chief ministers
-
అమిత్ షా అధ్యతన వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల సమావేశం
-
నీతిఆయోగ్ భేటీకి ఆరుగురు సీఎంలు దూరం
న్యూఢిల్లీ: హస్తినలో శనివారం జరగబోయే నీతి ఆయోగ్ పాలకమండలి భేటీని విపక్ష ‘ఇండియా’ కూటమి పార్టీలకు చెందిన ఆరుగురు సీఎంలు బహిష్కరించారు. కేంద్ర బడ్జెట్లో తమ రాష్ట్రాలకు నిధుల కేటాయింపులో తీవ్ర వివక్ష చూపారంటూ ఈ నిర్ణయం తీసుకున్నారు. వీరిలో కాంగ్రెస్‌పాలిత రాష్ట్రాల సీఎంలు రేవంత్‌రెడ్డి (తెలంగాణ), సిద్ధరామయ్య (కర్ణాటక), సుఖీ్వందర్ సింగ్ సుఖూ (హిమాచల్ ప్రదేశ్)తో పాటు ఎంకే స్టాలిన్ (తమిళనాడు), విజయన్ (కేరళ), భగవంత్ మాన్ (పంజాబ్) ఉన్నారు. ఢిల్లీ ప్రభుత్వమూ భేటీని బాయ్‌కాట్ చేసింది.ప్రణాళికా సంఘమే కావాలి: మమతపశి్చమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ మాత్రం భేటీలో పాల్గొంటానని స్పష్టంచేశారు. ‘‘బడ్జెట్ కేటాయింపుల్లో విపక్షాలపాలిత రాష్ట్రాలపై మోదీ సర్కార్ వివక్షను భేటీలో ప్రస్తావిస్తా. బెంగాల్లో విభజన రాజకీయాలు తెస్తూ పొరుగురాష్ట్రాలతో వైరానికి వంతపాడుతున్న కేంద్రాన్ని కడిగేస్తా. నీతి ఆయోగ్ ప్రణాళికలు ఒక్కటీ అమలుకావడం చూడలేదు. ప్రణాళికా సంఘంలో ఒక విధానమంటూ ఉండేది. రాష్ట్రాల సూచనలకు విలువ ఇచ్చేవారు. నీతిఆయోగ్‌లో మా మాట వినే అవకాశం లేదు. పట్టించుకుంటారన్న ఆశ అస్సలు లేదు. అందుకే ప్రణాళికా సంఘాన్ని పునరుద్ధరించాలి’’ అని మమత అన్నారు. నేడు మోదీ నేతృత్వంలో భేటీ 2047 ఏడాదికల్లా అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ను తీర్చిదిద్దే లక్ష్యంతో కేంద్రప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై చర్చించేందుకు నేడు ప్రధాని మెదీ అధ్యక్షతన 9వ నీతిఆయోగ్ పాలకమండలి సమావేశం జరగనుంది. ఈ భేటీకి కేంద్రమంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు హాజరుకానున్నారు. అయితే పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్.రంగస్వామి ఈ భేటీకి రావట్లేదని తెలుస్తోంది. పుదుచ్చేరిలో రంగస్వామికి చెందిన ఏఐఎన్ఆర్సీ పార్టీ బీజేపీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతోంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజాజీవనాన్ని మెరుగుపరిచేందుకు కేంద్ర, రాష్ట్రాలు ఎలా మరింత సమన్వయంతో పనిచేయాలనే అంశాలనూ ఈ భేటీలో చర్చించనున్నారు. వికసిత భారత్‌కు దార్శనిక పత్రం రూపకల్పనకు తీసుకోవాల్సిన చర్యలను ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఈ క్రతువులో రాష్ట్రాల పాత్రపై విస్తృతస్థాయిలో చర్చ జరగనుందని ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. గత ఏడాది డిసెంబర్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల మూడో జాతీయ సదస్సులో చేసిన సిఫార్సులనూ సమావేశంలో పరిశీలించనున్నారు. -
తొలి దశలో దిగ్గజాల పోరు
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర మంత్రులుగా, ఏకంగా ముఖ్యమంత్రులుగా పదవీ బాధ్యతలు మోసి దిగపోయిన నేతలు మళ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో తమ సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. ఒక మాజీ గవర్నర్‌సహా 8 మంది కేంద్ర మంత్రలు, ఇద్దరు సీఎంలు రేపు జరగబోయే లోక్‌సభ ఎన్నికల తొలి దశ పోరులో పోటీపడుతున్నారు. రేపు పోలింగ్ జరగబోయే 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 స్థానాలకు ప్రచారం బుధవారంతో ముగిసింది. తమ తమ నియోజకవర్గాల్లో గట్టిపోటీ ఎదురవుతున్నాసరే పక్కా వ్యూహరచనతో ముందడుగు వేస్తున్నారు. నితిన్ గడ్కరీ మహారాష్ట్రలోని నాగ్ పూర్ నియోజకవర్గంలో హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్దమైన బీజేపీ నేత నితిన్ గడ్కరీ తన గెలుపుపై ధీమాగా ఉన్నారు. 2014లో ఏడుసార్లు ఎంపీగా గెలిచిన విలాస్ ముట్టెంవార్‌పై 2.84 లక్షల ఓట్ల తేడాతో విజయం సాధించి గడ్కరీ తన సత్తా ఏమిటో అందరికీ తెలిసేలా చేశారు. ప్రస్తుత మహారాష్ట్ర కాంగ్రెస్ సారథి నానా పటోలేను 2019లో ఇదే నాగ్‌పూర్‌లో 2.16 లక్షల మెజారిటీతో మట్టికరిపించి తనకు ఎదురులేదని గడ్కరీ నిరూపించారు. అయితే ఇటీవల స్థానికంగా బాగా పట్టు సాధించిన కాంగ్రెస్ నేత వికాస్ థాకరే(57) గడ్కరీకి గట్టి సవాలు విసురుతున్నారు. నాగ్‌పూర్ వెస్ట్ ఎమ్మెల్యేగా ఉన్న థాకరే కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు. ప్రకాశ్ అంబేద్కర్‌కు చెందిన వంచిత్ బహుజన్ అఘాడి పార్టీ సైతం థాకరేకి మద్దతు పలికింది. కాంగ్రెస్‌లో అన్ని వర్గాలు ఒక్కటై థాకరే విజయం కోసం పనిచేస్తుండడంతో గడ్కరీ అప్రమ్తత మయ్యారు. కాంగ్రెస్ నేతలు నిరుద్యోగం, స్థానిక సమస్యలను ప్రధానంగా ప్రస్తావిస్తూ ఓటర్లకు దగ్గర అవుతున్నారు. దీంతో గడ్కరీ ఆయన సతీమణి, కుమారుడు, కోడలు సైతం నిప్పులు కక్కే ఎండల్లో విరివిగా ప్రచారం చేశారు. కిరెన్ రిజిజు: 2004 నుంచి అరుణాచల్ ప్రదేశ్ నుంచి మూడు సార్లు ఎంపీగా గెలిచిన బీజేపీ నేత, కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు నాలుగోసారి సార్వత్రిక సమరంలో దూకారు. 52 ఏళ్ల రిజిజుకు ఈసారి నబాం టుకీ రూపంలో గట్టి ప్రత్యర్థి ఎదురయ్యారు. టుకీ అరుణాచల్ మాజీ ముఖ్యమంత్రి మాత్రమే కాదు ప్రస్తుతం ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు కూడా. టుకీకి కరిష్మా తక్కువేం లేదు. దీంతో ఆసక్తి సర్వత్రా నెలకొంది. సర్బానంద సోనోవాల్: నౌకాశ్రయాలు, షిప్పింగ్, నదీజలాల రవాణా మంత్రిత్వ శాఖ కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సోనోవాల్ సైతం ఈసారి అస్సాంలోని దిబ్రూగఢ్ నుంచి బరిలో దిగారు. రాజ్యసభ సభ్యుడైన సోనోవాల్ ఈసారి లోక్‌సభలో తన అదృష్టం పరీక్షించుకుంటున్నారు. పెట్రోలియం, సహజవాయు మంత్రిత్వ శాఖ సహాయమంత్రి రామేశ్వర్ తేలికి బీజేపీ ఈసారి టికెట్ నిరాకరించి సోనోవాల్‌ను నిలబెట్టింది. సంజీవ్ భలియా: ఉత్తరప్రదేశ్‌లో కులరాజ కీయాలకు పేరొందిన ముజఫర్‌నగర్‌లో కేంద్ర మంత్రి సంజీవ్ భలియా పోటీకి నిలబడ్డారు. ఈయనకు సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి హరీంద్ర మాలిక్, బహుజన్‌సమాజ్ పార్టీ అభ్యర్థి దారాసింగ్ ప్రజాపతి నుంచి గట్టిపోటీ ఉంది. ఈ త్రిముఖపోరులో గెలుపు ఎవరిని వరిస్తుందో. జితేంద్ర సింగ్: జమ్మూకశ్మీర్‌లోని ఉధంపూర్ నుంచి రెండుసార్లు ఎంపీగా గెలిచారు. మోదీ హయాంలో సహాయ మంత్రిగా సేవలందించారు. హ్యాట్రిక్ కొట్టాలని లక్ష్యంగా పెట్టుకుని తెగ ప్రచారం చేశారు. భూపేంద్ర యాదవ్: రాజ్యసభ సభ్యుడైన భూపేంద్ర మోదీ మంత్రివర్గంలో పర్యావరణ, అటవీ శాఖ మంత్రిగా సేవలందిస్తున్నారు. రాజస్థాన్‌లోని అల్వార్ నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్నారు. బీజేపీ సిట్టింగ్ ఎంపీ బాలక్ నాథ్‌ను పక్కనబెట్టిమరీ పార్టీ ఈయనకు టికెట్ ఇచ్చింది. జిల్లాలో సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే లలిత్ యాదవ్ ఈయనకు గట్టిపోటీ ఇస్తున్నారు. జిల్లాలోని మత్స్య ప్రాంతంలో యాదవుల మద్దతు ఇద్దరికీ ఉండటంతో ఎవరు గెలుస్తారో చెప్పలేని పరిస్థితి నెలకొంది. అర్జున్‌రాం మేఘ్వాల్: రాజస్థాన్‌లోని బికనీర్ నుంచి తలపడుతున్న కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్తో మాజీ కాంగ్రెస్ మంత్రి గోవింద్ రామ్ మేఘ్వాల్ తలపడుతున్నారు. ఎల్.మురుగన్: తమిళనాడులోని నీలగిరి నియోజకవర్గంలో కేంద్ర మంత్రి, బీజేపీ నేత ఎల్.మురుగన్ తన అదృష్టం పరీక్షించుకోనున్నారు. ఇక్కడ డీఎంకే సిట్టింగ్ ఎంపీ, మాజీ కేంద్ర టెలికం మంత్రి ఏ.రాజా నుంచి మురుగన్‌కు గట్టి పోటీ ఎదురవుతోంది. మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన మురుగన్ తొలిసారిగా నీలిగిరి నుంచి నిలబడ్డారు. తమిళిసై సౌందరరాజన్: తెలంగాణ గవర్నర్‌గా పనిచేసి రాజీనామా చేసి మళ్లీ రాజకీయరంగప్రవేశం చేసిన తమిళనాడు బీజేపీ నాయకురాలు తమిళిసై సౌందరరాజన్ చెన్నై సౌత్ స్థానం నుంచి పోటీచేస్తున్నారు. గతంలో తూత్తుకుడి నుంచి తమిళిసై పోటీచేసి డీఎంకే నాయకురాలు కనిమొళి చేతిలో ఓటమిని చవిచూశారు. బిప్లవ్‌కుమార్ దేవ్: త్రిపుర మాజీ ముఖ్యమంత్రి బిప్లవ్ కుమార్ దేవ్ ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీచేస్తున్నారు. వెస్ట్ త్రిపురలో బిప్లవ్ దేవ్‌కు పోటీగా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు ఆశిశ్ కుమార్ సాహా నిలబడ్డారు. ఇద్దరికీ ఈ నియోజకవర్గంపై గట్టిపట్టుంది. దీంతో ఎవరు గెలుస్తారో చెప్పడం కష్టంగా మారింది. -
మార్పులే మంత్రం!
రాజకీయాల్లో ఆశ్చర్యకర పరిణామాలు కొత్త కాదు కానీ, కొన్ని ఘటనలు అమితాశ్చర్యానికి గురి చేస్తాయి. ఆకర్షిస్తాయి. అవి సంభవించడానికి ప్రేరణ ఏమిటన్న ఆలోచనకు పురిగొల్పుతాయి. ఇటీ వలి వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో 3 రాష్ట్రాల్లో విజయకేతనం ఎగరేసిన బీజేపీ కొత్త ముఖ్యమంత్రుల ఎంపిక అక్షరాలా అలాంటిదే. మూడు చోట్లా సీనియర్లను కాదని కొత్త ముఖాలను కాషాయ పార్టీ ఎంచుకున్న తీరు ఆశ్చర్యాన్నీ, ఆలోచననూ కలిగిస్తోంది. కొత్త నేతల పేర్లు పెద్దగా తెలియ కున్నా... రకరకాల స్థానిక సామాజిక వర్గాల లెక్కలను పరిగణనలోకి తీసుకొన్నాకనే మధ్యప్రదేశ్‌లో మోహన్ యాదవ్, ఛత్తీస్‌గఢ్‌లో విష్ణుదేవ్ సహాయ్, రాజస్థాన్‌లో భజన్‌లాల్ శర్మలను అధిష్ఠానం ఎంపిక చేసినట్టుంది. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు రానున్న వేళ కమలనాథులు అనుసరిస్తున్న ఈ కొత్త సీఎం ముఖాల వ్యూహం లోతుపాతుల పట్ల అంచనాలు, విశ్లేషణలను పెంచుతోంది. ప్రజాస్వామ్యంలో సభలో సంఖ్యా బలంతో అధికార పీఠంపై కూర్చొనే రాజకీయ పార్టీకీ, ఎన్నికైన ఆ పార్టీ చట్టసభ సభ్యులకూ తమకు నచ్చిన వ్యక్తిని ముఖ్యమంత్రిగా ఎన్నుకొనే పూర్తి స్వేచ్ఛ, స్వాతంత్య్రం ఉంటాయి. అది ఆ పార్టీల అంతర్గత వ్యవహారం. అయితే, శ్రమించి పార్టీని అధికారంలోకి తెచ్చిన, నిలబెట్టిన సీనియర్ నేతలకు సీఎం పీఠం దక్కకపోవడం, రాజస్థాన్ లాంటి చోట్ల తొలిసారి ఎమ్మెల్యేనే సరాసరి సీఎంను చేయడం, మంత్రులుగా ఎన్నడూ పనిచేయనివారిని డిప్యూటీ సీఎంలను చేయడం విచిత్రమే. కానీ నిత్యం ఎన్నికల పోరులో ఉన్నట్టే ఏడాది పొడుగూతా శ్రమించే బీజేపీకి తనవైన లెక్కలున్నాయి. విస్తృత రాజకీయ, సైద్ధాంతిక వ్యూహమూ ఈ ఎంపికలో కనిపి స్తోంది. ప్రతి రాష్ట్రంలో ప్రాంతాల మధ్య సమతూకం పాటిస్తూ, సామాజిక వర్గాల బలాబలాలను అంచనా వేసుకొంటూ ఈ కొత్త సీఎంల ఎంపికకు వ్యూహరచన చేశారని అర్థమవుతోంది. కొత్త సీఎంలు ముగ్గురూ హిందూత్వ వాదులే. ఆరెస్సెస్‌కు సన్నిహితులే. అధినేతలకు విధేయులే. మాజీ కేంద్ర మంత్రి, ఛత్తీస్‌గఢ్ బీజేపీ అధ్యక్షుడైన విష్ణుదేవ్‌ను అక్కడి సీఎం పీఠంపై కూర్చోబెట్టడం వెనుక దేశంలోని 9 శాతం ఆదివాసీలను అక్కున చేర్చుకొనే వ్యూహం ఉంది. ఇప్పటికే ద్రౌపదీ ముర్ముతో దేశానికి తొలి గిరిజన రాష్ట్రపతిని అందించిన బీజేపీ ఆ వర్గంతో ఓట్ల బంధాన్ని బలోపేతం చేసుకోవాలనేది ఎత్తుగడ. ఇక, మధ్యప్రదేశ్‌లో మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, విద్యామంత్రిగా పనిచేసిన మోహన్ యాదవ్ రాష్ట్రంలో బలమైన ఓబీసీ వర్గానికి చెందినవారు కావడం కలిసొచ్చిన అంశం. ఆయన డిప్యూటీలుగా బ్రాహ్మణ, ఎస్సీ వర్గీయుల్ని నియమించడంలో, ఇతర ప్రధాన ఓటుబ్యాంకుల్ని తృప్తిపరిచే యత్నం కనిపిస్తోంది. రాజస్థాన్‌లోనైతే అధికారిక ప్రకటన ముందు దాకా సమావేశ ఏర్పాట్లలో ఉన్న ఎమ్మెల్యే భజన్‌లాల్ పేరును ఆకస్మికంగా ప్రకటించారు. ఆయనే ఊహించని ఆ ఎంపిక మరోసారి పదవిపై ఆశపడ్డ వసుంధరకు అధిష్ఠానం వేసిన గుగ్లీ. రాజవంశీయురాలైన వసుంధరా రాజె రెండు దశాబ్దాలలో తొలిసారిగా రాజస్థాన్‌లో ఇటు సీఎం కాకుండా, కనీసం సీఎం అభ్యర్థిగానైనా కాకుండా మిగిలారు. ఇక, మధ్యప్రదేశ్‌లో దీర్ఘకాలిక సీఎంగా పేరు తెచ్చుకొని, తాజా ఎన్నికల్లో ఏటికి ఎదురీది పార్టీని విజయతీరానికి చేర్చిన శివరాజ్ సింగ్ చౌహాన్‌కు మళ్ళీ పగ్గాలు దక్కలేదు. ఛత్తీస్‌గఢ్‌కు ఒకప్పుడు సీఎంగా వ్యవహరించిన రమణ్ సింగ్ పరిస్థితీ అదే. ఇప్పుడిక ఒక విషయం స్పష్టం. వసుంధరా రాజె, చౌహాన్లను పక్కనబెట్టడంతో కమలం పార్టీ ఇప్పుడిక ఒకప్పటి వాజ్‌పేయి, అద్వానీల శకం నుంచి పూర్తిగా బయటపడి, మోదీ, షాల కొత్త జమానాలోకి సంపూర్ణంగా చేరుకున్నట్టే. పాత కాపులుగా చక్రం తిప్పుతున్న అనేకులకు అనధికారికంగా... అధికార పీఠం నుంచి బలవంతపు పదవీ విరమణ ఇచ్చేసినట్టే. అయితే, సీఎం పదవి ఇవ్వనంత మాత్రాన బీజేపీలో ఈ సీనియర్ల కథ ముగిసిపోయిందని అనుకోలేం. రానున్న రోజుల్లో కాషాయపార్టీ వీరి సేవలను ఎలా వినియోగించుకుంటుందో వేచిచూడాలి. ఏమైనా, ఎన్నికల్లో గెలిచిన తొమ్మిది రోజుల తర్వాత బీజేపీ ఆచితూచి సీఎంల ఎంపిక తతంగాన్ని పూర్తిచేసింది. రాజకీయాల్లో తరాల మార్పే కాక అధికార మార్పిడి సైతం సాఫీగా సాగేలా చూసుకుంది. దేశంలో 60 ఏళ్ళు ఆ పైబడ్డ ఓటర్లు 15 నుంచి 20 శాతమే అని లెక్కలు వినిపిస్తున్న వేళ పెరుగుతున్న యువ ఓటర్లను ఆకర్షించే నవతరం నేతలను భవిష్యత్ అవసరాలకు తగ్గట్టు తీర్చిదిద్దే పథకరచనకు విజయవంతంగా శ్రీకారం చుట్టింది. వ్యక్తుల కన్నా వ్యవస్థ (పార్టీ) పెద్దదనే నిష్ఠురసత్యాన్ని నసాళానికి అంటేలా సీనియర్లకు సంకేతించింది. ఇక, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో కొత్త సీఎంలు బుధవారం కొలువుతీరారు. కొన్ని ధార్మికస్థలాలే లక్ష్యమనిపించేలా బహిరంగ ప్రదేశాల్లో లౌడ్‌స్పీకర్లపై నిషేధమంటూ మధ్యప్రదేశ్‌లో మోహన్‌యాదవ్ పని మొదలెట్టేశారు. పాతవారిని మరిపించేలా పాలన అందించడమే కాక, తక్షణమే రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పార్టీకి మరిన్ని సీట్లు సాధించే సవాలు ఈ ముగ్గురు కొత్త సీఎంల ముందుంది. బీజేపీ మాత్రం వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోనూ తమదే విజయమన్న దిలాసా కనబరుస్తోంది. తరగని మోదీ మాయ, పార్టీ సైద్ధాంతిక పునాది, ప్రారంభం కానున్న అయోధ్య రామాలయం, ఆర్టికల్ 370 రద్దు సహా ఈ కులసమీకరణాలూ తమకు లాభిస్తాయనే భరోసాతో ఉంది. మార్పే మంత్రమని నమ్మిన బీజేపీ ఇప్పటికైతే అధికారంలో ఉన్నప్పుడైనా, లేనప్పుడైనా ఓటర్లపై పట్టు నిలుపు కోవడానికీ, పెంచుకోవడానికీ పై స్థాయిలో మార్పులు కీలకమని ఆచరణలో పెట్టింది. కొత్త యంత్రాన్ని పాత సాఫ్ట్‌వేర్‌తో కాక, కొత్త సాఫ్ట్‌వేర్‌తో నడపాలని నమ్మిన బీజేపీ వ్యూహం ఏ మేరకు ఫలి స్తుందో చూడాలి. అది ఫలిస్తేప్రతిపక్షాలెంత ఆశపడ్డా ఢిల్లీ గద్దెపై మార్పును 2024లోనూ చూడలేవు. -
అధికారం అంటే దోచుకోవడం..దాచుకోవడమేనా ?
-
సరిహద్దు భద్రతలో రాష్ట్రాలకూ బాధ్యత
కోల్‌కతా: దేశ సరిహద్దు ప్రాంతాల్లో భద్రతలో బీఎస్ఎఫ్తోపాటు సంబంధిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు బాధ్యత పంచుకోవాలని హోం మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. శనివారం కోల్‌కతాలోని పశ్చిమబెంగాల్ సెక్రటేరియట్లో జరిగిన 25వ ఈస్టర్న్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో అమిత్ మాట్లాడారు. సరిహద్దు ప్రాంతాల్లో బీఎస్ఎఫ్ పరిధిని విస్తరించిన నేపథ్యంలో ఆయా చోట్ల భద్రతపై జరిగిన చర్చ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భేటీలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, జార్ఖండ్ సీఎం సోరెన్, బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ, ఒడిశా మంత్రి పాల్గొన్నారు. -
NITI Aayog governing council: జీఎస్టీ వసూళ్లు పెరగాలి
న్యూఢిల్లీ: వ్యవసాయ రంగంలో భారత్ స్వయంసమృద్ధంగా మారడంతో పాటు ప్రపంచ సారథిగా ఎదగాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. ఇందుకు సాగు, పశుపోషణ, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలను ఆధునీకరించాల్సిన అవసరముందన్నారు. దిగుమతులను బాగా తగ్గించుకుని ఎగుమతులను ఇతోధికంగా పెంచుకోవాలని ఆకాంక్షించారు. ఇందుకోసం ట్రేడ్ (వాణిజ్యం), టూరిజం (పర్యాటకం), టెక్నాలజీ అనే మూడు ‘టి’లపై మరింతగా దృష్టి సారించాల్సిందిగా రాష్ట్రాలకు పిలుపునిచ్చారు. నీతి ఆయోగ్ పాలక మండలి ఏడో సమావేశం ఆదివారం ఢిల్లీలో మోదీ సారథ్యంలో జరిగింది. 23 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు తదితరులు భేటీలో పాల్గొన్నారు. గత రెండేళ్లలో ఇది నీతి ఆయోగ్ తొలి భౌతిక సమావేశం. కరోనా కారణంగా 2021లో భేటీ వర్చువల్‌గా జరిగింది. 4 కీలకాంశాలను పాలక మండలి లోతుగా చర్చించింది. పంట వైవిధ్యం, తృణధాన్యాలు, నూనె గింజలు తదితర వ్యవసాయ దిగుబడుల్లో స్వయంసమృద్ధి, పాఠశాల, ఉన్నత విద్యలో జాతీయ విద్యా విధానం అమలు, పట్టణ పాలన విషయంలో చేపట్టాల్సిన చర్యలపై సభ్యులంతా తమ అభిప్రాయాలను పంచుకున్నారు. నీతి ఆయోగ్ భేటీని బాయ్‌కాట్ చేస్తున్నట్టు ప్రకటించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు కరోనా నుంచి కోలుకుంటున్న బిహార్ సీఎం నితీశ్‌కుమార్ సమావేశానికి రాలేదు. రాష్ట్రానికో జీ20 టీమ్ నీతీ ఆయోగ్ పాలక మండలి ఏడో భేటీని జాతీయ ప్రాథమ్యాలను గుర్తించేందుకు కేంద్ర రాష్టాల మధ్య నెలల తరబడి జరిగిన లోతైన మేధోమథనం, సంప్రదింపులకు ఫలితంగా మోదీ అభివర్ణించారు. పలు అంశాల్లో కేంద్ర రాష్ట్రాల నడుమ సహాయ సహకారాలు మరింతగా పెరగాల్సిన అవసరముందన్నారు. భేటీలో చర్చించిన అంశాలు వచ్చే పాతికేళ్లలో జాతి ప్రాథమ్యాలను నిర్ణయించడంలో కీలకంగా మారతాయని వెల్లడించారు. జీఎస్టీ వసూళ్లు మెరుగ్గా ఉన్నా అవి భారీగా పెరగాల్సి ఉందదన్నారు. అందుకు అపారమైన అవకాశాలు కూడా ఉన్నాయని ప్రధాని అభిప్రాయపడ్డారు. ఈ దిశగా ఉమ్మడి కార్యాచరణకు శ్రీకారం చుట్టాలని రాష్ట్రాలకు సూచించారు. అప్పుడే ఆర్థికంగా దేశం మరింత బలపడి 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రూపుదాలుస్తుందన్నారు. వీలైన ప్రతిచోటా స్థానిక వస్తువులనే వాడేలా ప్రజలను ప్రోత్సహించాలని రాష్ట్రాలకు సూచించారు. వోకల్ ఫర్ లోకల్ అన్నది ఏ ఒక్క పార్టీ అజెండానో కాదని, అందరి ఉమ్మడి లక్ష్యమని గుర్తుంచుకోవాలన్నారు. ‘‘శరవేగంగా సాగుతున్న పట్టణీకరణను సమస్యగా కాకుండా దేశానికి గొప్ప బలంగా మలచుకోవాల్సి ఉంది. సేవల్లో పారదర్శకత, పౌరులందరి జీవన ప్రమాణాల పెంపుపై దృష్టి సారించాలి’’అన్నారు. కరోనాపై పోరాటంలో ప్రతి రాష్ట్రమూ చురుకైన పాత్ర పోషించిందని కొనియాడారు. తద్వారా ఇవాళ వర్ధమాన దేశాలు స్ఫూర్తి కోసం భారత్‌వైపు చూసే పరిస్థితి ఉందని హర్షం వ్యక్తం చేశారు. స్వాతంత్య్ర అమృతోత్సవాల వేళ అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు తొలిసారిగా ఒక్కచోటికి వచ్చి జాతీయ ప్రాధాన్యమున్న అంశాలపై మూడు రోజుల పాటు చర్చించడం గొప్ప విషయమన్నారు. సంపన్న, వర్ధమాన దేశాలతో కూడిన జీ20కి 2023లో భారత్ సారథ్యం వహించనుండటాన్ని మోదీ ప్రస్తావించారు. దీన్నుంచి గరిష్టంగా లబ్ధి పొందే మార్గాలను సూచించేందుకు ప్రతి రాష్ట్రమూ ఓ జీ20 టీమ్‌ను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. రాష్ట్రాలేమన్నాయంటే... వ్యవసాయ రంగానికి ఆంధ్రప్రదేశ్ అత్యధిక ప్రాధాన్యమిస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. రాష్ట్రాలపై విధానాలను కేంద్రం బలవంతంగా రుద్దొద్దని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. జాతీయ విద్యా విధానం అమలుకు ఒత్తిడి తేవొద్దన్నారు. రాష్ట్రాల డిమాండ్లకు కేంద్రం మరింత ప్రాధాన్యమివ్వాలని సూచించారు. రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారాన్ని మరో ఐదేళ్లు పొడిగించాలని బీజేపీయేతర పార్టీల పాలనలో ఉన్న ఛత్తీస్‌గఢ్, కేరళ, రాజస్తాన్ సీఎంలు కోరారు. జార్ఖండ్‌లో కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని సీఎం హేమంత్ సోరెన్ కోరారు. వ్యవసాయ, విద్యా రంగాల్లో మహారాష్ట్రకు కేంద్రం మరింత దన్నుగా నిలవాలని సీఎం ఏక్నాథ్ షిండే విజ్ఞప్తి చేశారు. రాజ్యాంగంలో రాష్ట్రాల జాబితాలోని అంశాలపై కేంద్రం చట్టాలు చేయడాన్ని మానుకోవాలని కేరళ సీఎం పినరాయి విజయన్ డిమాండ్ చేశారు. రాజ్యాంగం తాలూకు సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా పోవొద్దన్నారు. విపత్తుల నిర్వహణకు ఒడిశాకు మరిన్ని నిధులు కేటాయించాలని సీఎం నవీన్ పట్నాయక్ కోరారు. కనీస మద్దతు ధరకు కేంద్రం చట్టపరమైన హామీ ఇవ్వాలని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ డిమాండ్ చేశారు. రాష్ట్రాలు లేవనెత్తిన అంశాలు, వాటి ఆందోళనలు, అవి ఎదుర్కొంటున్న సవాళ్లు తదితరాలను నీతీ ఆయోగ్ లోతుగా అధ్యయనం చేస్తుందని మోదీ ప్రకటించారు. చిన్న అణు విద్యుత్కేంద్రాలు మేలు ఇంధన అవసరాలను తీర్చుకునేందుకు పాతబడుతున్న థర్మల్ విద్యుత్కేంద్రాల స్థానంలో చిన్న మాడ్యులర్ రియాక్టర్ల (ఎస్ఎంఆర్)ను ఏర్పాటు చేసుకోవడంపై కేంద్రం దృష్టి సారించాలని నీతీ ఆయోగ్ సభ్యుడు, శాస్త్రవేత్త వీకే సారస్వత్ సూచించారు. అణు విద్యుత్కేంద్రాల స్థాపన ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. ఎస్ఎంఆర్లు 300 మెగావాట్ల సామర్థ్యంతో కూడిన అధునాతన అణు రియాక్టర్లు. ప్రస్తుతం దేశంలో 6,780 మెగావాట్ల సామర్థ్యంతో కూడిన 22 అణు రియాక్టర్లు పని చేస్తున్నాయి. జాతీయ విద్యా విధానం కింద టీచర్ల సామర్థ్యాన్ని, నైపుణ్యాలను, అభ్యసన ఫలితాలను మెరుగు పరిచేందుకు చేపట్టిన చర్యలను కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వివరించారు. కరోనా అనంతర పరిస్థితుల నేపథ్యంలో దేశ ప్రగతికి కేంద్రం, రాష్ట్రాలు కలసికట్టుగా ముందుకు సాగాల్సిన అవసరం మరింతగా ఉందని నీతీ ఆయోగ్ వైస్ చైర్మన్సుమన్ బెరీ అన్నారు. కేంద్ర విధానాలను రుద్దొద్దు: రాష్ట్రాలు వ్యవసాయ రంగానికి ఆంధ్రప్రదేశ్ అత్యధిక ప్రాధాన్యమిస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. రాష్ట్రాలపై విధానాలను కేంద్రం బలవంతంగా రుద్దొద్దని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. జాతీయ విద్యా విధానం అమలుకు ఒత్తిడి తేవొద్దన్నారు. రాష్ట్రాల డిమాండ్లకు కేంద్రం మరింత ప్రాధాన్యమివ్వాలని సూచించారు. రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారాన్ని మరో ఐదేళ్లు పొడిగించాలని బీజేపీయేతర పార్టీల పాలనలో ఉన్న ఛత్తీస్‌గఢ్, కేరళ, రాజస్తాన్ సీఎంలు కోరారు. జార్ఖండ్‌లో కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని సీఎం హేమంత్ సోరెన్ కోరారు. వ్యవసాయ, విద్యా రంగాల్లో మహారాష్ట్రకు కేంద్రం మరింత దన్నుగా నిలవాలని సీఎం ఏక్నాథ్ షిండే విజ్ఞప్తి చేశారు. రాజ్యాంగంలో రాష్ట్రాల జాబితాలోని అంశాలపై కేంద్రం చట్టాలు చేయడాన్ని మానుకోవాలని కేరళ సీఎం పినరాయి విజయన్ డిమాండ్ చేశారు. విపత్తుల నిర్వహణకు ఒడిశాకు మరిన్ని నిధులు కేటాయించాలని సీఎం నవీన్ పట్నాయక్ కోరారు. కనీస మద్దతు ధరకు కేంద్రం చట్టపరమైన హామీ ఇవ్వాలని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ డిమాండ్ చేశారు. రాష్ట్రాలు లేవనెత్తిన అంశాలు, వాటి ఆందోళనలు, అవి ఎదుర్కొంటున్న సవాళ్లు తదితరాలను నీతీ ఆయోగ్ లోతుగా అధ్యయనం చేస్తుందని ప్రధాని మోదీ ప్రకటించారు. -
7న ప్రధాని అధ్యక్షతన నీతి ఆయోగ్ భేటీ
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ అధ్యక్షతన ఆదివారం నీతి ఆయోగ్ ఏడో గవర్నింగ్ కౌన్సిల్ భేటీ ఉంటుందని ప్రధానమంత్రి కార్యాలయం అధికారులు తెలిపారు. కేంద్రం, రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల మధ్య సహకారానికి ఈ సమావేశం మరింతగా తోడ్పడుతుందన్నారు. 2019 జూలై తర్వాత నీతి ఆయోగ్ సభ్యులు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రత్యక్షంగా పాల్గొంటున్న ఈ సమావేశం రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్ వేదికగా జరుగుతుందన్నారు. పంటల వైవిధ్యం, పప్పులు, నూనె గింజల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి, అగ్రి కమ్యూనిటీస్, ఎన్ఈపీ అమలు, పట్టణ పాలన వంటి అంశాలపై ఈ భేటీలో చర్చలు ఉంటాయన్నారు. -
అంతర్రాష్ట్ర మండలి పునర్నిర్మాణం
న్యూఢిల్లీ: దేశ సమాఖ్య విధానంలో సహకార స్పూర్తిని పెంచేందుకు కృషి చేసే అంతర్రాష్ట్ర మండలిని కేంద్రం పునర్నిర్మించింది. ఈ మండలి అధ్యక్షుడు ప్రధాని మోదీ కాగా, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆరుగురు కేంద్రమంత్రులు సభ్యులుగా ఉంటారు. మరో 10 మంది కేంద్ర మంత్రులు మండలి శాశ్వత ఆహ్వానితులుగా ఉంటారు. దీంతోపాటు, హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో అంతర్రాష్ట్ర మండలి స్టాండింగ్ కమిటీని నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. శాసనసభలు లేని కేంద్ర పాలిత ప్రాంతాల పరిపాలనాధికారులకు మండలిలో సభ్యులుగా అవకాశం కల్పించింది. కేంద్రం–రాష్ట్రాలు, వివిధ రాష్ట్ర ప్రభుత్వాల మధ్య తలెత్తే వివిధ అంశాలను అంతర్రాష్ట్ర, జోనల్ మండలులు పరిశీలించి, పరిష్కారాలు వెతుకుతాయి. ఇవి ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ సూచనలు చేస్తుంటాయి. హోం మంత్రి అధ్యక్షుడిగా ఏర్పాటైన మండలి స్టాండింగ్ కమిటీలో సభ్యులుగా కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, నరేంద్ర సింగ్ తోమర్, వీరేంద్ర కుమార్, గజేంద్రసింగ్ షెకావత్‌తోపాటు ఆంధ్రప్రదేశ్, అస్సాం, బిహార్, గుజరాత్, మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉంటారు. -
తెలంగాణ సీఎస్‌పై సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ఆగ్రహం
న్యూఢిల్లీ: ఢిల్లీలో ముఖ్యమంత్రులు, హైకోర్టు సీజేల సంయుక్త సదస్సు సందర్భంగా తెలంగాణ చీఫ్ సెక్రటరీపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలోని న్యాయవ్యవస్థ సమస్యల పరిష్కారంపై సీఎం, హైకోర్టు సీజే పలు నిర్ణయాలు తీసుకున్నప్పటికీ వాటిని అమలు చేయకుండా పెండింగ్‌లో ఉంచడంపై సీరియస్ అయ్యారు. తమ వ్యక్తిగత పనుల కోసం అడగడం లేదని.. న్యాయవ్యవస్థ బలోపేతం కోసమే నిర్ణయాలు తీసుకుంటున్నామన్నారు. కోర్టుల్లో దయనీయమైన పరిస్థితులు ఉన్నాయని ఎన్వీ రమణ ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కోర్టుల్లో ఒక న్యాయవాది లోపలకు వెళ్లి వెనక్కు వస్తే తప్ప మరొకరు వచ్చే పరిస్థితి లేదని వ్యాఖ్యానించారు. దీనిపై స్పందించిన తెలంగాణ న్యాయశాఖమంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఈ అంశాలను తాను పరిశీలిస్తానని హామీ ఇచ్చారు. చదవండి👉 (పంజాబ్‌లో టెన్షన్.. టెన్షన్.. ఇంటర్నెట్ సేవలు బంద్) -
కోర్టుల్లో స్థానిక భాషలకు ఊతం
సాక్షి, న్యూఢిల్లీ: న్యాయస్థానాల్లో స్థానిక భాషలను ప్రోత్సహించడం చాలా ముఖ్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. తద్వారా ప్రజలు న్యాయ ప్రక్రియతో అనుసంధానమైనట్లు భావిస్తారని, వారిలో విశ్వాసం పెరుగుతుందని అన్నారు. అంతిమంగా న్యాయ ప్రక్రియపై ప్రజల హక్కు బలపడుతుందని తెలిపారు. ఇప్పటికే సాంకేతిక విద్యలో స్థానిక భాషలను ప్రోత్సహిస్తున్నట్లు గుర్తుచేశారు. చట్టాల గురించి సులభమైన భాషలో అర్థమయ్యేలా వివరించాలన్నారు. శనివారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల సంయుక్త సదస్సులో ప్రధాని ప్రారంభోపన్యాసం చేశారు. అండర్ ట్రయల్ ఖైదీల కేసులకు ప్రాధాన్యం ఇవ్వాలని హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులకు సూచించారు. ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే... సదస్సుకు చాలా సీనియర్ని ‘‘దేశంలో న్యాయ వ్యవస్థ రాజ్యాంగ సంరక్షకుడి పాత్ర పోషిస్తోంది. సీఎంలు, సీజేల సంయుక్త సదస్సు రాజ్యాంగ సౌందర్యానికి నిలువెత్తు నిదర్శనం. నేను చాలాకాలంగా ఈ సదస్సుకు వస్తున్నా. మొదట ముఖ్యమంత్రిగా, ఇప్పుడు ప్రధానమంత్రిగా సదస్సుకు హాజరవుతున్నా. ఒకరకంగా చెప్పాలంటే ఈ సదస్సు విషయంలో నేను చాలా సీనియర్ని. డిజిటల్ ఇండియా మిషన్ డిజిటల్ ఇండియా మిషన్‌లో భాగంగా న్యాయ వ్యవస్థలో సాంకేతికతకు పెద్దపీట వేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీన్ని సీఎంలు, ప్రధాన న్యాయమూర్తులు మరింత ముందుకు తీసుకెళ్లాలి. ఈ–కోర్టుల ప్రాజెక్టును మిషన్ మోడ్‌లో అమలు చేస్తున్నాం. న్యాయ వ్యవస్థతో డిజిటల్ ఇండియాను అనుసంధానించాలి. బ్లాక్‌చెయిన్‌లు, ఎలక్ట్రానిక్ డిస్కవరీ, సైబర్ సెక్యూరిటీ, రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బయోఎథిక్స్ వంటి సబ్జెక్టులను అనేక దేశాల్లో న్యాయ విశ్వవిద్యాలయాల్లో బోధిస్తున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా భారత్‌లోనూ న్యాయ విద్యను అందించడం మన బాధ్యత. చట్టాల్లో సంక్లిష్టతలు, వాడుకలో లేని చట్టాలు చాలా ఉన్నాయి. 2015లో ప్రభుత్వం 1,800 చట్టాలను అప్రస్తుతంగా గుర్తించి ంది. ఇప్పటికే 1,450 చట్టాలను రద్దు చేశాం. పెండింగ్ కేసులకు మధ్యవర్తిత్వం స్థానిక కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల పరిష్కారానికి మధ్యవర్తిత్వం ఒక ముఖ్యమైన సాధనం. మన సమాజంలో మధ్యవర్తిత్వం ద్వారా వివాదాలను పరిష్కరించుకోవడం వేల సంవత్సరాలుగా ఒక సంప్రదాయంగా కొనసాగుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం మధ్యవర్తిత్వ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టింది.’ అని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఖాళీల భర్తీకి కృషి చేస్తున్నాం మన దేశం స్వాతంత్య్రం పొంది 2047 నాటికి 100 ఏళ్లు పూర్తవుతుంది. అప్పుడు దేశంలో ఎలాంటి న్యాయ వ్యవస్థను చూడాలనుకుంటున్నాం? 2047 నాటికి దేశ ఆకాంక్షలను నెరవేర్చగలిగేలా మన న్యాయ వ్యవస్థను ఎలా సమర్థంగా తీర్చిదిద్దాలి? ఈ ప్రశ్నలే ఈ రోజు ప్రాధాన్యతగా ఉండాలి. అమృత్ కాల్లో మన విజన్(దార్శనికత) అంతా సులభ న్యాయం, సత్వర న్యాయం, సమ న్యాయం కల్పించే న్యాయ వ్యవస్థపై ఉండాలి. న్యాయ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు, మౌలిక సదుపాయాలను మెరుగుపర్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. వివిధ స్థాయిల్లో ఖాళీలను భర్తీ చేసేందుకు కృషి చేస్తున్నాం. Delhi | PM Narendra Modi, Union Minister of Law & Justice Kiren Rijiju and Chief Justice of India NV Ramana attend the Joint Conference of CMs of States & Chief Justices of High Courts at Vigyan Bhawan pic.twitter.com/cmawTEOWOl — ANI (@ANI) April 30, 2022 న్యాయ వ్యవస్థ బలోపేతమే లక్ష్యం ♦ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ♦ ప్రత్యక్షంగా ఎన్నికైన వారిని ♦ అందరూ గౌరవించాల్సిందే ♦ కోర్టుల నిర్ణయాలను ప్రభుత్వాలు ♦ ఏళ్ల తరబడి అమలు చేయట్లేదు ♦ అందుకే వ్యాజ్యాలు పెరుగుతున్నాయ్ సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో న్యాయ వ్యవస్థను బలోపేతం చేయడమే తమ లక్ష్యమని, అందుకు మరిన్ని చర్యలు అవసరమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ చెప్పారు. న్యాయ వ్యవస్థలో మౌలిక సదుపాయాలను వీలైనంత త్వరగా ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకొన్న ప్రతినిధులను అందరూ గౌరవించాల్సిందేనని స్పష్టం చేశారు. కోర్టుల నిర్ణయాలు ఏళ్ల తరబడి అమలు కాకపోవడం వల్లే ప్రభుత్వాలపై ధిక్కరణ కేసులు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వాల విధి నిర్వహణ వైఫల్యం వల్ల కేసుల సంఖ్య పెరుగుతోందన్నారు. శనివారం ఢిల్లీలో రాష్ట్రాల సీఎంలు, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల సంయుక్త సదస్సులో జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడారు. దేశవ్యాప్తంగా కోర్టుల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం రాష్ట్ర స్థాయిలో స్పెషల్ పర్సస్ వెహికల్స్ ఏర్పాటు చేయాలన్నారు. సీఎంలు లేదా వారి తరపు ప్రతినిధులు ఇందులో భాగస్వాములు కావాలన్నారు. ఇందుకు ముఖ్యమంత్రులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలున్న ప్రజాప్రతినిధుల నుంచి ఎంతో నేర్చుకొనే అవకాశం వచ్చిందని జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. న్యాయ వ్యవస్థ పనితీరును మెరుగుపర్చడానికి, ప్రస్తుతం ఉన్న సవాళ్లను గుర్తించి, పరిష్కరించడంలో ప్రజాప్రతినిధులకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నానని వివరించారు. సదస్సులో ఆయన ఇంకా ఏం చెప్పారంటే... పెండింగ్ కేసులు 4.11 కోట్లు: న్యాయ వ్యవస్థలో ఖాళీలను త్వరగా భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. న్యాయమూర్తులు–జనాభా నిష్పత్తిని పెంచేందుకు హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు కృషి చేయాలి. అన్ని హైకోర్టుల్లో 1,104 జడ్జీల పోస్టులను ప్రభుత్వం మంజూరు చేయగా, ప్రభుత్వం 388 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఖాళీల భర్తీకి నేను పదవిలోకి వచ్చిన మొదటి రోజు నుంచే ప్రయత్నిస్తున్నా. మరోవైపు ఈ ఆరేళ్లలో పెండింగ్ కేసుల సంఖ్య 2.65 కోట్ల నుంచి 4.11 కోట్లకు పెరిగింది. ‘పిల్’ దుర్వినియోగం కోర్టుల్లో అనవసరమైన వ్యాజ్యాల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు (పిల్) కొన్నిసార్లు వ్యక్తిగత ప్రయోజనాల వ్యాజ్యాలుగా మారుతున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజా ప్రయోజనాలను కాపాడాల్సిన ‘పిల్’ను కొన్నిసార్లు ప్రాజెక్టులను నిలిపివేయడానికి, ప్రభుత్వ అధికారులపై ఒత్తిడి తీసుకురావడానికి దుర్వినియోగం చేస్తున్నారు. రాజకీయ అవసరాలు నెరవేర్చుకోవడానికి, కార్పొరేట్లపై కక్ష తీర్చుకోవడానికి ‘పిల్’ ఓ సాధనంగా మారడం విచారకరం. కోర్టుల్లో భాషాపరమైన అడ్డంకులు తొలగించడం, సంస్కరణలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఖాళీల భర్తీ, న్యాయ వ్యవస్థ బలాన్ని పెంపొందించడం వంటివి తక్షణావసరం’’ అని జస్టిస్ ఎన్వీ రమణ పిలుపునిచ్చారు. కోర్టుల్లో స్థానిక భాషలు.. ఒక్కరోజులో సాధ్యం కాదు కోర్టుల్లో స్థానిక భాషను ప్రవేశపెట్టడం వంటిసంస్కరణలను అమలు చేయడం ఒక్కరోజులో సాధ్యం కాదని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ చెప్పారు. కొన్ని ప్రతికూలతలు ఉన్నందువల్ల దాన్ని అమలు చేయడానికి కొంత సమయం పడుతుందన్నారు. -
‘సత్వర న్యాయం’ దిశగా అడుగులు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని పౌరులకు సత్వర న్యాయం అందించే దిశగా జరిగే ప్రయత్నాల సమర్థ సమన్వయం కోసం జరిగే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల çసంయుక్త సదస్సుకు రంగం సిద్ధమైంది. ఆరేళ్ల తర్వాత ఈ నెల 30న ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఈ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. నేషనల్ జ్యుడీషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అథారిటీ ఏర్పాటు ప్రధాన ఎజెండాగా ఈ సదస్సు కొనసాగనుంది. సమావేశంలో రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు, న్యాయవ్యవస్థలను ఏకీకృతం చేసేందుకు ఉమ్మడి కార్యాచరణను తీసుకొచ్చే దిశగా జరిగే ప్రయత్నాలపై చర్చించనున్నారు. ఈ సదస్సులో ప్రధాని మోదీ, సీజేఐ ఎన్వీ రమణ, కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెణ్ రిజిజు ప్రసంగిస్తారు. ప్రారంభ సమావేశం తర్వాత సదస్సు ఎజెండాపై ముఖ్యమంత్రులు, హైకోర్టుల సీజేలు పరిష్కార మార్గాలను కనుగొనేందుకు చర్చలు జరుగుతాయి. దేశంలోని న్యాయస్థానాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు నేషనల్ జ్యుడీషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అథారిటీ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేయాలని సీజేఐ రమణ గతంలోనే కేంద్ర ప్రభుత్వానికి సూచనలుచేశారు. న్యాయస్థానాల్లో సరైన మౌలిక సదుపాయాలు కొరవడి న్యాయపాలికల పనితీరు వెనుకబడిందని, ఈ సమస్యలన్నింటికీ అథారిటీ ఏర్పాటే పరిష్కారమని సీజేఐ వ్యాఖ్యానించారు. అథారిటీ ఏర్పాటుతో కేసులను త్వరితగతిన పరిష్కరించడంతో పాటు ప్రజలకు సత్వర న్యాయం అందుతుందని న్యాయ నిపుణులు భావిస్తున్నారు. హైకోర్టులు, కింది కోర్టుల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంలో రాష్ట్ర ప్రభుత్వాలు కీలకపాత్ర పోషిస్తున్నందున వారి అభిప్రాయాల కోసం ఈ ప్రతిపాదనను రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల పంపింది. త్వరగా కోర్టుల్లోని జడ్జి పోస్టులను భర్తీచేయాలని డిమాండ్లు ఎక్కువయ్యాయి. కరోనా నేపథ్యంలో కోర్టుల్లో వేల సంఖ్యలో కేసులు దాఖలయ్యాయి. దీనిపై సదస్సులో చర్చించనున్నారు. సీఎం, సీజేల సదస్సు సాధారణంగా ప్రతి రెండేళ్లకు ఒకసారి నిర్వహిస్తారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల సదస్సు తొలిసారిగా 1992లో అప్పటి ప్రధాని, దివంగత పీవీ నరసింహారావు, జస్టిస్(రిటైర్డ్) మధుకర్ హీరాలాల్ కనియా సీజేఐగా ఉన్నపుడు జరిగింది. 2016 ఏప్రిల్ 24న చివరిసారిగా సదస్సు జరిగింది. ఇందులో సబార్డినేట్ కోర్టుల మౌలిక సదుపాయాలు, నేషనల్ మిషన్ ఫర్ జ్యుడీషియల్, సెలవు రోజుల్లో కోర్టుల పనితీరు, ట్రయల్ ఖైదీలకు సంబంధించిన ప్రత్యేక సూచనలతో జైళ్ల పరిస్థితులు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అమలు, న్యాయ–సహాయ కార్యక్రమాల బలోపేతం, హైకోర్టుల్లో ఖాళీల భర్తీ వంటి అంశాలపై ప్రధానంగా చర్చించారు. నేడు సీజేల సమావేశం సుప్రీంకోర్టు సీజేఐ ఎన్వీ రమణ, 25 హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల 39వ సీజేల సమావేశం నేడు ఢిల్లీలో జరగనుంది. ఈ సమావేశం సైతం ఆరేళ్ల తర్వాత నిర్వహిస్తుండటం గమనార్హం. హైకోర్టుల్లో జడ్జీల నియామకాలు, సిబ్బంది కొరత, దేశవ్యాప్తంగా అన్ని కోర్టుల మధ్య నెట్వర్క్ సమన్వయం మరింత పటిష్టవంతం చేయడం వంటి ప్రధాన అంశాలు ఈ సమావేశంలో చర్చకు రానున్నాయి. -
ఆరేళ్ల తర్వాత అరుదైన సమావేశం
న్యూఢిల్లీ: దాదాపు ఆరు సంవత్సరాల విరామం తర్వాత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల సమావేశం ఈ నెల 30న జరగనుంది. సత్వర న్యాయాన్నందించడం, వివాదాల పరిష్కారం, న్యాయవ్యవస్థలో ఖాళీలు పెరగడం తదితర అంశాలు సమావేశంలో చర్చిస్తారు. 2016 ఏప్రిల్ 24న చివరిసారి ఈ సమావేశం జరిగింది. తాజా సమావేశాన్ని ప్రధాని ప్రారంభిస్తారు. ఇందులో సీజేఐ, న్యాయమంత్రి పాల్గొనే అవకాశముంది. సమావేశంలో పలు వర్కింగ్ సెషన్లు జరుగుతాయి. నిజానికి ఇలాంటి సమావేశాలను ప్రతి రెండేళ్లకొకసారి నిర్వహించాల్సిఉంది. చదవండి: (ఇకపై ఒకేసారి రెండు డిగ్రీలు: యూజీసీ అనుమతి) -
పంజాబ్ ముఖ్యమంత్రుల విద్యా ప్రస్థానం
సాక్షి, న్యూఢిల్లీ: పంజాబ్‌లో ఎన్నికల హోరు జోరందుకుంది. 1966లో పంజాబ్ పునర్వ్యవస్థీకరించి హరియాణా విడిపోయిన తర్వాత మొదటి ముఖ్యమంత్రిగా పనిచేసిన జ్ఞానీ గురుముఖ్ సింగ్ ముసాఫిర్ మొదలు ప్రస్తుత ముఖ్యమంత్రి చరణ్‌జీత్ సింగ్ చన్నీ వరకు 12మంది అధికారపీఠంపై కూర్చున్నారు. (క్లిక్: వామ్మో.. 94 ఏళ్ల వయసులో ఎమ్మెల్యేగా పోటీ.. ఎవరో తెలుసా?) ముసాఫిర్ కవి, రచయితగా సాహిత్య అకాడమీ అవార్డును అందుకోగా, చరణ్‌జీత్ సింగ్ చన్నీ న్యాయశాస్త్ర పట్టా తీసుకొని, ఎంబీఏ పూర్తిచేసి ప్రస్తుతం పీహెచ్డీ చేస్తున్నారు. ఇప్పటివరకు సీఎంలు అయినవారిలో ఏడుగురు సాధారణ గ్రాడ్యుయేట్లు కాగా, ముగ్గురు లా గ్రాడ్యుయేట్లు ఉన్నారు. అంతేగాక గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేయలేకపోయిన ఇద్దరు సీఎంలు అయ్యారు. (చదవండి: గాడ్ ఫాదర్ లేరు.. అయితేనేం..) -
ముఖ్యమంత్రిలతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్
-
ముఖ్య మంత్రుల జీతాలు ఎంత....?
