
న్యూఢిల్లీ: దాదాపు ఆరు సంవత్సరాల విరామం తర్వాత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల సమావేశం ఈ నెల 30న జరగనుంది. సత్వర న్యాయాన్నందించడం, వివాదాల పరిష్కారం, న్యాయవ్యవస్థలో ఖాళీలు పెరగడం తదితర అంశాలు సమావేశంలో చర్చిస్తారు. 2016 ఏప్రిల్ 24న చివరిసారి ఈ సమావేశం జరిగింది. తాజా సమావేశాన్ని ప్రధాని ప్రారంభిస్తారు. ఇందులో సీజేఐ, న్యాయమంత్రి పాల్గొనే అవకాశముంది. సమావేశంలో పలు వర్కింగ్ సెషన్లు జరుగుతాయి. నిజానికి ఇలాంటి సమావేశాలను ప్రతి రెండేళ్లకొకసారి నిర్వహించాల్సిఉంది.
Comments
Please login to add a commentAdd a comment