సరిహద్దు భద్రతలో రాష్ట్రాలకూ బాధ్యత | States also share responsibility for security in border areas: Home Minister Amit Shah | Sakshi
Sakshi News home page

సరిహద్దు భద్రతలో రాష్ట్రాలకూ బాధ్యత

Published Sun, Dec 18 2022 6:14 AM | Last Updated on Sun, Dec 18 2022 6:14 AM

States also share responsibility for security in border areas: Home Minister Amit Shah - Sakshi

అమిత్‌ షాకు స్వాగతం పలుకుతున్న మమత

కోల్‌కతా: దేశ సరిహద్దు ప్రాంతాల్లో భద్రతలో బీఎస్‌ఎఫ్‌తోపాటు సంబంధిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు బాధ్యత పంచుకోవాలని హోం మంత్రి అమిత్‌ షా పేర్కొన్నారు. శనివారం కోల్‌కతాలోని పశ్చిమబెంగాల్‌ సెక్రటేరియట్‌లో జరిగిన 25వ ఈస్టర్న్‌ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో అమిత్‌  మాట్లాడారు.

సరిహద్దు ప్రాంతాల్లో బీఎస్‌ఎఫ్‌ పరిధిని విస్తరించిన నేపథ్యంలో ఆయా చోట్ల భద్రతపై జరిగిన చర్చ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భేటీలో బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, జార్ఖండ్‌ సీఎం సోరెన్, బిహార్‌ డిప్యూటీ సీఎం తేజస్వీ, ఒడిశా మంత్రి పాల్గొన్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement