
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ,నీతా అంబానీ దంపతుల చిన్న కుమారుడు అనంత్ అంబానీ (Anant Ambani) రాధికా మర్చంట్ (Radhika Merchant) వివాహం అంగరంగ వైభవంగా కనీవినీ ఎరుగని రీతిలో జరిగింది. ప్రపంచంలోనే అతిఖరీదైన వివాహంగా పేరు గాంచింది. దీనిపై ప్రముఖ గాయకుడు మికా సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. గత ఏడాది జరిగిన ఈ కార్పొరేట్ వెడ్డింగ్‌పై మికాసింగ్ (Mika Singh) చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
2024లో జరిగిన అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహ వేడుక చాలా మందికి ఒక ఆశీర్వాదకరమని వ్యాఖ్యానించారు. అనంత్, రాధికా అంబానీ గ్రాండ్ వెడ్డింగ్ పై విమర్శలను మికా సింగ్ ప్రస్తావించారు. వారిపెళ్లిపై ప్రశంసలు కురిపించాడు. అంతేకాదు తాను ఎందుకు భావిస్తున్నానో కూడా వివరించాడు. ఆ ఒక్క పెళ్లి వల్ల లక్షల మందికి ఉపాధిలభించిందని, అందుకే అది బ్లెస్సింగ్ అన్నానని చెప్పుకొచ్చాడు. అంతమాత్రాన తానేమీ చెంచిగిరీ చేయడం లేదంటూ వివరణ ఇచ్చాడు.
ఇలాంటి గ్రాండ్ వెడ్డింగ్స్ అనేక ఉపాధి అవకాశాలను అందిస్తాయనేది జనం అర్థం చేసుకోలేకపోతున్నారని మికా సింగ్ వ్యాఖ్యానించాడు. క్యాటరర్లు, డెకరేటర్లు, ఫ్యాషన్ డిజైనర్లు, సంగీతకారులు, భద్రతా సిబ్బంది, మళ్లీ వీరినుంచిమరికొంతమందికి లాభం చేకూరుతుందన్నాడు. అంతేకాకుండా, అనేక మంది కళాకారులు, సెలబ్రిటీలు తమ తమ ప్రదర్శన ఇచ్చే అవకాశం పొందుతారంటూ ఉదాహరణలతో చెప్పుకొచ్చాడు. తద్వారా అంబానీ కుటుంబం ఆడంబర వివాహంతో డబ్బు వృధా చేసిందన్న వ్యక్తులకు ఆయన కౌంటర్ ఇచ్చాడు. ఇటువంటి గ్రాండ్ వెడ్డింగ్స్ వాటి నుండి సంపాదించే చాలా మందికి ఒక వరం అని పేర్కొన్నాడు.
భారతదేశంలో అత్యంత ప్రియమైన గాయకులలో మికా సింగ్ ఒకరు. ఆయన తన ప్రత్యేకమైన స్వరం, ఆకట్టుకునే శైలితో అనేక మంది ఫ్యాన్స్‌ను సంపాదించుకున్నాడు. సుబా హోనే నా దే, ఆంఖ్ మారే, మౌజా హి మౌజా, పార్టీ తో బన్‌తీ హై లాంటి అత్యంత ప్రజాదరణ పొందిన పాటలతో పాపులరయ్యాడు. ఈ నేపథ్యంలోనే వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌ల గ్రాండ్ వివాహ వేడుకలో ప్రదర్శనకు ఆహ్వానించారు.
కాగా అనంత్ అంబానీ రాధిక మర్చంట్‌ల వివాహంగత ఏడాది జూలైలో ముంబై నగరంలో జియో కన్వెన్షన్ సెంటర్‌లో జరిగింది. 2024లో జరిగిన అతిపెద్ద ఈవెంట్లలో ఒకటి. రెండు డెస్టినేషన్ ప్రీ-వెడ్డింగ్, ముంబైలో ఆరు రోజుల గ్రాండ్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ అత్యంత ఘనంగా జరిగాయి. ప్రపంచ దేశాల ప్రముఖులతో పాటు, దేశీయంగా అనేక మంది వ్యాపార, రాజకీయ, సినీ, క్రీడా రంగ ప్రముఖులు హాజరైన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment