Eastern
-
సరిహద్దు భద్రతలో రాష్ట్రాలకూ బాధ్యత
కోల్‌కతా: దేశ సరిహద్దు ప్రాంతాల్లో భద్రతలో బీఎస్ఎఫ్తోపాటు సంబంధిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు బాధ్యత పంచుకోవాలని హోం మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. శనివారం కోల్‌కతాలోని పశ్చిమబెంగాల్ సెక్రటేరియట్లో జరిగిన 25వ ఈస్టర్న్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో అమిత్ మాట్లాడారు. సరిహద్దు ప్రాంతాల్లో బీఎస్ఎఫ్ పరిధిని విస్తరించిన నేపథ్యంలో ఆయా చోట్ల భద్రతపై జరిగిన చర్చ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భేటీలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, జార్ఖండ్ సీఎం సోరెన్, బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ, ఒడిశా మంత్రి పాల్గొన్నారు. -
మళ్లీ ఉత్తర కొరియా బాలిస్టిక్ క్షిపణి పరీక్ష
సియోల్: అంతర్జాతీయంగా వస్తున్న వ్యతిరేకతల్ని బేఖాతర్ చేస్తూ ఉత్తర కొరియా మరోసారి బాలిస్టిక్ క్షిపణి పరీక్షలు నిర్వహించింది. తూర్పు సముద్రంలో సోమవారం ఈ పరీక్షలు నిర్వహించినట్టుగా దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ జనరల్ వన్ ఇన్ చౌల్ వెల్లడించారు. ఆ క్షిపణి 700 కి.మీ. దూరంలో లక్ష్యాలను ఛేదించగలదని చెప్పారు. ప్రస్తుతం అమెరికా, ఉత్తర కొరియా మధ్య అణుచర్చలపై సంక్షోభం కొనసాగుతున్నప్పటికీ అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ అణ్వాయుధ కార్యక్రమాన్ని విస్తరిస్తామని ఇప్పటికే తెగేసి చెప్పారు. వారం వ్యవధిలోనే రెండోసారి క్షిపణి పరీక్షలు నిర్వహించి దక్షిణ కొరియాకు సవాల్ విసిరారు. తూర్పు సముద్రంలో ఈ పరీక్షలు నిర్వహించడంతో జపాన్ ప్రభుత్వం అప్రమత్తమైంది. తమ దేశ నౌకలు, విమానాలు ఏమైనా ధ్వంసమయ్యాయా అన్న దిశగా విచారణ జరుపుతోంది. -
సవాళ్లకు నిలిచిన ఇండో– రష్యా స్నేహం
న్యూఢిల్లీ: భారత్, రష్యాల స్నేహబంధం కాలపరీక్షను తట్టుకొని నిలిచిందని ప్రధాని నరేంద్రమోదీ కొనియాడారు. రెండు దేశాలు కలిసి ప్రపంచ ఇంధన మార్కెట్లో స్థిరత్వం తెస్తాయని అభిలíÙంచారు. రష్యాలోని వ్లాడివోస్టోక్ నగరంలో జరుగుతున్న ఈఈఎఫ్(ఈస్ట్రన్ ఎకనమిక్ ఫోరమ్) సమావేశాలనుద్దేశించి ఆయన ఆన్లైన్లో ప్రసంగించారు. కరోనా సమయంలో ఇరు దేశాల మధ్య సహకారం మరింత పెరిగిందని మోదీ చెప్పారు. రష్యా తూర్పు ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి పుతిన్ చేపడుతున్న చర్యలను మోదీ కొనియాడారు. ఈ విషయంలో రష్యాకు భారత్ నమ్మకమైన భాగస్వామిగా ఉంటుందన్నారు. రష్యాలో సహజవనరులున్నాయని, భారత్‌లో మానవవనరులున్నాయని, రెండూ కలిసి అభివృద్ధి చెందేందుకు అనేక అవకాశాలున్నాయని మోదీ అభిప్రాయపడ్డారు. యాక్ ఫార్ ఈస్ట్ పాలసీలో భాగంగా 2019లో జరిపిన రష్యా పర్యటనను ఆయన గుర్తు చేసుకున్నారు. రష్యాతో కీలక, నమ్మక వ్యూహాత్మక భాగస్వామ్యం ఏర్పరుచుకోవడంలో ఈ పాలసీ కీలకపాత్ర పోషిస్తుందన్నారు. కరోనాతో వైద్యారోగ్య రంగాల్లో ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల ప్రాముఖ్యత తెలియవచి్చందన్నారు. అగ్రో, సెరామిక్స్, రేర్ఎర్త్ మినరల్స్, డైమండ్స్ తదితర రంగాల్లో కొత్త అవకాశాలను ఇరుదేశాలు అన్వేíÙస్తున్నాయని చెప్పారు. రష్యా తూర్పు ప్రాంతానికి చెందిన 11 ప్రాంతాల గవర్నర్లను భారత్‌లో పర్యటించాలని మోదీ ఆహా్వనించారు. -
ఎంటీఆర్ ఫుడ్స్ చేతికి ఈస్టర్న్ బ్రాండ్
ఈస్టర్న్ బ్రాండుతో మసాలా పౌడర్లు, పచ్చళ్లు తయారు చేసే ఈస్టర్న్ కాండిమెంట్స్‌ను ఎంటీఆర్ ఫుడ్స్ సొంతం చేసుకోనుంది. ఇందుకు అనుబంధ సంస్థ ఎంటీఆర్ ఫుడ్స్ ద్వారా ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు నార్వేజియన్ దిగ్గజం ఓక్లా తాజాగా పేర్కొంది. దీనిలో భాగంగా కేరళకు చెందిన ఈస్టర్న్ కాండిమెంట్స్‌లో 67.8 శాతం వాటాను ఓక్లా కొనుగోలు చేయనుంది. ఇందుకు రూ. 2,000 కోట్లు వెచ్చించనున్నట్లు తెలుస్తోంది. తద్వారా దేశీయంగా మసాలా పౌడర్లు, ప్రొడక్టుల అమ్మకాలను రెట్టింపునకు పెంచుకోవాలని యోచిస్తున్నట్లు ఎంటీఆర్ ఫుడ్స్ మాతృ సంస్థ ఓక్లా తెలియజేసింది. విలీనం ఒప్పందం ప్రకారం ఈస్టర్న్ కాండిమెంట్స్ ప్రమోటర్లు మీరన్ కుటుంబం నుంచి 41.8 శాతం వాటాను ఓక్లా కొనుగోలు చేయనుంది. ఇదే విధంగా మెక్‌కార్నిక్ ఇన్గ్రెడియంట్స్కు చెందిన 26 శాతం వాటాను చేజిక్కించుకోనుంది. మెజారిటీ వాటా కొనుగోలు తదుపరి ఎంటీఆర్ ఫుడ్స్‌లో ఈస్టర్న్ కాండిమెంట్స్‌ను విలీనం చేయనున్నట్లు ఓక్లా తెలియజేసింది. డీల్‌కు కాంపిటీషన్ కమిషన్(సీసీఐ) అనుమతించవలసి ఉన్నట్లు వెల్లడించింది. కంపెనీల వివరాలు ఎంటీఆర్ ఫుడ్స్‌ను నార్వేజియన్ దిగ్గజం ఓక్లా 2007లో సొంతం చేసుకుంది. తద్వారా మసాలా పౌడర్లు తదితర ప్రొడక్టుల ద్వారా దేశవ్యాప్తంగా బిజినెస్‌ను విస్తరించింది. గత ఆర్థిక సంవత్సరంలో రూ. 920 కోట్ల టర్నోవర్‌ను సాధించింది. ఇక కేరళకు చెందిన ఈస్టర్న్ కాండిమెంట్స్‌ను 1983లో ఎంఈ మీరన్ ఏర్పాటు చేశారు. జూన్ చివరికల్లా 12 నెలల కాలంలో రూ. 900 కోట్ల అమ్మకాలు సాధించింది. దీనిలో సగ భాగం కేరళ నుంచే లభిస్తుండటం గమనార్హం! ఈస్టర్న్ కాండిమెంట్స్ నాన్‌వెజ్, వెజిటేరియన్ ఫుడ్ ప్రొడక్టులను రూపొందిస్తుంటే.. ఎంటీఆర్ వెజిటేరియన్ ఉత్పత్తులకే పరిమితమైంది. డీల్ తదుపరి ఈస్టర్న్ కాండిమెంట్స్‌లో మీరన్ కుటుంబానికి 26 శాతం వాటా మిగలనుంది. అయితే విలీనం తదుపరి సంయుక్త సంస్థలో ఈ వాటా 9.99 శాతానికి చేరనున్నట్లు తెలుస్తోంది. -
నవ్వులు నాటిన ‘నైరుతి’!..
