మాములుగా శరీరానికి తగు మోతాదులో నెయ్యి అవసరం. శరీరానికి కావాల్సిన మంచి కొలస్ట్రాల్ నెయ్యి అని కూడా నిపుణులు చెబుతున్న సంగతి తెలిసిందే. ఇది జ్ఞాపకశక్తిని, జీర్ణశక్తిని పెంచడమే గాక రోగనిరోధక శక్తిని మెరుగ్గా ఉంచుతుంది. అలాంటి నెయ్యి మొక్కల సంరక్షణ కోసం వినియోగిస్తారని విన్నారా?. ఈ నెయ్యి వల్ల మొక్కల కుండీల్లో నేల సారవంతమై మొక్క ఆరోగ్యంగా పెరిగేలా చేయడమే కాకుండా పురుగు, పుట్ర వంటివి దరిచేరనివ్వదని చెబుతున్నారు అగ్రికల్చర్ పరిశోధకులు. ఇంతకీ మొక్కలకు నెయ్యి వల్ల కలిగే ప్రయోజనాలేంటి? ఎలా వినియోగించాలి వంటివి తెలుసుకుందామా!.
►నెయ్యిలో కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉన్నందున , దానిని పెరుగుతున్న నేలలో వేయడం వల్ల సేంద్రీయ కూర్పు పెరుగుతుంది . దీన్ని మెక్క పెరుగుతున్న భాగంలో వేసి ఆ తర్వాత నీళ్లు పోసి వృద్ధి చెందేలా చూడాలి.
► అఫిడ్స్ స్లగ్‌లు కాండం, ఆకులపై దాడి చేయకుండా ఈ నెయ్యి రక్షిస్తుంది. దాని కుండే మృదు స్వభావానికి అవి దాడి చేయడం కష్టమవుతుంది. అలాగే ఇబ్బందికరమైన తెగుళ్ల నుంచి రక్షించుకోవడానికి నెయ్యి గొప్ప ప్రత్యామ్నాయం.
► దూదిపై 3-4 చుక్కల కరిగించిన నెయ్యి వేసి, తెగులు సోకిన మొక్క కాండం,ఆకులను తుడిస్తే..అఫిడ్స్, స్లగ్స్ పైకి రావు. నెయ్యిలోని కొవ్వులు నేలకు ఉపయోగపడే సూక్ష్మజీవులకు ఆహార వనరును అందిస్తాయి. మొక్క పెరుగుతున్న నేలలో సేంద్రీయ పదార్థం సమృద్ధిగా ఉండేలా చేస్తుంది. దీంతో మొక్క బాగా పెరగడమే గాక పచ్చగా పెరగడానికి సహాయపడుతుంది.
►ఇలా ప్రతి రెండు నుంచి మూడు నెలలకు చొప్పున రెండు నుంచి మూడు టీస్పూన్‌ల నెయ్యిని వేస్తే చాలు మంచి ఫలితాలు ఉంటాయి.
►రబ్బరు మొక్క వంటి పెద్ద ఆకులు కలిగిన మొక్కలకు నెయ్యితో మంచి ప్రయోజనం ఉంటుంది. తడిగా ఉన్న కాటన్ వస్త్రాన్ని ఉపయోగించి వాటి ఆకులను శుభ్రం చేయండి. పూర్తయిన తర్వాత, ఒక దూదీలో 4 నుంచి 5 చుక్కల కరిగించిన నెయ్యి వేసి, ఆకులను తుడవండి. ఇది ఆకులను మెరిసేలా చేయడమే కాకుండా కొవ్వు పొరను కూడా జోడిస్తుంది.
గమనిక: నెయ్యి అప్లై చేసిన తర్వాత ఎక్కువ ధూళిని ఆకర్షిస్తుంది కాబట్టి 3-4 రోజుల తర్వాత మళ్లీ ఆకులను తుడవడం మంచిది. ప్రత్యక్ష సూర్యకాంతికి గురయ్యే మొక్కలపై దీనిని ఉపయోగించవద్దు.
(చదవండి: స్టవ్ వెలిగించకుండానే.. పండంటి వంటలు..)
Comments
Please login to add a commentAdd a comment