
పోటాపోటీగా ఇద్దరు సీఎంల హెలికాప్టర్లు!
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరూ అభివృద్ధిలో పోటీ పడటం మాట అటుంచి.. తమకు తాము సౌకర్యాలు కల్పించుకోవడంలో మాత్రం ముందంజలో ఉంటున్నారు. ఇటీవలే తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు తన కోసం ప్రత్యేకంగా ఒక హెలికాప్టర్ కొనుగోలు చేయాలని నిర్ణయించారు. అందుకు పోటీగా అన్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఒక హెలికాప్టర్ కొనుగోలు చేయాలని తాజాగా నిర్ణయించింది.
ముఖ్యమంత్రులు పర్యటనలు చేయడానికి, అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించడానికి ప్రతి రాష్ట్రానికి హెలికాప్టర్ ఉంటుంది. అలాగే ఇంతకుముందు సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా హెలికాప్టర్ ఉంది. దాన్ని ఏం చేయాలన్న విషయాన్ని మాత్రం పక్కన పెట్టి, ఇప్పుడు మళ్లీ ఇద్దరూ తలో హెలికాప్టర్ కొనాలని భావిస్తున్నారు.