Helicopters
-
AP: బురదలో ఆహార పొట్లాలు.. సాయం ఇలాగేనా?
సాక్షి, విజయవాడ: వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెండు రోజుల నుంచి ఆహారం, నీరు లేకపోవడంతో హెలికాప్టర్ వద్దకి ప్రజలు పరుగులు తీస్తున్నారు. వాంబే కాలనీలో ఆహార పొట్లాలను హెలికాప్టర్ ద్వారా బురదలోకి జారవిడుస్తున్నారు. దీంతో ఆహారం, వాటర్ కోసం స్థానికులు బురదలో పడి కొట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.పక్కనే అపార్ట్మెంట్లు ఉన్నా బురదలో పడేయడం ఏంటి అని బాధితులు ప్రశ్నిస్తున్నారు. బురదలో పడి ఆహారం కోసం కుక్కలా కొట్టుకొనేటట్లు ప్రభుత్వం చేసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బురదలో ఆహార ప్యాకెట్లు పడటంతో సగం పైనే బురదమయం అవుతున్నాయని మహిళలు వాపోతున్నారు.మరో వైపు, వరద సహాయక చర్యల్లో పాల్గొనేందుకు వచ్చిన వారికి కష్టాలు తప్పడం లేదు. వరద బాధితులను తరలించేందుకు అధికారులు బోట్లను రప్పించారు. తిండీ తిప్పల్లేకుండా ఆకలితో అలమటిస్తూ.. బోట్లతో మత్స్యకారులు వచ్చారు. ముస్తాబాద్ వద్ద వరద బాధితుల కోసం బోటు ఏర్పాటు చేయగా, బోటుతో పాటు మచిలీపట్నం నుంచి ముగ్గురు మత్స్యకారులు వచ్చారు.అధికారులు తీసుకొచ్చి తమను వదిలేశారని.. ఒక్కరు కూడా తమను పట్టించుకోవడమ లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వరద బాధితుల ప్రాణాలను రక్షిస్తున్న తమ ప్రాణాలకు గ్యారంటీ లేదని మత్స్యకారులు వాపోతున్నారు. -
పొలం పనులకు వెళ్లి.. వరదలో చిక్కుకుని..
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/అశ్వారావుపేటరూరల్: ఒక్కసారిగా పెద్దవాగుకు వరద పోటెత్తింది. దీంతో ఆ వరద ఉధృతిలో 28 మంది చిక్కుకున్నారు. వారిని కాపాడేందుకు రెండు హెలికాప్టర్లు రంగంలోకి 25 మందిని సురక్షిత ప్రాంతానికి చేర్చగా, మరో ముగ్గురిని స్థానికులు కాపాడారు. వాన తగ్గిందని...భద్రాద్రి కొత్తగూడెంజిల్లా అశ్వారావుపేట మండలం గుమ్మడవెల్లి దగ్గర పెద్దవాగుపై మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఉంది. ప్రాజెక్టులోకి వరద వచ్చే క్యాచ్మెంట్ ఏరియాలో కొంత ఏపీలోని బుట్టాయిగూడెం మండల పరిధిలో ఉంది. బుధవారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో వాగులో ప్రవాహం పెరిగింది. మరోవైపు అశ్వారావుపేట మండలంలో గురువారం ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురిసింది. మధ్యాహ్నం 12:30 గంటలకు వాన కొంత తగ్గుముఖం పట్టడంతో స్థానికులు పొలాలకు వెళ్లారు. మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో పెద్దవాగుకు అకస్మాత్తుగా వరద పెరిగి ముందుగా ఒడ్డు వెంట ఉన్న పొలాలను చుట్టుముట్టింది. దీంతో వరదలో చిక్కుకున్న వారు ప్రాణాలు కాపాడుకునేందుకు చెరువుకట్టకు దగ్గరలో ఉన్న ఎత్తయిన ప్రదేశం వైపు వెళ్లారు. ఆ తర్వాత క్రమంగా వరద నీటిమట్టం పెరుగుతూ మధ్యాహ్నం 2:30 గంటల సమయానికి బాధితుల మోకాళ్లలోతు వరకు వచ్చాయి. క్రమంగా గట్టు దాటుకొని పొలాలను ముంచెత్తింది. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యానికి మించి వరద రావడంతో ముందుగా ప్రాజెక్టు ఎగువ భాగం ముంపునకు గురైంది. దీంతో వెంటనే ప్రాజెక్టుకు ఉన్న మూడు గేట్లు తెరిచేందుకు ప్రయత్నించగా అందులో ఒకటి తెరుచుకోలేదు. బాధితులు ఫోన్లో సమాచారం ఇవ్వగా, వరద పరిస్థితిని తెలుసుకున్న మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రభుత్వ యంత్రాంగాన్ని సహాయ కార్యక్రమాల కోసం అప్రమత్తం చేశారు. అటు అనుకుంటే ఇటు..: ఏపీలోని వేలేరు పాడు మండలం అల్లూరినగర్ దగ్గర వరద నీటిలో ఒక కారు కొట్టుకుపోయింది. అందులో ఉన్న ఐదుగురిని కాపాడేందుకు ఏపీ ప్రభుత్వం రంగంలోకి దిగి నేవీ హెలికాప్టర్‌ను పంపింది. అయితే హెలికాప్టర్ రావడం ఆలస్యం కావడంతో గ్రామస్తులు ఆ కారులో ఉన్న ఐదుగురిని కాపాడారు. దీంతో నేవీ హెలికాప్టర్ సంఘటనా స్థలానికి రాకుండా ఏలూరులో ఆగిపోయింది. అయితే అదే సమయంలో పెద్దవాగు ప్రాజెక్టు ఎగువన నారాయణపురంలో 28 మంది వరదలో చిక్కుకుపోయిన విషయం వెలుగుచూసింది. దీంతో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అక్కడి అధికారులతో మాట్లాడి హెలికాప్టర్‌ను ఇటు పంపించారు. జాయింట్ ఆపరేషన్: ఏలూరు నుంచి హెలికాప్టర్ ఘటనా స్థలికి 6:15 గంటలకు వచ్చింది. వెలుతురు సరిగ్గా లేదు. సహా య కార్యక్రమాలు ఏమేరకు జరుగుతాయో అనే సందేహం నెలకొంది. నేవీ హెలికాప్టర్ ముందుగా ప్రభావిత ప్రాంతంలో చక్కర్లు కొట్టి బాధితులు ఉన్న లొకేషన్‌ను గుర్తించింది. ఆ తర్వాత 20 నిమిషాలకు తెలంగాణకు చెందిన హెలికాప్టర్ ఘటనా స్థలికి చేరుకుంది. 6:45 గంటలకు అసలైన రెస్క్యూ ఆపరేషన్ మొదలైంది. నేవీ హెలికాప్టర్ దారి చూపిస్తూ లొకేషన్ దగ్గరికి తీసుకెళ్లి బాధితులు ఉన్న చోటుపై లైట్ వేసింది. రెండో హెలికాప్టర్ ఆ స్థలానికి చేరుకుని బాధితులకు రోప్ అందించింది. విడతల వారీగా బాధితులను బయటకు తీసుకురా వడంతో రెస్క్యూ ఆపరేషన్ విజయవంతమైంది. వైకుంఠధామంలో ల్యాండింగ్..బాధితులు మధ్యాహ్నం 3 గంటలకు వరద నీటిలో చిక్కుకున్నారు. గంటగంటకూ వరద నీరు పెరుగుతూ మోకాళ్ల లోతుకు వచ్చింది. బాధితుల్లో మహేశ్ అనే యువకుడి దగ్గరే ఫోన్ ఉంది. దీంతో ప్రాణభయంతో అందరూ ఆ ఫోన్ నుంచే కుటుంబసభ్యులకు ఫోన్ చేసి తమ ప్రాణాలు దక్కవేమోనంటూ బోరున విలపించారు. మూడు గంటలు గడిచినా రెస్క్యూఆపరేషన్ మొదలు కాకపోవడం, మరోవైపు చీకటి పడుతుండటంతో పైప్రాణాలు పైనే పోయాయని భావించారు. అయితే ఏడు గంటల సమయంలో వరద నీటి నుంచి వారిని కాపాడిన హెలికాప్టర్ ల్యాండింగ్‌కు సరైన స్థలం లేక నారాయణపురం గ్రామంలో ఉన్న వైకుంఠధామం (స్మశానం)లో వారిని దించింది. ప్రాణాపాయం నుంచి బయటపడిన వారికి వైకుంఠధామం తొలి ఆశ్రయం ఇచ్చింది.పెద్దవాగుకు గండిరైట్ కెనాల్ తూము దగ్గర 40 మీటర్ల వద్ద....తెలంగాణలో రెండు, ఏపీలో ఏడు గ్రామాలు మునక!ముందుగానే గ్రామాలు ఖాళీ చేసిన ప్రజలు సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఏపీ, తెలంగాణవాసులను గడగడలాడించిన పెద్దవాగుకు ప్రాజెక్టుకు గండిపడింది. రెండు రాష్ట్రాల పరిధి పెద్దవాగు క్యాచ్మెంట్ ఏరియాలో సుమారు 16 సెం.మీ. వర్షపాతం నమోదైంది. దీంతో గురు వారం ఉదయం నుంచి వాగుకు వరద పోటెత్తింది. ఈ ప్రాజెక్టు నీటినిల్వ సామర్థ్యం 40,500 క్యూసెక్కులు కాగా మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి 70 వేల క్యూసెక్కులు, సాయంత్రం 5గంటలకల్లా 90 వేల క్యూసెక్కుల వరద చేరింది. దీంతో మధ్యాహ్నం నుంచే ప్రాజెక్టుకు ఎగపోటు మొదలైంది. సాయంత్రం 5–30 గంటలకు గేట్లు, మట్టికట్ట మీద నుంచి నీరు ప్రవహించడం మొద లైంది. రాత్రి 7.30గంటల సమయంలో 32 వేల క్యూసెక్కుల నీటిని కిందికి వదిలారు. అయితే ఉధృతి తగ్గకపోవడంతో రాత్రి 8 గంటల సమయంలో రైట్ కెనాల్ తూము దగ్గర 40 మీటర్ల మేరకు గండి పడగా, అక్కడి నుంచి కొంత దూరంలో మరో 20 మీటర్ల మేరకు గండి పడింది. మొత్తంగా 150 మీటర్ల మేరకు మట్టి కట్ట బలహీనపడిందని ఇరిగేషన్ అధికారులు తెలిపారు. నీట మునిగిన గ్రామాలు: పెద్దవాగు దిగువన తెలంగాణలో గుమ్మడవెల్లి, కొత్తూ రు గ్రామాలు ఉన్నాయి. గురువారం సాయంత్రం వరద ఉధృతి పెరిగిన వెంటనే ఈ గ్రామాల్లో ఉన్న ప్రజలు అధికారులు హుటా హుటిన ఖాళీ చేయించారు. గండి పడిన తర్వాత వచ్చిన వరద నలభై ఇళ్లను ముంచెత్తింది. పశువులు ఇతర ఆస్తి నష్టం వివ రాలు తెల్లవారితే కానీ తెలిసే అవకాశం లేదు. ఏపీలోని వేలేరుపాడు మండలం మేడిపల్లి, రామవరం, గుండ్లవాయి, రెడ్డిగూడెంకాలనీ, మద్దిగట్ల, పూచిరాల గ్రామాల్లోనూ వరద ప్రభావానికి లోనయ్యాయి. -
గాల్లో నేవీ హెలికాఫ్టర్లు ఢీ.. 10 మంది దుర్మరణం
మలేషియాలో మంగళవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. వైమానిక దళానికి చెందిన హెలికాఫ్టర్లు గాల్లోనే ఒకదాంతో మరొకటి ఢీ కొట్టాయి. ఈ ప్రమాదంలో పది మంది దుర్మరణం పాలయ్యారు. రాయల్ మలేషియన్ నేవీ పరేడ్ కోసం మంగళవారం ఉదయం లుముత్ నేవల్ బేస్‌లో రిహాల్సల్ జరిగాయి. ఆ సమయంలో రెండు హెలికాఫ్టర్లు ఆకాశంలోనే ఢీ కొట్టాయి. ముక్కలైన శకలాలు కింద మైదానంలో పడిపోయాయి. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే.. రెండు హెలికాఫ్టర్లలో పది మంది సిబ్బంది అక్కడికక్కడే చనిపోయినట్లు మలేషియా నేవీ ప్రకటించుకుంది. మృతదేహాల గుర్తింపునకు కోసం నేవీ ఆస్పత్రికి మృతదేహాల్ని తరలించినట్లు తెలిపింది. ⚡Ten people are reported killed as two military #helicopters had a mid-air collision in #Malaysia during preparations for a naval military parade. The incident occurred in the town of Lumut at around 9:30 am during a training to mark the 90th anniversary of the Royal… pic.twitter.com/OEF3SDNG6a — Shafek Koreshe (@shafeKoreshe) April 23, 2024 -
రేపే ఎన్నికలు.. సిద్ధంగా హెలికాప్టర్లు! ఎందుకంటే..
దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల తొలి దశ పోలింగ్ ఏప్రిల్ 19న ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్‌లో ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు రాష్ట్ర అదనపు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ విజయ్ కుమార్ జోగ్దండే ఎన్నికలకు సన్నద్ధత గురించిన సమాచారాన్ని అందించారు. ఉత్తరాఖండ్‌లోని మొత్తం ఐదు లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్ 19న ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. అత్యవసర సేవ కోసం రెండు హెలికాప్టర్లను ఏర్పాటు చేశామని, ఈసారి ఓటింగ్ ప్రమాద రహితంగా ఉంటుందని, ఎటువంటి అత్యవసర పరిస్థితి తలెత్తదని ఉత్తరాఖండ్ అదనపు ఎన్నికల అధికారి జోగ్దండే తెలిపారు. "అన్ని పోలింగ్ బృందాలు బయలుదేరుతున్నాయి. వారి అత్యవసర సేవ కోసం రెండు హెలికాప్టర్లను ఏర్పాటు చేశాం. ఒక హెలికాప్టర్ గర్వాల్‌లో, మరొకటి కుమావోన్లో మోహరిస్తాం. వీటిని అత్యవసర అవసరాలకు మాత్రమే ఉపయోగిస్తాం. బూత్ స్థాయిలో సహాయ నిర్వహణలో భాగంగా కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, అంబులెన్స్‌ల నంబర్లను అందుబాటులో ఉంచాం" అని ఆయన పేర్కొన్నారు. కొండ ప్రాంతంలో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు రాష్ట్రవ్యాప్తంగా 11వేలకు పైగా పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేస్తున్నారు. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. కాగా 2014, 2019 సార్వత్రిక ఎన్నికలలో వరుసగా రెండుసార్లు మొత్తం ఐదు స్థానాలనూ బీజేపీ గెలుచుకుంది. ఇప్పుడు మరోసారి క్లీన్‌స్వీప్ చేసి హ్యాట్రిక్ కొట్టాలని ఉత్సాహంగా ఉంది. -
వినువీధిలో మిలాన్ మెరుపులు
సాక్షి, విశాఖపట్నం: విశాఖ వేదికగా జరుగుతున్న మిలాన్–2024 విన్యాసాల్లో కీలకమైన ఇంటర్నేషనల్ సిటీ పరేడ్‌ను గురువారం సాయంత్రం విజయవంతంగా నిర్వహించారు. కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్‌భట్, ఇండియన్ నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్.హరికుమార్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్లు ఇంటర్నేషనల్ సిటీ పరేడ్‌ను ఆర్కే బీచ్‌లో ప్రారంభించారు. యుద్ధ నౌకల ప్రదర్శనలు, మిగ్–29 ఎయిర్‌క్రాఫ్ట్‌ల గగుర్పొడిచే విన్యాసాలు, సీహాక్స్, చేతక్, ఏఎల్‌హెచ్ హెలికాఫ్టర్ల సమర ప్రదర్శనలకు విశాఖ ఆర్కే బీచ్ వేదికైంది. లక్షలాది మంది వీక్షకుల నడుమ మార్కోస్.. శత్రుమూకలతో చేసిన పోరాటాలు సాగర తీరాన్ని రణరంగంగా మార్చాయి. యుద్ధ విన్యాసాల అనంతరం.. మిలాన్‌లో పాల్గొన్న 51 దేశాల జాతీయ జెండాల ప్రదర్శన, నౌకాదళ సిబ్బంది పరేడ్ ఆకట్టుకుంది. అనంతరం ప్రదర్శించిన నేవీ బ్యాండ్ ఉర్రూతలూగించగా.. కూచిపూడి, థింసా, గరగ, తప్పెటగుళ్లు, కొమ్ము నృత్యం, కోలాటం, గార్భా, దాండియా.. ఇలా వివిధ రాష్ట్రాలకు చెందిన నృత్య ప్రదర్శనలు విదేశీయుల్ని సైతం మంత్ర ముగ్ధుల్ని చేశాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాల పథకాలతో ఏర్పాటు చేసిన శకట ప్రదర్శనకు విదేశీయులు సైతం ఫిదా అయ్యారు. నేవీ బ్యాండ్‌తో ముగింపు పలకగా.. చివర్లో దేశ పరాక్రమాన్ని, ఇండియన్ నేవీ సామర్థ్యాన్ని ప్రస్ఫుటించేలా నిర్వహించిన లేజర్ షో అద్భుతంగా సాగింది. బాణసంచా పేలుళ్లతో కార్యక్రమాన్ని ముగించారు. సాగర జలాల్లో యుద్ధ విమాన వాహక నౌకలు ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ విక్రమాదిత్యతో పాటు వార్‌షిప్స్ జలాశ్వ, ముంబై, చెన్నై యుద్ధ నౌకలు విద్యుత్ వెలుగుల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా వివిధ దేశాల నేవీ సిబ్బంది గౌరవ వందనాన్ని కేంద్ర మంత్రి అజయ్‌భట్ స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారానికి కృతజ్ఞతలు విశాఖలో నిర్వహించిన రెండు మిలాన్‌లు అతిపెద్ద విన్యాసాలుగా చరిత్రకెక్కాయి. తూర్పు నౌకాదళంతో కలిసి విశాఖ నగరం మేరీటైమ్ సిటీగా అభివృద్ధి చెందుతోంది. భవిష్యత్‌లో నౌకాదళానికి విశాఖ నగరం కేంద్ర బిందువుగా మారనుంది. మిలాన్–2024 విన్యాసాల్లో భాగంగా నిర్వహించిన సిటీ పరేడ్ ద్వారా ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ.. సముద్ర జలాల్లో స్వేచ్ఛాయుత వాతావరణాన్ని అందించాలన్నదే లక్ష్యం. 51 దేశాల ప్రతినిధులకు రాష్ట్ర ప్రభుత్వం అందించిన సహకారం, ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయి. – అజయ్‌భట్, కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి విశాఖ నగరం అద్భుత ఆతిథ్యమిచ్చింది మిలాన్–2024 విన్యాసాలకు విశాఖ నగరం అద్భుతంగా ఆతిథ్యమిచ్చింది. మిలాన్ ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ విజయవంతంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో సహకరించినందుకు కృతజ్ఞతలు. విశాఖకు, నౌకాదళానికి అవినాభావ సంబంధం ఉంది. ఈస్ట్రన్ సీ బోర్డ్‌లో విశాఖ కీలక పాత్ర పోషిస్తోంది. అందుకే మిసైల్ డిస్ట్రాయర్ వార్ షిప్‌నకు.. ఐఎన్ఎస్ విశాఖపట్నంగా నామకరణం చేసి నగరానికి అంకితం చేశాం. ఇక్కడ నిర్వహించే ప్రతి నౌకాదళ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సహకరిస్తున్న ప్రభుత్వానికి, విశాఖ ప్రజలకు కృతజ్ఞతలు. – అడ్మిరల్ ఆర్ హరికుమార్, భారత నౌకాదళాధిపతి -
దక్షిణ గాజాపై ఇజ్రాయెల్ గురి
ఖాన్ యూనిస్: శనివారం దక్షిణ గాజాలోని నిర్దేశిత లక్ష్యాలపై ఇజ్రాయెల్ దాడులకు పాల్పడింది. ఇజ్రాయెల్ సైన్యం గాజా స్ట్రిప్‌లో హెలికాప్టర్ల ద్వారా మొట్టమొదటిసారిగా మ్యాప్ ముద్రించిన కరపత్రాలను విడిచిపెట్టింది. అందులో, దాడుల నుంచి రక్షణ పొందేందుకు తాముంటున్న చోటు నుంచి సురక్షిత ప్రాంతానికి ఎలా వెళ్లాలో తెలిపే వివరాలున్నాయి. శుక్రవారం ఉదయం నుంచి శనివారం వరకు దాడుల్లో కనీసం 200 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయినట్లు గాజాలోని ఆరోగ్య శాఖ తెలిపింది. -
తక్కువ సమయంలో విస్తృత ప్రచారం
సాక్షి,. హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో విస్తృత ప్రచారం నిర్వహించేందుకు, సాధ్యమైనన్ని ఎక్కువ అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేయడానికి వీలుగా బీజేపీ ముఖ్యనేతలు హెలికాప్టర్ సేవలను వినియోగించుకోనున్నారు. కేంద్రమంత్రి, బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, రాష్ట్ర పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్, ఇతర ముఖ్యనేతలు నిర్వహించే ప్రచారానికి హెలికాప్టర్లను వినియోగించనున్నారు. ఇందులో భాగంగా...గురువారం ఉదయమే ఢిల్లీ నుంచి నగరానికి తిరిగొచ్చిన ఈటల రాజేందర్...బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి హెలికాప్టర్లో మహబూబాబాద్ జిల్లా గూడూరుకు వెళ్లారు. గూడూరు నుంచి రోడ్డు మార్గాన డోర్నకల్ నియోజకవర్గంలోని నరసింహులపేటకు వచ్చిన ఆయన బీజేపీ అభ్యర్థి భూక్య సంగీత తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అక్కడి నుంచి రోడ్డుమార్గాన మహబూబాబాద్ నియోజకవర్గంలోని గూడూరుకు చేరుకుని అక్కడ బీజేపీ అభ్యర్థి హుస్సేన్ నాయక్ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికల సభ ముగిశాక హెలికాప్టర్లో హైదరాబాద్ చేరుకున్నారు. మళ్లీ ఈ నెల 5వ తేదీ నుంచి హెలికాప్టర్ ద్వారా ఆయా నియోజకవర్గాల్లో ఈటల ప్రచారాన్ని నిర్వహించనున్నారు. తాజాగా పార్టీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల కావడంతో...నామినేషన్ల దాఖలు...ఎన్నికల ప్రచార కార్యక్రమాల షెడ్యూల్‌ను ఖరారు చేసుకోవాల్సి ఉంది. మరో మూడు రోజుల్లో ప్రచార షెడ్యూల్‌ను ఖరారు చేసుకుని హెలికాప్టర్ ద్వారా విస్తృత ప్రచారాన్ని చేపడతామని బండి సంజయ్ ‘సాక్షి’తో మాట్లాడుతూ చెప్పారు. ప్రతీరోజు ఉదయం 7 నుంచి 11 దాకా, మళ్లీ సాయంత్రం 4 నుంచి 9 దాకా తాను పోటీచేస్తున్న కరీంనగర్లో సంజయ్ ప్రచారం నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల దాకా వరుసగా ఇతర అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచారానికి సంజయ్ సిద్ధమవుతున్నారు. పార్టీ అప్పగించిన ప్రచార బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తూనే.. పోటీ చేసే అసెంబ్లీ నియోజకవర్గంలోనూ ప్రజలకు అందుబాటులో ఉండనున్నట్లు సంజయ్ తెలిపారు. బీజేపీ అభ్యర్థుల మలివిడత జాబితాను ప్రకటించాక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డా.కె.లక్ష్మణ్ ఇతర నేతల ఎన్నికల ప్రచారానికి పార్టీ షెడ్యూల్ ఖరారు చేస్తోంది. కిషన్‌రెడ్డి, ఇతర ముఖ్యనేతలు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల సభలో పాల్గొనేందుకు వీలుగా హెలికాప్టర్ సేవలను అందుబాటులోకి తీసుకుని వస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు హెలికాప్టర్లో నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తుండగా..కాంగ్రెస్ కూడా పార్టీ అధినేతలు వచ్చిన సమయంలో హెలికాప్టర్ సేవలను వినియోగించుకుంటోంది. -
గ్రాండ్ వెడ్డింగ్‌లో అంబానీల మించిన జంట ఎవరో తెలుసా?
డెస్టినేషన్వెడ్డింగ్స్, విలాసవంతమైన సౌకర్యాలతో, ఆడంబరమైన పెళ్లిళ్లు ఈ మధ్యకాలంలో బడాబాబులకు, ఐశ్వర్యవంతులకు చాలా సాధారణంగా మారిపోయింది. కానీ భారతీయ చిత్రనిర్మాత, ఫ్యాషన్ డిజైనర్ జపిందర్ కౌర్, హోటల్ వ్యాపారి హర్‌ప్రీత్ సింగ్ చద్దా 2017లోనే దుబాయ్‌లో జరిగిన వివాహం సరికొత్త ట్రెండ్‌ని సృష్టించింది. పెళ్లి వేదికనుంచి దుస్తులు, ఆభరణాలనుంచి ప్రతీ వేడుక సోషల్ మీడియాలో విశేషంగా నిలిచింది. డిజైనర్ దుస్తులు, బంగారు తీగతో చేసిన చీర, డైమండ్లు, రత్నాల పొదిగిన ఆభరణాలు హెలికాప్టర్, ప్రైవేట్ యాచ్, ఇంకా.. చాలా ..చాలా..ఈ వివరాలేంటో ఒకసారి చూద్దాం. జపిందర్ కౌర్ దుబాయ్‌కి చెందిన ఫ్యాషన్ డిజైనర్ కాగా, చద్దా ప్రముఖ వ్యాపారవేత్త. అంబానీ, అదానీలకు మించిపోయిన జపిందర్ కౌర్ , హర్‌ప్రీత్ సింగ్ చద్దా వివాహ వేడుకలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. దుబాయ్‌లోని ది పాలాజ్జో వెర్సెస్, ది పాలాజ్జో వెర్సెస్ దుబాయ్, బుర్జ్ ఖలీఫా , బుర్జ్ అల్ అరబ్‌లో అత్యంత ఘనంగా నిర్వహించిన ఈ వివాహ వేడుకల్లో ముఖ్యమైన మెహిందీ ఈవెంట్ కోసం ఈ జంట మెగా ప్రైవేట్ యాచ్‌ని కూడా బుక్ చేసుకుంది. హెలికాప్టర్ద్వారా 350 కిలోల గులాబీ రేకులను లగ్జరీ పడవలోకి జార విడవడంప్రత్యేక ఆకర్షణ. ఐదు రోజుల పాటు జరిగిన ఈ వేడుకల్లో ప్రతీదీ ఒక స్పెషల్ ఎట్రాక్షన్. ఈ వివాహానికి మొత్తం ఖర్చు రూ. 600 కోట్లుగా అంచనా. ఇది ఇషా అంబానీ, ఆనంద్ పిరమల్ పెళ్లి ఖర్చు కంటే కొంచెమే తక్కువ అంటే అర్థం చేసుకోవచ్చు ఈ పెళ్లి రేంజ్‌ను. అద్భుతమైన డైమండ్ ఎంగేజ్మెంట్ రింగ్స్ బుర్జ్‌ఖలీఫాలో నిశ్చితార్థ వేడుకను ఘనంగా నిర్వహించారు. లేస్ డిజైన్‌తో తీర్చిదిద్దిన గౌనులో యువరాణిలా రాయల్టీ లుక్‌లో వెలిగిపోయింది. జపిందర్ గోల్డెన్ బ్యాండ్‌తో కూడిన 12 క్యారెట్ల డైమండ్ ఎంగేజ్మెంట్ రింగ్‌ను ధరించగా, ప్లాటినమ్ బ్యాండ్‌పై 6 క్యారెట్ల డైమండ్ రింగ్‌ను ధరించాడు చద్దా. ఈ లవబర్డ్స్ తమ రోకా వేడుకను విలాసవంతమైన బుర్జ్ అల్ అరబ్ జుమేరాలో నిర్వహించారు. మెగా మెహిందీ ఈవెంట్ అంతేకాదు నిశ్చితార్థ వేడుకను మించి తమ రికార్డును తామే బద్దలు కొట్టి మరీ మెహందీ వేడుకను ఒక ప్రైవేట్ యాచ్‌లో నిర్వహించారు. గులాబీ రేకులను చల్లేందుకు ప్రత్యేకమైన హెలికాప్టర్‌ను బుక్ చేసుకున్నారు. 350 కిలోల గులాబీ రేకులను జంటపై, పడవలో ఉన్న ఇతరులపై హెలికాప్టర్ అందంగా వెదజల్లింది. ఇది వధూవరులను మాత్రమే కాదు అక్కడున్న వారందరినీ థ్రిల్ చేసిందంటే అతిశయోక్తి కాదేమో. గ్రాండ్ వెడ్డింగ్ జపిందర్ కౌర్ హర్‌ప్రీత్ సింగ్ చదా గ్రాండ్ వెడ్డింగ్ వేడుక గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. విలువైన రత్నాలు పొదిగిన 5 మీటర్ల పొడవున్న ఈ గౌన్ బరువు 10 కిలోల కంటే ఎక్కువే. దార్ సారా పాస్టెల్ పింక్ హై-ఫ్యాషన్ వెడ్డింగ్ గౌన్‌తో, అంతకుమించిన డైమండ్ ఆభరణాలు,120-క్యారెట్ పోల్కీ వజ్రాలు, బర్మీస్ కెంపులు, పచ్చలు, ధరించిన మ్యాచింగ్ చెవిపోగులు , మాంగ్ టికాతో కూడిన లేయర్డ్ నెక్లెస్ దివినుంచి దిగివచ్చిన అప్సరసలా కనిపించింది. ఈ వివాహ వేడుక వెడ్డింగ్ రిసెప్షన్లో కూడా ఎక్కడా తగ్గలేదు ఈ జంట. ఈ రాయల్ రిసెప్షన్ కోసం మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన స్వచ్ఛమైన బంగారు దారంతో గౌను, బంగారు కిరీటంతో ధగ ధగ మెరిసిపోయింది. ఇక హర్‌ప్రీత్ రాయల్ బ్లూ షేర్వానీలో, కెంపులు , పచ్చలు పొదిగిన బంగారు ఖడ్గంతో రాజకుమారిడిలా వెలిగిపోయాడు. ఇక విందు భోజనాలు గురించి ప్రత్యేకంగా చెప్సాల్సింది ఏముంటుంది. View this post on Instagram A post shared by JAPINDER KAUR (@japinderkaur) -
ఎన్నికల సందడి.. స్టార్ క్యాంపెయినర్లతో విమానాలకు డిమాండ్
రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల సందడి మొదలైంది. ప్రధాన పార్టీలు ప్రచారానికి సన్నద్ధమవుతున్నాయి. రాష్ట్రమంతటా సుడిగాలి పర్యటనలు, వందల సంఖ్యలో ప్రచార సభలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో హెలికాప్టర్లు, చార్టర్డ్ విమానాలకు డిమాండ్ ‘టేకాఫ్’ తీసుకుంటోంది. ఇతర రాష్ట్రాల నుండి ఇక్కడ ప్రచారం చేయడానికి వచ్చే జాతీయ పార్టీ నేతలు, స్టార్ క్యాంపెయినర్లు వీటిని అద్దెకు తీసుకునేందుకు సై అంటున్నారు. ఒత్తిడి లేకుండా, వేగవంతంగా, సౌకర్యవంతంగా ప్రయాణం చేసే వీలుతో పాటు సమయం ఆదా అవుతుండటంతో అద్దె హెలికాప్టర్లకు ఎన్నికల వేళ గిరాకీ జోరందుకుంటుంది. గంటల వ్యవధిలోనే ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు వెళ్లి పలు ప్రచారాల్లో పాల్గొనే అవకాశం ఉండటం కూడా నేతలను గాల్లో చక్కర్లు కొట్టేలా చేస్తోంది. – సాక్షి, హైదరాబాద్ అద్దె లక్షల్లోనే... బ్లేడ్ ఇండియా, అర్బన్ ఎయిర్ మొబిలిటీ, ఇండియన్ ఫ్లై సర్విసెస్, జెట్‌సెట్‌గో వంటి కంపెనీలు హెలికాప్టర్లు, జెట్ విమానాలను అద్దెకు ఇస్తున్నాయి. ప్రైవేట్ ఏజెన్సీలతో పాటు సువిధ యాప్ ద్వారా కూడా హెలికాప్టర్లతో సహా వాహనాలను అద్దెకు తీసుకునేందుకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. సాధారణంగా బెల్ 407, ఎయిర్‌బస్ హెచ్125, హెచ్130 వంటి హెలికాప్టర్లను అద్దెకు తీసుకుంటారు. ఇందులో అయిదుగురు ప్రయాణించవచ్చు. సాధారణంగా సింగిల్ ఇంజిన్ హెలికాప్టర్ అద్దె గంటకు రూ.1.5 లక్షల నుంచి ఉంటుంది. రెండు ఇంజిన్ల సామర్థ్యం ఉంటే రూ.2.75 లక్షల వరకు అవుతుంది. జాతీయ పార్టీల నుంచి డిమాండ్.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఇతర రాష్ట్రాల ముఖ్య మంత్రులు, స్టార్ క్యాంపెనర్లతో తెలంగాణలో ప్రచారం చేయించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. దీంతో రాబోయే రోజుల్లో అద్దె హెలికాప్టర్లు, చార్టర్డ్ ఫ్లయిట్లకు డిమాండ్ మరింత పెరుగుతుందని పరిశ్రమ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే పోటీలో ఉన్న రాజకీయ పార్టీలు, వ్యక్తిగత రాజకీయ నాయకుల నుంచి హెలిక్టాపర్ల అద్దెకు అభ్యర్థనలు వస్తున్నాయని ఓ సంస్థ ప్రతినిధిని తెలిపారు. ఆయా పార్టీల నాయకులు కర్ణాటక, ఇతర రాష్ట్రాల ఎన్నికల్లో తమ హెలికాప్టర్లను అద్దెకు తీసుకొని ప్రచారం సాగించారని తెలిపారు. తెలంగాణలోనూ ఇరు పార్టీలు ప్రధానంగా పోటీలో ఉండటం వల్ల ఇక్కడ కూడా ఫుల్ డిమాండ్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. డీజీసీఏ మార్గదర్శకాలు తప్పనిసరి.. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) నిర్దేశించిన నిబంధనలను ఆపరేటర్లు తూ.చ. తప్పకుండా పాటించాల్సిందే. పైగా ఎన్నికల సమయంలో ప్రత్యేక మార్గదర్శకాలు కూడా ఉన్నాయి. మంత్రులు, సీనియర్ రాజకీయ నేతలు రెండు ఇంజిన్లు ఉన్న హెలికాప్టర్ లేదా విమానంలో మాత్రమే ప్రయాణించాల్సి ఉంటుంది. వీఐపీ విమానాలను నడిపే పైలట్లు ని ర్మిష్ట రకం విమానం లేదా హెలికాప్టర్లో నిర్దిష్ట సంఖ్యలో ఫ్లయింగ్ గంటల అనుభవాన్ని కలిగి ఉండాలి. అద్దె ఖర్చు ఎవరి ఖాతాలో.. హెలికాప్టర్ అద్దెలపై కూడా ఎన్నికల కమిషన్ నిఘా ఉంటుంది. జిల్లా ఎన్నికల అధికారి, స్థానిక డిప్యూటీ కమిషనర్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఒక స్టార్ క్యాంపెయినర్ హెలికాప్టర్‌ను ఉపయోగిస్తే అభ్యర్థి పేరు తీసుకోకుండా లేదా అభ్య ర్థితో వేదికను పంచుకోకుండా ప్రసంగాలు చేస్తే అప్పుడు ఆ ఖర్చు మొత్తం పార్టీపైనే పడుతుంది. ఒకవేళ అభ్యర్థి పేరుతో ప్రచారం చేస్తే గనుక అప్పుడు ఆ వ్యయం పార్టీ, అభ్య ర్థికి చెరి సగం పడుతుందని ఎన్నికల కమిషన్ చెబుతోంది. సొంతంగా హెలికాప్టర్లు ఉన్న వారి ప్రయాణ సమయం, అద్దెను అభ్యర్థుల ఖర్చుగా పరిగణిస్తారు. ప్రచార రథాలు సిద్ధం సాక్షి, హైదరాబాద్: ఎన్నికల షెడ్యూల్ విడుదలతో వివిధ పార్టీలకు ప్రచార వాహనాలను రూపొందించే సిబ్బందికి, వాహనాలకు, డ్రైవర్లకు ఒక్కసారిగా డిమాండ్ వచ్చింది. పార్టీల జెండాలు, బ్యానర్లను తయారు చేసే టైలర్లకు సైతం భారీ గిరాకీ వచ్చింది. ఉప్పల్, చర్లపల్లి తదితర పారిశ్రామిక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున రెడీమేడ్ దుస్తులను తయారు చేసే పలు కంపెనీల్లోని కుట్టుమిషన్లపైన ఇప్పుడు పార్టీల జెండాలు రెడీ అవుతున్నాయి. అంబర్పేట్ పటేల్‌నగర్, మూసారాంబాగ్ తదితర ప్రాంతాల్లోనూ వివిధ రాజకీయ పార్టీలకు చెందిన జెండాలను, బ్యానర్లను తయారు చేసే మహిళా టైలర్లకు డిమాండ్ వచ్చేసింది. తాత్కాలికంగా అయినా ఇప్పుడు ఇది ఓ కుటీర పరిశ్రమగా మారినట్లు పటేల్‌నగర్‌కు చెందిన బాలమణి తెలిపారు. రోజుకు 250 నుంచి 300 వరకు బ్యానర్లు, జెండాలు, ఇతర ప్రచార సామగ్రిని తయారు చేస్తున్నామని చెప్పారు. ప్రచార రథాలకు మేకప్.... నేతలు ప్రచార వాహనాలను సిద్ధం చేసుకుంటున్నారు. ప్రచార వాహనాల కోసం వినియోగించే టాటా, మహీంద్ర వాహనాలకు డిమాండ్ వచ్చేసింది. అభ్యర్థుల కటౌట్లు, బ్యానర్లు తదిర హంగులతో ప్రచార రథాలుగా తీర్చిదిద్దేందుకు కా ర్మికులు, టెక్నీషియన్లు రాత్రింబవళ్లు పని చేస్తున్నారు. మూసారాంబాగ్, ఇందిరాపార్కు, తదితర ప్రాంతాల్లో ప్రచార ర«థాల తయారీ పనులు జోరుగా సాగుతున్నాయి. -
Karnataka Assembly Election 2023: హెలికాప్టర్లకు డిమాండ్
సాక్షి,బళ్లారి: విధానసభ ఎన్నికలకు నామినేషన్ల ఉపసంహరణ పర్వం ముగియడంతో బరిలో ఉన్నదెవరో తేలిపోయింది. ఇక ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. పోలింగ్‌కు మరో 12 రోజులే గడువు ఉంది. దీంతో అన్ని ప్రాంతాల్లోనూ బహిరంగ సభలు నిర్వహించి ప్రముఖులతో ప్రచారం చేయిస్తున్నారు. రాష్ట్రంలోని 224 నియోజకవర్గాల్లో పర్యటించేందుకు బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ అగ్రనాయకులు హెలికాప్టర్లను ఆశ్రయిస్తున్నారు. దీంతో వాటికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. గతానికంటే ఈ సారి ఎన్నికలు విభిన్నంగా జరగనున్నాయి. అనేక మంది సీనియర్‌నేతలు పార్టీలు మారారు. దీంతో ఏ పార్టీకి కూడా గెలుపు అంత ఈజీ కాదనే పరిస్థితులు నెలకొన్నాయి. ఈక్రమంలో బీజేపీ తరఫున ప్రధానమంత్రి మోదీ, కేంద్ర మంత్రులు అమిత్‌షాతో పాటు కేంద్ర మంత్రివర్గం మొత్తం రాష్ట్రంలో తిష్టవేసి ప్రచారాన్ని తారాస్థాయికి తీసుకెళ్లనున్నారు. యూసీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో పాటు ఇతర బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు కూడా పాల్గొంటున్నారు. కాంగ్రెస్ తరఫున రాహుల్‌గాంధీ, మల్లికార్జున ఖర్గే, సిద్ధరామయ్య, డీకేశి, జేడీఎస్ తరఫున దేవెగౌడ, కుమారస్వామి కూడా ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. వీరందరూ కూడా దాదాపు హెలికాప్టర్లు వాడుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఈసారి రెట్టింపు సంఖ్యలో హెలికాప్టర్లు రాష్ట్రంలో చక్కర్లు కొడుతున్నాయని హెలిప్యాడ్ సంస్థ సంబంధిత అధికారి తెలిపారు. అన్ని రాజకీయ పార్టీల అతిరథ మహారథులు దాదాపు 100 హెలికాప్టర్లను వినియోగిస్తున్నట్లు అంచనా. రాష్ట్రంలో తగినన్ని హెలికాప్టర్లు లేనందున ముంబై, పుణే, పనాజి, హైదరాబాద్ తదితర ప్రముఖ నగరాల్లో ప్రైవేటు వ్యక్తుల నుంచి బాడుగకు తీసుకు వచ్చి ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. భారీగా పెరిగిన హెలికాప్టర్ బాడుగ బెంగళూరు, మంగళూరు, హుబ్లీ, బెళగావి, మైసూరు తదితర ప్రాంతాల్లో హెలిప్యాడ్‌లో ప్రముఖులు హెలికాప్టర్లను ఉంచి చుట్టుపక్కల నియోజకవర్గాలకు కార్లలో వెళ్లి ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఒక జిల్లా నుంచి మరొక జిల్లాకు వెళ్లేటప్పుడు హెలికాప్టర్‌ను బయటకు తీస్తారు. గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఈ సంవత్సరం హెలికాప్టర్ బాడుగ కూడా భారీగా పెరిగినట్లు తెలుస్తోంది. రెండు సీట్ల కెపాసిటీ ఉన్న హెలికాప్టర్ బాడుగ గంటకు రూ. లక్ష ఉండేది. ప్రస్తుతం రూ.2 లక్షలకు చేరింది. నాలుగు సీట్ల హెలికాప్టర్ బాడుగ రూ.2.5 లక్షలు, 8 సీట్ల హెలికాప్టర్ బాడుగ రూ.3.5 లక్షలు, 15 సీట్ల హెలికాప్టర్ బాడుగ రూ.5 లక్షల అద్దె వసూలు చేస్తున్నారు. హెలిప్యాడ్ వద్ద హెలికాప్టర్లను ఉంచేందుకు 8 గంటలకు రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు బాడుగ తీసుకుంటారు. -
తిరుమలలో హెలికాప్టర్ల చక్కర్లు..
సాక్షి, తిరుపతి: తిరుమలలో హెలికాప్టర్లు చక్కర్లు కొట్టాయి. నో ఫ్లై జోన్ నుంచి మూడు హెలికాప్టర్లు వెళ్లాయి. అయితే ఇవి ఎయిర్‌ఫోర్స్‌కు చెందినవని సమాచారం. కడప నుంచి చెన్నై వెళ్లే సమయంలో తిరుమల మీది నుంచి ప్రయాణించినట్లు తెలుస్తోంది. కానీ ఈ విషయాన్ని ఎయిర్‌ఫోర్స్ అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. మంగళవారం మధ్యాహ్నం ఈ హెలికాప్టర్లు కన్పించాయి. తిరుమల నో ఫ్లైయింగ్ జోన్ అనే విషయం తెలిసిందే. ఈ ప్రాంతంలో విమానాలు, హెలికాప్టర్లు ఎగరకూడదనే నిబంధన ఉంది. చదవండి: తిరుమలలో పాముల కలకలం -
భారత వైమానిక దళంలోకి మన ప్రచండ్ (ఫొటోలు)
-
గోదావరి ముంపు ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు
-
‘10 టన్నుల’ హెలికాప్టర్లపై దృష్టి పెట్టాలి
కంటోన్మెంట్(హైదరాబాద్): దేశ రక్షణ, భద్రతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు. హకీంపేట ఎయిర్‌ఫోర్స్ ఆధ్వర్యంలో శనివారం జరిగిన ‘చేతక్’హెలికాప్టర్ డైమండ్ జూబ్లీ కాన్క్లేవ్కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ‘చేతక్.. దేశానికి సేవలందించిన గొప్ప యుద్ధవిమానం. రాణాప్రతాప్ గుర్రాన్ని గుర్తు చేసుకునేలా ఈ హెలికాప్టర్‌కు ‘చేతక్’అనే నామకరణం చేశారు. ఇది ఎప్పటికప్పుడూ రూపాంతరం చెందుతూ నేటికీ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకుంటోంది. భారత్.. ఐదు టన్నుల సామర్థ్యం కలిగిన హెలికాప్టర్ల డిజైన్, డెవలప్మెంట్, ఆపరేషన్లతో సత్తా చాటింది. ఇక 10 టన్నుల సామర్థ్యం కలిగిన హెలికాప్టర్ల రూపకల్పనపై దృష్టి పెట్టాలి. అంతర్జాతీయంగా రక్షణ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా మనం ‘ఆత్మ నిర్భరత’ను సాధించాల్సిన అవసరం ఉంది. దేశీయ ఆయుధ సంపత్తి, సామర్థ్యాన్ని పెంచుకోవడంపై దృష్టి పెట్టాలి. ఈ మేరకు రక్షణ దళాలు, శాస్త్రవేత్తలు, రక్షణ ఉత్పత్తిదారులకు ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛనిచ్చింది. దేశీయ పరిశ్రమలకు సైతం డీఆర్డీఓ ద్వారా శాస్త్ర, సాంకేతిక సహకారం అందించనుంది. ఈ రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ఆహ్వానిస్తున్నాం. భారత్ ఏనాడూ అధికారం, ఆక్రమణ, ఆధిపత్యం కోసం యుద్ధం చేయలేదు. ప్రజాస్వామ్యం, మానవత్వ పరిరక్షణ కోసమే యుద్ధం చేసింది. ఈ కాన్క్లేవ్ దేశ సేవలో అమరులైన వారికి ఘన నివాళి వంటింది’అని రాజ్‌నాథ్ పేర్కొన్నారు. ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి సహా త్రివిధ దళాల హెలికాప్టర్ విభాగం ఉన్నతాధికారులు, రిటైర్డ్ అధికారులు, ఇండియన్ కోస్ట్ గార్డ్, హెచ్ఏఎల్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
ఆకట్టుకున్న 'వింగ్స్ ఇండియా 2022' ఏవియేషన్ షో
-
సాగర తీరంలో కనువిందు చేస్తోన్న యుద్ధనౌకలు, హెలికాప్టర్లు
-
8వేల కోట్ల ఆయుధాల కొనుగోలుకు ఓకే
న్యూఢిల్లీ: దాదాపు రూ.8 వేల కోట్ల విలువైన తేలికపాటి బహుళ ప్రయోజన హెలికాప్టర్లు, సైనిక సంబంధ ఆయుధాలు, పరికరాల కొనుగోలుకు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ మంగళవారం ఆమోదముద్ర వేసింది. ఆయుధాల సమీకరణకు సంబంధించిన ప్రతిపాదనలు ఢిల్లీలో జరిగిన రక్షణ ఆయుధాలు, ఉపకరణాల కొనుగోలు మండలి(డీఏసీ) సమావేశంలో ఆమోదం పొందాయని రక్షణ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. సైన్యం అవసరాల కోసం హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నుంచి 12 హెలికాప్టర్లను, నావికా దళం కోసం భారత్ ఎలక్ట్రానిక్స్ నుంచి లైనెక్స్ నావల్ గన్‌ఫైర్ నియంత్రణ వ్యవస్థను కొనుగోలుచేయనున్నారు. నావికాదళ గస్తీ విమానాలైన డార్నియర్ ఎయిర్క్రాప్ట్లను హిందుస్తాన్ ఏరోనాటిక్స్‌తో అప్‌గ్రేడ్ చేయించాలని డీఏసీ సమావేశంలో నిర్ణయించారు. ‘‘స్వావలంభనతోనే ఆయుధాల సమీకరణలో ‘ఆత్మనిర్భర్’ సాధించే దిశగా ముందడుగు వేయాలని నిర్ణయించారు. ఇందులోభాగంగానే విదేశాల నుంచి నావికాదళ గన్స్ కొనుగోళ్లను అర్ధంతరంగా ఆపేశారు. అందుకు ప్రత్యామ్నాయంగా భారత్ హెవీ ఎలక్ట్రికల్స్(భెల్) నుంచి అప్‌గ్రేడెడ్ సూపర్ ర్యాపిడ్ గన్ మౌంట్(ఎస్ఆర్జీఎం)లను తెప్పించాలని సమావేశంలో నిర్ణయించారు’’ అని రక్షణశాఖ ప్రకటనలో పేర్కొంది. యుద్ధనౌక ముందుభాగంలో ఠీవీగా కనబడే ఎస్ఆర్జీఎంతో ఎదురుగా ఉన్న లక్ష్యాలను అత్యంత ఖచ్చితత్వంతో చేధించవచ్చు. రూ.7,965 కోట్ల విలువైన ఆయుధసంపత్తి కొనుగోలు ప్రధానాంశంగా జరిగిన ఈ సమావేశానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షత వహించారు. త్రివిధ దళాల అత్యవసరాలు, నిర్వహణ, ఆధునీకరణ, నిధుల కేటాయింపుల అంశాలను సమావేశంలో చర్చించారు. సైన్యం అవసరాల కోసం సమకూర్చుకోనున్న ఆయుధాలు, ఉపకరణాల డిజైన్, ఆధునికీకరణ, తయారీ మొత్తం ‘మేక్ ఇన్ ఇండియా’ స్ఫూర్తితో కొనసాగాలని సమావేశంలో నిర్ణయించారు. ఇటీవల కాలంలో తూర్పు లద్దాఖ్‌లో చైనా సైనికులతో ఘర్షణల తర్వాత భారత సైన్యం కోసం అధునాతన ఆయుధాల సమీకరణ జరిగింది. -
అపాచీకి దీటుగా స్వదేశీ హెలికాప్టర్లు
న్యూఢిల్లీ: అమెరికా విమాన తయారీ సంస్థ బోయింగ్‌కు చెందిన అపాచీ హెలికాప్టర్లకు దీటుగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో మధ్య తరహా మిలటరీ హెలికాప్టర్లను తయారు చేయడానికి హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హాల్) సన్నాహాలు చేస్తోంది. 2027 కల్లా ఈ సైనిక హెలికాప్టర్లను తయారు చేసి భారత అమ్ముల పొదిలో చేర్చడానికి క్షేత్రస్థాయిలో పని ప్రారంభించినట్టు హాల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ మాధవన్ వెల్లడించారు. రానున్న సంవత్సరాల్లో భారత్‌లోని త్రివిధ బలగాలకు అవసరమైన హెలికాప్టర్లను తామే రూపొందించడానికి కృషి చేస్తున్నట్టు ఆదివారం పీటీఐ వార్తా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ హెలికాప్టర్ల డిజైన్ల రూపకల్పన ఇప్పటికే పూర్తయింది. ప్రభుత్వం అనుమతినిస్తే 500 యూనిట్లలో హెలికాప్టర్‌కు సంబంధించిన తొలి నమూనా పని 2023 నాటికి పూర్తయ్యేలా హాల్ లక్ష్యంగా నిర్ణయించింది. మి–17 స్థానంలో 10–12 టన్నుల కేటగిరీలో హెలికాప్ట్టర్ల తయారీపై హాల్ దృష్టి పెట్టింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో 500 హెలికాప్టర్ల తయారు చేయగలిగితే విదేశాల నుంచి రూ. 4 లక్షల కోట్లకు పైగా విలువైన దిగుమతుల్ని నిరోధించవచ్చునని మాధవన్ వెల్లడించారు. తేజస్ తర్వాత అతి పెద్ద ప్రాజెక్టు తేజస్ యుద్ధ విమానాల తయారీ తర్వాత హాల్ చేపట్టిన అతి పెద్ద ప్రాజెక్టు ఇదే. హెలికాప్టర్ల డిజైన్ల తయారీకి, నమూనా హెలికాప్టర్ తయారీకి రూ.9,600 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా. ‘‘ఈ ఏడాది ప్రభుత్వం నుంచి ప్రాథమిక డిజైన్‌కు అనుమతి లభిస్తే 2027 నాటికి 500 హెలికాప్టర్లను తయారు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. వాయుసేన, నేవీతో కూడా చర్చిస్తున్నాం. ఆర్మీ, వాయుసేనకు ఒక తరహా హెలికాప్టర్లు రూపొందిస్తే, నేవీ కోసం భిన్నమైన డిజైన్‌తో రూపొందించాల్సి ఉంటుంది. ఈ దిశగా నావికా, వైమానిక దళాధికారులతో చర్చలు కొనసాగిస్తున్నాం’అని మాధవన్ వెల్లడించారు. రెండు శక్తిమంతమైన ఇంజిన్లతో నడిచే ఈ హెలికాప్టర్ యుద్ధ నౌకలపై నుంచి కార్యకలాపాలు నడిపేలా బ్లేడ్ ఫోల్డింగ్ ఫీచర్‌తో రూపొందించనున్నారు. వీటికి భారీ డిమాండ్ ఉంటుందని మాధవన్ అంచనా. -
వాయుసేన అమ్ములపొదిలో అపాచీ యుద్ద హెలికాప్టర్లు
-
వాయుసేన అమ్ములపొదిలో అపాచీ యుద్ద హెలికాప్టర్లు
న్యూఢిల్లీ: భారత వాయుసేన ఆధునీకరణ దిశగా పెద్ద ముందడుగు పడింది. వాయుసేన అమ్ములపొదిలోకి తాజాగా ఎనిమిది అత్యాధునిక యుద్ధ హెలికాప్టర్లు వచ్చి చేరాయి. అమెరికాలో తయారైన అపాచీ ఏహెచ్-64ఈ (ఐ) హెలికాప్టర్లు మంగళవారం భారత్ చేరాయి. పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌లో వీటిని వాయుసేన స్వాధీనం చేసుకుంది. వాయుసేనకు చెందిన125 హెలికాప్టర్ యూనిట్ ’గ్లాడియేటర్స్’ ఈ అత్యాధునిక హెలికాప్టర్లు వినియోగించనున్నారు. వాయుసేన అమ్ములపొదిలోకి ఈ హెలికాప్టర్లు చేరిన సందర్భంగా వాటిని ఐఏఎఫ్ చీఫ్ బీఎస్ ధనోవా, ఎయిర్ మార్షల్ ఆర్ నంబియార్ పరిశీలించారు. అమెరికా నుంచి ఈ యుద్ధ హెలికాప్టర్లను భారత్ దిగుమతి చేసుకొంది. వీటిని కొనుగోలు చేసేందుకు 2015లోనే భారత్ అమెరికా రక్షణ సంస్థ బోయింగ్‌తో 1.1 బిలియన్ డాలర్ల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం 2022నాటికి భారత వాయుసేనలోకి మొత్తం 22 అపాచీయుద్ధ హెలికాప్టర్లు వచ్చి చేరనున్నాయి. మొత్తం నాలుగు దశల్లో వీటిని బోయింగ్ భారత్‌కు అప్పగించనుంది. ప్రస్తుతం భారత వాయుసేన సోవియట్ నాటి ఎంఐ-25, ఎంఐ 35 హెలికాప్టర్లను వినియోగిస్తోంది. వీటి స్థానంలో అపాచీ హెలికాప్టర్లను వాయుసేన ఇకనుంచి వినియోగించనుంది. పాకిస్థాన్ సరిహద్దులకు కొద్ది దూరంలోనే ఉన్న పఠాన్ కోట్ ఎయిర్‌బేస్‌లో ఈ యుద్ధ హెలికాప్టర్లలోని నాలుగింటిని వాయుసేన మోహరించనుంది. -
మాల్యా హెలికాప్టర్లు అమ్మేసారు..
-
మాల్యా చాపర్స్ రూ.8 కోట్లకు పైననే పలికాయి
బెంగళూరు : బ్యాంకులకు వేల కోట్లు ఎగ్గొట్టి, విదేశాలకు పారిపోయిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా హెలికాప్టర్లను వేలం వేశారు. బెంగళూరులోని డెట్ రికవరీ ట్రైబ్యునల్(డీఆర్టీ-1) ఈ-ఆక్షన్‌ను నిర్వహించి, బిజినెస్ టైకూన్ మాల్యాకు చెందిన రెండు హెలికాప్టర్లను ఢిల్లీకి చెందిన చౌదరి ఏవియేషన్‌కు అమ్మేసింది. ‘మాల్యాకు చెందిన రెండు వ్యక్తిగత హెలికాప్లర్లను తమ కంపెనీ రూ.8.75 కోట్లకు సొంతం చేసుకుంది. ఒక్కోటి రూ.4.37 కోట్లు’ అని చౌదరీ ఏవియేషన్ డైరెక్టర్ సత్యేంద్ర సెహ్రావత్ ప్రకటించారు. 17 బ్యాంకుల కన్సోర్టియం తరుఫున రికవరీ కోర్టు ఈ ఈ-ఆక్షన్‌ను నిర్వహించింది. 2007-2012 మధ్య తీసుకున్న రూ.9వేల కోట్లకు పైగా రుణాలను మాల్యా, ఆయనకు చెందిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ లిమిటెడ్ చెల్లించకుండా చేతులెత్తేసిన సంగతి తెలిసిందే. ఆ అనంతరం 2016లో మాల్యా దేశం విడిచిపారిపోయారు. తాము కొనుగోలు చేసిన 5 సీటర్ ఎయిర్‌బస్ యూరోకాప్టర్ బీ155 చాపర్స్ 10 ఏళ్ల కాలం నాటివని, ఇవి మంచి డ్యూయల్ ఇంజిన్‌ను కలిగి ఉన్నాయని సత్యేంద్ర తెలిపారు. ప్రస్తుతం ఇవి ముంబైలోని జుహు ఎయిర్‌పోర్ట్‌లో పార్క్ చేసి ఉంచినట్టు పేర్కొన్నారు. ఈ ఈ-ఆక్షన్‌లో మొత్తం మూడు కంపెనీలే పాల్గొన్నాయి. 2008 మోడల్‌కు చెందిన ఒక్కో హెలికాప్టర్ కనీస బిడ్ ధరగా రూ.1.75 కోట్లను నిర్ణయించింది రికవరీ కోర్టు. ఈ చాపర్లను వాణిజ్య అవసరాల కోసం వినియోగించుకోనున్నామని సత్యేంద్ర తెలిపారు. చౌదరి ఏవియేషన్ ప్రస్తుతం గ్రౌండ్ ఆపరేషన్లను నిర్వహించడమే కాకుండా.. దేశ రాజధాని పరిధిలోని ఆసుపత్రులకు ఎయిర్ అంబులెన్స్ సర్వీసులను అందజేస్తుంది. ఈ-ఆక్షన్ నిర్వహిస్తున్న విషయాన్ని రికవరీ కోర్టు అసలు మీడియాకు వెల్లడించలేదు. -
21 వేల కోట్లతో 111 హెలికాప్టర్లు
న్యూఢిల్లీ: భారత నౌకాదళం కోసం రూ.21,000 కోట్లతో 111 యుటిలిటీ హెలికాప్టర్లు కొనాలన్న ప్రతిపాదనకు రక్షణశాఖ ఆమోదం తెలిపింది. మరో రూ.25,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకూ ఓకే చెప్పింది. ఢిల్లీలో జరిగిన రక్షణ పరికరాల కొనుగోలు మండలి(డీఏసీ) సమావేశంలో ఈ ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. శత్రు స్థావరాలపై దాడి, నిఘా, గాలింపు, సహాయక చర్యల్లో పాల్గొనే 111 యుటిలిటీ హెలికాప్టర్లను రూ.21,000 కోట్లకుపైగా వ్యయంతో నేవీ కోసం కొనుగోలు చేయనున్నారు. వీటిని వ్యూహాత్మక భాగస్వామ్య విధానం కింద విదేశీ–స్వదేశీ సంస్థలు సంయుక్తంగా భారత్‌లోనే తయారుచేస్తాయి. సైన్యం కోసం రూ.3,364.78 కోట్లతో దేశీయంగా అభివృద్ధి చేసిన 150 అత్యాధునిక 155 ఎంఎం అర్టిలరీ గన్స్ కొనుగోలు ప్రతిపాదనకు డీఏసీ ఆమోదం తెలిపింది. సబ్ మెరైన్లపై దాడిచేయగల 24 నేవల్ మల్టీరోల్ హెలికాప్టర్ల కొనుగోలుకూ డీఏసీ పచ్చజెండా ఊపింది. 14 స్వల్పశ్రేణి క్షిపణి వ్యవస్థలను కొనుగోలు చేయాలని నిర్ణయించిన రక్షణశాఖ, వీటిలో 10 వ్యవస్థలు దేశీయంగా అభివృద్ధి చేసినవి అయ్యుండాలని షరతు పెట్టింది. గతేడాది మేలో తీసుకొచ్చిన వ్యూహాత్మక భాగస్వామ్య విధానం కింద విదేశీ ఆయుధ కంపెనీలతో జట్టుకట్టే భారత ప్రైవేటు కంపెనీలు.. యుద్ధ విమానాలు, సబ్మెరైన్లు, హెలికాప్టర్లు, సాయుధ వాహనాలను తయారుచేసేందుకు మాత్రమే వీలుంది. -
హెలికాప్టర్లతో అవుట్ ఫీల్డ్‌ను ఆరబెట్టారు
-
హెలికాప్టర్లతో అవుట్ ఫీల్డ్ రెడీ చేశారు...
లాహోర్: ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.. ఏ చిన్న కారణంతోనైనా మ్యాచ్ జరగపోతే ప్రేక్షకులు తీవ్ర నిరాశకు లోనవుతారనడంలో ఎటువంటి సందేహం లేదు. అందులోనూ నాకౌట్ మ్యాచ్‌లంటే మరీ ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. ప్రధానంగా వర్షం వెలిసిన తర్వాత అవుట్ ఫీల్డ్‌ను సిద్ధం చేయడంలో క్రికెట్ బోర్డులో సరైన చర్యలు తీసుకోలేకపోతే విమర్శలు వర్షం కురుస్తోంది. ఇలా చేయాలంటే ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలా తమవద్ద ఉన్న వనరులను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) సద్వినియోగం చేసుకుని మ్యాచ్ సజావుగా జరిగేలా చేసిన ఘటన పీఎఎస్ఎల్ చోటు చేసుకుంది. అందుకు హెలీకాప్టర్లను సైతం ఉయోగించుకుని శభాష్ అనిపించింది. బుధవారం పెషావర్ జల్మీ-కరాచీ కింగ్స్ జట్ల మధ్య ఎలిమినేటర్-2 మ్యాచ్ జరిగింది. మ్యాచ్‌కు ముందు వర్షం పడటంతో అవుట్ ఫీల్డ్ చిత్తడిగా మారింది. దాంతో సాధ్యమైనన్ని ఓవర్ల పాటు మ్యాచ్‌ను జరిపించాలని భావించిన పీసీబీ పెద్దలు ఉన్నపళంగా రెండు హెలికాప్టర్లను తెప్పించారు. వాటి సాయంతో అవుట్ ఫీల్డ్‌ను ఆరబెట్టారు. ఇది నాకౌట్ మ్యాచ్ కావడంతో హెలికాప్టర్లతో పిచ్‌ను సిద్ధం చేయడం ఒక్కటే మార్గమని తలచిన పీసీబీ.. ఆ మేరకు చర్యలు తీసుకుని సక్సెస్ అయ్యారు. ఆ క్రమంలోనే 16 ఓవర్ల పాటు మ్యాచ్ జరపడానికి అంపైర్లు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మ్యాచ్‌లో పెషావర్ జల్మీ 13 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్‌కు చేరింది.