grand wedding
-
ప్రపంచంలోనే రిచెస్ట్ అల్లుడు..
భారతీయ కుటుంబాలలో అల్లుడికి విశిష్ట హోదా ఉంటుంది. ప్రత్యేకించి సంపన్న కుటుంబాల వివాహాల్లో ఇది మరింత ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి కుటుంబాల్లో అల్లుడికి స్వాగత సత్కారాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇలాంటి ఓ వివాహం, ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన అల్లుడు, మామగార్ల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.ఆరు రోజుల పాటు గ్రాండ్ వెడ్డింగ్బిలియనీర్ స్టీల్ టైకూన్ లక్ష్మీ నివాస్ మిట్టల్ తన కుమార్తె, అల్లుడి వివాహాన్ని మరచిపోలేని వేడుకగా మార్చాలనుకున్నారు. ఖర్చు ఏమాత్రం వెనుకాడకుండా వనీషా మిట్టల్, అమిత్ భాటియాల వివాహం జరిపించారు. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌లో ఆరు రోజులపాటు ఈ వివాహ మహోత్సవం అత్యంత ఘనంగా జరిగింది. 2004లో జరిగిన ఈ పెళ్లికి రూ. 240 కోట్లు ఖర్చు పెట్టారు. అప్పట్లో ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పెళ్లి.పారిస్ నగరం మొత్తం ఈ వేడుకను జరుపుకుంటున్నట్లు అనిపించేంతగా ఏర్పాట్లు చేశారు. ప్రఖ్యాత సెలబ్రిటీ చెఫ్ మున్నా మహారాజ్‌ను భారత్ నుండి ఫ్రాన్స్‌కు రప్పించారు. ఈ గ్రాండ్ ఇండియన్ వెడ్డింగ్‌లో ప్రపంచవ్యాప్తంగా 10,000 మంది అతిథులు పాల్గొన్నారు. షారుఖ్ ఖాన్, రాణి ముఖర్జీతో సహా బాలీవుడ్, హాలీవుడ్ తారలు తమ ప్రదర్శనలతో హంగామా చేశారు. అంతర్జాతీయ పాప్ సంచలనం కైలీ మినోగ్ కూడా పెళ్లిలో ప్రదర్శన ఇచ్చారు. రూ. ఒక గంట ప్రదర్శనకు ఆమె రూ. కోటి తీసుకున్నట్లు చెబుతారు.ఎవరీ అమిత్ భాటియా ?అమిత్ భాటియా బ్రిటీష్-ఇండియన్ వ్యాపారవేత్త, బిలియనీర్ ఉక్కు వ్యాపారి లక్ష్మీ నివాస్ మిట్టల్ అల్లుడు. అయేబే క్యాపిటల్ (గతంలో స్వోర్డ్ ఫిష్ ఇన్వెస్ట్మెంట్స్ )వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్. అమిత్ తన ప్రాథమిక విద్యను ఢిల్లీలో పూర్తి చేసి ఉన్నత చదువుల కోసం యూకే వెళ్లారు.అమిత్ తన వృత్తిపరమైన ప్రయాణాన్ని న్యూయార్క్‌లో మెరిల్ లించ్, మోర్గాన్ స్టాన్లీతో ప్రారంభించారు. వెస్ట్ లండన్‌లోని షెపర్డ్స్ బుష్‌లో ఉన్న ఒక ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ క్లబ్ అయిన క్వీన్స్ పార్క్ రేంజర్స్ ఎఫ్సీకి ఆయన సహ-యజమాని. క్రీడలతో పాటు అమిత్ వ్యాపార సంస్థలు రియల్ ఎస్టేట్, సాంకేతిక రంగాల్లో విస్తరించాయి. స్ట్రాటజిక్ లాండ్ అండ్ ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అయిన సమ్మిక్స్ క్యాపిటల్‌లో ఈయన వ్యవస్థాపక భాగస్వామి.గతంలో 2016 ఆగస్టులో బ్రీడాన్ గ్రూప్‌ను కొనుగోలు చేసే వరకు హోప్ కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా పనిచేశారు. ఆ తర్వాత బ్రీడాన్ గ్రూప్ బోర్డ్‌లో నాన్-ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా చేరారు. కార్పొరేట్ ఫైనాన్స్, ప్రైవేట్ ఈక్విటీలో 20 సంవత్సరాల అనుభవంతో అమిత్ భాటియా విజయవంతమైన కెరీర్‌ను నిర్మించుకున్నారు. వనీషా మిట్టల్, అమిత్ భాటియా దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. -
డ్రీమ్ వెడ్డింగ్: భారతీయ దుస్తులతో అమెరికాలో ఘనంగా, ఫోటోలు వైరల్
నేటి తరానికి పెళ్లంటే ఆకాశమంత పందిరి, భూదేవి అంత పీట. అత్యంత విలాసవంతంగా తమ పెళ్లి జరగాలి అనేది ఒక డ్రీమ్. ఎంత ఖర్చైనా సరే మెహిందీ, సంగీత్‌లు, బారాత్‌లు, ఖరీదైన డిజైనర్ దుస్తులు, డైమండ్ నగలు, వంద రకాల వంటలు ఉండాల్సిందే. వరుడు, మురారి సినిమాల్లో లాగా అంగరంగ వైభంగా తమ పెళ్లి జరగాలని ముందునుంచే కలలు కంటారు. ఈ క్రమంలో భారత సంతతికి చెందిన కాలిఫోర్నియా వధువు సినిమా తరహాలోనే పెళ్లి చేసుకుంది. ఈ జీవితకాల వేడుక చాలా స్పెషల్‌గా ఉండాలని ప్లాన్ చేసుకుని మరీ ప్రియుడిని పెళ్లాడింది. నెట్టింట సందడి చేస్తున్న ఈ గ్రాండ్ వెడ్డింగ్ వివరాలు ఇలా ఉన్నాయి.అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన నితాషా పటేల్ అచ్చం బాలీవుడ్ పెళ్లి సందడిలా తన పెళ్లిని జరిపించుకుంది. అంతేకాదు తన గ్రాండ్ వెడ్డింగ్ కోసం డిజైనర్ రాహుల్ మిశ్రా డిజైన్ చేసిన ప్రత్యేకమైన దుస్తులకోసం ఇండియాకు వచ్చింది. నితాషా పటేల్, కృష్ణ గగ్లానీ ఇద్దరు ఆన్లైన్ డేటింగ్ యాప్ ద్వారా కలుసుకున్నారు. ప్రొఫైల్‌తో నితాషా కాలిఫోర్నియాకు బదులుగా ఆమె తన బేస్ లొకేషన్ లండన్ అని రాయడంతో తొలుత ఇద్దరి మధ్య కొంత అపార్థాలకు దారి తీసింది. కానీ అన్నీ సర్దుబాటు చేసుకుని నాలుగు నెలలపాటు కాల్స్, మెసేజెస్ ద్వారా మాట్లాడుకున్నారు. ఆ తరువాత లండన్‌లో ఇద్దరూ కలుసుకున్నారు. అనంతరం కాలిఫోర్నియాకు వచ్చిన కృష్ణ రెండు నెలలు అక్కడే ఉన్నాడు. ఇలా ఒక ఏడాది డేటింగ్ తర్వాత, కృష్ణ నితాషాకు ప్రపోజ్ చేశాడు. చివరికి పెళ్లి ముహూర్తం కూడా పెట్టేసుకున్నారు.నితాషా పటేల్, కృష్ణ గగ్లానీ తన పెళ్లికి హల్దీ, మెహందీ వేడుకలు ఘనంగా ఉండాలని భావించారు. ముఖ్యంగా నితాషా తన వివాహ ఈవెంట్లకు బాలీవుడ్ టచ్ ఉండాలని కోరుకుంది. నితాషా, తన తల్లితో కలిసి, ఇండియాలోని ముంబైలో ఉనన ప్రముఖ డిజైనర్ రాహుల్ మిశ్రా స్టోర్‌ని సందర్శించి, తన డ్రెసెస్ సెలెక్ట్ చేసుకుంది. పెళ్లిలో ఐవరీ హ్యూడ్ త్రీ పీస్ పలాజో సెట్లో, డైమండ్ హె లేయర్డ్ డైమండ్ నెక్లెస్, చెవిపోగులు , బ్రాస్లెట్తో సింపుల్ బ్యూటీగా మెరిసింది. మరోవైపు, వరుడు కృష్ణ తన వధువును క్రీమ్-హ్యూడ్ కుర్తా సెట్,రోలెక్స్ వాచ్, కార్టియర్ రింగ్‌తో కొత్త పెళ్లికళతో ఆకట్టుకున్నాడు.నితాషా, కృష్ణ గ్రాండ్ వెడ్డింగ్ రిసెప్షన్గ్రాండ్ వెడ్డింగ్ తరువాత రిసెప్షన్‌ను కూడా అంతే గ్రాండ్‌గా జరుపుకున్నారు. ఐవరీ కలర్ నెక్లైన్ సీక్విన్ లెహంగా, షీర్ సీక్విన్ దుపట్టాతోపాటు డైమండ్ డైమండ్ నెక్లెస్‌తో హైలైట్‌గా నిలిచింది వధువు నితాషా. ఇక వరుడు కృష్ణ తెల్లటి చొక్కా, సిల్క్ బౌటీ,మోనోగ్రామ్ కఫ్లింక్ల, బ్లాక్ టక్సేడోలో అందంగా కనిపించాడు. -
అనంత్ అంబానీ - రాధిక వెడ్డింగ్ : అందమైన ఫోటోలు
-
అనంత్-రాధిక రిసెప్షన్ : అంబానీ మనవడి రియాక్షన్, వైరల్ వీడియో
బిలియనీర్,రిలయన్స్ అధినేత ముఖేష్, నీతా అంబానీ చిన్న కుమారుడు రాధిక మర్చంట్ పెళ్లి వేడుకలు అంగరంగ వైభవంగా ముగిసాయి. పెళ్లి తరువాత శుభ్ ఆశీర్వాద్ , మంగళ్ ఉత్సవ్‌లను నిర్వహించారు గత కొన్ని రోజులుగా గ్రాండ్ వెడ్డింగ్‌కు సంబంధించిన ఏదో ఒక ముచ్చట సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. తాజాగా అనంత్-రాధిక వెడ్డింగ్ రిసెప్షన్లో అంబానీ వారసుడు పృథ్వీ ఆకాశ్ అంబానీకి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది.అంబానీ పెద్దకుమారుడు ఆకాష్ అంబానీ, శ్లోకాకుమారుడు పృథ్వీ అంబానీ సందడి ప్రత్యేకంగా నిలుస్తోంది. అనంత్, రాధిక పెళ్లి తరువాత అంబానీ ఫ్యామిలీ అంతా ఫోటోకు ఫోజులిస్తుండగా అకస్మాత్తుగా పరిగెత్తుకుంటూ వచ్చిన పృథ్వీ రాధిక కాళ్ల దగ్గర జారి పడి పోయాడు. కానీ వెంటనే లేచి సర్దుకున్నాడు. దీంతో తల్లి శ్లోకా కంగారుపడుతూ ముందుకొచ్చింది. ఇంతలో నానమ్మ అతడికి మైక్ అందివ్వగా జై శ్రీకృష్ణ అంటూ ముద్దుగా చెప్పాడు. దీంతో ఆశ్చర్యపోవడం అందరి వంతైంది.Wow what a landing...Chalo koi to nikla humhre jesa inki family me 😂😃😃 pic.twitter.com/pRMBdKaC1Z— Piku (@RisingPiku) July 15, 2024 -
అంబానీ గ్రాండ్ వెడ్డింగ్ వేడుకలో తెలుగు వీణ సందడి
పరాంకుశం వీణాశ్రీవాణి... ఆమె పేరులోనే సరిగమల శ్రుతి వినిపిస్తోంది. అమలాపురంలో ఓ చిన్న అగ్రహారం అమ్మాయి శ్రుతి చేసిన వీణ ఇప్పుడు అంబానీ ఇంటి వేడుకలో సరిగమలతో అలరించింది. ఆ ఆనంద క్షణాలను ఆమె సాక్షి ఫ్యామిలీతో పంచుకున్నారు. ‘‘మాది అమలాపురం జిల్లా ఇందుపల్లి అగ్రహారం. బండారులంకలోని పిచ్చుక సీతామహాలక్ష్మి గారి దగ్గర సంగీతం నేర్చు కున్నాను. ఈ రోజు ఇన్ని ప్రశంస లందుకుంటున్నానంటే ఆమె నేర్పిన సంగీత జ్ఞానమే కారణం. అంబానీ కుటుంబంలో పెళ్లి వేడుకకు వీణావాదన చేయడానికి ఆహ్వానం రావడంతో ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే నా పేరు వాళ్లకు తెలిసే అవకాశమే లేదు. నేను సోషల్ మీడియాలో చురుగ్గా ఉండడం వల్లనే నా కళను వారు గుర్తించడానికి కారణం అనుకుంటున్నాను. నీతా అంబానీ గారు చె΄్పారు అంటూ వాళ్ల మేనేజరో ఎవరో కాంటాక్ట్ చేశారు. ఏ దుస్తులు ధరించాలనే విషయం నుంచి వేడుకలో ఏ ΄ాటలు కావాలో కూడా ఆమే ఎంపిక చేశారు. నేనిచ్చిన జాబితా నుంచి ఆమె ఎంపిక చేసిన పది ΄ాటలను వీణ మీద వినిపించాను. నా చెలి రోజావే, ఉరికే చిలకా... వంటి పలు భాషల్లోకి అనువాదమై ఉన్న ΄ాటలనే ఎంచుకున్నాను. ఇదంతా పదిహేను రోజులపాటు నడిచింది. రెండు కళ్లు చాలవు!ఆడిటోరియానికి వెళ్లే దారిలో ఒక వరుస అత్తరులు, ఇత్తడి బిందెలతో గుజరాత్ సంప్రదాయ నమూనా అలంకరణ ఉంది. ఆ తర్వాత ధొలారి ధని థీమ్, ఫారెస్ట్ థీమ్, కలంకారీ థీమ్ ఓ వరుస ఉన్నాయి. శంకర్ మహదేవన్, శ్రేయాఘోషాల్, శివమణి వంటి సంగీతకారులు, గాయకుల ప్రోగ్రామ్‌లను టీవీ లైవ్ లో చూశాను. వందమంది రాజమౌళిలు, వంద మంది సంజయ్ లీలా భన్సాలీలు కలిసి సెట్టింగు వేయించారా అనిపించింది. చూడడానికి రెండు కళ్లు చాలవు. తలను 360 డిగ్రీల్లో తిప్పి చూడాల్సిందే. బారాత్ తర్వాత పెళ్లికి ముందు హై టీ టైమ్‌లో రాత్రి ఏడు నుంచి ఏడు ముప్పావు వరకు నా కచేరీ సాగింది. రాధిక మర్చంట్ కుటుంబం, అంబానీ కుటుంబ సభ్యులకు మాత్రమే అనుమతి. వాళ్లు కదలకుండా కూర్చుని, ఓ పాటను మళ్లీ అడిగి మరీ చక్కగా ఆస్వాదించడం, కళల పట్ల వారికున్న గౌరవం నాకు సంతృప్తినిచ్చింది. నాలుగు వేల అడుగులు పన్నెండవ తేదీ ఉదయం ముంబయికి వెళ్లాం. హోటల్లో రిఫ్రెష్ అయిన తర్వాత నేరుగా జియో కన్వెన్షన్ సెంటర్‌కెళ్లాం. ఆ సెంటర్ ఎంట్రన్స్ నుంచి నా ప్రదర్శన ఉన్న ఆడిటోరియంలో వేదిక వద్దకు చేరడానికి నాలుగు వేల అడుగులు పడ్డాయి. ఫోన్లో చెక్ చేసుకున్నాను కూడా. నిర్వహకులు వెంట ఉండి తీసుకెళ్లకపోతే నా వేదిక ఏదో తెలుసుకోవడంతోనే రోజు పూర్తయ్యేదేమో. నీతా అంబానీ స్వయంగా కళాకారిణి కావడంతో ఈ వేడుకలో కళాప్రదర్శనకు ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చారనుకున్నాను. భోజనాల దగ్గర కూడా ఆర్టిస్టుల కోసమే ఒక పెద్ద హాలును కేటాయించారు. వేల రకాల వంటలు వడ్డించారని విన్నాను. కానీ నేను సలాడ్లు, కాఫీ మాత్రమే తీసుకున్నాను. పెళ్లి వేడుకలో నీతా అంబానీ ఎంత శ్రద్ధగా ప్రతి చిన్న విషయాన్నీ పట్టించుకున్నారంటే డెకరేషన్లో ఉన్న పూలను కూడా పరిశీలించి థీమ్‌కి అనుగుణంగా మార్పించారు. కొన్ని రోజులపాటు ఆమె మధ్యాహ్నం మూడు నుంచి తెల్లవారి ఆరుగంటల వరకు పని చేశారట. అయినా సరే ఆమె ముఖంలో అలసట కనిపించలేదు. గొప్ప ఆర్గనైజర్ ఆమె. వీణావాణి ఇచ్చిన వరం జనసందోహంలో నేను ఎక్కువ సేపు ఇమడలేను. నా కచేరీ పూర్తి కాగానే నన్ను బయటకు తీసుకెళ్లమని నిర్వహకులను అడిగాను. గేటు వరకు తీసుకొచ్చి వెహికల్ ఎక్కించేశారు. పదమూడవ తేదీ ఉదయం ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్‌కి వచ్చేసి హమ్మయ్య అనుకున్నాను. నాకిప్పుడు తలుచుకున్నా సరే అంతా కలలా అనిపిస్తోంది. ఆంధ్రుల ఆడపడుచుని, తెలంగాణ కోడలిని. నాకు తెలిసినంత వరకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఈ వేడుకలో కళను ప్రదర్శించిన ఏకైక వ్యక్తిని నేనే... అనుకున్నప్పుడు గర్వంగా అనిపిస్తోంది. సరస్వతీ మాత వీణతోపాటు నాకిచ్చిన వరం ఈ అవకాశం అనుకుంటున్నాను’’ అని రెండు చేతులూ జోడించారు వీణాశ్రీవాణి తన వీణను మురిపెంగా చూసుకుంటూ.– వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఫొటోలు : నోముల రాజేశ్ రెడ్డి -
దటీజ్ నీతా అంబానీ : పింక్ గాగ్రా, వెరీ, వెరీ స్పెషల్‌గా బ్లౌజ్
సందర్భం ఏదైనా రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్మన్ నీతా అంబానీ తన ప్రత్యేకతను చాటుకుంటారు. తాజాగా తన చిన్న కుమారుడు అనంత్ అంబానీ గ్రాండ్ వెడ్డింగ్‌లో వరుడి తల్లిగా నీతా అద్భుతంగా కనిపించారు. నిశ్చితార్థం, ప్రీ వెడ్డింగ్ వేడుకలు, పెళ్లి, రిసెప్షన్, ఇలా ప్రతీ వేడుకను దగ్గరుండి మరీ ఘరంగా నిర్వహించడంతో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ వివాహ తొలి పత్రికను తనకెంతో ఇష్టమైన పవిత్ర వారణాసిలోని కాశీ విశ్వనాథుడి పాదల వద్ద ఉంచి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు.తాజాగా 'శుభ్ ఆశీర్వాద్' వేడుకలో తన స్పెషల్ ఫ్యాషన్‌తో అలరించారు నీతా . డిజైనర్లు అబు జానీ సందీప్ ఖోస్లా ప్రత్యేకంగా రూపించిందిన పింక్ గాగ్రాలో హుందాగా కనిపించారు. కాశీలోని క్లిష్టమైన వాస్తుశిల్పం, దేవాలయాల ప్రేరణతో చేతితో ఎంబ్రాయిడరీ చేసిన జర్దోజీ గాగ్రాను ఎంచుకున్నారు. ముఖ్యంగా దీనికి మ్యాచింగ్‌గా ఆమె ధరించిన బ్లౌజ్ విశేషంగా నిలిచింది.ఇందులో హ్యాండ్ మేడ్ ఎంబ్రాయిడరీ ఝుమ్కా మోటిఫ్‌లు, బ్లౌజ్ వెనక వీపుపై శుభప్రదమైన ఏనుగు డిజైన్లు ఉన్నాయి. ఆకాష్, ఇషా అనంత్, తోపాటు మనవళ్ల పేర్లు-కృష్ణ, ఆదియా, పృథ్వీ , వేద చోళీపై హిందీలో చేతితో ఎంబ్రాయిడరీ చేయించారు. ఇంకా సంస్కృత శ్లోకాలతో, స్పెషల్ జరీ వర్క్ , ఎంబ్రాయిడరీ చేసిన దుపట్టా మరింత ఆకర్షణీయంగా నిలిచింది. విరేన్ భగత్ సెట్ చేసిన పచ్చలు, వజ్రాలఆభరణాలతో తన లుక్ మరింత ఎలివేట్ అయ్యేలా జాగ్రత్త పడ్డారు. -
అంబానీ చిన్న కోడలిగా రాధిక మర్చంట్, తొలి ఫోటో వైరల్
బిలియనీర్ ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, తన ప్రేయసితో వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. అత్యంత ఘనంగా నిర్వహించిన పెళ్లి వేడుకలో, సన్నిహితులు, అతిథుల ఆశీర్వాదాల మధ్య అనంత్, రాధిక మర్చంట్ దండలు మార్చుకున్నారు. ఈ గ్రాండ్ వెడ్డింగ్‌కు సంబంధించిన ఫోటో, వీడియోలు నెట్టింట సందడి చేస్తున్నాయి. View this post on Instagram A post shared by Shloka Akash Ambani (@shloka_ambani) వరుడు తల్లిదండ్రులు,వధువు తల్లిదండ్రులు అనంత్ సోదరి ఇషా అంబానీ పిరమల్, అంబానీ పెద్ద కోడలు శ్లోకా మెహతో పాటు, వధువు సోదరి అంజలి మర్చంట్ మజిథియా,తదితరు సన్నిహిత కుటుంబ సభ్యులు ఆనందంలో మునిగి తేలారు. బాలీవుడ్, టాలీవుడ్, క్రీడా రంగ ప్రముఖులు, దేశ విదేశాలకు అతిథులు ఈ వేడుకకు మరింత ఆనందోత్సాహాలను జోడించారు. రియాలిటీ టీవీ స్టార్లు కిమ్ కర్దాషియాన్, ఖోలే కర్దాషియాన్ సందడి చేశారు. ఇంకా శాంసంగ్ చైర్మన్ లీ జే-యోంగ్, బాలీవుడ్ స్టార్లు, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, దీపికా పదుకొనే, జాన్వీకపూర్, కత్రినా, టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు కుటుంబం, రాంచరణ్, సూర్య జ్యోతిక, రాణా అతని భార్య, మాజీ అందాల సుందరి మానుషి చిల్లర్, ఇవాంకా ట్రంప్ తదితరులు ఈ లిస్ట్‌లో ఉన్నారు. -
అంగరంగ వైభవం.. తరలివచ్చిన బిజినెస్ టైకూన్స్
Ambani wedding: ఎంతగానో ఎదురుచూస్తున్న అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ల వివాహ వేడుకలు శుక్రవారం (జూలై 12) సాయంత్రం ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. ఈ గ్రాండ్ వెడ్డింగ్‌కు పలువురు అగ్రశ్రేణి వ్యాపార దిగ్గజాలు హాజరవుతున్నారు. అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ నుంచి మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో బిల్ గేట్స్ వరకు అనేక మంది దేశీయ, అంతర్జాతీయ వ్యాపార ప్రముఖలులు ఈ వేడుకకు హాజరవుతారని భావిస్తున్నారు.అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ వివాహానికి హాజరవుతున్న వ్యాపార దిగ్గజాలలో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, థాయ్ వ్యాపారవేత్త, అంతర్జాతీయ ఒలింపిక్ సభ్యురాలు ఖున్ యింగ్ పటామా లీస్వాడ్ట్రాకుల్, సౌదీ అరామ్కో సీఈవో అమీన్ నాసర్, బీపీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ముర్రే ఔచిన్క్లోస్ ఉన్నారు. అలాగే డ్రగ్ దిగ్గజం జీఎస్కే సీఈవో ఎమ్మా వామ్స్లీ, లాక్‌హీడ్ మార్టిన్ సీఈవో జిమ్ టైక్లెట్, ఫిఫా అధ్యక్షుడు జియాని ఇన్ఫాంటినో కూడా వేడుకలకు హాజరవుతున్నట్లు ఎకానమిక్ టైమ్స్ నివేదించింది.వీరితో పాటు ఎరిక్సన్ సీఈవో బోర్జే ఎఖోల్మ్ , టెమాసెక్ సీఈవో దిల్హాన్ పిళ్లే, హెచ్‌పీ ప్రెసిడెంట్ ఎన్రిక్ లోరెస్, ఏడీఐఏ బోర్డు సభ్యుడు ఖలీల్ మహ్మద్ షరీఫ్ ఫౌలతీ, ముబాదలాకు చెందిన ఖల్దూన్ అల్ ముబారక్, కువైట్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ ఎండీ బాదర్ మహ్మద్ అల్-సాద్ తదితరులు వేడుకలకు తరలివస్తున్నట్లుగా తెలుస్తోంది. -
అనంత్-రాధిక గ్రాండ్ వెడ్డింగ్: భావోద్వేగ క్షణాలు, వైరల్ వీడియో
పెళ్లి చేసి ఆడబిడ్డను అత్తారింటికి సాగనంపడం అనేది భావోద్వేగంతో కూడిన సందర్భం. పెళ్లికి నిశ్చితార్థం మొదలు, ఆ మూడు ముళ్లూ పడివరకు, ఇక అమ్మాయి అప్పగింతల సమయంలో ఆ ఉద్విగ్న క్షణాలు కన్నీటి పర్వంత మవుతాయి. నిరుపేదైనా, కుబేరుడైనా ఈ అనుభవం తప్పదు. పారిశ్రామికవేత్త విరేన్ మర్చంట్ ముద్దుల తనయ రాధికమర్చంట్ మధ్య ఇలాంటి భావోద్వేగ క్షణాలు నమోదైనాయి. మర్చంట్, అంబానీ కుటుంబాలు నిర్వహించిన గ్రహ శాంతి పూజ సందర్భంగా వీరేన్, కాబోయే వధువు రాధికను ఆలింగనం చేసుకుని ఎమోషనల్ అయ్యారు. గ్రాండ్ వెడ్డింగ్‌కు ముందు అనంత్ అంబానీకూడా తన కాబోయే భార్యను ఆత్మీయంగా గుండెలకు హత్తుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.కాగా ఇద్దరు పారిశ్రామికవేత్తలువియ్యమందుకునే ముహూర్తం మరికొద్ది గంటల్లో రానుంది. ప్రపంచంలోని అత్యంత సంపన్న కుటుంబాలలో ఒకటి, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా చిన్న కుమారుడు అనంత్, పారిశ్రామికవేత్త వీరేన్ మర్చంట్, వ్యాపారవేత్త శైలా మర్చంట్ కుమార్తె రాధిక మర్చంట్‌తో ఈ రోజు (జూలై 12) వివాహం జరగనుంది. ఈ వివాహానికి పలువురు సినీ, క్రీడా రంగ సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు దేశ విదేశాలకు చెందిన అతిరథ మహారథులు ఇప్పటికే ముంబై చేరుకుంటున్నారు. View this post on Instagram A post shared by WeddingSutra.com (@weddingsutra) -
అనంత్ - రాధిక పెళ్లి సందడి : మరోసారి మెస్మరైజ్ చేసిన రాధిక
రిలయన్స్ వారసుడు, ముఖేష్, నీతా అంబానీ చిన్నకుమారుడు అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ వివాహ వేడుకల్లో భాగంగా గృహ శాంతి పూజలో అనంత్ కాబోయే భార్య రాధిక పాల్గొంది. ఈ సందర్భంగా ముగ్ధ మనోహర రూపంలో మరోసారి ఆకట్టుకుంది. మరాఠీ ముల్గిగా అద్భుతంగా కనిపించింది రాధిక.జూలై 12, 2024న ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహ బంధంలోకి అడుగు పెట్టబోతున్నారు. ఈ సందర్బంగా ప్రీ వెడ్డింగ్ వేడుకలు జోరందుకున్నాయి. ఇటీవల అంబానీ ఫ్యామిలీ మామేరా వేడుకను ఘనంగా నిర్వహించగా, ఇపుడు రాధిక కుటుంబం గృహ శాంతి పూజను నిర్వహించింది. ఈ పూజలో రాధిక తన తల్లి, సోదరి అంజలి మర్చంట్‌తో కలిసి కార్యక్రమాలు నిర్వహించింది. ఈ సందర్బంగా రాధిక ఫ్యాషన్ దుస్తులు, ఆభరణాలు విశేషంగా నిలిచాయి. View this post on Instagram A post shared by Nikitaa🌻 (@nikitaawaghela_) జరీ వర్క్‌తో తొమ్మిది గజాల కాంచీపురం సంప్రదాయపట్టు వైట్ శారీని దక్షిణ భారత శైలిలో చుట్టుకుంది. ఎరుపు రంగు బ్లౌజ్‌తో పెళ్లి కూతురిలా అందంగా కనిపించింది. దీనికి తగ్గట్టుగా, డైమండ్ నెక్లెస్, సరిపోలే జత చెవిపోగులతో కళకళలాడింది.కాగా ఇప్పటికే రెండు సార్లు ప్రీవెడ్డింగ్ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. కనీవినీ ఎరుగని రీతిలో అనంత్-రాధిక వివాహ వేడుక మూడు రోజుల పాటు జరగబోతోంది. -
దిల్ రాజు ఇంట పెళ్లి సందడి.. ఫ్యామిలీతో బయలుదేరిన నిర్మాత!
ప్రముఖ టాలీవుడ్ నిర్మాత ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. దిల్ రాజు తమ్ముడు కొడుకు, టాలీవుడ్ యంగ్ హీరో ఆశిష్ రెడ్డి వివాహా వేడుకకు అంతా సిద్ధమైంది. ఇప్పటికే సినీ, రాజకీయ ప్రముఖులను ప్రత్యేకంగా ఆహ్వానాలు అందించారు. ఈనెల 14న జైపూర్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ గ్రాండ్‌గా జరగనుంది. ఇప్పటికే పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు సైతం పూర్తయ్యాయి. తాజాగా వివాహా వేడుక కోసం దిల్ రాజు ఫ్యామిలీ బయలుదేరి వెళ్లారు. జైపూర్ వెళ్తూ తన కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ విమానాశ్రయంలో కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా.. దిల్ రాజు మేనల్లుడైన ఆశిష్ రెడ్డి గతేడాది డిసెంబర్లోనే నిశ్చితార్థం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యాపారవేత్త కూతురు అద్వైత రెడ్డితో ఆతనికి ఎంగేజ్మెంట్ జరిగింది. ఈ వేడుక ఇరువురి కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగింది. టాలీవుడ్లో రౌడీ బాయ్స్ అనే చిత్రం ద్వారా ఆశిష్ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటించింది. 2022 జనవరిలో రిలీజైన ఈ చిత్రం మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఆశిష్ రెడ్డి ప్రస్తుతం సెల్ఫీష్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి విశాల్ కాశీ దర్శకత్వం వహిస్తున్నారు. #TFNExclusive: Ace Producer #DilRaju & Groom @AshishVOffl along with their family members get papped as they jet off to Jaipur for the grand wedding ceremony!! 📸🤩#Ashish #Tollywood #TeluguFilmNagar pic.twitter.com/IQllj4yVCU — Telugu FilmNagar (@telugufilmnagar) February 12, 2024 -
వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి రిసెప్షన్.. టాలీవుడ్ స్టార్ హీరోనే యజమాని!
మెగా ఇంట పెళ్లి వేడుకకు అంతా సిద్ధమైంది. ఇటలీలోని టుస్కానీలో జరగనున్న ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం ఇప్పటికే రామ్ చరణ్- ఉపాసన, అల్లు అర్జున్ దంపతులు ముందుగానే ఇటలీ బయలుదేరి వెళ్లారు. ఇటీవలే షాపింగ్ పూర్తి చేసుకున్న కాబోయే వధూవరులు సైతం ఇటలీ ఫ్లైటెక్కారు. ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో భాగంగా అక్టోబర్ 30న కాక్టేల్ పార్టీతో పెళ్లి వేడుకలు మొదలు పెట్టి 31న హల్దీ, మెహందీ నిర్వహించనున్నారు. నవంబర్ 1న పెళ్లిబంధంతో ఒక్కటి కానున్నారు. (ఇది చదవండి: 'అంతా నా వల్లే అంటున్నారు'.. డైరెక్టర్ పోస్ట్ వైరల్!) అయితే ఇటలీ పెళ్లి వేడుక తర్వాత హైదరాబాద్‌లో ఇండస్ట్రీలోని ప్రముఖులు, సన్నిహితులకు గ్రాండ్‌గా రిసెప్షన్ ప్లాన్ చేశారు. నవంబర్ ఐదో తేదీన మాదాపూర్‌లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్లో తర్వాత రిసెప్షన్ వేడుక జరగనుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఆహ్వాన పత్రిక సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫంక్షన్లో దాదాపు 3 వేలకు పైగా అతిథులు పాల్గొనే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అందుకు తగిన విధంగానే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అయితే గ్రాండ్ రిసెప్షన్ జరగనున్న ఎన్ కన్వెన్షన్ సెంటర్ టాలీవుడ్‌కు చెందిన స్టార్ హీరోకు చెందినదిగా తెలుస్తోంది. ప్రస్తుతం బిగ్‌బాస్ తెలుగు సీజన్-7 హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అక్కినేని నాగార్జున ఈ సెంటర్‌కు యజమానిగా వ్యవహరిస్తున్నారు. ప్రముఖ వ్యాపారవేత్త నల్లా ప్రీతమ్ రెడ్డితో కలిసి ఆయన దీన్ని నిర్మించారు. ఈ కన్వెన్షన్ సెంటర్‌కు వీరిద్దరు భాగస్వాములుగా ఉన్నారు. అయితే గతంలో ఎన్ కన్వెన్షన్ సెంటర్ నిర్మాణంపై పలు వివాదాలు తలెత్తాయి. (ఇది చదవండి: వరుణ్ తేజ్- లావణ్య పెళ్లి షెడ్యూల్ ఇదే.. వేడుకలకు ఆమె దూరం) -
గ్రాండ్ వెడ్డింగ్‌లో అంబానీల మించిన జంట ఎవరో తెలుసా?
డెస్టినేషన్వెడ్డింగ్స్, విలాసవంతమైన సౌకర్యాలతో, ఆడంబరమైన పెళ్లిళ్లు ఈ మధ్యకాలంలో బడాబాబులకు, ఐశ్వర్యవంతులకు చాలా సాధారణంగా మారిపోయింది. కానీ భారతీయ చిత్రనిర్మాత, ఫ్యాషన్ డిజైనర్ జపిందర్ కౌర్, హోటల్ వ్యాపారి హర్‌ప్రీత్ సింగ్ చద్దా 2017లోనే దుబాయ్‌లో జరిగిన వివాహం సరికొత్త ట్రెండ్‌ని సృష్టించింది. పెళ్లి వేదికనుంచి దుస్తులు, ఆభరణాలనుంచి ప్రతీ వేడుక సోషల్ మీడియాలో విశేషంగా నిలిచింది. డిజైనర్ దుస్తులు, బంగారు తీగతో చేసిన చీర, డైమండ్లు, రత్నాల పొదిగిన ఆభరణాలు హెలికాప్టర్, ప్రైవేట్ యాచ్, ఇంకా.. చాలా ..చాలా..ఈ వివరాలేంటో ఒకసారి చూద్దాం. జపిందర్ కౌర్ దుబాయ్‌కి చెందిన ఫ్యాషన్ డిజైనర్ కాగా, చద్దా ప్రముఖ వ్యాపారవేత్త. అంబానీ, అదానీలకు మించిపోయిన జపిందర్ కౌర్ , హర్‌ప్రీత్ సింగ్ చద్దా వివాహ వేడుకలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. దుబాయ్‌లోని ది పాలాజ్జో వెర్సెస్, ది పాలాజ్జో వెర్సెస్ దుబాయ్, బుర్జ్ ఖలీఫా , బుర్జ్ అల్ అరబ్‌లో అత్యంత ఘనంగా నిర్వహించిన ఈ వివాహ వేడుకల్లో ముఖ్యమైన మెహిందీ ఈవెంట్ కోసం ఈ జంట మెగా ప్రైవేట్ యాచ్‌ని కూడా బుక్ చేసుకుంది. హెలికాప్టర్ద్వారా 350 కిలోల గులాబీ రేకులను లగ్జరీ పడవలోకి జార విడవడంప్రత్యేక ఆకర్షణ. ఐదు రోజుల పాటు జరిగిన ఈ వేడుకల్లో ప్రతీదీ ఒక స్పెషల్ ఎట్రాక్షన్. ఈ వివాహానికి మొత్తం ఖర్చు రూ. 600 కోట్లుగా అంచనా. ఇది ఇషా అంబానీ, ఆనంద్ పిరమల్ పెళ్లి ఖర్చు కంటే కొంచెమే తక్కువ అంటే అర్థం చేసుకోవచ్చు ఈ పెళ్లి రేంజ్‌ను. అద్భుతమైన డైమండ్ ఎంగేజ్మెంట్ రింగ్స్ బుర్జ్‌ఖలీఫాలో నిశ్చితార్థ వేడుకను ఘనంగా నిర్వహించారు. లేస్ డిజైన్‌తో తీర్చిదిద్దిన గౌనులో యువరాణిలా రాయల్టీ లుక్‌లో వెలిగిపోయింది. జపిందర్ గోల్డెన్ బ్యాండ్‌తో కూడిన 12 క్యారెట్ల డైమండ్ ఎంగేజ్మెంట్ రింగ్‌ను ధరించగా, ప్లాటినమ్ బ్యాండ్‌పై 6 క్యారెట్ల డైమండ్ రింగ్‌ను ధరించాడు చద్దా. ఈ లవబర్డ్స్ తమ రోకా వేడుకను విలాసవంతమైన బుర్జ్ అల్ అరబ్ జుమేరాలో నిర్వహించారు. మెగా మెహిందీ ఈవెంట్ అంతేకాదు నిశ్చితార్థ వేడుకను మించి తమ రికార్డును తామే బద్దలు కొట్టి మరీ మెహందీ వేడుకను ఒక ప్రైవేట్ యాచ్‌లో నిర్వహించారు. గులాబీ రేకులను చల్లేందుకు ప్రత్యేకమైన హెలికాప్టర్‌ను బుక్ చేసుకున్నారు. 350 కిలోల గులాబీ రేకులను జంటపై, పడవలో ఉన్న ఇతరులపై హెలికాప్టర్ అందంగా వెదజల్లింది. ఇది వధూవరులను మాత్రమే కాదు అక్కడున్న వారందరినీ థ్రిల్ చేసిందంటే అతిశయోక్తి కాదేమో. గ్రాండ్ వెడ్డింగ్ జపిందర్ కౌర్ హర్‌ప్రీత్ సింగ్ చదా గ్రాండ్ వెడ్డింగ్ వేడుక గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. విలువైన రత్నాలు పొదిగిన 5 మీటర్ల పొడవున్న ఈ గౌన్ బరువు 10 కిలోల కంటే ఎక్కువే. దార్ సారా పాస్టెల్ పింక్ హై-ఫ్యాషన్ వెడ్డింగ్ గౌన్‌తో, అంతకుమించిన డైమండ్ ఆభరణాలు,120-క్యారెట్ పోల్కీ వజ్రాలు, బర్మీస్ కెంపులు, పచ్చలు, ధరించిన మ్యాచింగ్ చెవిపోగులు , మాంగ్ టికాతో కూడిన లేయర్డ్ నెక్లెస్ దివినుంచి దిగివచ్చిన అప్సరసలా కనిపించింది. ఈ వివాహ వేడుక వెడ్డింగ్ రిసెప్షన్లో కూడా ఎక్కడా తగ్గలేదు ఈ జంట. ఈ రాయల్ రిసెప్షన్ కోసం మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన స్వచ్ఛమైన బంగారు దారంతో గౌను, బంగారు కిరీటంతో ధగ ధగ మెరిసిపోయింది. ఇక హర్‌ప్రీత్ రాయల్ బ్లూ షేర్వానీలో, కెంపులు , పచ్చలు పొదిగిన బంగారు ఖడ్గంతో రాజకుమారిడిలా వెలిగిపోయాడు. ఇక విందు భోజనాలు గురించి ప్రత్యేకంగా చెప్సాల్సింది ఏముంటుంది. View this post on Instagram A post shared by JAPINDER KAUR (@japinderkaur) -
ఘనంగా గుణశేఖర్ కుమార్తె వివాహం.. ఫోటోలు వైరల్
ప్రముఖ దర్శక-నిర్మాత గుణశేఖర్ కుమార్తె నీలిమ గుణ వివాహం ఘనంగా జరిగింది. హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా ప్యాలెస్‌లో శుక్రవారం రాత్రి 12 గంటల 31 నిమిషాలకు (తెల్లవారితే శనివారం)ఈ పెళ్లి జరిగింది. హైదరాబాద్‌కి చెందిన ప్రముఖ విద్య, వ్యాపారవేత్త, శ్రీ శక్తి అధినేతలు డా. రామకృష్ణ పింజల, సత్య పింజల కుమారుడు, వ్యాపారవేత్త రవి ప్రఖ్యాతో నీలిమ గుణ ఏడడుగులు వేశారు. ఈ వివాహ వేడుకకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. కాగా రుద్రమదేవి సినిమాకు సహనిర్మాతగా వ్యవహరించిన నీలిమ శాకుంతలం(సమంత లీడ్ రోల్లో నటించారు)సినిమాతో నిర్మాతగా మారారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఎట్టకేలకు ఒక్కటైన లవ్‌బర్డ్స్, గ్రాండ్ వేడుక
సాక్షి, హైదరాబాద్: కొన్నాళ్ల పాటు డేటింగ్ చేసిన బాలీవుడ్ లవ్‌బర్డ్స్ ఆదిత్య సీల్, అనుష్క రంజన్ ఎట్టకేలకు మూడు ముళ్లబంధంతో ఒక్కటయ్యారు. ఈ జంట వివాహానికి ముందు ప్రీ వెడ్డింగ్ వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. గ్రాండ్‌గా మెహందీ, సంగీత్ ఇలా స్టార్-స్టడెడ్ ఈవెంట్స్‌లో వాణి కపూర్, అతియా శెట్టి, రవీనా టాండన్, భూమి పెడ్నేకర్, అలియా భట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అలాగే అలియా తన డ్యాన్స్‌లతో అదరగొట్టింది ప్రీ వెడ్డింగ్ వేడుకలో ఎరుపు లెహంగాలో అనుష్క, ఆదిత్య మెటాలిక్ బ్లాక్ షేర్వానీలో అదరగొట్టారు. ఇక వధూవరులుగా అనుష్క, ఆదిత్య ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. దండలు మార్చుకునే సమయంలో భావోద్వేగానికి లోనైన అనుష్క కళ్లు ఆదిత్య తుడవడం అక్కడున్నవారందరిలో ఆనందాన్ని నింపింది. -
డ్రైఫ్రూట్స్ వెడ్డింగ్ కార్డు.. బంగారపు పట్టు చీర
హైదరాబాద్: మైనింగ్ దిగ్గజం గాలి జనార్థన్ రెడ్డి కుమార్తె వివాహం మరువక ముందే అంత స్థాయిలో కాకపోయినా కాస్తా అటు..ఇటు హైదరాబాద్ లో గురువారం మరో వివాహం ఘనంగా జరగనుంది. ముషీరాబాద్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, రేణుక శక్తి సెక్యురిటీ సర్వీసెస్ ప్రైవేటు లిమిటెడ్ యజమాని గుర్రం శంకర్ కుమారుడు గుర్రం గణేష్ వివాహం బోయినపల్లిలోని అశోక గార్డెన్స్ లో వైభవంగా నిర్వహించనున్నారు. వీవీఐపీల కోసం ప్రత్యేకంగా 4 వేల వెడ్డింగ్ కార్డులను ఢిల్లీలో ముద్రించారు. అచ్చం గాలి వెడ్డింగ్ బాక్స్ టైప్ లో ఉండే కార్డు తెరవగానే పెళ్లి వివరాలు, ఆ తర్వాత రిసెప్షన్ వివరాలు పొందుపరిచారు. చివరలో నాలుగు రకాల డ్రైఫ్రూట్స్ ప్యాకెట్లు దర్శనమిస్తాయి. వధూవరులు ధరించే కోటు, చీర ఢిల్లీలోని కాలీ బజార్ లో ప్రముఖ డిజైనర్లు తీర్చిదిద్దారు. పెళ్లి కుమార్తె చీరకు బంగారు కోటింగ్ తో నగసీలు దిద్దుతున్నారు. రాజకీయ సినీ తారలతో పాటు దాదాపు 15 నుంచి 20 వేల మంది హాజరయ్యే ఈ వేడుకకు ఆ స్థాయిలో వంటకాలను సిద్ధం చేస్తున్నారు.