డెస్టినేషన్‌వెడ్డింగ్స్, విలాసవంతమైన సౌకర్యాలతో, ఆడంబరమైన పెళ్లిళ్లు ఈ మధ్యకాలంలో బడాబాబులకు, ఐశ్వర్యవంతులకు చాలా సాధారణంగా మారిపోయింది. కానీ భారతీయ చిత్రనిర్మాత, ఫ్యాషన్ డిజైనర్ జపిందర్ కౌర్, హోటల్ వ్యాపారి హర్‌ప్రీత్ సింగ్ చద్దా 2017లోనే దుబాయ్‌లో జరిగిన వివాహం సరికొత్త ట్రెండ్‌ని సృష్టించింది. పెళ్లి వేదికనుంచి దుస్తులు, ఆభరణాలనుంచి ప్రతీ వేడుక సోషల్ మీడియాలో విశేషంగా నిలిచింది. డిజైనర్ దుస్తులు, బంగారు తీగతో చేసిన చీర, డైమండ్లు, రత్నాల పొదిగిన ఆభరణాలు హెలికాప్టర్, ప్రైవేట్ యాచ్, ఇంకా.. చాలా ..చాలా..ఈ వివరాలేంటో ఒకసారి చూద్దాం.
జపిందర్ కౌర్ దుబాయ్‌కి చెందిన ఫ్యాషన్ డిజైనర్ కాగా, చద్దా ప్రముఖ వ్యాపారవేత్త. అంబానీ, అదానీలకు మించిపోయిన జపిందర్ కౌర్ , హర్‌ప్రీత్ సింగ్ చద్దా వివాహ వేడుకలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. దుబాయ్‌లోని ది పాలాజ్జో వెర్సెస్, ది పాలాజ్జో వెర్సెస్ దుబాయ్, బుర్జ్ ఖలీఫా , బుర్జ్ అల్ అరబ్‌లో అత్యంత ఘనంగా నిర్వహించిన ఈ వివాహ వేడుకల్లో ముఖ్యమైన మెహిందీ ఈవెంట్ కోసం ఈ జంట మెగా ప్రైవేట్ యాచ్‌ని కూడా బుక్ చేసుకుంది. హెలికాప్టర్‌ద్వారా 350 కిలోల గులాబీ రేకులను లగ్జరీ పడవలోకి జార విడవడంప్రత్యేక ఆకర్షణ. ఐదు రోజుల పాటు జరిగిన ఈ వేడుకల్లో ప్రతీదీ ఒక స్పెషల్ ఎట్రాక్షన్. ఈ వివాహానికి మొత్తం ఖర్చు రూ. 600 కోట్లుగా అంచనా. ఇది ఇషా అంబానీ, ఆనంద్ పిరమల్ పెళ్లి ఖర్చు కంటే కొంచెమే తక్కువ అంటే అర్థం చేసుకోవచ్చు ఈ పెళ్లి రేంజ్‌ను.
అద్భుతమైన డైమండ్ ఎంగేజ్‌మెంట్ రింగ్స్
బుర్జ్‌ఖలీఫాలో నిశ్చితార్థ వేడుకను ఘనంగా నిర్వహించారు. లేస్ డిజైన్‌తో తీర్చిదిద్దిన గౌనులో యువరాణిలా రాయల్టీ లుక్‌లో వెలిగిపోయింది. జపిందర్ గోల్డెన్ బ్యాండ్‌తో కూడిన 12 క్యారెట్ల డైమండ్ ఎంగేజ్‌మెంట్ రింగ్‌ను ధరించగా, ప్లాటినమ్ బ్యాండ్‌పై 6 క్యారెట్ల డైమండ్ రింగ్‌ను ధరించాడు చద్దా. ఈ లవబర్డ్స్ తమ రోకా వేడుకను విలాసవంతమైన బుర్జ్ అల్ అరబ్ జుమేరాలో నిర్వహించారు.
మెగా మెహిందీ ఈవెంట్
అంతేకాదు నిశ్చితార్థ వేడుకను మించి తమ రికార్డును తామే బద్దలు కొట్టి మరీ మెహందీ వేడుకను ఒక ప్రైవేట్ యాచ్‌లో నిర్వహించారు. గులాబీ రేకులను చల్లేందుకు ప్రత్యేకమైన హెలికాప్టర్‌ను బుక్ చేసుకున్నారు. 350 కిలోల గులాబీ రేకులను జంటపై, పడవలో ఉన్న ఇతరులపై హెలికాప్టర్ అందంగా వెదజల్లింది. ఇది వధూవరులను మాత్రమే కాదు అక్కడున్న వారందరినీ థ్రిల్ చేసిందంటే అతిశయోక్తి కాదేమో.
గ్రాండ్ వెడ్డింగ్
జపిందర్ కౌర్ హర్‌ప్రీత్ సింగ్ చదా గ్రాండ్ వెడ్డింగ్ వేడుక గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. విలువైన రత్నాలు పొదిగిన 5 మీటర్ల పొడవున్న ఈ గౌన్ బరువు 10 కిలోల కంటే ఎక్కువే. దార్ సారా పాస్టెల్ పింక్ హై-ఫ్యాషన్ వెడ్డింగ్ గౌన్‌తో, అంతకుమించిన డైమండ్ ఆభరణాలు,120-క్యారెట్ పోల్కీ వజ్రాలు, బర్మీస్ కెంపులు, పచ్చలు, ధరించిన మ్యాచింగ్ చెవిపోగులు , మాంగ్ టికాతో కూడిన లేయర్డ్ నెక్లెస్ దివినుంచి దిగివచ్చిన అప్సరసలా కనిపించింది.
ఈ వివాహ వేడుక వెడ్డింగ్ రిసెప్షన్‌లో కూడా ఎక్కడా తగ్గలేదు ఈ జంట. ఈ రాయల్ రిసెప్షన్ కోసం మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన స్వచ్ఛమైన బంగారు దారంతో గౌను, బంగారు కిరీటంతో ధగ ధగ మెరిసిపోయింది. ఇక హర్‌ప్రీత్ రాయల్ బ్లూ షేర్వానీలో, కెంపులు , పచ్చలు పొదిగిన బంగారు ఖడ్గంతో రాజకుమారిడిలా వెలిగిపోయాడు. ఇక విందు భోజనాలు గురించి ప్రత్యేకంగా చెప్సాల్సింది ఏముంటుంది.
Comments
Please login to add a commentAdd a comment