-
జేఈఈ, నీట్ వాయిదాకై సుప్రీంకు!
న్యూఢిల్లీ: జేఈఈ మెయిన్స్, నీట్ పరీక్షలను కరోనా సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకొని వాయిదా వేయాలన్న డిమాండ్‌కు మద్దతు పెరుగుతోంది. ఈ విషయమై ఉమ్మడిగా సుప్రీంకోర్టును ఆశ్రయించాలని బీజేపీయేతర రాష్ట్రాలకు చెందిన ఏడుగురు ముఖ్యమంత్రులు నిర్ణయించారు. మరోవైపు డీఎంకే, ఆప్ సైతం ఈ డిమాండ్‌కు మద్దతు పలికాయి. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ బుధవారం పలువురు ముఖ్యమంత్రులతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. పరీక్షల వాయిదాకు సుప్రీం తలుపుతట్టాలని ఈ సమావేశంలో ఏకాభిప్రాయం వ్యక్తమ యింది. సమావేశంలో సీఎంలు అమరీందర్ సింగ్, అశోక్ గహ్లోత్, భూపేష్ భఘేల్, నారాయణ స్వామి, హేమంత్ సోరేన్, మమతా బెనర్జీ, ఉద్ధవ్ ఠాక్రేలు పరీక్షల వాయిదాపై సమష్టి వ్యూహంతో ముందుకు సాగాలని నిర్ణయించారు. విద్యార్థుల ఆరోగ్యానికి సంబంధించిన ఈ అంశంపై కేంద్రం అత్యంత అజాగ్రత్తగా వ్యవహరిస్తోందని సోనియా విమర్శించారు. పరీక్షల వాయిదాపై మరోమారు కలిసికట్టుగా సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలని మమతాబెనర్జీ ఇతర ముఖ్యమంత్రులకు విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ సహా ఇతర సీఎంలతో కలిసి నడవాలని మమతను సోనియా కోరారు. మమత సూచనపై సానుకూలంగా స్పందించిన అమరీందర్ సింగ్, ఈ విషయమై న్యాయసలహా ఇవ్వాలని రాష్ట్ర అడ్వొకేట్ జనరల్‌ను కోరారు. అందరం కలిసికట్టుగా కోర్టును ఆశ్రయించి లక్షలాది విద్యార్ధులకు బాసటగా నిలుద్దామన్నారు. ఈ నెల 28న పరీక్షల వాయిదాపై వివిధ రాష్ట్రాలు, జిల్లాల రాజధానుల్లోని కేంద్రప్రభుత్వ కార్యాలయాల వద్ద ఆందోళనలు నిర్వహించాలని, దేశవ్యాప్తంగా #SpeakUpForStudentSafety పేరిట ఆన్లైన్ ఉద్యమం నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. జాప్యంతో మరింత అనర్థం జేఈఈ, నీట్ పరీక్షల నిర్వహణ మరింత ఆలస్యం చేయడం మెరిట్ విద్యార్ధుల కెరీర్, అకడమిక్ క్యాలెండర్‌పై దుష్ప్రభావం చూపుతుందని ఐఐటీ ఢిల్లీ డైరెక్టర్ రామ్‌గోపాల్ రావు అభిప్రాయపడ్డారు. పరీక్షలు వాయిదా వేస్తే మొత్తం ఐఐటీ క్యాలెండర్‌పై ప్రభావం పడుతుందని, అప్పుడు ఒకేమారు రెండు బ్యాచులు నడపాల్సి ఉంటుందని చెప్పారు. దీనికితోడు లక్షలాది మంది విద్యార్థులు జీరో అకడమిక్ ఇయర్ బారిన పడతారన్నారు. ఇది మెరిట్ స్టూడెంట్స్ కెరీర్‌పై పెనుప్రభావం చూపుతుందని వివరించారు. ఇప్పటికే ఆరునెలలు వృథా అయ్యాయని, సెప్టెంబర్‌లో పరీక్షలు పెడితే కనీసం డిసెంబర్లో క్లాసులు ఆరంభించవచ్చని, ఇంకా వాయిదా వేయడం సబబుకాదని చెప్పారు. 14 లక్షల అడ్మిట్ కార్డుల డౌన్లోడ్ జేఈఈ మెయిన్స్, నీట్ పరీక్షలకు సంబంధించి దాదాపు 14 లక్షలకు పైగా అభ్యర్థులు అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకున్నట్లు ఎన్టీఏ తెలిపింది. నీట్ పరీక్షకు అడ్మిట్‌కార్డులను బుధవారం మధ్యాహ్నం నుంచి అందుబాటులో ఉంచగా తొలి మూడుగంటల్లో 4 లక్షల కార్డులు డౌన్లోడ్ చేసుకున్నారని, సాయంత్రానికి 6.84 లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారని ఎన్టీఏ అధికారి తెలిపారు. ఈ పరీక్షకు దాదాపు 16 లక్షల మంది రిజిస్టరయ్యారు. జేఈఈ మెయిన్స్‌కు దరఖాస్తు చేసుకున్న 8.58 లక్షల మంది అభ్యర్దుల్లో సుమారు 7.41 లక్షల మంది అడ్మిట్‌కార్డులను డౌన్లోడ్ చేసుకున్నారు. సెప్టెంబర్ 1–6 తేదీల్లో జేఈఈ మెయిన్స్, సెప్టెంబర్ 13న నీట్ పరీక్షలు నిర్వహించనున్నారు. -
మళ్లీ లాక్డౌన్.. నిజం కాదు!
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్‌పై జరుగుతున్న పోరాటంలో సమిష్టి కృషి, నిబద్ధతతోనే విజయం వరిస్తుందని ప్రధాని∙మోదీ పేర్కొన్నారు. కరోనాకు వ్యతిరేకంగా పోరాడుతూనే తగిన జాగ్రత్తలతో ఆర్థిక కార్యకలాపాలను వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. మళ్లీ లాక్డౌన్ విధిస్తారంటూ ప్రచారంలోకి వస్తున్న వదంతులను కొట్టిపారేయాలని అన్నారు. ఇండియా ఇప్పుడు అన్లాకింగ్(అన్‌లాక్ 1.0)æ దశలో ఉందని గుర్తుచేశారు. అన్‌లాక్ 2.0 గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. అన్‌లాక్ 1.0 తదనంతర పరిస్థితులు, కోవిడ్–19 మహమ్మారి కట్టడి ప్రణాళికపై చర్చించేందుకు ప్రధాని మోదీ వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. బుధవారం 14 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, ప్రతినిధులతో చర్చించారు. మౌలిక సదుపాయాల కల్పన, నిర్మాణ సంబంధిత పనుల్లో వేగం పెంచేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజల భాగస్వామ్యం కీలకం కరోనా వైరస్ సోకిన బాధితులు చాలామంది చికిత్సతో పూర్తిగా కోలుకుంటున్నారని, వారి సంఖ్యను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీఎంలకు మోదీ సూచించారు. తద్వారా కరోనా వల్ల నెలకొన్న భయాందోళనల నుంచి ప్రజలను బయటకు తీసుకురావాలని చెప్పారు. పోరాటంలో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని వెల్లడించారు. తమ రాష్ట్రాల్లో కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలను ముఖ్యమంత్రులు ఈ సందర్భంగా మోదీకి వివరించారు. ఆరోగ్య సేతుతో సానుకూల ఫలితాలు కొన్ని పెద్ద రాష్ట్రాలు, నగరాల్లో కరోనా మహమ్మారి వ్యాప్తి అధికంగా ఉందని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ఇతర ప్రాంతాల్లో ప్రజల సహకారం, పాలనా యంత్రాంగం సంసిద్ధత, కరోనా యోధుల అంకితభావం కారణంగా కరోనా వ్యాప్తి అదుపులో ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న కోవిడ్ నిర్ధారణ పరీక్షల సామర్థ్యాన్ని పూర్తిగా ఉపయోగించుకోవాలని సూచించారు. ప్రజలకు టెలిమెడిసిన్ సేవలు అందించేందుకు సీనియర్ వైద్యుల బృందాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. హెల్ప్లైన్లను సమర్థవంతంగా అమలు చేయడానికి యువ వాలంటీర్ల బృందాన్ని నియమించుకోవాలన్నారు. ఆరోగ్య సేతు యాప్‌ను పెద్ద సంఖ్యలో డౌన్లోడ్ చేసిన రాష్ట్రాల్లో సానుకూల ఫలితాలు వస్తున్నాయని మోదీ గుర్తుచేశారు. సరిపడా టెస్టింగ్ కిట్లు ఉన్నాయి కరోనా బారినపడి కోలుకుంటున్నవారి సంఖ్య భారీగా పెరుగుతుండడం మంచి పరిణామమన్నారు. కొందరు బాధితులకే ఐసీయూ సేవలు అవసరమవుతున్నాయని చెప్పారు. 900కుపైగా కరోనాటెస్టింగ్ ల్యాబ్‌లు, లక్షలాది ప్రత్యేక పడకలు, వేల సంఖ్యలో ఐసోలేషన్, క్వారంటైన్ సెంటర్లు, సరిపడా టెస్టింగ్ కిట్లు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. కోటికిపైగా పీపీఈ కిట్లు, అంతే సంఖ్యలో ఎన్095 మాస్కులు ఇప్పటికే రాష్ట్రాలకు పంపిణీ చేశామని తెలిపారు. -
ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటోంది
సాక్షి, న్యూఢిల్లీ: కొన్ని వారాల ప్రయత్నాలతో ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అన్‌లాక్ 1.0 పరిస్థితులు, భావి ప్రణాళికలపై చర్చించేందుకు ప్రధాని మోదీ ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైన ఈ సమావేశం దాదాపు రెండు గంటలపాటు సాగింది. కోవిడ్ నేపథ్యంలో ముఖ్యమంత్రులతో ప్రధాని మాట్లాడడం ఇది ఆరోసారి. కరోనా వ్యాప్తి తక్కువగా ఉన్న 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లతో ప్రధానమంత్రి మంగళవారం మాట్లాడారు. కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని.. దేశంలో కొన్ని వారాలుగా ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయని ప్రధాని వివరించారు. మహమ్మారిని ఎదుర్కోవటానికి సకాలంలో తీసుకున్న నిర్ణయాలు దేశంలో దాని వ్యాప్తిని నియంత్రించడంలో ప్రభావవంతంగా పనిచేశాయని ప్రధాని తెలిపారు. సహకార సమాఖ్యవాదానికి మనం ప్రపంచానికి ఒక ఉదాహరణను అందించామని ప్రజలు గుర్తుంచుకుంటారని ఆయన అన్నారు. ప్రతి ప్రాణాన్ని కాపాడటానికి ప్రయత్నించామని ప్రధాని అన్నారు. ప్రపంచవ్యాప్త ఆరోగ్య నిపుణులు భారతీయులు చూపిన క్రమశిక్షణను ప్రశంసిస్తున్నారని, దేశంలో రికవరీ రేటు ఇప్పుడు 50% పైగా ఉందని ఆయన అన్నారు. క్రమశిక్షణ సడలితే వైరస్‌కు వ్యతిరేకంగా మన పోరాటం బలహీన పడుతుందని హెచ్చరించారు. -
కరోనాపై ఏం చేద్దాం..
న్యూఢిల్లీ: దేశంలో లాక్డౌన్ ఆంక్షలు సడలించిన తర్వాత కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడానికి ఏం చేయాలన్న దానిపై ముఖ్యమంత్రుల అభిప్రాయాలు తెలుసుకొని, తదనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ భావిస్తున్నారు. ఆయన మంగళవారం, బుధవారం ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం కానున్నారు. మంగళవారం మధ్యాహ్నం 21 రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల సీఎంలు, లెఫ్టినెంట్ గవర్నర్లు, సీనియర్ అధికారులతో సంప్రదింపులు జరుపుతారు. బుధవారం మరో 15 రాష్ట్రాల సీఎంలు, అధికారులతో చర్చిస్తారు. ప్రధాని మోదీ ఇప్పటి దాకా ముఖ్యమంత్రులతో ఐదుసార్లు సమావేశమయ్యారు. చివరిసారిగా మే 11న ముఖ్యమంత్రులతో చర్చలు జరిపారు. -
మోదీ వీడియోకాన్ఫరెన్స్.. ఏం చెబుతారో?
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 16, 17 తేదీల్లో సుదీర్ఘ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. కరోనా మహమ్మారి వ్యాప్తి నివారణకు చేపట్టాల్సిన చర్యలు, ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ గురించి ఆయన చర్చించనున్నారు. మంగళవారం 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన సంభాషించనున్నారు. దేశంలోని మొత్తం కరోనా కేసుల్లో ఈ 21 రాష్ట్రాల్లో దాదాపు 5 శాతం యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో అత్యధిక కోవిడ్ కేసులు నమోదైన రాష్ట్రాల ముఖ్యమంత్రులతో బుధవారం ప్రధాని మోదీ మాట్లాడనున్నారు. కరోనా వైరస్ కేసుల పెరుగుదల, రాష్ట్రాల భౌగోళిక స్థానాల ఆధారంగా రాష్ట్రాలను రెండు గ్రూపులుగా విభజించారు. ఈ జాబితాను ప్రధానమంత్రి కార్యాలయం గతవారం ట్విటర్లో షేర్ చేసింది. మొదటి రోజు వీడియో కాన్ఫరెన్స్‌లో ఆరు కేంద్రపాలిత ప్రాంతాలు, ఈశాన్య ప్రాంతంలోని అన్ని రాష్ట్రాలు, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ వంటి పర్వతప్రాంత రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొంటారు. ఈ రాష్ట్రాల్లో అత్యధిక కరోనా కేసులు అసోం(4049), పంజాబ్(3140), కేరళ(2461)లలో నమోదయ్యాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆదివారం నాటికి ఈ 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో నమోదైన మొత్తం క్రియాశీల కేసులు18,000 లోపు ఉన్నాయి. 7,500 మంది కోలుకోగా, 130కి పైగా మరణాలు సంభవించాయి. సోమవారం నాటికి దేశంలోని కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,32,424కి చేరగా, మృతుల సంఖ్య 9,520కి పెరిగింది. ఇక రెండో రోజు ప్రధాని మోదీ సమావేశం కానున్న రాష్ట్రాల్లో దాదాపు 2.10 లక్షల కరోనా క్రియాశీల కేసులు ఉన్నాయి. దేశం మొత్తం కేసుల్లోని దాదాపు 65 శాతం వీటిలోనే నమోదయ్యాయి. లాక్డౌన్ నేపథ్యంలో వలస కార్మికులు స్వస్థలాలకు తిరిగి రావడం వల్లే కోవిడ్ కేసులు పెరిగినట్టు ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు చెబుతున్నాయి. దేశంలో కరోనా కేసులు వెలుగులోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రులతో ప్రధాని చర్చలు జరపడం ఇది ఆరోసారి. మార్చి 20న తొలిసారిగా సీఎంలతో ఆయన మాట్లాడారు. ఈసారి కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీల పాలిత రాష్ట్రాలు తమ గళాన్ని గట్టిగానే వినిపించే అవకాశముంది. లాక్డౌన్ కారణంగా కుదేలయిన తమకు కేంద్రం ప్రత్యక్ష సాయం అందించాలని, షరతులు లేని రుణాలు అందించాలని ప్రధాని మోదీని కోరనున్నాయి. (ప్రమాద ఘంటికలు: భారత్‌పై కరోనా పడగ) కరోనా విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో దేశంలో మరోసారి సంపూర్ణ లాక్డౌన్ ప్రకటించే అవకాశముందని ఊహాగానాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ సర్వత్రా ఆసక్తి నెలకొంది. సీఎంలతో మాట్లాడిన తర్వాత ప్రధాని ఏం నిర్ణయం తీసుకుంటారోనని ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. (మళ్లీ తెర ముందుకు అమిత్ షా!) -
లాక్డౌన్ పొడిగింపుపై మీరేమంటారు?
న్యూఢిల్లీ: ఈనెల 31వ తేదీతో ముగియనున్న దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను మరికొద్ది రోజులపాటు పొడిగించాలన్న ప్రతిపాదనపై హోం మంత్రి అమిత్ షా గురువారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. నాలుగో దశ లాక్డౌన్ ఈ నెలాఖరుతో ముగియనున్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రులతో ఫోన్లో మాట్లాడిన అమిత్ షా..ఏఏ రంగాలకు మినహాయింపు అవసరం? ఎలాంటి సమస్యలున్నాయి? వంటి అంశాలపై చర్చించారు. సీఎంలు ఏం చెప్పారనే విషయం వెల్లడి కానప్పటికీ, ఏదో ఒక రూపంలో లాక్డౌన్ పొడిగింపునకే ఎక్కువ మంది మొగ్గు చూపినట్లు సమాచారం. ఆర్థిక కార్యకలాపాలు కొనసాగేందుకు, జన జీవనం సాధారణ స్థాయికి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. కేంద్రం తుది నిర్ణయాన్ని రెండుమూడు రోజుల్లో ప్రకటించే అవకాశాలున్నాయి. -
రీస్టార్ట్‌కి రెడీ అవుదాం
న్యూఢిల్లీ: కరోనా, లాక్డౌన్లతో దారుణంగా దెబ్బతిన్న ఆర్థిక రంగాన్ని గాడిన పెట్టేందుకు కేంద్రం సాయం అందించాలని పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అభ్యర్థించారు. తమ రాష్ట్రాల్లో జోన్లను నిర్ధారించే అధికారం తమకే ఉండాలని కోరారు. కరోనా నియంత్రణ, లాక్డౌన్ నిర్వహణ, ఆర్థిక రంగ ఉద్దీపన సహా పలు అంశాలపై సోమవారం ప్రధాని మోదీ రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయా అంశాలపై వారి అభిప్రాయాలను తెల్సుకున్నారు. కరోనా మహమ్మారిపై పోరుకు సంబంధించి భవిష్యత్ కార్యాచరణ విషయంలో సమతుల వ్యూహం అవసరమని సీఎంలతో భేటీలో వ్యాఖ్యానించారు. రాష్ట్రాలు ఇచ్చే సూచనల ఆధారంగానే ఆ వ్యూహం రూపొందుతుందన్నారు. లాక్‌డౌన్‌కు సంబంధించి తమ సమగ్ర వ్యూహాలను మే 15 లోగా పంపించాలని ముఖ్యమంత్రులను ప్రధాని కోరారు. గ్రామాలకు విస్తరించవద్దు కరోనా నుంచి భారత్ విజయవంతంగా బయటపడిందన్న భావనలో ప్రపంచం ఉందని మోదీ అన్నారు. ఈ విజయంలో రాష్ట్రాలు నిర్ణయాత్మక పాత్ర పోషించాయని ప్రశంసించారు. కరోనా గ్రామాలకు వ్యాపించకుండా చూడడం అతి పెద్ద సవాలన్నారు. లాక్డౌన్ నిబంధనలను సరిగా పాటించని ప్రాంతాల్లోనే కరోనా వ్యాప్తి చెంది, సమస్యాత్మకంగా మారాయన్నారు. కరోనా వ్యాప్తి చెందకుండా ఉండాలంటే ఎక్కడున్న వారు అక్కడే ఉంటే మంచిదని, కష్ట సమయంలో తమ వాళ్లతో ఉండాలనుకుంటారు కనుక తదనుగుణంగా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు. వ్యాప్తిని తగ్గించే దిశగా దృష్టి పెట్టాలని, ప్రజలు ‘రెండు గజాల దూరం’సహా అన్ని నిబంధనలను పాటించేలా చూడాలని పీఎం కోరారు. ఏ ప్రాంతాల్లో వైరస్ ప్రభావ తీవ్రంగా ఉంది, ఏ ప్రాంతాల్లో వ్యాప్తి చెందే అవకాశాలున్నాయనే విషయంలో స్పష్టమైన సమాచారం కేంద్రం వద్ద ఉందన్నారు. వైరస్‌ను నియంత్రించేందుకు ఈ సమాచారం ఉపయోగపడుతుందన్నారు. ఆర్థిక కార్యకలాపాల పునఃప్రారంభం దాదాపు ఆరు గంటల పాటు పీఎం–సీఎంల కాన్ఫరెన్స్ కొనసాగింది. దేశంలో ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకోనున్నాయని ఈ సందర్భంగా మోదీ వ్యాఖ్యానించారు. ఆర్థిక కార్యకలాపాలను పూర్తి స్థాయిలో పునఃప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. పెద్ద సంఖ్యలో వలస కార్మికులు తమ గ్రామాలకు వెళ్లిపోతున్న పరిస్థితుల్లో పారిశ్రామిక కార్యకలాపాల పునరుద్ధరణ ప్రస్తుతం సమస్యగా మారిన అంశం భేటీలో చర్చకు వచ్చింది. అందరు ముఖ్యమంత్రుల అభిప్రాయాలు తీసుకున్న తరువాతనే లాక్‌డౌన్‌ను ఎత్తివేయడమా? లేక కొనసాగించడమా? అనే విషయంపై నిర్ణయం తీసుకోవాలనుకున్నట్లు సీఎంలతో వ్యాఖ్యానించారు. హోం, ఫైనాన్స్, డిఫెన్స్ మంత్రులూ.. భేటీలో హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్, ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి(ఆంధ్రప్రదేశ్), చంద్రశేఖర రావు(తెలంగాణ), ఉద్ధవ్ ఠాక్రే(మహారాష్ట్ర) తదితరులు భేటీలో పాలు పంచుకున్నారు. కరోనాకి సంబంధించి పీఎం– సీఎంల మధ్య ఇది ఐదవ వీడియో కాన్ఫరెన్స్. ఈ భేటీలో దాదాపు సీఎంలందరికీ తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే అవకాశం లభించింది. పొడిగింపునకే మొగ్గు కరోనా విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో పలువురు సీఎంలు లాక్‌డౌన్‌ను మరోసారి పొడగించాలని ప్రధానికి సూచించారు. ఈ నెల మొత్తం రైలు, విమాన ప్రయాణాలపై నిషేధం కొనసాగించాలని తెలంగాణ, తమిళనాడు ముఖ్యమంత్రులు ప్రధానిని కోరారు. కంటెయిన్మెంట్ ప్రాంతాలను మినహాయించి, దేశ రాజధాని ప్రాంతంలో ఆర్థిక కార్యకలాపాలను ప్రారంభించాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కోరారు. లాక్‌డౌన్‌ను కొనసాగించాలని అస్సాం, పంజాబ్ సహా ఐదు రాష్ట్రాల సీఎంలు కోరారు. సొంత ప్రాంతాలకు ఆకలిదప్పులకు ఓర్చుకుంటూ కాలినడకన వెళ్తున్న వలస కార్మికుల గురించి మెజారిటీ సీఎంలు ఆవేదన వ్యక్తం చేశారు. తమ రాష్ట్రంలో వైరస్ ప్రభావం లేని ప్రాంతాల్లో ఎయిర్, రైల్, మెట్రో ప్రయాణాలకు అనుమతించాలని కేరళ సీఎం విజయన్ కోరారు. ఈ విషయంలో నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్రాలకు ఉండాలన్నారు. లాక్డౌన్ నుంచి వ్యూహాత్మకంగా బయటకు వచ్చే వ్యూహాన్ని జాగ్రత్తగా రూపొందించాల్సి ఉందని పంజాబ్ సీఎం అమరిందర్ సింగ్ కోరారు. ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు రాష్ట్రాలకు ఆర్థిక సాయం అందించాలన్నారు. దీదీ సీరియస్ కరోనాపై పోరులో పశ్చిమబెంగాల్‌ను అనవసరంగా టార్గెట్ చేస్తున్నారని ఆ రాష్ట్ర సీఎం మమత బెనర్జీ ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌లో ఆగ్రహం వ్యక్తం చేశారని తృణమూల్ కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. ‘బెంగాల్‌ను రాజకీయంగా లక్ష్యంగా చేసుకుంటున్నారు. సంక్షోభం నుంచి బయటపడేందుకు కేంద్రం ఒక స్పష్టమైన వ్యూహంతో ముందుకు రావాలి’ అని మమత డిమాండ్ చేశారని తెలిపాయి. ఆ వర్గాలు తెలిపిన సమాచారం మేరకు.. కోవిడ్‌పై పోరు విషయంలో ప్రస్తుతం అవలంబిస్తున్న విధానంలోని వైరుధ్యాలను ఆమె ప్రధాని దృష్టికి తీసుకువచ్చారు. ఒకవైపు లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయాలంటూనే.. మరోవైపు, మినహాయింపుల పేరుతో రైళ్లను నడపడం, రాష్ట్రాల సరిహద్దులను తెరవడాన్ని ఆమె ఆక్షేపించారు. ఏ రంగాలకు మినహాయింపునివ్వాలన్నది క్షేత్రస్థాయి పరిస్థితుల ఆధారంగా రాష్ట్రాలే నిర్ణయించుకోవడం మంచిదన్నారు. ప్రధాని మొదట మాట్లాడిన సీఎంలలో మమత ఒకరని అధికార వర్గాలు తెలిపాయి. -
నేడు సీఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషించనున్నారు. దేశంలో దశలవారీగా లాక్డౌన్ ఎత్తివేత, ఆర్థిక కార్యకలాపాల పునఃప్రారంభం అంశమే ప్రధానంగా చర్చ సాగనుంది. కోవిడ్ కేసుల తీవ్రత దృష్ట్యా ప్రస్తుతం రెడ్ జోన్లుగా ఉన్న వాటిని ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా మార్పుచెందేలా చూడటం, ఆర్థిక కార్యకలాపాలకు ఊతమివ్వడంపైనే వీరు దృష్టి సారించనున్నారు. ఈ సందర్భంగా లాక్డౌన్ ఆంక్షలపై మరిన్ని సడలింపులు ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఏప్రిల్ 27వ తేదీన ప్రధాని మోదీ, సీఎంలతో చర్చ జరిగిన సమయంలో దేశంలో కోవిడ్ కేసులు 28వేల వరకు ఉండగా ప్రస్తుతం అది 63 వేల వరకు చేరుకున్న విషయం తెలిసిందే. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి మొదలయ్యాక ప్రధాని మోదీ ముఖ్యమంత్రులతో జరిపే ఐదో సమావేశం ఇది. మార్చి 25వ తేదీన మొదటిసారిగా దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను అమల్లోకి తెచ్చిన కేంద్రం..మూడోసారి ఈ నెల 17వ తేదీ వరకు ఆంక్షలను పొడిగిస్తున్నట్లు ప్రకటిస్తూ..ప్రజల రాకపోకలు, ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించి పలు సడలింపులు చేపట్టింది. -
ఆ తర్వాత కూడా ఇవి నిషేధమే..!
న్యూఢిల్లీ: విద్యా సంస్థలు, షాపింగ్ మాల్స్, ప్రార్థనా స్థలాలు, ప్రజా రవాణా.. తదితర ప్రజలు గుమికూడే ప్రదేశాలపై మే 3 తరువాత కూడా నిషేధం కొనసాగే అవకాశముందని అధికారులు సోమవారం తెలిపారు. ఈ మేరకు ప్రధాని, ముఖ్యమంత్రుల సమావేశంలో సంకేతాలు వచ్చాయన్నారు. అయితే, లాక్డౌన్ కొనసాగింపుపై ఈ వారాంతంలో ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. గ్రీన్ జోన్ జిల్లాల్లో ప్రైవేటు వాహనాలను కొంతవరకు అనుమతించవచ్చన్నారు. రైల్వే, విమానయానానికి మాత్రం మే 3 తరువాత కూడా అనుమతి లభించకపోవచ్చన్నారు. కరోనా వ్యాప్తిని సమీక్షించిన తరువాత మే మూడో వారంలో నియమిత ప్రాంతాలకు వీటిని అనుమతించే విషయం ప్రతిపాదనలో ఉందన్నారు. ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న సీఎంలలో ఒడిశా, గోవా, మేఘాలయ సహా ఐదు రాష్ట్రాల ముఖ్యమంత్రులు లాక్‌డౌన్‌ను పొడిగించాలని కోరారని, కొందరు మాత్రం హాట్‌స్పాట్స్‌ను మినహాయించి, మిగతా ప్రాంతాల్లో దశలవారీగా లాక్‌డౌన్‌ను ఎత్తివేయాలని సూచించారని సమాచారం. వేరే రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కార్మికులను సొంత ప్రాంతాలకు పంపేందుకు చర్యలు తీసుకోవాలని పలువురు సీఎంలు కోరారని అధికారులు తెలిపారు. -
మే 3 తరువాత కూడా!
సాక్షి, న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌ను మరికొన్ని రోజులు కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత రెండో విడత దేశవ్యాప్త లాక్డౌన్ మే 3న ముగుస్తుంది. ఒకేసారి దేశవ్యాప్తంగా కాకుండా, కరోనా తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ను కొనసాగించాలని, మిగతాచోట్ల లాక్డౌన్ నిబంధనలకు చాలావరకు మినహాయింపు ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లోనూ ప్రధాని ఇదే అభిప్రాయాన్ని సూచనప్రాయంగా వ్యక్తం చేశారని తెలుస్తోంది. ‘ఇప్పటివరకు రెండు లాక్డౌన్లను ప్రకటించాం. రెండూ వేర్వేరు తరహా నిబంధనలున్నవి. ఆ దిశగా ఆలోచించాలి. రానున్న కొన్ని నెలల పాటు కరోనా ప్రభావం ఉండబోతోందని నిపుణులు చెబుతున్నారు’అని సీఎంలతో మోదీ పేర్కొన్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. లాక్డౌన్ నుంచి దశలవారీగా బయటకు వచ్చే వ్యూహాన్ని సిద్ధం చేయాల్సిందిగా ప్రధాని సూచించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. లాక్డౌన్ ఎగ్జిట్ వ్యూహాలను స్థానిక పరిస్థితులను బట్టి రాష్ట్రాలే రూపొందించుకోవాలని మోదీ చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్రెడ్డి(ఆంధ్రప్రదేశ్), కేసీఆర్(తెలంగాణ), కేజ్రీవాల్(ఢిల్లీ), ఉద్ధవ్ ఠాక్రే(మహారాష్ట్ర), పళనిస్వామి(తమిళనాడు), కన్రాడ్ సంగ్మా(మేఘాలయ), యోగి ఆదిత్యనాథ్(యూపీ) తదితరులు పాల్గొన్నారు. సీఎంల ప్రశంసలు కరోనా కట్టడికి తమ రాష్ట్రాల్లో తాము చేపట్టిన చర్యలను ముఖ్యమంత్రులు ప్రధానికి వివరించారు. అంతర్జాతీయ సరిహద్దులపై గట్టి నిఘా పెట్టాలని, ఆర్థిక సవాళ్లను ఎదుర్కొనేందుకు, ఆరోగ్య రంగంలో మౌలిక వసతులను పెంచేందుకు చర్యలు చేపట్టాలని పలువురు ప్రధానికి సూచించారు. కరోనా సంక్షోభ సమయంలో సమర్థ నాయకత్వం అందిస్తున్నారని పలువురు ముఖ్యమంత్రులు ప్రధానిని ప్రశంసించారు. కరోనాపై పోరులో వైద్య సిబ్బంది, పోలీసుల కృషిని నేతలంతా కొనియాడారు. ముఖ్యమంత్రులతో జరిగిన ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధానితో పాటు హోంమంత్రి అమిత్ షా, ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్, ప్రధాని కార్యాలయంలోని, ఆరోగ్య శాఖలోని ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సవాళ్లను అవకాశాలుగా మార్చుకోండి కరోనా కారణంగా తలెత్తిన సవాళ్లను అవకాశాలుగా మార్చుకోవాలని ముఖ్యమంత్రులతో వీడియో భేటీ సందర్భంగా సీఎంలకు ప్రధాని మోదీ ఉద్బోధించారని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. స్థానిక పరిస్థితుల ఆధారంగా లాక్డౌన్ నుంచి బయటకు వచ్చే వ్యూహాలను రాష్ట్రాల వారీగా రూపొందించుకోవాలని ప్రధాని సూచించారని వెల్లడించింది. కరోనా ప్రభావం మరికొన్ని నెలలు ఉంటుందని, మాస్క్‌లు, శానిటైజర్ల వాడకాన్ని కొనసాగించాలని ప్రధాని చెప్పారని మహారాష్ట్ర సీఎంఓ తెలిపింది. మేఘాలయలో కొనసాగింపు లాక్‌డౌన్‌ను మే 3 తరువాత కూడా కొనసాగించాలని మేఘాలయ నిర్ణయించింది. గ్రీన్ జోన్స్‌లో, కరోనా ప్రభావం లేని జిల్లాల్లో మాత్రం మినహాయింపు ఇస్తామని పేర్కొంది. ఆర్థికం కూడా కీలకమే కోవిడ్–19ను నియంత్రించడంతో పాటు ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవానికీ ప్రాముఖ్యత ఇవ్వాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు దిశా నిర్దేశం చేశారు. వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలు, లాక్ డౌన్ నిబంధనల అమలు, ఆంక్షలపై మినహాయింపులు తదితర అంశాలపై వారు చర్చించారు. వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న హాట్‌స్పాట్స్‌లో నిబంధనలను కఠినంగా అమలు చేయాలని ప్రధాని సీఎంలకు సూచించారు. లాక్డౌన్ వల్ల సత్ఫలితాలు వచ్చాయని, వేలాది ప్రాణాలను కాపాడగలిగామని చెప్పారు. ‘కొన్ని దేశాల జనాభా మొత్తం కలిస్తే భారత్ జనాభాతో సమానమవుతుంది. మార్చి మొదటివారంలో భారత్ సహా చాలా దేశాల్లో కరోనా తీవ్రత దాదాపు ఒకేలా ఉంది. అయితే, సరైన సమయంలో, సరైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా భారత ప్రభుత్వం విలువైన వేలాది ప్రాణాలను కాపాడగలిగింది’అని ప్రధాని వ్యాఖ్యానించారు. అయితే, కరోనా మహమ్మారి ముప్పు ఇంకా పూర్తిగా తొలగిపోలేదని ఆయన హెచ్చరించారు. అప్రమత్తంగా ఉంటూ, ప్రజలు ప్రభుత్వం ప్రకటించిన నిబంధనలను పాటించేలా చూడాల్సి ఉందన్నారు. రెడ్ జోన్స్‌ను ఆరెంజ్ జోన్స్‌గా, ఆ తరువాత వైరస్ రహిత గ్రీన్ జోన్స్‌గా మార్చే దిశగా వ్యూహాత్మక చర్యలు తీసుకోవాలని కోరారు. ‘కేసుల సంఖ్య పెరగడం నేరమేమీ కాదు. కేసుల సంఖ్య పెరుగుతోందని ఒత్తిడి, ఆందోళన చెందకండి. ఈ సమస్య దేశమంతా ఉంది’అని ప్రధాని సీఎంలతో వ్యాఖ్యానించారు. భౌతిక వ్యాప్తికి సంబంధించి ‘రెండు గజాల దూరం’మంత్రాన్ని అంతా అనుసరించాలన్నారు. వేసవికాలం, వర్షాకాలాల్లో వైరస్ వ్యాప్తిని అంచనా వేస్తూ.. తదనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలని సీఎంలకు దిశానిర్దేశం చేశారు. భవిష్యత్తు జన జీవనంలో ఇక మాస్క్‌లు భాగం అవుతాయన్నారు. కరోనాపై పోరులో, ఆర్థిక పునరుజ్జీవనంలో సాధ్యమైనంత వరకు సాంకేతికతను వినియోగించుకోవాలని, సామాన్యుడికి లబ్ధి చేకూర్చే మరిన్ని సంస్కరణలు చేపట్టే దిశగా ఆలోచించాలని ప్రధాని సూచించారు. విద్యా సంస్థల్లోని శాస్త్రవేత్తలు సమన్వయంతో ఈ కరోనా మహమ్మారిని అంతం చేసే దిశగా ప్రయోగాలు చేయాలన్నారు. -
నేడు సీఎంలతో పీఎం వీడియో కాన్ఫరెన్స్
న్యూఢిల్లీ: కరోనా వైరస్‌పై పోరులో తదుపరి చర్యలను చర్చించేందుకు ప్రధానమంత్రి మోదీ సోమవారం ఉదయం రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ భేటీలో మే 3 తరువాత లాక్‌డౌన్‌ను కొనసాగించడమా? లేక దశలవారీగా ఎత్తివేయడమా? అనే విషయంపై చర్చించే అవకాశముందని అధికార వర్గాలు తెలిపాయి. లాక్డౌన్ ఎత్తివేతపై అనుసరించాల్సిన వ్యూహాన్ని కూడా వారు చర్చిస్తారని వెల్లడించాయి. ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు ఇప్పటికే కేంద్రం, పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌కు పలు రంగాల్లో కొన్ని మినహాయింపులు ఇచ్చిన విషయం తెలిసిందే. హాట్స్పాట్లు కాని నివాస ప్రాంతాల్లోనూ మినహాయింపులూ ప్రకటించాయి. కరోనా కట్టడికి లాక్డౌన్ మరి కొన్నాళ్లు కొనసాగించడమే మేలని పలు రాష్ట్రాలు అభిప్రాయపడుతున్నాయి. మార్చి 20, ఏప్రిల్ 11 తేదీల్లోనూ ప్రధాని సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. -
27న సీఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్
న్యూఢిల్లీ: కోవిడ్ పరిస్థితులపై చర్చించేందుకు ప్రధాని మోదీ 27న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారని అధికార వర్గాలు తెలిపాయి. లాక్డౌన్ నేపథ్యంలో సీఎంలతో మోదీ మూడో వీడియో కాన్ఫరెన్స్ ఇది. దేశవ్యాప్తంగా ఉన్న గ్రామ పంచాయతీ సర్పంచ్‌లతో ప్రధాని ఈ నెల 24వ తేదీన వీడియో లింక్ ద్వారా మాట్లాడనున్నారు. ఈ సందర్భంగా ఆయన స్వామిత్వ పథకాన్ని ప్రారంభించడంతోపాటు ఈ–గ్రామస్వరాజ్ పోర్టల్, మొబైల్ యాప్‌ను ఆవిష్కరించనున్నారని అధికార వర్గాలు వెల్ల డించాయి. ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగిం చుకుని గ్రామీణ ప్రాంతాల్లోని నివాస ప్రాంతా న్ని గుర్తించడమే స్వామిత్వ పథకం ఉద్దేశం. ప్రధాని మోదీకి బిల్‌గేట్స్ ప్రశంసలు దేశంలో కరోనాæ వ్యాప్తిని అడ్డుకు నేందుకు లాక్డౌన్ విధించడంతో పాటు పరీక్షలు విస్తృతంగా చేపట్టడం వంటి చర్యలను అమలు చేస్తున్న మోదీపై మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ ప్రశంసలు కురిపించారు. ప్రజలకు సామాజిక భద్రత కల్పించినందుకు మోదీకి కృతజ్ఞతలు చెప్తూ ఆయన ప్రధానికి లేఖ రాశారని అధికార వర్గాలు తెలిపాయి. -
లాక్‌డౌన్‌పై ప్రధాని ప్రసంగం నేడు!
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఉదయం 10 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. 21 రోజుల దేశవ్యాప్త లాక్డౌన్ ఈ రోజుతో ముగియనున్న విషయం తెలిసిందే. మరో రెండు వారాలపాటు లాక్డౌన్ పొడిగిస్తారని, ఆర్థిక కార్యకలాపాలు కొనసాగించేందుకు కొన్ని నిబంధనల సడలింపు ఉంటుందని ఇప్పటికే కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రధాని ప్రసంగానికి ప్రాధాన్యమేర్పడింది. పలు రాష్ట్రాలు ఏప్రిల్ 14 తరువాత కనీసం రెండు వారాల లాక్డౌన్ పొడిగింపునకే మొగ్గు చూపుతుండగా ప్రభుత్వం మాత్రం కోవిడ్–19ను నిరోధించడం, అదే సమయంలో దశలవారీగా ఆర్థిక కార్యకలాపాలను మొదలుపెట్టడం అన్న ద్విముఖ వ్యూహంతో ముందుకు వెళుతోందని ఓ అధికారి తెలిపారు. భౌతిక దూరం కచ్చితంగా పాటించేందుకు అనువుగా లాక్‌డౌన్‌ను పొడిగించినప్పటికీ ఆర్థిక కార్యకలాపాలను నడిపించేందుకు వీలుగా కొన్ని మినహాయింపులూ ప్రధాని ప్రకటించవచ్చునని అంచనా. ప్రాణాలతోపాటు, జీవనోపాధులను కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ప్రధాని గత శనివారం రాష్ట్రాల ముఖ్యమంత్రులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లోనూ వ్యాఖ్యానించిన సంగతి ఇక్కడ ప్రస్తావనార్హం. ‘లాక్డౌన్ ప్రకటిస్తున్నప్పుడు నేను ప్రాణముంటే ప్రపంచం ఉంటుందని చెప్పాను. దేశంలోని అధికులు దీన్ని అర్థం చేసుకున్నారు. ఇళ్లల్లోనే ఉండి తమ బాధ్యతలు నెరవేర్చారు. ఇప్పుడు దేశ ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రాణాలతోపాటు జీవనోపాధులపై కూడా దృష్టి పెట్టాల్సిన సమయం వచ్చింది’ అని మోదీ ఆ సమావేశంలో వివరించారు. మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, తమిళనాడు, అరుణాచల్‌ప్రదేశ్, తెలంగాణ, పుదుచ్చేరిల్లో ఇప్పటికే లాక్‌డౌన్‌ను ఏప్రిల్ 30వ తేదీ వరకూ పొడిగించిన విషయం తెలిసిందే. కార్యాలయాలకు కేంద్ర మంత్రులు.. ఆర్థిక కార్యకలాపాలను పునరుద్ధరించేందుకు అనువుగా సోమవారం పలువురు కేంద్ర మంత్రులు ఢిల్లీలోని తమ కార్యాలయాల్లో విధులు నిర్వర్తించడం మొదలుపెట్టారు. ‘లాక్డౌన్లో ఎక్కువ కాలం ఇంటి నుంచే పనిచేశాను. ఈ రోజు శాస్త్రి భవన్‌లోని కార్యాలయానికి తిరిగి వచ్చా. మోదీ ప్రభుత్వం ఇప్పుడు పూర్తిస్థాయిలో పనిచేసేందుకు సిద్ధమైంది’’అని బొగ్గు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి వ్యాఖ్యానించారు. సమాచార ప్రసార శాఖల మంత్రి ప్రకాశ్ జవదేకర్, మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, రైల్వే, వాణిజ్య శాఖల మంత్రి పీయూష్ గోయెల్, యువజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు, సాంస్కృతిక శాఖ మంత్రి ప్రహ్లాద్ పటేల్ సోమవారం తమ తమ కార్యాలయాలకు వచ్చిన వారిలో ఉన్నారు. జాయింట్ సెక్రటరీలు, అంతకంటే పై స్థాయి అధికారులకు రవాణా సౌకర్యం ఉండటం వల్ల వారు కార్యాలయాలకు రాగా.. రెండు, మూడు, నాలుగో తరగతుల ఉద్యోగులు వంతుల వారీగా వస్తున్న విషయం తెలిసిందే. అవసరమైనంత రక్షణ ఏర్పాట్లతో గుర్తించిన పరిశ్రమలు, సేవలను అందుబాటులోకి తేవాలని దేశీ పరిశ్రమలు, వాణిజ్య ప్రోత్సాహక మండలి ఇప్పటికే సూచించింది కూడా. -
లాక్డౌన్ పొడిగింపునకే మొగ్గు!
న్యూఢిల్లీ: దేశంలో కరోనా రక్కసిని పూర్తిగా అంతమొందించేందుకు ఏప్రిల్ 14వ తేదీ తరువాత కూడా లాక్‌డౌన్‌ను కొనసాగించేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. ఈ మేరకు శనివారం ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిపిన సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టమైన సంకేతాలిచ్చారు. లాక్‌డౌన్‌ను కనీసం 2 వారాలైనా కొనసాగించేందుకు దాదాపు అన్ని రాష్ట్రాలు ఏకాభిప్రాయంతో ఉన్నట్లు స్పష్టమవుతోందని ప్రధాని పేర్కొన్నారు. కోవిడ్ –19పై పోరులో ముందుండి పోరాడుతున్న వైద్యులు, ఇతర శాఖల సిబ్బందికి వ్యక్తిగత రక్షణ పరికరాలను తగినన్ని అందుబాటులో ఉంచుతామని ప్రధాని సీఎంలకు వివరించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా, ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. లాక్డౌన్ కారణంగా కుదేలయిన రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలను ఆదుకునేందుకు, కోవిడ్–19పై పోరు కొనసాగించేందుకు కేంద్రం సాయం అందించాలని పలువురు సీఎంలు ప్రధానిని అభ్యర్థించారు. కరోనా వైరస్ వ్యాప్తిని సంపూర్ణంగా అడ్డుకునేందుకు లాక్‌డౌన్‌ను కొనసాగించడమే అత్యుత్తమ, ఏకైక మార్గమని పంజాబ్, ఢిల్లీ ముఖ్యమంత్రులు అమరీందర్ సింగ్, అరవింద్ కేజ్రీవాల్ ప్రధానికి సూచించారు. ఏప్రిల్ ఆఖరు దాకా లాక్‌డౌన్‌ను కొనసాగించాలని వారు ప్రధానికి సూచించారు. పంజాబ్, ఒడిశా రాష్ట్రాలు ఇప్పటికే లాక్‌డౌన్‌ను కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ప్రధాని మోదీ తెల్లని వస్త్రంతో చేసిన మాస్క్‌ను ధరించగా, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు కూడా మాస్క్‌లతో ఈ భేటీలో పాల్గొన్నారు. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఇప్పటివరకు తీసుకున్న చర్యలు ఏ మేరకు ఫలితాలను ఇచ్చాయన్నది రానున్న 3, 4 వారాల్లో తేలుతుందని ప్రధాని వ్యాఖ్యానించారు. వైరస్‌ను పూర్తిగా రూపుమాపేందుకు రానున్న 3, 4 వారాలు అత్యంత కీలకమన్నారు. ఈ కాన్ఫరెన్స్‌లో మమతా బెనర్జీ (బెంగాల్), యోగి ఆదిత్యనాథ్(ఉత్తరప్రదేశ్), ఉద్ధవ్ ఠాక్రే(మహారాష్ట్ర), ఎంఎల్ ఖట్టర్(హరియాణా), నితీశ్‌కుమార్(బిహార్) తదితర రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. కొన్ని ఆంక్షల సడలింపుతో లాక్‌డౌన్‌ను కొనసాగించనున్నారన్న వార్తల నేపథ్యంలో శనివారం ఉదయం 11 గంటలకు ఈ వీడియో కాన్ఫరెన్స్ ప్రారంభమైంది. ప్రాణాలూ ముఖ్యమే.. అభివృద్ధీ ముఖ్యమే మొదట లాక్డౌన్ ప్రకటించినప్పుడు ప్రజల ప్రాణాలను కాపాడటమే ప్రభుత్వాల ప్రాథామ్యమని చెప్పామని, అయితే, ఇప్పుడు ప్రభుత్వాల లక్ష్యం ప్రాణాలను కాపాడటంతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడటం కూడా అని ప్రధాని వ్యాఖ్యానించారు. ‘లాక్డౌన్ ప్రకటిస్తున్న సమయంలో ప్రాణాలు ఉంటేనే అభివృద్ధి అన్నాను. నా మాటలను అర్థం చేసుకున్న దేశప్రజలు లాక్డౌన్ నిబంధనలను అద్భుతంగా పాటించారు. ఇప్పుడు ప్రాణాలతో పాటు దేశాభివృద్ధిపైనా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది’ అన్నారు. కరోనా కట్టడిలో కేంద్రం, రాష్ట్రాలు సమన్వయంతో పని చేస్తున్నాయన్నారు. ఔషధాలు, నిత్యావసర వస్తువులు తగినన్ని అందుబాటులో ఉన్నాయని, వాటిని అక్రమంగా నిల్వ చేస్తే తీవ్ర చర్యలుంటాయని హెచ్చరించారు. వైద్య సిబ్బంది, ఈశాన్య రాష్ట్రాలు, కశ్మీర్ విద్యార్థులపై దాడులను ప్రధాని ఖండించారు. కోవిడ్ 19కి చికిత్స లేనందున భౌతిక దూరం పాటించడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం తప్పని సరి అని ప్రధాని పేర్కొన్నారు. వ్యవసాయ మార్కెట్లలో రద్దీని తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. దేశం అన్ని రంగాల్లో స్వయం సమృద్ధం కావడానికి ఈ సంక్షోభాన్ని ఉపయోగించుకోవాలన్నారు. -
సీఎంలతో నేడు మోదీ చర్చలు
న్యూఢిల్లీ: కరోనా విజృంభణ నేపథ్యంలో విధించిన దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను ఏప్రిల్ 14వ తేదీ తరువాత ఎత్తివేయాలా? వద్దా? అన్న అంశంపై ప్రధాని మోదీ శనివారం రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సంప్రదింపులు జరపనున్నారు. ఈ సమావేశం అనంతరమే లాక్‌డౌన్‌పై తుది నిర్ణయం తీసుకుంటామని ప్రధాని ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే శనివారం మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రుల అభిప్రాయాలను, సలహా, సూచనలను తీసుకోనున్నారు. అయితే పలు రాష్ట్రాలు ఇప్పటికే లాక్డౌన్ పొడిగింపునకు మద్దతు తెలిపిన నేపథ్యంలో తుది నిర్ణయం కూడా ఇదే దిశగా ఉండవచ్చునని అంచనా. పార్లమెంటులో వేర్వేరు రాజకీయ పార్టీల నేతలతో మోదీ మూడు రోజుల క్రితం మాట్లాడుతూ ఏప్రిల్ 14వ తేదీ తరువాత ఒకేసారి లాక్డౌన్ ఎత్తివేయడం సాధ్యం కాదని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ప్రతి ప్రాణాన్ని కాపాడుకోవాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని కూడా ఆయన చెప్పుకొచ్చారు. రాష్ట్రాలు, జిల్లా స్థాయి యంత్రాంగం, నిపుణులు కూడా లాక్‌డౌన్‌ను పొడిగించాలనే సూచిస్తున్నట్లు తెలుస్తోంది. ఒడిశా ఒకడుగు ముందుకేసి ఏప్రిల్ 30వ తేదీ వరకూ లాక్‌డౌన్‌ను పొడిగించింది కూడా. ప్రధాని మోదీ సీఎంలతో సంప్రదింపులు జరపడం ఇది రెండోసారి. ఏప్రిల్ 2న తొలి సమావేశంలో దశలవారీ లాక్డౌన్ ఎత్తివేతకు అనుకూలంగా ప్రధాని మాట్లాడారు. సమూహ వ్యాప్తి లేదు: కేంద్రం న్యూఢిల్లీ/భువనేశ్వర్/చండీగఢ్: కరోనా వైరస్‌కు సంబంధించి భారత్‌లో ఇప్పటివరకు సమూహ వ్యాప్తి(కమ్యూనిటీ ట్రాన్స్మిషన్) దశ రాలేదని కేంద్రం ప్రకటించింది. అలాంటిదేమైనా ఉంటే, ప్రజల్లో అప్రమత్తత పెంచేందుకు ముందు మీడియాకే చెప్తామని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ శుక్రవారం వ్యాఖ్యానించారు. కరోనా కారణంగా తీవ్ర శ్వాసకోశ ఇన్ఫెక్షన్ బారిన పడిన 104 మందిలో 40 మందికి ఎలాంటి ట్రావెల్ హిస్టరీ కానీ, పాజిటివ్‌గా తేలిన వ్యక్తులతో సన్నిహితంగా ఉన్న చరిత్ర కానీ లేదని తేలిందని ఐసీఎంఆర్ ప్రకటించిన విషయాన్ని ప్రస్తావించగా, లవ్ అగర్వాల్ పై సమాధానం ఇచ్చారు. మరోవైపు, కోవిడ్–9పై సమర్ధవంతంగా పనిచేస్తుందని తేలిన హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను ఎగుమతి చేయాలంటూ పలు దేశాల నుంచి విజ్ఞప్తులు వచ్చాయని విదేశాంగ శాఖ పేర్కొంది. అయితే, భారత్‌కు అవసరమైన స్టాక్ ఉన్న తరువాత, మిగతా స్టాక్‌ను ఎగుమతి చేయాలని నిర్ణయించామని తెలిపింది. విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను వెనక్కు తీసుకువచ్చే విషయంపై.. కరోనా వ్యాప్తి పరిస్థితిని సమీక్షించిన తరువాత నిర్ణయం తీసుకుంటామని విదేశాంగ శాఖ అదనపు కార్యదర్శి దమ్ము రవి తెలిపారు. అది ప్రమాదకరం కరోనా వైరస్‌ను పూర్తిగా కట్టడి చేయకముందే తొందరపడి ఆంక్షలను ఎత్తివేస్తే అత్యంత ప్రమాదకర పరిస్థితి నెలకొంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. అలా చేస్తే.. వైరస్ వ్యాప్తి అడ్డుకోలేని దశకు చేరుకునే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేసింది. లాక్‌డౌన్‌పై మీ అభిప్రాయం ఏమిటి? దేశవ్యాప్త లాక్‌డౌన్‌పై తమ అభిప్రాయాలు తెలపాల్సిందిగా కేంద్ర హోం శాఖ శుక్రవారం రాష్ట్రాలను కోరింది. ఏప్రిల్ 14 తరువాత మరో రెండు వారాలపాటు లాక్డౌన్ కొనసాగుతుందన్న వార్తలు వస్తున్న తరుణంలో హోంశాఖ ఈ∙సమాచారం కోరడం విశేషం. గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణ రంగ కార్యకలాపాలకు అనుమతి ఇవ్వాలన్న సూచనలు ఎక్కువగా రాష్ట్రాల నుంచి ఉన్నాయని తెలిసింది. లాక్డౌన్ సందర్భంగా ఆన్లైన్ ప్లాట్‌ఫాంతోపాటు అత్యవసర వస్తువుల విక్రయ కేంద్రాలు తెరిచే ఉంటాయని కేంద్రం ప్రకటించింది. వీటితోపాటు ఆరోగ్యం, పారిశుద్ధ్యం, పోలీస్, మీడియా, బ్యాంకులు పనిచేస్తాయని చెప్పింది. మాస్కు లేకపోతే పెట్రోలుకు నో! ముఖానికి మాస్కు లేనివారికి పెట్రోలు పంపుల్లో ఇంధనం నింపేది లేదని ఒడిశా రాష్ట్రం ఉత్కళ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ శుక్రవారం ప్రకటించింది. కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో పంజాబ్ రాష్ట్రం లాక్‌డౌన్‌ను మే ఒకటో తేదీ వరకూ పొడిగించింది. ఒడిశా ఇప్పటికే లాక్‌డౌన్‌ను ఏప్రిల్ 30వ తేదీ వరకూ పొడిగించిన విషయం తెలిసిందే. మతపరమైన ఊరేగింపులు వద్దు ఏప్రిల్ నెలలో వివిధ పండుగల సందర్భంగా మతపరమైన ఊరేగింపులు, గుమికూడటంపై రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు జాగరూకతతో వ్యవహరించాలని హోం శాఖ శుక్రవారం హెచ్చరించింది. అభ్యంతరకరమైన సమాచారం ఏదీ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టకుండా నిఘా ఉంచాలని, లాక్డౌన్ ఆంక్షలన్నీ కచ్చితంగా అమలయ్యేలా చూడాలని స్పష్టం చేసింది. ఈ నెలలో ఇప్పటికే కొన్ని మతపరమైన కార్యక్రమాలు పూర్తికాగా, బైశాఖీ, రోంగలి బీహూ, విషు, పోయినా బైశాఖ్, పుతాండు, మహా విశుబా సంక్రాంతి వంటి పండుగలన్నీ జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో వీటన్నింటిపై ప్రభుత్వ అధికారులు, మత సంస్థలు, పౌరులు అప్రమత్తంగా ఉండాలని హోం శాఖ కోరింది. లాక్డౌన్ మార్గదర్శకాల ఉల్లంఘనలపై భారతీయ శిక్షాస్మృతి, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆక్ట్ల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. -
11న సీఎంలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్
న్యూఢిల్లీ : కరోనా వైరస్ నియంత్రణ చర్యలకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడనున్నారు. ఈ మేరకు ఏప్రిల్ 11న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించున్నారు. ఈ సందర్భంగా కరోనా కట్టడికి కేంద్రం తీసుకుంటున్న చర్యలను వివరించడంతోపాటు.. రాష్ట్రాలవారీగా తీసుకున్న చర్యలపై మోదీ సమీక్ష జరపనున్నట్టుగా సమాచారం. అలాగే లాక్డౌన్ పొడిగింపుకు సంబంధించి మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల అభిప్రాయాలను అడిగి తెలుసుకునే అవకాశం ఉంది. కరోనా నియంత్రణ చర్యలకు సంబంధించి ప్రధాని మోదీ ఇప్పటికే రెండుసార్లు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడిన సంగతి తెలిసిందే. అలాగే దేశంలో పలు రంగాలకు చెందిన ప్రముఖులతో కూడా మోదీ ఈ అంశంపై చర్చించారు. కాగా, నేడు పలు పార్టీల పార్లమెంట్ ఫ్లోర్ లీడర్లతో జరిపిన వీడియో కాన్ఫరెన్స్‌లో లాక్డౌన్ పొడిగింపుకు సంబంధించి మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఏప్రిల్ 14న లాక్డౌన్ ఎత్తివేయడం సాధ్యం కాదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఒకేసారి లాక్డౌన్ ఎత్తివేయలేమని.. ఈ విషయంపై సలహాలు అన్నిటినీ పరిగణనలోకి తీసుకుంటున్నామని చెప్పారు. మరోవైపు ఇప్పటికే పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు లాక్డౌన్ పొడగించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్న సంగతి తెలిసిందే. చదవండి : ఏప్రిల్ 14న లాక్డౌన్ ఎత్తివేసే ఆలోచన లేదు: మోదీ -
డాక్టర్లపై ఎవరు దాడులు చేసినా.. కఠిన శిక్షే
న్యూఢిల్లీ: విధుల్లో ఉన్న వైద్యులపై ఎవరు దాడి చేసినా.. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ కోరారు. ఈ మేరకు ఆయన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులకు లేఖలు రాసినట్టు పీటీఐ వార్తాసంస్థ తెలిపింది. డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బందిని దాడుల నుంచి రక్షించేందుకు ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చే విషయాన్ని పరిశీలించాలని ఆయన ముఖ్యమంత్రులను కోరారు. గతవారం కోల్‌కతా మెడికల్ కాలేజీ హాస్పిటల్లో 85 ఏళ్ల వ్యక్తి చనిపోవడంతో వారి బంధువులు ఆసుపత్రి సిబ్బందిపై దాడి చేసి.. దౌర్జన్యానికి దిగారు. ఈ ఘటనలో ఆసుపత్రి సిబ్బందితోపాటు పలువురు జూనియర్ డాక్టర్లకు గాయాలయ్యాయి. ఈ ఘటనల నేపథ్యంలో తమకు రక్షణ కల్పించాలని జూడాలు కోరగా.. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సరిగా స్పందించకపోవడంతో వైద్యుల నిరసన తీవ్రతరమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ వివాదం ఇంకా పెద్దది కాకుండా చూడాలంటూ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ ఇప్పటికే మమతకు సూచించారు. ఈ నేపథ్యంలోనే విధుల్లో ఉన్న వైద్యులకు తగిన రక్షణ కల్పించాలంటూ ఆయన అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాశారు. మరోవైపు ఆందోళనకు దిగిన జూడాలను చర్చలకు మమత ప్రభుత్వం ఆహ్వానించగా జూడాలు ఆ ప్రతిపాదనను తిరస్కరించారు. తమ ఉద్యమాన్ని నీరు గార్చే కుట్రలో భాగంగానే ఈ చర్చల నాటకం ఆడుతున్నారంటూ జూడాలు ఆరోపిస్తున్నారు. -
నీతి ఆయోగ్‌తో లాభం లేదు
న్యూఢిల్లీ: నీతి ఆయోగ్ సమావేశం సందర్భంగా బీజేపీయేతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు (విపక్ష పార్టీలు) తమ ఐక్యతను ప్రదర్శించారు. సమావేశంలో కేంద్ర ప్రభుత్వంపై అంశాల వారీగా విమర్శలు చేశారు. 15వ ఆర్థిక సంఘం నివేదిక, కేంద్ర నిధుల పంపిణీ తదతర అంశాలపై ఎన్డీయే ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. నీతి ఆయోగ్‌తో రాష్ట్రాలకు ఎలాంటి లాభం లేదని. ఏదో జరుగుతుందని కూడా తాము భావించడం లేదని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. ‘రాష్ట్రాల సమస్యలను తెలుసుకునేందుకు కేంద్రం ప్రయత్నించిందా? ప్రతి రాష్ట్రానికి వేర్వేరు సమస్యలున్నాయి. కేంద్రం విధివిధానాలను నిర్ణయిస్తుంది. కానీ అమలుచేయాల్సిన బాధ్యత రాష్ట్రాలదే కదా. కేంద్రం సహకార సమాఖ్య విధానాన్ని అవలంబించాలి. రాష్ట్రాల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దు’ అని ఆమె పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక రాష్ట్రాల ముఖ్యమంత్రులు రైతు రుణమాఫీని సమావేశంలో లేవనెత్తారు. రైతు రుణమాఫీలో 50 శాతం సాయాన్ని కేంద్రమే భరించాలని కర్ణాటక సీఎం కుమారస్వామి కోరారు. 15వ ఆర్థిక సంఘం విధివిధానాలను పునర్నిర్వచించాలని కేరళ సీఎం పినరయి విజయన్ కోరారు. ‘కేంద్రం విడుదల చేసే నిధులు రాష్ట్రాలకు సమానంగా చేరేందుకు.. 15వ ఆర్థిక సంఘం విధివిధానాలను పునర్నిర్వచించాలి’ అని ఆయన తన ప్రసంగంలో పేర్కొన్నారు. -
ఏకకాల ఎన్నికలే ఉత్తమం
న్యూఢిల్లీ: లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికల నిర్వహణపై విస్తృత చర్చ జరగాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. దేశ ఆర్థిక వృద్ధి రేటును రెండంకెలకు తీసుకెళ్లడం భారత్ ముందున్న ప్రధాన సవాలని, అందుకోసం ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరముందని ఆయన పేర్కొన్నారు. ఆదివారం ప్రధాని మోదీ అధ్యక్షతన రాష్ట్రపతి భవన్లో నీతిఆయోగ్ పాలక మండలి సమావేశం జరిగింది. ఈ భేటీకి 23 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఒక లెఫ్టినెంట్ గవర్నర్ హాజరయ్యారు. సమావేశంలో సీఎంలు వెలిబుచ్చిన అభిప్రాయాల్ని, సలహాల్ని విధాన నిర్ణయాల అమలులో పరిగణనలోకి తీసుకుంటామని ప్రధాని హామీనిచ్చారు. ముఖ్యమంత్రుల ప్రసంగం అనంతరం మోదీ ముగింపు ఉపన్యాసం చేస్తూ.. ‘లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికల నిర్వహణపై విస్తృత స్థాయిలో చర్చలు, సంప్రదింపులు జరపాలి. దీనివల్ల ఖర్చును ఆదా చేయవచ్చు. అదే సమయంలో వనరుల్ని సమర్థంగా వినియోగించుకునే అవకాశం ఏర్పడుతుంది’ అని పేర్కొన్నారు. ఇప్పటికే అనేక సందర్భాల్లో ఏకకాలంలో ఎన్నికల అంశాన్ని ప్రస్తావించిన ప్రధాని మోదీ.. నీతి ఆయోగ్ భేటీలో పునరుద్ఘాటించారు. విధానాల రూపకల్పనలో సీఎంల పాత్ర కీలకమని ఆయన ప్రశంసించారు. ఫలితం ఆధారంగా కేటాయింపులు జరిగేలా, ఖర్చుల్లో సవరణల కోసం 15వ ఆర్థిక సంఘానికి సలహాలు ఇవ్వాలని ముఖ్యమంత్రుల్ని కోరారు. ‘భారత్‌లో సామర్థ్యం, వనరుల కొరత లేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో.. కేంద్రం నుంచి రాష్ట్రాలు రూ. 11 లక్షల కోట్లు అందుకుంటాయి. గత ప్రభుత్వం చివరి సంవత్సరంలో ఇచ్చిన దానికంటే రూ. 6 లక్షల కోట్లు ఎక్కువ ఇస్తున్నాం’ అని మోదీ చెప్పారు. వరద పరిస్థితిని సమర్థంగా ఎదుర్కొనేందుకు రాష్ట్రాలకు కేంద్రం నుంచి అన్ని రకాల సాయాన్ని అందచేస్తామని భరోసా నిచ్చారు. అభివృద్ధి కోసం నీతి ఆయోగ్ మంచి వేదిక 2017–18 నాలుగో త్రైమాసికంలో భారత ఆర్థిక వృద్ధి రేటు 7.7 శాతంగా ఉందని, ఈ వృద్ధి రేటును రెండంకెల స్థాయికి తీసుకెళ్లడం మన ముందున్న సవాలని, అందుకోసం అనేక చర్యల్ని చేపట్టాల్సి ఉందని ప్రధాని పేర్కొన్నారు. త్వరలోనే భారత్ 5 ట్రిలియన్ డాలర్ల(రూ. 3.4 కోట్ల కోట్లు) ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించాలని ప్రపంచం ఆశిస్తుందని చెప్పారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం, వెనకబడ్డ జిల్లాల (ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్) అభివృద్ధి, ఆయుష్మాన్ భారత్, మిషన్ ఇంద్రధనుష్, పౌష్టికాహార మిషన్, మహాత్మా గాంధీ 150వ జయంతి వేడుకలు తదితర అంశాల్ని మోదీ ప్రస్తావించారు. ‘2020 నాటికి నవభారత లక్ష్యాన్ని చేరుకునేందుకు తగిన చర్యలు తప్పనిసరి’ అని ఆయన పేర్కొన్నారు. దేశాభివృద్ధిలో చారిత్రక మార్పులు తీసుకువచ్చేందుకు నీతి ఆయోగ్ పాలక మండలి మంచి వేదిక అని కితాబునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలును ప్రస్తావించిన ప్రధాని స్వచ్ఛ్ భారత్ మిషన్, డిజిటల్ లావాదేవీలు, నైపుణ్యాభివృద్ధి తదితర అంశాలపై విధానాల రూపకల్పనలో సబ్ గ్రూపులు, కమిటీల ద్వారా ముఖ్యమంత్రులు కీలక పాత్ర పోషించారని మోదీ గుర్తుచేశారు. ఈ సబ్ గ్రూపులు చేసిన సిఫార్సుల్ని కేంద్రంలోని వివిధ మంత్రిత్వ శాఖలు పరిగణనలోకి తీసుకున్నాయని ఆయన చెప్పారు. ‘ఆయుష్మాన్ భారత్’ కింద దేశంలో 1.5 లక్షల వైద్య, సంరక్షణ కేంద్రాల్ని నిర్మిస్తున్నాం. ఈ పథకంలో 10 కోట్ల కుటుంబాలకు ఏడాదికి రూ. 5 లక్షల వరకూ ఆరోగ్య బీమాను అందిస్తాం. విద్య కోసం ‘సమగ్ర శిక్షా అభియాన్’ కింద సమగ్ర విధానాన్ని అమలుచేస్తున్నాం. ముద్రా యోజన, జన్‌ధన్ యోజన, స్టాండప్ ఇండియాలు ప్రజల ఆర్థిక అవసరాలకు చేయూతగా ఉంటున్నాయి’ అని ప్రధాని చెప్పారు. దేశంలో అభివృద్ధిని ఆకాంక్షిస్తున్న(ఆస్పిరేషనల్) 115 జిల్లాల్లో అన్ని విధాల అభివృద్ధి సాధించాల్సిన అవసరముందని అన్నారు. ఉపాధి హామీ చట్టాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయడం, పెట్టుబడిని తగ్గించి పంటల దిగుబడిని పెంచే విధంగా సూచనలు చేయాలని బిహార్, ఆంధ్రప్రదేశ్, యూపీ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌తో పాటు పలు రాష్ట్రాల సీఎంలకు ప్రధాని సూచించారు. రాష్ట్రాలతో సంప్రదింపులు జరపాలని నీతి ఆయోగ్‌కు సూచన సమావేశంలో వ్యక్తమైన సలహాల్ని విధానపర నిర్ణయాలు తీసుకునేటప్పుడు పరిగణనలోకి తీసుకుంటామని మోదీ హామీనిచ్చారు. అమలు చేయదగ్గ సలహాలు, సూచలనపై రాష్ట్రాలతో సంప్రదింపులు జరపాలని నీతి ఆయోగ్‌కు ఆయన సూచించారు. సమావేశంలో కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. ఒడిశా, జమ్మూ కశ్మీర్, ఢిల్లీ తదితర రాష్ట్రాల సీఎంలు గైర్హాజరయ్యారు. సమావేశం అనంతరం నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ విలేకరులతో మాట్లాడుతూ.. బిహార్, ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో ఇచ్చిన అన్ని హామీల్ని తూచా తప్పకుండా అమలు చేస్తామని ప్రధాని మోదీ స్పష్టం చేశారన్నారు. గత నాలుగేళ్లలో కేంద్ర ప్రభుత్వం 7.7 కోట్ల మరుగుదొడ్లను నిర్మించిందని, మహాత్మా గాంధీ 150 వ జయంతి వేడుకల నాటికి దేశంలో 100 శాతం పారిశుధ్యం సాధించాలని ఆకాంక్షించారన్నారు. ఢిల్లీ సంక్షోభాన్ని పరిష్కరించండి ప్రధానికి నలుగురు సీఎంల విజ్ఞప్తి ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్, ఆమ్ ఆద్మీ ప్రభుత్వం మధ్య కొనసాగుతున్న గొడవలో జోక్యం చేసుకోవాలని పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ ముఖ్యమంత్రులు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. నీతి ఆయోగ్ పరిపాలక మండలి సమావేశం వేదికగా.. మమతా బెనర్జీ, చంద్రబాబు, కుమారస్వామి, పినరయి విజయన్లు ఢిల్లీ సంక్షోభాన్ని పరిష్కరించాలని కోరారు. ‘నాతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ సీఎంలు ఢిల్లీ ప్రభుత్వ సమస్యల్ని తక్షణం పరిష్కరించాలని ప్రధానిని కోరాం. అయితే ప్రధాని మోదీ ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. ఆ విషయాన్ని పరిశీలిస్తానని హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు’ అని సమావేశం అనంతరం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెల్లడించారు. శనివారం ఈ నలుగురు సీఎంలు అరవింద్ కేజ్రీవాల్‌కు మద్దతు తెలపడంతో పాటు.. లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయంలో ఆందోళన చేస్తున్న కేజ్రీవాల్‌ను కలుసుకునేందుకు ప్రయత్నించారు. ఢిల్లీలో కొనసాగుతున్న సంక్షోభాన్ని ప్రధాని మోదీ వద్ద ప్రస్తావిస్తామని విలేకరుల సమావేశంలో వారు వెల్లడించారు. నెలరోజుల్లో ‘నవభారత’ పత్రం న్యూఢిల్లీ: ‘నవభారతం 2022’ నిర్మాణానికి సంబంధించిన అభివృద్ధి ఎజెండా పత్రాన్ని నెలరోజుల్లో సిద్ధం చేయనున్నట్లు నీతి ఆయోగ్ తెలిపింది. ఈ పత్రానికి తుదిరూపునిచ్చాక.. అభిప్రాయాలు, స్పందనల కోసం రాష్ట్రాలకు పంపిస్తామని సమావేశంలో వెల్లడించింది. గత సమావేశంలో పేర్కొన్నదాని ప్రకారం ఈ భేటీలో ఈ పత్రాన్ని రాష్ట్రాలకు అభిప్రాయాల కోసం ఇవ్వాల్సి ఉండగా.. కొన్ని కారణాలతో నెలరోజులు ఆలస్యం కానుందని నీతి ఆయోగ్ అధికారులు తెలిపారు. ‘నవభారతం 2022 అభివృద్ధి ఎజెండా రూపకల్పన చివరి దశలో ఉంది. అందువల్లే నేటి సమావేశంలో దీన్ని ఇవ్వలేకపోతున్నాం. క్షేత్రస్థాయిలో జరగాల్సిన మార్పులను ఈ ప్రతిపాదన ప్రతిబింబించాలని కోరుకుంటున్నాం. ఇది దాదాపుగా సిద్ధమైనట్లే. త్వరలోనే అభిప్రాయాల కోసం ఈ డాక్యుమెంటును రాష్ట్రాలకు పంపిస్తాం. ఆ తర్వాత విస్తృతమైన చర్చలు జరుగుతాయి. నెల, నెలన్నరలో ఇది అంతా పూర్తవుతుంది’ అని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ పేర్కొన్నారు. మూడేళ్లు, ఏడేళ్లు, 15 ఏళ్ల లక్ష్యాలను ఏర్పర్చుకుని వీటిని చేరుకునేందుకు దార్శనిక పత్రాల (విజన్ డాక్యుమెంట్) రూపకల్పన ప్రణాళికలను నీతి ఆయోగ్ రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. 2022 నాటికి (దేశ స్వాతంత్య్రానికి 75 ఏళ్లు) దేశం ఆరు ప్రధాన సమస్యల (పేదరికం, చెత్త, అవినీతి, ఉగ్రవాదం, కులతత్వం, మతతత్వం) నుంచి విముక్తమయ్యేలా పనిచేయాలని గతేడాది ప్రజెంటేషన్‌లో నీతి ఆయోగ్ పేర్కొంది. మీడియాతో నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్‌కాంత్, ఉపాధ్యక్షుడు రాజీవ్‌కుమార్ -
జీఎస్టీ అమల్లో రాష్ట్రాల పాత్ర ఆమోఘం
-
రాష్ట్రాల పాత్ర ఆమోఘం : ప్రధాని మోదీ
సాక్షి,న్యూఢిల్లీ : గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ) అమల్లో సహకరించినందుకు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ప్రధాని నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. జీఎస్టీ అమల్లో రాష్ట్రాల పాత్ర ఆమోఘమని ప్రధాని మోదీ కొనియాడారు. ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ నాలుగో సమావేశం ఆదివారం ఉదయం ప్రారంభమైంది. ఇక్కడి రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్లో సాయంత్రం 4 వరకు సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో మోదీ మాట్లాడుతూ.. పోటీతత్వంతో కూడిన సమైక్య స్ఫూర్తితో అభివృద్ధి సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. దేశంలో వనరులకు ఎలాంటి కొదవ లేదని, వాటిని సరైన రీతిలో వినియోగించుకోవాలని సూచించారు. విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, జిల్లా అభివృద్ధిపై దృష్టి సారించాలన్నారు. జన్‌ధన్ యోజన, ముద్రబ్యాంకు రుణాల పథకాలు దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్ట పరిచాయని వివరించారు. గత సమావేశ నిర్ణయాల అమలు, రైతుల ఆదాయం రెట్టింపు, ఆయుష్మాన్ భారత్, పోషణ్ మిషన్, మిషన్ ఇంద్రధనుష్, మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాలు, తదితర అంశాలు ఈ సమావేశంలో చర్చించనున్నారు. గత వారం రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న ఢిల్లీ ముఖ్యమంత్రి నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు కాలేదు. -
కేజ్రీకి సీఎంల సంఘీభావం
సాక్షి, న్యూఢిల్లీ: లెఫ్ట్‌నెంట్ గవర్నర్(ఎల్జీ) తీరుపై నిరసన తెలుపుతున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు నలుగురు ముఖ్యమంత్రుల నుంచి అనూహ్య మద్దతు లభించింది. ఆదివారం నాటి నీతి ఆయోగ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు శనివారమే ఢిల్లీ చేరుకున్న పశ్చిమబెంగాల్, కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ముఖ్యమంత్రులు వరుసగా మమత బెనర్జీ, పినరయి విజయన్, చంద్రబాబు నాయుడు, కుమారస్వామి.. ఢిల్లీ సీఎంకు సంఘీభావం ప్రకటించారు. ఈ విషయంపై సత్వరమే ప్రధాని నరేంద్ర మోదీ స్పందించాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ ప్రభుత్వంలో విధులు నిర్వహిస్తున్న ఐఏఎస్ అధికారులు తమ సమ్మెను విరమించాలని, పేదలకు ఇంటివద్దకే రేషన్ అందించే ప్రతిపాదనకు ఆమోదం తెలపాలనే ప్రధాన డిమాండ్లతో కేజ్రీవాల్, తన మంత్రివర్గ సహచరులతో ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ కార్యాలయంలోని సందర్శకుల గదిలో గత ఆరు రోజులుగా నిరసన తెలుపుతున్న విషయం తెలిసిందే. నలుగురు ముఖ్యమంత్రులు వరుసగా మమత బెనర్జీ, పినరయి విజయన్, చంద్రబాబు నాయుడు, కుమారస్వామి శనివారం సాయంత్రం కేజ్రీవాల్‌ను కలిసే అవకాశం కల్పించాలంటూ ఎల్జీని కోరారు. ఆయన అనుమతించకపోవడంతో.. కేజ్రీవాల్ నివాసంలో ఆయన భార్య సునీతను, కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం అక్కడే విలేకరుల సమావేశం నిర్వహించి, కేంద్రప్రభుత్వం, ప్రధాని మోదీ తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. అంతకుముందు ఆ నలుగురు ఏపీ భవన్లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రధానిపై మండిపడ్డ సీఎంలు దేశ రాజధాని అయిన ఢిల్లీ సమస్యనే పరిష్కరించలేని వారు దేశవ్యాప్తంగా ఉన్న సమస్యలను ఎలా పరిష్కరిస్తారని ప్రధాని మోదీపై మమతా బెనర్జీ మండిపడ్డారు. ‘చంద్రబాబు, కుమారస్వామి, పినరయి విజయన్‌లతో కలిసి కేజ్రీవాల్ ఇంటికి వచ్చాను. రాజకీయాలను రాజకీయాలుగానే చూడాలి. విపక్ష పార్టీలకు కూడా గౌరవం ఇవ్వాలి. ఢిల్లీలో ప్రజల అవసరాలను తీర్చాల్సిన బాధ్యత ఎన్నికైన ప్రభుత్వంపై ఉంది. ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఢిల్లీలో రాజ్యాంగ సంక్షోభం తలెత్తింది. దేశ రాజధానిలో సమస్య ఇలా ఉంటే ఎలా? దేశం, ప్రజాస్వామ్యం, రాజ్యాంగాల భవిష్యత్తు ఏమవుతుంది? ఎల్జీ పరిస్థితిని అర్థం చేసుకోవాలి. కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలుండాలి. అది స్వపక్షమా? విపక్షమా? అని చూడరాదు. ఒక సీఎంను ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలవడానికి వీలుకానప్పుడు ఇదేం ప్రజాస్వామ్యం?’ అని తీవ్రంగా ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ‘మేం కేజ్రీవాల్‌ను కలవాలనుకున్నాం. ఈ ప్రభుత్వం పనిచేసే పరిస్థితి కల్పించాలి. అంతిమంగా మా డిమాండ్ ఒక్కటే. ఈ సమస్యను పరిష్కరించాలి. ఎన్నికైన ప్రభుత్వాన్ని పనిచేసుకోనివ్వాలి. కేంద్రం–రాష్ట్రం కలిసి పనిచేయాలి. అప్పుడే ప్రజలకు సేవ చేయగలం’ అని పేర్కొన్నారు. కుమారస్వామి మాట్లాడుతూ ‘ఢిల్లీ సీఎంకు మద్దతు తెలిపేందుకు, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం వచ్చాం. ఢిల్లీ దేశ రాజధాని. కేంద్ర ప్రభుత్వం వెంటనే పరిష్కార చర్యలు చేపట్టాలి’ అని పేర్కొన్నారు. ‘కేంద్రం వైఖరి కారణంగానే ఈ పరిస్థితి తలెత్తింది. ఇది ప్రజాస్వామిక దేశం. కేంద్రం సమాఖ్య వ్యవస్థను గౌరవించాలి. కేజ్రీవాల్‌కు మా మద్దతుంటుంది’ అని విజయన్ పేర్కొన్నారు. మండిపడ్డ కేజ్రీవాల్ సీఎంల వినతిని ఎల్జీ తిరస్కరించడంపై కేజ్రీవాల్ మండిపడ్డారు. ‘లెఫ్టినెంట్ గవర్నర్ సొంతగా ఈ నిర్ణయం తీసుకుంటారనుకోను. కచ్చితంగా ప్రధాని కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాల మేరకే ఆయన ఈ నిర్ణయం తీసుకుని ఉంటారు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ఒక సీఎంను.. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలవడాన్ని ప్రధాని అడ్డుకోగలరా? రాజ్ నివాస్ ఏ ఒక్కరి సొత్తు కాదు. ఇది దేశ ప్రజలది. ఈ ఆందోళన మరింత తీవ్రతరం అవుతుంది’ అని ట్వీట్ చేశారు. శనివారం ఏం జరిగింది? పశ్చిమబెంగాల్, కేరళ, ఏపీ, కర్ణాటక రాష్ట్రాల ముఖ్యమంత్రులు మొదట ఆంధ్రా భవన్లో సమావేశమమయ్యారు. కేజ్రీవాల్‌కు మద్దతును సమీకరించేందుకు కావాల్సిన ప్రయత్నాలపై చర్చించారు. అనంతరం రాజ్ నివాస్ (లెఫ్టినెంట్ గవర్నర్ నివాసం, కార్యాలయం)లో నిరసన చెబుతున్న కేజ్రీవాల్‌ను కలుసుకునేందుకు అనుమతించాలని ఎల్జీ బైజాల్‌కు లేఖ రాశారు. కేజ్రీవాల్‌ను కలిసేందుకు అనుమతివ్వబోనని ఎల్జీ స్పష్టంచేశారు. తర్వాత వీరంతా కేజ్రీవాల్ నివాసంలో కుటుంబ సభ్యులను కలుసుకుని సంఘీభావం తెలిపారు. అప్పుడు ఏమయ్యారు: బీజేపీ నలుగురు సీఎంలు కేజ్రీవాల్‌కు సంఘీభావం తెలపడంపై బీజేపీ మండిపడింది. ‘కేజ్రీవాల్ నివాసంలో, ఆయన సమక్షంలోనే సీఎస్ అన్షు ప్రకాశ్‌పై దాడి జరిగింది. అప్పుడు ఈ నలుగురు ఏమయ్యారు? ఆ నాలుగు రాష్ట్రాల సీఎస్‌లు కూడా అన్షు ప్రకాశ్‌కు సంఘీభావంగా ముందుకు వస్తే వీళ్లేం చేస్తారు?’ అని బీజేపీ సీనియర్ నేత విజయ్ గోయెల్ ప్రశ్నించారు. -
బరిలో సీఎంల తనయులు
సాక్షి, బెంగళూరు: కన్నడనాట విధానసభ ఎన్నికల్లో ప్రస్తుత, పలువురు మాజీ ముఖ్యమంత్రుల తనయులు బరిలోకి దిగుతున్నారు. ప్రస్తుత సీఎం సిద్దరామయ్య కొడుకు యతీంద్ర వరుణ స్థానం నుంచి పోటీ చేస్తుండగా, బీజేపీ సీఎం అభ్యర్థి యడ్యూరప్ప కొడుకు విజయేంద్ర ఇదే స్థానం నుంచి బరిలోకి దిగుతారని గతంలో ప్రకటించారు. అయితే ఆయనకు వరుణ నుంచి ఇంకా టికెట్ కేటాయించకపోయినప్పటికీ, విజయేంద్ర ఆ స్థానంలో పోటీ చేయడం దాదాపు నిశ్చయమేననీ, త్వరలోనే బీజేపీ అధిష్టానం నుంచి అధికారిక ప్రకటన వస్తుందని సమాచారం. కొడుకు రాజకీయ భవిష్యత్తు కోసం సిద్దరామయ్య తన ప్రస్తుత నియోజకవర్గం వరుణను వదిలేసి చాముండేశ్వరి నుంచి బరిలోదిగారు. యతీంద్రతో పాటు దాదాపు 10 మంది వరకు మాజీ సీఎంల వారసులు ఈ ఎన్నికల్లో పోటీచేస్తున్నారు. గతంలో సీఎంలుగా చేసిన గుండూరావు, జేహెచ్ పటేల్, ఎస్ఆర్ బొమ్మై, ధరమ్ సింగ్ తదితరులు కొడుకులను ఈసారి విధానసభ ఎన్నికల్లో వివిధ నియోజకవర్గాల నుంచి పోటీలో నిలిపారు. ఇక మాజీ సీఎం బంగారప్ప ఇద్దరు పుత్రులు వేర్వేరు పార్టీల నుంచి పోటీ చేస్తున్నారు. కుమార బంగారప్ప బీజేపీ నుంచి, మధు బంగారప్ప కాంగ్రెస్ నుంచి పోటీలో ఉన్నారు. అలాగే మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ కుమారులిద్దరూ కూడా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. జేడీఎస్ ముఖ్యమంత్రి అభ్యర్థి కూడా దేవెగౌడ కొడుకు, మాజీ సీఎం కుమారస్వామే. యతీంద్ర వర్సెస్ విజయేంద్ర.. ప్రస్తుత ఎన్నిల్లో ఇద్దరు ప్రధాన ప్రత్యర్థులైన సిద్దరామయ్య, యడ్యూరప్ప వారసులు ఇద్దరూ ఒకే స్థానం నుంచి పోటీ చేస్తుండటంపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. కుటుంబ రాజకీయాలకు ఆద్యుడైన దేవెగౌడను గతంలో సిద్దరామయ్య విమర్శించేవారు. జేహెచ్ పటేల్ కుమారుడు మహిమా పటేల్ దావణగెరి జిల్లాలోని చెన్నగిరి నియోజకవర్గంలో జేడీయూ అభ్యర్థిగా, ధరంసింగ్ తనయుడు అజయ్ సింగ్ కలబురిగి జిల్లాలోని జీవర్గి నుంచి, హావేరి జిల్లాలోని శిగ్గావ నుంచి ఎస్ఆర్ బొమ్మై కుమారుడు బసవరాజ బొమ్మై బీజేపీ టికెట్ మీద పోటీ చేస్తున్నారు. అలాగే దివంగత మాజీ సీఎం గుండూరావ్ కొడకు, కేపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ దినేష్ 5వ సారి ఎన్నికల్లో పోటీకి దిగారు. ఆయన ఇప్పటివరకు 4 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రస్తుతం బెంగళూరులోని గాంధీనగర నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. పోటీలో శ్రీమంతులు దొడ్డబళ్లాపురం: కర్ణాటక ఎన్నికల బరిలో పలువురు శ్రీమంతులు దిగుతున్నారు. నామినేషన్ పత్రాలు దాఖలుచేసిన వారిలో కొందరి ఆస్తులు కళ్లు బైర్లు కమ్మేలా ఉన్నాయి. బెంగళూరు గ్రామీణ జిల్లా హొసకోట నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి ఎంటీబీ నాగరాజు తమ కుటుంబ ఆస్తి విలువ రూ.1,015కోట్లుగా పేర్కొన్నారు. వార్షిక ఆదాయం రూ.102 కోట్లుగా చూపగా, రూ.27 కోట్ల 70 లక్షల అప్పు ఉన్నట్లు పేర్కొన్నారు. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన తమ మొత్తం ఆస్తి విలువను రూ.470కోట్లుగా ప్రకటించడం గమనార్హం. అంటే ఈ ఐదేళ్లలో అది రెట్టింపైంది. కాగా, కనకపుర నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగిన విద్యుత్ మంత్రి డీకే శివకుమార్ ఆస్తి కూడా గత ఎన్నికల సమయంలో ప్రకటించిన దానికి రెట్టింపైంది. ఈసారి ఆయన తన ఆస్తి విలువను రూ.549 కోట్లుగా ప్రకటించారు. 2008లో కేవలం రూ.75కోట్లుగా ఉన్న ఆయన ఆస్తి 2013 ఎన్నికల నాటికి రూ. 251 కోట్లకు పెరిగింది. కాగా, శుక్రవారం మైసూరు జిల్లా చాముండేశ్వరి నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నామినేషన్ వేశారు. ఎంటీబీ నాగరాజు -
జవాబుదారీతనం ఎక్కడ?
అవినీతిని అంతం చేస్తానంటూ ప్రకటించని రాజకీయ నాయకుడు కనిపిం చడు. అత్యంత అవినీతిపరుడు సైతం నీతి గురించీ, విలువల గురించీ ఢంకా బజాయించి మరీ ఉపన్యాసం ఇస్తాడు. ఈ కపటత్వం మానవ స్వభావంలోనే ఉన్నది. రాజకీయవాదులు కానీ ఉన్నతాధికారులు కానీ ఇందుకు భిన్నంగా వ్యవ హరించాలని కోరుకోవడం అత్యాశ. మనిషి ఆలోచనే లోపభూయిష్టంగా ఉన్నది కనుక అవినీతిని అరికట్టడం అసాధ్యమని తీర్మానించుకొని చేతులు ముడుచు కొని కూర్చోనక్కరలేదు. రాజకీయ నాయకులూ, అధికారులూ నీతిమంతంగా ఉండాలంటే రాజ్యవ్యవస్థ కొన్ని షరతులకూ, నియమాలకూ లోబడి ఉండాలి. ప్రవృద్ధ ప్రజాస్వామ్య దేశాలలో అటువంటి వ్యవస్థ కనిపిస్తుంది. అమెరికా అధ్యక్షుడిని ప్రపంచంలో కెల్లా అత్యంత బలశాలి అంటాం. అటువంటి పదవిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ ఎన్నికలో రష్యా సహకారం ఉన్నదో లేదో తెలుసుకోవడా నికి పూర్తిస్థాయి దర్యాప్తు జరుగుతోంది. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) డెరెక్టర్ పదవి నుంచి జేమ్స్ కామేను ట్రంప్ తొలగించింది అధ్యక్ష ఎన్నికలలో రష్యా జోక్యంపైన ఆయన జరుపుతున్న దర్యాప్తును అడ్డుకోవడం కోసమేనని అమెరికన్లలో అధికసంఖ్యాకులు నమ్ముతున్నారు. అమెరికా కాంగ్రెస్ ఎదుట వాగ్మూలం చెప్పే అవకాశం కామేకు అమెరికా రాజ్యాంగం ప్రసాదిం చింది. ట్రంప్ అబద్ధాలు చెబుతున్నారని కామే స్పష్టంగా చెప్పాడు. జేమ్స్ కామేను బర్తరఫ్ చేసినందుకు నాపై దర్యాప్తు జరుగుతోంది ('I am being investigated over James Comey firing') అంటూ ట్రంప్ ప్రకటిం చాడు. ‘ఎన్నికలలో రష్యా జోక్యం లేదని నేను చెబుతున్నాను. కనుక విచారణ అక్కరలేదు’ అని చెప్పే సాహసం ట్రంప్ చేయరు. ఒకవేళ చేసినా, అక్కడి ప్రజాస్వామ్య వ్యవస్థలు ఆమోదించవు. అమెరికా అధ్యక్షుడు రాజ్యాంగాన్నీ, రాజ్యంగ సంస్థలనీ, విధివిధానాలనూ తప్పించుకోలేడు. వారు తప్పు చేయరని కాదు. తప్పు చేయడానికి జంకుతారు. తప్పు చేస్తే విధిగా విచారణ జరుగుతుంది. నిక్సన్, క్లింటన్ల విషయంలో నిజం నిగ్గు తేలేవరకూ వారిని దర్యాప్తు సంస్థలూ, కాంగ్రెస్ (పార్లమెంటు), న్యాయస్థానాలూ విడిచిపెట్ట లేదు. మనది ఏడుపదుల ప్రజాస్వామ్య వ్యవస్థ. పరిణతి చెందే క్రమంలో ఉంది. ఇక్కడ నాయకులు తమ తప్పులపైన దర్యాప్తు అవసరమో, కాదో వారే నిర్ణయి స్తారు. ఈ పరిస్థితి మారాలి. రాజ్యాంగ సవరణలు అవసరం మన రాజ్యాంగాన్ని మహామహులు నిర్మించారు. స్వాతంత్య్రం సాధించినవారి కంటే రాజ్యాంగం ప్రసాదించిన వారికే మనం పెద్దపీట వేస్తున్నాం. ప్రపంచం లోని అనేక రాజ్యాంగాలను కాచివడబోసి ఎంతో వివేకంతో, ముందుచూపుతో భారత రాజ్యాంగాన్ని సృష్టించారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా రాజ్యాంగాన్ని వంద విడతలకుపైగా సవరించుకున్నాం. అయినప్పటికీ కొన్ని భయంకరమైన లోటుపాట్లు కనిపిస్తున్నాయి. రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామంటూ ప్రమాణం చేసినవారే య«థేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. ఒకసారి ఎన్నికై అధికారం లోకి వచ్చిన ప్రధానులూ, ముఖ్యమంత్రులూ తమకు తోచిన విధంగా పరిపా లన చేస్తున్నారు. ప్రజాస్వామ్య సంస్థలకు తాము జవాబుదారీ అని వారు భావిం చడంలేదు. వారు నీతి అంటే నీతి. అవినీతి అంటే అవినీతి. వారు ఏకపక్షంగా తీసుకునే నిర్ణయాలను ప్రశ్నించే సాహసం మంత్రిమండలిలో ఎవ్వరికీ ఉండదు. అటువంటివారిని మంత్రులుగా పెట్టుకోరు. చట్టసభలలో రచ్చ తప్ప చర్చ జర గదు. ఒకవేళ జరిగినప్పటికీ నిజానిజాలతో, ధర్మాధర్మాలతో నిమిత్తం లేకుండా అధికార పక్షం గుడ్డిగా సమర్థిస్తుంది. చర్చ లేకుండా, సవరణలు లేకుండా ప్రతి పక్షం సభ నుంచి నిష్క్రమించాక ప్రధానమంత్రి లేదా ముఖ్యమంత్రి అనుకున్న చట్టాలు చేయడం పార్లమెంటులోనూ, శాసనసభలలోనూ ఆనవాయితీ. సభ నుంచి నిష్క్రమించిన ప్రతిపక్షాలనూ ఇష్టం వచ్చినట్టు తిట్టడం కెమేరాల సాక్షిగా జరిగిపోతోంది. ఇది ఎన్నికల ద్వారా పాలకులకు ప్రజలు ప్రసాదించిన హక్కు కాదు. రాజ్యాంగం ఇచ్చిన హక్కు అసలే కాదు. ప్రస్తుతం పదవులలో ఉన్నవారిని మాత్రమే దృష్టిలో పెట్టుకొని ఈ వ్యాఖ్యలు చేయడం లేదు. గతంలో అధికారం నెరపినవారికీ, భవిష్యత్తులో అధికారంలోకి రాబోయేవారికి కూడా ఇవి వర్తిస్తాయి. అవినీతికి అధికంగా ఆస్కారం ఉన్న రంగాలలో నీటిపారుదల ఒకటి. ఒక ప్రాజెక్టు నిర్మాణానికి ఫలానా మొత్తం ఖర్చు అవుతుందని ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఆ తర్వాత ప్రాజెక్టు డిజైన్ మార్పు పేరుతోనో, సిమెంటు, ఇసుక ధరలు పెరిగాయనో, మరే కారణంగానో ప్రాజెక్టు నిర్మాణ వ్యయాన్ని సవరిస్తారు. ఉదాహరణకు రూ. 500 కోట్లు ఉన్నదాన్ని రూ.750 కోట్లు చేస్తారు. సాధారణంగా ముఖ్యమంత్రి, ముఖ్య మంత్రి అనుమతిస్తే ఇరిగేషన్ మంత్రి, ప్రాజెక్టు నిర్మించే కాంట్రాక్టరు కలిసి ఈ నిర్ణయం చేస్తారు. రూ. 750 కోట్లుగా ఎందుకు నిర్ణయించారో, రూ. 700 కోట్లు ఎందుకు కాదో, రూ. 800 కోట్లు ఎందుకు కారాదో వివరించే బాధ్యత తమకు ఉన్నదని ముఖ్యమంత్రులు అనుకోవడం లేదు. ఇది రాష్ట్ర వ్యవహారం కనుక కేంద్రం జోక్యం చేసుకోదు. ప్రాజెక్టు వ్యయం వాస్తవంగా ఎంత ఉండాలో, ఎంత ఎక్కువగా చూపిస్తున్నారో తెలుసుకునేది ఎట్లా? లోకాయక్త వ్యవస్థ ఉన్నా, తగిన అధికారాలు లేకపోవడం పెద్ద సమస్య. భూకబ్జా ఎడాపెడా భూకబ్జాల సంగతీ అంతే. విశాఖపట్టణంలో వేలకోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూములూ, ఎసైన్డ్ భూములూ కబ్జా అయినాయంటూ మీడియా కోడై కూస్తుంది. అయ్యన్నపాత్రుడనే మంత్రివర్యుడు స్వయంగా తమ పార్టీ నాయ కులే కబ్జా చేశారంటూ బహిరంగంగా ప్రకటిస్తారు. విద్యామంత్రి గంటా శ్రీని వాసరావుకు ప్రత్యక్ష ప్రమేయం ఉన్నదంటూ మీడియా కథనాలు వెల్లడిస్తాయి. ముఖ్యమంత్రి కుమారుడు లోకేశ్ స్వయంగా సూత్రధారి అంటూ వార్తలు వస్తాయి. సీబీఐ చేత కానీ న్యాయమూర్తి చేత కానీ దర్యాప్తు జరిపించాలంటూ ప్రతిపక్ష నాయకులే కాకుండా స్వయంగా మంత్రి గంటా శ్రీనివాసరావు ముఖ్య మంత్రికి లేఖ రాసి మీడియాకు ఆ సంగతి తెలియజేస్తారు. ముఖ్యమంత్రి మాత్రం సీబీఐ దర్యాప్తు అవసరం లేదనీ, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) తో దర్యాప్తు జరిపిస్తే సరిపోతుందనీ సెలవిస్తారు. హైదరాబాద్‌లోని మియాపూర్‌లో వందల ఎకరాల భూమి కబ్జా అయిం దంటూ వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి ఏపీకి చెందిన దిలీప్‌రెడ్డి అనే తెలుగుదేశం పార్టీ శాసనమండలి సభ్యుడిని అరెస్టు చేశారు. రిజిస్ట్రార్ కార్యా లయంలో పనిచేస్తున్న అధికారుల ఇళ్ళపైనా, వారి బంధువుల ఇళ్ళపైనా ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్నారు. కోట్ల రూపాయల అవినీతి బయటపడినట్టు వార్తలు వస్తాయి. ఒక టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడి కుటుంబ సభ్యులు కూడా ప్రభుత్వ భూములను తమ పేర రిజిస్టర్ చేయించుకున్నారంటూ ఆరోపణలు వస్తాయి. సదరు ఎంపీ తనకు కానీ తన కుటుంబ సభ్యులకు కానీ వివాదస్ప దమైన ప్రాంతంలో ఒక్క సెంటు భూమి కూడా లేదని ప్రకటిస్తాడు. ఆ భూముల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసుకుంటానంటూ ఆ మర్నాడే మరో ప్రకటన విడుదల చేస్తారు. మియాపూర్ భూమాయలో ముఖ్యమాయావి గోల్డ్‌స్టోన్ ప్రసాద్ అని చెబుతున్నారు. రాజకీయ నాయకుల, న్యాయమూర్తుల, అధికారుల సహకారం లేకుండా ప్రసాద్ ఒక్కరే ఇంత అవినీతి చేయజాలరు. నిజాం వంశానికి చెంది నవారి పేరున ఉన్న భూములకు జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ (జీపీఏ) తీసుకొని వాటిని తనకు కావలసినవారి పేరు మీద రిజిస్టర్ చే యించడంలో ప్రసాద్ సిద్ధహస్తుడని అందరికీ తెలుసు. ఇంత జరిగిన తర్వాత, భూకుంభకోణం అంటూ ఏమీలేదనీ, ఒక్క గజం భూమి అన్యాక్రాంతం కాలేదనీ, ప్రభుత్వానికి ఒక్క రూపాయి నష్టం జరగలేదనీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు తేల్చేస్తారు. ఆరోపణలపైన దర్యాప్తు జరిపించాలో, లేదో, జరిపిస్తే ఏ సంస్థతో జరిపించాలో నిర్ణయించే స్వేచ్ఛ ముఖ్యమంత్రులకు రాజ్యాంగం ప్రసాదించలేదు. ఇటువంటి ప్రకటన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేయలేడు. ఈ విధమైన నిర్ణయాలు తీసు కుంటున్న ప్రధానులూ, ముఖ్యమంత్రుల విషయంలో ఏమి చేయాలో రాజ్యాంగం స్పష్టం చేయలేదు. ముఖ్యమంత్రులు ఎంత ఏకపక్షంగా వ్యవహరిస్తారో ప్రధానమంత్రులు సైతం అంతే ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోగలరని ఇందిరాగాంధీ నిరూపిం చారు (ఇది ఆమె శత జయంతివత్సరం). ఇప్పుడు నరేంద్ర మోదీ చేసి చూపి స్తున్నారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీకి ముందుగా తెలియదని వదంతులు వచ్చాయి. తనకు తెలుసునని జైట్లీ స్పష్టంగా చెప్పలేదు. ఇవన్నీ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా సాగుతున్న ధోరణులే. ఇవి ఇప్పుడే వచ్చినవి కావు. ఇప్పుడు అధికారంలో ఉన్నవారితో పోయేవీ కాదు. అమెరికా రాజ్యాంగం అంత పకడ్బందీగా మన రాజ్యాంగం లేకపోవడం ఈ అక్రమా లకూ, అవకతవకలకూ కారణం. చట్టం ముందు అందరూ సమానమే అన్న మాట రాతకే పరిమితమా? ప్రజాస్వామ్య సంస్థలు తమ విధులను సక్రమంగా నిర్వర్తించకపోతే ఏమి చేయాలి? రాజ్యాంగం చూపుతున్న పరిష్కారం ఏమిటి? రాజ్యాంగంలో ఉన్న లోపాలను రాజకీయ నాయకులూ, న్యాయమూర్తులూ, ఉన్నతాధికారులూ వినియోగించుకొని అక్రమాలు చేస్తూ అవినీతికి పాల్పడుతు న్నారా? అన్ని ప్రశ్నలకూ అవుననే సమాధానం. అవినీతిని నిర్మూలించాలంటే రాజ్యాంగంలో లొసుగులు లేకుండా చేయాలి. అడ్డదారి తొక్కే అవకాశం ఉన్న ప్పుడు ఎంతటివారైనా ఆ దారిలో నడవడానికే ప్రయత్నిస్తారు. దొంగదారి మూసివేయాలి. ఆ పని ఎట్లా చేయాలో నిర్ణయించాలి. అందుకోసం దేశ వ్యాప్తంగా చర్చ జరగాలి. శాసనకర్తలు ఊహించని పరిణామాలు సంభవించినప్పుడు ఏమి చేయాలి? ఉదాహరణకు శాసనసభాపతి అధికార పార్టీ ప్రయోజనాలకు అతీ తంగా, ముఖ్యమంత్రి ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా వ్యవహరించాలని ఊహించి పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని 2003లో వాజపేయి హయాంలో సవరించినప్పుడు నిర్ణయాధికారం సభాపతికే వదిలి వేశారు. సభాపతులు ముఖ్యమంత్రి బంట్లుగా వ్యవహరిస్తున్నారని స్పష్టమైన అనంతరం దాన్ని సవరించకపోతే ఆశించిన లక్ష్యం నెరవేరదు. లోక్‌సభ స్పీకర్‌కు కూడా ఇది వర్తిస్తుంది. అధికార పార్టీ ప్రయోజనాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకునే లేదా నిర్ణయాన్ని నిరవధికంగా వాయిదా వేసే స్పీకర్ల తీరు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం. అందువల్ల విచక్షణాధికారం స్పీకర్లకు లేకుండా చేయాలి. అదేవిధంగా, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ వ్యయం అంచనాలను సవరించి నప్పుడు అన్ని కోణాల నుంచీ సవరణలను పరిశీలించి ఆమోదించే లేదా తిరస్క రించే అధికారం ఏదైనా రాజ్యాంగబద్ధమైన ఉన్నతస్థాయి సంస్థకు ఉండాలి. భూకబ్జా కావచ్చు, ఇసుక మాఫియా కావచ్చు, ఓటుకు నోటు వ్యవహారం కావచ్చు... ఇటువంటి అవినీతి ఆరోపణలపైన మంత్రివర్గం కానీ, శాసనసభ కానీ నిర్ణయం తీసుకోనప్పుడు ఏమిచేయాలి? ఉదాహరణకు ఓటుకు నోటు వ్యవహారంలో టీఆర్ఎస్ శాసనసభ్యుడికి నగదు ఇస్తూ విడియోలో చిక్కిన రేవంత్‌రెడ్డిని తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా చంద్రబాబు ప్రమోషన్ ఇవ్వడం, రేవంత్‌రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిపైన ఒంటికాలిపై లేవడం చూసిన వారికి రెండు తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య ఎటు వంటి ఒప్పందం కుదిరిందోననే అనుమానం కలుగుతుంది. వాస్తవానికి ఈ వ్యవహారం ఇంత దూరం వచ్చాక, ప్రజలందరికీ తెలిశాక దర్యాప్తు నత్తనకడ నడిస్తే ఎవరిని నిందించాలి? ఈ ప్రశ్నలనూ, ఇటువంటి అనేక అంశాలనూ దేశ వ్యాప్తంగా చర్చించాలి. అందుకు అనుగుణంగా రాజ్యాంగాన్ని సవరించుకో వాలి. ప్రజాస్వామ్యానికి చెల్లించాల్సిన మూల్యం నిరంతర నిఘా. ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రజలే పూనుకోవాలి. - కె. రామచంద్రమూర్తి -
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశమైంది. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కే చంద్రశేఖర్ రావులతో పాటు ఇతర రాష్ట్రాల సీఎంలు, నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగరియా హాజరయ్యారు. దేశ ఆర్థికాభివృద్దికి సంబంధించి 15 ఏళ్ల విజన్ డాక్యుమెంట్‌పై సమావేశంలో చర్చించారు. వచ్చే ఏడేళ్లలో అనుసరించాల్సిన వ్యూహం, మూడేళ్ల యాక్షన్ ప్లాన్‌పై చర్చించారు. బీజేపీయేతర ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, ముకుల్ సంగ్మా వంటి వారు ఈ సమావేశానికి గైర్హాజరయ్యారు. తమకు బదులుగా మంత్రులను ఈ సమావేశానికి పంపారు. ఈ రోజు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతుండటంతో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సమావేశ ప్రారంభానికి రాలేదు. కాగా బిహార్, తమిళనాడు ముఖ్యమంత్రులు నితీష్ కుమార్, పళనిస్వామి, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు అమరీందర్ సింగ్, వీరభద్ర సింగ్, మాణిక్ సర్కార్, పినరయి విజయన్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. -
ముఖ్యమంత్రులకు ముచ్చెమటలు
-
ముఖ్యమంత్రులకు ముచ్చెమటలు
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ ఏకంగా ముఖ్యమంత్రులకు ముచ్చెమటలు పట్టిస్తోంది. పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా ముఖ్యమంత్రులు ప్రకాశ్ సింగ్ బాదల్, హరీష్ రావత్, లక్ష్మీకాంత్ పర్సేకర్.. సొంత నియోజకవర్గాల్లో స్పష్టమైన ఆధిక్యం సాధించలేకపోతున్నారు. గోవా సీఎం పర్సేకర్ ఓటమి చవిచూశారు. పంజాబ్‌లోని లంబీ స్థానం నుంచి పోటీ చేసిన బాదల్ వెనుకంజలో ఉన్నారు. డిప్యూటి సీఎం సుఖ్బీర్ సింగ్ కూడా అదే దారిలో ఉన్నారు. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ రూరల్‌లో హరీష్ రావత్ వెనుకంజలో ఉన్నారు. కాగా మణిపూర్ సీఎం ఒక్రమ్ ఇబోబి సింగ్ విజయం సాధించారు. ఎమ్మెల్సీగా ఉన్న యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఎన్నికల్లో పోటీ చేయలేదు. -
'దేశంలో న్యాయవ్యవస్థ మెరుగుపడాలి'
ఢిల్లీ: అనవసర చట్టాలను తొలగించి, న్యాయ వ్యవస్థ మెరుగుపడేందుకు కృషి చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఆదివారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్‌లు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల సదస్సును మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...న్యాయవ్యవస్థలో మార్పులు తీసుకురావాల్సిన అవసరముందన్నారు. దేశంలో పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కారించాలని సూచించారు. ఈ సదస్సుకు కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానందా గౌడ్, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌లతో పాటు ఆంధ్రప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఒరిస్సా, హిమాచల్, హర్యానా, జమ్మూ అండ్ కాశ్మీర్, మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రులు హాజరయ్యారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ సదస్సుకు గైర్హజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ నుంచి సీఎం చంద్రబాబునాయుడు, తెలంగాణ రాష్ట్రం నుంచి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హాజరయ్యారు. -
కొత్త సినిమా విడుదల ఎప్పుడో?
డేట్లైన్ హైదరాబాద్ పతాక సన్నివేశం తరువాత ఎప్పటిలాగే శుభం కార్డు పడింది. కానీ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య ఈ సఖ్యత ఎంతకాలం నిలుస్తుందన్న ప్రశ్న మిగిలే ఉంది. ప్రస్తుతానికైతే ఓటుకు కోట్లు వ్యవహారం నుంచి బయటపడడం కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, రానున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలలో విజయం సాధించి మేయర్ స్థానాన్ని దక్కించుకోవడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కొంతకాలం పాటు అపూర్వ సహోదరుల మాదిరిగానే కొనసాగుతారు. ‘ఆగర్భ శత్రువులు-అపూర్వ సోదరులు’ అనే చలనచిత్రాన్ని 2015 సంవత్సరంలో మనం రెండు భాగాలుగా చూశాం. ఇక ఈ ఏడాది ఎలాంటి సినిమాలు చూపించబోతున్నారో మన నాయకులు? కొత్త సంవత్సరం ప్రవేశించింది ఇప్పుడే కదా! తినబోతూ రుచులు అడగడం ఎందుకు? అయితే 2016లో కూడా మనం తప్పనిసరిగా కొన్ని సినిమాలు చూస్తాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అయితే కొత్త సంవత్సరం ఆరంభంలోనే ఒక సినిమా చూపించేశారు. మొన్న ప్రకాశం జిల్లాలో జన్మభూమి కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లి అక్కడ ఆయన చూపించిన సినిమాకు, ‘బాబుగారి గది’ అని పేరు పెడితే బాగానే ఉంటుంది. ఈ మధ్యనే ‘రాజుగారి గది’ అన్న పేరుతో ఒక బడ్జెట్ సినిమా విడుదలైన సంగతి గుర్తుండే ఉంటుంది. ఆ సినిమా కథ ఏమిటంటే, ఆ రాజుగారి గదిలో అన్నీ దయ్యాలూ, భూతాలూ ఉన్నట్టు భ్రమ కలుగు తుందట. ఆయన వైఖరి చూస్తుంటే ముఖ్యమంత్రి చంద్రబాబుకు కూడా ఇలాంటి భ్రమలే కలుగుతున్నాయేమోననిపిస్తుంది. ఆయననూ, ఆయన ప్రభుత్వాన్నీ ఎవరు విమర్శించినా, నిరసించినా సరే, అందులో చంద్ర బాబుకు వైఎస్ఆర్సీపీయే కనిపిస్తున్నదట. ఆయన రాజ్యంలో ఎవరూ నిరసన తెలిపే సాహసం చేయకూడదు. అసలు నిరసనకారులంతా ఆయన కంటికి టైస్టుల మాదిరిగా కనిపిస్తున్నారు. నిరసన తెలియచేస్తారని ఎవరి మీద అనుమానాలు ఉన్నాయో, వారందరినీ బాబుగారి పర్యటన సంద ర్భంగా పోలీసులు అరెస్టు చేశారు. శాంతిభద్రతల పరిరక్షణలో తమ వంతు కర్తవ్యాన్ని పూర్తి చేశారు. జర్నలిస్టులకూ సమస్యలు ఉంటాయి, వారు కూడా నిరసన తెలియచేయగలరన్న ఊహ తట్టకపోవడం వల్ల పోలీసులు విలేకరుల జోలికి పోలేదు. తీరా ప్రెస్ గ్యాలరీలో కూర్చున్న విలేకరులు తమ బొడ్లో దాచి పెట్టిన నినాదాల కాగితాలు తీసి ప్రదర్శించడంతో చంద్రబాబుగారికి ఎక్కడ లేని ఆగ్రహం పెల్లుబికింది. విలేకరులు బొడ్లో నుంచి తీసినవి కాగితాలే, కత్తులు కావు. అయినా వాళ్లు కూడా ఆయనకు టైస్టుల్లాగే కనిపించారు. అంతేకాదు, ఆ జర్నలిస్టులు ప్రాతినిధ్యం వహిస్తున్న సంఘం కూడా వైఎస్ఆర్సీపీ నడుపుతున్న సంఘంలా కనిపించింది. అంటే ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్‌లో ఎవరు నిరసన తెలియచేసినా కూడా ఆ నిరసనకారులంతా వైఎస్ఆర్సీపీ సభ్యులుగా, లేదా ఆ పార్టీ అనుబంధ సంస్థల సభ్యులుగానో చంద్రబాబు కంటికి కనిపిస్తున్నారు. తొలిభాగంలో... తాము మనుగడ సాగిస్తున్నది ప్రజాస్వామిక వ్యవస్థ అన్న సంగతిని చంద్ర బాబు మరచిపోతున్నారు. ‘ఏదన్నా అడుక్కోవాలంటే ఓ పక్కకొచ్చి నిలబడండి! వెళ్లేటప్పుడు చూస్తాను. అంతేకానీ నిరసన తెలియచేస్తే మీ సంగతి తేలుస్తా!’ అని బెదిరిస్తారాయన. నిరసనకారులంతా మన పాలకులకు అడు క్కునేవాళ్ల మాదిరిగా కనిపించడం ప్రజాస్వామ్యానికి చేటు. జర్నలిస్టులకు సంబంధించి ఇలాంటి బెదిరింపులు ఇంకొక చోట కూడా వినిపించిన సంగతి గుర్తుకు రావడం లేదా!? ఔను, చంద్రబాబుకు అపూర్వ సోదరుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు కూడా అధికారంలోకి రాగానే తెలంగాణ జర్నలిస్టుల నిరసనను అణచివేయడానికి ప్రయత్నించినప్పుడు ఇంతకంటే తీవ్ర స్వరంతో హెచ్చరికలు సంధించారు. ఈయన మీ సంగతి తేల్చేస్తానన్నారు. ఆయన మెడలు విరిచి అవతల పారేస్తానన్నారు. ఈ రెండు వ్యక్తీకరణలకీ పెద్ద తేడా లేదు. ఆరు దశాబ్దాల సమరశీల పోరాటాల చరిత్ర కలిగిన జర్నలిస్ట్ ఉద్యమానికి రాజకీయ ముద్రలు వేసే ప్రయత్నం చేస్తు న్నారు. బాబుగారు గది నుంచి బయటకు వస్తే అన్నీ స్పష్టంగా కనిపిస్తాయి. అసలు సినిమా ‘ఆగర్భ శత్రువులు-అపూర్వ సోదరులు’ విషయానికి వస్తే; ముందే చెప్పుకున్నట్టు ఇది రెండు భాగాలుగా సాగింది. ఫిరాయింపు రాజకీయాలు, ఎంఎల్సీ ఎన్నికలు, ఓటుకు కోట్లు వ్యవహారం, శాసనసభ్యుడే జైలుకు వెళ్లడం, సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రే అవినీతిని ప్రోత్సహిస్తూ ఫోన్లో మాట్లాడి పబ్లిగ్గా దొరికిపోవడం, నువ్వు జైలుకు పోతావంటే, నువ్వు నాశనమైపోతావని ముఖ్యమంత్రులిద్దరూ రోడ్డెక్కి బాహాటంగా తిట్టుకోవడం మొదటి భాగంలో చూశాం. ఇంకా, కొన్ని రోజుల పాటు సాగిన ఉద్రిక్త వాతావరణంలో చంద్రబాబు జైలుకు వెళ్లడం ఖాయమని చంద్రశేఖరరావు బహిరంగ వేదికల మీదే గర్జించగా, నీ అంతు చూస్తాను, నాకూ ఏసీబీ ఉంది. పోలీసులూ ఉన్నారు అంటూ చంద్రబాబు విజయవాడ వీధులలో హుంకరిం చారు. ముఖ్యమంత్రులమన్న సంగతి సరే, అసలు నాగరికులమన్న స్పృ హను కూడా వారు కోల్పోయారు. వీరి కోపతాపాలకు అనుగుణంగా అటూ ఇటూ మంత్రులు, ఎంఎల్ఏలు, పార్టీల నాయకులు ఒకరినొకరు నోరారా తిట్టుకోవడం వంటి ఘట్టాలు కూడా ఈ భాగంలోనే తిలకించాం. సినిమా ఏ మలుపు తిరుగుతుందోనని అనుకుంటూ విశ్రాంతి సమ యంలో చాయ్ తాగి థియేటర్లోకి వచ్చిన ప్రేక్షకులు దిమ్మెరపోయారు. రెండోభాగంలో ఆ ఇద్దరూ అపూర్వ సోదరులైపోయారు. ఆలింగనాలు, పుష్పగుచ్ఛాలు, పిండివంటలతో భోజనాలు, దుశ్శాలువలతో మర్యాదలు, వాటిని కొనసాగింపుగా ఆహ్వానాలు- ఇదీ వరస. అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రిని ఆహ్వానించడానికి చంద్రబాబు స్వయంగా విచ్చేస్తే, తాను నిర్వహించిన అయుత చండీయానికి రమ్మని చంద్రబాబును పిలవడానికి చంద్రశేఖరరావు విజయవాడ వెళ్లారు. ఈ ఆహ్వానాల కార్యక్రమం కోసం వారు ఉపయోగించిన హెలికాప్టర్ తదితర సౌకర్యాలకు అయిన ఖర్చంతా రెండు రాష్ట్రాల ప్రజలదే. అట్టహాసంగా జరిగిన అమరావతి శంకుస్థాపనకు చంద్రశేఖరరావు హాజరు కాగా, అయుత చండీయాగానికి దీక్షా వస్త్రాలు ధరించి మరీ చంద్రబాబు హాజరయ్యారు. ప్రభుత్వాధినేత యాగం చేస్తే ఎలా? అమరావతి శంకుస్థాపన గురించీ, చండీయాగం గురించి ఇక్కడ కొంచెం స్పష్టంగా మాట్లాడాలి. స్పష్టంగా అనడం ఎందుకంటే, వాటి గురించి బాహా టంగా విమర్శించడానికి చాలామంది జంకుతున్నారు. కొంతమంది తమలో తాము గొణుక్కుంటూ ఉంటే, కొందరు తమకెందుకులే అని మౌనం దాల్చారు. అమరావతి వ్యవహారంలో కొద్దిపాటి నిరసన అయినా వ్యక్తమైం ది. ఆ రాష్ట్రంలో ఉన్న ఏకైక ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీ. అది బలమైన ప్రతిపక్షం. వైఎస్ఆర్సీపీ, ఇతర పార్టీలు కూడా శంకుస్థాపన ఆర్భాటాన్నే కాకుండా, ఇతర అంశాల గురించి కూడా గళం ఎత్తాయి. కొన్ని కోట్ల ప్రజాధనం ఎందు కు వృథా చేయాలని విమర్శించాయి. అయుత చండీయాగం విషయంలో అలా కాదు. సొంత సొమ్ముతో నిర్వహిస్తున్నానని చంద్రశేఖరరావు ప్రకటిం చారు. అంతవరకు ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ మూఢ నమ్మకాలను పారద్రోలి ప్రజలలో శాస్త్రీయ అవగాహన పెంచవలసిన కాలంలో ప్రభుత్వాధి నేతలు యాగాలు చేయడం ఏమిటని ఒక్కరూ ప్రశ్నించకపోవడం విచార కరం. పూర్వం రాజులు ఈ యాగాలు చేశారు. అవన్నీ రాజ్య విస్తరణ కాంక్షతో చేసినవే తప్ప, ప్రజల క్షేమం కోసం చేసినవి మాత్రం కాదు. తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తే అయుత చండీయాగం చేస్తానని మొక్కుకు న్నట్టు చంద్రశేఖరరావు ప్రకటించారు. ఇంకేముంది! అందరి నోళ్లూ మూతప డ్డాయి. అక్కడ అమరావతి నిర్మాణం విషయంలో విమర్శలు ఎక్కుపెట్టిన వారిని రాజధానికే వ్యతిరేకులని ఏ విధంగా ముద్ర వేస్తున్నారో, తెలంగా ణలో కూడా అయుత చండీయాగాన్ని విమర్శిస్తే తెలంగాణకే వ్యతిరేకులన్న ముద్ర పడవచ్చుననే వాతావరణం కల్పించారు. యాగాలు మత సంబంధమై నవి. మత విశ్వాసాలు వ్యక్తిగతమైనవి. వాటిని చులకన చేయవలసిన అవ సరం లేదు. కానీ అవి వ్యక్తులకూ, వారి ఇళ్లకూ పరిమితం కావాలి. అంతే తప్ప, ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాధినేతలు యాగాలు చేయడం సరికాదు. వ్యక్తిగత హోదాలో సీఎం ఈ యాగాన్ని నిర్వహించారనే అనుకుంటే, ప్రజా స్వామ్యంలోని నాలుగు అంగాలకు చెందిన పెద్దలు కూడా పాల్గొనడం ఏ విధంగా రాజ్యాంగ స్ఫూర్తికి దోహదం చేయగలుగుతుంది? పతాక సన్నివేశంలో... ఇక సినిమా పతాక సన్నివేశం తరువాత ఎప్పటిలాగే శుభం కార్డు పడింది. కానీ తెలుగు రాష్ట్రాల సీఎంల మధ్య ఈ సఖ్యత ఎంతకాలం నిలుస్తుందన్న ప్రశ్న మిగిలే ఉంది. ప్రస్తుతానికైతే ఓటుకు కోట్లు వ్యవహారం నుంచి బయట పడడం కోసం ఆంధ్రప్రదేశ్ సీఎం, రానున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలలో విజయం సాధించి మేయర్ స్థానాన్ని దక్కించుకోవడానికి తెలం గాణ సీఎం కొంతకాలం పాటు అపూర్వ సహోదరుల మాదిరిగానే కొనసాగు తారు. తెలంగాణ రాష్ట్రానికి మకుటం హైదరాబాద్. అక్కడ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎప్పుడూ గెలవలేదు. అధికారంలోకి వచ్చాక ఇప్పుడు కూడా గెలవలేకపోతే ఆ పార్టీ రాజకీయంగా ఇబ్బందుల్లో పడుతుంది. గెలవాలంటే హైదరాబాద్‌లో స్థిరపడిన ఆంధ్రుల ఓట్లు కావాలి. జీహెచ్ఎంసీ ఎన్ని కలు పూర్తి కాగానే ఈ సంవత్సరంలోనే ఈ ముఖ్యమంత్రులు ఇద్దరూ రాజకీయ వెండితెర మీద మరో కొత్త సినిమా చూపించినా ఆశ్చర్యపోనక్కరలేదు. (వ్యాసకర్త : దేవులపల్లి అమర్, ఐజేయూ సెక్రెటరీ జనరల్, datelinehyderabad@gmail.com ) -
'సీఎంలు ఇద్దరూ అమావాస్య చంద్రులు'
ధర్మపురి (కరీంనగర్): ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరూ అమావాస్య చంద్రులని ఏఐసీసీ అధికార ప్రతినిధి మధుయాష్కిగౌడ్ ఆరోపించారు. గురువారం ఆయన కరీంనగర్ జిల్లా ధర్మపురిలో పుష్కరస్నానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియతో మాట్లాడుతూ.. పుష్కరాలకు మొక్కుబడి ఏర్పాట్లతో మమా అనిపించారని అసంతృప్తి వ్యక్తం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అమావాస్య చంద్రులు పాలిస్తుండటంతో వరుణుడు ముఖం చాటేశాడని విమర్శించారు. రాజమండ్రి సంఘటనకు ఏపీ సీఎం చంద్రబాబు నైతిక బాధ్యత వహించాలని మధుయాష్కి గౌడ్ కోరారు. -
కేంద్ర పథకాల కుదింపు
-
పరిస్థితి చక్కదిద్దడంలో గవర్నర్ విఫలం
- గవర్నర్ ఏమీ చేయడంలేదని విమర్శించిన పొన్నం ప్రభాకర్ సాక్షి,తిరుమల : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు పరస్పర విమర్శలకు దిగటం సరికాదని, ఈ పరిస్థితి చక్కదిద్దటంలో ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ విఫలమయ్యారని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆదివారం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఒక పార్టీలో గెలిచినవారు మరొకపార్టీ ప్రభుత్వంలో మంత్రులుగా ప్రమాణం చేస్తున్న తరుణంలో రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన గవర్నర్ కూడా ఏమీ చేయలేకపోతున్నారని ప్రజలు భావిస్తున్నారన్నా రు. రెండు రాష్ట్రాల్లో ఏర్పడిన పరిస్థితుల వల్ల శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉంద న్నారు. ఇందుకు ఆయా రాష్ట్రాల సీఎస్‌లు, డీజీపీలు కూడా నేతలకు వత్తాసు పలకటం సరికాదన్నారు. ఇలాంటి తరుణంలో పెద్దన్న పాత్ర పోషించాల్సిన కేంద్రం కూడా జోక్యం చే సుకోకపోవటం దారుణమన్నారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా దాటవేసేం దుకు ఇద్దరు సీఎంలు పరస్పరం విమర్శలకు దిగుతున్నారని విమర్శించారు. వీరి దూకుడుతో భవిష్యత్ తరా ల్లో వైషమ్యాలు మరింత పెరిగే ప్రమాదం ఉందన్నారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు శ్రీవారి ఆలయ జీయర్లు, ప్రధాన అర్చకులు రమణదీక్షితులు వంటి ధార్మిక పెద్దలు జోక్యం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. -
'ప్రతిపక్ష పార్టీ వాళ్లను నిస్సిగ్గుగా చేర్చుకుంటున్నారు'
విజయవాడ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అధికారంలో ఉన్న పార్టీలు ప్రతిపక్ష పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను నిస్సిగ్గుగా చేర్చుకుంటున్నాయని సీపీఐ ఏపీ కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. ఓటుకు కోట్లు వ్యవహారంలో ఆడియో టేపుల్లో ఉన్నది ఏపీ సీఎం చంద్రబాబు వాయిసే అయితే వెంటనే పదవికి రాజీనామా చేసి విచారణకు సిద్ధమవ్వాలని సూచించారు. కేసీఆర్, చంద్రబాబు డబ్బు రాజకీయాలు చేస్తున్నారని రామకృష్ణ వ్యాఖ్యానించారు. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలూ మీడియాను నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆయన అన్నారు. మీడియాను నియంత్రించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని రామకృష్ణ ఈ సందర్భంగా తెలిపారు. -
ప్రజల ఆకాంక్షల మేరకు పని చేయాలి: వెంకయ్య
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా కేంద్ర మంత్రి ఎం. వెంకయ్యనాయుడు శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల ఆకాంక్షల మేరకు పని చేయాలని ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు సూచించారు. సఖ్యతతో వ్యవహరించి సమస్యలను సర్దుబాటు చేసుకోవాలన్నారు. పద్ధతి ప్రకారం కేంద్రం నుంచి అందాల్సిన సహకారం రెండు రాష్ట్రాలకు అందుతుందని వెంకయ్యనాయుడు చెప్పారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మిగతా రాజకీయ విషయాలను పక్కన పెట్టి రాష్ట్రాల అభివృద్ధిపై దృష్టి పెట్టాలన్నారు. -
పథకాల్లో రాష్ట్రాలకు స్వేచ్ఛ
సీఎంలకు ప్రధాని మోదీ లేఖ న్యూఢిల్లీ: కేంద్ర ప్రాయోజిత పథకాలను రాష్ట్రాలు తమ అవసరాలకు అనుగుణంగా రూపొందించుకోవచ్చని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఈ మేరకు మంగళవారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాశారు. అభివృద్ధి ప్రణాళికల మేరకు పథకాల్లో మార్పుచేర్పులు చేసుకునే స్వేచ్ఛ రాష్ట్రాలకు ఉందని అందులో పేర్కొన్నారు. ‘‘కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటాను ఏకంగా 10 శాతానికి పెంచాలని ఆర్థిక సంఘం సిఫారసు చేసింది. దీంతో ఇంతకుముందు 32 శాతంగా ఉన్న వాటా 42 శాతానికి చేరుతుంది. దీనివల్ల సహజంగానే కేంద్రం వద్ద నిధులు తగ్గుతాయి. అయినా జాతీయ ప్రాధాన్యం గల పేదరిక నిర్మూలన, ఉపాధి హామీ, విద్య, ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం తదితరాలకు కేంద్రం నుంచి సాయం కొనసాగుతుంది. మీ చేతిలో పుష్కలంగా వనరులు ఉన్నప్పుడు.. కొన్ని పథకాలు, కార్యక్రమాలను పాత పద్ధతిలోనే అమలు చేయాలని లేదు. మీ విచక్షణ, అవసరాలకు అనుగుణంగా వాటిని మార్చుకోవచ్చు’’ అని ప్రధాని పేర్కొన్నారు. తమ అవసరాలకు అనుగుణంగా పథకాలు రూపొందించుకుంటామని, ఇందుకు సాయం చేయాల్సిందిగా రాష్ట్రాలు కొన్నేళ్ల నుంచి కేంద్రాన్ని కోరుతున్నాయన్నారు. -
'ముఖ్యమంత్రుల కొట్లాట నాటకం'
సాగర్ జలాల కోసం ఆంధ్ర - తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రుల కొట్లాట అంతా ఓ నాటకమని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ విమర్శించారు. సమస్యలపై ప్రజలు నిలదీయకుండా ఉండేందుకే ఇద్దరు ముఖ్యమంత్రులు పోట్లాడుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ఒకవేళ నిజంగానే సాగు నీటి కోసం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కొట్టుకుంటుంటే పెద్దన్న పాత్ర పోషించాల్సిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎందుకు మౌనంగా ఉన్నారని పొన్నం ప్రభాకర్ నిలదీశారు. -
పోలీసులే కొట్టుకోవడం సిగ్గుచేటు: మైసూరా రెడ్డి
హైదరాబాద్: శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీసులే కొట్టుకోవడం సిగ్గుచేటని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎం.వీ. మైసూరా రెడ్డి విమర్శించారు. దీనికి ఇరురాష్ట్రాల ముఖ్యమంత్రులు పూర్తి బాధ్యత వహించాలని ఆయన అన్నారు. ఈ గొడవలు చూస్తుంటే తెలుగు ప్రజల మధ్య విధ్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నాయన్నారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ముందుగానే మాట్లాడుకొని ఉంటే ఈ పరిస్థితి వచ్చేదే కాదని ఆయన హితవు పలికారు. ఇద్దరు ముఖ్యమంత్రులూ సమస్య పరిష్కారానికి గవర్నర్ వద్దకు వెళ్లడం సిగ్గుచేటన్నారు. ఇద్దరు సీఎంలూ రాజ్యాంగ సంక్షోభం సృష్టిస్తున్నారని మైసూరా రెడ్డి దుయ్యబట్టారు. ఈ పరిస్థితి ఎక్కడికి దారి తీస్తుందోనని ఆందోళన వ్యక్తం చేశారు. ఇద్దరు ముఖ్యమంత్రులూ సవాళ్లు, ప్రతి సవాళ్లు మానుకొని సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషిచేయాలని హితవు పలికారు. -
నీతి అయోగ్ తొలి భేటీ హైలైట్స్...