సాక్షి, హైదరాబాద్: ‘నైరుతి’వెళ్లిపోయింది.. బుధవారం నైరుతి రుతుపవనాలు దేశవ్యాప్తంగా నిష్క్రమించాయి.. ఇటు ఈశాన్య రుతుపవనాలు మొదలయ్యాయి. జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో చివరి రెండు నెలలు నైరుతి రుతుపవనాలతో వర్షాలు కుమ్మేశాయి. ఈ సీజన్లో తెలంగాణలో సాధారణంగా 759.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, 805.6 మిల్లీమీటర్లు నమోదైంది. సాధారణం కంటే 6 శాతం అధికంగా వర్షపాతం నమోదైంది. సాధారణానికి అటుఇటుగా వర్షం కురుస్తుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేయగా, అంతకుమించి వర్షం కురవడం గమనార్హం. 2016 తర్వాత ఈసారి తెలంగాణలో 6 శాతం అధికంగా వర్షపాతం నమోదైంది. 2016లో 19 శాతం అధికంగా వర్షం కురిసింది. అంతకుముందు 2013లో 26 శాతం, 2010లో 32 శాతం అధికంగా వర్షపాతం నమోదైందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం లెక్కలు చెబుతున్నాయి. జూన్‌లో లోటు.. సెప్టెంబర్‌లో అధికం గత పదేళ్లలో ఈ సీజన్‌తో కలిపి ఐదు సార్లు అధిక వర్షాలు నమోదు కాగా, మిగిలిన ఐదు సార్లు లోటు వర్షపాతం నమోదైంది. జూన్‌లో తెలంగాణలో 33 శాతం లోటు వర్షపాతం నమోదైతే, జూలైలో 12 శాతం లోటు రికార్డయింది. ఇక ఆగస్టులో వర్షాలు ఊపందుకున్నాయి. ఆ నెలలో 11% అధిక వర్ష పాతం నమోదు కాగా, సెప్టెంబర్‌లో రికార్డు స్థాయిలో ఏకంగా 83 శాతం అధిక వర్షపాతం నమోదైంది. ఇక రాష్ట్రంలో మొత్తం 589 మండలాలుంటే, ఈ సీజన్లో ఇప్పటివరకు 359 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. 122 మండలాల్లో అధిక వర్షపాతం నమోదైంది. జిల్లాల వారీగా చూస్తే కొమురంభీం, నిజామాబాద్, వరంగల్ అర్బన్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, మహబూబ్‌నగర్, ములుగు, నారాయణపేట జిల్లాలో అధిక వర్షపాతం నమోదైంది. మిగిలిన జిల్లాల్లో సాధారణ వర్షం కురిసింది. దేశంలో కూడా రికార్డు దేశవ్యాప్తంగా కూడా ఈ సీజన్లో అధిక వర్షపాతం నమోదైంది. మొత్తంగా 10 శాతం అధిక వర్షపాతం నమోదైంది. ఇక్కడ వందేళ్ల రికార్డు దేశంలో ఒకటి నమోదైంది. సరిగ్గా వందేళ్ల కిత్రం అంటే 1917 సెప్టెంబర్ నెలలో దేశవ్యాప్తంగా 165 శాతం వర్షపాతం నమోదైతే, మళ్లీ ఈ ఏడాది సెప్టెంబర్‌లో 152 శాతం వర్షపాతం నమోదైంది. వందేళ్ల తర్వాత ఆ స్థాయిలో వర్షపాతం నమోదు కావడం గమనార్హం. గణనీయంగా ఖరీఫ్ సాగు.. నైరుతి రుతుపవనాలు తెచ్చిన భారీ వర్షాలతో ఈ ఏడాది ఖరీఫ్‌లో పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా నమోదైంది. ఖరీఫ్‌లో అన్ని పంటల సాధారణ సాగు విస్తీర్ణం 1.08 కోట్ల ఎకరాలు కాగా... ఇప్పటివరకు ఏకంగా 1.10 కోట్ల ఎకరాల్లో (102 శాతం) పంటలు సాగయ్యాయి. అందులో వరి సాధారణ సాగు విస్తీర్ణం 24.11 లక్షల ఎకరాలు కాగా, రికార్డు స్థాయిలో 31.47 లక్షల ఎకరాల్లో (131 శాతం) నాట్లు పడ్డాయి. ఇక పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 43.12 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు ఏకంగా 46.48 లక్షల ఎకరాల్లో (108 శాతం) సాగైంది. పప్పు ధాన్యాల సాగు సాధారణ విస్తీర్ణం 10.37 లక్షల ఎకరాలు కాగా... 9.42 లక్షల (91 శాతం) ఎకరాల్లో సాగైంది. రాష్ట్రంలో అత్యధికంగా మంచిర్యాల జిల్లాలో 128 శాతం, నారాయణపేట జిల్లాలో 122 శాతం పంటల సాగు నమోదైంది. అతి తక్కువగా జనగామ 83 శాతం, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో 86 శాతం పంటలు సాగయ్యాయి. ఇక రబీ సాగుకు కూడా ఈ వర్షాలు దోహదం చేశాయి. జలాశయాలు, చెరువులు, కుంటలు, వాగులు పొంగి పొర్లడంతో రబీలో అంచనాలకు మించి పంటల సాగు నమోదవుతుందని వ్యవసాయశాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈశాన్య రుతుపవనాల ప్రవేశం.. ఈశాన్య రుతుపవనాలు బుధవారం రాష్ట్రంలోకి ప్రవేశించాయి. తమిళనాడు దాన్ని ఆనుకుని ఉన్న ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ ప్రాంతాల్లో ఈశాన్య రుతుపవన వర్షాలు ప్రారంభమయ్యాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ తమిళనాడు తీరానికి దగ్గరలో ఉన్న నైరుతి బంగాళాఖాతం నుండి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు ఉపరితల ద్రోణి ఏర్పడింది. ఈ ప్రభావంతో గురువారం అనేక చోట్ల ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే ఒకట్రెండు చోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. శుక్రవారం కొన్నిచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సీనియర్ అధికారి రాజారావు వెల్లడించారు. ఇక గత 24 గంటల్లో మహబూబాబాద్‌లో 5 సెంటీమీటర్ల అధిక వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలో గత పదేళ్లలో నమోదైన వర్షపాతం –––––––––––––––––––––––––––––––––––––––––––––– ఏడాది సాధారణంతో పోలిస్తే నమోదైన వర్షపాతం (శాతంలో) –––––––––––––––––––––––––––––––––––––––––––––– 2009 –35 2010 32 2011 –13 2012 4 2013 26 2014 –34 2015 –21 2016 19 2017 –13 2018 –2 2019 6 -
అమెరికా అతలాకుతలం
-
తూర్పు.. పశ్చిమం..
పదవుల పందేరంలో నేతల మధ్య భేదాభిప్రాయాలు * పశ్చిమానికే కీలక పదవులు * ‘తూర్పు’ నేతల్లో అసంతృప్తి సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : పదవుల పందేరం జిల్లాలోని తూర్పు, పశ్చిమ ప్రాంతాల్లో టీఆర్ఎస్ నేతల మధ్య దూరాన్ని పెంచుతోంది. రాష్ట్ర స్థాయిలో కీలక పదవులన్నీ పశ్చిమ ప్రాంత నేతలనే వరిస్తున్నాయనే చర్చ అధికార పార్టీలో జోరుగా సాగుతోంది. ఇప్పటి వరకు ప్రాధాన్యతతో కూడిన పదవులన్నీ ‘పశ్చిమా’నికే దక్కాయి. రానున్న రోజుల్లో భర్తీ చేయనున్న నామినేటెడ్ పదవుల విషయంలోనైనా తమకు ప్రాధాన్యం ఇవ్వాలనే వాదన ‘తూర్పు’ నుంచి వినిపిస్తోంది. ఇప్పటికే ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న జోగు రామన్న రాష్ట్ర అటవీ శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. అలాగే ముథోల్‌కు చెందిన వేణుగోపాలచారి కూడా కేబినెట్ స్థాయి పదవిలో ఉన్నారు. ఎన్నికల్లో ఓటమి పాలైనా ఢిల్లీలో రాష్ట్ర ప్ర భుత్వ ప్రతినిధిగా ఆయన్ను నియమిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. తాజాగా రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణలో కూడా నిర్మల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సీనియర్ నాయకుడు అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డికి చోటు దక్కింది. జిల్లా వ్యాప్తంగా టీఆర్ఎస్తోపాటు, కాంగ్రెస్‌లో కూడా ఆయనకు బలమైన అనుచరవర్గం ఉండటం, సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగి ఉండటం వంటి అంశాలు ఆయనకు కలిసొచ్చాయి. మంత్రి పదవితో పోల్చితే అంతగా ప్రాధాన్యత లేని పదవులు మాత్రం తూర్పు జిల్లా నేతలకు దక్కాయి. ప్రభుత్వ విప్‌గా చెన్నూరు ఎమ్మెల్యే నల్లా ల ఓదేలు నియమితులు కాగా, మహిళా కోటాలో కోవ లక్ష్మికి పార్లమెంట్ సెక్రెటరీ పదవి వరించింది. గతం నుంచీ వీరి మధ్య పోటీ గతంలో జిల్లాలో పలు పదవుల విషయంలో తూ ర్పు, పశ్చిమ జిల్లాల మధ్య పోటాపోటీ నెలకొంది. అత్యంత కీలకమైన జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పీఠం విషయంలో అప్పట్లో తూర్పు, పశ్చిమ నేతల మధ్య గట్టి పోటీ నెలకొంది. చివరి వరకు ఇరు ప్రాంతాలకు చెందిన ఇద్దరు జెడ్పీటీసీల పేర్లు వినిపించాయి. కానీ.. నిర్మల్ జెడ్పీటీసీ శోభా సత్యనారాయణగౌడ్కే ఈ పదవి వరించింది. తాజాగా కాంగ్రెస్ ఖాతాలో ఉన్న జిల్లా కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్) చైర్మన్ పదవి విషయంలోనూ ఇరు ప్రాంత నేతలు పోటీ పడ్డారు. ఈ పదవిని టీఆర్ఎస్ తమ ఖాతాలో వేసుకున్నా, చైర్మన్ పదవి విషయంలో తూ ర్పు, పశ్చిమ జిల్లాల డెరైక్టర్లు తీవ్రంగా ప్రయత్నిం చారు. తూర్పు జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే పట్టుబట్టడంతో చివరకు ఆ ప్రాంతానికి ఈ డీసీఎంఎస్ చైర్మన్ పదవి దక్కింది. అంతకు ముందు డీసీసీబీ చై ర్మన్ పదవి విషయంలోనూ ఇరు ప్రాంత నేతలు పా వులు కదిపారు. ఆదిలాబాద్ నియోజకవర్గానికి చెం దిన డీసీసీబీ చైర్మన్ ఎం.దామోదర్‌రెడ్డిపై అవిశ్వాసం వ్యవహారాన్ని నడిపిన చంద్రశేఖర్‌రెడ్డి పశ్చిమ ప్రాంతానికే చెందినా, తూర్పు ప్రాంత డెరైక్టర్ల మద్దతుతో ఈ వ్యవహారాన్ని నడిపారు. కానీ ఆయన ప్రయత్నాలు ఫలించ లేదు. -
నేటి నుంచి గలగలా గోదారి
తూర్పు, మధ్య డెల్టాలకు నేడు నీటి విడుదల ధవళేశ్వరం : సుమారు రెండు నెలల అనంతరం గోదారమ్మ పంట కాలువల్లోకి పరుగులు తీయనుంది. తూర్పు,సెంట్రల్ డెల్టాలకు ఆదివారం నీటిని విడుదల చేయనున్నారు. 58 రోజుల విరామం అనంతరం తూర్పు డెల్టాకు, 55 రోజుల విరామం అనంతరం సెంట్రల్ డెల్టాకు నీటిని విడుదల చేస్తున్నారు. ఆదివారం ఉదయం 9.30 గంటలకు మధ్య డెల్టాకు, 10.30 గంటలకు తూర్పు డెల్టాకు ఇరిగేషన్ సర్కిల్ ఎస్ఈ సుగుణాకరరావు లాంఛనంగా నీటిని విడుదల చేస్తారని హెడ్‌వర్క్స్ ఈఈ తిరుపతిరావు తెలిపారు. వాస్తవానికి జూన్ మొదటి వారంలోనే నీటిని విడుదల చేయాలి. అయితే రబీ పంట ఆలస్యం కావడంతో ఏప్రిల్ 17 వరకు తూర్పు డె ల్టాకు, ఏప్రిల్ 20 వరకు మధ్య డెల్టాకు నీటిని సరఫరా చేయాల్సి వచ్చింది. దాంతో కాలువలకు షార్ట్ క్లోజర్ పనులను మాత్రమే చేయడానికి వీలైంది. ఆ పనుల కోసమే ఇంతవరకు నీటిని విడుదల చేయలేకపోయారు. తూర్పు, మధ్య డెల్టాల్లో సుమారు రూ. 50 కోట్ల మేరకు పనులను పూర్తి చేసినట్టు ఇరిగేషన్ ఎస్ఈ సుగుణాకరరావు శనివారం తెలిపారు. సహజ జలాలే ఆధారం కాలువలకు నీటిని విడుదల చేస్తున్నప్పటికీ వర్షాలు ఇంకా పడకపోవడంతో గోదావరి సహజ జలాలపైనే ఆధారపడాల్సి వస్తోంది. రోజుకు సుమారు 3,500 క్యూసెక్కుల నీరు ధవళేశ్వరంలోని కాటన్ బ్యారేజ్‌కు చేరుతుంది. వానలు పడేంతవరకు ఈ నీరే శరణ్యం. ప్రాజెక్టులవారీ క్యాడ్ కమిటీలు వేయాలి రామచంద్రపురం : రాష్ట్ర స్థాయి క్యాడ్ కమిటీ ద్వారా ఎటువంటి