Border Security Force
-
వలసదారుల ఏరివేతకు ‘ఎమర్జెన్సీ’!
వాషింగ్టన్: డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక ఊహించినట్లుగానే సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అతి కీలకమైన ఎన్నికల అంశంగా మారిన అక్రమ వలసలపై ఆయన తాజాగా కీలక నిర్ణయం వెలువరించారు. సరిహద్దు భద్రతపై జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించే యోచన ఉందని సోమవారం ట్రంప్ ధ్రువీకరించారు. అక్రమ వలసదారులను తిప్పి పంపేందుకు సైన్యాన్ని కూడా రంగంలోకి దించుతామని తన సోషల్ మీడియా హాండిల్ ట్రూత్‌లో ప్రకటించారు! ఈ మేరకు ఓ రిపబ్లికన్ కార్యకర్త చేసిన చేసిన పోస్టును ట్రంప్ రీ పోస్టు చేస్తూ, ‘నిజమే’ అంటూ కామెంట్ జోడించారు. వలసలను ట్రంప్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. తనను గెలిపిస్తే కనీసం 10 లక్షల మంది అక్రమ వలసదారులను వెనక్కు పంపుతానని, మెక్సికోతో సరిహద్దులను దుర్భేద్యంగా మారుస్తానని ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారు. అమెరికాలో ఏకంగా కోటీ 10 లక్షల మందికి పైగా అక్రమంగా నివసిస్తున్నట్టు అధికారుల అంచనా. ట్రంప్ భారీ బహిష్కరణ ప్రణాళిక లక్షలాది కుటుంబాలపై నేరుగా ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు.ట్రంప్ జనవరి 20న అధ్యక్ష బాధ్యతలు స్వీకరించనుండటం తెలిసిందే. తన కేబినెట్‌ను ఇప్పటికే అతివాదులు, వలసల వ్యతిరేకులతో నింపేశారు. ముఖ్యంగా కీలకమైన ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ మాజీ చీఫ్ టామ్ హోమన్‌ను బోర్డర్ జార్ పదవికి ఎంపిక చేశారు. ‘అక్రమ వలసదారులారా! సామాన్లు ప్యాక్ చేసుకోవడం మొదలు పెట్టండి. మీ దేశాలకు తిరిగి వెళ్లాల్సిన సమయం వచ్చేసింది’ అని గత జూలైలోనే రిపబ్లికన్ పార్టీ సదస్సులో హోమన్ హెచ్చరికలు చేశారు. తమ విభాగం తొలుత 4.25 లక్షల మంది అక్రమ వలసదారులను బహిష్కరిస్తుందని ఆయన ఇటీవల పేర్కొన్నారు. అధ్యక్షుడు జో బైడెన్ పాలనలో రికార్డు సంఖ్యలో అక్రమ వలసదారులు అమెరికాలోకి ప్రవేశించారని ట్రంప్ పదేపదే ఆరోపించడం తెలిసిందే. వారంతా అమెరికా రక్తాన్ని విషపూరితం చేశారంటూ ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వారిని తిప్పి పంపేందుకు అవసరమైతే 1798 నాటి ఏలియన్ ఎనిమీస్ చట్టాన్ని కూడా ప్రయోగిస్తామన్నారు. -
బీఎస్ఎఫ్ చీఫ్, డిప్యూటీ చీఫ్‌లపై కేంద్రం వేటు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం అనూహ్యమైన నిర్ణయం తీసుకుంది. సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) డైరెక్టర్ జనరల్ నితిన్ అగర్వాల్‌తో పాటు బీఎస్ఎఫ్ డిప్యూటీ స్పెషల్ డీజీ (పశ్చిమ) వైబీ ఖురానియాలను తొలగించింది. ఈ మేరకు శుక్రవారం రాత్రి కేబినెట్ నియామకాల కమిటీ(ఏసీసీ)వేర్వేరు ఉత్తర్వులు జారీ చేసింది. తొలగింపు నిర్ణయం వెంటనే అమలులోకి వస్తుందని, ఆ ఇద్దరు అధికారులను వారి రాష్ట్రాల కేడర్లకు తిరిగి పంపిస్తున్నట్టు వెల్లడించింది.కాగా నితిన్ అగర్వాల్ 1989 బ్యాచ్ కేరళ కేడర్ అధికారి కాగా.. ఖురానియా 1990 బ్యాచ్ ఒడిశా కేర్‌కు చెందినవారు. గతేడాది జూన్‌లో బీఎస్ఎఫ్ చీఫ్‌గా అగర్వాల్ బాధ్యతలు స్వీకరించారు. ఇక ఖురానియా ప్రత్యేక డీజీగా(పశ్చిమ) పాకిస్థాన్ సరిహద్దు వెంబడి దళానికి నేతృత్వం వహిస్తున్నారు.కాగా అంతర్జాతీయ సరిహద్దు నుంచి భారత్‌లోకి నిరంతరం చొరబాట్లు కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి. అయితే ఉగ్రవాద ఘటనలకు సంబంధించి బలగాల చీఫ్‌లను తొలగించడం ఇదే తొలిసారి. ఇదిలా ఉండగా బీఎస్ఎఫ్లో దాదాపు 2.65 లక్షల మంది జవాన్లు ఉన్నారు. వీరు పశ్చిమ దిక్కున పాకిస్తాన్, తూర్పున బంగ్లాదేశ్‌తో భారత సరిహద్దులను కాపాడుతున్నారు. -
ఒడిశాలో మావోయిస్టుల ఆయుధ డంప్ స్వాధీనం..
భువనేశ్వర్: ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లాలో BSF బెటాలియన్ సిబ్బంది నిర్వహించిన సోదాల్లో మావోయిస్టుల భారీ ఆయుధ సామాగ్రి లభ్యమైంది. పక్క సమాచారంతో జరిపిన సోదాల్లో లభ్యమైన ఈ సామాగ్రి మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు సరిహద్దు భద్రతా దళాలు. బెజంగివడ రిజర్వ్ ఫారెస్ట్‌లో మావోయిస్టుల కదలికలపై పక్కా సమాచారం అందడంతో మల్కన్‌గిరి జిల్లాలో BSF బెటాలియన్ సిబ్బంది సోమవారం సెర్చ్ ఆపరేషన్ నిర్వహించింది. ఇందులో భాగంగా మల్కన్ గిరి జిల్లాలోని కలిమెల పోలీస్ పరిధి అమపాదర్-ఎల్కనూర్ గ్రామం, బోడిలుగూడ- బృందమామిడి సమీపంలోని రిజర్వ్ ఫారెస్ట్‌లో జరిపిన సోదాల్లో రాకెట్ లాంచర్లతో సహా భారీ ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు BSF సిబ్బంది. సరిహద్దు భద్రతా దళాల వారు స్వాధీనం చేసుకున్న ఆయుధాల్లో ఒక 303 రైఫిల్, 11 బ్యారెల్ (SBML), 303 రైఫిల్ యొక్క మ్యాగజైన్, 15 మెరుగైన హ్యాండ్ గ్రెనేడ్లు, మూడు దేశీయ తుపాకులు, రెండు 51 MM మోర్టార్ బాంబులు, ఒక గ్యాస్ వెల్డింగ్ యంత్రం, 42 లైవ్ కాట్రిడ్జ్‌లు, రాకెట్ లాంచర్, రెండు బ్రెన్ 303 ఎల్ఎంజీ స్పేర్ బ్యారెల్స్, 29 జెలటిన్ స్టిక్స్, ఐదు అల్యూమినియం నైట్రేట్ ప్యాకెట్లు, 30 ఎలక్ట్రిక్ డిటోనేటర్లు, తొమ్మిది సింథటిక్ వెయిస్ట్ బెల్ట్‌లు ఉన్నాయి. ఒకప్పుడు ఈ ప్రాంతం మావోయిస్టులకు వారి సానుభూతిపరులకు కంచుకోటగా ఉండేదని, వామపక్ష దళాలు పేలుడు ముడి పదార్థాలను ఇటువంటి రిమోట్ ప్రదేశాలలో ఉంచి అవసరమైనప్పుడు వీటిని ఉపయోగిస్తూ ఉంటారని తెలిపింది BSF సిబ్బంది. ఒక్కసారిగా ఇంత పెద్ద మొత్తంలో ఆయుధ సామగ్రి దొరకడంతో మావోయిస్టుల ఉనికి నిర్ధారణ అయ్యిందని అనుమానిత ప్రాంతాల్లో కూడా సెర్చ్ ఆపరేషన్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇది కూడా చదవండి: ఉత్తరాఖండ్‌లో చిక్కుకున్న యాత్రికులు -
ఆ శునకం ఎలా గర్భం దాల్చింది? సరిహద్దు భద్రతా దళం దర్యాప్తు!
షిల్లాంగ్: ఏదైనా శునకం గర్భం దాల్చి పిల్లలకు జన్మనిస్తే ఎవరూ పెద్దగా పట్టించుకోరు. కానీ, ఆర్మీలోని భారత సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) ఏకంగా ఉన్నతస్థాయి దర్యాప్తు చేపట్టింది. మేఘాలయ సరిహద్దుల్లో కాపలా కాస్తున్న తమ దళంలోని ఓ స్నైఫర్ డాగ్ మూడు పిల్లలకు జన్మనివ్వడంపై అనుమానాలు వ్యక్తం చేసింది. ఈ అంశంపై డిప్యూటీ కమాండెంట్ ర్యాక్ అధికారి దర్యాప్తు చేపట్టి నివేదిక సమర్పించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు కూడా. మేఘాలయ రాష్ట్ర బీఎస్ఎఫ్ హెడ్‌క్వార్టర్ షిల్లాంగ్ ఇచ్చిన ఆదేశాల కాపీని ప్రముఖ వార్తా సంస్థ ఏఎన్ఐ సేకరించింది. స్నైఫర్ డాగ్ గర్భం దాల్చడంపై డిసెంబర్ 19న బీఎస్ఎఫ్ ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్ 5 ఉదయం 10 గంటలకు బార్డర్ ఔట్ పోస్టు బాఘ్మారాలో స్నైఫర్ డాగ్ లాల్సీ మూడు పిల్లలకు జన్మనిచ్చింది. ఈ అంశంపై డిప్యూటీ కమాండెంట్ ర్యాక్ అధికారి సమ్మరీ కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ చేయాలని పేర్కొంది. డిసెంబర్ 30, 2022 నాటికి దర్యాప్తు పూర్తి చేసి నివేదిక సమర్పించాలని ఆదేశించింది. మరోవైపు.. శిక్షణ ఇచ్చే బీఎస్ఎఫ్ శునకాలు వాటి సంరక్షకుల పర్యవేక్షణలో భద్రంగా ఉంటాయని ఓ సీనియర్ అధికారి తెలిపారు. రెగ్యులర్‌గా హెల్త్ చెకప్‌లు జరుగుతాయన్నారు. ఈ శునకాలు ఇతర వాటితో ఎప్పుడూ కలవవని, బ్రీడింగ్ చేపడితే అది పశువైద్యుల పర్యవేక్షణలోనే ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం పిల్లలకు జన్మనిచ్చిన స్నైఫర్ డాగ్ లాల్సీ భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో కాపలా కాస్తోంది. ఇదీ చదవండి: Cameroon Green: వేలు విరిగిన విషయం తెలియక నాలుగు గంటలు ఓపికగా -
సరిహద్దు భద్రతలో రాష్ట్రాలకూ బాధ్యత
కోల్‌కతా: దేశ సరిహద్దు ప్రాంతాల్లో భద్రతలో బీఎస్ఎఫ్తోపాటు సంబంధిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు బాధ్యత పంచుకోవాలని హోం మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. శనివారం కోల్‌కతాలోని పశ్చిమబెంగాల్ సెక్రటేరియట్లో జరిగిన 25వ ఈస్టర్న్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో అమిత్ మాట్లాడారు. సరిహద్దు ప్రాంతాల్లో బీఎస్ఎఫ్ పరిధిని విస్తరించిన నేపథ్యంలో ఆయా చోట్ల భద్రతపై జరిగిన చర్చ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భేటీలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, జార్ఖండ్ సీఎం సోరెన్, బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ, ఒడిశా మంత్రి పాల్గొన్నారు. -
భద్రతా దళాల కాల్పుల్లో ఉగ్రవాది హతం
సాక్షి, శ్రీనగర్ : భద్రతా దళాలు కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. జమ్మూకశ్మీర్‌లోని కుల్గాం జిల్లా తంత్రిపోరా వద్ద శనివారం ఉదయం భద్రతదళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో మృతి చెందిన ఉగ్రవాదిని మచివాకు చెందిన ఇష్ఫాక్ పద్దార్గా గుర్తించారు. ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. కాగా పాకిస్తాన్ శుక్రవారం కాల్పుల ఉల్లంఘనకు పాల్పడింది. ఫూంచ్ సెక్టార్లో పాక్ ఆర్మీ జరిపిన కాల్పుల్లో బీఎస్ఎఫ్ జవాను మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే పాక్ కాల్పులను భారత జవాన్లు సమర్థవంతంగా తిప్పికొట్టారు. -
సరిహద్దుల్లో పాక్ గాలిబుడగల దుమారం!
-
సరిహద్దుల్లో పాక్ గాలిబుడగల దుమారం!
చండీగఢ్: పాకిస్థాన్ నుంచి పెద్దసంఖ్యలో గాలిబుడగలు (బెలూన్లు) భారత సరిహద్దులోకి వచ్చి వాలుతుండటం కలకలం రేపుతోంది. పంజాబ్‌లో సరిహద్దుల మీదుగా దాదాపు మూడు డజన్ల గాలిబుడగలను బీఎస్ఎఫ్ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. ఫీరోజ్‌పూర్, పఠాన్‌కోట్, అమృతసర్ సైనిక ఔట్‌పోస్టుల వద్ద అత్యధిక సంఖ్యలో గాలిబుడగలు దొరికాయి. ఉర్దూలో భారత్ వ్యతిరేక సందేశాలున్న కాగితాల్ని గాలిబుడగలకు కట్టి భారత్ వైపు ఎగురవేస్తున్నట్టు తెలుస్తోంది. భారతీయ మహిళలను, సైనికులను దూషిస్తూ అసభ్య వ్యాఖ్యలతో కూడిన గాలిబుడగలే అధికసంఖ్యలో వస్తున్నాయి. కొన్ని గాలిబుడగలపై ప్రధాని నరేంద్రమోదీకి సవాళ్లు కూడా ఉన్నాయి. ‘మోదీ పాకిస్థాన్ సైన్యం సత్తా ఏమిటో తెలుసుకోవాలంటే.. నేరుగా తలపడి చూసుకో’ అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఉన్నాయి. గత జనవరిలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా పాకిస్థాన్ నుంచి రాజస్థాన్ మీదుగా ప్రయాణించిన ఓ భారీ హెలియం బెలూన్ను భారత వైమానిక దళం (ఐఏఎఫ్) కూల్చేసిన సంగతి తెలిసిందే. అమెరికాలో తయారైన ఈ బెలూన్ 25వేల అడుగుల ఎత్తులో ఉండగానే ఐఏఎఫ్ రాడర్లు గుర్తించాయి. తమ దేశం నుంచి బెలూన్లు వెళితే భారత్ స్పందన ఎలా ఉంటుంది? వాటిని ఎంతసేపటిలో గుర్తిస్తారు? అన్నది తెలుసుకోవడానికి పాక్ సైన్యం ఇలాంటి కన్నింగ్ పనులకు పాల్పడుతుందా? అని సైనికాధికారులు అనుమానిస్తున్నారు. -
ఇద్దరు స్మగ్లర్ల హతం
అమృత్ సర్: దేశంలోకి అక్రమంగా చొరబడడానికి ప్రయత్నించిన స్మగ్లర్లను బీఎస్ఎఫ్ దళాలు కాల్చి చంపాయి. భద్రతా దళాలకు, స్మగ్లర్లకు జరిగిన కాల్పుల్లో ఇద్దరు పాకిస్థాన్ స్మగ్లర్లు మృతి చెందగా, ఒక బీఎస్ఎఫ్ జవానుకు గాయాలయ్యాయి. పంజాబ్ లోని ఫజిల్కా ప్రాంతంలోఆదివారం ఈ ఘటన జరిగింది. స్మగ్లర్ల నుంచి 15 నార్కోటిక్, హెరాయిన్ ప్యాకెట్లను, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించాయి. -
స్మగ్లింగ్‌కు బీఎస్ఎఫ్ జవాను సహకారం
మోహాలి: మరో బీఎస్ఎఫ్ జవానును పోలీసులు అరెస్టు చేశారు. సరిహద్దు గుండా మత్తుపదార్థాలు, ఆయుధ సామాగ్రి రవాణాకు సహకరిస్తున్నాడనే ఆరోపణల కింద సరిహద్దు రక్షణ విభాగం(బీఎస్ఎఫ్)కు చెందిన జవానును అరెస్టు చేశారు. ఇలాంటి ఆరోపణలపై వరుసగా ఇది రెండో అరెస్టు. అంతకుముందు కూడా ఇలాంటి ఆరోపణల కిందటే పోలీసులు ఓ బీఎస్ఎఫ్ జవానును అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన ప్రకారం ఈ నెల 4న రాజస్థాన్ లోని ఖరార్ ప్రాంతంలో గుర్జాంత్ సింగ్ అలియాస్ బోలు మరో ఇద్దరు స్మగ్లర్లను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం వారిని విచారించగా హవిల్దార్ ప్రేమ్ సింగ్ అనే జవాను తమకు సహకరించాడని, ఆయన సాయంతోనే మందుగుండు సామాగ్రి, మత్తుపదార్థాలను పాకిస్థాన్ నుంచి భారత్ సరిహద్దు గుండా తరలిస్తున్నామని చెప్పారు. దీంతో తరణ్ జిల్లాలోని నౌషెరా గ్రామంలో పోలీసులు హవిల్దార్ ను నిన్న రాత్రి అరెస్టు చేశారు. -
భారత్, పాక్ సరిహద్దు సమావేశం
-
ఉద్యోగాలు
ఇండియన్ నేవీ ఇండియన్ నేవీ సెయిలర్ (సీనియర్ సెకండరీ రిక్రూట్స్-2015 బ్యాచ్) పోస్టుల భర్తీకి అవివాహితులైన పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. అర్హతలు: మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ/ బయాలజీ/ కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టులతో ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థులు 01 ఫిబ్రవరి 1994 - 31 జనవరి 1998 మధ్య జన్మించి ఉండాలి. ఎత్తు కనీసం 157 సెం.మీ. ఉండాలి. ఎంపిక: రాత పరీక్ష, ఫిజికల్ ఫిట్నెస్ టెస్టు, మెడికల్ టెస్టుల ద్వారా. ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: జూన్ 8 వెబ్సైట్: www.nausena-bharti.nic.in బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) వివిధ విభాగాల్లో 496 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. పోస్టులు: ఏఎస్ఐ(ఆర్ఎమ్)-68 హెడ్ కానిస్టేబుల్ (రేడియో ఆపరేటర్)-417 హెడ్ కానిస్టేబుల్ (ఫిట్టర్)-11 అర్హతలు: ఇంటర్ (ఎంపీసీ)/ తత్సమానం ఉత్తీర్ణులై ఉండాలి. 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. పురుషులు కనీసం 168 సెం.మీ. ఎత్తు, 80 సెం.మీ. ఛాతీ కలిగి ఉండాలి. స్త్రీలు 157 సెం.మీ. ఎత్తు ఉండాలి. ఎంపిక: రాతపరీక్ష, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టు, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్టుల ద్వారా. దరఖాస్తు: వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. రాతపరీక్ష తేది: ఆగస్టు 24 దరఖాస్తుల స్వీకరణకు చివరితేది: జూలై 7 వెబ్సైట్: www.bsf.nic.in -
ఛత్తీస్‌గఢ్‌లో ముగ్గురు బీఎస్ఎఫ్ జవాన్లు మృతి
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మావోయిస్టులు మరోసారి పేట్రేగిపోయారు. బస్తర్ ప్రాంతంలోని సుకుమా జిల్లాలోని కేర్లపాల్ సమీపంలోని కల్వర్ట్ను మంగళవారం మావోయిస్టులు మందుపాతరతో పేల్చేశారు. ఆ ఘటనలో ముగ్గురు బీఎస్ఎఫ్ జవాన్లు అక్కడికక్కడే మృతి చెందారని పోలీసులు వెల్లడించారు. మరో జవాన్ తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. అతడిని రాయ్‌పూర్ తరలించినట్లు చెప్పారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారని పోలీసులు తెలిపారు. ఆ దుర్ఘటన చోటు చేసుకున్న ప్రాంతాల్లో పోలీసులు భద్రత సిబ్బంది సంయూక్తంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఛత్తీస్‌గఢ్‌లో మొదటి దఫా ఎన్నికలు సోమవారం ముగిశాయి. ఆ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసిన నేపథ్యంలో విధులు ముగించుకుని వెళ్తున్న భద్రత దళాలకు చెందిన జవాన్లనే లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు మందుపాతర పేల్చారు. మొదటి దశ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి అని ఊపిరి పీల్చుకుంటున్న అధికారులకు ఈ సంఘటనతో మళ్లీ తలనెప్పి మొదలైంది. రాష్ట్రంలో రెండవ మలి దశ ఎన్నికలు నవంబర్ 19న జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పటిష్ట భద్రత చర్యలకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. -
బీఎస్ఎఫ్ బ్రాండ్ అంబాసిడర్.. విరాట్ కోహ్లీ
విరాట్ కోహ్లీకి అరుదైన గౌరవం దక్కింది. అతడిని సరిహద్దు భద్రతాదళం తమ బ్రాండ్ అంబాసిడర్ పదవినిచ్చి సత్కరించింది. ఇకనుంచి కోహ్లీ బీఎస్ఎఫ్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తాడు. -
ఒడిశాలో పేలిన మందుపాతర
సాలూరు(విజయనగరం), న్యూస్‌లైన్/కొరాపుట్(ఒడిశా): ఆంధ్ర-ఒడిశా సరిహద్దులో మంగళవారం మావోయిస్టులు మందుపాతర పేల్చడంతో నలుగురు బీఎస్ఎఫ్ జవాన్లు మృతిచెందగా, మరో ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఒడిశాలోని కొరాపుట్ జిల్లాలో ఈ ఉదంతం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 161వ బీఎస్ఎఫ్ బెటాలియన్‌కు చెందిన 18 మంది జవాన్లు మల్కన్‌గిరి నుంచి విశాఖపట్నానికి మూడు వాహనాల్లో బయలుదేరారు. ఉదయం 9.30కు కొరాపుట్-సాలూరు జాతీయ రహదారి సమీపంలోని సకిరాయి గ్రామం దగ్గరకు వాహనాలు వచ్చాయి. మొదటి వాహనం అక్కడి క ల్వర్టు దాటింది. రెండో వాహనం దాటుతుండగా కల్వర్టు కింద అమర్చిన మందుపాతరను మావోయిస్టులు పేల్చారు. పేలుడు ధాటికి వాహనం తునాతునకలైంది. అందులోని జవాన్లలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు తర్వాత మావోయిస్టులు భద్రతా బలగాలపై కాల్పులు జరిపారు. జవాన్లు కూడా ఎదురు కాల్పులు జరిపారు. ఛత్తీస్‌గఢ్‌లో రెండు ఎన్కౌంటర్లు చింతూరు, న్యూస్‌లైన్:ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లాలో జరిగిన రెండు ఎన్కౌంటర్లలో ఇద్దరు పోలీసులు, ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. లోండిగూడ పోలీస్‌స్టేషన్‌కు చెందిన ఎస్టీఎఫ్, డీఎఫ్ బలగాలు సోమవారం సాయంత్రం సమీప అడవుల్లో కూంబింగ్ చేపడుతుండగా మర్దాపాల్ గ్రామం వద్ద మావోయిస్టులు తారసపడ్డారు. అప్పుడు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మహిళా మావోలు మృతి చెందారు.