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన రాష్ట్రాల ముఖ్యమంత్రులతో 'నీతిఅయోగ్' కార్యక్రమం జరిగింది. నీతిఅయోగ్ విధివిధానాలను ఈ సమావేశంలో చర్చించారు. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపిన కొన్ని హైలైట్స్: ఈ సమావేశంలో ప్రధాని మానస పుత్రికలైన జన్ ధన్ యోజన కార్యక్రమం ప్రజలందరి సహకారంతో ఏ విధంగా విజయవంతమందీ వివరించారు. అదేవిధంగా 'స్వచ్ఛభారత్' కార్యక్రమం రాష్ట్రాల సహకారంతో ఏ విధంగా విజయవంతమైందో తెలిపారు. మొదటి సబ్ గ్రూప్..కేంద్ర ప్రభుత్వ పథకాలను పరిశీలించి ఏవి అవసరమో అధ్యయనం చేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తుంది. రెండో గ్రూప్...రాష్ట్రాల్లోని స్కిల్ డెవలప్ మెంట్ పథకం కోసం సూచనలు, సలహాలతో నివేదిక సమర్పిస్తుంది. మూడో గ్రూప్...దైనందిన జీవితంలో స్వచ్ఛ భారత్ భాగమయ్యేలా దాని ఆవశ్యకతను ప్రజలందరికీ వివరించాలి.దీనికి అవసరమయ్యే యంత్రాంగ రూపకల్పనకు సలహాలు, సూచనలతో ఒక నివేదికను సమర్పించాలని ఆదేశించారు.ఈ సమావేశంలో రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మూడు సబ్ గ్రూప్ లను ఏర్పాటు చేశారు. -
మోదీ అధ్యక్షతన ప్రారంభమైన నీతి ఆయోగ్
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతను నీతి ఆయోగ్ తొలి సమావేశం ఆదివారం న్యూఢిల్లీలో ప్రారంభమైంది. ఈ సమావేశానికి దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు హాజరయ్యారు. పెట్టుబడులు, పొదుపు, అభివృద్ధి తదితర అంశాలపై ఈ సందర్బంగా చర్చిస్తున్నారు. అలాగే ఈ ఫిబ్రవరి 28న కేంద్ర ప్రవేశ పెట్టనున్న ఆర్థిక బడ్జెట్ లో తీసుకురావాల్సిన అంశాలపై కూడా ప్రధాని ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఈ సమావేశానికి పలువురు కేంద్ర మంత్రులు.. ఉన్నతాధికారులు హాజరయ్యారు. మోదీ ప్రభుత్వం ఇటీవల ప్రణాళిక సంఘం స్థానంలో నీతి ఆయోగ్ (భారత జాతీయ పరివర్తన సంస్థ)ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. -
కేంద్ర నిర్ణయాన్ని సీఎంలు సమర్థించారు: జైట్లీ
న్యూఢిల్లీ: ప్రణాళిక సంఘానికి బదులుగా నూతన సంస్థ స్థాపన కోసం మూడు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు. ఆదివారం న్యూఢిల్లీలో వివిధ రాష్ట్రాల సీఎంలు, ప్రధాన కార్యదర్శులతో మోడీ తన నివాసంలో సమావేశమైయ్యారు. ఆ సమావేశం వివరాలను జైట్లీ మీడియాకు వెల్లడించారు. మొదటి బృందంలో ప్రధాని, ముఖ్యమంత్రులు... రెండో బృందంలో ప్రధాని, కేంద్ర మంత్రి మండలి... మూడో బృందంలో ప్రధాని, ఉన్నతాధికారులు ఉంటారని తెలిపారు. 1950లో ప్రణాళిక సంఘం ఏర్పాటైనా...1992 నుంచి దేశంలో సంస్కరణలు మొదలయ్యాయని జైట్లీ గుర్తు చేశారు. దేశాభివృద్ధికి మరన్ని ప్రణాళికలు అవసరమని అన్నారు. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని చాలా మంది సీఎంలు సమర్థించారని జైట్లీ చెప్పారు. ప్రధాని, ముఖ్యమంత్రులు, అధికారులు కలిస్తేనే టీమిండియా అని జైట్లీ చమత్కరించారు. జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్ రాష్ట్రాల సీఎంలు మినహా మిగిలిన అన్ని రాష్ట్రాల సీఎంలు ఈ సమావేశానికి హాజరయ్యారని అరుణ్ జైట్లీ వెల్లడించారు. ఈ సంస్థ ఏర్పాటుపై అన్ని రకాల సలహాలు, సూచనలు అందిన తర్వాతే ముందుకు వెళ్తామన్ని చెప్పారు. -
నేడు సీఎంలతో ప్రధాని భేటీ
న్యూఢిల్లీ: ప్రణాళిక సంఘం స్థానంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న సంస్థ రూపురేఖలు, పనితీరుపై చర్చించేందుకు ప్రధాని మోదీ ఆదివారం వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నారు. మారిన దేశ ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా ఈ సంస్థ ఎలా ఉండాలన్న అంశంపై సీఎంల అభిప్రాయాలు తెలుసుకోనున్నారు. ఈ భేటీలో తొలుత ప్రణాళిక సంఘం కార్యదర్శి సింధుశ్రీ ఖులార్ భవిష్యత్తులో కొత్త సంస్థ నిర్వర్తించబోయే విధుల గురించి వివరిస్తారు. అనంతరం సీఎంలు ప్రసంగిస్తారు. ప్రణాళిక సంఘం స్థానంలో ఏర్పాటు చేయబోయే సంస్థలో 8 నుంచి 10 మంది సభ్యులు ఉండొచ్చని సమాచారం. కొత్త సంస్థ రాష్ట్రాలను మరింత బలోపేతం చేసేదిగా ఉంటుందని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ తెలిపారు. విమర్శనాస్త్రాలతో విపక్షాలు సిద్ధం... ప్రణాళికా సంఘం రద్దుకు ఆతురత పడుతున్న కేంద్రం తీరుపై సీఎంల భేటీలో ఎండగట్టేందుకు విపక్ష సీఎంలు సిద్ధమయ్యారు. ప్రణాళికా సంఘం రద్దు నిర్ణయాన్ని తీసుకున్న తీరుపై తమ సమావేశంలో వ్యతిరేకిస్తుందని జేడీయూ చీఫ్ శరద్ యాదవ్ వెల్లడించారు. అయితే, ప్రణాళికా వ్యవస్థ పునర్నిర్మాణాన్ని వ్యతిరేకించబోమని, దాని రద్దుకు చేపడుతున్న తొందరపాటు చర్యలనే వ్యతిరేకిస్తామని సమాజ్‌వాదీ పార్టీ తెలిపింది. తృణమూల్ కూడా అసమ్మతి తెలిపే అవకాశముంంది. ప్రస్తుత వ్యవస్థ అందరికీ ఆమోదయోగ్యంగా ఉందని, కొత్త వ్యవస్థ ఏర్పాటుచేయదలిస్తే అది కేంద్ర, రాష్ట్ర సంబంధాలను బోలోపేతం చేసేలా ఇంకా సమర్థంగా ఉండాలని కేరళ సీఎం ఊమెన్ చాందీ అన్నారు. -
వచ్చే నెల 4న ఏపీ, కర్ణాటక సీఎంల భేటీ!
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, సిద్దరామయ్యలు వచ్చే నెల 4న సమావేవశమయ్యే అవకాశముంది. చంద్రబాబు బెంగళూరులో సిద్ధరామయ్యను కలసి కృష్ణా నదీజలాల విషయం చర్చించనున్నట్టు సమాచారం. మంగళవారం సాయంత్రం చంద్రబాబు ఇరిగేషన్ శాఖ అధికారులతో సమావేశమయ్యారు. సరిహద్దు రాష్ట్రాలతో నదీజలాల అంశం గురించి చర్చించారు. తుంగభద్ర హెచ్ఎల్సీ నీటి నుంచి 32 టీఎంసీలను ఏపీ వినియోగించుకునేలా సిద్ధరామయ్యను ఒప్పించేందుకు చంద్రబాబు ప్రయత్నించనున్నారు. అలాగే ఇతర నదీ జలాల అంశాలను చంద్రబాబు చర్చించనున్నారు. -
సీఎంలిద్దరూ అహంభావం వీడాలి: శ్రీకాంత్‌రెడ్డి
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులిద్దరూ అహంభావం వీడి.. ప్రజల సంక్షేమం గురించి ఆలోచించాలని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. ప్రధానమంత్రి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను పిలిపించి మాట్లాడాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రాయలసీమ ప్రయోజనాలను కాపాడాలని, అక్కడి టీడీపీ నాయకులు స్వప్రయోజనాల కోసం, రియల్ ఎస్టేట్ లాభాల కోసమే చూసుకుంటున్నారని ఆయన విమర్శించారు. -
పోటాపోటీగా ఇద్దరు సీఎంల హెలికాప్టర్లు!
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరూ అభివృద్ధిలో పోటీ పడటం మాట అటుంచి.. తమకు తాము సౌకర్యాలు కల్పించుకోవడంలో మాత్రం ముందంజలో ఉంటున్నారు. ఇటీవలే తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు తన కోసం ప్రత్యేకంగా ఒక హెలికాప్టర్ కొనుగోలు చేయాలని నిర్ణయించారు. అందుకు పోటీగా అన్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఒక హెలికాప్టర్ కొనుగోలు చేయాలని తాజాగా నిర్ణయించింది. ముఖ్యమంత్రులు పర్యటనలు చేయడానికి, అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించడానికి ప్రతి రాష్ట్రానికి హెలికాప్టర్ ఉంటుంది. అలాగే ఇంతకుముందు సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా హెలికాప్టర్ ఉంది. దాన్ని ఏం చేయాలన్న విషయాన్ని మాత్రం పక్కన పెట్టి, ఇప్పుడు మళ్లీ ఇద్దరూ తలో హెలికాప్టర్ కొనాలని భావిస్తున్నారు. -
ఒకే వేదికపై ఇద్దరు చంద్రులు!!
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ఇద్దరి మధ్య సాధారణంగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. కానీ ఇద్దరూ ఇరుగు పొరుగు రాష్ట్రాలకు సీఎంలు. వాళ్లిద్దరూ పరస్పరం ఎదురుపడటమే కష్టం. అలాంటిది ఇద్దరూ ఒకే వేదికపై కనిపిస్తే ఎలా ఉంటుంది? పరస్పరం వాళ్లిద్దరూ ఎలాంటి విషయాలు మాట్లాడుకుంటారు? ఫీజు రీయింబర్స్మెంట్, విద్యుత్ సమస్య, నదీజలాల పంపిణీ.. ఇలాంటి విషయాలేమైనా వాళ్ల మధ్య చర్చకు వచ్చే అవకాశం ఉంటుందా? అసలు వాళ్లిద్దరూ ఒకే వేదికపైకి ఎలా వస్తారో చూస్తారా... చంద్రబాబు నాయుడు, చంద్రశేఖరరావు ఇద్దరికీ ఉన్నది ఒకే గవర్నర్.. ఆయనే ఈఎస్ఎల్ నరసింహన్. రంజాన్ మాసం సందర్భంగా గవర్నర్ నరసింహన్ ఇఫ్తార్ విందు ఇస్తున్నారు. దానికి ఆయన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులనూ ఆహ్వానించారు. దాంతో కేసీఆర్, చంద్రబాబు ఇద్దరూ ఒకేసారి రాజ్‌భవన్‌లో గవర్నర్ ఇచ్చే ఇఫ్తార్ విందుకు వెళ్లనున్నారు. అక్కడైనా రెండు రాష్ట్రాల సీఎంల మధ్య సుహృద్భావ వాతావరణంలో సంభాషణలు జరిగి ప్రస్తుతం ఉన్న సమస్యలకు ఓ పరిష్కారం దొరుకుతుందని ఆశిద్దాం. -
ముఖ్యమంత్రుల మార్పుపై మంతనాలు
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో దారుణ పరాజయం మూటగట్టుకున్న కాంగ్రెస్ పార్టీ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులను మార్చాలని యోచిస్తోంది. కాంగ్రెస్ హైకమాండ్ ఈ దిశగా కీలక నేతలతో వరుస మంతనాలు జరుపుతోంది. అసోం, మహారాష్ట్ర, హర్యానాల్లో ముఖ్యమంత్రులను మార్చే అవకాశం కనిపిస్తోంది. ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీతో శనివారం హర్యనా ముఖ్యమంత్రి భూపిందర్‌సింగ్ హుడా భేటీ అయ్యారు. మహారాష్ట్ర సీనియర్‌నేతలు శివాజీరావ్ దేశ్‌ముఖ్, శివాజీరావ్ మోఘే కూడా సోనియాతో సమావేశమయ్యారు. మరోవైపు మహారాష్ట్ర సీఎం పృథ్వీరాజ్ చౌహాన్ కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలు ఏకే అంటోనీ, అహ్మద్ పటేల్‌తో సమావేశమై చర్చించారు. అసోం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్‌పై అసంతృప్తి పెరుగుతున్నట్టు సమాచారం. అసోం సీనియర్‌నేత విశ్వశర్మ అధిష్టానం పెద్దలను కలుసుకోనున్నారు. -
ఛత్తీస్ సీఎంగా రమణ్‌సింగ్ ప్రమాణం
రాయ్‌పూర్: వైద్య వృత్తి నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన 61 ఏళ్ల డాక్టర్ రమణ్‌సింగ్ వరుసగా మూడోసారి ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. స్థానిక పోలీసు పరేడ్ గ్రౌండ్లో గురువారం ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన చేత గవర్నర్ శేఖర్ దత్ ప్రమాణం చేయించారు. పటిష్ట భద్రతా ఏర్పాట్ల మధ్య సాగిన ఈ కార్యక్రమానికి బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్, పార్టీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్, రాజ్యసభలో ప్రతిపక్ష నేత అరుణ్ జైట్లీ, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు నరేంద్ర మోడీ (గుజరాత్), శివరాజ్‌సింగ్ చౌహాన్ (మధ్యప్రదేశ్), మనోహర్ పరేకర్ (గోవా), ప్రకాశ్‌సింగ్ బాదల్ (పంజాబ్), ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగి, బీజేపీ నాయకురాలు వసుంధరా రాజే సింథియా (రాజ స్థాన్ ముఖ్యమంత్రిగా శుక్రవారం ప్రమాణం చేయనున్నారు) హాజరయ్యారు. అలాగే బీజేపీ నాయకులు హర్షవర్ధన్ సింగ్, వెంకయ్యనాయుడు, నితిన్ గడ్కరీ, రవిశంకర్ ప్రసాద్, రాజీవ్‌ప్రతాప్ రూడీ, నవ్‌జోత్‌సింగ్ సిద్ధూ, అనంత్‌కుమార్, ఉమాభారతి, స్మృతీ ఇరానీ, జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి అర్జున్ ముండా తదితరులు విచ్చేశారు. -
విచ్చిన్నకర శక్తులపై ఉక్కుపాదం
న్యూఢిల్లీ: దేశంలో మత ఘర్షణల ఉదంతాలు పెరుగుతుండటం పట్ల జాతీయ సమగ్రతా మండలి తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది. మత ఘర్షణలను పార్టీలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవటం మానాలని హితవు పలికింది. మతతత్వాన్ని నిరోధించేందుకు రాజకీయ నాయకులతో సహా దేశ ప్రజలంతా ఉమ్మడిగా కృషి చేయాలని పిలుపునిచ్చింది. అన్ని మతాల మధ్య సామరస్య సంబంధాలను కాపాడేందుకు, బలోపేతం చేసేందుకు.. పౌరులంతా సమానత్వంతో, గౌరవప్రదంగా, స్వేచ్ఛాయుతంగా జీవించేందుకు అన్ని చర్యలూ చేపట్టాలని తీర్మానం చేసింది. వివిధ వర్గాల ప్రజల మధ్య మతపరంగా చీలిక తేవటానికి ప్రయత్నిస్తున్న విచ్ఛిన్నకర శక్తులు దేశ సమగ్రతకు పెను ముప్పని.. ఇలాంటి శక్తులను ఉక్కుపాదంతో అణచివేయాలని ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ పిలుపునిచ్చారు. ఇటీవల ముజఫర్‌నగర్‌లో మతఘర్షణల నేపథ్యంలో జాతీయ సమగ్రతా మండలి సోమవారం ఢిల్లీలో సమావేశమైంది. ప్రధాని మన్మోహన్ అధ్యక్షతన రోజంతా కొనసాగిన ఈ సమావేశంలో కేంద్రమంత్రులు, పార్లమెంటులో ప్రతిపక్ష నేతలు, ముఖ్యమంత్రులు, జాతీయ, ప్రాంతీయ పార్టీల నాయకులు, మీడియా, వ్యాపార, ప్రజా జీవన రంగాల ప్రముఖులు పాల్గొన్నారు. మతాల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టేందుకు, అభ్యంతరకర అంశాలను ప్రచారం చేసేందుకు సామాజిక వెబ్సైట్లను దుర్వినియోగం చేయటంపై ప్రధాని సహా పలువురు ముఖ్యమంత్రులు తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. సామాజిక వెబ్సైట్ల అనియంత్రిత దుర్వినియోగాన్ని నిరోధించేందుకు చర్యలు చేపట్టాలని పలు సూచనలు చేశారు. బీజేపీకి చెందిన గుజరాత్, ఛత్తీస్‌గఢ్, గోవా సీఎంలు నరేంద్ర మోడీ, రమణ్‌సింగ్, మనోహర్ పారికర్లతోపాటు తమిళనాడు, ఒడిశా సీఎంలు జయలలిత, నవీన్‌పట్నాయక్‌లు ఈ సమావేశానికి హాజరుకాలేదు. అయితే తమ అభిప్రాయాలను తమ ప్రతినిధుల ద్వారా సమావేశంలో వినిపించారు. సమగ్రతా మండలిలో ఆయా నేతల ప్రసంగాల్లో ముఖ్యాంశాలు వారి వారి మాటల్లోనే... సోషల్ మీడియాను సౌభ్రాతృత్వానికి వాడాలి: ప్రధాని ‘‘ఇటీవల చోటుచేసుకున్న కొన్ని మత ఘర్షణల ఉదంతాల్లో.. ఒక మతంపై మరొక మతం వారిలో విద్వేషాన్ని రెచ్చగొట్టే ఉద్దేశంతో నకిలీ వీడియోలను సామాజిక వెబ్సైట్లలో ప్రసారం చేసినట్లు గుర్తించాం. దీనికి ముందు 2012లో కూడా ఈశాన్య ప్రాంత ప్రజలకు వ్యతిరేకంగా విద్వేషాలను రెచ్చగొట్టారు. ఇది ఇతర ప్రాంతాల నుంచి ఈశాన్య ప్రజలు పెద్ద సంఖ్యలో తిరిగి వెళ్లిపోయే పరిస్థితులకు దారితీసింది. సామాజిక మీడియాను సౌభ్రాతృత్వం, మత సామరస్యం పెంపొందించటానికి ఉపయోగించుకోవాలి. ప్రజలు సామాజిక మీడియాలో తమ అభిప్రాయాలు, దృక్పథాలను వెల్లడించే స్వేచ్ఛ ఉండటం అవసరం. కానీ అదే సమయంలో దుండగులు, ఇబ్బందులు సృష్టించేవారు సామాజిక మీడియాను దుర్వినియోగం చేయకుండా నిరోధించటమూ ముఖ్యమే. ముజఫర్‌నగర్‌లో ఇటీవల జరిగిన మత ఘర్షణల్లో దాదాపు 50 మంది చనిపోయారు. లక్షల కోట్ల రూపాయల ఆస్తి నష్టం సంభవించింది. జమ్మూకాశ్మీర్‌లోని కీస్త్వర్ ప్రాంతంలోనూ, బీహార్‌లోని నవద ప్రాతంలోనూ, హైదరాబాద్‌లోనూ గత కొద్ది మాసాల్లో ఇలాంటి ఘటనలు పెరిగాయి. వివిధ వర్గాల ప్రజల మధ్య మతపరంగా చీలిక తేవడానికి ప్రయత్నించే శక్తులు దేశ ప్రజాస్వామ్యానికి పెను సవాల్. ఇలాంటి శక్తులను ఉక్కుపాదంతో అణచివేయాలి. మత అల్లర్లను నివారించే బృహత్తర బాధ్యత రాష్ట్రాలపైనే ఉంది. ఇలాంటి ఘటనలకు ఎలాంటి రాజకీయ కోణం ఇవ్వటం కానీ, ఎలాంటి రాజకీయ లబ్ధి పొందటం కానీ చేయకుండా పార్టీలు, మీడియా సంయమనం పాటించాలి.’’ మత హింసను గర్హించిన మండలి: మత సామరస్యాన్ని దెబ్బతీసే ఉద్దేశంతో జరిగే అన్ని రూపాల్లోని హింసనూ ఖండించింది. ఇందులో సంబంధమున్న వారిపై చట్ట ప్రకారం తక్షణ కఠిన చర్యలు చేపట్టాలని జాతీయ సమగ్రతా మండలి ఏకగ్రీవంగా తీర్మానించింది. అన్ని మతాల మధ్య సామరస్య సంబంధాలను కాపాడేందుకు, పౌరులంతా సమానత్వంతో స్వేచ్ఛాయుతంగా జీవించేందుకు చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. మహిళలపై లైంగిక దాడులు, అత్యాచారాలు, హింసాత్మక దాడులను కూడా జాతీయ సమగ్రతా మండలి ఖండించింది. నేరస్తులపై చట్ట సంస్థలు కఠిన చర్యలు చేపట్టాలని తీర్మానం చేసింది. ఎస్సీ, ఎస్టీలపై తరచుగా అత్యాచారాలకు పాల్పడటాన్ని కూడా మండలి గర్హించింది. ఈ నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు చేపట్టాలని నిర్ణయించింది.