పనులూ జరగడం లేదని, ప్రాజెక్ట్‌లవారీ క్యాడ్ కమిటీలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర నీటి వినియోగదారుల సంఘం ప్రధాన కార్యదర్శి కొవ్వూరి త్రినాథరెడ్డి డిమాండ్ చేశారు. ఆయన శనివారం ఇక్కడ విలేకర్లతో మాట్లాడుతూ ప్రతి చిన్న పనికీ రాష్ట్రస్థాయి క్యాడ్ కమిటీ అనుమతి తీసుకోవాల్సి వస్తోందని అన్నారు. రైతులకు అనువుగా ఉండేలా ప్రాజెక్ట్‌లవారీ క్యాడ్ కమిటీలను వేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. దీనివల్ల రైతుల సమస్యలను సకాలంలో గుర్తించి వాటి పరిష్కారానికి వెంటనే పనులు చేపట్టడానికి వీలవుతుందన్నారు. నీటితీరువా నిధులు ఇప్పుడా! నీటితీరువా నిధులు ఇప్పుడు విడుదల చేశారని, కాలువలకు నీళ్లు ఇచ్చే సమయంలో ఈ నిధులు విడుదల చేయడంవల్ల ప్రయోజనమేమిటని త్రినాథరెడ్డి ప్రశ్నించారు. ఈ ఏడాది తూర్పు డెల్టాలో ఎ-కేటగిరీ పనులకు రూ.2.85 కోట్లు, బి-కేటగిరీ పనులకు రూ.3.02 కోట్లు నీటి తీరువా నిధులు విడుదలయ్యాయన్నారు. మధ్య డెల్టాలో ఎ-కేటగిరీకి రూ.38 లక్షలు, బి-కేటగిరీకి రూ.3.93 కోట్లు విడుదలయ్యాయన్నారు. కాలువల్లో తూడు తీత పనులు చేపట్టక పోవడంవల్ల వర్షాకాలంలో పంటలు ముంపు బారిన పడే అవకాశం ఉందని అన్నారు. -
తెలుగు కోయిల... పడమటి పల్లవి...
సంగీతం ప్రపంచ భాష.. మదిలోని భావాలను వ్యక్తపరిచే సాధనం.. అయినా సంగీతంలో తేడాలున్నాయి. వెస్ట్రన్, ఈస్ట్రన్ అంటూ... అయితే కొంతమంది సంగీతకారులు ఈ ఎల్లలు చెరిపేస్తున్నారు. పాశ్చాత్య సంగీతపు గుబాళింపును, భారత సంగీత సౌరభాన్ని మిశ్రమం చేస్తున్నారు. ఇలాంటి ప్రయత్నమే భావన రెడ్డిది కూడా. ఈ తెలుగు కోయిల ఎల్లలు దాటి హాలీవుడ్ స్థాయికి చేరింది. తను అభ్యసించింది భారత శాస్త్రీయ సంగీతం, శాస్త్రీయ నృత్యాలే అయినా తను ఒక రాక్‌స్టార్‌లా రాణిస్తుండటమే గమ్మత్తు... నేర్చుకొన్నది శాస్త్రీయ సంగీతం, శాస్త్రీయ నృత్యం. కుటుంబ నేపథ్యం కూడా అలాంటిదే. అయితే వెస్ట్రన్ మ్యూజిక్‌లో వావ్ అనిపిస్తోంది. ‘జాయ్‌రైడ్-3’ అనే హాలీవుడ్ సినిమాలో పాడే ఛాన్స్‌ను సంపాదించింది. కామన్వె ల్త్ గేమ్స్ ప్రారంభోత్సవ సమయంలో: భారత రాష్ట్రపతి, ప్రధానమంత్రి, దేశానికి చెందిన అనేకమంది రాజకీయ, సామాజిక, క్రీడాప్రముఖులందరూ కొలువైనవేళ, మనదేశం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన కామన్వెల్త్ గేమ్స్ ప్రారంభోత్సవ సమయంలో అద్భుతమైన తెలుగింటి కూచిపూడి నాట్యంతో ప్రపంచవ్యాప్తంగా లక్షలాది ప్రజల మనసులను దోచుకొంది. అమెరికాలోని లాస్ ఏంజెలెస్‌లో: భావన ఒక రాక్‌స్టార్. సొంతంగా పాట రాసుకొని, కంపోజ్ చేసుకొని, పాటలు పాడుతూ బ్యాండ్‌తో కలసి, సోలోగా ప్రదర్శనలిస్తూ ఉంటుంది. మ్యూజిక్ కాంపిటీషన్లలో భావన బ్యాండ్‌కు ఉన్న క్రేజే వేరు! ఇలా రెండు విభిన్నమైన ప్రాంతాల్లో, విభిన్నమైన కళల్లో, విభిన్నమైన గుర్తింపును సంపాదించుకొంది. కూచిపూడి నృత్యంలో ప్రపంచ ప్రసిద్ధులు, పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డు గ్రహీతలైన రాజారెడ్డి, రాధారెడ్డిల కూతురే ఈ భావన. తల్లిదండ్రుల శిష్యరికంలో కూచిపూడి నేర్చుకొని అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శనలను ఇచ్చింది. అయితే ఇదే స్థాయిలో ఆమెకు సంగీతం మీద కూడా ఆసక్తి ఉంది. ఈ ఆసక్తి ఆమెను ఊరకుండనీయనలేదు. ఢిల్లీలో పుట్టి పెరిగిన భావన తన వెస్ట్రన్ మ్యూజిక్ గోల్‌ను రీచ్ కావడానికి లాస్ ఏంజెలెస్ వెళ్లింది. కర్ణాటక సంగీతంపై ఉన్న పట్టు కూడా ఆమెకు బాగా ఉపయోగపడింది. గ్రామీ నామినీలతో కలిసి పని చేసింది! సొంతంగా గీతాలు రాసుకొని ‘టాంగిల్డ్ ఎమోషన్స్’ అనే ఈపీ(ఎక్స్టెండ్ ప్లే)ని రూపొందించింది భావన. గ్రామీ అవార్డ్‌కు నామినేట్ అయిన వ్యక్తులతో కలసి పనిచేసి ఆ మ్యూజికల్ రికార్డ్‌ను విడుదలచేసింది. ఇందులోని భావన వాయిస్‌కు బ్రహ్మాండమైన స్పందన వచ్చింది. భావన స్వరాన్ని విన్న హాలీవుడ్ దర్శకుడు క్లౌడ్ఫోయిజ్ తన సినిమాలో అవకాశం ఇచ్చాడు. దీంతో మన తెలుగమ్మాయికి అంతర్జాతీయ స్థాయిలో పేరొచ్చింది. ఓ నిరాశాపూరిత ప్రేమికురాలి మనసు ఆవిష్కరణ... ‘‘ప్రేమ మిగిల్చిన విషాదంతో నిరాశలో కూరుకుపోయిన ఒక అమ్మాయి మనసు ధ్వనే ‘టాంగెల్డ్ ఇన్ లవ్’. గత ప్రేమ చేదు అనుభవంతో, మరొకరిని ప్రేమించలేక ఆమె పడే వేదననే అక్షర రూపంలోకి తీసుకొచ్చాను. దీన్ని రికార్డింగ్ రూపంలోకి తీసుకురావడానికి ఏడాది కాలం పట్టింది. ‘స్మెల్ లైక్ రెయిన్’ సాంగ్ నాకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. తాజాగా నేను తొలిసారి హాలీవుడ్ సినిమా కోసం పాడాను. ఫాక్స్ ఎంటర్టైన్మెంట్ వారి సినిమాలోని ఓపెనింగ్ సాంగ్‌లో స్వరం వినబోతున్నారు. నాకు ఇది నిజంగా గ్రేట్ ఎక్సైట్మెంట్. నా సక్సెస్ విషయంలో మ్యూజిషియన్ల, స్నేహితుల సహకారం మరవలేనిది. - భావన