స్మగ్లింగ్కు బీఎస్ఎఫ్ జవాను సహకారం | Police arrests BSF man for helping cross-border smuggling | Sakshi
Sakshi News home page

స్మగ్లింగ్కు బీఎస్ఎఫ్ జవాను సహకారం

Published Tue, Jan 12 2016 6:29 PM | Last Updated on Mon, Aug 20 2018 4:27 PM

Police arrests BSF man for helping cross-border smuggling

మోహాలి: మరో బీఎస్ఎఫ్ జవానును పోలీసులు అరెస్టు చేశారు. సరిహద్దు గుండా మత్తుపదార్థాలు, ఆయుధ సామాగ్రి రవాణాకు సహకరిస్తున్నాడనే ఆరోపణల కింద సరిహద్దు రక్షణ విభాగం(బీఎస్ఎఫ్)కు చెందిన జవానును అరెస్టు చేశారు. ఇలాంటి ఆరోపణలపై వరుసగా ఇది రెండో అరెస్టు. అంతకుముందు కూడా ఇలాంటి ఆరోపణల కిందటే పోలీసులు ఓ బీఎస్ఎఫ్ జవానును అరెస్టు చేశారు.

పోలీసులు తెలిపిన ప్రకారం ఈ నెల 4న రాజస్థాన్ లోని ఖరార్ ప్రాంతంలో గుర్జాంత్ సింగ్ అలియాస్ బోలు మరో ఇద్దరు స్మగ్లర్లను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం వారిని విచారించగా హవిల్దార్ ప్రేమ్ సింగ్ అనే జవాను తమకు సహకరించాడని, ఆయన సాయంతోనే మందుగుండు సామాగ్రి, మత్తుపదార్థాలను పాకిస్థాన్ నుంచి భారత్ సరిహద్దు గుండా తరలిస్తున్నామని చెప్పారు. దీంతో తరణ్ జిల్లాలోని నౌషెరా గ్రామంలో పోలీసులు హవిల్దార్ ను నిన్న రాత్రి అరెస్టు చేశారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement