ను దేహం సరిగ్గా పీల్చుకోవడానికి కూడా నెయ్యి ఉండాలి. ఇడ్లీ మీద నెయ్యి వేసుకుని తినడానికి భయపడాల్సిన అవసరం లేదు. ఒకటి లేదా రెండు టీ స్పూన్లకు పరిమితం చేస్తే మంచిది. అలాగే రోజువారీ డైట్లో ప్రోటీన్, ఫైబర్ సమృద్ధిగా ఉండేలా చూసుకుంటూ రోజు మొత్తంలో ఆహారంలో ఎన్ని కేలరీలు చేరుతున్నాయో గమనించుకోవాలి. --సుజాత స్టీఫెన్ ఆర్.డి. న్యూట్రిషనిస్ట్(చదవండి: ఈ డ్రైఫ్రూట్‌తో నిద్రలేమికి చెక్‌పెట్టండి!) -
మౌత్ అల్సర్ నుంచి ఉపశమనానికై.. ఇలా చేయండి!
కొన్ని రకాల యాంటీ బయాటిక్స్ వాడటం, కొన్ని రకాల వ్యాధులతో బాధపడటం వల్ల నోటిలో పుళ్లు ఏర్పడుతుంటాయి. కొందరికి ఊరికినే కూడా అప్పుడప్పుడు నోటిపూత వస్తుంటుంది. ఇలాంటప్పుడు ఏమైనా తాగినా, తిన్నా చాలా బాధగా ఉంటుంది. మౌత్ అల్సర్స్ నుంచి ఉపశమనం పొందడానికి తేనె చక్కటి మార్గం. నోట్లో కణజాలాలు చిట్లిపోవడం వలన ఈ సమస్య ఏర్పడుతుంది కాబట్టి.. తేనెను పూయడం వలన కొత్త కణజాలాలు తిరిగి ఏర్పడడానికి ఇది దోహదం చేస్తుంది. తేనెలో పసుపు కలిపి పేస్ట్ లా చేసుకుని రాసినప్పుడు కూడా చక్కటి ఉపశమనం లభిస్తుంది.మొక్కజొన్న కంకి ఒలిచేటప్పుడు వచ్చే సిల్క్ దారాల్లాంటి కార్న్ సిల్క్‌ను వృథాగా పడేస్తారు. కానీ అవి కిడ్నీ రాళ్లను బయటకు పంపడంలో సమర్థవంతంగా పని చేస్తాయి. వాటిని నీటిలో ఉడికించి చల్లారాక వడగట్టి తాగాలి. ఇలా చేయడం వల్ల కిడ్నీలో కొత్తగా రాళ్లు ఏర్పడవు. ఇది మూత్ర విసర్జన సాఫీగా జరిగేలా చూస్తుంది. కిడ్నీ స్టోన్స్ వల్ల వచ్చే నొప్పిని తగ్గించడంలో కార్న్ హెయిర్ ఉపయోగపడుతుంది. కొబ్బరి నీళ్లను తరచూ తాగడం, కొబ్బరి నూనెను పూయడం, అలానే ఎండు కొబ్బరిని తినడం వల్ల కూడా నోటిపూత తగ్గుతుంది. ఎందుంకటే కొబ్బరి శరీరంలో వేడిని తగ్గిస్తుంది. ఫలితం గా నోటిపూత త్వరగా మాని΄ోతుంది.పాలపదార్ధాలైన నెయ్యి, మజ్జిగ వంటి పదార్ధాలు కూడా నోటిపూత నుంచి ఉపశమనం కల్పిస్తాయి. ఎక్కడైతే నోటిపూత గాయాలున్నాయో అక్కడ నేయి రాయడం, రోజుకు రెండుమూడుసార్లు గ్లాసు మజ్జిగ తాగడం వల్ల ఎంతో ఉపశమనం గా ఉంటుంది.తులసి ఆకులు కూడా నోటిపూతకు మంచి ఔషధం. రోజుకు నాలుగైదు సార్లు తులసాకులు నమలడం వల్ల నోటిపూత తొందరగా తగ్గి΄ోతుంది.చిన్న ఐస్ ముక్కతో పుండు ఉన్న చోట మర్దనా చేయడం, లవంగం నమలడం కూడా నోటిపూతను తగ్గిస్తాయి.ఇవి చదవండి: Beauty Tips: కాలానుగుణంగా.. చర్మం అందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే..? -
వేసవిలో నెయ్యిని తీసుకుంటే బోలెడన్ని లాభాలు!
మనం తినాలనిపించినప్పుడో లేదా ఘుమఘుమలాడే వేడివేడి పప్పులో నెయ్యి వేసుకుంటే ఆ రుచే వేరు. ఏడాది పొడవునా కొందరూ నెయ్యి వేసుకుని తింటుంటారు. అయితే ఆరోగ్య నిపుణులు మాత్రం వేసవిలో కచ్చితంగా ఆహారంలో నెయ్యిని చేర్చుకోవడం మంచిదని చెబుతున్నారు. అసలు ఈ వేసవిలో దాహం దాహం అంటుంది వాతావరణం. అలాంటి ఈ టైంలో నెయ్యి వేసుకంటే అమ్మో దాహమే దాహంగా ఉంటుంది కదా మరీ ఇలా ఎలా చెబుతున్నారు? రీజన్ ఏంటీ తదితరల గురించి సవివరంగా చూద్దాం. ఆయుర్వేద ప్రకారం నెయ్యి ఆహారానికి మంచి శక్తిని ఇచ్చే రుచికరమైన పదార్థం. నెయ్యి తీసుకోవడం వల్ల మొత్తం ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపుతుంది. శీతాకాలం లేదా వేసవికాలంలో నెయ్యిని తరుచుగా తీసుకుంటాం గానీ వేసవిలోనే దీన్ని ఎక్కువగా తీసకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే..?నెయ్యిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి. దీనిలో విటమిన్ ఏ, సీలు కూడా అధికంగా ఉంటాయి. ఇవి కణజాలాలకు పోషణనిస్తాయి. పైగా అవయవాల పనితీరుని మెరుగుపరుస్తుంది. శరీరం వేడిని తగ్గించడంలో నెయ్యికి మించిది మరోకటి లేదు. శరీరీంలో ఆరోగ్యకరమైన కొవ్వులు కోసం నెయ్యిని రోజువారి అల్పాహారంలో తీసుకోవడం మంచిది. ఈ ఆరోగ్యకరమై కొవ్వులు శరీరంలో పోషకాలను గ్రహించడానికి ముఖ్యమైన హార్మోన్లను విడుదల చేస్తాయి. నెయ్యిలో మాయిశ్చరైజింగ్ గుణాలు శరీరాన్ని హైడ్రేటింగ్ ఉంచడంలో సహాయపడతాయి. నెయ్యి తీసుకోవడంలో శరీరం మృదువుగా ఉంలేలా లోపలి నుంచి పోషణ ఇస్తుంది. ముఖ్యంగా వేసవిలో శరీరం సులభంగా డీహైడ్రేట్ అయినప్పుడు నెయ్యి తీసుకోవడం వల్ల చర్మం తేమగా, మృదువుగా ఉంటుంది. మన రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో నెయ్యి కీలక పాత్ర పోషిస్తుంది. ఇది మనల్ని వ్యాధులు, ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది. అంతేగాదు దీనిలో ఉండే బ్యూట్రిక్ యాసిడ్, స్వల్పకాలిక కొవ్వు ఆమ్లం, రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. నెయ్యిలో విటమిన్ ఏ, సీ పుష్కలంగా ఉన్నాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి.ముఖ్యంగా ఖాళీ కడుపుతో నెయ్యి తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. పైగా పిత్త దోషాన్ని నియంత్రిస్తుంది. ఇది శక్తివంతమైన యాంటీ ఫంగల్, యాంటీవైరల్ లక్షణాలను కలిగి ఉంది. అలాగే అనారోగ్యాన్ని నివారించడంలో సహాయపడుతుంది. ఆయుర్వేదం ప్రకారం, శరీరం జీర్ణక్రియను మెరుగుపరచడానికి, పోషకాలను గ్రహించడంలో సహాయపడటానికి నెయ్యి ఉత్తమమైన ఆహారాలలో ఒకటిగా చెప్పవచ్చు.నెయ్యి తీసుకోవడం వల్ల శరీరాన్ని చల్లగా ఉంచడమే గాక మనస్సు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే..? నెయ్యి మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. శరీరాన్ని శాంతపరిచే ప్రభావాన్ని అందిస్తుంది. నెయ్యి రుచిలో తీపి, చల్లని స్వభావం కలిగి ఉంటుంది. ఇది హాట్‌గా ఉండే వేసవి కాలంతో శరీరాన్ని చల్లగా ఉంచడంలో నెయ్యి ది బెస్ట్ అని చెప్పొచ్చు.(చదవండి: సీవీడ్‌తో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..!) -
మొక్కల సంరక్షణకు నెయ్యి ఉపయోగిస్తారని తెలుసా!
మాములుగా శరీరానికి తగు మోతాదులో నెయ్యి అవసరం. శరీరానికి కావాల్సిన మంచి కొలస్ట్రాల్ నెయ్యి అని కూడా నిపుణులు చెబుతున్న సంగతి తెలిసిందే. ఇది జ్ఞాపకశక్తిని, జీర్ణశక్తిని పెంచడమే గాక రోగనిరోధక శక్తిని మెరుగ్గా ఉంచుతుంది. అలాంటి నెయ్యి మొక్కల సంరక్షణ కోసం వినియోగిస్తారని విన్నారా?. ఈ నెయ్యి వల్ల మొక్కల కుండీల్లో నేల సారవంతమై మొక్క ఆరోగ్యంగా పెరిగేలా చేయడమే కాకుండా పురుగు, పుట్ర వంటివి దరిచేరనివ్వదని చెబుతున్నారు అగ్రికల్చర్ పరిశోధకులు. ఇంతకీ మొక్కలకు నెయ్యి వల్ల కలిగే ప్రయోజనాలేంటి? ఎలా వినియోగించాలి వంటివి తెలుసుకుందామా!. ►నెయ్యిలో కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉన్నందున , దానిని పెరుగుతున్న నేలలో వేయడం వల్ల సేంద్రీయ కూర్పు పెరుగుతుంది . దీన్ని మెక్క పెరుగుతున్న భాగంలో వేసి ఆ తర్వాత నీళ్లు పోసి వృద్ధి చెందేలా చూడాలి. ► అఫిడ్స్ స్లగ్‌లు కాండం, ఆకులపై దాడి చేయకుండా ఈ నెయ్యి రక్షిస్తుంది. దాని కుండే మృదు స్వభావానికి అవి దాడి చేయడం కష్టమవుతుంది. అలాగే ఇబ్బందికరమైన తెగుళ్ల నుంచి రక్షించుకోవడానికి నెయ్యి గొప్ప ప్రత్యామ్నాయం. ► దూదిపై 3-4 చుక్కల కరిగించిన నెయ్యి వేసి, తెగులు సోకిన మొక్క కాండం,ఆకులను తుడిస్తే..అఫిడ్స్, స్లగ్స్ పైకి రావు. నెయ్యిలోని కొవ్వులు నేలకు ఉపయోగపడే సూక్ష్మజీవులకు ఆహార వనరును అందిస్తాయి. మొక్క పెరుగుతున్న నేలలో సేంద్రీయ పదార్థం సమృద్ధిగా ఉండేలా చేస్తుంది. దీంతో మొక్క బాగా పెరగడమే గాక పచ్చగా పెరగడానికి సహాయపడుతుంది. ►ఇలా ప్రతి రెండు నుంచి మూడు నెలలకు చొప్పున రెండు నుంచి మూడు టీస్పూన్ల నెయ్యిని వేస్తే చాలు మంచి ఫలితాలు ఉంటాయి. ►రబ్బరు మొక్క వంటి పెద్ద ఆకులు కలిగిన మొక్కలకు నెయ్యితో మంచి ప్రయోజనం ఉంటుంది. తడిగా ఉన్న కాటన్ వస్త్రాన్ని ఉపయోగించి వాటి ఆకులను శుభ్రం చేయండి. పూర్తయిన తర్వాత, ఒక దూదీలో 4 నుంచి 5 చుక్కల కరిగించిన నెయ్యి వేసి, ఆకులను తుడవండి. ఇది ఆకులను మెరిసేలా చేయడమే కాకుండా కొవ్వు పొరను కూడా జోడిస్తుంది. గమనిక: నెయ్యి అప్లై చేసిన తర్వాత ఎక్కువ ధూళిని ఆకర్షిస్తుంది కాబట్టి 3-4 రోజుల తర్వాత మళ్లీ ఆకులను తుడవడం మంచిది. ప్రత్యక్ష సూర్యకాంతికి గురయ్యే మొక్కలపై దీనిని ఉపయోగించవద్దు. (చదవండి: స్టవ్ వెలిగించకుండానే.. పండంటి వంటలు..) -
మీకు తెలుసా! వేడి నీళ్లలో నెయ్యి కలిపి తాగితే ఏమౌతుందో!?
'సాధారణంగా కొందరు ఉదయం నిద్రలేచిన వెంటనే వేడినీరు తాగుతారు. ఇది జీర్ణక్రియలో సహాయపడుతుంది. అయితే వేడినీటిలో నెయ్యి కలుపుకుని తాగడం వల్ల జీర్ణ వ్యవస్థకు మరింత మేలు జరుగుతుందని మీకు తెలుసా!?' ఇది గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. నెయ్యిలో ఉండే ఫ్యాటీ యాసిడ్స్ గుండెకు చాలా మేలు చేస్తాయి. ఇది కాకుండా, కేలరీలు, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు ఎ, ఇ మొదలైనవి నెయ్యిలో లభిస్తాయి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో నెయ్యి తీసుకోవడం వల్ల రక్తప్రసరణ పెరుగుతుంది. చర్మ సంబంధిత సమస్యల నుంచి బయటపడవచ్చు. చర్మం ఆరోగ్యంగా... ప్రకాశవంతంగా మారుతుంది. కొవ్వు కరిగిపోతుంది. ఎముకలు దృఢంగా తయారవుతాయి. ఇది వెచ్చని నీటితో లేదా ఆహారంతో ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకోవచ్చు. ఉదయం ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి కలిపి తాగడం వల్ల శరీరంలోని రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంతోపాటు అనేక రకాల ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది. గోరువెచ్చని నీటిలో నెయ్యి కలిపి తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ తొలగిపోతాయి. ఇవి కూడా చదవండి: రక్తహీనతతో బాధ పడుతున్నారా.. అయితే ఇవి తీసుకోండి! -
రకుల్ ప్రీత్ సింగ్ ఫిట్నెస్ సీక్రెట్, పొద్దున్నే ఇది తాగుతుందట
కాఫీ అంటే తెలియని వారు ఉండరేమో. చాలామందికి పొద్దున్నే కాఫీ తాగనిదే రోజు గడవదు. బెడ్ మీద నుంచి లేవడంతోనే కాఫీతో డే స్టార్ట్ చేస్తారు. కాఫీ తాగడం మంచిదే కానీ, కొందరు అదే పనిగా రోజుకు 4-5సార్లు కాఫీని ఎనర్జీ డ్రింక్‌లా తాగేస్తుంటారు. అయితే ఇదంత మంచిది కాదని వైద్యులు సూచిస్తుంటారు. కాఫీలో కోల్డ్ కాఫీ, ఫిల్టర్ కాఫీ, బ్లాక్ కాఫీ.. ఇలా చాలా రకాలున్నా నెయ్యి కాఫీ అన్నింటికంటే ది బెస్ట్ అంటున్నారు. అందుకే ఎంతోమంది సెలబ్రిటీల రొటీన్లో నెయ్యి కాఫీ ముందుంటుంది. నెయ్యి కాఫీ(Ghee Coffee)వినడానికి కాంత కొత్తగా అనిపించినా ఇప్పుడు సెలబ్రిటీలు ఫాలో అవుతున్న ట్రెండ్ ఇదే. నెయ్యి కాఫీ తాగడానికి రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి, చర్మ సౌందర్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. అందుకే ఈ మధ్యకాలంలో బాగా పాపులర్ అయ్యింది. ప్రముఖ సెలబ్రిటీలు రకుల్ ప్రీత్ సింగ్, భూమి ఫడ్నేకర్ ఇప్పటికే చాలాసార్లు సోషల్ మీడియాలో తమ డే రొటీన్లో నెయ్యి కాఫీ గురించి నెటిజన్లతో పంచుకున్నారు. ఇంతకీ నెయ్యి కాఫీ అంటే ఏంటి? దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటన్నది చూద్దాం. నెయ్యి కాఫీ జీవక్రియను పెంచడంలో సహాయపడుతుంది. అసిడిటీని దూరం చేయడంలో తోడ్పడుతుంది. నెయ్యిలో విటమిన్-ఇ, ఎ,కె లు పుష్కలంగా ఉంటాయి. ఇది ఆకలిని తగ్గిస్తుంది. దీనివల్ల బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుంది. మొండి కొవ్వులను కరిగించడంలో నెయ్యి కాఫీ సహాయపడుతుంది. నెయ్యిలో ఒమేగా 3, 6, 9 వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. పరిగడుపున టీ స్పూన్ నెయ్యిని కాఫీలో కలుపుకుని తాగితే గట్ ఆరోగ్యం మెరుగుపడుతుంది. నెయ్యిలోని యాంటీ ఆక్సిడెంట్లు ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. చర్మ సమస్యలను తగ్గిస్తుంది. రకుల్ ప్రీత్ సింగ్ ఫేవరెట్ రెసిపి నెయ్యి కాఫీతోనే తన రోజు మొదలవుతుందని ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది. మంచి కొవ్వుతో పాటు చర్మ ఆరోగ్యానికి ఇది ఎంతో మేలు చేస్తుందని పేర్కొంది. మరి రకుల్ ప్రీత్ సింగ్ ఈ కాఫీని ఎలా తయారు చేసుకుంటుంది? ఏమేం వాడుతుందంటే... ►ముందుగా గ్లాస్లో ఒక స్పూన్ దేశీ నెయ్యి వేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్‌కి పైగా కాఫీ పౌడర్, కొలాజిన్‌ను జత చేసుకోవాలి. ఇందులో వేడి నీళ్లు పోసి బాగా కలపాలి. అంతే చిటికెలో నెయ్యి కాఫీ రెడీ అయినట్లే ► ఒకవేళ మీరు చక్కెర వేసుకోవాలనుకుంటే మీకు నచ్చిన ఏదైనా స్వీటెనర్ వేసుకోవచ్చు. లేదా 2-3 యాలకులు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమానికి కాసిన్ని పాలు కూడా జత చేసుకోవచ్చు. బరువు త్వరగా తగ్గాలనుకునేవారు పాలకు బదులుగా కేవలం వేడినీళ్లు వేసుకోవాలి. అంతే ఇలా ప్రతిరోజూ పరగడుపున నెయ్యి కాఫీ తాగడం వల్ల నెలరోజుల్లోనే రిజల్ట్ కనిపిస్తుంది. View this post on Instagram A post shared by jhaji kitchen (@jhajikitchen13) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) -
చలికాలంలో నెయ్యి తింటున్నారా?యాంటీ ఇన్‌ఫ్లేమేటరీ గుణాల వల్ల..
మన భారతీయ వంటకాల్లో చాలావరకు నెయ్యి ఉపయోగిస్తామన్న విషయం తెలిసిందే. వేడి వేడి అన్నంలో ఆవకాయ వేసుకొని కాస్త నెయ్యి కలుపుకొని తింటే ఆ రుచే వేరు కదా. స్వీట్ల దగ్గర్నుంచి ఘుమఘుమలాడే బిర్యానీల వరకు చాలా వంటకాల్లో నెయ్యిని వాడుతుంటాం. ప్రతిరోజూ నెయ్యి తీసుకుంటే బరువు పెరగతామని చాలామంది అనుకుంటారు. కానీ ఇది ఒట్టి అపోహ మాత్రమే. శీతాకాలంలో నెయ్యి క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ►నెయ్యిలో ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఒక చెంచా నెయ్యి తింటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది.నెయ్యి ప్రేగులలోని ఆమ్ల pH స్థాయిని తగ్గించి చిన్న పేగును శుద్ధిచేస్తుంది. దాంతో పాటు మలబద్ధకం సమస్య కూడా దూరమవుతుంది. ► నెయ్యి యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. నెయ్యి మన డైట్లో చేర్చుకుంటే.. చలికాలంలో తరచుగా ఇబ్బంది పెట్టే బలుబు, దగ్గు, ఫ్లూ, అలర్జీల నుంచి రక్షణ లభిస్తుంది ► ఇందులో విటమిన్లుఎ, ఇ, డి, కె.. వంటి కొవ్వుల్ని కరిగించుకునే విటమిన్లు, ఒమేగా-3, ఒమేగా-6 వంటి ఫ్యాటీ యాసిడ్స్, లినోలిక్, బ్యుటిరిక్ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. నిరోధకత శక్తి మెరుగుపడుతుంది. ► చలికాలంలో నెయ్యి తినడం వల్ల శరీరం లోపలి నుంచి వెచ్చగా ఉంటుంది. శరీరంలోనిని అంతర్గత ఉష్ణాన్ని క్రమబద్ధీకరించి ఉంచేందుకు నెయ్యి సహకరిస్తుంది. నెయ్యికి స్మోకింగ్ పాయింట్ అధికంగా ఉంటుంది. ► పసుపు, మిరియాలతో కలిపి నెయ్యిని తీసుకుంటే వాపును తగ్గించడంతో పాటు ఒత్తిడి తొలిగి నిద్రలేమిని అధిగమించవచ్చు. ►హార్మోన్ల సమతుల్యాన్ని కాపాడడంలో నెయ్యి కీలక పాత్ర పోషిస్తుంది. ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్‌ను కాపాడుతుంది. ► క్యాన్సర్ కణాలను నాశనం చేసే గుణాలు నెయ్యిలో ఉంటాయి. దీంతో రోజూ నెయ్యి తాగడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ► కంటి సంబంధిత వ్యాధితో భాధపడే వారు నెయ్యి ని ఆహారంతో పాటు తీసుకుంటే ఆ సమస్యల నుండి బయటపడవచ్చు.ఎందుకంటే ఇందులో మిటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. ► నెయ్యి తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుంది అనే భావన చాలా మందిలో ఉంది.అయితే నిజానికి నెయ్యి చెడు కొలెస్ట్రాల్ పెంచదు..మంచి కొలెస్ట్రాల్‌ను మాత్రమే పెంచుతుంది.దీంతో గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. అందానికి నెయ్యి నెయ్యి కేవలం ఆరోగ్యానికే కాదు.. అందానికీ మేలు చేస్తుంది. ఇది న్యాచురల్ మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. నెయ్యిని చర్మానికి అప్లై చేస్తే.. చర్మం మృదువుగా ఉంటుంది. నెయ్యి తీసుకోవడం వల్ల ముఖంపై మొటిమలు, మచ్చలు తొలగిపోతాయి. అంతేకాదు, ప్రతిరోజూ నెయ్యిని తీసుకుంటే ముఖం కాంతిమంతంగా తయారవుతుంది. ఇలాంటి వారు రాత్రి పడుకొనే ముందు నెయ్యితో పెదాలపై నెమ్మదిగా మర్దన చేయాలి. ఇలా తరచూ చేస్తుంటే పెదాల రంగు మెరుగవ్వడమే కాకుండా మృదువుగా మారతాయి. నెయ్యి చర్మంలో కొల్లాజెన్ అభివృద్ధిని ప్రేరేపిస్తుంది. ఇది చర్మ ప్రకాశాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. అలాగే పిగ్మెంటేషన్ సమస్యను తగ్గిస్తుంది. -
నేచురల్ పద్దతిలో కోట్లు సంపాదిస్తున్న మహిళ - 50 ఏళ్ల వయసులో..
Kamaljit Kaur Success Story: జీవితంలో ఎదగాలంటే తెలివి మాత్రమే కాదు చేయాలనే సంకల్పం, చేయగలననే పట్టుదల ఉంటే నిన్ను ఆపడం ఎవరికీ సాధ్యం కాదు.. విజయ శిఖరాలను అధిరోహించి సక్సెస్ సాధించిన మహానుభావులు చెప్పే మాటలివి. విజయం సాధించాలంటే మాటల్లో అనుకున్నంత సులభమైతే కాదు, కానీ ప్రయత్నిస్తే అసాధ్యం కాదు. ఇలాంటి కోవకు చెందిన వారిలో ఐదు పదులు దాటిన 'కమల్జిత్ కౌర్' (Kamaljit Kaur) ఒకరు. ఇంతకీ ఈమె ఎవరు? ఈమె జీవితంలో సాధించిన సక్సెస్ ఏంటి? అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమయంలో పంజాబ్ లుథియానాలోని చిన్న గ్రామంలో పుట్టిన కమల్జిత్ చిన్నప్పటి నుంచి స్వచ్ఛమైన పాలు, నెయ్యి, వెన్న తింటూ పెరిగింది. ఎలాంటి కల్తీ లేని పదార్థాలను తీసుకోవడం వల్ల ఈమెకు చిన్నప్పటి నుంచి ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాలేదని గతంలో వెల్లడిందింది. కిమ్ముస్ కిచెన్ బాల్యంలో తాను ఆస్వాదించిన స్వచ్ఛమైన దేశీ నెయ్యిని ఎలాంటి రసాయనాలు కలపకుండా సహజంగా అందించాలనే సంకల్పంతో 50 సంవత్సరాల వయసులో కమల్జిత్ కౌర్ కిమ్ముస్ కిచెన్ పేరుతో నెయ్యి విక్రయించడానికి సంకల్పించింది. అనుకున్న విధంగానే స్వచ్ఛమైన నెయ్యిని తయారు చేసి విక్రయించడం మొదలు పెట్టింది. అతి తక్కువ కాలంలోనే ఈమె నెయ్యి వాసనలు భారతదేశంలో మాత్రమే కాకుండా విదేశాలకు కూడా పాకాయి. దెబ్బతో కిమ్ముస్ కిచెన్ మూడు పువ్వులు ఆరు కాయలుగా ఎదిగింది. (ఇదీ చదవండి: ఐఐటీ చదివి యంగెస్ట్ బిలియనీర్ అయ్యాడిలా.. సంపాదనలో మేటి ఈ అంకిత్ భాటి!) ఎలాంటి కల్తీ లేకుండా నెయ్యిని తయారు చేయడానికి ఈమె బిలోనా అని పిలువబడే ఒక పద్ధతిని ఉపయోగించింది. ఈ పద్ధతిలో మొదట ఆవు పాలను మరిగించి చల్లబరుస్తుంది, తర్వాత ఒక టీస్పూన్ పెరుగు కలిపి, మరుసటి రోజు అందులో నుంచి వెన్నను తీసి నెయ్యిని తయారు చేస్తుంది. (ఇదీ చదవండి: ఈ సైకిల్ కొనే డబ్బుతో కారు కొనేయొచ్చు! ధర ఎంతో తెలుసా?) సంపాదన క్రమంగా కమల్జీత్ కౌర్ నెయ్యికి బాగా డిమాండ్ బాగా పెరిగింది. ప్రపంచ దేశాల్లోని చాలా మంది ప్రజలు ఇప్పుడు ఇతర దేశాల నుండి కూడా ఆర్డర్ చేస్తున్నారు. రిటైల్ నెయ్యి సీసాలు 220 ml, 500 ml, 1 లీటర్ పరిమాణాల్లో లభిస్తాయి. పరిమాణాన్ని బట్టి ధరలు వివిధ రకాలుగా ఉంటాయి. కొన్ని నివేదికల ప్రకారం కిమ్ముస్ కిచెన్ సంపాదన నెలకు రూ. 20 లక్షల కంటే ఎక్కువ. వీరి సంపాదనలో 1 శాతం గురుద్వార్‌కు, ఆకలితో ఉన్న వారికి అందిస్తున్నట్లు సమాచారం. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడానికి ఈ లింకుపై క్లిక్ చేయండి. -
Recipes: బాస్మతి బియ్యంతో ఘీ రైస్.. కార్న్‌ఫ్లోర్‌తో పనీర్ జిలేబీ! తయారీ ఇలా
Ghee Rice, Paneer Jalebi Recipes In Telugu: ఒక్కోరోజు ఒక్కో అలంకారంలో దర్శనమిచ్చే అమ్మవారికి వివిధ రకాల వంటకాలను నైవేద్యాలుగా పెడుతుంటాము. ఈ దసరాకు ఏటా పెట్టే వాటితోపాటు ఎంతో రుచికరమైన ఈ కింది నైవేద్యాలను కూడా అమ్మవారికి సమర్పించి మరింత ప్రసన్నం చేసుకుందాం.. ఘీ రైస్ కావలసినవి: ►బాస్మతి బియ్యం – కప్పు ►నెయ్యి – రెండున్నర టేబుల్ స్పూన్లు ►బిర్యానీ ఆకు – ఒకటి ►యాలకులు – రెండు ►లవంగాలు – రెండు ►దాల్చిన చెక్క – అంగుళం ముక్క ►అనాస పువ్వు – ఒకటి ►మరాటి మొగ్గ – ఒకటి ►జీలకర్ర – టీస్పూను ►ఉప్పు – రుచికి సరిపడా ►జీడిపప్పు పలుకులు – టేబుల్ స్పూను ►పచ్చిబఠాణీ – అరకప్పు ►స్వీట్ కార్న్ – అరకప్పు ►పచ్చిమిర్చి – మూడు (సన్నగా తరగాలి). తయారీ: ►స్వీట్‌కార్న్, పచ్చిబఠాణీలను ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ►స్టవ్ మీద బాణలి పెట్టి టేబుల్ స్పూను నెయ్యి వేయాలి. ►వేడెక్కిన నెయ్యిలో బాస్మతి బియ్యాన్ని కడిగి వేసి రెండు నిమిషాలు మంచి వాసన వచ్చేంత వరకు వేయించాలి. ►ఇప్పుడు బిర్యానీ ఆకు, యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, అనాసపువ్వు, మరాటి మొగ్గ, అరటీస్పూను జీలకర్ర వేసి తిప్పాలి. ►దీనిలో ఒకటిన్నర కప్పులు నీళ్లుపోసి అన్నం పొడిపొడిగా వచ్చేలా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ►స్టవ్ మీద మరో బాణలి పెట్టి ఒకటిన్నర టేబుల్ స్పూన్లు నెయ్యి వేయాలి. ►నెయ్యి వేగాక అరటీస్పూను జీలకర్ర, జీడిపప్పు పలుకులువేసి వేయించాలి. ►ఇవి వేగాక తరిగిన పచ్చిమిర్చి, ఉడికించిన పచ్చిబఠాణి, స్వీట్ కార్న్ వేసి మీడియం మంటమీద వేయించాలి. ►ఇప్పుడు అన్నం వేసి అన్నింటిని చక్కగా కలిసేలా కలియతిప్పి దించేయాలి. ►నెయ్యి, బాస్మతీల సువాసనలతో కాస్త ఘాటుగా, తియ్యగా ఉండే నెయ్యి అన్నాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చు. పనీర్ జిలేబీ కావలసినవి: ►పనీర్ ముక్కలు– అరకప్పు ►మైదా – అరకప్పు ►వంటసోడా – చిటికెడు ►కార్న్‌ఫ్లోర్ – టేబుల్ స్పూను ►ఆరెంజ్ ఫుడ్ కలర్ – పావు టీస్పూను ►పాలు – పావు కప్పు ►నూనె – డీప్‌ఫ్రైకి సరిపడా ►పిస్తాపలుకులు – గార్నిష్‌కు తగినంత. సుగర్ సిరప్ కోసం: పంచదార – కప్పు, నీళ్లు – అరకప్పు, కుంకుమపువ్వు రేకలు – ఎనిమిది, నిమ్మరసం – రెండు చుక్కలు, యాలకులపొడి – పావు టీస్పూను. తయారీ: ►పనీర్ ముక్కలను బ్లెండర్లో వేసి పేస్టులా గ్రైండ్ చేయాలి ►పనీర్ పేస్టుని ఒక గిన్నెలో వేయాలి. ఈ గిన్నెలోనే కార్న్‌ఫ్లోర్, వంటసోడా, మైదా, ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసి కలపాలి. ►ఇప్పుడు టేబుల్ స్పూన్ చొప్పున పాలు పోసి కలుపుతూ మెత్తటి పిండి ముద్దలా కలుపుకోవాలి. ►పిండి ఎండిపోకుండా తేమగా ఉండేలా పాలు అవసరాన్ని బట్టి పోసి, కలిపి పక్కన పెట్టుకోవాలి. ►పంచదారను మందపాటి బాణలిలో వేసి నీళ్లు, నిమ్మరసం, కుంకుమ పువ్వు వేసి మీడియం మంటమీద పంచదార తీగపాకం రానివ్వాలి. ►పాకం వచ్చిన వెంటనే యాలకుల పొడి వేసి కలిపి దించేయాలి. ►కలిపి పెట్టుకున్న పిండిముద్దను మౌల్డ్‌లో వేసుకుని నచ్చిన పరిమాణంలో జిలేబీ ఆకారంలో వేసి డీప్‌ఫ్రై చేసుకోవాలి. ►జిలేబీలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారాక తీసి పాకంలో వేయాలి. ►రెండు నిమిషాలు నానాక మరోవైపు తిప్పి మరో రెండు నిమిషాలు నాననిచ్చి పిస్తా పలుకులతో గార్నిష్ చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోవాలి. ఈ వంటకాలు ట్రై చేయండి: Papaya Halwa Recipe: మొక్కజొన్న, మైదాపిండితో.. నోరూరించే బొప్పాయి హల్వా! తయారీ ఇలా Malida Muddalu: మలీద ముద్దల తయారీ విధానం! వీటిని తింటే ఇన్ని ఆరోగ్య లాభాలా?! -
సామాన్యులకు మరో శుభవార్త! నూనెలతో పాటు వీటి ధరలు తగ్గనున్నాయ్!
దేశ ప్రజలకు కేంద్రం శుభవార్త చెప్పింది. క్రూడ్ సోయా బిన్ ఆయిల్, సన్ ఫ్లవర్ ఆయిల్‌తో పాటు క్రూడ్ పామాయిల్‌పై డ్యూటీ ఫ్రీ ఇంపోర్ట్ ట్యాక్స్‌ను, పాయిల్‌పై 10శాతం ఇంపోర్ట్ ట్యాక్స్ నుంచి మినహాయింపు ఇచ్చింది. దీంతో రోజురోజూకీ పెరుగుతున్న నూనె ధరలతో పాటు ఇతర వస్తువులు భారీగా తగ్గనున్నాయి. వంటనూనెలేనా ఇంకా కేంద్రం తీసుకున్న నిర్ణయంతో వంటనూనెలతో పాటు ఫుడ్ ఐటమ్స్, కాస్మోటిక్స్ ధరలు అదుపులోకి రానున్నాయి. ఎందుకంటే ఫాస్ట్ మూవీంగ్ కన్జ్యూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ) సంస్థలు తయారు చేసేందుకు ముడి పదార్ధాలైన సన్ ఫ్లవర్ ఆయిల్, పాయిల్‌ను వినియోగిస్తుంటాయి. నూనె ధరలు తగ్గడంతో ఎఫ్ఎంసీజీ కంపెనీలు రా మెటీరియల్‌పై పెట్టే ఖర్చును తగ్గించడంతో అటోమెటిగ్గా.. తయారు చేసే ప్రొడక్ట్‌ల ధరలు తగ్గుతాయి. వచ్చే మూడునెలల్లో మనదేశంలో ఆయిల్ సీడ్ ప్రొడక్షన్ తక్కువ.అందుకే భారత్ సంవత్సరానికి 55 శాతం 60శాతం వరకు వంట నూనెను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. కేంద్రం నూనెలపై ట్యాక్స్ తగ్గింపుతో రాబోయే 3నెలలో సామాన్యులు విరివిరిగా వినియోగించే వస్తువుల ధరలు భారీ తగ్గనున్నాయని ప్రాక్సిస్ గ్లోబల్ అలయన్స్ పార్ట్నర్ సుమన్ జగ్దేవ్ తెలిపారు. నూనెల తగ్గింపుతో త్వరలో తగ్గనున్న వంట నూనెల ధర ప్రభావం ఇతర ఉత్పత్తులపై పడనుంది. నూనెతో తయారు చేసే బిస్కెట్‌లాంటి ఫుడ్ ఐటమ్స్‌తో పాటు నెయ్యి, కోకోనట్ ఆయిల్, హెయిర్ ఆయిల్ ధరలు అదుపులో ఉండడనున్నాయని వెంచురా సెక్యూరిటీస్ రీసెర్చ్ విభాగం అధినేత వినీత్ బోలిజ్కర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. రెండేళ్ల నుంచి ధరలు పైపైకి కరోనా, ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం, సప్లయ్ చైన్ సమస్య, పెరిగిన ఇన్ పుట్ కాస్ట్ తో పాటు ఇతర కారణాల వల్ల దేశీయ ఎఫ్ఎంసీజీ సంస్థలైన నెస్లే ఇండియా, మారికో, హిందుస్తాన్ యూనిలివర్, రుచి సోయా, బ్రిటానియా, డాబర్,కోల్గెట్, ఇమామీ, టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్, విప్రో కన్జ్యూమర్ కేర్ సంస్థలు గత రెండేళ్లలో పలు ప్రొడక్ట్‌లను భారీగా పెంచాయి. తాజా, కేంద్ర నిర్ణయంతో పై సంస్థలు తయారు చేస్తున్న ఉత్పత్తుల్ని తగ్గించనున్నాయి. చదవండి👉దేశంలో భారీగా తగ్గనున్న సిమెంట్, స్టీల్ ధరలు! -
చలిలో అనారోగ్యం... నెయ్యితో వైద్యం
ప్రస్తుతం వ్యాధి నిరోధక సామర్ధ్యం / ఇమ్యూనిటీ మీద సర్వత్రా అవగాహన పెరిగిన నేపధ్యంలో నెయ్యి అనేది ఒక సహజమైన ఇమ్యూనిటీ బూస్టర్‌గా ఆహార నిపుణులు సిథ్స్ఫార్మ్ నిర్వాహకులు కిషోర్ ఇందుకూరి అభివర్ణిస్తున్నారు. నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ తో పాటు ఇతర పలు సంస్థలు కూడా నెయ్యి అందించే ఆరోగ్య లాభాలను థృవీకరించిన నేపధ్యంలో నెయ్యి వినియోగం వల్ల కలిగే పలు ప్రయోజనాలు ఆయన వివరించారిలా... దేశీ నెయ్యి యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఆక్సిడెంట్‌గా కూడా పనిచేస్తుంది. తద్వారా వింటర్ సీజన్లో విభిన్న రకాల వైరస్‌లను అడ్డుకుని ఫ్లూ, దగ్గు, జలుబుల నుంచి రక్షిస్తుంది. ఆయుర్వేద గ్రంధాల ప్రకారం... దేహంలోని అంతర్గత ఉష్ణాన్ని క్రమబద్ధీకరించి ఉంచేందుకు నెయ్యి సహకరిస్తుంది. అందువల్లే దీనిని చలికాలపు వంటకాలు, గజర్ కా హల్వా, మూంగ్ దాల్ హల్వా తదితర మిఠాయిల్లో ఎక్కువ వినియోగిస్తారు. శీతాకాలంలో ప్రధాన పండగలు రావడం, ఆ సమయంలో దీపాలను సైతం నెయ్యి తో వెలిగించడం వెనుక అంతరార్ధం ఇదే. అలాగే పిండివంటలు వండుకోవడం సర్వ సాధారణం. గారెలు, బూరెలు, అరిసెలు...మరేవైనా సరే వాటి తయారీలో ఆయిల్ వినియోగం తప్పనిసరి. అయితే వీలైనంత వరకూ పిండి వంటలు నెయ్యితో వండడం శ్రేష్టమంటున్నారు నిపుణులు సంప్రదాయంగా మన భారతదేశ వంటల విధానంలో నెయ్యి ఒక తప్పనిసరి ముడి సరుకు. మరీ ముఖ్యంగా శాఖాహార వంటలకు సంబంధించి అటు రుచిని ఇటు ఆరోగ్యాన్ని పెంచేందుకు నెయ్యి తప్పనిసరిగా వినియోగించేవారు. అయితే రిఫైండ్ ఆయిల్స్‌తో నెయ్యిని మేళవించడం అనేది ఆధునికులు చేస్తున్న అతిపెద్ద పొరపాటని పోషకాహార నిపుణుల మాట. పుష్కలంగా నీరుతో పాటు ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా నెయ్యిలో పుష్కలంగా ఉంటాయి. తద్వారా వ్యాధి నిరోధకత పెంపొందుతుంది. శరీరం కొవ్వును గ్రహించడంలో నెయ్యి సహకరిస్తుంది. బరువు తగ్గించే మార్గాల్లో నెయ్యి వాడకం కూడా ఒకటని నవతరం వైద్యులు చెబుతున్నారు. నెయ్యిలో శరీరానికి అవసరమైన, కొవ్వును కరిగించే ద్రవపదార్ధాలు, శరీర ధర్మాల్ని నిర్వర్తించడంలో సహకరించే డి,కె,ఇ,ఇ విటమిన్స్ ఉంటాయి. దీనిలో బ్యుటిరిక్ యాసిడ్ ఉంటుంది. దీనిని పెద్ద పేగు కణాలు శక్తి కారకంగా ఉపయోగించుకుంటాయి. హార్మోన్ల సమతుల్యాన్ని కాపాడడంలో నెయ్యి కీలక పాత్ర పోషిస్తుంది. ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్‌ను కాపాడుతుంది. –కణాల విధులను దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్ రాకను నెయ్యిలోని అధిక వేడి గుణం అడ్డుకుంటుంది. పరగడుపున ఉదయం పూట నెయ్యిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కణాల పునరుజ్జీవన ప్రక్రియను అది బలోపేతం చేస్తుంది. నెయ్యిలోని యాంటాక్సిడెంట్స్, యాంటీ ఇన్‌ఫ్లేమేటరీ గుణాలు చర్మంలోని సున్నితత్వాన్ని పరిరక్షిస్తాయి. చర్మాన్ని దెబ్బ తీసే పిగ్మంటేషన్ ను, ఇన్ఫ్లమేషన్ ను దూరం చేస్తాయి. వృద్ధాప్యాన్ని ఆలస్యం చేస్తాయి. ఇది సహజమైన మాయిశ్చరైజర్‌గా కూడా పనిచేస్తుంది. గుండె పనితీరు, కంటి చూపును మెరుగుపరచి, కేన్సర్, మలబద్దక నివారిణిగా ఉపకరిస్తుంది. దగ్గు, జలుబు, తలనొప్పి వంటి శీతాకాల సమస్యలను తగ్గించేందుకు చేసే న్యాసా చికిత్సలో గోరు వెచ్చని నెయ్యిని వినియోగిస్తారు. –భారతీయ పురాణాలు, సంప్రదాయాలు ఎప్పటి నుంచో నెయ్యి ప్రాధాన్యతను తెలియజేస్తున్నాయి. అలాగే ఆయుర్వేద చికిత్స నిపుణులు...దీనిని సహజసిద్ధమైన ఇమ్యూనిటీ బూస్టర్‌గా అభివర్ణిస్తారు. అలాగే శాస్త్రీయ పరిశోధనలు కూడా నెయ్యిని రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం అత్యుత్తమ ఆరోగ్య చిట్కాగా తేల్చాయి. –కిషోర్ ఇందుకూరి, సిథ్స్ ఫార్మ్ -
ఇకపై శ్రీవారి కైంకర్యాలకు దేశీయ నెయ్యి
-
నెయ్యి కుంభకోణం ఎఫెక్ట్: వేటు పడింది
సాక్షి, ద్వారకా తిరుమల: శ్రీవారి అంబరుఖానా (ప్రసాదాల తయారీ కేంద్రం)లో ఇటీవల జరిగిన నెయ్యి కుంభకోణం ఘటనకు సంబంధించి నలుగురు ఉద్యోగులపై ఆలయ ఈఓ డి.భ్రమరాంబ సోమవారం చర్యలు చేపట్టారు. అలాగే ఆ ఘటనపై విచారణ జరిపే సమయంలో స్టాకులో పలు అవకతవకలను గుర్తించిన ఈఓ మరో నలుగురు ఉద్యోగులకు ఇప్పుడు మెమోలను జారీచేశారు. వివరాల్లోకి వెళితే.. స్వామి లడ్డూ ప్రసాదాల తయారీకి వినియోగించే నెయ్యి 11 వందల కేజీలు మాయమైనట్లు ఈ ఏడాది జూలైలో దేవస్థానం అధికారులు గుర్తించారు. ఆ సమయంలో అంబరుఖానా గుమస్తాగా పనిచేస్తున్న మద్దాల శ్రీనును దానికి బాధ్యుడిని చేస్తూ సస్పెండ్ చేశారు. అలాగే అతడి నుంచి రూ.5.30 లక్షలను రికవరీ చేశారు. రాష్ట్ర దేవదాయశాఖ కమిషనర్ దీనిపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశిస్తూ, అప్పటి రీజినల్ జాయింట్ కమిషనర్, ప్రస్తుత శ్రీవారి దేవస్థానం ఈఓ భ్రమరాంబను విచారణాధికారిగా నియమించారు. దీనిపై అప్పట్లో విచారణ జరిపిన భ్రమరాంబ నివేదికను కమిషనర్‌కు అందజేశారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్న మద్దాల శ్రీనుకు రెండు ఇంక్రిమెంట్లు కట్‌చేసి, విధుల్లోకి తీసుకుంటూ ఈఓ భ్రమరాంబ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే ఇదే ఘటనకు సంబంధించి ఒక ఏఈఓను, ఒక సూపరింటెండెంట్‌ను, అలాగే మరో గుమస్తాను బాధ్యులను చేస్తూ, వారికి ఒక్కో ఇంక్రిమెంట్‌ను కట్‌చేస్తూ ఆదేశాలిచ్చారు. అవకతవకలపై మరో నలుగురికి.. నెయ్యి కుంభకోణం ఘటనపై విచారణ జరిపిన సమయంలో ఈఓ భ్రమరాంబ అంబరుఖానాలోని స్టాకులో పలు అవకతవకలను గుర్తించినట్లు తెలిసింది. దీనికి ఒక ఏఈఓను, ఒక సూపరింటెండెంట్‌ను, ఇద్దరు గుమస్తాలను బాధ్యులను చేస్తూ, ఏడు రోజుల్లో వివరణ కోరుతూ వారికి మెమోలను జారీచేశారు. అలాగే చైతన్యజ్యోతి వెల్ఫేర్ సొసైటీకి నిబంధనలకు విరుద్ధంగా ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ ఇచ్చిన ఏఈఓకు ఒక ఇంక్రిమెంట్ కట్ చేస్తూ ఉత్తర్వులిచ్చారు. అలాగే బ్రాహ్మణ కార్పొరేషన్ షాపు లీజు విషయంలో జరిగిన అవకతవకలపై విచారణాధికారిగా ఆలయ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ వైకుంఠరావును నియమించారు. వీటికి సంబంధించి ఆలయ ఈఓ భ్రమరాంబను వివరణ కోరేందుకు యత్నించగా ఆమె అందుబాటులోకి రాలేదు. -
‘దేశీ’ ఉత్పత్తులే దివ్యౌషధాలు!
ఇదొక విలక్షణ ప్రకృతి వ్యవసాయ క్షేత్రం. అపురూపమైన దేశీ వరి రకాలతోపాటు.. అరుదైన గడ్డి రకాలు కూడా అక్కడ సాగవుతున్నాయి. అంతేకాదు.. ఔషధ విలువలు కలిగిన ప్రత్యేక దాణా మేపు ద్వారా దేశీ ఆవుల పెంపకం ఈ ప్రకృతి వ్యవసాయ క్షేత్రం విశిష్టత. ఈ ఆవుల పాలతో తయారైన పెరుగు, నెయ్యి దివ్యౌషధాలుగా పనిచేస్తున్నాయని, వీటిని తిన్న వారిలో మందులు వాడకుండానే షుగర్ నియంత్రణలో ఉంటున్నదని పశువైద్య శాస్త్రవేత్త డా. సాయి బుచ్చారావు చెబుతున్నారు. దీనిపై మరింత లోతైన అధ్యయనం చేయడానికి జాతీయ పోషకాహార సంస్థ (ఎన్.ఐ.ఎన్.) ఇటీవల సుముఖత తెలిపిందని వెల్లడించారు. మూడేళ్లు కొనసాగే ఈ ప్రయోగం శాస్త్రీయంగా రుజువైతే షుగర్ వ్యాధిగ్రస్తులకు మేలు జరగడంతోపాటు.. దేశీ ఆవుల పెంపకందారులకు స్థిరమైన మంచి ఆదాయం కూడా సమకూరుతుందనటంలో సందేహం లేదు. సిద్ధార్థ గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ క్షేత్రం సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం సూరారం శివారులో 27 ఎకరాల్లో విస్తరించి ఉంది. ప్రముఖ ఆర్కిటెక్ట్ వేగిశ్న శ్రీనివాస్ రాజు దేశవాళీ గోజాతులపై ఉన్న అమితమైన ప్రేమతో తన భూమిని రాజీలేని గో ఆధారిత ప్రకతి వ్యవసాయ క్షేత్రంగా తీర్చిదిద్దారు. 18 సాహివాల్ దేశవాళీ ఆవులను పెంచుతున్నారు. పంటలు, పశుగ్రాసం సాగులో గాని, ఆవుల పోషణలో గాని రసాయనాలకు ఏమాత్రం చోటివ్వకుండా పూర్తిస్థాయిలో ప్రకృతి వ్యవసాయ పద్ధతులు అనుసరిస్తుండటం విశేషం. అంతరించిపోతున్న దేశవాళీ వరి వంగడాల్లో పోషకాలతో పాటు ఔషధ విలువలు పుష్కలంగా ఉంటాయని రాజు నమ్ముతూ ఈ రకాలనే మూడేళ్లుగా సాగు చేస్తున్నారు. రత్నచోడి, నవార, బ్లాక్ రైస్, బహురూపి, నారాయణ కామిని, తెల్లహంస తదితర దేశీ రకాల ధాన్యాన్ని పండిస్తున్నారు. ఈ రకాలు 130–150 రోజుల్లో కోతకు వస్తాయి. ధాన్యాన్ని అమ్మటం లేదు. తానే బియ్యం పట్టించి షుగర్, బీపీ వ్యాధిగ్రస్తులకు విక్రయిస్తూ మంచి ఆదాయాన్ని సైతం పొందుతున్నారు. క్వింటా మార్కెట్లో రూ.10 వేల ధర పలుకుతున్నదన్నారు. పిండి పదార్థం తక్కువగా, పీచు శాతం ఎక్కువగా ఉండి దేహానికి ఎంతో ప్రయోజనం చేకూరుస్తాయని ఆయన అంటారు. దేశీ వరి రకాల విత్తనాలను ఆసక్తి ఉన్న రైతులకు అందజేçస్తున్నారు. రసాయనిక వ్యవసాయం చేసే రైతులు వరి సాగులో ఎకరాకు రూ.20 వేలు ఖర్చు చేస్తుంటే.. ఈయన రూ. 11,500 ఖర్చుతో ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేస్తున్నారు. ప్రకృతి వ్యవసాయంలో జీవామృతం, కషాయాలు రైతు స్వయంగా తయారు చేసుకొని వాడాలి. కాయకష్టమే తప్ప పెద్దగా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. పైగా ఆరోగ్యమైన ఉత్పత్తులు చేతికి అందుతాయి అంటున్నారు శ్రీనివాస్ రాజు. ఆవుల కోసం ఏడు రకాల గడ్డి సాగు 18 దేశవాళీ సాహివాల్ ఆవుల మేత కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఏడు రకాల కాయ, పప్పు జాతుల పశుగ్రాసాలను సాగు చేస్తున్నారు. 25% ప్రొటీన్ కలిగి ఉండే ఛాయ (స్పినాచ్ ట్రీ) పశుగ్రాస చెట్లను సాగు చేస్తున్నారు. తూ.గో. జిల్లా నుంచి తెప్పించిన చెంగల్వ గడ్డి, గుజరాత్ నుంచి తెచ్చిన జింజువ గడ్డితోపాటు సూపర్ నాపియర్, హెడ్జ్ లూసర్న్ తదితర రకాల గడ్డిని ఆరు ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేస్తున్నారు. ప్రముఖ పశువైద్య నిపుణులు డా. సాయిబుచ్చారావు సూచనల మేరకు వీటి ఆరోగ్య సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఔషధ గుణాలతో కూడిన దాణా రసాయన రహితంగా ఈ వ్యవసాయ క్షేత్రంలో పండించిన జొన్నలు, మొక్కజొన్నలు తదితర ముడి పదార్థాలనే ఆవులకు దాణాగా వాడుతున్నారు. అంతేకాదు.. ఆ దాణాలో 21 రకాల ఔషధ మొక్కల నుంచి సేకరించిన వేర్లు, ఆకులు, కాండాలను ప్రత్యేక శ్రద్ధతో ఆయుర్వేద నియమాల ప్రకారం శుద్ధి చేసి.. పొడిగా చేసి.. ఆ పొడిని కలిపిన దాణాను సాహివాల్ ఆవులకు మేపుతున్నారు. వ్యవసాయ పనుల కోసం ఒంగోలు జాతి గిత్తలను పోషిస్తున్నారు. దేశీ ఆవుపాల ఉత్పత్తులపై పరిశోధన సీనియర్ పశువైద్య నిపుణులు డాక్టర్ ఎం. సాయి బుచ్చారావు దేశీ గోజాతులపై గత 8 సంవత్సరాలుగా విస్తృతంగా పరిశోధన చేస్తున్నారు. ఔషధ మూలికల పొడిని తగు మోతాదులో కలిపిన దాణాను దేశీ ఆవులకు తినిపించడం ద్వారా.. వాటి పాలల్లో ఔషధ గుణాలను పెంపొందించవచ్చని ఆయన అంటున్నారు. ఈ పాలతో తయారైన పెరుగు, నెయ్యి తిన్న వారిలో మధుమేహం (టైప్1, టైప్2 కూడా) మందులతో అవసరం లేకుండా నియంత్రణలోకి వస్తుందని 2012 నుంచి తాను నిర్వహిస్తున్న పరిశోధనల్లో తేలిందని ఆయన తెలిపారు. తూ.గో. జిల్లా తాపేశ్వరం, ప.గో. జిల్లా ఐ. భీమవరం, చిన్నకాపవరంలలో ఒంగోలు, గిర్, సాహివాల్ ఆవులతో పరిశోధనలు చేశానన్నారు. వీటి పెరుగు, నెయ్యి తిన్న వారిలో మధుమేహం నియంత్రణ మందులు అవసరం లేకుండా సాధ్యపడిందని డా. సాయి బుచ్చారావు అన్నారు. అధ్యయనానికి ఎన్.ఐ.ఎన్. సింసిద్ధత ఔషధ మూలికల పొడితో కూడిన దాణా తినటం వల్ల దేశీ ఆవుల పాల ఉత్పత్తుల్లో ఏయే మార్పులు చోటుచేసుకుంటున్నదీ తెలుసుకోవడానికి గతంలో ప్రయోగశాలలో లోతైన అధ్యయనం నిర్వహించలేదని డా. సాయి బుచ్చారావు తెలిపారు. ఈ నేపథ్యంలో లోతైన పరీక్షలు చేయడానికి రీసెర్చ్ ప్రాజెక్టును చేపట్టేందుకు హైదరాబాద్‌లోని జాతీయ పోషకాహార సంస్థ(ఎన్.ఐ.ఎన్.) ఇటీవలే ప్రాథమికంగా అంగీకారం తెలిపిందని డాక్టర్ సాయి బుచ్చారావు వెల్లడించారు. ఈ పూర్వరంగంలో సిద్ధార్థ గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ క్షేత్రం కేంద్రంగా ఎన్.ఐ.ఎన్. సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ అనంతన్ ఆధ్వర్యంలోని శాస్త్రవేత్తల బృందం మూడేళ్లపాటు ఈ పరిశోధనలు నిర్వహించనుంది. ఈ ప్రయోగాలు పూర్తిగా విజయవంతం అయితే దేశీ గోజాతుల పెంపకంపై రైతులకు ఆసక్తితోపాటు వాటి సంతతి పెరుగుతుందని డా. సాయిబుచ్చారావు ‘సాక్షి’తో చెప్పారు. మధుమేహాన్ని పారదోలడంతో పాటు దేశీ ఆవులను పెంచి పోషించే రైతులకు స్థిరమైన ఆదాయ మార్గం చూపడమే తమ లక్ష్యమని డా. సాయి బుచ్చారావు అంటున్నారు. – కైరంకొండ నర్సింలు, సదాశివపేట రూరల్ ఎన్.ఐ.ఎన్. అంగీకారం సంతోషదాయకం ఔషధ మూలికల దాణా తిన్న దేశీ ఆవుల పెరుగు, నెయ్యిలో మధుమేహాన్ని నియంత్రించే సుగుణం ఉందని నా 8 ఏళ్ల పరిశోధనలో తెలుసుకున్నాను. అయితే, 3 నెలల తర్వాత కొందరి సుగర్ లెవల్స్‌లో హెచ్చు తగ్గులు కనిపించాయి. అందుకు గల కారణాలపై గతంలో లేబరేటరీ పరీక్షల ద్వారా పరిశోధించలేదు. ప్రాథమిక పరిశోధనా ఫలితాలను పరిశీలించిన మీదట లోతుగా అధ్యయనం చేయడానికి జాతీయ పోషకాహార సంస్థ(ఎన్.ఐ.ఎన్.) అంగీకరించటం సంతోషదాయకం. దేశీ ఆవులతోపాటు సంకర జాతి/విదేశీ జాతుల ఆవులు, గేదెలపై కూడా గతంలో పరిశోధన చేశా. అయితే, సంకర జాతి/విదేశీ జాతుల ఆవుల పెరుగు, నెయ్యి తిన్న మధుమేహ రోగుల్లో ఎటువంటి సత్ఫలితాలు కనిపించలేదు. గేదె పెరుగు, నెయ్యి ద్వారా ఫలితాలు కొంతవరకు కనిపించాయి. తాజాగా ఎన్.ఐ.ఎన్. చేపట్టబోయే పరిశోధనల్లోనూ దేశీ ఆవులతోపాటు సంకరజాతి, గేదెలపై కూడా పరిశోధన జరుగుతుంది. – డా. ఎం.సాయి బుచ్చారావు , (99122 92229), ప్రముఖ పశువైద్య శాస్త్రవేత్త -
కూరలో ఉప్పు ఎక్కువైందా.. ఇలా చేయండి
► ఇడ్లీ, దోసెల కోసం బియ్యం, మినప్పప్పు నానబెట్టేటప్పుడు ముందే కడగాలి. నానిన తర్వాత గ్రైండ్ చేసేటప్పుడు కడగడం వల్ల విటమిన్లు నీటిలో పోతాయి. అంతేకాకుండా దుకాణాల్లో వాటికి పురుగుపట్టకుండా నిల్వ చేయడానికి కీటక నాశినులను గనుక వాడి ఉంటే కడగకుండా నానబెట్టినప్పుడు ఆ అవశేషాలతో కూడిన నీటినే బియ్యం, మినప్పప్పు పీల్చుకుంటాయి కాబట్టి అవన్నీ శరీరంలోకి వెళ్లే ప్రమాదం కూడా ఉంటుంది. ► కూరల్లో ఉప్పు ఎక్కువైనప్పుడు అందులో బంగాళాదుంప ముక్కలను వేయాలి. అధికంగా ఉన్న ఉప్పును పొటాటో పది నిమిషాల్లో పీల్చుకుంటుంది. ► గారెల కోసం తయారు చేసుకున్న పిండిలో నీరు ఎక్కువై నూనెలో వేయగానే అంచుల దగ్గర సన్న పలుకులుగా విడిపోతున్నట్లయితే, పిండిలో ఒక టేబుల్‌స్పూను నెయ్యి కలపాలి. ► కూరలు, పులుసులు, సూప్‌లు మరీ పలచగా ఉన్నట్లనిపిస్తే అందులో ఒక టేబుల్‌స్పూను కార్న్‌ఫ్లోర్ కలపాలి. కార్న్‌ఫ్లోర్‌ను అలాగే వేస్తే ఉండలవుతుంది. ముందుగా ఒక కప్పులో వేసి చన్నీటితో కలిపి ఆ మిశ్రమాన్ని కూరల్లో వేస్తే సమంగా కలుస్తుంది. -
అనుదిన ద్రవ్యాలు అమోఘ గుణాలు
తెలుగువారి పండుగలు, ఆచారాలు, ధార్మిక సంస్కృతితో సమ్మిళితమై ఉంటాయి. దైవ కైంకర్యంలో నైవేద్యానిది ప్రధాన పాత్ర. చక్రపొంగలి, దద్ధ్యోదనం, పులిహోర వంటి ప్రసాదాలు మనకు అతి సాధారణం. వీటన్నింటిలోనూ సామాన్య ద్రవ్యం ‘వరి అన్నమే’. ఇతర పదార్థాలలో నెయ్యి, బెల్లం/శర్కర; పెరుగు, నిమ్మకాయ/చింతపండు’ ప్రధానమైనవి. ఇవి మనకి అతి సామాన్యంగా కనిపిస్తాయే గాని వాటి పోషక విలువలు, గుణధర్మాలు అమోఘం. వీటి ప్రయోజనాలు ఆయుర్వేద గ్రంథాలలో సుస్పష్టంగా కనిపిస్తాయి. నెయ్యి ఘృతం, ఆజ్యం, సర్పి మొదలైనవి నెయ్యికి సంస్కృత పర్యాయపదాలు. ఆయుర్వేదంలో ఆవు నేతికి విశిష్టత ఉంది. గుణధర్మాలు: మధురం, ప్రధానంగా పిత్త దోషహరం, వాత కఫ శ్యామకం, చలువ చేస్తుంది. తెలివితేటలను పెంచుతుంది. ఓజోకరం, శుక్రకరం, రసాయనం (సప్త ధాతు పుష్టికరమై క్షమత్వ వర్థకం). లావణ, కాంతి, తేజోవర్థకం. ముసలితనం రానీయకుండా యౌవనాన్ని పదిలపరుస్తుంది. ఆయు వర్థకం. మంగళకరం. కంటికి మంచిది. గవ్యం ఘృతం విశేషేణ చక్షుష్యం, వృషం, అగ్నికృత్.... మేధా లావణ్య కాంతి తేజో ఓజో వృద్ధికరం, వయస్థాపకం, బల్యం, సుమంగలం, ఆయుష్యం, సర్వ ఆజ్యేషు గుణాధికం ►ఆవు నెయ్యిని హోమం చేస్తే వచ్చే పొగ విషహరం, క్రిమిహరం, వాతావరణ కాలుష్య హరం. ►ఆవు పెరుగు: కొంచెం పులుపు. ఎక్కువ తీపి కలిగితే రుచిలో నుంచి ఆకలిని పెంచి, ధాతుపుష్టిని కలిగించి, గుండెకు కూడా శక్తినిస్తుంది. నాడీవ్యవస్థను పటిష్ఠపరుస్తుంది (వాత హరం). అందువలననే దీనిని చాలా పవిత్రమని వర్ణించారు. గవ్యం దధి విశేషేణ... రుచిప్రదం, పవిత్రం, దీపనం, హృద్యం, పుష్టికృత్, పవనాపహం... గేదె పెరుగు: ఇది చాలా చిక్కగా ఉండటం వలన బరువైన ఆహారంగా చెప్పబడింది. కఫకరం, స్రోతస్సులలో అవరోధం కలిగిస్తుంది. రక్తాన్ని దూషిస్తుంది. శుక్రకరం. రాత్రిపూట పెరుగు తినకూడదు (రాత్రౌ దధి న భుంజీత). పెరుగును వేడి చేయకూడదు. మితిమీరిన పరిమాణంలో పెరుగును సేవించకూడదు. బెల్లం చెరకు రసం నుంచి తయారుచేసిన బెల్లం తియ్యగా, జిగురుగా ఉండి శుక్రవర్థకంగా ఉపకరిస్తుంది. దేహంలో కొవ్వుని పెంచుతుంది. కొంతవరకు వేడిని తగ్గిస్తుంది కాని శర్కరంత చలువచేయదు. బలవర్థకమే కాని, కఫాన్ని క్రిములను పెంచుతుంది. పాతబెల్లం (పురాణ గుడం) చాలా మంచిది (పథ్యం). వేడిని తగ్గించి, కొవ్వును కరిగిస్తుంది. జఠరాగ్నిని పెంచి పుష్టిని కలిగిస్తుంది. (కాని ఈనాడు బెల్లం తయారీలో చాలా కెమికల్స్‌ని కలిపి, కల్తీ చేస్తున్నారు. ఇది హానికరం). శర్కర ఆయుర్వేద శాస్త్రంలో చెప్పిన శర్కర చాలా విశిష్టమైనది. దాని తయారీ వేరు. ఈనాడు చేస్తున్న పంచదార తయారీలో పోషక విలువలు శూన్యం. పరిపూర్ణంగా కెమికల్స్ మయం. చాలా అనర్థదాయకం. చింత చింతకాయ చక్కటి పులుపు కలిగి వాతహరంగానూ, కించిత్ పిత్తకఫాలను పెంచేదిగానూ ఉంటుంది. బరువుగా ఉండి ఆలస్యంగా జీర్ణమవుతుంది. పక్వమైనది (చింత పండు) ఆకలిని పెంచి, విరేచనం సాఫీగా అవటానికి సహకరిస్తుంది (సుఖరేచకం). ఉష్ణవీర్యమై వాతకఫహరంగా ఉంటుంది. ‘చించా, తింత్రిణీ, తింతిడీ, అమ్లీ, చుక్రికా... మొదలైనవి. చింతకాయ/పండునకు సంస్కృత పర్యాయపదాలు నిమ్మ నింబు, జంబీర అను పర్యాయపదాలున్నాయి. కఫవాత శ్యామకం. దప్పికను తగ్గిస్తుంది. (తృష్ణాహరం). రుచిని పెంచుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మూత్రకరం. జ్వరహరం. కంఠవికారాన్ని తగ్గిస్తుంది. నేత్రదృష్టివర్థకం. బాగుగా పరిపక్వమైనది (పండు) వాడుకుంటే మంచిది. ఇంగువ (హింగు) ఉష్ణవీర్యం, ఆహారపచనం బాగా చేస్తుంది. కడుపునొప్పి, కడుపులోని వాయువు, క్రిములను పోగొడుతుంది. వాతకఫహరం. పసుపు (నిశా, హరిద్రా) ఇది కడుపులోకి సేవించినా లేక బయటపూతగా వాడినా కూడా క్రిమిహరం. రక్తశోధకం, జ్వరహరం, మధుమేహ హరం. శరీర కాంతిని పెంచి చర్మరోగాలని దూరం చేస్తుంది. – డా. వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి ఆయుర్వేద వైద్య నిపుణులు, హైదరాబాద్ -
అటుకిటుకులు
అటు ఇటు తిరుగుతూ దంచుకుని... మంచుకునే సూపర్ స్నాక్. అటుకుల వంటకాలు చిటికెలో అయిపోతాయి. చేయడానికి ఇన్ని కిటుకులు ఉన్నాయి. అటుకులమిక్స్చర్ కావలసినవి: పల్చటి అటుకులు – 2 కప్పులు; వేయించిన పల్లీలు – పావు కప్పు; పుట్నాల పప్పు – పావు కప్పు; వేయించిన జీడి పప్పులు – పావు కప్పు; ఎండు కొబ్బరి ముక్కలు – పావు కప్పు; కిస్మిస్ – 2 టేబుల్ స్పూన్లు; నూనె – పావు కప్పు; బెల్లం పొడి – 2 టీ స్పూన్లు; ఉప్పు – తగినంత; నూనె – అర టేబుల్ స్పూను పోపు కోసం... కరివేపాకు – రెండు రెమ్మలు; తరిగిన పచ్చి మిర్చి – 2; పసుపు – పావు టీ స్పూను; ఇంగువ – కొద్దిగా ; తయారీ: స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక, మంట బాగా తగ్గించి, అటుకులు వేసి దోరగా వేయించి తీసి పక్కన ఉంచాలి ∙అదే బాణలిలో నూనె వేసి కాగాక, పల్లీలు వేసి వేయించి తీసి పక్కన ఉంచాలి ∙పావు కప్పు ఎండు కొబ్బరి ముక్కలు వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి, ముక్కలను తీసి పక్కన ఉంచాలి ∙పుట్నాల పప్పు, జీడి పప్పులు, కిస్మిస్లను కూడా విడివిడిగా వేసి వేయించి తీసి పక్కన ఉంచాలి. అదే బాణలిలో అర టేబుల్ స్పూను నూనె వేసి కాగాక, మంట తగ్గించాలి ∙కరివేపాకు, పచ్చి మిర్చి, ఇంగువ వేసి వేయించాలి ∙పసుపు, ఉప్పు జత చేయాలిబెల్లం పొడి జత చేసి కలిపి, రంగు మారుతుండగా, వేయించిన అటుకులు జత చేసి ఐదు నిమిషాల పాటు కలపాలి ∙వేయించిన డ్రై ఫ్రూట్స్ జత చేసి కలిపి దింపేయాలి ∙చల్లారాక గాలిచొరని డబ్బాలో నిలవ చేసుకోవాలి ∙టీ టైమ్‌లో తినడానికి బాగుంటుంది. కిటుకు: కొద్దిగా నెయ్యి, కొద్దిగా గరం మసాలా జత చేస్తే మిక్స్చర్ మరింత రుచిగా ఉంటుంది. అటుకులలడ్డూ కావలసినవి: అటుకులు – ఒక కప్పు; గింజలు తీసిన ఖర్జూరాలు – అర కప్పు; ఏలకుల పొడి – ఒక టీ స్పూను; ఎండు కొబ్బరి తురుము – పావు కప్పు; బెల్లం పొడి – ఒక టేబుల్ స్పూను; వేయించిన నువ్వులు – ఒక టేబుల్ స్పూను; నెయ్యి – ఒక టీ స్పూను. తయారీ: స్టౌ మీద బాణలిలో నెయ్యి వేసి కరిగాక అటుకులు వేసి వేయించి తీసేయాలి ∙మిక్సీ జార్లో అటుకులు, ఖర్జూరాలు, ఎండు కొబ్బరి తురుము, నువ్వులు, బెల్లం పొడి, ఏలకుల పొడి వేసి మెత్తగా చేసి, ఆ మిశ్రమాన్ని పాత్రలోకి తీసుకోవాలి ∙చేతికి కొద్దిగా నెయ్యి పూసుకుని, అటుకుల మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుంటూ, ఉండలు చేయాలి. కిటుకు: ఈ జీడి పప్పుల పొడి జత చేస్తే లడ్డూలు మరింత రుచిగా ఉంటాయి. అటుకుల పునుగులు కావలసినవి: అటుకులు – ఒక కప్పు; బియ్యప్పిండి – పావు కప్పు; పెరుగు – అర కప్పు; ఉల్లి తరుగు – పావు కప్పు; క్యారట్ తురుము – ఒక టేబుల్ స్పూను; బంగాళదుంప తురుము – ఒక టేబుల్ స్పూను; అల్లం తురుము – ఒక టీ స్పూను; వెల్లుల్లి తురుము – ఒక టీ స్పూను; తరిగిన పచ్చి మిర్చి – 3; కొత్తిమీర తరుగు – టీ స్పూను; ఉప్పు – తగినంత; నూనె – డీప్ ఫ్రైకి సరిపడా. తయారీ: ఒక పాత్రలో అటుకులకు తగినన్ని నీళ్లు జత చేసి, ఐదు నిమిషాల పాటు నానబెట్టాలి ∙రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి, గట్టిగా పిండి, నీళ్లు వేరు చేయాలి ∙ఒక పాత్రలో అటుకులు, బియ్యప్పిండి, ఉల్లి తరుగు, క్యారట్ తురుము, బంగాళదుంప తురుము, అల్లం తురుము, వెల్లుల్లి తురుము, కొత్తిమీర తరుగు, ఉప్పు, పెరుగు వేసి పునుగుల పిండిలా కలపాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాచాలి ∙పిండిని పునుగుల మాదిరిగా నూనెలో వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి, పేపర్ టవల్ మీదకు తీసుకోవాలి ∙టొమాటో సాస్‌తో తింటే రుచిగా ఉంటాయి. కిటుకు: నానబెట్టి, ఉడికించిన సగ్గుబియ్యాన్ని (రెండు టీ స్పూన్లు) జత చేస్తే పునుగులు మెత్తగా వస్తాయి. అటుకులచిక్కీ కావలసినవి: అటుకులు – ఒక కప్పు; బెల్లం పొడి – ఒక కప్పు; ఏలకుల పొడి – ఒక టీ స్పూను; జీడిపప్పుల పొడి – ఒక టీ స్పూను; బాదం పప్పుల పొడి – ఒక టీ స్పూను; నెయ్యి – ఒక టేబుల్ స్పూను తయారీ: ∙స్టౌ మీద బాణలిలో నెయ్యి వేసి కరిగాక అటుకులు వేసి దోరగా వేయించాలి ∙ఒక పాత్రలో బెల్లం పొడి, కొద్దిగా నీళ్లు పోసి, స్టౌ మీద ఉంచి ఉండ పాకం వచ్చే వరకు కలుపుతుండాలి ∙ఏలకుల పొడి, బాదం పప్పుల పొడి, జీడి పప్పుల పొడి వేసి కలిపి దింపేయాలి నెయ్యి వేసి కలియబెట్టాలి ∙ఒక ప్లేటుకి నెయ్యి పూసి, తయారుచేసి ఉంచుకున్న అటుకుల చిక్కీ మిశ్రమాన్ని అందులో పోసి, గరిటెతో సమానంగా పరవాలి ∙కొద్దిగా గట్టిపడుతుండగా, చాకుతో ముక్కలుగా కట్ చేసి, చల్లారాక ముక్కలను గాలి చొరని డబ్బాలో నిల్వ చేసుకోవాలి. కిటుకు: పాకంలో నెయ్యి వేసి కలిపితే చిక్కీ చూపడటానికి అందంగా ఉంటుంది. అటుకుల పులిహోర కావలసినవి: అటుకులు – 2 కప్పులు; చింతపండు – పెద్ద నిమ్మకాయంత; వేయించిన పల్లీలు – ఒక టేబుల్ స్పూను; వేయించిన జీడి పప్పులు – 15; నూనె – 2 టేబుల్ స్పూన్లు; ఇంగువ – అర టీ స్పూను; పచ్చి సెనగ పప్పు – 2 టీ స్పూన్లు; మినప్పప్పు – 2 టీ స్పూన్లు; ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; ఎండు మిర్చి – 10; తరిగిన పచ్చి మిర్చి – 6; కరివేపాకు – 4 రెమ్మలు; పసుపు–పావు టీ స్పూను; ఉప్పు – తగినంత. తయారీ: ∙చింతపండును రెండు కప్పుల నీళ్లలో అరగంట సేపు నానబెట్టాక, రసం తీయాలి ∙అటుకులను శుభ్రంగా కడిగి, చింతపండు రసంలో నానబెట్టాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె కాగాక, ఇంగువ, పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, పచ్చి మిర్చి, కరివేపాకు వేసి వేయించి తీసేయాలి ∙ఒక పాత్రలో... చింతపండులో నానబెట్టిన అటుకులు, పోపు, పసుపు, ఉప్పు వేసి గరిటెతో జాగ్రత్తగా కలియబెట్టి అరగంట తరవాత తింటే రుచిగా ఉంటుంది. కిటుకు: తగినంత చింతపండు రసం మాత్రమే తీసుకుంటే రుచిగా ఉంటుంది. -
ఊదలు వంటలు
ఊదల కట్లెట్ కావలసినవి: ఊదల పిండి – ఒక కప్పు కంద ముక్కలు – పావు కప్పు బఠాణీ – పావు కప్పు జీలకర్ర పొడి – ఒక టీ స్పూను ధనియాల పొడి – ఒక టీ స్పూను వాము – ఒక టీ స్పూను మిరియాల పొడి – అర టీ స్పూను మిరప కారం – అర టీ స్పూనుకొత్తిమీర తరుగు – 2 టీ స్పూన్లు అల్లం + వెల్లుల్లి ముద్ద – రెండు టీ స్పూన్లు జీడి పప్పు పలుకులు – 10 ఉప్పు – తగినంత నెయ్యి – కాల్చటానికి తగినంత నువ్వుల పొడి – రెండు టేబుల్ స్పూన్లు నిమ్మ రసం – ఒక టీ స్పూను తయారీ: కంద ముక్కలు, బఠాణీలను విడివిడిగా ఉడికించి, చేతితో మెత్తగా చిదిమి పక్కన ఉంచాలి. స్టౌ మీద బాణలిలో నెయ్యి కాగాక ఊదల పిండి వేసి దోరగా వేయించి చల్లారనివ్వాలి. ఒక గిన్నెలో ఊదల పిండి, మెత్తగా మెదిపిన కంద, బఠాణీ ముద్ద వేసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. కలుపుతున్నప్పుడే అల్లం వెల్లుల్లి ముద్ద, మిరప కారం, మిరియాల పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, వాము, కొత్తిమీర తరుగు, ఉప్పు, నిమ్మ రసం ఒకదాని తరవాత ఒకటి వేసి కలుపుకోవాలి. ఈ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని, కట్లెట్లాగ ఒత్తి, నువ్వుల పొడిలో ముంచి పక్కన ఉంచాలి. స్టౌ మీద పెనం ఉంచి వేడయ్యాక, నూనె వేసి కాగాక తయారుచేసి ఉంచుకున్న కట్లెట్లను పెనం మీద వేసి రెండు వైపులా దోరగా కాల్చుకోవాలి. జీడి పప్పులతో అలంకరించి వేడివేడిగా అందించాలి. 100 గ్రాముల ధాన్యాల్లో పోషకాలు, పీచు పదార్థం ఎంత? ఊదలు(Banyard Millet) నియాసిన్ (Niacin)mg (B3) 1.5 రిబోఫ్లావిన్ (Rivoflavin)mg (B2) 0.08 థయామిన్ (Thiamine) mg (B1) 0.31 కెరోటిన్ (Carotene)ug 0 ఐరన్ (Iron)mg 2.9 కాల్షియం (Calcium)g 0.02 ఫాస్పరస్ (Phosphorous)g 0.28 ప్రొటీన్ (Protein)g 6.2 ఖనిజాలు (Minerals) g 4.4 పిండిపదార్థం (Carbo Hydrate) g 65.5 పీచు పదార్థం (Fiber) g 10.0 పిండిపదార్థము/పీచు నిష్పత్తి (Carbo Hydrate/Fiber Ratio) 6.55 ఊదల పిజ్జా కావలసినవి: ఊదలు – అర కప్పు, – గోధుమ పిండి – అర కప్పుబేకింగ్ పౌడర్ – అర టీ స్పూను, ఉప్పు – తగినంతనెయ్యి / నూనె – 2 టీ స్పూన్లుటాపింగ్ కోసం ఉల్లి తరుగు + క్యాప్సికమ్ తరుగు + టొమాటో తరుగు+ మష్రూమ్ తరుగు – అర కప్పు, స్వీట్ కార్న్ గింజలు – ఒక టేబుల్ స్పూను టొమాటో సాస్ – పావు కప్పు, మొజెల్లా చీజ్ – తగినంత తయారీ: ఊదలను శుభ్రంగా కడిగి, తగినన్ని నీళ్లు జత చేసి సుమారు రెండు గంటలసేపు నానబెట్టాక, నీళ్లు ఒంపేయాలి. ఊదలను గ్రైండర్లో వేసి మెత్తటి పిండిలా రుబ్బి, ఒక గిన్నెలోకి తీసుకోవాలి. గోధుమ పిండి, ఉప్పు, బేకింగ్ పౌడర్ జత చేసి బాగా కలిపి సుమారు ఆరు గంటలపాటు పులియబెట్టాలి. స్టౌ మీద పాన్‌ను వేడి చేయాలి. కొద్దిగా నూనె వేసి కాగాక, పులియబెట్టిన పిండిని ఒక గరిటెడు తీసుకుని పెనం మీద వేసి రెండు వైపులా కాలిస్తే, పిజ్జా బేస్ సిద్ధమైనట్లే. 180 డిగ్రీల ఉష్ణోగ్రత దగ్గర అవెన్‌ను ఐదు నిమిషాల పాటు వేడి చేయాలి. బేకింగ్ ట్రేలో అల్యూమినియం ఫాయిల్ పేపర్ వేసి తయారుచేసి ఉంచుకున్న పిజ్జా బేస్‌ను ట్రేలో ఉంచాలి. టొమాటో సాస్, మొజెల్లా చీజ్, టొమాటో తరుగు, ఉల్లి తరుగు, క్యాప్సికమ్ తరుగు, మష్రూమ్ తరుగు, స్వీట్ కార్న్ గింజలు ఒకదాని మీద ఒకటి వేయాలి. సుమారు పది నిమిషాలు దీనిని బేక్ చేసి బయటకు తీయాలి. వేడివేడిగా అందించాలి. ఊదల పుదీనా అన్నం కావలసినవి: ఊదలు – ఒక కప్పు, నీళ్లు – 2 కప్పులు, ఉప్పు – తగినంత బిర్యానీ ఆకు – 1, నెయ్యి / నూనె – 2 టీ స్పూన్లు, ఉల్లి తరుగు – పావు కప్పు, క్యారట్ తరుగు – ఒక కప్పు టొమాటో తరుగు – అర కప్పు, కరివేపాకు – 2 రెమ్మలు పుదీనా – ఒక కప్పు, కొత్తిమీర – పావు కప్పు, తరిగిన పచ్చి మిర్చి – 2 లవంగాలు – 2, అల్లం తరుగు, వెల్లుల్లి తరుగు – అర టీ స్పూను చొప్పున తయారీ: ఊదలను శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు జత చేసి సుమారు రెండు గంటల సేపు నానబెట్టి, నీళ్లు ఒంపేయాలి. స్టౌ మీద కుకర్‌లో ఊదలు, నీళ్లు, ఉప్పు, బిర్యానీ ఆకు వేసి కుకర్ మూత పెట్టాలి. మంటను కొద్దిగా తగ్గించి రెండు విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి. పుదీనా ఆకును శుభ్రంగా కడిగి, కొద్దిగా నీళ్లు జత చేసి మిక్సీలో వేసి మెత్తగా చేయాలి. స్టౌ మీద బాణలిలో నెయ్యి వేసి కరిగాక లవంగాలు, పచ్చి మిర్చి తరుగు, అల్లం తరుగు, వెల్లుల్లి తరుగు ఒకదాని తరవాత ఒకటి వేసి దోరగా వేయించాలి. ఉల్లి తరుగు జత చేసి మరోమారు వేయించాలి. టొమాటో తరుగు, క్యారట్ తరుగు, కరివేపాకు వేసి పచ్చి వాసన పోయేవరకు వేయించాలి. పుదీనా ముద్ద వేసి బాగా కలిపి, కొద్దిసేపు ఉడికించాలి. చివరగా ఉప్పు వేసి కలియబెట్టి దింపేయాలి. ఒక పెద్ద పాత్రలో ఉడికించిన ఊదలు, వేయించి ఉంచుకున్న పుదీనా మిశ్రమం వేసి బాగా కలియబెట్టాలి. కొత్తిమీరతో అలంకరించాలి. రైతాతో వడ్డించాలి. ఊదల ఇండియానా కావలసినవి: ఊదలు – ఒక కప్పుకూరగాయ ముక్కలు – ఒక కప్పు (క్యారట్, బీన్స్, క్యాలీఫ్లవర్, పచ్చి బఠాణీ అన్నీ కలిపి)ఉప్పు – తగినంతతరిగిన పచ్చి మిర్చి – 5నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు కరివేపాకు పొడి – 2 టీ స్పూన్లుకొత్తిమీర – తగినంతఇంగువ – పావు టీ స్పూనుజీలకర్ర – ఒక టీ స్పూనునీళ్లు – అర కప్పు తయారీ: ఊదలను శుభ్రంగా కడిగి, తగినన్ని నీళ్లు జత చేసి సుమారు గంట సేపు నానబెట్టాలి. స్టౌ మీద కుకర్‌లో నెయ్యి వేసి కరిగాక జీలకర్ర, ఇంగువ వేసి వేయించాలి. కూరగాయ ముక్కలు, తరిగిన పచ్చి మిర్చి జత చేసి మరోమారు కలియబెట్టాలి. కరివేపాకు పొడి వేసి బాగా కలపాలి. ఊదలలో నీటిని ఒంపేయాలి. మరుగుతున్న నీళ్లలో ఊదలు, ఉప్పు వేసి బాగా కలిపి మూత ఉంచాలి. రెండు విజిల్స్ వచ్చాక దింపేయాలి. మూత తీశాక కొద్దిగా నెయ్యి, కొత్తిమీర వేసి వేడివేడిగా వడ్డించాలి. -
పంచగవ్యాల ప్రాశస్త్యం
సంస్కృత ‘సాధు’ పదానికి ‘మంచి గుణం’ అని అర్థం. మంచితనానికి పరాకాష్ఠ ‘పవిత్రత’. ఈ తత్త్వం మానసిక ఆరోగ్యానికి ఉత్ప్రేరకం. భగవంతుని ఆశీర్వచన సూచికనే ప్రసాదంలో భక్తులు వీక్షిస్తారు. అందుకే ప్రసాదం పరమ పవిత్రమైనదని ప్రతీతి. ఇక్కడ పరిమాణం ప్రధానం కాదు, విశ్వాసం విశిష్టమైనది. భారతీయ ధార్మిక సాంప్రదాయాలలో, భగవంతుని క్షేత్రం ఏదైనా, స్థాయి ఏదైనా ప్రసాదమే ప్రాముఖ్యత వహిస్తుంది. ప్రాంతాన్ని బట్టి ప్రసాద పదార్థం మారుతుంటుంది. మారేడు దళమైనా, మందార పువ్వైనా, కుంకుమైనా, విభూదిౖయెనా, అన్నిటికీ ఔషధ ప్రయోజనాలు ఉన్నాయి. కడుపులోకి సేవించే వాటిలో కదళీ ఫలమైనా, నారికేళ జలమైనా, కర్పూల తులసీ దళ తీర్థమైనా అన్నీ ఆరోగ్యకరమైనవే. ప్రత్యేకంగా తయారుచేసే భక్ష్యాలలో పాలు, నెయ్యి, శర్కర, తేనె... వంటి పదార్థాలు ప్రధాన పాత్ర వహిస్తాయి. మధురమైనవి, మధురేతరమైనవి కూడా ప్రసాదాలుగా ఉండొచ్చు. పాలు, నెయ్యి అన్నప్పుడు అవి ఆవులకు సంబంధించినవే అని అర్థం చేసుకోవాలి. సంస్కృతంలో ఆవుని ధేనువు అంటారు. ‘గో’ శబ్దం ఆవుకి, ఎద్దుకి కూడా వర్తిస్తుంది. భారత ఇతిహాసంలో గోమాత యొక్క పవిత్రత, ప్రాశస్త్యం గురించి చెప్పవలసిన అవసరం లేదు. నాటి ఆయుర్వేద శాస్త్రం నుంచి, నేటి ఆధునిక పరిశోధన విప్లవాల వరకు పంచగవ్యాల (ఆవు పాలు, పెరుగు, నెయ్యి, మూత్రం, గోమయం/పేడ) పోషక విలువలు, ఔషధ గుణాలు, ఆరోగ్య ప్రయోజనాలు అత్యుత్తమంగానే ఉన్నాయి. శాస్త్ర దృక్కోణం లో ఆవు ఉత్కృష్టతను ఒక్కమాటలో చెప్పాలంటే, ఆవుకి విషం ఇస్తే, అది మరణిస్తుందే తప్ప దాని క్షీర, మూత్ర, మలాలలో మాత్రం విషపు ఛాయలు కనబడవు. ఈ గుణం ఏ ప్రాణికీ లేదు. అటువంటి పంచగవ్యాల గురించి స్థూలంగా శాస్త్రం చెప్పిన విషయాలు... గోమూత్రం: రుచి: కటు (కారం) క్షార (ఉప్పదనం), తిక్త (చేదు), కషాయ (వగరు) గుణాలు: తీక్షణం, లఘు, అగ్నిదీపనం, కఫవాతహరం, పిత్తకరం. ఔషధ ధర్మాలు: జీర్ణశక్తిని పెంచి, పొట్టలో వాయువును తొలగించి, ఉదర శూల (కడుపులో నొప్పి) ను పోగొడుతుంది. మేధావర్ధకం. ముఖరోగాలను (నోటి పూత మొదలైనవి) తగ్గిస్తుంది. మూత్ర వహ సంస్థానానికి చాలా ఉపయుక్తం. అంటే మూత్రాన్ని ధారాళంగా ప్రవహింప చేసి, ఎన్నో మూత్ర రోగాలను హరిస్తుంది. శోఫ హరం (శరీరంలో వాపులను నశింపచేస్తుంది). దగ్గు, ఆయాసాలను తగ్గిస్తుంది. కంటి రోగాలను, సమస్త చర్మ రోగాలను హరిస్తుంది. క్రిమిహరం, కీళ్ల నొప్పులు తగ్గుతాయి. (గోమూత్రం... మేధ్యం... శూలగుల్మ ఉదర ఆనాహ... కాస, శ్వాసాపహం... మూత్రలం, మూత్రరోగహరం... అతిసార కుష్ట క్రిమి, శోఫ, పాండు రోగాపహం...) గోమయం (ఆవు పేడ): దీనిలో కూడా పోషక విలువలు ఉంటాయి. క్రిమిహరం కూడా. తక్కువ ప్రమాణంతో గోమయ రసాన్ని సేవించటం కూడా ఉంది. వాతావరణ కాలుష్యాన్ని పోగొట్టే క్రిమిహర, విషహర గుణాలు ఉన్నాయి. చక్కటి ఎరువుగా ఉపకరిస్తుంది.ఎండబెట్టి పిడకలు చేసి ఇంధనంగా వాడితే ఆయా వంటకాల గుణాలు కూడా ఉత్తమం. భస్మమైన పిడకల్ని ‘కచిక’ అంటారు. దీంతో పండ్లు (దంతాలు) తోముకునే విధానాన్ని ఇప్పటికీ పల్లె ప్రజలు పాటిస్తున్నారు. దంత రోగాలు రాకుండా కాపాడుతుంది. కొద్దిగా గోమయం కలిపిన నీటితో స్నానం చేసే సాంప్రదాయం కూడా ఉంది.‘గోమయేన సదా స్నాయాత్ కర్రషి చ ఆప్యవిశేషేత్’’ (మహాభారతం, అనుశాసన పర్వం)యన్మే రోగం శోకం చ తన్మే దహతు గోమయం, రక్షం శకృత్ కృత్వా ద్వాదశాంగేషు నామభిః’’(శ్రీమద్భాగవతం)అందుకే గోమూత్ర గోమయాలను పవిత్రంగా భావిస్తారు.బజారులో లభించే ఆయుర్వేద ఔషధం: పంచగవ్య ఘృతం మరియు మహాపంచగవ్య ఘృతం. మోతాదు: ఒక చెంచా (5 మి.లీ. లేక గ్రాములు) పావు కప్పు ఆవు పాలలో కలిపి ఉదయం ఖాళీ కడుపున సేవించాలి. సాయంత్రం కూడా మరోసారి తాగాలి. ఎంతకాలం వాడినా మంచిదే. ప్రయోజనాలు: మేధా వర్ధకం, అన్నిరకాల మానసిక రోగాలలోనూ (ఉద్వేగ, ఉన్మాద, బుద్ధిమాంద్య, నిద్రా నాశరోగాలు) గుణకారి. ఆటిజం, పార్కిన్సోనిజం వంటి వాతరోగాలు తగ్గడానికి సహకరిస్తుంది. గుర్తుంచుకోవలసిన సారాంశం:గోఘృతంబునె సర్వదా కోరుకొనుముప్రబల మేధ్యంబు వృష్యంబు బలకరంబుముదిమి రానీదు యువ శక్తి పొంగిపొరలు కంటికి బలమ్ము దీర్ఘాయుకర ము, ఘనముపావు పెరుగు నెయ్యి పరమోత్తమంబవిఆవు మూలమైన అమృతమయముక్రొత్త కాదు మనకు గోమయ మూత్రముల్పంచగవ్యములవి యెంచి చూడ ఆవు పాలు: (భావప్రకాశ సంహితా)గవ్యం దుగ్ధం విశేషేణ మధురం రసపాకయోఃశీతలం స్తన్యకృత్ స్నిగ్ధం వాత పిత్త నాశనమ్... జరా సమస్త రోగాణా శాంతికృత్ సేవినాం సదా’’ఆవు పాలు తియ్యగా ఉంటాయి. చలవ చేస్తాయి. జిగురుగా ఉంటాయి. స్తన్యవర్థకం. వాతపిత్తహరమై రక్తదోషాలను తొలగిస్తాయి. ఆవు పాలను ప్రతి రోజూ తీసుకోవచ్చు. దీనివల్ల సమస్త రోగాలను నివారించే ‘క్షమత్వం’ వృద్ధి చెందుతుంది. ముసలితనం దూరం అవుతుంది. ఓజస్సును పెంపొందించి, నేత్రాలకు, చర్మానికి కాంతిని కలిగిస్తుంది. తల్లి పాలు కొరవడినప్పుడు శిశువులకు ఆవు పాలు శ్రేష్ఠం, బలవర్ధకం. అందుకే చరకాచార్యులు ‘ప్రవరం జీవనీయానాం క్షీరముత్తమం రసాయనం’ అని చెప్పాడు. సప్తధాతు పుష్టికరమై ఆయువును పెంచుతాయి ఆవు పాలు. ఆవు నెయ్యి (గోఘృతం): మధురం, ప్రధానంగా పిత్త దోషహరం, వాతకఫ శ్యామకం, చలువ చేస్తుంది. మేధా (తెలివితేటలు) వర్ధకం, ఓజోకరం, శుక్రకరం, రసాయనం (సప్తధాతు పుష్టికరమై క్షమత్వ వర్ధకం). లావణ్య, కాంతి, తేజో... వర్ధకం, వయస్థాపకం (ముసలితనం రానీయకుండా యౌవనాన్ని పదిల పరుస్తుంది), ఆయుః వర్ధకం, మంగళకరం. కంటికి మంచిది. (గవ్యం ఘృతం విశేషేణ చక్షుష్యం, వృష్యం, అగ్నికృత్... మేధా లావణ్య కాంతి తేజో ఓజో వృద్ధికరం, వయస్థాపకం, బల్యం, సుమంగలం, ఆయుష్యం, సర్వ ఆజ్యేషు గుణాధికం) ఆవు నేతిని హోమం చేస్తే వచ్చే పొగ విషాన్ని హరిస్తుంది. వాతావరణ కాలుష్యాన్ని కూడా హరిస్తుంది. – డా. వృద్ధుల లక్ష్మీనరసింహ శాస్త్రి, ప్రముఖ ఆయుర్వేద వైద్యులు -
నకిలీ నెయ్యి కుంకుమ తయారీ గుట్టురట్టు
-
నెయ్యి... తినాలా, వద్దా?
ఆయుర్వేద కౌన్సెలింగ్ ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో నెయ్యి శరీరానికి అవసరమా, కాదా? సేవించవచ్చా, సేవించకూడదా? అవసరమైతే ఏ నేతిని వాడాలి? వివరాలు తెలియజేయండి. - ఎ. కామాక్షి, హైదరాబాద్ మనిషి ఆరోగ్యం సక్రమంగా ఉండాలంటే, పోషకవిలువలు ఉన్న ఆహారం, తగురీతిలో వ్యాయామం అత్యంతావశ్యకం. కాలమాన పరిస్థితుల ఎలా ఉన్నా, ఆరోగ్యాన్ని పణంగా పెట్టి హానికరమైన జీవనశైలికి దాసోహం అనడం సరికాదు. నెయ్యి శరీరానికి చాలా అవసరం. నెయ్యికి సంస్కృతంలో ఇతర పర్యాయ పదాలు... ఘృతం, ఆజ్యం, సర్పిః, హవిః, పవిత్ర మొదలగునవి. ఏ జంతువుకి సబంధించిన నేతికైనా సాధారణ గుణధర్మాలు ఈ కింది విధంగా ఉంటాయి. * సప్తధాతువులకు పుష్టిని కలిగిస్తూ, ఓజస్సును వృద్ధి చేస్తుంది. దేహకాంతి, తేజస్సు, లావణ్యాలను పెంపొందిస్తుంది. కంఠస్వరాన్ని మెరుగుపరుస్తుంది. మేధావర్ధకమై ధారణశక్తిని పెంచుతుంది. ఆయుష్కరం. * స్నిగ్ధం (జిడ్డుగా ఉంటంది), గురువు (ఆలస్యంగా జీర్ణమై, దేహాన్ని బరువెక్కిస్తుంది), స్వల్పంగా ‘అభిష్యంది’కరం (స్రోతస్సులకు అవరోధం కలిగిస్తుంది), కఫకరం, వాతపిత్తహరం. శీతవీర్యం (చలవచేస్తుంది), విషహరం, కళ్లకు మంచిది, రుచిగా ఉంటుంది. ఆకలిని పెంచుతుంది (దీపనం). * ఉన్మాదం వంటి మానసిక వికారాలను తగ్గించడంలో ఉపకరిస్తుంది. ఉదరశూల, జ్వరం, కొన్ని చర్మరోగాలను పోగొడుతుంది. కృమిహరం (ఇన్ఫెక్షన్లను హరిస్తుంది). విశేష గుణాలు : గేదెనెయ్యి, వృష్యం (శుక్రవర్ధకం), కామోత్తేజకం, మేకనెయ్యి దగ్గు, ఆయాసాలను తగ్గిస్తుంది. గొర్రె నెయ్యి ఎముకలకు పుష్టినిస్తుంది, మూత్ర విసర్జక వ్యవస్థలో రాళ్లు పెరగకుండా చూస్తుంది. * ఇక ఆవునెయ్యి (గోఘృతం) అన్నింటిలోనూ శ్రేష్ఠం. వయస్థాపకం (ముసలితనాన్ని దూరం చేస్తుంది). మంచి పరిమళం ఉంటుంది. రసాయనం (శారీరక మానసిక శక్తివర్ధకం). భావప్రకాశ సంహితలోని శ్లోకం : ‘‘గత్యం ఘృతం... బల్యం, పవిత్ర మాయుష్యం, వయస్థాపకం, రసాయనం ॥ సుగంధం రోచనం చారు సర్వాజ్యేషు గుణాధికం॥‘‘ - పురాణఘృతం (ఒక సంవత్సరం దాటిన నెయ్యి): చాలా వ్యాధులను పోగొడుతుంది. ఉదా: మూర్ఛ, అపస్మారక, ఉన్మాద, తిమిర (కంటి చూపు తగ్గడం), చర్మరోగాలు మొదలైనవి. - నవీన ఘృతం (కొత్త నెయ్యి) : నీరసాన్ని, పాండురోగాన్ని (అనీమియా), నేత్రరోగాలను తగ్గిస్తుంది. - బాలురు, వృద్ధులు, ఆకలి తక్కువగా ఉన్నవారు, అజీర్ణం, మలబంధ వికారాలు కలిగి ఉన్నవారు నెయ్యిని చాలా మితంగా సేవించాలి. గమనిక : నెయ్యి వేడి చేస్తుందనడం అపోహ మాత్రమే. వాస్తవానికి అది చలవచేసి అనేక పిత్త దోష వికారాలను తగ్గిస్తుంది. (ఉదాహరణకు రక్తస్రావం, తలతిరగడం, మంట వంటివి). ఆవు నెయ్యిని ‘మితం’గా ప్రతిరోజూ సేవిస్తూ, తదనుగుణంగా ఏదో రీతిలో ప్రతిరోజూ తగినంత వ్యాయామం చేస్తుంటే, ఎంతో ఆరోగ్యప్రదం. - డాక్టర్ వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి ఆయుర్వేద నిపుణులు, సౌభాగ్య ఆయుర్వేదిక్ క్లినిక్, హుమాయూన్‌నగర్, హైదరాబాద్ ఆర్థోపెడిక్ కౌన్సెలింగ్ నా వయసు 26 ఏళ్లు. దాదాపు ఆర్నెల్ల క్రితం క్రికెట్ ఆడుతుండగా కాలు మడతపడి, మోకాలు వాచింది. విపరీతమైన నొప్పి వస్తోంది. రెండు వారాల తర్వాత నొప్పి తగ్గింది. తర్వాత నేను క్రికెట్ ఆడేటప్పుడు బ్యాలెన్స్ తప్పి పడిపోయాను. దాంతో మోకాలిలో తీవ్రమైన వాపు, నొప్పి వచ్చాయి. ఈసారి ఎమ్మారై చేయించాం. అందులో ఏసీఎల్ లిగమెంట్ దెబ్బతినట్లుగా తేలింది. మా డాక్టర్‌గారు శస్త్రచికిత్స అవసరం అన్నారు. కానీ మా బాబాయికి కూడా ఇలాంటి సమస్యే వచ్చిందని చెప్పి, ఆయన సర్జరీ అవసరం లేదన్నారు. దాంతో ఇప్పుడు నేను అయోమయంలో పడిపోయాను. దయచేసి నాకు తగిన పరిష్కారం చెప్పండి. - మధుసూదన్, అనకాపల్లి ఆటలు ఆడేవారిలోనూ, బైక్ యాక్సిడెంట్లో గాయపడ్డవారిలో ఏసీఎల్ లిగమెంట్ దెబ్బతినడం అన్నది చాలా సాధారణంగా జరుగుతుంది. గతంలో దీన్ని కనుగొనడం కూడా అంతగా జరగకపోయేది. కాబట్టి శస్త్రచికిత్స ప్రస్తావనే వచ్చేది కాదు. మీ బాబాయి లాంటి పెద్ద వయసు వారు ఎలాగూ పెద్దగా కదలికలు లేని జీవనశైలి గడుపుతారు కాబట్టి వారికి శస్త్రచికిత్స లేకపోయినా పర్వాలేదు. కానీ మీలాంటి యువకుల్లో శారీరక కదలికలు ఎక్కువ కాబట్టి సమస్య మళ్లీ తిరగబెట్టడం, కొన్నేళ్ల తర్వాత ఆర్థరైటిస్ సమస్య రావడం వంటివి జరిగే అవకాశం ఉంది. యువకుల్లో ఈ పరిణామం చాలా ప్రమాదకరంగా మారవచ్చు. కాబట్టి... మీ వయసులో ఉన్నవారికి ఏసీఎల్ లిగమెంట్ను పునర్నిర్మించే శస్త్రచికిత్స (ఏసీఎల్ లిగమెంట్ రీకన్స్ట్రక్షన్ సర్జరీ) అవసరం అని నా సలహా. దీని వల్ల మీరు భవిష్యత్తులోనూ ఇంతే చురుగ్గా ఉండటంతో పాటు మీకు వచ్చేందుకు అవకాశం ఉన్న ఆర్థరైటిస్‌ను నివారించినట్లు అవుతుంది. - డాక్టర్ కె. సుధీర్‌రెడ్డి చీఫ్ ఆర్థోపెడిక్ సర్జన్, ల్యాండ్‌మార్క్ హాస్పిటల్స్, హైదరాబాద్ కార్డియాలజీ కౌన్సెలింగ్ మేము ఉన్న ఊరు నుంచి సిటీ కాస్త దూరం. గుండెపోటు వచ్చినప్పుడు పెద్దాసుపత్రులకు వెళ్లేలోపు మాలాంటి వారు ఎలాంటి తక్షణ జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పండి. - వి. గురునాథరావు, చౌటుప్పల్ రోగికి గుండెనొప్పిగా అనిపిస్తోందని తెలిసిన వెంటనే అతడిచేత ఒక గ్లాసు నీరు తాగించాలి. కొన్నిసార్లు వెంటనే ఈసీజీ తీసే సమయం కూడా ఉండకపోవచ్చు. పరిస్థితి కాస్త తీవ్రంగా ఉందనిపిస్తే వెంటనే డిస్ప్రిన్-300 మి.గ్రా. మాత్రను నీటిలో కలిపి తాగించాలి. కూర్చోబెట్టిగానీ, పడుకోబెట్టి కూడా తల కాస్తంత పైకి లేపిగానీ డిస్ప్రిన్-300 మి.గ్రా. కలిపిన ద్రావణాన్ని తాగించవచ్చు. ఆ తర్వాత సార్బిట్రేట్ మాత్ర కూడా వేయవచ్చు. దీంతో వెంటనే నొప్పి తగ్గిపోతుంది. ఆ తర్వాత సాధ్యమైనంత త్వరగా (శరీరానికి ఏమాత్రం శ్రమ కలిగించకుండా) ఏదో ఒక వాహనం మీద రోగిని ఆసుపత్రికి తరలించాలి. డిస్ప్రిన్ మాత్ర డాక్టర్లు ఇచ్చే స్ట్రెప్టోకైనేజ్ ఇంజెక్షన్‌కు సమానంగా పనిస్తుంది. అందుకే గుండెనొప్పి వచ్చినవారికి సార్బిట్రేట్ కన్నా డిస్ప్రిన్ చాలా ముఖ్యం. ఆ మాత్రను నీళ్లలో కలిపి తాగించడం వల్ల... వెంటనే ఒంటిలోకి అది కలిసిపోతుంది. ఇక డిస్ప్రిన్, సార్బిట్రేట్... ఈ రెండూ ఇవ్వడం వల్ల రోగికి ఎక్కువ ప్రయోజనం చేకూరుతుంది. గుండెపోటు వచ్చినప్పుడు తొలి గంట చాలా అమూల్యమైనది. కాబట్టి గుండెనొప్పి వచ్చిన రోగిని, నొప్పి వచ్చిన గంటలోపే హాస్పిటల్‌కు చేర్చడం చాలా ముఖ్యం. కొందరు దడ వచ్చిన వెంటనే కళ్లు తిరిగి పడిపోతారు. గుండెవేగం బాగా తగ్గిపోవడం వల్ల ఇలా పడిపోతారు. దీన్ని ‘సింకోప్ అటాక్’ అంటారు. ఇది గుండెజబ్బుకు సూచన. గుండెదడతో పడిపోయిన వారు మాత్రం రెండు నిమిషాల్లోనే మళ్లీ తేరుకుని, లేచి నడవగలరు. అయినప్పటికీ ముందుజాగ్రత్తగా వీళ్లకు ఒకసారి ఈసీజీ తీసి, అవసరమైన చికిత్స అందించడం మేలు. - డాక్టర్ అనుజ్ కపాడియా సీనియర్ కార్డియాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ -
నెయ్యితో బరువు తగ్గొచ్చు..!
నెయ్యి, నూనెలు, పాల ఉత్పత్తులతో కొవ్వు పెరిగిపోతుందని భయపడతాం. శరీర బరువు తగ్గించుకోవాలన్నపుడు భోజనంలో నెయ్యి వాడకం మానేస్తాం. అలాగే నెయ్యితో తయారు చేసే స్వీట్లు, వంటకాలకు దూరంగా ఉంటాం. అయితే నెయ్యి తినడం వల్ల బరువు తగ్గుతారంటే నమ్ముతారా? అవును ఇది నజంగానే అధిక క్యాలరీలు కలిగిన పదార్థమే అయినా... నెయ్యితో ఎన్నో ప్రయోజనాలు కూడ ఉన్నాయని డైటీషియన్లు చెప్తున్నారు. భారత సంప్రదాయ వంటకాల్లోనూ, భోజనంలోనూ విరివిగా వాడే నెయ్యి వల్ల బరువు తగ్గుతారని, దీనికి తోడు అనేక ప్రయోజనాలు కూడ ఉన్నాయని చెప్తున్నారు. నెయ్యిని రోజువారీ ఆహరంలో వినియోగించి ఆరోగ్యాన్ని పొందవచ్చని డైటీషియన్లు సూచిస్తున్నారు. కొబ్బరి, నువ్వుల నూనె వంటి ఆరోగ్యకరమైన కొవ్వును మాత్రమే నెయ్యి కూడ కలిగి ఉంటుందంటున్నారు. కొద్దిపాటి ఆమ్లాలు కలిగిన కొవ్వు మాత్రమే కలిగి ఉండే నెయ్యిని... కాలేయం స్వయంగా కరిగించుకొని.. శరీరానికి మంచి శక్తినిస్తుందని చెప్తున్నారు. ఒమేగా-3 ని కలిగి ఉన్న నెయ్యి తినడంవల్ల క్యాన్సర్, గుండెజబ్బులు, మధుమేహం వంటి ప్రమాదాలకు దూరం కావొచ్చని, నెయ్యిలో ఉండే 'కంజుగేటెడ్ లినోలైక్' ఫ్యాటీ ఆమ్లం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుందని డైటీషియన్లు వివరిస్తున్నారు. నెయ్యిలో కొలెస్ట్రాల్ శాతం తక్కువగా ఉండటం, అలాగే ఒమేగా-3 ఉండటం వల్ల గుండె ఆరోగ్యాన్ని రక్షించేందుకు సహకరిస్తుంది. అంతేకాక నెయ్యి మాయిశ్చురైజర్ గా కూడ ఉపయోగ పడుతుంది. పొడిచర్మంతో బాధపడేవారికి, పెదాలు పగిలిపోయే సమస్య ఉన్నవారికి నెయ్యి సహకరించి మృదుత్వాన్ని చేకూరుస్తుంది. అలాగే వాపులు, కాలిన గాయాలకు మందుగా కూడ నెయ్యి ఉపకరిస్తుంది. ముఖ్యంగా మనం తినే ఆహారం సులభంగా జీర్ణమయ్యేందుకు నెయ్యిలో ఉండే బటిరిక్ ఆమ్లాలు ఎంతగానో ఉపయోగ పడతాయి. కడుపులో ఉండే గ్యాస్ ను బయటకు పంపించి, జీర్ణశక్తిని పెంచి శరీరం ఆరోగ్యంగా ఉండేట్టు చేస్తుంది. నెయ్యిలో ఉండే గ్యాస్ట్రిక్ యాసిడ్ శరీరంలోని శక్తిహీనతను తగ్గించి కీళ్ళ మధ్యన ఉండే జారుడు పదార్థాన్ని రక్షిస్తూ శరీరం ఫ్లెక్సిబుల్ గా ఉండేందుకు సహకరిస్తుంది. ఎ, డి, ఇ, కె, విటమిన్లను కూడ కలిగి ఉండే నెయ్యి... ప్రతిరోజూ భోజనంలో ఒక్క టేబుల్ స్పూన్ చొప్పున తీసుకుంటే శరీరానికి కావలసిన పోషకాలను అందిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఇతర నూనె పదార్థాలను వేపుళ్ళకు వినియోగించడం కన్నా నెయ్యిని వినియోగించడం ఎంతో శ్రేయస్కరమంటున్నారు. సౌందర్య సాధనంగా కూడ నెయ్యిని వినియోగించవచ్చని, భారత మహిళలు పొడి చర్మానికి మాయిశ్చురైజర్ గా నెయ్యిని వినియోగిస్తారని, తల్లోని చర్మానికి పట్టిస్తే జుట్టు పెరుగుదలను కూడ మెరుగుపరుస్తుందని నమ్ముతారని వైద్య నిపుణులు చెప్తున్నారు. -
నకిలీ డిటర్జెంట్ తయారీ కేంద్రంపై దాడులు
హైదరాబాద్: నగరంలోని కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో నకిలీ డిటర్జెంట్, తేనె, నెయ్యి తయారీ కేంద్రంపై ఎస్వోటీ పోలీసులు శనివారం దాడులు నిర్వహించారు. సర్ఫ్ఎక్సెల్ పేరుతో నకిలీ డిటర్జెంట్ తయారీ చేస్తున్నట్టు హిందూస్థాన్ యూనీలీవర్ కంపెనీ ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నాగార్జుననగర్‌లో ఓ తయారీ కేంద్రంపై దాడులు నిర్వహించారు. శ్రీనివాస్, సాగర్ అనే ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు. రూ.లక్ష విలువజేసే నకిలీ డిటర్జెంట్, రూ.5 లక్షల విలువ జేసే నకిలీ నెయ్యి, తేనెను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు స్టేషన్‌కు తరలించారు. -
90 లీటర్ల కల్తీ నెయ్యి సీజ్
గోషామహల్ ప్రాంతంలో పామోయిల్తో కల్తీ చేసిన 90 లీటర్ల నెయ్యిని హైదరాబాద్ టాస్క్ పోలీసులు పట్టుకున్నారు. కల్తీ నెయ్యిని విక్రయిస్తున్న దినేష్ పాండియాను అదుపులోకి తీసుకున్న పోలీసులు 90 లీటర్ల నెయ్యిని సీజ్ చేసి, స్థానిక పోలీసులకు అప్పగించారు. నగరంలోని ముర్గీచౌక్ నుంచి హసన్‌నగర్‌కు చెందిన మహ్మాద్ నిజాముద్ధీన్, మహ్మాద్ యూసుఫ్‌తో కలిసి చికెన్ వెస్టేజ్తో తయారు చేసిన 555 లీటర్ల అయిల్ను తరలిస్తుండగా టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చే శారు. ఈ దాడి నుంచి మహ్మాద్ యూసుఫ్ తప్పించుకున్నారు. దోరికిన మహ్మాద్ నిజాముద్ధీన్ నుంచి స్వాధీనం చేసుకున్న 555 లీటర్ల అయిల్ను సీజ్ చేసి , ఆయనను ఆరెస్టు చేసి ,స్థానిక పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటనలపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
నెయ్యి ట్యాంకర్లపై నిర్లక్ష్యం
ఆరు నెలల క్రితం తిరుమలకు తీసుకొచ్చిన అధునాతన ట్యాంకులు వినియోగంలోకి తేవడంలో తీవ్ర జాప్యం ట్యాంకులు ఏర్పాటైతే నాణ్యమైన నెయ్యి నిల్వకు అవకాశం తిరుమల: నెయ్యి నిల్వకోసం కొత్తగా తెప్పించిన ట్యాంకుల వినియోగంపై టీటీడీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. నెయ్యి నిల్వ కోసం ఆరు నెలల క్రితం అధునాతన ట్యాంకర్లు తిరుమలకు వచ్చాయి. వాటిని వినియోగంలోకి తేవడంలో టీటీడీ తీవ్ర జాప్యం చేస్తోంది. దీనిప్రభావం లడ్డూల తయారీ సంఖ్య, నాణ్యతపై పడుతున్నా సంబంధిత అధికారుల్లో చలనం లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. కొండకు ట్యాంకర్లతోనే నెయ్యి సరఫరా తిరుమలేశునికి దర్శనానికి వచ్చే భక్తుల కోసం టీటీడీ ప్రతిరోజూ మూడు లక్షల లడ్డూలు తయారుచేస్తోంది. లడ్డూతోపాటు ఆలయ అవసరాల కోసం సుమారు 10 నుంచి 12 వేల కిలోల నెయ్యి వాడుతోంది. ఈ మొత్తం నెయ్యి నిల్వ కోసం 8 భారీ స్థాయి ట్యాంకులు తెప్పించి శ్రీవారి ఆలయానికి ఉత్తర దిశలో లడ్డూ కౌంటర్ పక్కనే ఉంచారు. ఇందులో 4 ట్యాంకుల్లో ఒక్కో దానిలో 5వేల కిలోలు, మరో నాలుగింటిలో ఒక్కోదానిలో 4,500 కిలోల నెయ్యి నిల్వచేసుకోవచ్చు. ప్రస్తుతం టెండరుదారు నుంచి తిరుపతి మార్కెటింగ్ గోడౌన్‌కు ట్యాంకర్ల ద్వారా చేరిన నెయ్యిని తిరుమలకు తరలిస్తారు. రెండు రోజులకోసారి సుమారు 12 నుంచి 15వేల కిలోల సామర్థ్యం గల వాహన ట్యాంకుల ద్వారా నెయ్యిని లడ్డూ కేంద్రంలోని ట్యాంకులకు చేరవేసి నిల్వ చేస్తున్నారు. పెరుగుతున్న ఫిర్యాదులు భక్తులు అత్యంత ప్రీతిపాత్రంగా స్వీకరించే శ్రీవారి లడ్డూ విషయంలో పదేళ్లుగా ఫిర్యాదులు పెరిగాయి. మరోవైపు 3 లక్షల లడ్డూలు తయారు చేసినా సరిపోవటం లేదు. అయినప్పటికీ టీటీడీ లడ్డూ తయారి సంఖ్య కంటే వాటి నాణ్యతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. పాత ట్యాంకుల్లో ఎక్కువ రోజులు నెయ్యి నిల్వ ఉండడం వల్ల కూడా లడ్డూ నాణ్యతలో వ్యత్యాసం ఉందని నిపుణులు టీటీడీకి సూచించారు. పాత ట్యాంకులు అడ్డంగా (హారిజాంటల్) అమర్చి ఉండడం వల్ల నెయ్యి వాడిన తర్వాత వేడినీళ్లతో శుద్ధి చేసేందుకు ఇబ్బందులు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. తిరుమల వాతావరణ పరిస్థితుల వల్ల శీతాకాలంలో నెయ్యి ట్యాంకుల్లోనే గడ్డక ట్టడం, వాటివల్ల వృథా ఎక్కువగా జరగడాన్ని వారు గుర్తించారు. దీన్ని టీటీడీ ఉన్నతాధికారులు సీనియస్‌గా పరిగణించారు. అధునాతన ట్యాంకులు ఏర్పాటు చేయాలని మూడేళ్లకు ముందు నిర్ణయించారు. ఇందులో భాగంగా ట్యాంకులు అడ్డంగా (హారిజాంటల్) కాకుండా నిలువుగా (వర్టికల్‌గా ఏర్పాటు..ట్యాంకులోని ప్రతి బొట్టినెయ్యిని వినియోగించుకోవటంతోపాటు వేడినీళ్లతో శుద్ధి చేయటానికి సులభంగా ఉండేలా) డిజైన్లు రూపొందించారు. ఆరు నెలల ముందు 12వేల కిలోల నెయ్యి నిల్వ ఉండేలా నాలుగు ట్యాంకులు తెప్పించారు. ఆ ట్యాంకులకే అదనంగా వేడినీళ్లతో శుద్ధి చేసే యంత్రాలు అమర్చారు. సివిల్ పనులతో కొత్త ట్యాంకుల ఏర్పాటులో జాప్యం కొత్త ట్యాంకులు ఏర్పాటు చేస్తేనే అవసరమైన లడ్డూల తయారీతోపాటు నాణ్యమైన నెయ్యి, ట్యాంకుల శుద్ధి పనుల్లో పురోగతి కనిపిస్తుంది. అయితే, ఈ ట్యాంకులు అమర్చడంలో జాప్యం జరుగుతోంది. సివిల్ పనులు ఆలస్యం కావటం వల్లే ట్యాంకులు ఏర్పాటు చేయలేదనే వాదన వస్తోంది. పనుల విషయంలో జాప్యం ఉండకూడదని టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు పదేపదే చెబుతున్నా సంబంధిత అధికారుల చెవికి ఎక్కడం లేదు. ఇకనైనా సంబంధిత అధికారులు కొత్త ట్యాంకుల ఏర్పాటును పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. సివిల్ పనులతో కొత్త ట్యాంకుల ఏర్పాటులో జాప్యం కొత్త ట్యాంకులు ఏర్పాటు చేస్తేనే అవసరమైన లడ్డూల తయారీతోపాటు నాణ్యమైన నెయ్యి, ట్యాంకుల శుద్ధి పనుల్లో పురోగతి కనిపిస్తుంది. అయితే, ఈ ట్యాంకులు అమర్చడంలో జాప్యం జరుగుతోంది. సివిల్ పనులు ఆలస్యం కావడం వల్లే ట్యాంకులు ఏర్పాటు చేయలేదనే వాదన వస్తోంది. పనుల విషయంలో జాప్యం ఉండకూడదని టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు పదేపదే చెబుతున్నా సంబంధిత అధికారుల చెవికి ఎక్కడం లేదు. ఇకనైనా సంబంధిత అధికారులు కొత్త ట్యాంకుల ఏర్పాటును పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. -
మీర్పేట్లో కల్తీ నెయ్యి స్వాధీనం
-
ప్రతి ముద్దలో కల్తీ
పదేపదే పట్టుబడినా అదే తీరు పోలీసు కాలనీలోనే తయారీ నెయ్యితో పాటు మరో 10 రకాలు పట్టుబడ్డ ప్రధాన నిందితుడు కర్మాగారానికి సీలు వంటిల్లు కల్తీ అవుతోంది.. తినే ప్రతి ముద్దలోనూ అవే జాడలు కనిపిస్తున్నాయి. పప్పులో వాడే నెయ్యి.. కూరలో వాడే పసుపు, మసాలాలు, ధనియాల పొడి.. ఇలా అన్నీ కల్తీ అయితే ఇక మనిషి ఆరోగ్యానికే ముప్పు వాటిల్లే పరిస్థితి. ఒకేసారి కనిపించకపోయినా.. క్రమేణా ఆరోగ్యం క్షీణించటం ఖాయం. తాజాగా విజయవాడ నగరంలో వెలుగులోకి వచ్చిన కల్తీ నెయ్యి, 10 రకాల ఆహార పదార్థాల దినుసుల వ్యవహారంతో జనం ఆందోళనకు గురవుతున్నారు. విజయవాడ సిటీ : నెయ్యి తయారీకి డాల్డా, రంగు కోసం హానికారక రసాయన మిశ్రమాలు. కారం.. పసుపు.. మసాలా దినుసుల తయారీకి సర్వం సిద్ధం. ఆధునిక యంత్రాలతో అత్యాధునిక ప్యాకింగ్. చూసినవారు పేరొందిన కంపెనీ ఉత్పత్తులుగానే భ్రమించేందుకు నిర్దేశించిన బండిల్స్ కొద్దీ లేబుల్స్. ఇవీ పోలీసులు సోదా చేసిన కల్తీ నెయ్యి గోడౌన్లో కనిపించిన దృశ్యాలు. పట్టుబడిన ప్రధాన నిందితుడు ఆవుల ఫణిని వెంటబెట్టుకొని పటమట సీఐ కె.దామోదర్ మీడియా సమక్షంలో ఇందిరానాయక్ నగర్‌లోని కర్మాగారాన్ని తనిఖీ చేశారు. అక్కడి దృశ్యం చూసి అవాక్కయ్యారు. కల్తీ సరకుల తయారీకి సిద్ధం చేసిన ముడి సరకుతో పాటు ప్యాకింగ్ కోసం నిర్దేశించిన లేబుల్స్ పెద్ద మొత్తంలో ఉన్నాయి. 60కి పైగా వేర్వేరు పేర్లతో కూడిన ఉత్పత్తుల తయారీకి అక్కడ ఏర్పాట్లు ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. పోలీసు కుటుంబాలు నివాసం ఉండే కాలనీలోనే గుట్టుగా సాగుతున్న కల్తీ ఉత్పత్తులు నగర వాసులను ఆశ్చర్యానికి, ఆందోళనకు గురిచేస్తున్నాయి. మూడంతస్తుల విశాల భవనంలో అత్యాధునిక యంత్రాలు ఏర్పాటు చేసి ఆవుల ఫణికుమార్ కల్తీ దందా నిర్వహిస్తున్నాడు. కొద్ది రోజుల కిందట ప్రజాప్రతినిధులు దాడి చేసి కల్తీ బాగోతాన్ని వెలికితీయడంతో పోలీసు, ప్రజల దృష్టిని మరల్చేందుకు ఆగిరిపల్లి మండలం నెక్కలం గొల్లగూడెం గ్రామంలో కల్తీ నెయ్యి తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేసిన రోజుల వ్యవధిలోనే పోలీసులకు చిక్కాడు. ఇదీ జరిగింది : గుంటూరుకు చెందిన ఆవుల ఫణీంద్ర కుమార్ అలియాస్ ఫణి తన బావ అనిల్ కుమార్‌తో కలిసి బతుకుదెరువు కోసం నగరానికి వచ్చాడు. ప్రారంభంలో పాతబస్తీలోని ప్రియా గోల్డ్ సంస్థలో గుమాస్తాలుగా పని చేశారు. అనతి కాలంలోనే వ్యాపార మెలకువలను తెలుసుకొని నకిలీ కల్తీ నెయ్యికి శ్రీకారం చుట్టారు. నగర శివారు ప్రాంతమైన అజిత్‌సింగ్‌నగర్ ఇందిరా నాయక్ నగర్లో స్థలం కొనుగోలు చేసి కల్తీ నెయ్యి తయారీ ప్రారంభించాడు. శ్రీ దుర్గా ఫుడ్ ప్రొడక్ట్స్ పేరిట లెసైన్స్ తీసుకొని నిర్వహిస్తున్న కల్తీ వ్యాపారంపై 2012లో నున్న పోలీసులు దాడి చేసి అరెస్టు చేశారు. ఆ తర్వాత కొద్ది రోజులు గుంటూరు జిల్లా దుగ్గిరాలలో నిర్వహించగా ఫుడ్ ఇన్స్పెక్టర్లు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. దీంతో స్వస్థలమైన గుంటూరును కేంద్రంగా చేసుకొని కల్తీ మసాలా దినుసుల వ్యాపారం ప్రారంభించి మరోసారి పోలీసులకు చిక్కాడు. రెండు నెలల క్రితం పాత ప్రాంతంలోనే పట్టుబడినా, మరోసారి నెక్కలం గొల్లగూడెంలో నెయ్యి తయారుచేస్తూ ఈ నెల 13న టాస్క్‌ఫోర్స్ పోలీసులకు చిక్కటం గమనార్హం. బలమైన నెట్వర్క్ : గత పదేళ్ల కాలంలో రాష్ట్రంలోని ప్రధాన పట్టణాలతో పాటు ఒడిశా, తెలంగాణ, కర్నాటక రాష్ట్రాల్లో నెట్వర్క్ విస్తరించుకున్నాడు. దాదాపు 150 మందికి పైగా డిస్ట్రిబ్యూటర్లు, ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని కల్తీ దందా చేస్తున్నాడు. నెలకు రూ.25 కోట్ల మేర వ్యాపారం జరుగుతున్నట్టు పోలీసులు గుర్తించారు. మార్కెట్లో అసలు నెయ్యి కిలో రూ.450 నుంచి రూ.500 వరకు ఉంది. దీనిపై మార్జిన్ కూడా పెద్దగా ఉండదు. వీరు తయారుచేసి విక్రయిస్తున్న నెయ్యి కిలో రూ.150కి మాత్రమే సరఫరా చేస్తుండటం గమనార్హం. సహకరించిన వారిపైనా కేసులు : నకిలీ నెయ్యి తయారీ చేసిన వ్యక్తులతో పాటు ఇందుకు సహకరించిన వారిపై కూడా కేసుల నమోదుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే 30 మంది డీలర్ల జాబితాను పోలీసులు సేకరించారు. పరారీలోని నిందితులతో పాటు వీరి అరెస్టుకూ రంగం సిద్ధం చేస్తున్నారు. పదే పదే పట్టుబడినా కల్తీ వ్యాపారం కొనసాగిస్తున్న ఆవుల ఫణీంద్రపై రౌడీషీటు తెరిచే ఆలోచన కూడా చేస్తున్నట్టు సమాచారం. కల్తీ కాదు.. కాపీరైట్ ఉల్లంఘనే : ఫణీంద్ర తాను కల్తీ నెయ్యి, ఇతర ఆహార ఉత్పత్తులు తయారు చేస్తున్న మాట అవాస్తవమని ప్రధాన నిందితుడు ఆవుల ఫణి చెబుతున్నాడు. అరెస్టు సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కాపీ రైట్ కోసం దరఖాస్తు చేశానని, ఇంకా అనుమతులు రాలేదని తెలిపాడు. -
కెవ్వు కేక
ఓరీ వెధవాయ్... చుక్క నెయ్యి లేకుండా తింటున్నావ్... నాయనమ్మ గావు కేక! ఆవకాయ, పప్పు, వేడివేడి అన్నం, ఓ రెండు చెంచాలు నెయ్యి... కేక! వాట్ ఈజ్ దిస్ లైఫ్.. కమాన్.. లెట్స్ ఎంజాయ్.. ఫ్రెండ్స్ కెవ్వు కేక! కేక్స్, పేస్ట్రీ, ఐస్‌క్రీమ్, పీజా, బర్గర్, చిప్స్, ఫ్రైస్... కొవ్వు కేక! కొలెస్ట్రాల్, ఒబేసిటీ, హార్ట్ ప్రాబ్లం, పక్షవాతం, ఫ్యాటీ లివర్.. చా... కేక! డాక్టర్లు, క్లినిక్‌లు, హాస్పిటళ్లు, ఆపరేషన్ థియేటర్లు, ఐసీయూలు, బిల్లులు.. పొలి కేక! ఇక లాభం లేదు. ఈ డౌట్స్ అన్నిటికీ ఒక ఆన్సర్ కావాలి. ఏ కొవ్వు మంచిదో.. ఏ కొవ్వు చెడ్డదో.. ఏ కొవ్వు అవసరమో.. ఏ కొవ్వు వద్దో.. చెప్పే హెచ్చరిక.. ఈ తొలి కేక. సుస్మిత పదహారేళ్ల పిల్ల. వాళ్ల ఉమ్మడి కుటుంబంలో ఆమె ఒక్కతే ఆడపిల్ల. నానమ్మ, తాతయ్య, మేనత్తల దగ్గర్నుంచి పెద్దనాన్న, పెద్దమ్మ, బాబాయ్ పిన్ని దాకా.. అందరికీ గారాల పట్టి. తిండి దగ్గర్నుంచే ఆ గారాబాన్ని మొదలుపెడ్తారు. వెజ్ అయినా నాన్ వెజ్ అయినా అన్నీ ఫ్రై కూరలు, కమ్మటి నెయ్యి, మీగడ పెరుగు, రోజొక రకం స్వీట్ సుస్మిత మెనూలో చేరుస్తారు. ఆ అమ్మాయి మాత్రం వీటన్నిటినీ పక్కను తోసి నూనె లేని పుల్క, నీళ్లకూరతో భోజనం అయిందనిపించేస్తుంది. కారణం.. మోడల్ కావాలనే ఆమె ఆశయం! కానీ సుస్మిత నానమ్మ, తల్లికి మాత్రం ఆ పిల్ల ధోరణి భయం పుట్టిస్తోంది. ‘ఎవరైనా ఉద్యోగం చేసేది బతకడానికే కానీ నువ్వేంటే కడుపు చంపుకొనే ఉద్యోగం కావాలనుకుంటున్నావ్’ అంటూ నానమ్మ అసహనాన్ని వెళ్లగక్కినా వినిపించుకోదు ఆ మనవరాలు. తినడానికి ఏమి ఇచ్చినా ‘అమ్మో ఇది బోలెడంత ఫ్యాట్’ అంటూ మూతి విరిచేస్తుంది. ఆ చేష్టలకు సుస్మిత తల్లి కోపం నషాళానికి అంటుతుంది. సుస్మితకు తోడు వాళ్ల పెద్దనాన్న.. పాలు, పెరుగు, నూనె వస్తువులంటే అమ్మో.. ఫ్యాట్.. కొలెస్ట్రాల్‌ని పెంచేస్తుంది అంటూ ఆమడదూరం పరిగెడుతాడు. మిత్స్ (అపోహలు) ఇలా సుస్మిత, వాళ్ల పెద్దనాన్నే కాదు.. వయసు, పరిజ్ఞానం వంటి భేదాల్లేకుండా చాలామందే ఈ ఫ్యాట్స్ ఫ్యాక్ట్స్ ఏంటో తెలియక పోషకాల ప్రాధాన్యం లేని పదార్థాలతో పొట్టనింపుకుంటున్నారు. ఫ్యాట్స్ మిత్స్లో పడిపోయి అదే నిజమనే మిథ్యలో ఉంటున్నారు. కొవ్వులు పెరుగుతాయనే అపోహతో నెయ్యి, నూనెలను పూర్తిగా తగ్గించేసుకుంటున్నారు. మరికొంతమందైతే కొన్ని నూనె కంపెనీలు తమది కొలెస్ట్రాల్ ఫ్రీ ఆయిల్ అన్న ప్రచారాన్ని నమ్మి ఆ కంపెనీ నూనెలను మాత్రమే ఉపయోగిస్తున్నారు. ఇవన్నీ తప్పే! అసలు మన దేశంలో వాడే నూనెల్లో దేంట్లోనూ కొలెస్ట్రాల్ ఉండదు. కొలెస్ట్రాల్ అన్నది మొక్కల (వెజిటెబుల్ కింగ్డమ్)నుంచి రాదు. మన నూనెలన్నీ సీడ్స్ నుంచే తయ్యారయ్యేవే. అన్ని నూనెలూ కొలెస్ట్రాల్ఫ్రీయే! కాబట్టి సదరు కంపెనీల ప్రచారాన్ని నమ్మి సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరంలేదు. కొవ్వులు.. నిజాలు ఫ్యాట్స్ అన్నీ హానికరం కాదు. మన శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తూ వైటల్ ఆర్గాన్స్‌ను సంరక్షించే రక్తనాళాలు, మెదడు, చర్మకణాలకు ఫ్యాట్స్ చాలా అవసరం. మనం తీసుకునే ఆహారానికి రుచినీ కల్పిస్తాయి. శరీరానికి శక్తినిస్తాయి. ఫ్యాట్స్ స్లిమ్‌గా ఉండడానికీ తోడ్పడుతాయి. ఉదాహరణకు అన్నంలో నెయ్యి వేసుకొని తింటే.. అది ఆహారం పైన ఓ పొరలా మారి ఆహారం నెమ్మదిగా జీర్ణమయ్యేలా చేస్తుంది. దీనివల్ల త్వరగా ఆకలి కాదు. తక్కువ ఆహారం తీసుకోవడం వల్ల ఒళ్లూ పెరగదు. పైగా నెయ్యితో ఆహారాన్ని తినడం వల్ల సెటైటీ (ఆహారం తిన్న సంతృప్తి భావన) త్వరగా కలుగుతుంది. దీనివల్లా తినే పరిమాణం తగ్గుతుంది. ఆశ్చర్యంగా అనిపించినా ఇది వాస్తవం. ఏమేమి.. ఎంత అవసరం... మనిషికి మోనో - అన్ సాచ్యురేటెడ్, పాలీ - అన్సాచ్యురేటెడ్, సాచ్యురేటెడ్యాసిడ్స్, ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్ అనే నాలుగు రకాల ఫ్యాటీ యాసిడ్స్ అవసరం. వీటిలో మోనో -అన్సాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ (మ్యూఫా) , పాలీ - అన్సాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ (ప్యూఫా) ఆరోగ్యకరమైనవి. వీటిని మార్చిమార్చి వాడటం వల్ల గుండెకు కొవ్వులు చేరకుండా గార్డుడ్యూటీ చేస్తుంటాయి. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ (ఎల్డిఎల్.. లో డెన్సిటీ లైపో ప్రొటీన్) పెరగకుండా చేస్తాయి. తగు మోతాదులో సాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్... అంటే నెయ్యి వంటివి కూడా అవసరమే. అలాగే ఓమేగా -3 ఫ్యాటీ యాసిడ్సూ శరీరానికి కావాలి. ఎందుకంటే వాటిని మన శరీరం తయారు చేసుకోలేదు. పైగా ఎ, డి, ఇ అనే విటమిన్లను మన శరీరం గ్రహించడానికి ఈ ఫ్యాటీ యాసిడ్స్ ఎంతగానో తోడ్పడతాయి. పై విటమిన్లు కేవలం కొవ్వుల్లోనే కరుగుతాయి. కంటికి ఎ విటమిన్, పూర్తి వ్యాధి నిరోధక శక్తికి డి విటమిన్, సంతాన సాఫల్యానికి ఇ విటమిన్ ఎంత దోహదం చేస్తాయో చెప్పనవసరం లేదు. అలాంటి విటమిన్లను శరీరంలోకి ఇంకేలా చేసేవి ఈ కొవ్వులే! అయితే ఈ ఫ్యాట్స్ అన్నీ హై ఎనర్జీనిస్తాయి. సాచ్యురేటెడ్ అయినా, అన్సాచ్యురేటెడ్ అయినా ఒక గ్రామ్ ఫ్యాట్ 9 క్యాలరీల శక్తినిస్తుంది. కాబట్టి ఏ ఫ్యాట్స్ అయినా అవి శరీరంలో నిల్వ ఉండనంత వరకు... అంటే మనం ఉండాల్సినదాని కన్నా ఎక్కువ బరువు ఉండనంత వరకు మాత్రమే తీసుకోవాలి. - సాక్షి ఫీచర్స్ ప్రతినిధి పరిమితి అవసరం ఎలాగూ కొవ్వు పదార్థాలు అవసరం కదా అని అదేపనిగానూ, ఆహారంలో రుచిపెంచడం కోసమూ కొవ్వుల్ని ఎక్కువ మోతాదుల్లో తీసుకోకూడదు. అలాగని పూర్తిగా నివారించకూడదు. పరిమితిలో తీసుకోవడం వల్ల కొవ్వులతోనూ ఆరోగ్యం చేకూరుతుంది. ఆ పరిమితి ఏమిటంటే... ప్రతి వ్యక్తి నెలకు అరలీటర్ (500 ఎమ్ఎల్) నుంచి ముప్పావు లీటర్ (750 ఎమ్ఎల్) వరకునూనె వాడాలి. అంతకు మించితే ఆరోగ్యానికి చేటే. మధుమేహం, గుండెజబ్బులు, రక్తపోటు వంటి వ్యాధులు ఉన్నవారైతే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కొలతను మించనివ్వకూడదు. ఇంత కచ్చితంగా ఎలా పాటించాలి అంటే.. ఒక టీస్పూన్లో 5 ఎమ్ఎల్ నూనె పడుతుంది. ప్రతి వ్యక్తి రోజూ 3 టీ స్పూన్ల నూనె వాడితే అది నెలకు 450 ఎమ్ఎల్ అవుతుంది. మరో 50 ఎమ్ఎల్ను అదనం. ఆ లెక్కన ప్రతి వ్యక్తికి రోజూ మూడు నుంచి నాలుగు చెంచాల నూనె చాలు. ఇంతకు మించి వాడకూడదనే నియమం పెట్టుకోవాలి. కృత్రిమ కొవ్వు దీనికి ఉదాహరణ.. మార్జరిన్. ఆహారపదార్థాలు ఎక్కువ కాలం నిల్వ ఉండడానికి దీన్ని ఉపయోగిస్తారు. ఇలాంటి కృత్రిమ కొవ్వు పదార్థాలను ట్రాన్స్‌ఫ్యాట్స్ అని కూడా అంటారు. ఇది చాలా ప్రమాదకరమని పరిశోధకులు చెబుతున్నారు. గుండెకు ఎందుకు మంచిది? ఎందుకు చెడ్డది? ఎల్డీఎల్ కొవ్వు పదార్థాలు రక్తనాళాల్లో గారలాగా (ప్లాక్) ఏర్పడి, రక్తప్రవాహంలో అడ్డంకులు ఏర్పరుస్తాయి. గుండెకూ, మెదడుకు అందాల్సిన రక్తప్రవాహానికి అడ్డుపడితే గుండెపోటుకు, పక్షవాతానికి దారితీస్తాయి. హెచ్‌డీఎల్ ఆ గారను తొలగిస్తూ ఉంటుంది. కాబట్టి రక్తంలో హెచ్‌డీఎల్ పాళ్లు 40కి పైగా ఉంటేనే ఆరోగ్యం. ఎల్డీఎల్ పాళ్లు 100 లోపు ఉంటే మంచిది. ఏయే నూనెల్లో ఏ ఫ్యాట్స్ ఎక్కువ? నూనెలు ఫ్యాట్స్ వేరుశనగ, ఆలివ్ మోనో - అన్సాచ్యురేటెడ్ సఫోలా, సన్‌ఫ్లవర్, అవొకాడో పాలీ - అన్సాచ్యురేటెడ్ నెయ్యి, డాల్డా సాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ చేప, సోయాబీన్, ఆవనూనె ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్ ఏయే పదార్థాల్లో ఎంతెంత ఫ్యాట్స్ పదార్థం(గ్రాముల్లో) ఫ్యాట్స్ 100 గ్రా. పాలు (స్కిమ్డ్) 1 గ్రాము 100 గ్రా. పన్నీర్ 6.5 గ్రాములు 100 గ్రా. సోయాబీన్ 19.5 గ్రాములు ఉడికించిన కోడిగుడ్డు 7 గ్రాములు ప్రై చేసిన గుడ్డు 14 గ్రాములు 100 గ్రా. చీజ్ 25.1 గ్రాములు 100 గ్రా. ఐస్‌క్రీమ్ (వెనీల) 11 గ్రాములు 100 గ్రా. బాదాం 58.9 గ్రాములు 100 గ్రా. జీడిపప్పు 46.9 గ్రాములు 100 గ్రా. వేరుశనగలు 40.1 గ్రాములు 100 గ్రా. మిక్స్డ్ నట్స్ (వేయించిన) 54 గ్రాములు 100 గ్రా డార్క్ చాక్లెట్స్ 31 గ్రాములు 100 గ్రా. పిజా 10 గ్రాములు 85 గ్రా. చేప (వెన్నలో వేయించినది) 12 గ్రాములు ఎలా, ఎందుకు తీసుకోవాలి..? మోనో అన్సాచ్యురేటెడ్, పాలీ అన్సాచ్యురేటెడ్, ఒమేగా - 3 ఫ్యాటీ యాసిడ్స్‌తోపాటు అతి తక్కువ మోతాదులో సాచ్యురేటెడ్ ఆయిల్స్ అందేలా నూనెల కాంబినేషన్స్ మారుస్తూ తీసుకుంటే మంచిది. ఈ నూనెల వల్ల వచ్చే కొవ్వులు బయటి వేడిమి, చల్లదనం నుంచి కాపాడుతాయి. మూత్రపిండాలు, కాలేయం, గుండె వంటివాటికి ప్యాడింగ్గా ఉంటాయి. కాని అదే నూనెలను అంటే ఒక్కరు రోజుకు 25 గ్రాముల కంటే ఎక్కువగా వాడితే.. ఆ కొవ్వు శరీరంలో పేరుకుపోతే.. స్థూలకాయం, గుండెజబ్బులు, డయాబెటిస్, ఆర్థరైటిస్, అధిక రక్తపోటు వంటి వ్యాధులకు దారితీసే ప్రమాదం ఉంది. శాకాహారులైతే వాళ్లు ఉపయోగించే నూనెలతోపాటు తప్పనిసరిగా సోయాబిన్నూనె లేదా ఆవనూనె వాడాలి. మాంసాహారులైతే వారానికి కనీసం మూడు సార్లు చేపలను తీసుకోవడం మంచిది. వ్యక్తి వ్యక్తికీ మారే కొవ్వు పాళ్లు ఒక వ్యక్తి ఎంత కొవ్వు తీసుకోవాలన్న అంశం వారి వ్యక్తిగత బీఎమ్ఐ (బాడీ మాస్ ఇండెక్స్) మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఆహారంతో తీసుకోవలసిన కొవ్వు పాళ్లు వ్యక్తి నుంచి వ్యక్తికి మారతాయి. కాబట్టి న్యూట్రిషనిస్ట్‌ను సంప్రదించి ఆహారం తీసుకుంటేనే మేలైన ఆరోగ్యం. - మధురిమా సిన్హా, చీఫ్ న్యూట్రిషనిస్ట్, కేర్ హాస్పిటల్స్ -
తిరుచానూరు ఆలయంలో నెయ్యి గోల్మాల్!
తిరుపతి: తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో నెయ్యి గోల్మాల్ వ్యవహారం బుధవారం వెలుగుచూసింది. 110 డబ్బాల నెయ్యి మాయమైనట్టు తెలుస్తోంది. నెయ్యి విలువ రూ. 10లక్షల విలువ పైనా ఉంటుందని అంచనా. అయితే ఈ విషయంలో టీటీడీ ట్రాన్స్పోర్ట్, ఆలయ స్టోర్ సిబ్బంది అస్తమున్నట్టు పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రెండు నెలల నుంచి టీటీడీలో ఈ తరహా అక్రమాలు చోటుచేసుకున్నట్టు సమాచారం. దీనిపై టీటీడీ విజిలెన్స్ అంతర్గత విచారణ చేపట్టింది. -
శాకారుణ్యాహారం...
అక్టోబర్-1శాకాహార దినోత్సవం ఇటీవల ఆరోగ్యరీత్యా కొందరు... జీవకారుణ్య దృష్టితో చాలా మంది ఇప్పుడు శాకాహారాన్ని స్వీకరించడమే కాదు... దాని ప్రాధాన్యాన్ని ప్రచారం చేస్తున్నారు. శాకాహారంలోనూ ఎన్నో తేడాలు చాలామంది కూరగాయలు, ఆకుకూరలు తినడంతో పాటు జంతువుల నుంచి వచ్చే ఉత్సాదనలైన పాలు, పెరుగు, వెన్న, నెయ్యి వంటి వాటిని తీసుకుంటారు. మొదటి నుంచి అమల్లో ఉన్న సాంస్కృతిక ఆహారపు అలవాట్ల కారణంగా వారు తమను తాము శాకాహారులుగానే పరిగణిస్తారు. శాకాహారం తీసుకుంటూ, జంతు ఉత్పాదనలైన పాలు, పెరుగు వాడేవారిని ‘లాక్టో వెజిటేరియన్స్’గా పరిగణిస్తారు. ఇక మరికొందరు ఇటీవల లభ్యమయ్యే గుడ్లలో పొదిగిస్తే ఎదిగే పిండం ఉండదు కాబట్టి వాటిని శాకాహారంగా పరిగణిస్తారు. వీరిని ‘లాక్టో-ఓవో వెజిటేరియన్స్’గా పిలుస్తారు. అయితే మొదటి నుంచీ ఉన్న సాంస్కృతిక అలవాటు కారణంగా కొందరు పిండం లేని గుడ్డును కూడా మాంసాహారంగానే పరిగణిస్తారు. ఇక మరికొందరు చేపలను పూర్తిగా శాకాహారంగా పరిగణిస్తారుగానీ... మిగతా జీవరాశులను మాంసాహారంగా చూస్తారు. ఇక మరికొందరైతే పాలు, పెరుగు, గుడ్లు... ఇలా జంతుసంబంధమైన ఏ ఉత్పాదననైనా మాంసాహారంగానే పరిగణిస్తారు. వీరు జంతు ఉత్పాదనలు ఏవైనా సరే వాటిని ఆహారంగా తీసుకోరు. ఇలాంటి వారిని ‘వేగన్స్’ అని అంటారు. వీరు తీసుకునే శుద్ధశాకాహారాన్ని వైగన్ డైట్ అంటారు. ఈ వేగన్ డైట్ తీసుకునే వారు ఎంత కఠినంగా ఉంటారంటే... తేనెను తేనెటీగలు తయారు చేస్తాయి కాబట్టి మకరందం వాటి ఆహారం కాబట్టి తేనెను కూడా జంతుసంబంధమైన ఉత్పత్తిగానే పరిగణించి శాకాహారంలో దానికి స్థానమివ్వరు. ఫ్లెక్సిటేరియన్ డైట్ : పై కారణాల వల్ల ఫలానాదే నిర్దిష్టంగా శాకాహారంగా చెప్పడం కష్టం. దాంతో చాలామంది జీవకారుణ్యంతో జంతువుల ప్రాణాలకు గాని లేదా వాటి ఉనికికి గాని ఎలాంటి హానీ లేకుండా వచ్చే జంతు ఉత్పాదనలను ఆహారంగా స్వీకరిస్తూ, వాటిని చంపి మాంసం తీసుకోవడాన్నే వ్యతిరేకిస్తారు. అందుకే వీళ్లు తీసుకునే ఆహారాన్ని ‘ఫ్లెక్సిటేరియన్ డైట్’గా పేర్కొంటారు. వాదనలు ఎలా ఉన్నాప్పటికీ ఆహారం పట్ల అభిరుచి అన్నది వ్యక్తిగత అంశంగా కొందరు ఇలాంటి వివాదాల జోలికి వెళ్లరు. తేనెను కూడా వ్యతిరేకించేంత వేగనిజమ్ను కలిగి ఉండటమూ తప్పేననీ, అలాగే జీవహింసనూ చేయడమూ సరికాదనేది ఫ్లెక్సిటేరియన్స్ దృక్పథం. మాంసాహారంతో అనర్థాలెన్నో... శాకాహారాన్ని నిర్వచించే తీరుతెన్నులు ఎన్ని ఉన్నా... మనం సాధారణంగా శాకాహారంగా పరిగణించే ఆకుకూరలు, కూరగాయలు, పాలు, పండ్లతో సమకూరే ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువే. మాంసాహారంతో మన శరీరంలోకి కొన్ని అవాంఛిత సూక్ష్మజీవులు చేరే అవకాశాలున్నాయి. ఉదాహరణకు సరిగా ఉడకని పోర్క్ తినేవారిలో ‘టేప్ వార్మ్స్’ పెరుగుతాయి. సీఫుడ్స్‌తో అలర్జీలు ఎక్కువే ఉంటాయి. మాంసాహారంలోని అధిక కొవ్వుల వల్ల కొలెస్ట్రాల్ స్థాయులు పెరిగి గుండెజబ్బులు, పక్షవాతం, హైబీపీ వంటి వాటికి దారితీస్తున్నాయి. మాంసాహారం జీర్ణమయ్యేందుకు పట్టే సమయం ఎక్కువ. మాంసాహారాన్ని జీర్ణం చేయడానికి అవసరమైన హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉత్పాదన పెరగడం వల్ల అల్సర్లు వచ్చే అవకాశాలు ఎక్కువ. శాకాహారంతో చేకూరే ప్రయోజనాలెన్నో ... శాకాహారం తీసుకునే వారికి అనేక ఆరోగ్యకరమైన ప్రయోనాలు చేకూరుతాయి. వాటిలో కొన్ని... శాకాహారం మన శరీరంలో పేరుకునే చాలా విషపదార్థాలను స్వాభావికంగా బయటకు పంపుతుంది. అందుకే వీటిని ‘డీ-టాక్స్’ డైట్ అని కూడా చెబుతుంటారు. శాకాహారంలో పీచుపదార్థాలు (డయటరీ ఫైబర్) ఎక్కువ. దాంతో అది తేలిగ్గా జీర్ణమవుతుంది. కొలోన్ క్యాన్సరు నివారితమవుతాయి. శాకాహారంలోని పీచు వల్ల మొలలు, స్థూలకాయం, డయాబెటిస్, మలబద్దకం, హయటస్ హెర్నియా, డైవర్టిక్యులైటిస్, ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్, పిత్తాశయంలో రాళ్లు వంటి అనేక వ్యాధుల నివారణ సాధ్యం. దీంతో లభ్యమయ్యే ఫోలేట్స్, ఫైటోన్యూట్రియెంట్స్, యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల చర్మానికి ఎప్పటికప్పుడు మంచి పోషణ, విటమిన్స్ లభిస్తాయి కాబట్టి వాళ్లలో మేని మెరుపు చాలా బాగుంటుంది. శాకాహారంతో తేలిగ్గా బరువును నియంత్రించుకోవచ్చు. ఫలితంగా బీపీ నియంత్రణలో ఉండటం, గుండెజబ్బులకు ఆస్కారం లేకపోవడం వంటివి ప్రయోజనాలు చేకూరతాయి. ఆకుకూరలు, పండ్లలో కాపర్, మెగ్నీషియమ్ వంటి ఖనిజాలు, లవణాలు ఉంటాయి. ఆరోగ్యానికి మేలు చేసే ఫ్లేవనాయిడ్స్ లభిస్తాయి. అంతా మేలేనా... మరి పరిమితులు లేవా? శాకాహారం వల్ల అంతా మేలేననీ, పరిమితులేవీ లేవని చెప్పడం కూడా వైద్యశాస్త్రపరంగా సరికాదు. అయితే వాటిని కొన్ని శాకాహార ప్రత్యామ్నాయాలతో అధిగమించవచ్చు. ఉదా: ప్రోటీన్లు : శాకాహారం కంటే మాంసాహారంలో ప్రోటీన్లు ఎక్కువ. అయితే మాంసాహారం నుంచి దూరంగా ఉండి కేవలం శాకాహారంతోనే ప్రోటీన్లు పొందడం కూడా సాధ్యమే. అందుకోసం చిక్కుళ్లు, సోయా ఉత్పాదనలు బాగా ఉపకరిస్తాయి. శాకాహారం ద్వారానే ప్రొటీన్ కోరుకునేవారు తమ ఆహారంలో ఈ కింది పదార్ధాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. అవి: గుమ్మడి గింజలు బ్లాక్ బీన్స్ సోయామిల్క్ పీనట్ బటర్ బాదం రాజ్మా క్యాల్షియమ్ : యుక్తవయసులో ఉన్నవారు మొదలుకొని యాభైలలో పడ్డ వారి వరకూ... ప్రతి ఒక్కరికీ ఎముకల ఆరోగ్యం, పటిష్టత, నిర్వహణ కోసం క్యాల్షియమ్ పుష్కలంగా అందాలి. సాధారణంగా పాల ఉత్పాదనల్లో క్యాల్షియమ్ ఎక్కువ. కానీ వెజిటేరియనిజమ్ కారణాలతో క్యాల్షియమ్‌ను శాకాహారం నుంచి పొందాలనుకుంటే ఆకుకూరలైన పాలకూర వంటివీ, బ్రకోలీ, పొద్దుతిరుగుడు గింజలు, సోయా మిల్స్ ఉత్పాదనలను రోజూ తీసుకోవాలి. విటమిన్ డి : మన శరీరంలోకి క్యాల్షియమ్ చక్కగా ఇంకిపోవాలంటే విటమిన్-డి అవసరం. ఇది పాల ఉత్పాదన్లో, సూర్యకాంతిలో లభ్యమవుతుంది. సాధారణ ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరికీ ప్రతిరోజూ 2000 ఇంటర్నేషనల్ యూనిట్స్ (ఐయూ)ల విటమిన్-డి అవసరం. ఒకవేళ జంతువుల నుంచి కాకుండా కేవలం శాకాహారం నుంచి మాత్రమే లభ్యం కావాలనుకుంటే సోయా మిల్క్ ఉత్పాదనలు వాటిని భర్తీ చేస్తాయి. ఐరన్ : మనలో రక్తహీనత రాకుండా ఉండటానికి ఐరన్ చాలా అవసరం. ఇది మాంసాహారంలో తక్షణం లభిస్తుంది. అయితే శాకాహారం ద్వారానే ఇది లభ్యం కావాలంటే ముదురు ఆకుపచ్చరంగులో ఉండే ఆకుకూరలు (పాలకూర, బ్రకోలీ), డ్రైఫ్రూట్స్, గుమ్మడి గింజలు, నువ్వులు, సోయాబిన్ నట్స్ వంటివి పుష్కలంగా తీసుకోవాలి. విటమిన్-సి ఎక్కువగా ఉండే నిమ్మజాతి పండ్లు టమాటాలు తినడం వల్ల కూడా ఐరన్ తేలిగ్గా శరీరంలోకి ఇంకుతుంది. విటమిన్ బి12 : ఇది మాంసాహారంలోనే పుష్కలంగా లభిస్తుంది. ఆ తర్వాత పాలలో అధికంగా ఉంటుంది. ఇక శాకాహారం నుంచే దీన్ని తీసుకోవాలంటే సోయామీల్ వంటి వాటిపై ఆధారపడాలి. దీని లోపం వల్ల మెదడు నరాల నుంచి అవయవాలకు ఆదేశాలు అందడంలో ఆటంకాలు, స్పృహతప్పడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ఎండలో తగినంతగా తిరగకుండా ఇన్‌డోర్స్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తూ, కేవలం శాకాహారాన్ని మాత్రమే తీసుకునే వారిలో విటమిన్-డి, విటమిన్-బి12 లోపంతో వచ్చే నరాల సమస్యలు ఇటీవల చాలా పెరిగాయి. అందుకే కేవలం వెజిటేరియన్ ఆహారంపైనే ఆధారపడే వారు, విటమిన్-డి, విటమిన్-బి12, ఐరన్ వంటి కీలకమైన పోషకాల కోసం ప్రత్యామ్నాయాలపై మరింత ఎక్కువ దృష్టిపెట్టాలి. ఇలా ప్రత్యామ్నాయ ఆహారం ద్వారా జంతువుల నుంచి లభ్యమయ్యే వాటిని శాకాహారంతోనే పొంది జీవహింసను నివారించడంలోని తృప్తినీ, ఆరోగ్యాన్నీ ఏకకాలంలో పొందవచ్చు. -
టీటీడీలో నిండుకుంటున్న నెయ్యి
కేవలం 50 రోజులకు సరిపడా నిల్వ నిత్యం 10 టన్నులు అవసరం కొనుగోళ్లపై దృష్టిపెట్టని టీటీడీ తిరుపతి సిటీ: టీటీడీలో నెయ్యి నిల్వలు నిండుకుంటున్నాయి. ప్రస్తుతం మార్కెటింగ్ విభాగం వద్ద టీటీడీ అవసరాలకు కేవలం 50 రోజులకు సరిపడా నెయ్యి మాత్రమే నిల్వ ఉంది. కొనుగోళ్లపై దృష్టి పెట్టాల్సిన అధికారులు కాలయాపన చేస్తున్నారు. గత ఏడాది ఇ-ప్రొక్యూర్మెంట్ ద్వారా 33 లక్షల కిలోల నెయ్యిని కిలో రూ.273.95 చొప్పున కొనుగోలు చేశారు. అప్పట్లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బరేలికి చెందిన ప్రీమియర్ అగ్రీఫుడ్స్ ప్రైవేటు లిమిటెడ్ వారు టెండర్‌ను దక్కించుకున్నారు. ఆగ్మార్క్ కలిగిన స్వచ్ఛమైన ఆవు నెయ్యిని సరఫరా చేయాలనే నిబంధన ఉంది. అయితే కొనుగోలుదారులు పోటీపడి మరీ తక్కువ ధరకు కోట్ చేయడంతో సరైన క్వాలిటీ ఇవ్వడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. నాలుగు మాసాల క్రితం ప్రసాదాల తయారీకి వినియోగించే సమయంలో చెడిపోయినట్లు గుర్తించిన 300 కిలోల నెయ్యిని సదరు కాంట్రాక్టర్‌కు వెనక్కి పంపించారు. ప్రస్తుతం టీటీడీ శ్రీవారి ఆలయంతోపాటు స్థానిక ఆలయాలకు ప్రసాదాల తయారీతోపాటు స్వామివారి కైంకర్యాలకు కలిపి నిత్యం 10 టన్నుల నెయ్యిని వినియోగిస్తున్నారు. కాగా, ఇంతకుమునుపు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి టీటీడీ అధికారులు నెయ్యి కొనుగోలు చేసేవారు. దగ్గరలో అందుబాటులో ఉన్న వాటిని వదులుకుని దూర ప్రాంతం నుంచి కొనుగోలు చేయడంపై గతంలో టీటీడీ అధికారులపై విమర్శలు వచ్చాయి. ఇంకో యాభై రోజుల్లో నెయ్యి నిల్వలు అయిపోనున్నాయి. పైగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు వస్తుండడంతో వీలైనంత త్వరగా నెయ్యి కొనుగోలు చేయకపోతే ఇబ్బందులు తప్పవనే విషయాన్ని అధికారులు గుర్తించి కొనుగోళ్లకు వెంటనే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఫైలు ఈవో గారికెళ్లింది నెయ్యి కొనుగోలుకు సంబంధించిన ఇ-ప్రొక్యూర్మెంట్ ఫైలు ఈవోగారి దగ్గరకు వెళ్లింది. వీలైనంత త్వరలో కొనుగోలు ప్రక్రియను ప్రారంభిస్తాం. గతంలో రెండు సంస్థలు ఇ-ప్రొక్యూర్మెంట్లో పాల్గొన్నాయి. -శ్రీనివాసరావు, మార్కెటింగ్ అధికారి, టీటీడీ -
మొదలైందా నెలసరి...ఈ ఆహారం సరి..!
పాప రజస్వల అయ్యింది. ఆ అమ్మాయికి ఇప్పుడు ఎలాంటి ఆహారం ఇవ్వాలో అంటూ అమ్మకు టెన్షన్. ఇకపై నెలనెలా రుతుస్రావం అవుతుంటుంది. అమ్మాయి రక్తం కోల్పోతూ ఉంటుంది. నెత్తురు భర్తీ అవ్వాలి కాబట్టి ఎప్పుడూ తినేదానికంటే ఎక్కువే తినిపించమంటారు పొరుగువారు. ఆ మాట నిజమేనా? మరి అమ్మాయి సరిగా తినడం లేదే? ఏం చేయాలి. ఎటూ పాలుపోని ఈ పరిస్థితిపై అయోమయాలు తొలగిపోవాలంటే ఈ కథనం చదవండి. అమ్మాయి ఆరోగ్యాన్ని పరిరక్షించండి. పొరుగువారి మాటల్లో నిజమెంత? రుతుస్రావం సమయంలో నెత్తురు ఎక్కువగా పోతుంటుంది కాబట్టి ఆహారం ఎక్కువ మోతాదులో పెట్టాలని పొరుగువారు, ఫ్రెండ్స్ చెబుతుంటారు. అది నిజం కాదు. ఈ సమయంలోనే అమ్మాయిలు తాము తీసుకునే క్యాలరీల వల్ల బరువు పెరుగుతుంటారు. అందుకే ఆహారం ఎక్కువగా తీసుకోవడం కంటే... ఎప్పటిలాగే తీసుకుంటూ అదనంగా ఇక్కడ పేర్కొన్న ఎక్కువగా తీసుకోవాల్సిన పదార్థాలు తీసుకోవాలి. కొత్తగా రుతుస్రావం మొదలైన వారికి కొబ్బరి, బెల్లం పెట్టాలంటారు. సంప్రదాయకంగా పెద్దలు చెప్పే ఆ ఆహారం పెట్టినా పరవాలేదు. అయితే కొబ్బరిలోనూ, నువ్వుల్లోనూ కొవ్వు పాళ్లు ఎక్కువ కాబట్టి కాస్తంత పరిమితి పాటిస్తే మంచిది. నెయ్యికి బదులు వెన్న వాడాలి. ఎందుకంటే వెన్న కాచి నెయ్యి చేశాక అందులో కొన్ని పోషకాలు తగ్గుతాయి. అందుకే ఒక స్టెప్ ముందుగానే వాటిని తీసుకుంటే కొవ్వులో జీర్ణమయ్యే విటమిన్లను ఒంటబట్టించుకునేందుకు వెన్న దోహదం చేస్తుంది. ఎక్కువగా తీసుకోవాల్సినవి... మీరు శాకాహారులైతే... మీ రోజువారీ ఆహారం తోపాటు తాజాగా ఉండే ఆకుపచ్చటి ఆకుకూరలు (గ్రీన్‌లీఫీ వెజిటబుల్స్), ఎండుఖర్జూరం, నువ్వులు, బెల్లం (బెల్లం, నువ్వులు ఉండే నువ్వుల జీళ్లు, బెల్లం, వేయించిన వేరుశనగలు ఉండే పల్లీపట్టీ కూడా మంచివే), గసగసాలు, అటుకులు ఎక్కువగా ఉండేలా చూడండి. మీరు మాంసాహారులైతే... మీ రోజువారీ ఆహారాన్నే తీసుకోండి. దాంతోపాటు మీ ఆహారంలో వేటమాంసం, చేపలు, చికెన్‌తో పాటు... మాంసాహారంలో లివర్‌ను ప్రత్యేకంగా ఇవ్వండి. మాంసాహారులైనా, శాకాహారులైనా... కోడిగుడ్డు, పాలు తప్పనిసరిగా రోజూ ఇవ్వండి. కోడిగుడ్డులో పచ్చసొన వద్దనే అపోహను తొలగించుకుని, దాన్ని అమ్మాయికి తప్పక ఇవ్వండి. ఎందుకంటే ఈ వయసులో వారు అది తీసుకోవడం వల్ల పచ్చసొన కారణంగా వచ్చే హానికరమైన కొలెస్ట్రాల్ కంటే, ఒకవేళ వారు గుడ్డు తీసుకోకపోతే కోల్పోయే పోషకాలే ఎక్కువ. ఇకపై ప్రతినెలా రక్తం కోల్పోతుండటం వల్ల హిమోగ్లోబిన్ కౌంట్ తగ్గుతుంది. అందుకే రక్తహీనత రాకుండా ఐరన్‌ను భర్తీ చేయాల్సిన అవసరం ఉండటం వల్ల పై ఆహారాన్ని నిపుణులు సిఫార్సు చేస్తుంటారు. మాంసాహారం, శాకాహారం ఈ రెండింటిలోనూ ఐరన్ ఉన్నప్పటికీ మాంసాహారంలో హీమ్ ఐరన్ ఉంటుంది. అంటే... అది తిన్నవెంటనే ఒంటికి పడుతుంది. అదే శాకాహార పదార్థాల్లోని నాన్ హీమ్ ఐరన్ మన ఒంటికి పట్టాలంటే, అదనంగా విటమిన్-సి కావాలి. కాబట్టి ఐరన్ ఉండే శాకాహార పదార్థాలతో పాటు విటమిన్-సి ఉండే తాజా పండ్లు... జామ, నిమ్మ, నారింజ వంటివి ఎక్కువగా తీసుకోవాలి. ద్రవాహారం... రుతుస్రావం అవుతున్న సమయంలో ద్రవాహారం పుష్కలంగా లభించేలా ఎక్కువ నీళ్లు తాగుతూ, కొబ్బరినీళ్లు తీసుకోవడం కూడా మంచిదే. పరిమితంగా మాత్రమే తీసుకోవలసినవి... ఉప్పు ఎక్కువగా ఉండే పచ్చళ్లు, అప్పడాలు వంటివాటినీ, కొవ్వులు ఉండే ఆహారాలను పరిమితంగా మాత్రమే తీసుకోవాలి. కెఫిన్ ఎక్కువగా ఉండే కాఫీ చాలా పరిమితంగా తీసుకోవాలి. వ్యాయామం... అన్నిటికంటే ముఖ్యంగా ఆ సమయంలోనూ తేలికపాటి వ్యాయామం చేయడం అవసరమని గుర్తుంచుకోండి. అస్సలు తీసుకోకూడనివి... బేకరీ ఐటమ్స్ అయిన చిప్స్, ఫ్రెంచ్‌ఫ్రైస్, బర్గర్లు, పిజ్జాల వంటి జంక్‌ఫుడ్‌తో పాటు కెఫిన్ పాళ్లు ఎక్కువగా ఉండే కూల్‌డ్రింక్స్ అస్సలు తీసుకోకూడదు. నిర్వహణ: యాసీన్